jessica
-
అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!
సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్‌లో టాకాఫ్ ద టౌన్‌గా మారిందిప్పుడు. డీఎన్ఏ కిట్‌తో... 2021 క్రిస్మస్. లండన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్ఏ హోమ్ టెస్టింగ్ కిట్ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్ కోసం తన శాంపిల్‌ను డీఎన్ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా రిజల్ట్ మెయిల్ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. తామిద్దరి డీఎన్ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్ కూడా పుట్టిందని తేలింది. ఏం జరిగిందంటే... జోన్ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నా కూతుళ్లే ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. న్యాయపరమైన చిక్కులు.. తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్ సరి్టఫికెట్ మొదలుకుని పాస్‌పోర్ట్ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్హెచ్ఎస్)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫైనల్లో జెస్సికా, సబలెంకా
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. గ్రాండ్‌స్లామ్ కెరీర్లో తొలిసారి సెమీస్ చేరిన ఆమె తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ఈ సారి సొంతగడ్డపై యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా 1–6, 6–4, 6–2తో కరోలినా ముచొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. అయితే మరో అమెరికన్ ఎమ్మా నవారో ఆట సెమీస్‌తోనే ముగిసింది.రష్యన్ స్టార్, గత యూఎస్ ఓపెన్ రన్నరప్ అరినా సబలెంక 6–3, 7–6 (7/2)తో 13వ సీడ్ ఎమ్మా నవారోను వరుస సెట్లలో ఇంటిదారి పట్టించింది. నేడు జరిగే ఫైనల్లో పెగూలా తన తొలి గ్రాండ్‌స్లామ్ కోసం, సబలెంక తన మూడో గ్రాండ్‌స్లామ్ కోసం తలపడతారు. సబలెంకా 2023, 2024లలో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. తొలి సెట్ కోల్పోయినా... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌ను ఓడించిన జెస్సికాకు సెమీస్ పోరు అంత సులువుగా సాగలేదు. మ్యాచ్ ఆరంభంలో ఫ్రెంచ్ ఓపెన్ 2023 రన్నరప్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచొవా చెలరేగి ఆడింది. తొలి 12 విన్నర్లలో పది విన్నర్లను ఆమె కొట్టింది. తొలి సెట్లో పెగూలా అదేపనిగా చేసిన తప్పిదాలు, పేలవమైన సర్విస్తో వెనుకబడింది. ఇదే అదనుగా పట్టు బిగించిన ముచొవా 28 నిమిషాల్లోనే తొలి సెట్‌ను వశం చేసుకుంది. రెండో సెట్లోనూ తొలి 9 గేముల్లో ఎనిమిదింట గెలిచి ఒక దశలో 3–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఇక్కడి నుంచి సీన్ మారిపోయింది. జెస్సికా జోరు మొదలైంది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆటలో వేగం పెంచింది. మూడు బ్రేక్ పాయింట్లతో రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో చెక్ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశమివ్వకుండా జెస్సికా మెరుపుషాట్లతో విరుచుకుపడింది. సబలెంక జోరు మరో సెమీఫైనల్లో రష్యన్ స్టార్ సబలెంక జోరుకు ఎమ్మా నవారో ఎదురు నిలువలేకపోయింది. ప్రత్యేకించి యూఎస్ ఓపెన్‌లో తొలిరౌండే దాటని అమెరికన్ ప్లేయర్ ఎమ్మా నిరుటి రన్నరప్ సబలెంక ధాటికి తొలిసెట్లో చతికిలబడింది. తొలిసెట్‌ను 6–3తో గెలుచుకున్న రెండో సీడ్ సబలెంకకు రెండో సెట్లో కాస్తా పోటీ ఇవ్వడంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అయితే టై బ్రేక్‌లో అనుభవజ్ఞురాలైన రష్యన్ అలవోకగా పాయింట్లు సాధించడంతో కేవలం గంటన్నరలోనే మ్యాచ్ ముగిసింది. సబలెంక 8 ఏస్‌లతో చెలరేగింది. 34 విన్నర్లు కొట్టింది. ఒకే ఒక ఏస్ సంధించిన నవారో 13 విన్నర్లే కొట్టగలిగింది. -
జెస్సికా జోరు
న్యూయార్క్: ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ‘ఫోబియా’ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ జెస్సికా పెగూలా అధిగమించింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన జెస్సికా ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈసారి అమెరికా క్రీడాకారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా... మహిళల సింగిల్స్‌లోనూ ఇద్దరు అమెరికా క్రీడాకారిణులు జెస్సికా పెగూలా, ఎమ్మా నవారో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం.సినెర్, డ్రేపర్ తొలిసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), 25వ ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సినెర్ 6–2, 1–6, 6–1, 6–4తో 2021 చాంపియన్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందగా... డ్రేపర్ 6–3, 7–5, 6–2తో పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)ను ఓడించాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన డ్రేపర్ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకున్న నాలుగో బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో గ్రెగ్ రుసెద్‌స్కీ (1997), టిమ్ హెన్మన్ (2004), ఆండీ ముర్రే (2008, 2011, 2012) ఈ ఘనత సాధించారు. ఏడో ప్రయత్నంలో...కెరీర్లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న 30 ఏళ్ల జెస్సికా గతంలో ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ ఆరుసార్లూ ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. కానీ ఏడో ప్రయత్నంలో జెస్సికా సఫలమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో క్వార్టర్ ఫైనల్లో జెస్సికా 6–2, 6–4తో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను కంగుతినిపించింది. 88 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన జెస్సికా 22 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘గతంలో పలుమార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఓడిపోయాను. సెమీఫైనల్ ఎప్పుడు చేరుకుంటావు అని నా శ్రేయోభిలాషులు అడుగుతుండేవారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. ఎట్టకేలకు క్వార్టర్ ఫైనల్‌ను దాటి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని జెస్సికా వ్యాఖ్యానించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జెస్సికా; ఎమ్మా నవారో (అమెరికా)తో సబలెంకా (బెలారస్) తలపడతారు. -
రెండు చేతులూ లేవు..పైలట్‌గా రికార్డ్! ఈమె గురించి తెలిస్తే, గూస్బంప్స్ ఖాయం!
The Success Story Jessica Cox శరీరంలో ఏదైనా ఒక అవయవ లోపం ఉంటేనే కృంగిపోతారు చాలామంది. కానీ కొందరు మాత్రం ఎలాంటి లోపం ఉన్నాదాన్ని చాలెంజ్‌గా స్వీకరిస్తారు. అద్బుతమైన కృషితో పట్టుదలతో తామేంటే నిరూపించుకుంటారు. అలా రెండు చేతులు లేకపోయినా పైలట్‌గా రాణిస్తోంది. జెస్సికా ప్రపంచంలోనే తొలి చేతులు లేని లైసెన్స్ పొందిన తొలి పైలట్‌గా చరిత్ర సృష్టించింది.వండర్ విమెన్ అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అరుదైన పుట్టుకతో వచ్చే లోపం కారణంగా జెస్సికాకు పుట్టుకతోనే నుండే రెండు చేతులు లేవు. అయినా ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు.అలాగే జెస్సికా కూడా రెండు చేతులు లేకపోయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. లేని చేతుల గురించి బాధపడుతూ కూర్చోలేదు. తన రెండు కాళ్లే చేతులుగా మార్చుకుంది.రెండు కాళ్లతో సాధారణ ప్రజలు ఎలాంటి పనులు చేసుకుంటారో అంతే సునాయాసంగా తానూ అలవాటు చేసింది. కొన్నాళ్లపాటు కృత్రిమ చేతులు ధరించినా ఆ తరువాత వాటిని కూడా తీసివేసింది. అరిజోనాలోని సియెర్రా విస్టాలో 1983లో జన్మించిన జెస్సికా తన పాదాలతో తన జీవితాన్ని గడపడం నేర్చుకుంది. చిన్నతనంలో, ఆమె తన సొంత పట్టణంలో నృత్యం అభ్యసించింది. 14 సంవత్సరాలు నృత్యం కొనసాగించింది. (ఉద్యోగానికి అప్లయ్ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!) 22 ఏళ్ల వయసులో పైలెట్‌గా శిక్షణ పొందింది. లెట్‌గా శిక్షణ పొందింది.కేవలం మూడు సంవత్సరాల్లో పైలెట్‌గా పూర్తి చేసింది. అంతేకాదు ఈత కొట్టడం, డ్రైవింగ్ చేయడం (కారు), విమానం నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది. 2008, అక్టోబరు 10న జెస్సికా తన పైలట్ సర్టిఫికేట్‌ను పొందింది. ఆమె 10,000 అడుగుల ఎత్తులో తేలికపాటి క్రీడా విమానాన్ని నడిపేందుకు అర్హత పొందింది.2004లో, జెస్సికా మొదటిసారిగా రైట్ ఫ్లైట్ ద్వారా సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపింది. రెండు ముఖ్యమైన అవయవాలు లేనప్పటికీ టైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్‌లను కూడా సంపాదించింది. 2019లో, కాక్స్ నాల్గవ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించింది. అమెరికన్ టైక్వాండో అసోసియేషన్‌లో బ్లాక్ బెల్ట్ సంపాదించిన చేతులు లేని తొలి వ్యక్తి. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) జెస్సికా కాక్స్ అచీవ్ మెంట్స్ ♦ జెస్సికా యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనా విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ♦బ్రాండ్లారేట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ పర్సనాలిటీ అవార్డు ♦AOPA LIVE పైలట్స్ ఛాయిస్ అవార్డ్ 2010: జెస్సికా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మహిళా ఏవియేటర్‌గా మారింది. ♦ఫిలిపినో ఉమెన్స్ నెట్వర్క్: 2009లో అమెరికాలో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన ఫిలిపినో మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ♦ది సక్సెస్ స్టోరీ జెస్సికా కాక్స్ 2009లో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో కూడా పబ్లిష్ అయింది. ఇదీ చదవండి: క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి! ♦ ఫిలిపినో అమెరికన్ జర్నల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ , 2008లో అత్యుత్తమ ఫిలిపినో అవార్డు లభించింది. ‘♦ ‘వైకల్యం అంటే అసమర్థత కాదు" అని రైట్‌ఫుటెడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మిషన్‌ను ప్రచారం చేయడానికి తాను విమానాన్ని ఉపయోగిస్తానని ఆమె పేర్కొంది ♦ 2015లో కాక్స్ తన జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా స్వంత సవాళ్లను అధిగమించడానికి ప్రజలను ప్రేరేపించేలా డిసార్మ్ యువర్ లిమిట్స్ అనే పుస్తకాన్ని రచించారు. దాదాపు 26 దేశాల్లో మోటివేషనల్ స్పీకర్ కూడా -
ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఫొటోలు వైరల్
Jess Jonassen Marriage: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జెస్సికా లూసీ జొనాసెన్ తన చిరకాల ప్రేయసి సారా వెర్న్‌ను పెళ్లాడింది. పదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఏప్రిల్ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది. హవాయిలో అత్యంత సన్నిహితుల నడుమ జొనాసెన్- సారా పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జెస్ జొనాసెన్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘సర్ప్రైజ్! థర్డ్‌టైమ్ లక్కీ.. ఎట్టకేలకు నా బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాను. ఏప్రిల్ 6.. నా హృదయంలో అలా నిలిచిపోతుంది’’ అని ట్వీట్ చేసింది. అవును లెస్బియన్నే కాగా జొనాసెన్ తాను లెస్బియన్ అన్న విషయాన్ని గర్వంగా ఈ ప్రపంచానికి చెప్పుకోగలనంటూ గతంలో ప్రకటించింది. ఈ క్రమంలోనే సారాతో ప్రేమలో ఉన్నట్లు 2018లో ప్రకటించిన ఆమె తాజాగా తనను వివాహమాడింది. ఇక ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించారన్న విషయం తెలిసిందే. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగిన జొనాసెన్.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలు. ఐదుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో మెంబర్. ఆమె ఖాతాలో వన్డే వరల్డ్‌కప్(2022) కూడా ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆసీస్ జట్టులో కూడా జొనాసెన్ భాగమైంది. ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టిన 30 ఏళ్ల జొనాసెన్.. మొత్తంగా 88 మ్యాచ్‌లలో 135 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. 100 టీ20లు ఆడి 91 వికెట్లు తీసింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఢిల్లీ తరఫున తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసింది. కొత్తేం కాదు ఇప్పటికే చాలా మంది మహిళా క్రికెటర్లు లెస్బియన్లుగా ప్రకటించుకోవడమే గాకుండా.. తమ భాగస్వాములను కూడా పెళ్లాడారు. డేనియెల్ వ్యాట్- జార్జ్ హాడ్జ్, డానే వాన్ నీకెర్క్-మారిజానే క్యాప్, లీ తహుహు- ఆమీ సాటెర్త్‌వైట్, నటాలీ సీవర్- కేథరిన్ బ్రంట్, లిజెల్లీ లీ- తంజా క్రోన్జ్, లారెన్ విన్ఫీల్డ్- కర్టెనీ హిల్, మేఘన్ షట్- జెస్ హొల్యోక్, హేలీ జెన్సెన్- నికోలా హాంకోక్, మ్యాడీ గ్రీన్- లిజ్ పెర్రీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. చదవండి: వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్ SURPRISE!! 3rd time lucky - finally married my best friend 🥰 April 6th will always have a special place in my heart 👩❤️👩💍 #hawaii #wedding #love pic.twitter.com/rOYEyrOGFQ — Jessica Jonassen (@JJonassen21) April 14, 2023 -
నాతో స్టార్ హీరో సీక్రెట్ అఫైర్.. చివరకు కాల్ గర్ల్‌లా..: నటి
ఓ స్టార్ హీరో తనను వాడుకుని వదిలేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది అమెరికన్ సింగర్, నటి జెస్సికా సింప్సన్. తనతో రహస్య సంబంధం పెట్టుకున్న అతడు ఆ సమయంలో బయటకు మాత్రం సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకునేవాడని పేర్కొంది. 'మూవీ స్టార్: దె ఆల్వేస్ సే దె ఆర్ సింగిల్' వ్యాసంలో తన అనుభవాన్ని ఏకరువు పెట్టింది నటి. 'మ్యూజిక్ వీడియో అవార్డుల ఫంక్షన్లో హాలీవుడ్‌లోని ఓ మెగాస్టార్ నన్ను ఓరగా చూశాడు. కళ్లతోనే దోబూచులాడాడు. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్‌లో జిమ్‌లో మరోసారి మేమిద్దరం కలిశాం. అప్పుడు అతడిని నా మ్యూజిక్ వీడియోలో నటించమని అడిగాను. మనం అడగ్గానే ఒప్పుకుంటున్నారని మురిసిపోవద్దు. దాన్ని వాళ్లు అవకాశంగా తీసుకుంటారు. తర్వాత మనల్ని మోసం కూడా చేస్తారు. ఇది చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. నాపై ముద్దుల వర్షం కురిపించిన అతడు మరో ప్రియురాలితో కలిసి రెడ్ కార్పెట్‌పై కనిపించడంతో నా గుండె ముక్కలయ్యింది. మా బంధం ముగిసిపోయిందని అర్థమైంది. నాకు నేను కాల్ గర్ల్‌లా అనిపించాను. హాలీవుడ్లో ఒక్క భార్య/గర్ల్‌ఫ్రెండ్ చాలు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారని అప్పుడే తెలిసొచ్చింది' అని రాసుకొచ్చింది. కాగా జెస్సికా 2002లో నిక్ లాచేను పెళ్లాడగా 2006లో విడాకులిచ్చింది. తర్వాత 2014లో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎరిక్ జాన్సన్‌ను పెళ్లాడింది. చదవండి: పాపం అవకాశాల్లేక చిత్రవిచిత్ర డ్రెస్సులో కీర్తి సురేశ్ మేకప్ రూమ్‌లో పేలుడు, నటి పరిస్థితి విషమం -
ఆశాదీక్షలే ఇరు భుజాలు
పడిశం పడితే బెంబేలు పడిపోతాం. జ్వరం వస్తే మంచమెక్కుతాం. ఇ.ఎం.ఐ కట్టలేక స్కిప్ అయితే ముఖానికి చెమటలు పట్టించుకుంటాం. ఏదో ఒక కష్టం వస్తే ఏదో ఒకవైపు పారిపోదాం అని చూస్తాం. ఎట్టకేలకు వాటినుంచి ఎలాగోలా బయట పడతాం. కాని బయటపడలేని కష్టం ఒకటి వస్తే? ఆ కష్టం శాశ్వతం అని తెలిస్తే? అప్పుడు సీతాకోకచిలుకలా ఎగిరే ధైర్యం తెచ్చుకుంటామా? గగనాన్ని సవాలు చేయగల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటామా? ఈ జీవితం మెడలు వొంచి ముందుకు సాగగలం అని దిలాసాగా అనుకోగలుగుతామా?ఈమె, 36, సంవత్సరాల జెస్సికా కాక్స్ అనుకుంది. కనుక ఇవాళ ప్రపంచమంతా ఆమెను చూస్తోంది. ఆమెను వింటోంది. ఆమె మాటలకు ఇన్‌స్పయిర్ అయ్యి ఎదురయ్యే సవాళ్లను ముక్కచెక్కలు చేయడం నేర్చుకుంటోంది. ఆగడం, ఆపేయడం చెడ్డ అలవాట్లు. ముందుకు సాగడం జెస్సికా కాక్స్‌ను చూసి నేర్చుకోవాల్సిన మంచి అలవాటు.అమెరికాలో అరిజోనా రాష్ట్రంలోని టక్సన్ ప్రాంతంలో 1983లో జెస్సికా జన్మించినప్పుడు ఆమెకు ఇరుభుజాలు లేకపోవడాన్ని చూసి తల్లిదండ్రులు స్థాణువయ్యారు. గర్భంతో ఉన్నప్పుడు చేసిన స్కానింగ్ రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయని భావించడం వల్ల లోపల ఉన్న పాపాయికి భుజాలు లేకుండే పుట్టే ఒక అరుదైనా రుగ్మత ఉన్నట్టు కనిపెట్టలేకపోయారు. ఇటువంటి అనూహ్యత ఎదురైనప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏడుస్తూ మూల కూర్చుంటారు. కాని జెస్సికా తల్లిదండ్రులు మొదట తమ పాపకు భుజాలు లేవు అన్న వాస్తవాన్ని స్వీకరించారు. అయితే ఆమెను అందరు పిల్లలకు భిన్నంగా పెంచాలనే ఆలోచనను మానుకున్నారు. తాను అందరిలాంటి దాన్నే అనే భావం కలిగేలా జెస్సికాను మామూలు స్కూల్లోనే వేశారు. మామూలు పిల్లలతోనే ఆడుకునేలా చేశారు. అయితే ఆ పిల్లలు ఆమెకు చేతులు లేవని ఎక్కువ ప్రేమగా, కన్సర్న్‌గా చూడటం జెస్సికాకు విసుగు పుట్టేది. తనకు తానుగా ఆడుకోవాలని కోరికతో తహతహలాడేది.జెస్సికాకు ఐదారేళ్ల వయసులోనే కృత్రిమ చేతులు పెట్టారు. రోజూ స్కూల్ నుంచి వచ్చాక ఆ చేతులను ఎలా ఉపయోగించాలన్న విషయం మీద ప్రాక్టీసు ఉండేది. పద్నాలుగేళ్ల వరకు కృత్రిమ చేతులతోనే జెస్సికా తన బాల్యాన్ని దాటింది. కాని ఎన్ని రోజులు గడిచినా అవి కృత్రిమ చేతులనే ఆమెకు అనిపించాయి తప్ప ‘తన చేతులు’ అనిపించలేదు.ఇవి నాకెందుకు... నావైన నా కాళ్లు ఉన్నాయి కదా వాటినే చేతులుగా మార్చుకుందామని నిర్ణయించుకుని, ఆ కృత్రిమ చేతులను పక్కకు పడేసిన రోజున ఆమె జీవితం మలుపు తిరిగింది. అప్పటినుంచి జెస్సికా తనను తాను సాధన చేసుకోవడం నేర్చుకుంది. కాళ్లతో షూస్ వేసుకోవడం, ఈత కొట్టడం, టైప్ చేయడం, కారు నడపడం... అంతేకాదు యుద్ధవిద్య ‘టైట్వాండో’లో ఆమె అతి త్వరలో బ్లాక్ బెల్ట్ సాధించింది. పియానో వాయించడం నేర్చుకుంది. అంతదాకా ఎందుకు కళ్లల్లో కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవడం తీయడం కూడా ఆమె కాళ్లతో అతి సులువుగా చేయగలదు. ‘శారీరక పరిమితులు ఉన్నాయనుకుని మెదడు వేసే బంధనాలు తెంచుకోవడంలోనే అసలు విజయమంతా ఉంది’ అని జెస్సికా కాక్స్ చెబుతుంది.ఫిలాసఫీలో డిగ్రీ చేశాక ఆమెకు విమానం నడపాలనే కోరిక పుట్టింది. కొత్తలో ఈ ఆలోచనకు భయపడ్డా, ఆమెకు ట్రయినింగ్ ఇచ్చే ఏవియేషన్ క్లబ్బులు సందేహించినా 2005లో ఆమె ఇందుకుగాను ట్రైయినింగ్ మొదలుపెడితే అనేక ప్రయత్నాలు, వైఫల్యాల తర్వాత 2008లో ఆమెకు అనుమతి పత్రం లభించింది. పెడల్స్ లేని లైట్ వెయిట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి ఇప్పుడు జెస్సికా దగ్గర లైసెన్స్ ఉంది. ఇలాంటి లైసెన్స్ పొందిన మహిళ ఈమె ఒక్కతే.జెస్సికా విజయగాథ విని దాదాపు ఇరవై దేశాల యూనివర్సిటీలో స్ఫూర్తిదాయక ప్రసంగాల కోసం ఆమెను ఆహ్వానించాయి. ఆమె స్వయంగా మోటివేషనల్ స్పీకర్‌గా జనాలను ఉత్తేజ పరుస్తుంటుంది. ట్వయికోండో శిక్షణలో పరిచయమైన పాట్రిక్‌ను ఆమె వివాహం చేసుకుంది. వారిద్దరూ సంతోషంగా ఒకరికొకరు సపోర్టుగా ఉంటూ జీవితం సాగిస్తున్నారు.‘మీ కలలు కేవలం రెండు భుజాలు మాత్రమే ఉన్నాయన్న భావనని మొదట తీసేయ్యండి. మీకు వేయి భుజాలు ఉన్నాయని నమ్మినప్పుడే దేన్నయినా సాధిస్తారు’ అని ఆమె అంటుంది.భుజాలు లేని జెస్సికా ఇన్ని సాధించినప్పుడు రెండు భుజాల ఐశ్వర్యం ఉన్న మనం ఎన్ని సాధించాలి? -
భారత సంతతి మహిళ దారుణ హత్య
లండన్ : ఉత్తర ఇంగ్లండ్‌లో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన మహిళా ఫార్మాసిస్టును గుర్తు తెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఇంగ్లండ్‌లోని మిడిల్స్బరో పట్టణంలోని తన ఇంట్లో ఉన్న జెస్సీకా పటేల్‌ను గత సోమవారం వెంటాడి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిడిల్స్‌బరోలో జెస్సీకా, మితేష్ దంపతులు గత మూడేళ్లుగా ఫార్మసీని నడుపుతున్నారని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో చదువుతున్న సమయంలో ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించారు. జెస్సీకా మృతికి గల కారణాన్ని మాత్రం ఇప్పుడే బయటకు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎలాంటి సమాచారం ఉన్నా తమను సంప్రదించాలని స్థానికులను పోలీసులు కోరారు. జెస్సీకా నివాసం ఉండే భవనం రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుందని, ఆధారాలను సేకరించేందుకు క్లూ టీమ్‌కు ఇది క్లిష్టంగా మారిందని వెల్లడించారు. -
చేతుల్లేకున్నా.. లోకాన్ని అందుకుంది!
ఆమెకు రెండు చేతులు లేవు అయితేనేం ఆత్మవిశ్వాసం మాత్రం నిండుగా ఉంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సాధించలేని ఉన్నత శిఖరాలను ఆత్మస్థైర్యంతో అధిరోహించింది. ప్రపంచంలోనే చేతులు లేకుండా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేకాదు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సాధించడంతోపాటు విమానాన్ని నడిపిన తొలి పైలట్‌గానూ గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది జెస్సికా కాక్స్. ఆ సంగతులేంటో నేటి ‘success story’లో తెలుసుకుందాం...! మనలో చాలామందికి అసలు లక్ష్యాలు ఉండవు. లక్ష్యాలు ఉన్నవారు కూడా తమ కుటుంబ పరిస్థితులు బాగాలేవని, మా తల్లిదండ్రులు చదువుకొని ఉంటే బాగుండని, మేం డబ్బున్నవాళ్లమైతే అనుకున్న లక్ష్యాలను చేరేవారమని ఇలా నిందించుకుంటూ లక్ష్య సాధనలో వెనకపడుతూ ఉంటారు. నిండైన ఆత్మవిశ్వాసం ఉంటే తమ లక్ష్యసాధనకు ఏదీ అడ్డంకి కాదని ఎందరో నిరూపించి మనకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు జెస్సికా కాక్స్. సౌకర్యాలకన్నా నిండైన ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర శ్రమ ద్వారానే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపిస్తోంది జెస్సికా. ఆమె 1983 ఫిబ్రవరి 2న అమెరికాలో జన్మించింది. అయితే జన్యుపరమైన లోపాల కారణంగా ఆమెకు రెండు చేతులు లేవు. కూతురి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. భవిష్యత్తులో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి చిన్నతనంలోనే చంపేయాలని ఇరుగుపొరుగు సూచించినా వారు మాత్రం కన్నపేగును కడుపులో దాచుకొని పెంచారు. కొన్నిరోజుల తర్వాత జెస్సికాను పాఠశాలకు పంపండం ప్రారంభించారు. అయితే పాఠశాలలో తోటి విద్యార్థులు జెస్సికాను తీవ్రంగా అవమానించేవారు. వారి మాటలకు జెస్సికా చాలా బాధపడేది. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్లలేనని చెప్పేది. కానీ, అకస్మాత్తుగా ఒకరోజు జెస్సికా తనకు చేతులు లేకపోయినా కాళ్లు ఉన్నాయి వాటిసాయంతోనే అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని నిశ్చయించుకుంది. పైలెట్‌గా.... చేతులు లేకపోయినా కాళ్లతోనే రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు కాళ్లతోనే టైపింగ్ చేయడం కూడా నేర్చుకుంది. నిమిషంలోనే 25 పదాలు టైప్ చేసే స్థాయికి చేరుకుంది. అందరిలా తాను ఉండాలనుకునే జెస్సికా స్విమ్మింగ్ కూడా నేర్చుకుని బెస్ట్ స్విమ్మర్‌గా మారింది. 14 సంవత్సరాల వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి జెస్సికా. అంతేకాదు గుర్రపుస్వారీలో కూడా ప్రావీణ్యం సాధించింది. 17 సంవత్సరాల వయసులో కారు డ్రైవింగ్ నేర్చుకుని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. చదువులో కూడా జెస్సికా ఎప్పుడు ముందే ఉండేది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించే జెస్సికా పైలెట్‌గా మారాలని నిశ్చయించుకుంది. మూడేళ్ల శిక్షణ అనంతరం 2008లో పైలెట్‌గా సర్టిఫికెట్ అందుకుంది. జెస్సికా వివిధ దేశాలు పర్యటిస్తూ అందరికి ప్రేరణ కలిగిస్తోంది. 2014లో జెస్సికా కరాటేలో అరిజోనా చాంపియన్‌గా నిలిచింది. కసి, పట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసం ఉన్నత శిఖరాలు మన కాళ్ల దగ్గరకొస్తాయని జెస్సికా నిరూపించింది. జెస్సికా నీవు సాధించిన ఘనతలకు నిజంగా నీకు సెల్యూట్....! – సాక్షి స్కూల్ ఎడిషన్ -
నిలబడి చప్పట్లు కొట్టండి!
అమ్మాయి ఒళ్లు చూసే ప్రపంచం ఇది. ఎవరి తల్లీ.. ఎవరి బిడ్డా.. ఎవరి చెల్లీ.. ఎవరి భార్యా.. ఆ కొలతల చూపుల్నుంచి తప్పించుకోలేరు. అలాంటి కళ్లను.. అవి ఎన్ని కళ్లయినా సరే.. పొడిచేయాలనిపిస్తుంది! కానీ ‘‘కంటికి కన్ను సమాధానం కాదు.. అలా అయితే ప్రపంచమే చూపులేనిదైపోతుంది’’ అన్నారు గాంధీజీ! మరేం చేయాలి? అదే ఒళ్లుతో అవే కళ్లను తెరిపించాలి.. ప్రపంచాన్ని మార్చాలి.. పెరూ పేరును మార్చాలి... అనుకున్నారు జెస్సికా న్యూటన్! అద్భుతమైన కథ.. మీరందరూ చదవాల్సిన కథ..లేచి చప్పట్లు కొట్టాల్సిన కథ! ఇంట్రడక్షన్ ఆఫ్ జెస్సికా జెస్సికా న్యూటన్.. 1987లో మిస్ పెరూగా ఎన్నికైంది. మోడల్‌గా పనిచేసింది. అది గ్లామర్ ప్రపంచం! అమ్మాయిని చూపించి వ్యాపారం చేసుకునే మార్కెట్. దురదృష్టవశాత్తు స్త్రీ కూడా కమాడిటీయే. ఒక కమాడిటీని చూపించి ఎన్నో కమాడిటీస్ను అమ్ముకునే సంత. తమ మీద ఆధారపడి సాగే మార్కెట్లో కూడా తమకు విలువ లేదు. అంతా పురుషుల రాజ్యమే. అవకాశం చూపించి ఏమైనా ఆశించొచ్చు. అది వాళ్ల హక్కు. నేమ్, ఫేమ్, ఆశ, ఆశయం.. చివరకు మనీ... కోసం తప్పదు కొన్నిసార్లు వీళ్లకు! తనకు కనడ్డవి.. చవిచూసినవి అన్నీ ఒకెత్తు! కంట్రీ ఆఫ్ ది రేపిస్ట్స్ అని దేశానికి ఉన్న పేరు ఒకెత్తు! ఇన్ని రోజులు పేపర్లలో, టీవీ న్యూస్ చానళ్లలో, చాలా చదివింది, చూసింది.. సోషల్ మీడియాలో చాలానే ఫోలో అయింది. ఎక్కడైనా ఒకటే.. హాంటిగ్ ఇష్యూ.. వయలెన్స్ ఎగైన్స్ట్ విమెన్! డొమెస్టిక్ వయలెన్స్, హెరాస్మెంట్.. డిస్క్రిమినేషన్, ట్రాఫికింగ్.. రేప్! ఓ గాడ్.. సేవ్ విమెన్ అని చాలా సార్లే అనుకుంది. మౌనంగా దేవుడిని వేడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని తన చేతకాని తనాన్నీ తిట్టుకుంది. కాని కిందటి రాత్రి చూసిన నివేదిక.. అందులో ఒళ్లు గగుర్పొడిచే స్టాట్స్.. ఆమెను నిద్రపోనివ్వలేదు. ఈసారి బ్యూటీకాంటెస్ట్ నిర్వహణా బాధ్యతను ఇవ్వడానికి ఆర్గనైజర్స్ వచ్చినప్పుడు.. బ్రహ్మాండంగా నిర్వహించి అంతకుముందున్న రికార్డ్‌ను బద్దలు కొట్టాలి అనుకుంది.. ఆ దిశగానే ప్లాన్ చేసుకుంది. ప్రాక్టీస్ చేస్తోంది కూడా. కాని ఆ నివేదిక రాత్రికి రాత్రే జెస్సికా ప్లాన్‌ను మార్చేసింది. ఆ క్షణమే కమిటీలో ఉన్న తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది అప్పుడే పుట్టిన తన ఆలోచనను. ‘‘శభాష్.. గో అహెడ్’’ అని ప్రోత్సహించారు! తెల్లవారే.. కకావికలమైన మనసుతో తన ప్రణాళికను ఆచరణలో పెట్టింది. పెరూ రాజధాని లిమాలో... 2018 బ్యూటీ కంటెస్ట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఈసారి లాస్ వేగస్‌లో జరగబోయే 66వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఎలాగైనా మిస్ పెరూ ఎన్నికవ్వాలి. దానికి ఈ మిస్ పెరూ బ్యూటీకాంటెస్ట్ డయాస్ కావాలి’ జెస్సికా న్యూటన్‌కు చెవిలో జోరీగలాగా చెప్తున్నారు ఆర్గనైజర్స్, స్పాన్సర్స్! కిందటి రోజు దాకా చాలా ఉత్సాహంగా ఉన్న జెస్సికా.. ఎందుకనో ఆ రోజు ఉదయం నుంచి చాలా అన్యమనస్కంగా ఉంది. ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ మాటలు చెవికెక్కడం లేదు. ఆ పనంతా వదిలేసి పారిపోవాలనుంది. ఉండుండీ దుఃఖం వస్తోంది. అప్పటికే రెండుసార్లు రెస్ట్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసినా భారం తగ్గట్లేదు. ఏమీ పట్టనట్టున్న ఆమె ప్రవర్తన వింతగా తోస్తోంది మిగతా వాళ్లకు. ‘‘మెనోపాజ్ ఏమో..’’.. ‘హిహి.. హార్మోనల్ ఇంబాలెన్స్’’ లాంటి కామెంట్స్ వినపడతున్నాయి వెకిలి నవ్వుకి తోడుగా ఆమెకు! అవేవీ ఆమెకు ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు. అలవాటే. పైగా అంతకుముందు తాను విన్నవాటితో, కిందటి రోజు రాత్రి తాను చదివిన ఓ నివేదికలోని సారాంశంతో పోల్చి చూసుకుంటే ఆ కామెంట్స్ నథింగ్. విరక్తిగా నవ్వుకుంది. ఏదో తెలియని బాధ, వేదన అనుభవిస్తోంది. అయినా తాను చేయాల్సిన ఓ పని గురించి బ్రెయిన్ షార్ప్‌గానే ఆలోచిస్తోంది. తనదైన పంథాలో ప్రణాళిక వేస్తోంది. రిహార్సల్స్ హాల్లోకి వెళ్లింది. 23 మంది అమ్మాయిలు.. అందరూ దాదాపుగా పద్దెనిమిది నుంచి 20 ఏళ్లలోపు వాళ్లే! ఆ కళ్లల్లో ఆశలు.. ఆ క్యాట్వాక్లో కాన్ఫిడెన్స్.. తన యవ్వనపు రోజులు గుర్తొచ్చాయి ఆమెకు. తనూ ఇలాగే చాలా యాంబిషియస్‌గా ఉండేది. ఫస్ట్ టైమ్ స్విమ్ సూట్లో ర్యాంప్ మీదకి రావడానికి చాలా నెర్వస్‌గా ఫీలయింది. ఇబ్బంది పడింది. గెలిచినప్పుడు ఆ నెర్వస్‌నెస్‌ను, ఇబ్బందిని దుఃఖంతో బయటకునెట్టేసింది. ఇప్పుడు.. వాళ్లలో తనను చూసుకుంటోంది. వీళ్లు.. కొత్తగా కనపడాలి.. ఈ బ్యూటీకాంటెస్ట్ పర్పస్ చేంజ్ అవ్వాలి! థీమ్ బేస్ కాదు.. ఇష్యూ బేస్డ్గా బయటకు రావాలి! అందరినీ విష్ చేసి.. రిహార్సల్స్ ఆపించి ఆ హాల్లో ఒక చోట సమావేశపర్చింది. తన మనసులో ఉన్నది వాళ్లకు చెప్పింది. చేతిలో ఉన్న కాపీలను వాళ్లకు పంచింది. ఏం చేయాలో వివరించింది. ఆ 23మంది మొహాల్లో ఒకరకమైన భావన! అర్థంకాని ఎక్స్ప్రెషన్! కాని అన్నిజతల కళ్లల్లోనూ ఒక మెరుపు! ఓ కొత్త పనికి పూనుకోబోయే ముందు వచ్చే ఒక పులకరింపు ఒంట్లో! మొత్తానికి ఏదో సరికొత్త శక్తిని ఆవహించుకున్నట్టయితే కనిపించారు వాళ్లు జెస్సికాకు! ఈ ఉత్సాహం చాలు అనుకుంది ఆమె! అక్టోబర్ 29.. ఆదివారం అందాల పోటీల రోజు రానే వచ్చింది. లిమాలోని ‘ట్రీటో మున్సిపల్ డి లిమా’ వేదిక! పోటీల్లో ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు లిమా గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్ల భద్రత, రక్షణ విషయంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో లిమా అయిదో స్థానంలో ఉంది. అబ్రప్ట్గా ఈ ప్రస్థావన ఎందుకంటే.. 23 మంది ఫైనలిస్ట్‌లు ఒకొక్కరే స్టేజ్ మీదకు వస్తున్నారు తమను తాము పరిచయం చేసుకునేందుకు! ఇక్కడా ఇంకో విషయం చెప్పాలి.. క్షమించండి.. మళ్లీ అంతరాయం కలిగించినందుకు! పెరూ అందాల పోటీల్లో పాల్గొనే వాళ్లు స్టేజ్ మీద తమ పేరు, ఊరు, వయసుతోపాటు విధిగా తమ శరీర కొలతలనూ చెప్పాలి. ఇది పోటీల నియమం. 1950ల్లో పెరూలో అందాల పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి సడలని, సడలించని, సడలించడానికి వీల్లేని నియమం! ఇక విషయంలోకి... హాలంతా కిక్కిరిసిపోయి ఉంది. ఒక వైపు జడ్జీలు ఆసీనులయ్యారు. ఇంకో వైపు ఆర్గనైజర్స్. ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న యాంకర్ చాలా హుషారుగా ఉన్నారు. కొన్ని వినోద కార్యక్రమాలు అయిపోయాక అందాల పోటీలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ కంటెస్టెంట్‌ను పిలిచారు. ఆ నడకలో సహజంగా అందాల పోటీల్లో ఉండే కంటెస్టెంట్లో ఉన్న వయ్యారం లేదు. ప్రశ్నిస్తున్నట్టుంది బాడీ లాంగ్వేజ్. జడ్జెస్ అందరి మొహాల్లో ఒక ప్రశ్నార్థకం ఒకేసారి! ‘‘ఐయామ్ కెమిలా కానికోబా.. ఫ్రమ్ లిమా’’ తన పేరు, ఊరు చెప్పింది ర్యాంప్ మీద. ఆ తర్వాత బాడీ కొలతలే. అందరూ చెవులు రిక్కించారు.. ఉత్సుకతతో చూస్తున్నారు.. ‘మై మెజర్మెంట్స్ ఆర్.. రెండువేల రెండు హత్యలు. గత తొమ్మిదేళ్లలో నా దేశంలో నమోదైన ఆడపిల్లల హత్యలు అక్షరాలా రెండువేల రెండు’’ అని చెప్పి అంతే వేగంగా ర్యాంప్ మీద నుంచి స్టేజ్ మీదకు వెళ్లింది. అందరిలో అయోమయం జడ్జెస్‌తో సహా! బ్యాక్‌స్టేజ్‌లో ఉన్న జెస్సికా పిడికిలి బిగించి ‘యెస్’అనుకుంది కసిగా! తను అనుకున్నట్టే జరుగుతోంది ప్రోగ్రామ్. కెమిలా ఎంతో నమ్మకాన్నిచ్చింది. ప్రారంభం బాగుంది. థ్యాంక్యూ కెమిలా.. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది జెస్సికా! సెకండ్ కంటెస్టెంట్ ర్యాంప్ మీదకు వచ్చి.. ‘‘మై నేమ్ ఈజ్ కరేన్ క్యూటో.. మై మెజర్మెంట్స్ ఆర్.. ఈ యేడు డొమెస్టిక్ వయలెన్స్ కింద 82 మంది మహిళల హత్య, 156 రేప్‌లు’’ అని చెప్పింది. ఇంకో కంటెస్టెంట్.. ‘‘నా పేరు రొమినా లొజానో. కల్లావో నుంచి వచ్చా. నా కొలతలు 2014 నుంచి ఇప్పటి వరకు మూడు వేల నూట పధ్నాలుగు మంది అమ్మాయిలు ట్రాఫికింగ్’’. నాలుగో కంటెస్టెంట్.. ‘‘నా పేరు లోంజానో.. నా దేశంలోని యూనివర్శిటీల్లో అసాల్ట్‌కు గురైన అమ్మాయిలు 65 శాతం!’’. ఆ తర్వాత.. ‘‘నా పేరు సమంతా బాటల్లనోస్.. నా మెజర్మెంట్స్.. సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌తో ప్రతి ఆరు నిమిషాలకో బాలిక చచ్చిపోతోంది’’. ‘‘నా పేరు జువానా అసెవేడో. నా కొలతలు.. నా దేశంలో 70 శాతం మంది మహిళలు స్ట్రీట్ హెరాస్‌మెంట్‌కు గురవుతున్నారు’’... ఇలా 23 మంది పోటీదారులు పెరూలో మహిళల మీద రకరకాల రూపంలో జరుగుతున్న హింసను లెక్కలతో సహా చెప్పారు వాళ్ల కొలతలకు బదులుగా! స్విమ్ సూట్ రౌండ్కైతే... స్టేజ్ వెనకాల.. మహిళల మీద దాడులు, రేప్‌లు, ఇతర అరాచకాలు, దాష్టీకాలకు సంబంధించిన వార్తా పత్రికల న్యూస్ క్లిప్పింగ్, న్యూస్ చానళ్ల ఫుటేజ్‌తో మాంటేజ్‌ను ప్రదర్శించారు. ఈ పోటీ అయిపోయే సరికి ఆహూతులు, జడ్జీలు.. కరతాళ ధ్వనులు చేయలేదు. అవమానం దహించేస్తుండగా.. విచారం కమ్మేయగా లేచి నిలబడి తలవంచుకున్నారు! జెస్సికా కళ్లల్లో ఉద్వేగంతో కూడిన నీళ్లు! రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది. వీళ్లందరిలో ఆలోచనను రేకెత్తించింది. కనీసం ఇన్సల్ట్ ఫీలయ్యేలాగైనా చేసింది. అలా ఏడుస్తూనే ఉంది. కెమెరాలు, మైక్‌లతో మీడియా వాళ్లు వచ్చేవరకు! ‘‘బ్యూటీకంటెస్ట్ను మహిళల మీద జరుగుతున్న హింసకు ప్రొటెస్ట్‌గా మార్చాలనే ఐడియా ఎలా వచ్చింది?’’ మీడియా ప్రశ్న. ‘‘ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి ఐడియా రానక్కర్లేదు. ఆ బాధను అనుభవిస్తే తెలుస్తుంది దాన్ని ఎలా ప్రొటెస్ట్ చేయాలో. హెరాస్మెంట్, మిస్ట్రీట్మెంట్, రేప్.. ఇక ఉండకూడదు అనుకున్నా. ఇన్నాళ్లు అమ్మాయిల బాడీ కొలతలు చెప్పడం.. పోటీలో మ్యాండెటరీగా ఉండింది. కాని మన దేశంలోని జెండర్ డిస్క్రిమినేషన్, వయెలెన్స్ ఎగైనెస్ట్ విమెన్ స్టాటిస్టిక్స్ను బాడీకొలతలుగా చెప్పించాలనుకున్నా. అలాగైనా ఈ కంటెస్ట్ తీరు మారుతుందని, కనీసం కొంతమందైనా మహిళల గురించి ఆలోచిస్తారని’’ ఆన్సర్ చేసింది జెస్సికా. ‘‘ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు మహిళా సాధికారత వేదిక. అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలకు బుర్ర ఉండదని చాలామంది అభిప్రాయం. ఆ భ్రమను తొలగించాలి.. భ్రాంతిని బద్దలు చేయాలని ఈ కంటెస్టెంట్స్‌కి చెప్పా! వీ ఆర్ బ్యూటీస్ విత్ నాట్ ఓన్లీ బ్రెయిన్స్ బట్ ఆల్సో విత్ హార్ట్ అని నిరూపించారు వీళ్లు! సో.. మీడియా.. అండ్ సోకాల్డ్ మెన్స్ వరల్డ్.. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి! ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి. ఎటు పడితే అటు నోరు పారేసుకోడానికి వీల్లేదు.. వేలెత్తి చూపితే కుదరదు. మేం యే బట్టలు వేసుకోవాలి? ఎలా ఉండాలి అన్నది మా వ్యక్తిగత విషయం. వ్యక్తిగత నిర్ణయం. ఇది మీడియాకు వార్త కాదు. వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఒకవేళ మేం అరకొర దుస్తులతోనే బయటకు వెళ్లాలనుకుంటే వెళ్తాం. అది మా ఇష్టం. నేను బికినీ వేసుకుని బయటకు వెళ్లినా.. ఈవినింగ్ డ్రెస్‌లో వెళ్లినంత డీసెంట్‌గానే వెళ్తా!’’ అని కొనసాగించింది జెస్సికా న్యూటన్. ఈ సారి పెరూ అందాల పోటీ ఇదివరకటికన్నా ప్రాచుర్యం పొందింది. మహిళల పట్ల హింస, లైంగికదాడులు, వివక్ష, గౌరవలేమి.. ఒక్క పెరూకే పరిమితం కాదు. ఆడవాళ్ల భద్రత, రక్షణ విషయంలో అత్యంత ప్రమాదకరమైన సిటీ లిమానే కాదు మన రాజధాని ఢిల్లీ కూడా. క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్‌కు సంబంధించి మన అపకీర్తి ఆకాశాన్నంటుతోంది. మన దగ్గర అందాల పోటీలూ కొలతలనే ప్రస్తావిస్తాయి. ఈ విషయంలో పెరూ బ్యూటీకంటెస్ట్ స్ఫూర్తిని మనమూ సాగిస్తే బాగుంటుంది. చిన్న మనవి.. ఇదీ బయోగ్రఫే! వివక్ష, అన్నిరకాల హింసకు గురవుతున్న ప్రతిదేశంలోని మహిళ బయోగ్రఫీ. దాన్ని ఎదిరించాలనుకునే సాహసి బయోగ్రఫీ! అందం.. ఆలోచన.. మనసు ఉన్న మహిళ బ్రయోగ్రఫీ! – శరాది -
ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం
-
ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. బుధవారం నాంపల్లి కోర్టులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇస్తున్నారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్‌కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ముడుపులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. మార్క్ టేలర్ ఇంట్లోనే రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను కలిశారు.