note for votes
-
రేవంత్‌కు హైకోర్టులో ఊరట
‘ఓటుకు కోట్లు’ కేసులో బెయిల్ షరతులను సడలించిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు సమయంలో విధించిన పలు షరతులను హైకో ర్టు మంగళవారం సడలించింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని... ‘ఓటుకు కోట్లు’ కేసు గురిం చి మీడియాతో మాట్లాడరాదని రేవంత్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని.. రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌కు జూన్ 30న హైకోర్టు షరతులతో కూడిన బెయిలిచ్చింది. రూ.5లక్షల చొప్పున పూచీకత్తులతో పాటు, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కొడంగల్ నియోజకవర్గం దాటి బయటకు రావద్దని ఆదేశించింది. అయితే త్వరలో తన కుమార్తె వివాహం ఉందని, అలాగే ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తన బెయిల్ షరతులను సడలించాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యా యమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం విచారణ జరిపారు. రేవంత్ తరఫున సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదన వినిపిస్తూ... ఓటు కు కోట్లు కేసులో దర్యాప్తు పూర్తైదని, పోలీసు లు చార్జిషీట్ కూడా దాఖలు చేశారని కోర్టుకు నివేదించారు. రేవంత్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించారని, బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. వైద్యపరీక్షల నిమిత్తం తరచూ హైదరాబాద్ రావా ల్సి ఉన్నందున బెయిల్ షరతులను సడలించాలని కోరారు. అనంతరం ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రవికిరణ్‌రావు వాదనలు వినిపిస్తూ... బెయిల్ షరతులను సడలిస్తే దాని ప్రభావం దర్యాప్తుపై ఉంటుందన్నారు. రేవంత్ గతం లో ఎన్నడూ ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించలేదన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... ‘ఇప్పుడే వచ్చినట్లున్నాయిలే’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. -
ఈసీ చేతికి ఓటుకు కోట్లు ఆడియో, వీడియో
ప్రత్యేక కోర్టు నుంచి రికార్డులు తీసుకున్న ఈసీ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో భాగంగా ఏసీబీ రికార్డు చేసిన ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ల నకలు కాపీలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులకు అందాయి. తమకు ఈ ఆడియో, వీడియో రికార్డులను ఇవ్వాలని కోరుతూ ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ మేరకు వారికి హార్డ్‌డిస్క్‌లు ఇచ్చేందుకు అనుమతించారు. కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు నిందితులుగా ఉండడంతోతోపాటు, పలువురు ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను పరిశీలించాలని ఈసీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కోసం రూ.5 కోట్లు ఇస్తామంటూ రేవంత్‌రెడ్డి ప్రలోభపెట్టడం, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇవ్వడంతోపాటు ఇవన్నీ మా పార్టీ అధినేత ఆదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పడం తదితర అంశాలను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే కోర్టు నుంచి తీసుకోగా...తాజా ఆడియో, వీడియో రికార్డులను కూడా తీసుకున్నారు. అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు, సంబంధం ఉన్న ఇతర చట్టసభల ప్రతినిధులపై ఎన్నికల చట్టాల కింద ఎన్నికల సంఘం క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?
-
ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?
ఆ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో మొదటి విడతగా చెల్లించిన రూ.50 లక్షల నోట్లకట్టల్లో దొంగనోట్లున్నాయా? తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు చెల్లిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. అందులో కొన్ని దొంగ నోట్లు ఉన్నట్టు తేలిందని తెలిసింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? ఐటీ లెక్కలున్నాయా? వంటి వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేస్తోంది. ఈ కేసు విచారణలో ఆ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేశారా? లేక ఎవరైనా పారిశ్రామిక వేత్త నుంచి తెచ్చారా? అన్న విషయంపై ఆరా తీసిన తర్వాత ఏసీబీ ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలిపే అవకాశాలున్నాయి. అయితే వాటిని లెక్కించిన అధికారులు అందులో దొంగనోట్లు ఉన్నాయని తెలియడంతో ఇప్పు డు దానిపైనా దృష్టి సారించినట్టు అధికారవర్గాల సమాచారం. కాగా గతంలో ఏపీ సీఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒకరు దొంగ నోట్ల కేసులో పట్టుబడిన ఉదంతం నేపథ్యంలో వ్యవహారం ఎటు మళ్లుతుందోనని చర్చ జరుగుతోంది.