
మెల్‌బోర్న్: కరోనా కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ఐసీసీ టోర్నీ స్థానంలో భారత్‌లో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమవుతుందని ఆయన అన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టి20 వరల్డ్‌కప్‌పై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఐపీఎల్ జరిగితే భారత్‌కు వెళ్లే బాధ్యత సదరు క్రికెటర్‌పైనే ఉంటుందని అన్నాడు.
‘నాకు తెలిసి వరల్డ్‌కప్ టోర్నీ కోసం 15 జట్లు ఆసీస్ రావడం ప్రస్తుత తరుణంలో చాలా కష్టం. ఇంకా 14 రోజులు ఐసోలేషన్ నిబంధన ఈ టోర్నీ నిర్వహణకు మరింత ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి టోర్నీని వాయిదా వేయాలని ఐసీసీ భావిస్తే... ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐకి అవకాశాలు మెరుగవుతాయి. జట్టంతా ఒక దేశం వెళ్లడం కంటే.. ఒక ఆటగాడు లీగ్ కోసం భారత్‌కు వెళ్లడం సులభంగా ఉంటుంది’ అని 55 ఏళ్ల టేలర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment