ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. బుధవారం నాంపల్లి కోర్టులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇస్తున్నారు. స్టీఫెన్సన్తో పాటు ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ముడుపులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. మార్క్ టేలర్ ఇంట్లోనే రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ను కలిశారు.