జెస్సీకా పటేల్ (ఫైల్ ఫొటో)
లండన్ : ఉత్తర ఇంగ్లండ్‌లో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన మహిళా ఫార్మాసిస్టును గుర్తు తెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఇంగ్లండ్‌లోని మిడిల్స్‌బరో పట్టణంలోని తన ఇంట్లో ఉన్న జెస్సీకా పటేల్‌ను గత సోమవారం వెంటాడి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిడిల్స్‌బరోలో జెస్సీకా, మితేష్ దంపతులు గత మూడేళ్లుగా ఫార్మసీని నడుపుతున్నారని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో చదువుతున్న సమయంలో ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించారు.
జెస్సీకా మృతికి గల కారణాన్ని మాత్రం ఇప్పుడే బయటకు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎలాంటి సమాచారం ఉన్నా తమను సంప్రదించాలని స్థానికులను పోలీసులు కోరారు. జెస్సీకా నివాసం ఉండే భవనం రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుందని, ఆధారాలను సేకరించేందుకు క్లూ టీమ్‌కు ఇది క్లిష్టంగా మారిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment