
రేవంత్‌కు ఉస్మానియాలో వైద్య పరీక్షలు
(రేవంత్‌రెడ్డికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు) గ్యాలరీ ..
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆదివారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రేవంత్ ను రోడ్ నెంబర్ 12లో ఉన్న భారీ బందోబస్తు మధ్య ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు. ఈ రోజు న్యాయమూర్తి నివాసం వద్ద ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నట్టు సమాచారం. ఇవాళ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి అనంతరం జైలుకు తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రాత్రంతా ఏసీబీ కార్యాలయంలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్ తెలిపారు. రెండు రోజుల కింద రేవంత్‌రెడ్డి నేరుగా స్టీఫెన్‌సన్ బంధువు ఇంటికి వచ్చి డీల్ కుదిర్చిన వ్యవహారంతో పాటు ఆదివారం ఏసీబీకి పట్టుబడక ముందు రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ జరిపిన సంభాషణ మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డయింది.