Stephenson
-
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌రెడ్డి, స్టీఫెన్‌పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి రావడంతో వారు రాజీనామా చేశారు.నిన్న వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా వీసీని భయబ్రాంతులకు గురిచేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్ గోపాల్ వ్యవహరించారుగతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.కాగా, తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. -
ఓటుకు నోటు కేసు: ఆ స్వరం చంద్రబాబుదే..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే మన వాళ్లు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్ ఫోన్లో చంద్రబాబుతో మాట్లాడించారని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ‘‘మన వాళ్లు అంతా బ్రీఫ్ మీ’’వాళ్లు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అంటూ.. చంద్రబాబు తనను ప్రలోభపెట్టారని వివరించారు. ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా సోమవారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు నమోదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోను కోర్టులో ప్లే చేయగా విని స్టీఫెన్సన్ ధ్రువీకరించారు. అలాగే రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రికార్డు చేసిన వీడియో, ఆడియో దృశ్యాలను కూడా చూసి ధ్రువీకరించారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలు ఉన్నారంటూ వారిని కోర్టు హాల్లో (ఐడెంటిఫికేషన్ సందర్భంగా) గుర్తించారు. మా ఇంట్లోనే కలిశారు.. ‘‘స్టీఫెన్సన్ను ఆయన ఇంట్లో కలవడానికి టీడీపీ నేతలు సిద్ధపడకపోవడంతో మా ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. ఆ రోజు డబ్బు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి తదితరులు మా ఇంటికి వచ్చారు. రేవంత్‌రెడ్డి సూచన మేరకు రూ.50 లక్షలు బ్యాగ్ నుంచి తీసి రుద్ర ఉదయ సింహ టేబుల్ మీద పెట్టారు. ఓటింగ్ తర్వాత రూ.4.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డయింది. డబ్బు ఇచ్చేందుకు వచ్చింది రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ ఓటుకు కోట్లు కుట్రను కళ్లకు కట్టినట్లు వివరించారు. లంచం ఇస్తున్న సమయంలో ప్రత్యక్షంగా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ కుమార్తెను హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. -
చంద్రబాబే నాతో మాట్లాడారు.. ప్రత్యేక కోర్టులో స్టీఫేన్
హైదరాబాద్: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ తనను ప్రలోభ పెట్టాడని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఫోన్లో నేరుగా తనతో మాట్లాడారని, ‘మనవాళ్లు అంతా బ్రీఫ్ చేశారు, వాళ్లు చెప్పినట్లు చేయాలి’ అని కోరారని.... తానున్నానని, వాళ్లు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని వివరించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్ గురువారం ప్రత్యేక కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్‌గా పరిచయం చేసుకున్న సెబాస్టియన్...చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడించారని తెలిపారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెబితే చంద్రబాబునాయుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సెబాస్టియన్ చెప్పినట్లు వివరించారు. రేవంత్‌రెడ్డి వస్తారని సెబాస్టియన్ చెప్పారు.. ‘‘2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసే విషయంలో చంద్రబాబునాయుడు నేరుగా మాట్లాడాలను కుంటున్నారని ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా హ్యారీ సెబాస్టియన్ నన్ను సంప్రదించారు. చంద్ర బాబునాయుడు ప్రతినిధిగా పార్టీలో కీలకమైన వ్యక్తి వస్తేనే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. దీంతో చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్‌రెడ్డి మాట్లాడడానికి వస్తారని చెప్పారు’’ అని స్టీఫెన్సన్ వివరించారు. లంచం తీసుకోవడం ఇష్టం లేదని, దీంతో వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించానని తెలిపారు. రూ.50 లక్షలు అడ్వాన్స్ అని చెప్పారు.. ‘‘ఏసీబీ అధికారులు మేము ఉన్న ఫ్లాట్‌లో ఐఫోన్‌ను, ఇతర ఆడియో, వీడియో పరికరాలను ఏర్పాటు చేశారు. 2015 మే 30న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలు నేను ఉన్న ఫ్లాట్‌కు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తాం. అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తున్నాం. మిగిలిన డబ్బు ఓటింగ్ తర్వాత ఇస్తాం అని చెప్పారు. ఇందులో భాగంగా రూ.2.5 లక్షలుగా ఉన్న 500 రూపాయల బండిళ్లు 20 టీపాయ్ మీద పెట్టారు. వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రేవంత్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు’’ అని స్టీఫెన్సన్ వివరించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలాన్ని పాక్షికంగా నమోదు చేసిన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు....తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై అభ్యంతరం.. ఇదిలా ఉండగా ఇదే కేసులో మరికొందరు సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయ్యే వరకూ స్టీఫెన్సన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను ఆపాలంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. ఉదయసింహ అప్పీల్ కొట్టివేత.. మరోవైపు ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ తాను దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ప్రత్యేక కోర్టు డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసిందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. -
ఓటుకు కోట్లు... ఆశ చూపింది సెబాస్టియనే..!
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇస్తామని ప్రలోభపెట్టింది ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న బిషప్ హ్యారీ సెబాస్టియన్ అని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ కుట్రలో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై గురువారం ఏసీబీ అదనపు ఎస్పీ రమణకుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయి. సెబాస్టియన్ ఫోన్లో కుట్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ఓటు కోసం ప్రలోభపెట్టడం అవినీతి నిరోధక చట్టం కింద నేరం. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారన్న సెబాస్టియన్ వాదనలో నిజం లేదు. స్టీఫెన్‌సన్‌తో ముందుగా ఫోన్లో మాట్లాడిందని సెబాస్టియన్. అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డితో కలసి సెబాస్టియన్ స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసిన తర్వాత సెబాస్టియన్ సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా అనేక ఆధారాలు లభించాయి’’ అని తెలిపారు. ( ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ) అంతేకాక ‘‘అభియోగాల నమోదుపై 2018 మార్చి 5 నుంచి దాదాపు రెండున్నర ఏళ్లుగా నిందితులు సమయం తీసుకుంటూనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 9న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అభియోగాలు నమోదు చేయాలని మరోసారి ప్రత్యేక కోర్టును కోరారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు గత అక్టోబరు 12న డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని లేదా నేరుగా వాదనలు వినిపించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే సెబాస్టియన్ తరఫు న్యాయవాది పలు వాయిదాలు తీసుకున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని కౌంటర్లో కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. -
ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ స్పెషల్ పీపీ సురేందర్‌రావు ప్రత్యేక కోర్టుకు నివేదించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టిన కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు మంగళవారం విచారించారు. కుట్రలో నిందితుల పాత్ర ఉందనేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. (తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు) రేవంత్‌రెడ్డితో కలసి వీరంతా ఈ కుట్రలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. మరో నిందితుడు ఉదయసింహ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి నుంచి రూ.50 లక్షల నగదు తెచ్చారని వివరించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన డబ్బు తెచ్చారని, స్టీఫెన్సన్ ఇంటికి తెచ్చి ఇచ్చింది కూడా ఉదయసింహనే అని పేర్కొన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలంటూ అన్ని ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేశామని, ఈ నేపథ్యంలో వారి పిటిషన్లు కొట్టివేసి నిందితులపై అభియోగాలను నమోదు చేయాలని సురేందర్‌రావు నివేదించగా, ఈ కేసులో నిందితుల తరఫున వాదనలు వినేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
మహానాడు వేదికగా.. ఓటుకు కోట్లు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బు తో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. తనను ఈ కేసులో అక్రమంగా ఇరి కించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై ఏసీబీ ఇటీవల కౌంట ర్ దాఖలు చేసింది. సండ్ర వాదనను ఏసీబీ తోసిపుచ్చింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా ఈ కుట్రలో భాగస్వామిగా మారారని పేర్కొంది. శంషాబాద్ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని తెలిపింది. అలాగే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్‌లోనూ సండ్ర ప్రమే యం స్పష్టంగా ఉన్నాయంది. సండ్ర పాత్రపై ఆధారాలున్న నేపథ్యంలోనే.. 2015, జూలై 6న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, తర్వాత అన్ని ఆధారాలతో 2017, ఫిబ్రవరి 18న అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశామని వివరించింది. ఎఫ్ఐఆర్, దర్యాప్తు తర్వాత దాఖలు చేసిన చార్జి షీట్లో ఆయన్ను చేర్చలేదని, తర్వాత లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా సండ్ర పాత్రపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది. డబ్బు తెచ్చింది ఉదయసింహనే... రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్.. సీఫ్టెన్సన్ను ప్రలోభపెట్టారని ఏసీబీ వివరించింది. స్టీఫెన్సన్కు అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చేం దుకు టీడీపీ ఎమ్మెల్యేలు బస చేసిన శంషాబాద్ నోవాటెల్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి బయలు దేరారని తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015, మే 31న మధ్యాహ్నం 4.40 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారు (మహీంద్రా స్కార్పియో–ఏపీ 09 సీవీ 9939) లో వచ్చారని వెల్లడించింది. వారు వచ్చిన కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారు (టీఎస్10యుఏ 1031)లో రూ.50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది. తెచ్చిన డబ్బును సంచిలో నుంచి తీసి టీపాయ్‌పై పెట్టింది కూడా ఉదయసింహనే అని తెలిపింది. ఈ సమయంలో వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని మరోసారి రేవంత్‌రెడ్డి.. స్టీఫెన్సన్ను కోరారని, మిగిలిన రూ.4. 5 కోట్లను ఓటింగ్ తర్వాత ఇస్తామని వాగ్ధానం చేశారని పేర్కొంది. ‘డబ్బు ఎక్కడి నుంచి తేవా లని చెప్పేందుకు నాగోలు చౌరస్తాకు రమ్మని ఉదయసింహకు రేవంత్‌రెడ్డి సూచించారు. మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి వేం కృష్ణకీర్తన్ రెడ్డి నుంచి సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రూ.50 లక్షలను తీసుకురావాలని రేవంత్‌రెడ్డి.. ఉదయసింహకు చెప్పారు. ఈ కేసులో ఉదయసింహ పాత్ర ను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నా యి. ఓటుకు కోట్లు కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలి’అని ఏసీబీ నివేదించింది. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణలో భాగం గా శుక్రవారం రేవంత్‌రెడ్డి, సండ్ర తదితరులు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా న్యాయమూర్తి అనుమతించారు. తదుపరి విచా రణను ఈనెల 27కి వాయిదా వేశారు. -
ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తీరుపై నిరసన
రాంగోపాల్‌పేట్: క్రైస్తవ మతానికి, మత పెద్దలకు వ్యతిరేకంగా శాసనసభలో మాట్లాడిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీస్ స్టీఫెన్సన్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ క్యాథలిక్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరును ఖండిస్తూ ఆదివారం ఎస్డీరోడ్‌లోని సెయింట్ మేరీస్ చర్చి ఆవరణలో స్టీఫెన్సన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు గోపు బాలరెడ్డి మాట్లాడుతూ.. ఆంగ్లో ఇండియన్లకు ప్రతినిధి అయిన స్టీఫెన్సన్ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఇండిపెండెంట్ పాస్టర్లను కట్టడి చేయాలని శాసనసభలో మాట్లాడి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. క్యాథలిక్ విద్యా సంస్థల్లో క్రైస్తవ మైనార్టీ విద్యార్థులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వడంతో పాటు అర్హులందరికీ ఫీజులో రాయితీలు కల్పిస్తున్నామన్నారు. పోప్లు, బిషప్‌లు కేవలం ఆధ్యాత్మిక బోధకులే కాదని క్యాథలిక్ సమాజానికి వాళ్లు సామాజిక నాయకులని అలాంటి వారిని ప్రశ్నించే హక్కు, అర్హత ఆయనకు లేదన్నారు. అసోసియేషన్ ప్రతినిధి ఆరోగ్యరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ ప్రతినిధి మోరిన్ హ్యాచ్ మాట్లాడుతూ.. తాను క్యాథలిక్ కాకపోయినప్పటికీ స్టీఫెన్ మాటలు క్రైస్తవ సమాజానికి మంచిది కాదనే భావనతో వీరికి మద్దతు ఇస్తున్నామన్నారు. నిరసనలో రాయ్‌డిన్ రోచ్, ఎల్ఎం రెడ్డి, సాంద్రా, శశిధర్, ఇంగ్రిడ్ పాయ్ ఖురానా పాల్గొన్నారు. స్టీఫెన్సన్ చెప్పినవి వాస్తవాలు: మత్తయ్య క్రైస్తవ సమాజంలో శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాస్తవాలు మాట్లాడారని క్రైస్తవ ధర్మప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవ మైనార్టీ విద్యా సంస్థలు మాఫియా లాగా తయారయ్యాయన్న వాస్తవాన్ని ఎమ్మెల్యే సభ ముందుకు తేవడంతో దీన్ని జీర్ణించుకోలేక కొందరు హంగామా చేస్తున్నారని విమర్శించారు. క్రైస్తవ మైనార్టీ విద్యా సంస్థల్లో ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం లేదని, ఎంతో మంది క్రైస్తవ పిల్లలను ఫీజులు కట్టకుంటే బయటకు గెంటేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. దమ్ముంటే ఎంతమంది విద్యార్థులకు ఏయే సంవత్సరాల్లో సీట్లు, రాయితీలు ఇచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఓటుకు కోట్లు : ఏది జరిగినా మీరే బాధ్యులు..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో గురువారం మరో వీడియో బయటపడింది. స్పై కెమెరాలకు సమాంతరంగా ఏసీబీ ఏర్పాటు చేసిన ఫోన్ కెమెరాలో తాజా వీడియో రికార్డయింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే, ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లకు బేరం కుదిరినట్టు ఈ వీడియో లో స్పష్టమైంది. టీడీపీ నేత సెబాస్టియన్, స్టీఫెన్‌సన్‌తో.. ‘తొలుత బాబు గారు 3.5 కోట్లు ఇవ్వడానికే ఒప్పుకున్నారు. నా ఒత్తిడి మేరకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సరేనన్నారు’ అని మాట్లాడారు. అదే సమయంలో.. రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత స్టీఫెన్సన్కు ముట్టజెప్పే సొమ్ములో తన కొచ్చే కమీషన్ గురించి కూడా సెబాస్టియన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. (సార్ ఎవరు? ) ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నట్టు వారి మధ్య జరిగిన సంభాషణ ద్వారా వెల్లడైంది. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, ఈ డీల్ సమయంలో స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెండ్ డెరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినది ఎవరేనేది కూడా విచారణలో తేలనుంది. గత నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజా వీడియోతో విచారణ వేగం కావొచ్చని పలువురు భావిస్తున్నారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) కాగా,‘ఓటుకు కోట్లు’ కేసులో ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) తాజా వీడియో ఆధారంగా సంభాషణ.. స్టీఫెన్సన్ : లెటస్ గో టు ది డీల్.. సెబాస్టియన్ : నిజానికి బాబు ముందు 3.5 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పారు. నా ఒత్తిడి మేరకు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు నమ్ముతున్నారు. బాబు నన్ను నమ్ముతున్నారు. మీరు రేవంత్ రెడ్డిని నమ్మడంతో ఆయన తెరమీదకు వచ్చారు. ఏది జరిగినా మీరే బాధ్యులు.. ఓకే సార్. సంబధిత వార్తలు.. దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఇంగ్లిష్ డెయిలీ డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో.. తార్నాకలోని మాల్కం టేలర్ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్, టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్ స్టీఫెన్‌సన్‌తో బేరం మాట్లాడినట్టు ఈ వీడియో ద్వారా తెలిసింది. (సార్ ఎవరు?) అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.5 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్ ఓకే అయిందని సెబాస్టియన్ స్టీఫెన్ సన్తో చెప్పిన విషయం వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్, ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజాగా బయటపడిన వీడియో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..! (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) సంబధిత వార్తలు : దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడిగా స్టీఫెన్సన్ నియామాకం
-
నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్)గా ఎల్విస్ స్టీఫెన్సన్ను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం జరిగింది. సాధారణంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకం జరిగేది. అయితే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటే నామినేటెడ్ సభ్యుడు సైతం ప్రమాణం చేసేలా మంత్రివర్గం నిర్ణయించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే తన విలువైన పదవీకాలం కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణలో మతసామరస్య సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ట్లుగానే.. అసెంబ్లీ వ్యవహరాల్లోనూ ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్‌గా ముస్లిం వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఎల్విస్ స్టీఫెన్సన్ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ప్రతిపాదనలు పంపగా.. వీటికి గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ కూడా దీనికి ఆమోదిస్తూ.. స్టీఫెన్సన్ నియామకాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీఫెన్సన్ తెలంగాణ శాసనసభకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులవడం ఇది రెండోసారి. తెలంగాణ తొలిశాసనసభలోనూ ఈయన నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2018 డిసెంబర్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర మంత్రి వర్గం అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. ఎమ్మెల్యేలకు రాజ్యాంగం ప్రతులు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగ ప్రతులను, అసెంబ్లీ నిబంధనల పుస్తకాలను, బుక్లెట్లను, ఇతర సమాచారాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో వీటిని అందివ్వనుంది. దీనికి సబంధించిన ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. జనవరి 17న ఉదయం 11.30 గంటలకు శాసనసభ తొలి సమావేశం.. 19న ఉదయం 11.30 గంటలకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 19న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. -
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా మళ్లీ ఆయనే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసింది. నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు గవర్నర్ నరసింహన్‌కు ఆమోదం తెలిపారు. అనంతరం ఆ ప్రతిని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి పంపారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ నియామానికి ఆమోదం తెలుపుతూ సీఈఓ రజత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం తెలంగాణ తొలి మంత్రివర్గ సమావేశం జరగింది. సమావేశంలో హోంమంత్రి మహ్మద్ అలీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ శాసనసభ స్థానాలు 120. ఇందులో 119 మంది ఎన్నికల ద్వారా వస్తారు. మిగిలిన స్థానంలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నియమిస్తారు. గత ప్రభుత్వంలో కూడా స్టీఫెన్సన్ ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడిగా నియమించబడ్డారు. ఆ సమయంలో ‘ఓటుకు నోటు’ ఉదంతం జరిగింది. -
ఆ డబ్బు ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయ్కార్ భవన్లో విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదును ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంత మొత్తాన్ని ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఆ డబ్బును సంబంధిత వ్యక్తి ఆదాయపు పన్ను కింద చూపించారా లేదా అన్న అంశాల్లో క్లారిటీ ఇవ్వాలని రేవంత్‌ను అడిగినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు రాసిన లేఖపైనే తాము విచారణ జరుపుతున్నామని, రూ.50 లక్షలతో పాటు మిగతా రూ.4.5 కోట్ల సంగతి కూడా చెప్పాలని పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే డొల్ల కంపెనీలకు సంబంధించిన అంశాలపై రేవంత్ వివరణ ఇచ్చినట్లు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. తనకెలాంటి కంపెనీలు లేవని, తాను దాఖలు చేసిన అఫిడవిట్‌తో పాటు ఐటీ రిటర్నులపై ఆడిటర్‌తో కలసి ఐటీ అధికారులకు రేవంత్ వివరించారని సమాచారం. మీ ఖాతాలోవేనా..? స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్‌తో పాటు ఉదయ్‌సింహాను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏసీబీ నుంచి ఒక డీఎస్పీ, మరో ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బు మీ ఖాతా నుంచి డబ్బు డ్రా చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరినట్లు తెలిసింది. ఒకవేళ ఉదయ్‌సింహా ద్వారానే వస్తే ఆ డబ్బు ఎవరిచ్చారో చెప్పాలని అతన్ని ప్రశ్నించినట్లు ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని రేవంత్, ఉదయ్‌సింహా కోరినట్లు తెలిసింది. దీంతో ఓటుకు కోట్లు విచారణ ఆపి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు భోజన విరామం ఇచ్చారు. 2.15 గంటల తర్వాత తన పాత ఇంట్లో ఉన్న కంపెనీలకు రేవంత్‌కు సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తన పేరిట ఎలాంటి కంపెనీలు లేవని, అవసరమైతే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని రేవంత్ దీటుగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సాయంత్రం 4.50 గంటల వరకు రేవంత్, ఉదయ్‌సింహాను విచారించిన అధికారులు మళ్లీ ఈ నెల 23న విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో 5.00 గంటల సమయంలో వారు ఆయకార్ భవన్ నుంచి బయటకు వచ్చారు. అధికారుల ముసుగులో కేసీఆర్ సైన్యం: రేవంత్‌రెడ్డి విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను విచారిస్తున్న అధికారులతో పాటు అధికారుల ముసుగులో కేసీఆర్ ప్రైవేట్ సైన్యం కూడా ఉందని ఆరోపించారు. ఐటీ అధికారుల పేరు చెప్పి డీఐజీ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తమ ఇంట్లో అర్ధరాత్రి దాడులు చేసి భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. తనను వేధించేందుకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు విభాగాలను ఉపయోగించుకుంటున్నారని, తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తేలేదని.. న్యాయబద్ధంగా, రాజకీయంగా వీటన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంట్లో సోదాలు చేసిన సమయంలో, ఇప్పుడు విచారణలో అధికారులకు అన్ని వివరాలు డాక్యుమెంట్లతో సహా సమాధానమిచ్చానన్నారు. తమతో పరిచయం లేని రణధీర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులమని చెప్పి అర్ధరాత్రి దాడులు చేసి వేధించిన విషయంపై ఆదాయపు పన్ను కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై నగర కమిషనర్‌తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తానని, ఇలాంటి వేధింపులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. ఐటీ అధికారులు లేవనెత్తిన మరిన్ని అంశాలపై వివరణ ఇచ్చేందుకు 23న రావాలన్నారని, తాను విచారణకు హాజరవుతానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రతీక్షణం ఏపీ ఇంటెలిజెన్స్ అప్డేట్... ఐటీ అధికారులు రేవంత్‌రెడ్డిని విచారిస్తున్న ఆయ్కార్ భవన్ వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తచ్చాడారు. 8 మందితో కూడిన అధికార బృందం రేవంత్ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు అప్డేట్ చేశారు. విచారణలో వెల్లడిస్తున్న అంశాలపై కూడా ఆరా తీసి సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఏపీ సీఎం చంద్రబాబుకు పంపించేలా బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఐటీ సోదాల దెబ్బతో ఏపీలోని పలువురు నేతలు, మంత్రులు వణికిపోతున్న సంగతి తెలిసిందే. -
గుట్టు తేలితే బాబుపైనే నజర్!
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ ఎదుర్కోబోతున్నారా? వారం రోజులుగా ఆదాయపుపన్ను శాఖ నిర్వహిస్తున్న సోదాలు, సేకరిస్తున్న ఆధారాలనుబట్టి చూస్తే అందరిలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 5 కోట్లు ఇవ్వజూపి రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వడం, స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతూ ఇచ్చిన హామీల ఫోన్ సంభాషణ చంద్రబాబుదే అని తేలడంతో ఆదాయపన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేశాయి. స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడివనే దానిపై ఐటీశాఖ ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించింది. బుధవారం జరగనున్న విచారణ లో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్ట వచ్చ నే ఆలోచనతో ఐటీశాఖ ఉంది. ఆ డబ్బు సంగతి తెలియదని నిందితులు చెబితే ఈడీ కేసు నమోదు చేసే అవకాశముంది. అదే జరిగితే కేసులోని ప్రతి ఒక్కరికీ ఈడీ సమన్లు జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. మేమే లేఖ రాశాం... ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ రూ. 50 లక్షల సంగతి తేల్చాలని తామే లేఖ రాసినట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ప్రతినిధితో చెప్పారు. 2015 లో ఒకసారి, మూడు నెలల క్రితం మరోసారి ఐటీ శాఖకు లేఖ రాసినట్లు సంబంధిత అధికారి ధ్రువీకరించారు. అయితే ఆ సొమ్ము గుట్టు వీడితే కుట్రకు బీజం వేసిన వారిని విచారించడం మరింత సులభమవుతుందని, ఆ పాత్రధారి ఎవరో తేలితే కేసులో బలమైన ఆధారం లభించినట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురి నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసిన తాము ఐటీశాఖ ఇచ్చే నివేది క ఆధారంగా అసలు నిందితులను చేర్చి తుది చార్జి షీట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక్కొక్కటిగా లింకులు ఛేదిస్తూ... స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తెచ్చిన రూ. 50 లక్షల లింకును ఒక్కొక్కటిగా తేలుస్తూ ఐటీశాఖ కీలక అడుగులు వేస్తోంది. ఉదయసింహ, కొండల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పద్మనాభరెడ్డి ఇళ్లలో ఏకధాటిగా చేసిన సోదాల్లో ఈ సొమ్ముకు సంబంధించిన ఆధారాలను పట్టుకునే పనిలో పడింది. అయితే వారి ఖాతాల నుంచి లేదా వారి సంబంధీకుల నుంచి రూ. 50 లక్షలు వెళ్లి ఉంటాయా అనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఫోన్లు, హార్డ్‌డిస్క్‌ల నుంచి సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించగా వారు డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు. ఎవరు ఇమ్మంటే నిందితులు డబ్బిచ్చారు.. ఆ డబ్బు ఏ నేతకు సంబంధించినది అనే ప్రశ్నలకు డేటా రికవరీ ద్వారా సమాధానం లభించవచ్చని భావిస్తున్నారు. రణధీర్‌ను విచారించిన టాస్క్‌ఫోర్స్ ఓటుకు కోట్లు కేసులో ప్రశ్నించేందుకు రేవంత్‌రెడ్డి అనుచరుడైన ఉదయసింహ స్నేహితుడు రణధీర్‌రెడ్డిని ఆదివారంరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నాగోల్ సమీపంలోని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. గతంలో ఉదయసింహ ఇల్లు ఖాళీ చేసిన సమయంలో తనకు ఒక కవర్ ఇచ్చాడని, అందులో హార్డ్‌డిస్క్, ఉదయసింహ తల్లికి చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు ఉన్నాయని రణధీర్ చెప్పారు. నేడు విచారణకు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నివాసంలో నాలుగు రోజుల కిందట సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఆయన్ను బుధవారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేశారు. దీంతో రేవంత్ బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవన్‌కు వెళ్లనున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు ఓటుకు కోట్లు కేసులో నిందితులైన ఉదయసింహ, సెబాస్టియన్లను కూడా విచారించనున్నారు. రేవంత్ మామ ఎస్. పద్మనాభరెడ్డి, సోదరుడు కొండల్‌రెడ్డిని కూడా మళ్లీ విచారించనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. వణికిపోతున్న ఏపీ పెద్దలు.. ఐటీ సోదాలు, విచారణను గమనిస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఎప్పుడు ఐటీ అధికారులు తమ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తారో నని ముందుగానే అన్నీ సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో వ్యాపారాలున్న ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి కార్యాలయాలు, ఇళ్లలో కీలక పత్రాలను ఏపీకి తరలించి ఉంటారని తెలుస్తోంది. ఏపీలో అయితే స్థానిక అధికారులు సోదాలకు రాకపోవచ్చని, అక్కడి ఇంటెలిజెన్స్ అధికారులు సైతం టీడీపీ పెద్దలకు సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది. కొందరు నేతలు ఐటీ రిటర్నుల దాఖలుపై చార్టెడ్ అకౌంట్లతో జరిమానాలతో సహా చెల్లిస్తున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. మరికొందరు తాము దాఖలు చేసిన ఐటీకి... వ్యాపారాలకు లెక్కల్లో తేడా ఉందా అనే అంశాలనూ సరిచూసుకుంటున్నట్లు తెలిసింది. -
ఓటుకు కోట్లు కేసు.. ఏపీ ప్రముఖులకు టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి వస్తుందా? నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎవరు సమకూర్చారన్న వివరాలు బయటకు వస్తాయా? హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కార్పొరేషన్ బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసినట్లు చెబుతున్న ఆ సొమ్మును నగరానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఏ రాజ్యసభ సభ్యుడికి(ఏపీ) అప్పగించారు? ఎమ్మెల్యే బ్యాంకు నుంచి తెచ్చిన ఆ ఖాతా ఎవరిది? ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు బయటకు వస్తాయా? గత రెండు రోజులుగా ఈడీ అధికారులు సాగిస్తున్న విచారణ చూసిన తరువాత ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు ఇవి. ఓటుకు కోట్లు కేసులో నిందితులైన రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ఈడీ అధికారులు గురు, శుక్రవారాల్లో విచారించారు. ఉదయ్‌సింహను రేవంత్‌రెడ్డి ఇంటికి పిలిచి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా ప్రశ్నలు సంధించినట్లు సమా చారం. తాను కేవలం రేవంత్ రమ్మంటే స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లానే తప్ప ఆ డబ్బు ఎక్కడిదన్న వివరాలు తనకు తెలియదని ఉదయ్‌సింహ ఈడీ అధికారులకు చెప్పారు. అంతకుముందు సెబాస్టియన్‌ను విచారించినప్పుడు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ద్వారా ఫోన్ చేయించడం తప్ప తనకు ఇతర ఏ వివరాలు తెలియవని ఈడీ అధికారులకు చెప్పారు. స్టీఫెన్సన్ కోసం రూ. 5 కోట్లు! నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతోపాటు ఆయనకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం (ఒప్పందం ప్రకారం) రూ. 4.50 కోట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి ఇంటికి చేరవేసినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఏ బ్యాంకు ఖాతా నుంచి వాటిని విత్‌డ్రా చేశారు? ఎవరు ఆ రాజ్యసభ సభ్యుడికి ముట్టజెప్పారు వంటి వివరాలు ఇంకా బయటకు రావాల్సిఉంది. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఒకరు ఆ డబ్బును హైదరాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా రాజ్యసభ సభ్యుడి నివాసానికి చేరవేశారు. అక్కడి నుంచి రేవంత్‌రెడ్డి వాహనంలోకి రూ. 50 లక్షలు చేరింది. ఇంతవరకూ సమాచారాన్ని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తన విచారణలో తెలుసుకోగలిగింది. డబ్బును సమకూర్చిన ప్రస్తుత ఏపీ మంత్రి డ్రైవర్‌ను కూడా ఏసీబీ అప్పట్లో విచారించింది. అయితే బ్యాంకు ఖాతాల పరిశీలన, మనీలాండరింగ్ వంటి అంశాలు తమ పరిధిలో లేకపోవడంతో తదుపరి విచారణకు అవసరమైన వివరాలు అందజేయాలని ఈడీకి లేఖ రాసింది. రెండేళ్ల క్రితమే లేఖ రాసినా ఈడీలో ఉన్న ఒక అధికారి ఈ లేఖను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టినట్లు ఇటీవల తేటతెల్లమైంది. అప్పట్లో లేఖ రాసినా ఆ కేసుకు సంబంధించి తమకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదంటూ తాజాగా మరో లేఖ రాయడంతో ఈడీ ఖంగుతిన్నది. వెంటనే విచారణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహ నివాసాలపై దాడులు. ఓటుకు కోట్లు కేసు విచారణ చేస్తున్న సమయంలో ఈ ముగ్గురికీ సంబంధించి డొల్ల కంపెనీలు, నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున నగదు మార్పిడి చేయడం వంటి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో గడచిన 15 రోజులుగా వారి ఖాతాలు, ఇతరత్రా ఆస్తులు, కంపెనీల వివరాలు సేకరించిన ఈడీ... ఆదాయపన్ను అధికారులతో కలసి దాడులు నిర్వహించింది. వరుసగా రెండోరోజు రాత్రి వరకు కూడా రేవంత్ నివాసంలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారికి టెన్షన్.. టెన్షన్.. ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు రావడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఏపీ ప్రముఖులు ఆందోళనకు లోనవుతున్నారు. స్టీఫెన్సన్కు నిధులు సమకూర్చిన ఏపీ మంత్రి నిందితుల్లో ఒకరైన ఉదయ్‌సింహతో మాట్లా డేందుకు శుక్రవారం ప్రయత్నించినట్లు తెలిసిం ది. రేవంత్ ఇంటి దగ్గర ఉన్న సమయంలోనూ ఆ మంత్రి ఉదయ్‌సింహకు వాట్సాప్ కాల్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. -
దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు నేరం చేస్తూ నగ్నంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడును చట్టపరంగా శిక్షించడంలో జాప్యం చోటుచేసుకుంటున్నది. ‘‘మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ..’’ అంటూ ఆయన అమలు చేసిన ఓటుకు కోట్లు కుట్ర అమలు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు. 31మే, 2015న... తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకుగానూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్వయంగా రూ.50 లక్షలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయి, జైలుపాలయ్యారు. కొద్ది గంటల్లోనే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఉమ్మడి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబు అనంతర కాలంలో హైదరాబాద్‌పై ఉన్న 10ఏళ్ల హక్కును వదులుకుని పారిపోయే పరిస్థితి తలెత్తింది.అసలేం జరిగింది?: శాసన సభ్యుల ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినప్పటికీ టీడీపీ తన అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని బరిలో నిలిపింది. అక్రమంగా ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారిగా ఓటుకు కోట్లు కుట్ర రూపొందింది. ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. రూ.50లక్షల రూపాయిల నోట్ల కట్టలను అందించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రేవంత్ మాట్లాడిన మాటలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ‘‘ఓటు వేసిన తర్వాత మిగతా డబ్బు అందజేస్తామని చెప్పి మమ్మల్ని బాస్(చంద్రబాబు) పంపించాడు. కావాలంటే మీరు మా బాస్‌తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇక్కడ తెలంగాణాలో మీకు ఎలాంటి ప్రాబ్లం వున్నా నేన్ను చూసుకుంటాను..’’ అని రేవంత్ చెప్పడం స్పష్టంగా వినిపిస్తాయి. అప్పటికే కుట్ర సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు.. టీడీపీ నేతల్ని రెడ్ హ్యాండెడ్‌గా దొరకబుచ్చుకున్నారు. స్టీఫెన్సన్-చంద్రబాబుల సంభాషణ స్టీఫెన్సన్ : హలో చంద్రబాబు మనిషి : ఆ యా బ్రదర్ స్టీఫెన్సన్ : సర్ చంద్రబాబు మనిషి : అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్ స్టీఫెన్సన్ : ఒకే సర్ చంద్రబాబు : హలో స్టీఫెన్సన్ : సర్ గుడ్ ఈవినింగ్ సర్ చంద్రబాబు : ఆ గుడ్ ఈవినింగ్ బ్రదర్ హౌ ఆర్ యు స్టీఫెన్సన్ : ఫైన్ సర్ థ్యాంక్ యు చంద్రబాబు : మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ స్టీఫెన్సన్ : యా సర్ చంద్రబాబు : ఐ యాం విత్ యు డోంట్ బాదర్ స్టీఫెన్సన్ : రైట్ చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ స్టీఫెన్సన్ : యా సర్ రైట్ చంద్రబాబు : ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్ స్టీఫెన్సన్ : ఎస్ సర్ చంద్రబాబు : దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వి విల్ వర్క్ టుగెదర్ స్టీఫెన్సన్ : రైట్ చంద్రబాబు : థ్యాంక్ యు ఏపీకి ఆపాదించే కుట్ర: చంద్రబాబు సంభాషణల వీడియో బయటికి రావడం, ఓటుకు కోట్లు కేసులో ’దొరికిన దొంగ చంద్రబాబు’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడం లాంటి పరిణామాలతో బెంబేలెత్తిపోయిన చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల కాళ్లావేళ్లాపడి కాపాడాల్సిందిగా వేడుకున్నారు. అటుపై కోర్టును ఆశ్రయించారు. ఈలోపే తన కుట్రలకు మరింత పదునుపెట్టిన చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఆంధ్రులకు రక్షణలేదని, ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8ని అమలుచేయాలని నాటకాలు మొదలుపెట్టారు. టీడీపీ అక్రమ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి వ్యవహారంలో చంద్రబాబు పట్టుబడిన వైనం సంచలనం సృష్టించింది. -
‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసుకు, ఆ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డికి మే నెలతో వివాదాస్పద అనుబంధం ఉందంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పన్నిన కుట్ర మొత్తం మే నెలలోనే సాగినట్టు ఏసీబీ వర్గాలు ధ్రువీకరించాయి. టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది 2015, మే 30వ తేదీనే. ఈ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతూ మూడేళ్ల తర్వాత.. అంటే 2018 మే నెలలోనే మళ్లీ తెరపైకి వచ్చింది. స్టీఫెన్‌సన్‌తో సాగి న సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఈ నెలలోనే ఏసీబీకి చేరింది. అటు ఏసీబీ కూడా ఈ నెలలోనే తుది చార్జిషీటు దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తంగా ‘ఓటుకు కోట్లు’వ్యవహారంలో మే నెల కీలకంగా మారుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన రేవంత్‌రెడ్డికి కూడా మే నెల అచ్చివచ్చి నట్టు కనిపించడం లేదు. ఆయనకు రాజకీయంగా 2015 మే 30న తీరని దెబ్బ పడింది. ఇప్పుడదే నెలలో ఆయన ఏకంగా సీఎం అవడం తన లక్ష్యమం టూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపింది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన రాజకీయ భవిష్యత్‌ను ఎటువైపునకు తీసుకెళుతుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం. -
ఓటుకు కోట్లు : మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
-
ఓటుకు కోట్లు : మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లు తనను బలిపశువు చేస్తున్నాయని కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు స్టీఫెన్‌సన్‌తో పాటు చాలా మందిని కొనుగోలు చేసి ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరికి టీడీపీ నాయకులు ఫోన్ చేశారన్న విషయాన్ని బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులను ప్రలోభపెట్టి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ప్రమేయమున్న అందరిపై పూర్తి దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎవరెవరిని కోనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయాలను సైతం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరారు. -
చంద్రబాబే ఏ-1
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి రాబోతోంది! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ కేసులో ఏ–1 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోబోతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు రుజువైనందున ఈ కుట్రలో ఆయనే కీలకం అవుతారని న్యాయ నిపుణులు ఇప్పటికే తేల్చిచెప్పారు. కేసులో ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొనాల్సి ఉంటుందని సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు. ‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. మూడేళ్ల నాటి కేసు మూడేళ్ల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, అరెస్టు కావడం తెలిసిందే. స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రలోభాలకు గురిచేసిన ఆడియో అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏ–1 నిందితుడిగా పేర్కొన్న మొదటి చార్జిషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులో ఆ వాయిస్ చంద్రబాబుదా కాదా అని నిర్ధారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది. ఆడియో టేపులను చండీగఢ్ ఫోరెన్సిక్ విభాగానికి పంపింది. అది చంద్రబాబు వాయిసేనంటూ ఫోరెన్సిక్ విభాగం ఇటీవలే నివేదిక ఇచ్చింది. కారణమేంటో గానీ రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు ఏ మాత్రం ముందుకు సాగలేదు. చండీగఢ్ ఎఫ్ఎస్ఎల్ ధ్రువీకరణ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియోను ధ్రువీకరించుకునేందుకు ఏసీబీ చాకచక్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కాకుండా చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో వాయిస్‌ను శాంపిల్‌ను పరీక్ష చేయించింది. అంతకుముందే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం బాబు ఆడియో శాంపిల్స్‌ను ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో పరీక్ష చేయించారు. అది చంద్రబాబు గొంతే అని స్పష్టంగా తేలడంతో ఆయన.. బాబుపై విచారణ జరపాలంటూ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీరా ఇప్పుడు ఏసీబీ అధికారికంగా పరీక్షించిన వాయిస్ టెస్టులో అది చంద్రబాబు గొంతేనని మరోసారి అధికారికంగా ధ్రువీకరించడంతో కేసులో కదలిక వచ్చింది. ప్రఖ్యాతిగాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నాలుగు రోజుల క్రితం బాబు ఆడియో నివేదిక ఏసీబీ చేతికి అందింది. అన్ని ఆధారాలు లభ్యం కావడంతో రా>ష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు నాలుగు రోజులుగా లోలోపల కసరత్తు చేస్తోంది. కుట్ర మొత్తం బాబుదే.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ..’అంటూ సంభాషించింది చంద్రబాబు అని తేలడంతో ఓటుకు కోట్లు కేసులో కుట్ర మొత్తం చంద్రబాబుదిగానే ఏసీబీ చార్జిషీట్ రూపొందిస్తోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణతో సెక్షన్లు చేర్చబోతోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏ–1గా ఉండగా, సెబాస్టియన్ ఏ–2గా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏ–3గా, ఉదయ్‌సింహ ఏ–4గా, జెరూసలెం మత్తయ్య ఏ–5గా ఉన్నారు. అయితే ఇప్పుడు కుట్ర మొత్తం చంద్రబాబుదే అని స్పష్టం కావడంతో ఏ–1గా ఆయన పేరు చేర్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు. ఆ తర్వాత మిగిలిన నిందితుల పేర్లను చేరుస్తామని అధికారులు తెలిపారు. 2015 జూలై 28న తొలి చార్జిషీట్ ఓటుకు కోట్లు కేసులో ముందుగా అరెస్టయిన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర, ఉదయ్‌సింహలను విచారించిన ఏసీబీ అధికారులు 2015 జూలై 28న మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆడియో, వీడియో శాంపిల్స్, స్టీఫెన్సన్, సెబాస్టియన్, రేవంత్, తదితరుల ఫోరెన్సిక్ రిపోర్టులను 2017 మార్చిలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో పొందుపరిచారు. ఇప్పుడు బాబే అసలు నిందితుడని తేలడంతో ఏసీబీ ఈ నెల చివరి వారంలో తుది చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎవరి ఒత్తిడికీ లొంగవద్దు: కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఓటుకు కోట్లు కేసు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, ఏసీడీ మాజీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో చట్టం తని పని తాను చేసుకుపోవాలని, ఆధారాలు బలంగా ఉన్నప్పుడు ఎవరి ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదని, చార్జిషీట్ దాఖలు చేయాల్సిందేనని సీఎం అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగనున్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. గవర్నర్ దృష్టికి.. ఆదివారం రాత్రి సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ భేటీలోనూ ఈ కేసు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. గవర్నర్‌కు కేసు పురోగతిని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబుపై తీసుకోబోతున్న చర్యలను కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావడంతో చార్జిషీట్, నిందితుల జాబితాలో చేర్చడం వంటి అంశాల్లో గవర్నర్ నుంచి అనుమతి కూడా రాష్ట్ర ప్రభుత్వం పొందినట్టు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వచ్చే పదిహేను రోజుల్లో ఏసీబీ కోర్టులో పూర్తి స్థాయి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు జీఏడీ నుంచి అనుమతి తీసుకున్నామని, గవర్నర్ నుంచి కూడా అనుమతి లభించినట్టు ఏసీబీలోని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బాబు వివాదాస్పద నిర్ణయాలపై పునఃసమీక్ష ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీ అనే సంస్థకు రాజధాని హైదరాబాద్‌లో క్రీడా మైదానాలు అప్పగించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తిరగదోడాలని, దానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ సంస్థకు గోల్ఫ్ కోర్సు పేరిట దాదాపు 500 ఎకరాలు కట్టబెట్టిన వైనంపైనా విచారణ జరుపనుంది. ఎమ్మార్, రహేజాతో పాటు చంద్రబాబు హయాంలో సాగిన అన్ని భూ లావాదేవీల వెనుక గుట్టును రాబట్టాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. సెబాస్టియన్ (బాబు అనుచరుడు): హలో స్టీఫెన్సన్: యా బ్రదర్.. సెబాస్టియన్: బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు, బి ఆన్ ద లైన్ (బాబు గారు మీతో మాట్లాడుతారు మీరు లైన్లో ఉండండి) స్టీఫెన్సన్: యా చంద్రబాబు: హలో.. స్టీఫెన్సన్: సర్ గుడ్ ఈవెనింగ్ సర్.. చంద్రబాబు: ఆ.. గుడ్ ఈవెనింగ్ బ్రదర్, హౌ ఆర్ యూ స్టీఫెన్సన్: ఫైన్.. థ్యాంక్యూ సర్ చంద్రబాబు: మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్ (మనవాళ్లు నాకు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిన పని లేదు) స్టీఫెన్సన్: యస్ సర్.. రైట్ సర్ చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు, వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటాను. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తా) స్టీఫెన్సన్: ఎస్ సార్.. రైట్ సార్.. చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లం ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.. ఎలాంటి సమస్యా లేదు) స్టీఫెన్సన్: ఎస్ సర్ చంద్రబాబు: దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వుయ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ.. మనం కలసి పని చేద్దాం) స్టీఫెన్సన్ : రైట్...థాంక్యూ సర్.. చంద్రబాబు: థాంక్యూ. చంద్రబాబు–ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ఇదీ.. -
బ్రీఫ్డ్ కేస్
పంచ్‌నామా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి చిక్కులు తప్పవు. మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదు. అవతలి వాళ్లు అప్రమత్తం కాకుండా చూసుకోవడం కూడా మన పనే. ఇదంతా ఎందుకంటే... చంద్రబాబు నాయుడి కేసు గురించే. తెలంగాణ ఏసీబీ వారికి కించిత్ మర్యాద లేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆట పట్టించకూడదన్న ఇంగితం అసలే లేదు. థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ నడిపిన సీనియర్ని అల్లరి చేయకూడదన్న మంచితనం ఏ కోశానా లేదు. ఏమీ లేవు కాబట్టే... తెలంగాణ ఏసీబీ వారు అందరూ మర్చిపోయిన ఓటుకు కోట్లు కేసు వ్యవహారాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చారు. ఓటుకు కోట్లు కేసులో ఛార్జిషీటు దాఖలు చేసిన ఏసీబీవారు అందులో చంద్రబాబు నామజపమే చేశారు. ఏకంగా 22సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించారు. పాపం చంద్రబాబు నాయుడు ఎంతో గుట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవడం కోసం జస్ట్ ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుక్కుందామని ప్రయత్నిస్తే ఆ ప్లాన్ అంతా చెడగొట్టింది ఏసీబీ. చేసింది చాలదన్నట్లు... ఆ ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబు నాయుడు ఏం ప్లాన్ వేశారో రేవంత్ రెడ్డి చేతికి డబ్బుల సూట్‌కేస్ ఇచ్చి ఎలా పంపారో... స్టీఫెన్ సన్తో చంద్రబాబు ఏమేం బేరసారాలు ఆడారో అంతా రహస్యంగా రికార్డు చేసింది ఏసీబీ. పెద్దమనుషులు ఏదో వ్యవహారంలో రహస్యంగా బేరసారాలు ఆడుకుంటూ ఉంటే ఆ ఫోను సంభాషణ వినడమే తప్పు. విన్నది కాక దాన్ని రికార్డు చేయడం అత్యంత అమర్యాదకరమైన విషయం. పోనీ రికార్డు చేశారే అనుకుందాం... దాన్ని ఏసీబీ వారు తమకి బోరు కొట్టినపుడు కాలక్షేపానికి వింటే సరిపోతుంది. అలా చేయకుండా దాన్ని మొత్తం పబ్లిక్‌కి తెలిసేలా చేయడం... మహాదారుణం. ‘ఎక్కడికి వెళ్తున్నాం మనం’ అని వాపోతున్నారు బాబు. ఈ దేశంలో ఎంత రహస్యంగా పనులు చేసుకుందామన్నా కుదరడం లేదని పాపం చంద్రబాబు నాయుడు ఎంతగా మనస్తాపం చెందారో? ముఖ్యమంత్రి పదవిలోఉన్నాక... తమ పార్టీకి ఓ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోడానికి... ఎమ్మెల్యేలను కొనడం నేరమెలా అవుతుంది? ఎమ్మెల్యేలకు డబ్బులు కూడా ఇవ్వకుండా వారి మద్దతు అడిగితే తప్పవుతుంది కానీ... చక్కగా యాభై లక్షల సూట్ కేస్ ఇచ్చి పంపిన ధర్మప్రభువు చంద్రబాబు నాయుడి విషయంలో ఏసీబీ వారు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గంగానే ఉందని మర్యాదస్థులంతా చాలా మర్యాదగా చెవులు కొరుక్కుంటున్నారు. ఇది చాలదన్నట్లు ఇదే సమయంలో సుప్రీం కోర్టు కూడా చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. అది కూడా ఓటుకు కోట్లు కేసుకు సంబంధించినదే.ఇవన్నీ చూశాక చంద్రబాబులాంటి మనుషులకు ఇవి రోజులు కావేమోనన్న బెంగ గుండెల్ని కోసేస్తోంది. అయితే సుప్రీం నోటీసుల గురించి ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని... అలాంటి కేసులు నోటీసులు తాను చాలానే చూశానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుచరుల్లో ఇపుడు అదే చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ధీమాకి కారణం ఏమిటా అని వారు ఆలోచిస్తున్నారు. ‘ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు?’ అంటే అర్ధం... ఇంకా ఇలాంటి వ్యవహారాలు చాపకింద చాలా తోసేశారా? అని పచ్చచొక్కాలు నర్వస్‌గా బెల్లు కొట్టేసుకుంటున్నారు. మీడియానీ రాజకీయనాయకులనూ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు ఇపుడేం చేస్తారా అని వారంతా అలజడితో సైకిల్ టైర్లలో గాలి తీసి కొడుతూ... తీసి కొడుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడి బ్రీఫింగ్ అండ్ బ్రీఫ్‌కేస్ గ్యాంగ్ మాత్రం మా బాస్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కేసులు లేకుండా చేయగలరు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటో వారి ధీమా? వాళ్ల బ్రీఫ్‌కేసులలో ఎంత ధీమా ఉందో?... మీరే ఆలోచించండి. - నానాయాజీ -
'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్ వేధిస్తోంది'
ఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని నిందితుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకొచ్చినా తనను బలిపశువును చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పిటిషన్ వేయడంలో ఆంతర్యమేంటని మత్తయ్య ప్రశ్నించారు. ఈ కేసులో స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసును సీబీఐకి అప్పగించాలి
- హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ డిమాండ్ - కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు వెల్లడి ఏలూరు: తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు డిమాండ్ చేశారు. ఈ రెండు కేసులు వెలుగులోకి వచ్చి ఈనెల 27కు ఏడాది కావస్తుండడంతో కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు ఆయనతోపాటు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫతేబాద్సెంటర్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్ కేసుల్లో సృష్టమైన ఆధారాలున్నట్లు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బహిరంగంగా ప్రకటించాయన్నారు. అయితే, తర్వాత రెండు ప్రభుత్వాలు రాజీ పడి కేసులను నీరుగార్చేస్తున్నాయని, దర్యాప్తు ఆలస్యమయ్యే కొద్దీ కీలక ఆధారాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో దేశంలో రెండు రాష్ట్రాల పాలకులు పరస్పర కేసులు పెట్టుకున్న ఉదంతాలు లేవన్నారు. ఇరు వర్గాలు రాజ్యాంగ బద్ధులై చట్టాలను కాపాడతామని ప్రమాణం చేసిన వారేనని, కానీ ఈ కేసుల్లో వారే నిందితులుగా మారారని చెప్పారు. చట్టాలను అమలు చేసే వారే నిందితులుగా మారితే వారి ఆజమాయిషీలో పనిచేసే ఆయా రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా పనిచేయలేవని పేర్కొన్నారు. ఈ కేసులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీటిని వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. చార్జిషీట్లో పేరున్న చంద్రబాబుపై చర్యలేవీ? గతంలో రెండు రాష్ట్రాల పాలకులు ఒకరిపై మరొకరు పోటీ పడి సుమారు 150 కేసులు పెట్టుకున్నారని, ఇప్పుడు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చార్జీషీటులో ఉందని, తప్పుచేసి దొరికిపోయిన ఆయనపై ఇప్పుటి వరకు ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారని, అంత డబ్బు రేవంత్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో తెలపాలని, చంద్రబాబు ఆడియో టేపులను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్ధారించినప్పటికీ ఆ వివరాలను ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులను వెంటనే సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలని కోరారు. సమావేశంలో సామాజిక కార్యకర్త జి.సత్యనారాయణ పాల్గొన్నారు. -
'లంచం తీసుకున్న వాడే నేరస్తుడు'
-
‘ఓటుకు నోట్లు’లో ‘బలిదానాలు’
పేద, బడుగువర్గాలు, దళిత బహుజన, మైనారిటీలు ఈ పరిణామాల్ని శ్రద్ధగా గమనించాలి. ‘మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి’ అనీ ‘చైతన్యం పొందండి, చైతన్యం పొందండి, చైతన్యం పొందండీ’ అనీ మూడేసిమార్లు అంబేడ్కర్ ఎందుకు ఆదేశించవలసి వచ్చిందో ఆలోచించవలసిన అవసరం ఉంది. ‘వైస్రాయి హోటల్’ తరహా మోసాల నుంచీ, ‘ఫామ్‌హౌస్’ కుట్రల నుంచీ దళిత ప్రతినిధులూ, మైనారిటీ, బహుజన వర్గాల ప్రతినిధులూ బయటపడాలి. రెండోమాట ‘ఓటుకు-నోట్లులో’ కుంభకోణాన్ని ఛేదించడంలో అవినీతివ్యతిరేక సాధి కార బృందం (ఏసీబీ) ఒకవైపున ముందుకు సాగుతున్నప్పటికీ, అవినీతి కేసు లలో శిక్షలుపడిన వారి శాతం మాత్రం ఘోరం! గడచిన మూడేళ్లలోనే ‘ఏసీబీ’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 344 కేసులు నమోదు చేసింది. అంతే-కథ కం చికి వెళ్లింది, ఏసీబీ ఇంటికి చేరింది’. -టైమ్స్ ఆఫ్ ఇండియా (18-6-2015) ‘ఓటుకు-నోట్లు’ తాజా కేసులు కూడా ఉభయ రాష్ట్రాల ప్రజల ప్రయోజ నాలకన్నా ఇద్దరు ప్రధాన నేతల, వారి రాజకీయపక్షాల స్వార్థ ప్రయోజనాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. విభజనానంతరం తమ అధికారం స్థిరపడ్డానికి పాలకపక్షాలు చేస్తున్న వ్యూహరచనలో బలి పశువులు అవుతున్నది- బడుగు బలహీనవర్గాల వారేనన్నది సత్యం! ఈ కేసులోని నిందితులు నలుగురిలో ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లు, ఇద్దరు దళిత క్రిస్టియన్లు. వీరిలో ఒక సాక్షిని ఒక రాష్ట్ర నేత తన పంచన చేర్చుకోగా, మరొక సాక్షిని మరొక నేత తన పంచను చేర్చుకున్నాడు! ఆ గుట్టుమట్టుల చాటున పెద్దలు తలలు దాచుకుంటున్నారు. ఈ రోజు దాకా కేసులకు సంబంధించిన ‘అతిరహస్యం’ ప్రజలకు ‘చెవి పోటు’గా మారింది! కానీ అవినీతి రాజకీయాల నిర్వహణలో ఆరితేరిన ఈ నేతల మధ్య కేంద్ర ప్రభుత్వ ‘పెద్దల’ జోక్యంతోనో లేదా మధ్యవర్తిత్వంతోనో రాజీ కుదిరినా కుదరవచ్చు. పదవుల రక్షణార్థం ఈ పరిణామం చోటు చేసు కోవచ్చునని కొన్ని పత్రికలూ, కొందరు నాయకులూ ఇప్పటికే ప్రకటించారు. ఎటూ తేలకుండా (రెండు రాష్ట్రాల నేతల మధ్య)సాగుతున్న ఈ అధికార స్థాయి అంతర్నాటకంలో- ఇలాంటి వ్యవహారాలలో వాస్తవాలను వెలికి తీయడానికి తోడ్పడవలసిన ఫోరెన్సిక్ లేబొరేటరీలో కూడా ప్రభుత్వాలు పెట్టే కేసుల్లో ఎలాంటి ప్రయోగాలకు అవకాశం ఉంటుందో షాజహాన్‌పూర్ (యూపీ)లో జరిగిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు జాగేంద్రసింగ్ హత్యతో వెల్ల డైంది. మంత్రి రామమూర్తి వర్మ ఇందుకు కారకుడని జాగేంద్రసింగ్ మరణ వాంగ్మూలంలో చెప్పాడు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు సమర్పించిన ఫోరె న్సిక్ నివేదిక వర్మను నిర్దోషిగా ప్రకటించడానికి సాహసించింది! ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంగన్వాడి కార్మికురాలు కూడా పోలీసులే జర్నలిస్టును కాల్చి చంపారని చెప్పింది. కానీ జర్నలిస్టే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసు కున్నాడని పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టును సిద్ధం చేశారు! జర్నలిస్టు కుటుం బానికి ‘న్యాయం’ చేస్తాననీ, రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లిస్తాననీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించిన 24 గంటల్లోనే వేరే కథకు కాళ్లువచ్చాయి! ‘ఓటుకు నోట్లు’ కేసులో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిత్ర మైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది! ఈ కేసు వివరా లను (ఆడియో, వీడియోలు, టేపులూ, పోలీసుల నివేదిక, కోర్టుకు సమర్పిం చిన అభియోగాల తబిసీళ్లు వగైరా) తనకు వెంటనే అందజేయాలనీ, ఎన్నికల సందర్భంగా జరిగే అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారణ బాధ్యత తన పరిధిలోకి వస్తుందనీ ఎన్నికల కమిషన్ జూన్ 1వ తేదీన ప్రకటించింది. కానీ ఆ విషయం ‘ది హిందూ’ వెల్లడించేదాకా ఇతర మీడియా మభ్యపెట్టడం విశేషం! ఎప్పటికప్పుడు ‘కీలక సాక్ష్యం’ దొరికిందని చెప్పడమే కాని, అదెంత ‘కీలక’మో తెలుసుకుందామన్న ఆసక్తితో ఉన్న ప్రజలకు మాత్రం అది అంద డం లేదు. ఎన్నికల కమిషన్ జూన్ 1వ తేదీన ఏసీబీని ఆదేశించిన లేఖను స్థానిక పాలకులు నిర్లక్ష్యం చేసినందుననే 24 రోజుల తర్వాత (జూన్ 25న) మరోసారి రిమైండర్ (జ్ఞాపకం) ఇవ్వవలసి రావటం కేసులు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయో తెలుస్తోంది. అంతేగాదు, అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి హార్డ్‌డిస్క్, ఇతర కీలక సాంకేతిక పరికరాలు కూడా తమకు ట్రాన్స్క్రెబింగ్కు విధిగా అవసరమనీ ఫోరెన్సిక్ అధికారులు కోరగా, ‘ఆ బాదరబందీ మీకెందుకు, ఆ పనిని మేమే చూస్తాంలెండి’ అని ఏసీబీ సమాధానమిచ్చినట్టు కూడా ‘ది హిందూ’ సూచనప్రాయంగా వెల్లడించింది. అటూ ఇటూ కక్కుర్తే లోకంలో దొరికినవాడు ‘దొంగ’, దొరకనివాడు ‘దొర’! ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ఒక ప్రాంతంలోని అధికారపక్షం నేతలు ‘ఓటుకు నోట్ల’తో కక్కుర్తిప డ్డారు. నిజమే. ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన’ వేసుకున్నట్టుగా మరో రాష్ట్రం శాసనసభలో 63 మంది సభ్యులే ఉన్నప్పటికీ, మండలిలో ఐదు సీట్ల కోసం అక్కడి అధికారపక్షం చూపించిన కక్కుర్తి ఎలాంటిది? 63 సంఖ్యను 85కి దేకించాలి కాబట్టి, అవసరమైన 22 మంది ప్రతిపక్షాల (కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ వగైరా) సభ్యులకు ఎరవేయడం అందుకే. అంటే అధికారం నిలబెట్టుకోవడానికి ఏ సంపన్న వర్గ రాజకీయ పక్షమూ సిగ్గూ, లజ్జాభిమా నాలను త్యాగం చేయడానికి వెరవదని మరొకసారి ప్రజల అనుభవంలోకి వచ్చింది! చివరికి - ఏ పార్టీ గుర్తుతో ఎన్నికైనారో ఆ పార్టీల ‘బకెట్’ను కాస్తా తన్నేసి, అధికారపక్షంలో భాగమవుతున్నవారి గుర్తింపును రద్దు చేయాల్సిన లెజిస్లేచర్ సభాపతులు కూడా నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. విచార ణాధికారులు అభియోగాలు మోపిన తరువాత, నిందితుల్ని అరెస్టు చేయవ లసి వస్తే ముందు ప్రాథమిక నివేదిక ఆధారంగా కోర్టు అనుమతిని విధిగా పొందవలసిన కనీస ఆనవాయితీని కూడా విచారణ సంస్థలు పాటించక పోవడం ఏ సంప్రదాయం కింద, ఏ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద, ఏ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ఏ ఎన్నికల కమిషన్ నిబంధనల కింద నమోదైందో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు. బడుగులూ బహుపరాక్! పేద, బడుగువర్గాలు, దళిత బహుజన, మైనారిటీలు ఈ పరిణామాల్ని శ్రద్ధ గా గమనించాలి. కేవలం ధనస్వామ్య ప్రయోజనాలను కాపాడుతున్న శాసన వేదికల్లో ప్రవేశించాలన్న ఆబతో, ఆ చక్రబంధంలో చిక్కుబడిపోకుండా చైత న్యంతో ఉండవలసిన అవసరం గతంలోకన్నా నేడు ఎక్కువగా ఉందని గ్రహించాలి! ‘ఓటుకు నోటు’ లాంటి అవినీతికర ప్రయోగాలకు ‘ఎర’గాకుం డా జాగ్రత్తపడాలి. స్టీఫెన్సన్, సెబాస్టియన్, జెరూసలెం మత్తయ్య లాంటి వారు ఇరు రాష్ట్రాల పాలకశక్తుల కుట్రలకు బలవుతున్న తీరుతెన్నులు ఇతరు లకూ గుణపాఠం కావాలి! నేటికీ ‘నాలుగు పడగల హైందవ నాగరాజులు’ ఏలుతున్న స్వతంత్ర భారతంలో రానున్న పరిణామాల్ని ముందుగానే పసి కట్టగలిగిన మహాకవి జాషువా ధనిక వర్గ వ్యవస్థలో దళిత, మైనారిటీ బహు జన వర్గాలు ఎలా వ్యవహరించాలో హెచ్చరించాడు: ‘‘ఏ నాడు మా జాతి (దళిత బహుజనులు) దృష్టి మాంద్యము బాసి చుట్టు ప్రక్కల తేరిపార చూడగలదొ / ఏనాడు మా బుర్రలీ జుట్టు తలలేని పుక్కిటి కథలలో చిక్కువడదొ/ ఏనాడు మా విద్యలు ఇనుప సంఘమునందు చిలుముపట్టక ప్రకాశింపగలవొ’’ ఆనాడు, అదిగో ఆనాడు మాత్రమే శ్రమైకజీవనం మీద ఆధారపడే బహుజనులందరికీ నిజమైన విమోచన దినం. ఆ లక్ష్యసాధనే డాక్టర్ అంబే డ్కర్కు ఆచరణాత్మకమైన, నిజమైన నివాళి. ‘మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి’ అనీ ‘చైతన్యం పొందండి, చైతన్యం పొందండి, చైతన్యం పొం దండి’ అనీ మూడేసిమార్లు అంబేడ్కర్ ఎందుకు ఆదేశించవలసి వచ్చిందో ఆలోచించవలసిన అవసరం ఉంది. ‘వైస్రాయి హోటల్’ తరహా మోసాల నుంచీ, ‘ఫామ్‌హౌస్’ కుట్రల నుంచీ దళిత ప్రతినిధులూ, మైనారిటీ, బహు జన వర్గాల ప్రతినిధులూ బయటపడాలి. (వ్యాసకర్త మొబైల్: 9848318414) ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకం
-
స్టీఫెన్సన్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా
-
మత్తయ్య అరెస్టుపై రేపటి వరకు స్టే
-
నిందితుడిని ప్రభుత్వం ఎలా రక్షిస్తుంది?
-
'మాట్లాడింది చంద్రబాబే'
-
ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?
-
ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?
ఆ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో మొదటి విడతగా చెల్లించిన రూ.50 లక్షల నోట్లకట్టల్లో దొంగనోట్లున్నాయా? తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు చెల్లిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. అందులో కొన్ని దొంగ నోట్లు ఉన్నట్టు తేలిందని తెలిసింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? ఐటీ లెక్కలున్నాయా? వంటి వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేస్తోంది. ఈ కేసు విచారణలో ఆ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేశారా? లేక ఎవరైనా పారిశ్రామిక వేత్త నుంచి తెచ్చారా? అన్న విషయంపై ఆరా తీసిన తర్వాత ఏసీబీ ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలిపే అవకాశాలున్నాయి. అయితే వాటిని లెక్కించిన అధికారులు అందులో దొంగనోట్లు ఉన్నాయని తెలియడంతో ఇప్పు డు దానిపైనా దృష్టి సారించినట్టు అధికారవర్గాల సమాచారం. కాగా గతంలో ఏపీ సీఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒకరు దొంగ నోట్ల కేసులో పట్టుబడిన ఉదంతం నేపథ్యంలో వ్యవహారం ఎటు మళ్లుతుందోనని చర్చ జరుగుతోంది. -
ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం
-
ఓటుకు కోట్లు: జెస్సికా, టేలర్ వాంగ్మూలం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. బుధవారం నాంపల్లి కోర్టులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇస్తున్నారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్‌కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ముడుపులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. మార్క్ టేలర్ ఇంట్లోనే రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను కలిశారు. -
నాది మైండ్‌గేమ్ కాదు: స్టీఫెన్సన్
ఓటుకు నోటు కేసులో నన్నెవరూ ఆడించలేదు: స్టీఫెన్సన్ హైదరాబాద్: ‘‘ఓటుకు నోటు వ్యవహారంలో నేను మైండ్‌గేమ్ ఆడలేదు. నాతో ఎవరూ మైండ్‌గేమ్ ఆడించలేదు’’ అని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బు ఎరజూపుతూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన స్టీఫెన్‌ను రాష్ర్టంలోని పలు క్రిస్టియన్, క్యాథలిక్ సంక్షేమ సంఘాలు మంగళవారం సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా స్టీఫెన్సన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన అంతరాత్మ ప్రబోధం మేరకే వ్యవహరించినట్లు చెప్పారు. ప్రజల కోసం, దేశం కోసం త్యాగాలు చేసిన వారే నిజమైన నాయకులని నమ్మే వ్యక్తినన్నారు. సొంతలాభం కోసం పనిచేసే వారు నిజమైన నాయుకులు కాదన్నారు. తన ఆలోచనా విధానం ప్రకారమే వ్యవహరించానని, ఈ విషయంలో ఒత్తిళ్లు, తొందరపాటుతనం ఎంతమాత్రం లేదన్నారు. తన జీవితంలో కోట్ల రూపాయలను ఎప్పుడూ చూడలేదన్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు దశాబ్దాల తరబడి చేసిన వ్యాపారంలో వ్యవహారమంతా కోటి రూపాయలను మించలేదన్నారు. స్వలాభం కోసమే చూసుకునే వాడినైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. ఐదు కోట్లు తీసుకునే వాడినని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి పరిణామానికి ముందు తనను అంతా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా చూసేవారని, కానీ ప్రస్తుతం క్రైస్తవ సంఘాల వారంతా తనను తమ బిడ్డగా, నిజాయితీకి ప్రతిరూపంగా చెప్పుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ప్రమాదం పొంచి ఉందని, జాగ్రత్తగా ఉండాలని పలువురు శ్రేయోభిలాషులు సూచిస్తున్నారని స్టీఫెన్ పేర్కొన్నారు. తాను నమ్మిన జీసెస్ సిద్ధాంతాలే తనకు రక్షణ అని అన్నారు. తాను జీవితకాలం నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారమే నడుచుకున్నానని, అదే ధర్మాన్ని నాయకులందరూ పాటించాలన్నదే తన అభిమతమని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే వేలాది మంది స్టీఫెన్సన్లు పుట్టుకొస్తారని, తన స్ఫూర్తితో నీతిమంతమైన రాజకీయూలతో బంగారు తెలంగాణ సాధిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, స్టీఫెన్సన్ వ్యవహరించిన తీరు క్రైస్తవ సమాజానికి పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయని పలు సంఘాల ప్రతినిధులు కొనియాడారు. ఆయనకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. క్యాథలిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి లియో నేతృత్వంలో జరిగిన అభినందన కార్యక్రమంలో పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాట నిగ్గు తేలేదిలా
దేశంలోనే సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి చేరింది. ఈ నేరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనే ఆరోపణలు వచ్చాయి. తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో చంద్రబాబు జరిపిన సంభాషణ రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఇవి వాస్తవ రికార్డులే అని తెలంగాణ ఏసీబీ అధికారులు చెప్తుండగా.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం వివిధ సందర్భాల్లో తాను మాట్లాడిన మాటలను క్రోడీకరించి ‘కట్ అండ్ పేస్ట్’గా తయారు చేశారని అంటున్నారు. ఈ రికార్డులు ఏ కోవకు చెందినవి, అందులో ఉన్న గొంతులు ఎవరెవరివి? అనే అంశాలు ఎఫ్ఎస్ఎల్ నిర్వహించే పరీక్షల్లో తేలనున్నాయి. ఆ పరీక్షలు ఏమిటి? ఎలా నిర్వహిస్తారు? ఎలా నిర్ధారిస్తారు? అనేది నేటి ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ టేపులకు రెండు రకాల పరీక్షలు ఆడియో, వీడియో టేపుల్ని ఫోరెన్సిక్ నిపుణులు ‘ఫోరెన్సిక్ ఆడియో-వీడియో అథెంటిఫికేషన్’ విధానంలో విశ్లేషిస్తారు. ఈ ప్రక్రియలో మొత్తం రెండు ఘట్టాలు ఉంటాయి. మొదటిది అథెంటిఫికేషన్. సదరు టేపులు రికార్డు చేసినవా, ఉద్దేశపూర్వకంగా తయారు చేసినవా అనేది ఈ పరీక్షలో తేలుతుంది. తెలంగాణ ఏసీబీ అధికారులు పంపిన టేపులను ప్రాథమికంగా ఈ కోణంలోనే విశ్లేషిస్తారు. తదుపరి ఘట్టం ఆ టేపుల్లో ఉన్న వాయిస్ ఎవరిది అనేది గుర్తించడంతో పాటు వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఫలానా వారే అని నిర్ధారించడం. దీన్ని సాంకేతికంగా ఐడెంటిఫికేషన్ అంటారు. ఈ విశ్లేషణల కోసం ‘మల్టీ స్పీచ్ 3700’ సహా పలు సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి. అథెంటిఫికేషన్ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆడియో, వీడియో రికార్డుల అథెంటిఫికేషన్ నిర్ధారణ అయిన తర్వాత అందులో ఉండే గొంతులు, వ్యక్తుల్ని గుర్తించడం కోసం ఐడెంటిఫికేషన్ పరీక్షను నిర్వహిస్తారు. వీడియోకు ఈ పరీక్ష చేయడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫొటోలను వివిధ భంగిమల్లో సేకరిస్తారు. ఆడియోను పరీక్షించడానికి... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందుబాటులో లేకుంటే పాత రికార్డులు, అందుబాటులో ఉండే న్యాయస్థానం అనుమతితో నమూనాలు సేకరిస్తారు. నమూనాల సేకరణలో భాగంగా ఆడియోలో ఉన్న మాటల్నే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో మరోమారు చెప్పించి రికార్డు చేస్తారు. ఆ మాటల్ని స్లోగా, మీడియం ఫాస్ట్‌గా, ఫాస్ట్‌గా ఉచ్ఛారణ చేయిస్తూ, చిన్న గొంతుతో, మధ్యస్త గొంతుతో, బిగ్గరగా చెప్పించి రికార్డు చేస్తారు. వీటిని సేకరించే ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నోటికి వివిధ రకాలుగా పరీక్షిస్తారు. ఓకల్ కార్డ్ ప్రీక్వెన్సీ కీలకం... ఆడియో ఐడెంటిఫికేషన్లో ఓకల్ కార్డ్ (స్వరపేటిక) ఫ్రీక్వెన్సీ అత్యంత కీలకాంశం. ప్రతి వ్యక్తి మాట్లాడటానికి నోరు, ముక్కుల్లో ఉండే పెరింజెల్ క్యావిటీ, లారింగ్స్, ఎసోఫేగస్ భాగాల వినియోగం తప్పనిసరి. వీటిని వినియోగిస్తేనే నోస్ ఔట్ లెట్, మౌత్ ఔట్లెట్స్ మధ్య సమన్వయంతో మాటలు బయటకు వస్తాయి. ఓ వ్యక్తి మాట్లాడేప్పుడు అతడి శ్వాస, నాలుక, కొండ నాలుక కలిసి పని చేయాల్సి ఉంటుంది. వీటిని ఓకల్ కార్డ్ మాడ్యులేషన్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లోని గాలి ఓకల్ కార్డ్ ద్వారా వస్తూ రెండు నాలుకల మధ్య జరిగే మాడ్యులేషనే మాట. ఈ ప్రక్రియలో ఓకల్ కార్డ్ కదలికలకు ప్రత్యేక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇది ఏ ఇద్దరు మనుషులకూ ఒకేలా ఉండదు. ప్రతి మాటకు బేస్టోన్, వేవ్‌లెన్త్, ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ప్రముఖుల గొంతును ధ్వని అనుకరణ (మిమిక్రీ) చేసే వ్యక్తులు సైతం మొదటి రెండింటినీ అనుకరించినా ఫ్రీక్వెన్సీని మాత్రం అనుకరించలేరు. ఈ ఫ్రీక్వెన్సీని ‘ఫోరెన్సిక్ ఆడియో-వీడియో అథెంటిఫికేషన్’ విధానంలో కంప్యూటర్ ద్వారా విశ్లేషించి, ఆడియో-నమూనాలను పోల్చి చూస్తే రికార్డులో ఉన్నది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్వరమా? కాదా? అనేది తేలిపోతుంది. ఈ విశ్లేషణలో మాటల్లోని పదాల మధ్య ఉన్న తీవ్రత (పిచ్), విరామం (పాస్)లను కంప్యూటర్ పరిగణనలోకి తీసుకుని రిపోర్ట్ ఇస్తుంది. ఫ్రేమ్స్ ఆధారంగా వీడియో ఆడియో విశ్లేషణకు, వీడియో విశ్లేషణకు దాదాపు ఒకే తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫోరెన్సిక్ నిపుణులు వాడతారు. ఆడియోను స్పెక్ట్రమ్స్ ఆధారంగా నిర్ధారించినట్లే... వీడియోను ఫ్రేమ్స్ ఆధారంగా నిర్ధారిస్తారు. ఓ దృశ్యం వీడియోగా 24 ఫ్రేమ్‌లుగా మారి కెమెరాలో రికార్డు అవుతుంది. ‘ఫోరెన్సిక్ ఆడియో-వీడియో అథెంటిఫికేషన్’ విశ్లేషణలో కంప్యూటర్ సాయంతో ఈ ఫ్రేమ్స్‌ను విడివిడిగా చేసి చూసినప్పుడు వాటిలో ఉన్న తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలానే వివిధ సందర్భాల్లో రికార్డు చేసినట్లయితే ఆ వీడియోలో కనిపించే వ్యక్తులు మారకపోయినా చుట్టుపక్కల ఉండే వస్తువులు, పరిసరాలతో పాటు ఫ్రేమ్స్ కచ్చితంగా మారతాయి. వీడియో మొత్తాన్ని వివిధ ఫ్రేమ్స్గా విభజించి విశ్లేషించడం ద్వారా ఈ మార్పుచేర్పుల్ని గుర్తించే అవకాశం ఉంటుంది. స్పెక్ట్రమ్స్తో ఆడియో గుట్టురట్టు ఏదైనా ఫోన్ కాల్, సంభాషణ, సభ, సమావేశం తదితరాలను రికార్డు చేసినప్పుడు ఇంటెండెడ్, అన్-ఇంటెండెడ్ శబ్దాలు అందులో రికార్డు అవుతాయి. ఓ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రికార్డు అయ్యే అతడి మాటలు ఇంటెండెడ్ స్పీచ్ కేటగిరీలోకి వస్తే... వెనుక వచ్చే వివిధ రకాలైన శబ్దాలు (నాయిస్) అన్-ఇంటెండెడ్ స్పీచ్ కేటగిరీలోకి వస్తాయి. ఏ రెండు ప్రాంతాలు, సమయాలు, సందర్భాల్లో మాటలు (ఇంటెండెడ్ స్పీచ్) ఒకేలా ఉన్నా... నాయిస్ మాత్రం ఒకేలా ఉండదు. ఆ ప్రాంతం, పరిసరాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ‘కట్ అండ్ పేస్ట్’ ఆడియోలో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. సదరు ఆడియో/రికార్డును ‘మెటాడేటా అనాలసిస్’ విధానంలో విశ్లేషించడం ద్వారా స్పీచ్, నాయిస్లను విడివిడిగా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా నిపుణులు ఆడిటరీ ఎగ్జామినేషన్‌లో వినడం ద్వారా ఈ మార్పుచేర్పుల్ని గుర్తిస్తారు. మరింత అథెంటిక్‌గా నిర్ధారించడం కోసం రికార్డులకు సాంకేతికంగా స్పెక్టోగ్రాఫిక్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఆడియోను స్పెక్ట్రమ్స్ రూపంలోకి మారుస్తారు. ఈ పరీక్షలో ఆడియో కంప్యూటర్ తెరపై స్పెక్టోగ్రామ్స్గా పిలిచే గ్రాఫ్‌ల రూపంలో కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ల్లో కనిపించే స్పీచ్, నాయిస్ లెవల్స్ ఒక్కో ఫ్రీక్వెన్సీలో కనిపిస్తుంటాయి. వీటిలో వచ్చే తేడాల ఆధారంగా ఆడియో విశ్వసనీయతను నిర్ధారించి నివేదిక తయారు చేస్తారు. ఫొటోలు జేపీజీ (జేపెగ్) ఫార్మాట్లో సేవ్ అయినట్లే.. వాయిస్ రికార్డులు ఎంపీజీ (ఎంపెగ్) ఫార్మాట్లో సేవ్ అవుతాయి. ఇలా సేవ్ అయిన ప్రతిసారీ సదరు ఫైల్లో అంతర్గతంగా డేట్-టైమ్-ఫార్మాట్ సేవ్ అవుతాయి. మెటాడేటా అనాలసిస్‌లో ఇవి కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఒకే సందర్భంలో రికార్డు చేసిన ఆడియోకు వీటిలో భారీ మార్పులు ఉండవు. అలా ఉంటే ‘కట్ అండ్ పేస్ట్’గా తేలిపోతుంది. ఎఫ్ఎస్ఎల్లో సి-డార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా సేవలు అందిస్తున్న ఎఫ్ఎస్ఎల్ గత ఏడాది లండన్ నుంచి సి-డార్ అనే అత్యాధునిక పరికరాన్ని కొనుగోలు చేశారు. వివిధ రకాలైన ఆడియోలను విశ్లేషించి, కచ్చితమైన నివేదికలు ఇవ్వడానికి ఇది ఉపకరిస్తుంది. దక్షిణ భారతదేశంలోని మరే ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్స్‌లోనూ ఇలాంటి పరికరం అందుబాటులో లేదు. సభల్లోనూ, ఆన్లైన్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో పాటు ఫోన్ల ద్వారా, నేరుగా బెదిరింపులే కాదు... కొన్ని రకాలైన భారీ కుంభకోణాల కేసుల దర్యాప్తులోనూ అనుమానిత వ్యక్తి వాయిస్ రికార్డులు, శాంపిల్స్‌ను పక్కాగా విశ్లేషించడానికి ఇది ఉపకరిస్తుంది. గతంలో ఈ తరహా పరీక్షల కోసం పోలీసు విభాగంతో పాటు ఇతర ఏజెన్సీలు చండీగఢ్‌లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీపై ఎక్కువగా ఆధారపడేవి. దీనికి పరిష్కారంగా లండన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి సి-డార్ పరికరాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం ఎఫ్ఎస్ఎల్లో పని చేస్తున్న నిపుణులకు సి-డార్ సంస్థ లండన్‌లో ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చింది. వీడియో విశ్లేషణకూ ఎఫ్ఎస్ఎల్లో ప్రత్యేక పరికరాలు ఉన్నాయి. -
కోర్టుకు సాక్ష్యాధారాలు
* నోట్లకట్టలు, సీడీలు, సెల్ఫోన్లు అప్పగించిన ఏసీబీ * కస్టడీ గడువు తగ్గించాలని రేవంత్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రేవంత్ కేసులో స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల సొమ్మును ఏసీబీ అధికారులు శనివారం ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. అలాగే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో నిందితుల సంభాషణకు సంబంధించిన ఆడియో, వీడియో సీడీలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను కూడా కోర్టుకు సమర్పించారు. నిజానికి నిందితుల అరెస్ట్ తర్వాత వారిని ఈ నెల 1న కోర్టులో హాజరుపరిచినప్పుడే ఈ ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంది. అయితే నిందితులను జడ్జి నివాసంలో హాజరుపరిచినందున ఆధారాలను అప్పుడు అందించలేదు. కాగా, ఆడియో, వీడియో సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కోర్టు.. నివేదిక కోరే అవకాశముంది. మరోవైపు ఏసీబీ కస్టడీలో విచారించిన తర్వాత రేవంత్‌ను చర్లపల్లి జైలుకు తరలించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో శనివారం మెమో దాఖలు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే కస్టడీకి తీసుకోవాలని కోర్టు పేర్కొందని, ఆ తర్వాత రేవంత్‌ను ఎక్కడికి తరలించాలనే విషయాన్ని స్పష్టం చేయలేదని జడ్జి దృష్టికి తెచ్చారు. విచారణ అనంతరం జైలుకు తరలించేలా ఆదేశించాలని కోరారు. మెమోను పరిశీలించిన కోర్టు.. ఏసీబీ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అలాగే నాలుగు రోజుల కస్టడీ గడువును తగ్గించాలని మరో పిటిషన్‌ను కూడా రేవంత్ లాయర్ దాఖలు చేశారు. -
రేవంత్ రవ్వంత మాట తూలినా...
(వెబ్ సైట్ ప్రత్యేకం) మాజీ డీజీపీ ఏకే మహంతి అవినీతి నిరోదక శాఖ అధిపతిగా ఉన్న రోజుల్లో ఓ రైతు దగ్గర నుండి కేవలం 50 రూపాయలు...(అవును 50 రూపాయలు) లంచం తీసుకున్న నేరానికి ఒక విద్యుత్ శాఖ లైన్మెన్ను అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా చేశారు. యాభై రూపాయల లంచానికి అరెస్టా?... ఆ రైతుకు ఆ దశలో 50 రూపాయలు ఎక్కువే. రైతు అవసరాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం నేరమే... చట్టానికి విరుద్ధంగా ఏమి చేసినా నేరమే... చిన్నదా...పెద్దదా అని ఉండదు. యాభై రూపాయలకైనా 50 లక్షల రూపాయలకైనా సెక్షన్లు ఒకటే. కోర్టు విధించే శిక్షలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు అనేది ఏసీబీ వాదన. దాదాపు దశాబ్దంన్నర తర్వాత యాభై లక్షల రూపాయల ఉదంతం...అదే సూత్రం వర్తిస్తుంది కదా... ఏసీబీ దాడి వ్యూహాత్మకంగానే ఉంటుంది. లంచం ఇచ్చే నోట్ల నంబర్లతో సహా నోట్ చేసుకుంటారు. పోటాషియం పర్మాంగనేట్ పౌడర్ని నోట్లకి అద్దుతారు. దాడి అనంతరం ఆ నోట్లు తీసుకున్న వ్యక్తి చేతుల్ని కడుగుతారు. నీళ్లు పర్పుల్ (ఉదా రంగు)లోకి మారుతాయి. కాట్ రెడ్ హ్యాండెడ్ అంటే అర్థం ఇదే. మరి రేవంత్ రెడ్డి వ్యవహారంలో 'కుట్ర దాగి ఉంది' అనే గొంతుకలు ఎందుకు వినబడుతున్నాయి. అసలు కుట్ర అంటే ఏమిటి? రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రెండు రకాలుగా విశ్లేషించే వీలుంది. ఇప్పుడు ఏం జరిగింది: తెలుగుదేశం నాయకులు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ని కదిలించారు. డబ్బులు ఆశ చూపారు. స్టీవెన్సన్ ఏసీబీని కలిశారు. ఏసీబీ ప్రణాళిక రచించింది. ఉచ్చులో రేవంత్ రెడ్డి పడ్డారు. చాలా విషయాలు...సందర్భానికి అవసరం లేని అంశాలు కూడా మాట్లాడారు. నోట్లకట్టలు అందచేసి పట్టుబడ్డారు. వీడియోలు బయటకు రాకముందు మీసం మెలేశారు. ఆ పార్టీ నాయకులు ఇంకో అడుగు ముందుకు వేసి పాపం రేవంత్...పేదవాడు. పసివాడు.. కుట్రలో బలైపోయాడు అని కెమెరా ఏడ్పులు కూడా ఏడ్చారు.. నిజంగానే టీడీపీ నిప్పులో కాల్చిన బంగారం అనుకుంటే ఏం చేసుండాల్సింది. వాళ్లు చెప్పినట్టుగానే స్టీవెన్సన్ వాళ్లని తనకు తానుగా సంప్రదించి ఉంటే ఎమ్మెల్యే లంచం అడుగుతున్నాడని తెలుసు కాబట్టి ఈ ట్రాప్ ఏదో వాళ్లే చేయించి ఉండాలి. ప్రణాళిక ప్రకారం ఉచ్చు బిగించి డబ్బులు ఇస్తూ వీడియో తీసి ఇదిగో ఇదీ స్టీవెన్సన్ నీతి అని బాహాటంగా మీడియా సమావేశం పెట్టి 'కడిగిన ముత్యం' లా ప్రపంచానికి తెలియచేసి ఉండాలి. ఇపుడు నిందితులుగా నిలబడ్డవారు గర్వంగా తలెత్తుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడం అని ఢంకా భజాయించి మరీ చెప్పే వీలుండేది. ప్రజలు కూడా ఔరా అనుకునేవాళ్లు. ప్రజాస్వామ్యం చిరునవ్వులు చిందిస్తూ ఉండేది. కానీ ఏం జరిగిందో దేశానికి తెలుసు. ఇరు రాష్ట్రాల ప్రజలకు ఇంకా బాగా తెలుసు. చంద్రబాబు...బాబుగారు...నాయుడుగారు...బాస్... ఒక టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడి నోటి వెంట ఈ పదాలు పదేపదే వస్తే ఎవరిని ఉద్దేశించి చేశారో రెండు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెపుతారు. ఆ జవాబు కోసం ఐన్‌స్టీన్ లాంటి మేధస్సు ఉండాల్సిన అవసరం లేదు. బాస్ మాత్రం మౌనం వీడరు..నీతి... నిజాయితి పుట్టింట్లో తానే మేనమామ అన్నట్టుగా మాట్లాడతారు. నా జీవితం తెరిచిన పుస్తకం అంటారు. సమస్యను పక్కదోవ పట్టించేందుకు అసందర్భ ప్రస్తావనలు ఎన్నో చేస్తారు. ఏసీబీ కేసీఆర్ జేబు సంస్థ అంటారు. ఎనిమిది సంవత్సరాల ఎనిమిదినెలల పదమూడు రోజులు ముఖ్యమంత్రిగా చేసి 12 నెలలుగా మరోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి.. ప్రభుత్వ సంస్థలు ఎలా పని చేస్తాయో తెలియనంత అమాయకుడు అనుకోవాలా! ఎన్నోసార్లు మంత్రులుగా చేసి, చేస్తున్న వ్యక్తుల మాటలు తీరు కూడా రెండు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆశ్చర్యపోయారని అనుకోవడానికి ఏమీలేదు. కాకి లెక్కలే ఆధారంగా 'శత్రువులను' జైలుగోడల మధ్య బంధించి ఉంచాలని చీకటి ప్రయాణాలు చేసి చిదంబర రహస్యాలను పంచుకొని నవ్వుకున్న వ్యక్తులకు ఇపుడేమో 'మనసు కలత చెంది' నిద్ర పట్టడం లేదట. పాపం...ప్రజాస్వామ్యం ఇలా అయిపోయిందేమోననే బెంగా? లేక రేవంత్ రవ్వంత మాట తూలినా మొదటికే మోసం వస్తుందన్న భయమా... మాట్లాడితే ట్విట్టర్, ఫేస్బుక్ కామెంట్స్‌లో ప్రతాపం చూపే ముఖ్యమైన గొంతుకలు పాపం మూగపోయాయి. ఎందుకో ప్రజలకు తెలియదా... గతంలో పేజీలకు పేజీలు నింపి గంటలకు గంటలు చర్చలు పెట్టిన కలాలకు, గొంతుకలకు పాపం ఊపిరాడుతున్నట్టు లేదు. ఎవరి ఎజెండా వారిది. ఇంకా ఎలా సమర్థించుకుంటున్నారు? ఒక టీనేజర్ అడిగిన ప్రశ్న. సమర్థించుకోవడానికి గొంతు ఉంటే చాలు...వేరే ఏమీ అక్కర్లేదు. రేవంత్ తనకు తానుగా చేశారా...బాస్ చెపితే చేశారా..? జవాబు ఏదయినా సమస్య బాస్కే. రేవంత్‌ను అలా వదిలేస్తే.. అసలే దూకుడుగా వ్యవహరించే రేవంత్ ఆ బాస్ ఎవరో చెపితే.. కొంపలంటుకోవా? పోని రేవంత్ తప్పేమీ లేదు అంటే ఆ తప్పుకు కుట్ర ఎవరిదో కూడా తెలియాలి కదా! రేవంత్...ఆయన అజ్ఞాత బాస్...ఇద్దరూ బయటకు వచ్చి చెప్పుకోలేక పోవచ్చు. కాని గుట్టు విప్పాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదే. ఈ ప్రయత్నంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైతే రేపటి నుండి వేడివేడి కొలిమిల్లోంచి నిఖార్సయిన బంగారాలు బయలుదేరుతాయి. అప్పుడు టీవీల నిండా పేపర్లనిండా రోజు నోట్లకట్టలే. ప్రజలు కూడా అలవాటు పడతారేమో!. -
రేవంత్‌రెడ్డికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు
-
రేవంత్‌కు ఉస్మానియాలో వైద్య పరీక్షలు
-
రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
-
రేవంత్‌కు ఉస్మానియాలో వైద్య పరీక్షలు
(రేవంత్‌రెడ్డికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు) గ్యాలరీ .. హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆదివారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రేవంత్ ను రోడ్ నెంబర్ 12లో ఉన్న భారీ బందోబస్తు మధ్య ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు. ఈ రోజు న్యాయమూర్తి నివాసం వద్ద ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నట్టు సమాచారం. ఇవాళ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి అనంతరం జైలుకు తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రాత్రంతా ఏసీబీ కార్యాలయంలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్ తెలిపారు. రెండు రోజుల కింద రేవంత్‌రెడ్డి నేరుగా స్టీఫెన్సన్ బంధువు ఇంటికి వచ్చి డీల్ కుదిర్చిన వ్యవహారంతో పాటు ఆదివారం ఏసీబీకి పట్టుబడక ముందు రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ జరిపిన సంభాషణ మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డయింది. -
ఎవరీ సెబాస్టియన్ హారీ!
* టీడీపీ క్రిస్టియన్ విభాగం నాయకుడు ముడుపుల డీల్‌లో రేవంత్‌తో అరెస్టు * హారీ ద్వారా ‘డీల్’కు తెర తీసింది బాబే! * ‘బాస్‌తో టచ్ ఉన్నాన’ంటూ రికార్డెడ్‌గా దొరికిన హారీ సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు అరెస్టయిన సెబాస్టియన్ హారీ టీడీపీ క్రిస్టియన్ విభాగం నాయకుడు. తనకు సన్నిహితుడైన సెబాస్టియన్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబే ఈ ముడుపుల డీల్‌కు సంబంధించి స్వయంగా తెరవెనుక మంత్రాంగం నడిపినట్లు భావిస్తున్నారు. తాను రేవంత్‌రెడ్డితోనే కాకుండా బాస్ (చంద్రబాబు)తో కూడా టచ్‌లో ఉన్నట్లు సెబాస్టియన్ పేర్కొనడం రహస్య కెమెరాలో రికార్డయిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతను రెండు పర్యాయాలు రేవంత్‌తో పాటు స్టీఫెన్సన్ వద్దకు వెళ్లాడు. ఆదివారం కూడా డబ్బులతో పాటు స్టీఫన్సన్ వద్దకు వెళ్లాడు. ఈ వ్యవహారంలో హారీయే మధ్యవర్తి అని, ఆయనను ప్రశ్నిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి ఆయనను నిందితుడిగా, లేదా సాక్షిగా చేస్తామని పేర్కొన్నాయి. జిమ్మి, మత్తయ్య అనే రెండుపేర్లు కూడా సంభాషణల్లో బయటపడ్డాయని, వారెవరనేది పరిశీలించి, వారిని కూడా విచారిస్తామని తెలిపాయి. మరోవైపు, స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన సందర్భంగా రేవంత్ తనకు వచ్చిన ఒక ఫోన్ కాల్‌కు బదులిచ్చారని ఏసీబీ అధికారులు తెలిపారు. దాని ఆధారంగా, ఆయన ఏ మొబైల్ టవర్ లొకేషన్లో ఉన్నారో కూడా స్పష్టమైందని వివరించారు. ఈ వ్యవహారంలో ఇది కూడా సాక్ష్యంగా మారనుందని వారు చెబుతున్నారు. దీంతోపాటు రేవంత్ కాల్‌డేటా రికార్డులను కూడా ఈ వ్యవహారంలో సాక్ష్యంగా ఏసీబీ ఉపయోగించుకోనుంది. స్టీఫెన్సన్కు డబ్బులిచ్చిన సందర్భంగా రేవంత్ అక్కడ ఒక గ్లాస్ మంచినీళ్లు తాగారు. ఆ గ్లాస్‌పై పడిన రేవంత్ వేలిముద్రలను కూడా సాక్ష్యంగా ఏసీబీ సేకరించింది. ఇవన్నీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తాయని ఏసీబీ అధికారులు చె బుతున్నారు. -
రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
మీడియాతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీఫెన్సన్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి ట్రాప్ చేసినట్లు తెలిపారు. ‘‘రేవంత్‌రెడ్డి ప్రలోభపెడుతున్నారంటూ మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీతో విచారణకు ఆదేశించాం. ఆదివారం రేవంత్ రూ.50 లక్షలు స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డారు. రేవంత్‌తో పాటు, డబ్బు లు తెచ్చిన బిషప్ సెబాస్టియన్ హరి, ఉదయ్‌సింహలను అదుపులోకి తీసుకున్నాం. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్ 120డి, 34 (లంచం ఇవ్వజూపడం, మూకుమ్మడిగా ప్రలోభానికి గురిచేయడం) కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశాం. వీరితోపాటు, ఇంతకు ముందు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఈ డీల్ గురించి మాట్లాడిన మాథ్యూస్ జెరూసలం అనే వ్యక్తిపైనా కేసు నమోదు చేశాం. అతను మా అదుపులో లేడు. రూ.50 లక్షలు కూడా రికవరీ చే శాం’’ అని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పంపిస్తేనే వచ్చానన్న రేవంత్ వ్యాఖ్యలపై విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ‘‘సాక్షాలన్నీ దొరికాయి. వాటిని, ప్రాథమిక ఆధారాలను పరిశీలించాకే కేసు నమోదు చేశాం. విచారణ అనంతరం రేవంత్‌ను జడ్జి ముందు ప్రవేశపెడతాం’’ అని వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఎక్కడినుంచి వచ్చిందనేది కూడా విచారణలో తెలుస్తుందన్నారు. డీజీపీని కలిసిన టీడీపీ నేతలు: రేవంత్ అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి తదితరులు డీజీపీ అనురాగ్‌శర్మను కలిశారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ను చంపే కుట్ర జరుగుతోందని, కావాలనే కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశారు. కాగా చంద్రబాబు అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. -
మూడు దశాబ్దాల తర్వాత.. అవినీతి కేసులో టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడటం సంచలనం రేపింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 1984లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కార్మికశాఖ మంత్రి ఎన్.రామచంద్రారావు ఒక పారిశ్రామికవేత్త నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. స్వయంగా ఎన్టీఆరే పథకం ప్రకారం ఆయన్ను పట్టించి ఆ మర్నాడే మంత్రివర్గం నుంచి ఆయనకు ఉద్వాసన పలికారు.