రేవంత్‌కు హైకోర్టులో ఊరట | High court to relief of revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు హైకోర్టులో ఊరట

Published Wed, Sep 9 2015 1:50 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

రేవంత్‌కు హైకోర్టులో ఊరట - Sakshi

రేవంత్‌కు హైకోర్టులో ఊరట

‘ఓటుకు కోట్లు’ కేసులో బెయిల్ షరతులను సడలించిన న్యాయస్థానం
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు సమయంలో విధించిన పలు షరతులను హైకో ర్టు మంగళవారం సడలించింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని... ‘ఓటుకు కోట్లు’ కేసు గురిం చి మీడియాతో మాట్లాడరాదని రేవంత్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీచేశారు.
 
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని.. రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌కు జూన్ 30న హైకోర్టు షరతులతో కూడిన బెయిలిచ్చింది. రూ.5లక్షల చొప్పున పూచీకత్తులతో పాటు, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కొడంగల్ నియోజకవర్గం దాటి బయటకు రావద్దని ఆదేశించింది.
 
  అయితే త్వరలో తన కుమార్తె వివాహం ఉందని, అలాగే ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తన బెయిల్ షరతులను సడలించాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యా యమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం విచారణ జరిపారు. రేవంత్ తరఫున సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదన వినిపిస్తూ... ఓటు కు కోట్లు కేసులో దర్యాప్తు పూర్తైదని, పోలీసు లు చార్జిషీట్ కూడా దాఖలు చేశారని కోర్టుకు నివేదించారు.

రేవంత్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించారని, బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. వైద్యపరీక్షల నిమిత్తం తరచూ హైదరాబాద్ రావా ల్సి ఉన్నందున బెయిల్ షరతులను సడలించాలని కోరారు. అనంతరం ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రవికిరణ్‌రావు వాదనలు వినిపిస్తూ... బెయిల్ షరతులను సడలిస్తే దాని ప్రభావం దర్యాప్తుపై ఉంటుందన్నారు. రేవంత్ గతం లో ఎన్నడూ ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించలేదన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... ‘ఇప్పుడే వచ్చినట్లున్నాయిలే’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement