ఓటుకు కోట్లు వ్యవహారంలో మొదటి విడతగా చెల్లించిన రూ.50 లక్షల నోట్లకట్టల్లో దొంగనోట్లున్నాయా? తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు చెల్లిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. అందులో కొన్ని దొంగ నోట్లు ఉన్నట్టు తేలిందని తెలిసింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? ఐటీ లెక్కలున్నాయా? వంటి వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేస్తోంది.