హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు | Mirza Riyaz Ul Hassan Effendi Is Mim Mlc Candidate For Hyderabad Local Body | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

Published Fri, Apr 4 2025 2:59 PM | Last Updated on Fri, Apr 4 2025 4:12 PM

Mirza Riyaz Ul Hassan Effendi Is Mim Mlc Candidate For Hyderabad Local Body

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్‌ ఎఫెండ్‌ను ఆ పార్టీ ఖరారు చేసింది. 2009లో నూర్ ఖాన్ బజార్, 2016లో డబిర్ పురా కార్పొరేటర్‌గా ఆయన గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది. 2023లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తవ్వగా..  తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది.

కాగా, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరపున ఎన్ గౌతంరావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.

బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో రెండు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్ణయించాయి. కాంగ్రెస్‌ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్‌తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.  25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement