mark taylor
-
Shane Warne: అప్పుడే ఏడాది గడిచిపోయిందా? నమ్మలేకున్నా!
Shane Warne Death Anniversary: ‘‘అత్యంత విచారకరం. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు. కాలం గిర్రున తిరిగిపోయిందని.. వార్న్ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్ లేనిలోటు ఎవరూ పూడ్చలేరన్నాడు. ‘మాంత్రికుడు’ మరో లోకానికి.. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ లోకాన్ని వీడి నేటికి సరిగ్గా ఏడాది. థాయ్‌లాండ్‌లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన అతడు హఠాన్మరణం చెందాడు. ఛాతీ నొప్పితో కుప్పకూలిన వార్న్.. థాయ్‌లాండ్ పర్యటనలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించింది. వార్న్‌ను కడసారి చూసుకునేందుకు తరలివచ్చిన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. క్రికెట్ అంటే పిచ్చి ఈ నేపథ్యంలో షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్న మార్క్ టేలర్.. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. స్పిన్ మాంత్రికుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇండియాలో బంతి అద్భుతంగా టర్న్ అవుతున్న సందర్భాల్లో కచ్చితంగా వార్న్ మనందరికీ మరీ మరీ గుర్తుకువస్తాడు. తన స్పిన్ మాయాజాలంతో వార్న్ చేసిన అద్భుతాలు, మైదానంలో వదిలిన జ్ఞాపకాలు అలాంటివి. అతడు లేని లోటు ఎన్నటికీ ఎవ్వరూ పూడ్చలేరు. అతడి అభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆట పట్ల వార్న్‌కు ఉన్న ప్రేమ, అంకితభావానికి మాత్రం ఫిదా కాకుండా ఉండలేం’’ అని మార్క్ టేలర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ గెలిచిన సారథిగానూ రికార్డులకెక్కాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇక ప్రస్తుతం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ వార్న్ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు -
ఆదివారం విచిత్ర పరిస్థితి! దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్
ICC Mens T20 World Cup 2022 - India Vs Pakistan- Dead Ball Row: టీ20 వరల్డ్‌కప్-2022 సూపర్-12లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా చర్చనీయాంశమైన ‘డెడ్ బాల్’పై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ పాక్ అభిమానులు వాదిస్తుండగా.. సైమన్ టాఫెల్ వంటి దిగ్గజ అంపైర్.. నిబంధనల ప్రకారమే టీమిండియాకు మూడు పరుగులు వచ్చాయని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఈ ఆసీస్ అంపైర్ పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మార్క్ టేలర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. కాగా పాక్‌తో ఆదివారం నాటి హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ నాలుగో బంతికి నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను విరాట్ కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచిన విషయం తెలిసిందే. దీనిని అంపైర్ ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించడంతో టీమిండియాకు 1 బంతికి 7 పరుగులు వచ్చాయి. అంతేకాకుండా రోహిత్ సేనకు ‘ఫ్రీ హిట్’ ఛాన్స్ కూడా దొరికింది. ఆ క్రమంలో విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారగా.. నవాజ్ వైడ్ వేయడంతో.. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. అయితే, ఈ ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. నిజానికి ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లగానే. కోహ్లి, దినేశ్ కార్తిక్ 3 ‘బై’ పరుగులు తీశారు. కానీ, చాలా మంది ఈ మూడు పరుగులు ఎలా ఇస్తారు? అంటూ డెడ్‌బాల్ అంశంపై చర్చ లేవనెత్తారు. ఇలా చేస్తే సరి! ఈ విషయంపై మార్క్ టేలర్ తన స్పందన తెలియజేశాడు. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో అతడు మాట్లాడుతూ.. ఇలాంటి సందర్భాల్లో బ్యాటింగ్ జట్టుకు లాభం చేకూరేలా నిర్ణయం ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. ‘‘నిజానికి ఒకవేళ బంతి స్టంప్స్‌ను తాకినా అవుట్ కాకుండా ఉండటమే అనైతికంగా లాభం పొందడం లాంటిది. ఆదివారం రాత్రి విచిత్ర పరిస్థితిని మనం చూశాం. బంతి ఎక్కడున్నా సరే.. ఒకవేళ ఫీల్డింగ్ జట్టు బ్యాటర్‌ను రనౌట్ చేయాలనుకుంటే అప్పటికే బెయిల్స్ కిందపడిపోయి ఉంటాయి. అలాంటప్పుడు స్టంప్‌ను రిమూవ్ చేయాలి. అలా చేయడం కష్టమన్న విషయం తెలిసిందే. నా అభిప్రాయం ప్రకారం.. ఫ్రీ హిట్ బంతికి ఒకవేళ బ్యాటర్ బౌల్డ్ అయినా క్యాచవుట్ అయినా.. ఎప్పటిలాగే అతడిని నాటౌట్‌గానే ప్రకటించాలి. అయితే, ఆ బాల్‌ను మాత్రం డెడ్‌బాల్‌గా పరిగణించాలి. ఆదివారం నాటి సందర్భాల్లో ఇలా చేయడం న్యాయమైనది. హేతుబద్ధంగా కూడా ఉంటుంది. ఫ్రీ హిట్‌కు బ్యాటర్ అవుట్ కాకుండా ఉంటాడు.. అదే సమయంలో రెండోసారి అతడికి ఫేవర్‌గా అంపైర్ నిర్ణయం తీసుకోలేడు’’ అంటూ క్రికెట్ చట్టాల్లోని రూల్స్ మార్చాలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వరుసగా రెండోసారి ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్‌లో శుభారంభం చేసింది. తదుపరి గురువారం(అక్టోబరు 27) సిడ్నీలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 56 పరుగులతో చిత్తు చేసి రెండో విజయం నమోదు చేసింది. చదవండి: నన్ను GOAT అని పిలవకండి.. ఆ ఇద్దరే అందుకు అర్హులు: విరాట్ కోహ్లి Ind Vs Ned: పాక్‌తో అయినా.. పసికూనతో అయినా నీ ఆట తీరు మారదా? అదేం కాదు! -
‘బాక్సింగ్ డే’ టెస్టుకు ప్రేక్షకుల్లేకుంటే ఎలా?
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లోనే మేటి జట్లయిన భారత్, ఆస్ట్రేలియాలు తలపడితే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులుండాలని... వాళ్లు లేకపోతే అది గొప్ప సిరీస్ అనిపించుకోదని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ వ్యాఖ్యానించారు. ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టును (డిసెంబర్ 26–30) పూర్తిస్థాయి సామర్థ్యమున్న స్టేడియంలో నిర్వహిస్తేనే మజా ఉంటుందని... ప్రేక్షకులు లేకుండా నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ టెస్టు వేదికను మెల్బోర్న్ నుంచి మార్చే అవకాశాలున్నాయి. మెల్బోర్న్ మైదానం ఉన్న విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో బాక్సింగ్ డే టెస్టు వేదిక మార్పు తప్పేలా లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై టేలర్ మాట్లాడుతూ ‘క్రిస్మస్లాంటి సమయంలో ఇతరత్రా కారణాలతో స్టేడియంలో పది లేదా ఇరవై వేల ప్రేక్షకులతో మ్యాచ్ నిర్వహించాల్సి వస్తే అది గొప్ప సిరీస్ కానేకాదు. కరోనా అంతగా లేని పెర్త్, అడిలైడ్ ఓవల్ వేదికల్లో నిర్వహిస్తే చాలా మంది ప్రేక్షకులతో ఆట రంజుగా సాగుతుంది. పెర్త్, అడిలైడ్ మైదానాల్లో 55 వేలకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంది. అడిలైడ్‌లో అయితే భారతీయులు ఎగబడతారు. ప్రపంచకప్ (2015)లో భాగంగా భారత్, పాక్‌ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్ కోసం టికెట్లన్నీ 52 నిమిషాల్లోనే అమ్ముడైన సంగతి గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. -
మాటలు రావట్లేదు: క్లార్క్
సిడ్నీ: ఆసీస్ ప్రపంచకప్ విజయ సారథి మైకేల్ క్లార్క్ ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇది మన భారత్‌లో పద్మ పురస్కారాల్లాగే ఆస్ట్రేలియాలో ఇచ్చే అవార్డు. క్రికెట్‌కు అందించిన విశేష సేవలకుగాను క్లార్క్‌కు ఈ పురస్కారం దక్కింది. ఆసీస్‌లో ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనేది ఆ దేశ మూడో అత్యున్నత పురస్కారం. గతంలో దిగ్గజ క్రికెటర్లయిన అలెన్ బోర్డర్, బాబ్ సింప్సన్, స్టీవ్ వా, మార్క్ టేలర్, రికీ పాంటింగ్‌లకు ఈ అవార్డు లభించింది. క్లార్క్ 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలిపాడు. తాజాగా లభించిన హోదాపై క్లార్క్ మాట్లాడుతూ ‘నిజాయితీగా చెబుతున్నా... ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నమ్మలేకున్నా. దీన్నెలా వర్ణించాలో మాటలు రావట్లేదు. ఈ అవార్డుతో ఆసీస్ దిగ్గజాలు, నేనెంతో అభిమానించే హీరోల సరసన నిలవడం చాలా సంతోషంగా ఉంది. అంతే గర్వంగా ఉంది. క్రికెట్ వల్లే ఇది సాకారమైంది’ అని అన్నాడు. టి20 ప్రపంచకప్‌పై అనుమానాలున్నప్పటికీ ఈ మెగా టోర్నీతోనే మళ్లీ తమ దేశంలో క్రికెట్ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 39 ఏళ్ల క్లార్క్ తన కెరీర్లో 115 టెస్టులాడి 8643 పరుగులు చేశాడు. 245 వన్డేల్లో 7981 పరుగులు, 34 టి20ల్లో 488 పరుగులు చేశాడు. -
టి20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకోండి
మెల్బోర్న్: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరిగే అవకాశాలు కనిపించడంలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఈనెల 28న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు మీటింగ్‌లో టి20 ప్రపంచకప్ నిర్వహణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టేలర్ కోరాడు. ‘ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ తదుపరి ప్రణాళిక చేసుకుంటారు. ఒకవేళ ప్రపంచకప్ వాయిదా పడితే అవే తేదీల్లో ఐపీఎల్ జరిగే అవకాశముంది. ఐపీఎల్లో ఆడేందుకు ఆసీస్ బోర్డు తమ దేశ క్రికెటర్లకు అనుమతి ఇస్తుందనడంలో సందేహం లేదు. బీసీసీఐని సంతోషంగా ఉంచేందుకు ఆస్ట్రేలియా బోర్డు ప్రయత్నిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన యధావిధిగా కొనసాగితే ఆసీస్ బోర్డుకు ఎంతో లాభం చేకూరుతుంది’ అని టేలర్ అన్నాడు. -
వరల్డ్ కప్ వాయిదా పడితే...
మెల్బోర్న్: కరోనా కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ఐసీసీ టోర్నీ స్థానంలో భారత్‌లో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమవుతుందని ఆయన అన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టి20 వరల్డ్‌కప్‌పై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఐపీఎల్ జరిగితే భారత్‌కు వెళ్లే బాధ్యత సదరు క్రికెటర్‌పైనే ఉంటుందని అన్నాడు. ‘నాకు తెలిసి వరల్డ్‌కప్ టోర్నీ కోసం 15 జట్లు ఆసీస్ రావడం ప్రస్తుత తరుణంలో చాలా కష్టం. ఇంకా 14 రోజులు ఐసోలేషన్ నిబంధన ఈ టోర్నీ నిర్వహణకు మరింత ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి టోర్నీని వాయిదా వేయాలని ఐసీసీ భావిస్తే... ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐకి అవకాశాలు మెరుగవుతాయి. జట్టంతా ఒక దేశం వెళ్లడం కంటే.. ఒక ఆటగాడు లీగ్ కోసం భారత్‌కు వెళ్లడం సులభంగా ఉంటుంది’ అని 55 ఏళ్ల టేలర్ వివరించారు. -
కోహ్లి కక్ష పెంచుకోవడం సరికాదు!
మెల్బోర్న్: వివాదాలతో, విద్వేషాలతో ఉత్కంఠభరితంగా ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లను ఇక ఎంతమాత్రం స్నేహితులుగా పరిగణించబోనంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ దిగ్గజాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడలో జయాపజయాలతోపాటు అన్ని భాగమేనని, కాబట్టి ఈ విషయంలో అతడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. ధర్మశాల టెస్టులో విజయంతో బోర్డర్-గవస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం కోహ్లి మాట్లాడుతూ ఇక ఆసీస్ ఆటగాళ్లతో తాను ఏమాత్రం స్నేహాన్ని కొనసాగించబోనని, వారు తన స్నేహితులు కాదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం మార్క్ టేలర్ తీవ్రంగా తప్పుబట్టారు. కోహ్లి మరింతగా ఎదగాల్సిన అవసరముందని సూచించాడు. ’ఈ రోజుల్లో క్రికెటర్లు కొన్నిసార్లు కలిసి ఆడుతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. ఇలాంటి సమయంలో కక్షలు పెంచుకోవడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవిషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని టేలర్ సూచించాడు. ఆటలో పరిణామాలు, జయాపజయాలు ఎలా ఉన్నా క్రీడాస్ఫూర్తి వ్యవహరించడం ముఖ్యమని వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ కోసం రాసిన తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్, మాజీ ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ లాయిడ్ సైతం కోహ్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. అతని వ్యాఖ్యల్లో విజ్ఞత కనిపించడం లేదని పేర్కొన్నారు. ’ఈ గొప్ప క్రీడలో గెలుపోటములే కాదు.. ఆటలో స్నేహంగా మసులుకోవడం, స్నేహితులను చేసుకోవడం కూడా భాగమే’ అని జోన్స్ పేర్కొన్నారు. మైదానంలో ఎలా వ్యవహరించాలనే దానిపై లెజండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ నుంచి కోహ్లి పాఠాలు నేర్చుకోవాలని లాయిడ్ సూచించాడు. -
ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం
-
ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. బుధవారం నాంపల్లి కోర్టులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇస్తున్నారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్‌కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ముడుపులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. మార్క్ టేలర్ ఇంట్లోనే రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను కలిశారు.