
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో 15 ఎకరాల భూమిని మై హోం కన్‌స్ట్రక్షన్స్, మై హోం ఇండస్ట్రీస్, పీఆర్ ఎనర్జీ హోల్డింగ్ లిమిటెడ్‌లకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
కేటాయింపులు నిబంధనలకు, ఐటీ పాలసీకి విరుద్ధంగా జరిగాయని, కాబట్టి ఈ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తయ్యేదాకా ఈ పదెకరాలపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాస నం ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరపనుంది.