Hyderabad
-
యాదాద్రిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు సమాచారం. కార్మికుల మరణంపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉండగా.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం,సాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార కాంగ్రెస్‌లో చర్చాంశనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ కరువైంది. దమ్మపేట మండలం పూసికుంటలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అవమానం జరిగింది.కోట్లాది రూపాయల పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఆహ్వానం అందలేదు. అధికారులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఆహ్వానం అందకపోయినా కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సమక్షంలో అధికారుల తీరుపై జారే మండిపడ్డారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎమ్మెల్యే చచ్చిపోయాడనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శంకుస్థాపన నిలిపివేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..ఎమ్మెల్యే జారె ఆదినారాయణను సముదాయించేందుకు తన కారులోకి తీసుకెళ్లారు. ఎలాగోలా సముదాయించి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో శంకుస్థాపన చేయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే జారె వర్గీయులు వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. -
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐపీఎస్‌లు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వ్యవహారంలో (Bhoodan Land Issue) కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 26 మంది ఆఫీసర్లకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ నెల 24న సింగిల్ బెంచ్ జస్టిస్ భాస్కర్‌రెడ్డి తీర్పు వెల్లడించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్‌లు అప్పీల్ చేశారు. మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది.తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్‌కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు.ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గత గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్‌పై విచారణ జరిపించాలని మహేశ్ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు.కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్ ప్రొసీడింగ్‌లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్‌కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు.అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్ పాస్‌బుక్‌లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్‌కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్ నోటీసులు పంపారు.క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్‌బుక్‌లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేశారు. -
మహిళా కార్పొరేటర్‌పై హనీమూన్ వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పోలీసులలతో పాటు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ ఫిర్యాదుతో Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశంపై వివరణ, విచారణకు హాజరవ్వాలంటూ మహిళా కమిషన్ సైతం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం, ఎమ్మెల్యే సుధీరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరోజు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు అడిగారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాను. కావాలని నాపై రాజకీయ కక్షతో పిర్యాదు చేశారు. ఈ అంశంపై లీగల్‌గా ఫైట్ చేస్తాను’అని వ్యాఖ్యానించారు.వివాదం నేపథ్యం ఇదే గత నెలలో ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే..కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు.దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..పీఎస్‌కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు.వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్‌కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు.ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. -
హైదరాబాద్‌లో విషాదం.. రీల్స్ పిచ్చి.. ప్రాణాలు తీసింది
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. జవహర్‌నగర్‌లో రీల్స్ చేస్తూ తరుణ్(17) అనే యువకుడు క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. రీల్స్ ప్రభావంతో తరుణ్ తన ఆరుగురి స్నేహితులతో కలిసి ఓ క్వారీ దగ్గర ఫోటో షూట్ చేస్తుండగా ఈ విషాదం జరిగింది. స్నేహితులతో ఈత కొడుతూ ఫొటోలు దిగుతూ లోతును గమనించకపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా, కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. -
నిధుల సమీకరణకు ఫ్యాషన్ షో..
గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్కు హోటల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్‌లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ స్నేహల్‌తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతులో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్ అని పేర్కొన్నారు. ఉమంగ్ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్‌వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు. (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
GHMC: పది నెలలు.. నలుగురు కమిషనర్లు!
రాజధాని నగరంగా..తెలంగాణకు తలమానికంగా కీలకపాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మహానగరంపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోందా..అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. మహానగరాభివృద్ధిలో కీలకమైన జీహెచ్ఎంసీ నిర్వహణ తీరునే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. తరచుగా కమిషనర్లను మార్చడం..అభివృద్ధి పనులు నిలిచిపోవడం..నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీ నిరీ్వర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బహుశా..ఎలాగూ రెండో, అంతకంటే ఎక్కువో కార్పొరేషన్లు చేసే యోచనలో ఉన్నందున కాబోలు ప్రభుత్వం జీహెచ్ఎంసీపై పెద్దగా శ్రద్ధ చూపుతున్నట్లు లేదు. పది నెలల వ్యవధిలోనే నలుగురు కమిషనర్లు రావడం అందుకు నిదర్శనమంటున్నారు జీహెచ్ఎంసీ గురించి తెలిసిన వారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికి కమిషనర్‌గా ఉన్న రోనాల్డ్‌రాస్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ముగ్గురు కమిషనర్లు మారారు. గత సంవత్సరం ఆగస్ట్‌లో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సి రావడంతో, అక్టోబర్‌లో అదనపు కమిషనర్‌గా నియమించిన ఇలంబర్తిని నవంబర్ 14 నుంచి రెగ్యులర్ కమిషనర్‌గా నియమించారు. ఐదు నెలల్లోనే ఆయన్ను బదిలీ చేసి ఆర్వీ కర్ణన్‌ను తాజాగా నియమించారు. కారణాలేవైనా తరచూ కమిషనర్లు మారుతుండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలో ఆరువేల మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులున్నారు. ఔట్సోర్సింగ్, ఇతరత్రా వెరసి 30 వేల మంది వరకున్నారు. ఇంతపెద్ద వ్యవస్థను అర్థం చేసుకోవడానికే కనీసం ఆర్నెళ్లు పడుతుంది. ఆలోగానే మారిస్తే..కొత్తగా వచ్చేవారికి అదే పరిస్థితి ఎదురవుతుంది. తనదైన శైలితో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయిన ఇలంబర్తి.. గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో కావచ్చు పాలనలో లోపాల్ని, ఇష్టారీతిన జరుగుతున్న వ్యవహారాల్ని, పెచ్చరిల్లిన అవినీతిని అడ్డుకునేందుకు నిశ్శబ్దంగానే పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు.. సంస్థ ఆస్తులెన్నో తెలియని దిక్కుమాలిన స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీని చక్కదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతతో అంగుళం కూడా తేడా రాకుండా జీహెచ్ఎంసీ ఆస్తుల్ని గుర్తించే పనుల్ని చేపట్టారు. ఇంజినీరింగ్ పనుల్లో, కాంట్టాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో లోపాలకు అడ్డుకట్ట వేశారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లలో అవకతవకల నివారణకు చర్యలు చేపట్టారు. స్ట్రీట్‌లైట్స్, సీఆర్ఎంపీ పనుల్లో అడ్డగోలు చెల్లింపులను గుర్తించి కట్టడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. అవన్నీ గాడిన పడి ఒక దశకు రాకముందే ఆయన్ను బదిలీ చేయడంతో..కొత్త కమిషనర్‌కు పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. వదలరు.. కదలరు సుదీర్గకాలంగా జీహెచ్ఎంసీలో పాతుకుపోయిన వారి కొందరి ఆట కట్టించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.రిటైరయ్యాక సైతం జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారందరినీ పంపించాలని,ఒకవేళ వారి సేవలు నిజంగా అవసరమైతే అందుకు కారణాలు తెలపాలని,ప్రభుత్వం అనుమతించాక తిరిగి కొనసాగించాలని గత నెలలో ప్రభుత్వం సూచించినప్పటికీ, జీహెచ్ఎంసీలో మాత్రం ఎక్కడి వారక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవై మంది సేవలు మళ్లీ అవసరమని కోరినప్పటికీ, ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే వారు కొనసాగుతూనే ఉన్నారు. మిగతా ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటి వారు కొనసాగుతుండగా, జీహెచ్ఎంసీలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. అలా కొనసాగుతున్న వారిలో కొందరు జీహెచ్ఎంసీకి పనులు చేయడం కంటే, జీహెచ్ఎంసీని అడ్డుపెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం సాగిస్తున్న ‘ప్రైవేట్’ దందానే ఎక్కువని జీహెచ్ఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పుడిప్పుడే.. ఇలంబర్తి చేపట్టిన కొన్ని చర్యలు తొలుత అర్థం కాకపోయినప్పటికీ, కనిపిస్తున్న ఫలితాలతో జీహెచ్ఎంసీ మెరుగవుతోందనుకుంటున్న తరుణంలో బదిలీ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. రోనాల్డ్‌రాస్, ఆమ్రపాలి సైతం జీహెచ్ఎంసీని అర్థం చేసుకొని, గాడిలో పెట్టే తరుణంలోనే జీహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి అప్పట్లో వారిని పంపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేకున్నా ఇలంబర్తి బదిలీతో జీహెచ్ఎంసీ పరిస్థితి ఏం కానుందో వేచి చూడాల్సిందే ! -
హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో
హైదరాబాద్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన 'బిర్లా ఓపస్ పెయింట్స్'.. ఈరోజు హైదరాబాద్‌లో తన బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను (కంపెనీ యాజమాన్యంలోని కంపెనీ ఆపరేటెడ్ ఎక్స్పీరియన్స్ స్టోర్) ప్రారంభించామని ప్రకటించింది. గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరులో ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించిన అనంతరం, పెయింట్, డెకర్ పరిశ్రమను ఆవిష్కరణ, ప్రీమియం ఆఫర్లు, నిజంగా లీనమయ్యే కస్టమర్ అనుభవం ద్వారా మార్చాలనే బ్రాండ్ నిబద్ధతను ఈ విస్తరణ మరింత బలోపేతం చేస్తుంది.బిర్లా ఓపస్ పెయింట్స్ హైదరాబాద్ స్టూడియో సాధారణ రిటైల్ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకమైన, లీనమయ్యే అనుభవంగా మార్చడానికి ఆలోచనాత్మకంగా రూపొందించారు. ఈ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ దుకాణాలకు అతీతంగా సృజనాత్మకతకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కేంద్రం. ఇది వినియోగదారుల సృజనాత్మకతను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, నిజ జీవిత వాతావరణంలో రంగులను తాకడానికి, అనుభూతి చెందడానికి మరియు ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది.వినియోగదారుల వ్యక్తిగతీకరించిన గైడ్ ద్వారా షేడ్ ఎంపిక, టెక్చర్లు, వినియోగించే నైపుణ్యాలపై నిపుణుల నుంచి ఉచిత మార్గదర్శకత్వాన్ని కూడా పొందవచ్చు. అధునాతన విజువలైజేషన్ సాధనాలు ఇంటి యజమానులు వారు ఎంచుకున్న రంగులు నిజ జీవిత సెట్టింగ్‌లలో ఎలా కనిపిస్తాయో ముందస్తుగా వీక్షించేందుకు సహాయపడతాయి. పెయింట్లకు మించి, పెయింట్ స్టూడియో వాల్కవరింగ్లు, డిజైనర్ ఫినిషింగ్‌లు మరియు సమగ్ర డెకర్ సొల్యూషన్ కోసం స్పెషాలిటీ కోటింగ్ ఎంపికలను కూడా కలిగి ఉంది.ఈ స్టోర్ 170 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, రంగుల ఎంపికపై నిపుణుల సంప్రదింపులు, వినూత్న అప్లికేషన్ టెక్నిక్‌లు, గొప్ప స్థానిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన క్యూరేటెడ్ డెకర్ సొల్యూషన్లతో సహా పలు ప్రత్యేక సేవలను అందిస్తుంది. ఇది స్థానిక అభిరుచులు, వారసత్వానికి అనుగుణమైన ఎంపికలతో శక్తివంతమైన నగర స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రత్యేకమైన షేడ్స్‌ను క్యూరేటెడ్ డెకర్ ప్యాకేజీలను అందిస్తుంది.దేశ వ్యాప్తంగా.. తన రిటైల్ పాదముద్రను విస్తరించే లక్ష్యంతో బిర్లా ఓపస్ పెయింట్స్ వృద్ధి వ్యూహంలో ఈ ప్రారంభం కూడా ఒక ముఖ్యమైన అడుగు. అనుభవపూర్వక రిటైల్‌పై దృష్టి సారించి, రాబోయే నెలల్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్ మరియు సూరత్‌లలో అదనపు అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “హైదరాబాద్‌లోని మా కొత్త పెయింట్ స్టూడియో కేవలం రిటైల్ స్థలం మాత్రమే కాదు, ఇది మీ పెయింటింగ్ అవసరాలకు ఒక అనుభవ కేంద్రం. అత్యాధునిక సాంకేతికత నుంచి స్థానికంగా ప్రేరణ పొందిన షేడ్ ప్యాలెట్ల వరకు, వినియోగదారులు, నిపుణులు అన్వేషించేందుకు, ప్రయోగాలు చేయడానికి, వ్యక్తీకరించడానికి మేము ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాము. భారతదేశం పెయింట్లతో నిమగ్నమయ్యే విధానాన్ని మార్చడానికి, పెయింటింగ్ ప్రయాణాన్ని మరింత వ్యక్తిగతీకరించేందుకు, లీనమయ్యేలా.. స్ఫూర్తిదాయకంగా మార్చడానికి మా నిబద్ధతను ఈ స్టూడియో ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు. -
అందమైన పక్షులను వీక్షించాలనుకునే పిల్లలకోసం ఎర్లీబర్డ్ వర్క్‌షాప్
భారతీయులలో పక్షులను వీక్షించడం అనేది అభిరుచిగా అభివృద్ధి చెందుతోంది. అయితే, ఆ అనుభవాన్ని మరింత అందంగా ఆనందకరమైన అనుభవంగా మిగిల్చేందుకు ఎర్లీ బర్డ్ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎర్లీ బర్డ్ ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది.తద్వారా పక్షుల ప్రపంచంలోకి చిన్నారులు మరింత డీప్‌గా వెళ్లేందుకు ,ఇతర జీవరాశులను నిశితంగా గమనించే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎర్లీ బర్డ్ ప్రకటించింది. ఈ వర్క్‌షాప్‌ను ఆన్లైన్లో అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ బర్డ్ లవర్స్ చేరాలని ఆశిస్తోంది.మే 11 నుండి జూన్ 8 వరకు జరిగే 6వ ఎడిషన్ నిర్వహిస్తున్నట్టు ఎర్లీ బర్డ్ తెలిపింది. యంగ్ బర్డర్స్ వర్క్‌షాప్ 2021లో ఆన్లైన్ వర్క్‌షాప్‌గా ప్రారంభమైందనీ,అప్పటి నుండి ఈ ఫార్మాట్లో కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటివరకు, దాదాపు 200 మంది పిల్లలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.ఈ వర్క్‌షాప్ 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ పక్షి పరిశీలకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది 4 వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ రూపంలో ఉంటుంది. ప్రతి వారం, పాల్గొనేవారు పక్షులకు సంబంధించిన విభిన్న ఇతివృత్తాలను అన్వేషిస్తారు. ఈ సెషన్లు పూర్తిగా ఆన్లైన్లో ఉంటాయి .మల్టీమీడియా, గైడెడ్ ఇంటరాక్షన్లు, ఉల్లాసమైన చర్చలు , కార్యకలాపాల మిళితంగా ఈ వర్క్‌షాప్ ఉండనుంది.పక్షుల గురించి లోతైన పరిశీలనలను సులభతరం చేయడానికి సంబంధించిన కథనాలు అందిస్తుంది. ఇందులో పాల్గొనేవారు తమ ఇళ్ల చుట్టూ ఉన్న పచ్చని ప్రదేశాలను స్వతంత్రంగా అన్వేషించడంలో సహాయపడతాయి. ఇది వారి వేసవి సెలవుల్లో అద్భుతమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. వారపు ప్రత్యక్ష సెషన్లు వరుసగా వారాంతాల్లో ఆన్లైన్లో అందిస్తాయిరు. ప్రతి ఒక్కటి ఎంచుకున్న థీమ్ గురించి నేర్చుకున్న విషయాలను తిరిగి పొందడమే కాకుండా పాల్గొనేవారు స్వయంగా కొనసాగించగల కొత్త కార్యకలాపాలను కూడా పంచుకునే ఇలస్ట్రేటెడ్ యాక్టివిటీ షీట్‌తో ఉంటాయి.ఈ వర్క్‌షాప్ పాల్గొనేవారు ఎప్పుడూ గమనించిన, తమ ఇళ్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిజంగా తెలుసుకోవడానికి అనుమతిస్తుందని నిర్వహికులు తెలిపారు. వర్క్‌షాప్‌కు హాజరు కావడానికి ఉచితం. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టిసిపెంట్స్, మెటీరియల్‌కు సంబంధించి రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. https://bit.ly/ybw_2025 అనేలింక్ ద్వారా వర్క్‌షాప్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యావేత్తలు, తల్లిదండ్రులు , ప్రకృతి ఔత్సాహికులు ఎవరైనా వారి వారి ప్రాంతాలలోని పిల్లల కోసం ఇలాంటి వర్క్‌షాప్‌ను నిర్వహించడానికి ఆసక్తి ఉన్నవారికి, తాము'యంగ్ బర్డర్స్ కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. ఈ ఉచిత గైడ్ https://early-bird.in/ybw-guideను ఎర్లీ బర్డ్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎర్లీ బర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎర్లీ బర్డ్ఎర్లీ బర్డ్ అనేది పిల్లలను పక్షులు , ప్రకృతికి దగ్గరగా తీసుకురావాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF)లో ఒక భాగం. -
ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు
సనత్‌నగర్: వేసవి సెలవుల జోష్ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్‌లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! ఎప్పటిలాగానే అమీర్‌పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. క్రికెట్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి తెలిపారు. వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10 ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్.జీహెచ్ఎంసీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. స్కేటింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: పవన్‌కుమార్ ఫోన్: 98665 13604 బాక్సింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: ప్రకాశ్ ఫోన్: 93907 65412 జిమ్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.200, కోచ్: విక్రమ్ ఫోన్: 91772 85745 బ్యాడ్మింటన్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: సురేష్ ఫోన్: 99498 14362 హాకీవేదిక: అమీర్‌పేట్ క్రీడామైదానం ఫీజు: రూ.10, కోచ్: దర్శన్‌సింగ్ , ఫోన్: 98497 21703 కరాటే వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: బాబు, ఫోన్: 96181 33057జిమ్నాస్టిక్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మహేష్ ఫోన్: 90002 77716 యోగా వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మనోజ్ ఫోన్: 99639 78509 హ్యాండ్‌బాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.10, కోచ్: ఇమ్రాన్‌ఖాన్ ఫోన్: 91772 39786 బాస్కెట్‌బాల్ వేదిక: సనత్‌నగర్ ఎస్ఆర్టీకాలనీ ఇమ్మానుయేల్ చర్చి సమీపంలోని గ్రౌండ్ ఫీజు: రూ.10 కోచ్: నయిముద్దీన్, ఫోన్: 98483 96922వాలీబాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఫీజు: రూ.10, కోచ్: చిన్ని, పెద్ది ఫోన్ :99599 51499 క్రికెట్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.100, కోచ్: రాజ్‌కిరణ్ ఫోన్: 97041 59549 ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..! -
Himayat Nagar: పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో దారుణ హత్య
హైదరాబాద్,సాక్షి: హిమాయత్ నగర్లో దారుణం జరిగింది. దోమలగూడా పీఎస్ పరిధిలో హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు బాధితుణ్ని హత్య చేశారు. అనంతరం, బ్యాంకు లిఫ్ట్‌లో పడేసి వెళ్లారు. హత్యపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాల్ని సేకరిస్తున్నారు. -
పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాతబస్తీలోని పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. తెలంగాణలో భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భూదాన్ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపారు. దాదాపు వంద ఎకరాల భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి.. పాతబస్తీలో మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, శర్పాన్, సుకుర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమాయ్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. -
సాహసం చేద్దాం బ్రదర్..! ఈ సమ్మర్లో చూడాల్సిన బెస్ట్ అడ్వెంచర్ స్పాట్స్..
వేసవి సెలవులను ఎంజాయ్ చేయడంలో ఇప్పుడు అడ్వెంచర్స్ కూడా భాగమవుతున్నాయి. గతంలో ఈ తరహా సాహస వినోదాల కోసం విహార యాత్రలకు వెళ్లినప్పుడు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు నగరం నుంచి కేవలం 30కి.మీ నుంచి 200 కి.మీ పరిధిలోనే పలు రకాల అడ్వెంచర్ స్పాట్స్ సాహసికులను, ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్లో కాసింత ఉత్కంఠ, మరి కాసింత ఉద్వేగవంతమైన అనుభూతిని పొందేందుకు వినోదాన్ని మేళవించిన అనుభవాలను పొందాలనుకుంటే.. కచ్చితంగా ఇలాంటి వారి కోసమే అన్నట్లు పలు స్పాట్స్ ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ సాహసాలు ఏవైనా అవగాహన పెంచుకుని, ముందస్తు శిక్షణ తీసుకున్న అనంతరమే ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. మన దేశంలో తొలిదశలో ఉన్న సాహసికులను ఆకర్షించేది అడ్వెంచర్ పారా గ్లైడింగ్ దాదాపు 4 దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ క్రీడా వినోదానికి బాగా ఆదరణ పెరిగింది. వందల/వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తూ ఓ గ్లైడర్/ కనోపి సాయంతో గాల్లో ఎగరడం ఒక అద్భుతమైన అనుభూతి. దీనిని ఎంజాయ్ చేయాలంటే.. నగరం నుంచి ఓ 50 కిమీ ప్రయాణించాలి. షామీర్పేట్, తుర్కపల్లి దగ్గర ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో ఈ అడ్వెంచర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు.హైలెస్సో.. హైలెస్సా అంటూ నదిలో బోట్లు నడిపే కయాకింగ్ సాహసాలందు ఓ గొప్ప అనుభూతిని పంచుతుందంటున్నారు సాహసికులు. నీళ్లలో పడవను స్వయంగా నడుపుకుంటూ వైవిధ్యభరిత అనుభూతిని అందుకోవాలనునే వారిని.. సుమారు 100 కి.మీ.దూరంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ ఆహ్వానిస్తోంది. నీళ్లలో పడవల యానం.. మొదటిసారిగా ప్రయతి్నస్తున్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుభవజు్ఞలైన వారికి మరింత ఆస్వాదించదగిన అనుభవం. గుహల అన్వేషణ.. హిమాలయాల కంటే పాతవైన ఈ పర్వత సమూహాల్లో గుహల అన్వేషణకు పాండవుల గుట్ట ప్రత్యేక చిరునామా. అక్కడ జంతువులు, పురాతన చిహ్నాలతో కూడిన ప్యాలియోలిథిక్ రాక్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. నగరం నుంచి సుమారు 195 కిమీ దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుట్టలో గుహలను శోధించడం.. ఓ సాహసం మాత్రమే కాదు చరిత్రను గుర్తుచేసుకోవడం కూడా. దీనిని సాహసాలను ఇష్టపడేవారి వారాంతపు వినోదానికి సరైన ఎంపిక అనవచ్చు. డర్ట్ బైక్.. ఏటీవీ రైడ్స్.. ఆఫ్–రోడ్ థ్రిల్ కోరుకునే వారికి నగరం నుంచి 85 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ సరైన అడ్రెస్ అని చెప్పాలి. అక్కడ అడ్వెంచర్ చేయడానికి డర్ట్ బైకులు మాత్రమే కాదు ఏటీవీ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొండలు, చెట్లు రాళ్లు రప్పల నడుమ ప్రత్యేకంగా రూపుదిద్దిన రేసింగ్ ట్రాక్‌పై చేసే డర్ట్ బైక్స్, ఏటీవీ రైడ్స్ సాహసికులకు థ్రిల్‌ని అందిస్తాయి. జిప్ లైనింగ్.. నగరం నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ఘట్కేసర్ దగ్గరలోని పెబుల్ బీచ్ అడ్వెంచర్ క్లబ్లో జిప్ లైనింగ్ ట్రిప్‌లు ఉన్నాయి. వీటిని పిల్లలకూ, పెద్దలకూ సరిపోయేలా రూపుదిద్దారు. ఇంకా నగరం చుట్టు పక్కల బ్యాలెన్స్వాక్, ఫారెస్ట్ క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. లతో పాటు మరిన్న వైవిధ్యభరిత సాహస వినోదాలు అందుబాటులో ఉన్నాయి. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీటిని ఎంజాయ్ చేస్తే చక్కని సమ్మర్ అనుభూతిని అందుకోవచ్చు. రాప్పెలింగ్.. స్కై సైక్లింగ్.. ఓ వీకెండ్‌ను వైవిధ్యభరితంగా, ఉద్విగ్నంగా గడపాలంటే స్కై సైక్లింగ్ మరో మంచి ఎంపిక. ఇది నగరం నుంచి 105కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు దగ్గర అందుబాటులో ఉంది. ఈ స్కై సైక్లింగ్ చేస్తూ ఆ చెరువు అందాలను, పరిసర ప్రదేశాల్లో అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. రాక్ క్లైంబింగ్.. తెలంగాణలో అనేక కొండలు, గుట్టలు రాక్ క్లైంబింగ్‌కు ప్రసిద్ధి చెందాయి. అయితే భువనగిరి కోట ప్రత్యేక శైలి నిర్మాణం రాక్ క్లైంబింగ్ సాహసానికి చారిత్రాత్మక ఆకర్షణను అందిస్తుంది. ఇది నగరం నుంచి దాదాపు 105 కిమీ దూరంలో ఉంది.బంగీ జంపింగ్.. ఇప్పటికే చాలా సినిమాల్లోనూ, బయటా స్టార్స్ చేయగా చూసి ఉంటారు. అలాంటి బంగీ జంపింగ్ నగరవాసులకు కూడా చేరువలోకి తెచ్చింది లియోనియా రిసార్ట్. నగరం నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ రిసార్ట్‌కు వెళితే ఈసాహసాన్ని ఆస్వాదించవచ్చు. (చదవండి: అరేబియా సౌందర్యం..కన్నడ దైవత్వం..! ఏకంగా ఆరు రోజులు, ఐదు రాత్రులు..) -
అబ్బో.. అబ్బూరి బ్రదర్స్!
అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ.. అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయాం. మాలా మీరెవరూ మోసపోవద్దు. వీళ్లు పెద్ద మోసగాళ్లు. నీతి, నిజాయితీ అన్నదే లేదు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్లే పెద్ద వెంచర్ పేరుతో వైజాగ్‌లో వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. – హైదరాబాద్‌లో ఉర్సా బాధితుల ఆక్రోశం సాక్షి, అమరావతి: మోసాలే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అబ్బూరి బద్రర్స్ హైదరాబాద్‌లో విల్లాల పేరుతో అనేక మందికి కుచ్చుటోపీ పెట్టారు! తాజాగా ఉర్సా ముసుగులో విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు! ఈ బాగోతం బయట పడటంతో ముసుగు దొంగల వెనక ఉన్న ముఖ్యనేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. ఈ నేపథ్యంలో ఓ ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అబ్బూరీ.. ఇది నిజం కాదా? ఉర్సా క్లస్టర్స్‌లో ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న సతీష్ అబ్బూరి ఫ్యామిలీ ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’ పేరుతో పలు డొల్ల కంపెనీలను నెలకొల్పి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఉంటున్నామని.. ఎన్నారైలమని.. తమ నెట్‌వర్త్ రూ.వందల కోట్లంటూ అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్‌లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని ధారపోసిన వారికి కుచ్చుటోపీ పెట్టారు. ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్ అబ్బూరి, సతీష్ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్‌లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారు.అమెరికాలో ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సీ పేరుతో సతీష్ అబ్బూరి కంపెనీ నమోదు అయిన విషయాన్ని కేశినేని నాని సాక్ష్యాలతో సహా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య కేశినేని జానకిలక్ష్మి డైరెక్టర్లుగా వ్యవహరించారు. కేశినేని చిన్ని వైదొలగిన తర్వాత జానకిలక్ష్మి డైరెక్టర్‌గా కొనసాగారు. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారు. అంతా కలసి పంగనామం.. హైదరాబాద్‌లోని నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, ఎల్బీనగర్ వద్ద ‘స్ప్రింగ్ వ్యాలీ’ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిరి్మస్తున్నట్లు సతీష్ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీరి వద్ద ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోయారు. కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలి రెండేళ్లు కనపడకుండా పారిపోయినట్లు ఓ బాధితుడు పేర్కొన్నారు. బాధితులు అంతా కలసి ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు. తమలా మరెవరూ మోసపోవద్దని హెచ్చరించారు.ఎట్టకేలకు అమెరికాలో పని చేస్తున్న సతీష్ అబ్బూరి ఒరాకిల్ కంపెనీ చిరునామా, ఫోన్ నంబరు వివరాలను సేకరించి అక్కడున్న వారు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాథేయపడ్డారు. దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చు. ఆ ముగ్గురు సోదరులు తమ వెనుక పెద్ద శక్తులున్నాయని, తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ‘మోసగాళ్లయిన వీళ్లు వైజాగ్‌లో వెంచర్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాలా మీరు మోసపోకండి..’ అంటూ పలువురు బాధితులు గతంలోనే హెచ్చరించారు. అదే మోసగాళ్లు ఇప్పుడు ఉర్సా పేరుతో మళ్లీ విచ్చేస్తున్నారంటూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’తో తనకు సంబంధం లేదని సతీష్ అబ్బూరి జూమ్ మీటింగ్‌లో పేర్కొన్నాడు. ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో బాధితుల వాయిస్లున్న పేజీలను డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించేశారు. ఒకపక్క బాధితులను బెదిరిస్తూ.. మరోపక్క వెబ్సైట్లో పేజీలను డిలీట్ చేయించటాన్ని బట్టి దొంగెవరో ప్రత్యేకించి చెప్పాలా..? అని బాధితులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ తో వారు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో బేటీ అయిన వారిలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ లు ఉన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ నేతలు.మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాందీనిపై సీఎం రేవంత్ వారితో మాట్లాడుతూ.. ‘నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది.ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని తెలిపారు.కాగా, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలనేది శాంతి చర్చల కమిటీ నేతల విన్నపం. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. అయితే ఈ లేఖ రాసిన మరుసటి రోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. -
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 30న ఆమె రిటైర్ కానున్నారు. ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడిగిస్తారని చర్చ సాగింది.. కానీ ప్రభుత్వం.. కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా శశాంక్ గోయల్మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెకట్రరీగా టీకే శ్రీదేవిజీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వి కర్ణన్యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకట్రావుపరిశ్రమలు, పెట్టుబడుల సెల్ సీఈవోగా జయష్ రంజన్ప్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంకకార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్జెన్కో సీఎండీగా హరీష్హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణపరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్ కుమార్పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ఇలంబర్తిరాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిలసెర్ప్ అదనపు సీఈవోగా పి. కాత్యాయనీదేవిఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డిజీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా హేమంత్‌సహదేవ్ రావుటీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఫణీంద్రారెడ్డిపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్‌గా కధిరవన్హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి -
ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
పంజగుట్ట (హైదరాబాద్): ఓ న్యాయవాది ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదు ఎత్తుకెళ్లిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను పంజగుట్ట పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే పురుషోత్తంరెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్గవితో 2007లో కులాంతర వివాహం జరిగింది. భార్గవి సికింద్రాబాద్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా విధులు నిర్వహిస్తోంది. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు భార్గవి పురుషోత్తంరెడ్డిపై గృహహింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఇంట్లో ఉన్న రూ.3.20 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న భార్గవి ఆమెకు పాతపరిచయం ఉన్న సంగారెడ్డి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరవింద్ కిరణ్ ఇటికి వెళ్లి అక్కడే ఉంటోంది. గత నెల 30న ఇంట్లో నగదు, బంగారం కనిపించకపోవడంతో పురుషోత్తంరెడ్డి ఆరాతీశాడు. భార్గవి అల్వాల్‌లోని అరవింద్ కిరణ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి డబ్బుల విషయమై ఆరాతీస్తే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో పురుషోత్తంరెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరవింద్ కిరణ్, భార్గవిని అదుపులోకి తీసుకున్నారు. -
ఎట్టకేలకు.. నగరాన్ని వీడిన ఓ పాకిస్థానీ
సాక్షి,హైదరాబాద్: పాకిస్థాన్ నుంచి షార్ట్ టర్మ్ వీసాపై (ఎస్టీవీ) నగరానికి వచ్చిన నలుగురు పౌరుల్లో ఒకరు శనివారం వెళ్లిపోయారు. సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురూ ఆదివారం వెళ్లిపోయే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర దేశంలో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతానికి ఎస్టీవీ కేటగిరీకి చెందిన వారిని ఆదివారం లోపు పంపాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో నగర పోలీసులు శనివారం ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పురుషుడు, ఓ మహిళ వేర్వేరుగా సిటీకి రాగా... తన చిన్నారితో మరో మహిళ వచ్చారు. శనివారం పురుషుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. నగరంలో ఉన్న 199 మంది పాకిస్థానీల్లో ఈ నలుగురే ఎస్టీవీతో వచ్చారు. సైబరాబాద్‌లో ఉంటున్న 11 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్టీవీ)తోనే ఉంటుండటంతో వారికి ప్రస్తుతం నోటీసులు జారీ చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన అన్నదమ్ముల్ని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు లాంగ్ టర్మ్ వీసాపై ఉంటున్నారు. వీరి వీసా గడువు సెపె్టంబర్ వరకు ఉండటంతో పాటు కేటగిరీ వేరు కావడంతో వీరిని పంపే ఆస్కారం లేదని తెలుస్తోంది. ఇక్కడి యువకుడు దుబాయ్‌లో ఉండగా అతడిని ప్రేమ వివాహం చేసుకున్న మరో పాకిస్థానీ ప్రస్తుతం భర్తతో కలిసి వాసవీ కాలనీలో నివసిస్తున్నారు. ఈమె లాంగ్‌టర్మ్ వీసా గడువు గతంలోనే ముగిసిపోయింది. భర్తతో కలిసి జీవిస్తున్న తనకు వీసా పొడిగించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆమె విషయంలోనూ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిఘా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేంద్రం నుంచి కేవలం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారికే నోటీసులు జారీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్న వారికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే తదుపరి ఆదేశాలను బట్టి వీరిపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. -
వేర్‌హౌస్ లావాదేవీల్లో.. అప్ అండ్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పారిశ్రామిక గిడ్డంగుల(వేర్‌హౌస్) విపణిలో భిన్న వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో నగరంలో 3 లక్షలు చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 2 లక్షల లావాదేవీలతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ఇక, 2025 క్యూ1లో నగరంలో కొత్తగా 2 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం సరఫరా అయ్యింది. గతేడాది ఇదే కాలంలో సరఫరా అయిన 6 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 67 శాతం తక్కువ.ఈ ఏడాది క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగుల స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 78 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఎక్కువగా ఇంజినీరింగ్ కంపెనీలు 25 శాతం, ఈ–కామర్స్ సంస్థలు 21 శాతం స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. అలాగే ఈ క్యూ1లో కొత్తగా 94 లక్షల చ.అ. స్పేస్ సరఫరా అయింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. -
‘స్పెషల్ కాయిన్’..వీడియోలో చూపించి మరీ, రూ.9 లక్షలు దోచేసింది!
శంషాబాద్: ‘‘అదో స్పెషల్ కాయిన్... కాయిన్ ఎదురుగా పెట్టగానే సూది కూడా లేచి నిలబడుతుంది’’.. ఇలా కాయిన్‌తో అనేక విన్యాసాలు చూపించి దానిని తయారీకి రూ. 4 నుంచి రూ. 6 లక్షలు ఖర్చు చేస్తే.. దానిని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు.. లేడీ టక్కుటమార విద్యలతో పాటు మాటలను నమ్మిన ఓ మహిళ 8 లక్షల రూపాయలు చెల్లించింది.. ఆరు నెలలుగా ఇదిగో అదిగో అంటూ చెప్పుకొస్తున్న ఆ మహిళ మాటలు నమ్మి చివరికి నిండా మునిగింది. జరిగింది ఇలా... శంషాబాద్ పట్టణంలోని సాతంరాయి బస్తీకి చెందిన అరుణ(32) అదే బస్తీకి చెందిన ఓ యువకుడి ద్వారా కాయిన్ విషయాన్ని తెలుసుకుంది. కర్నాటక మైసూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ కాయిన్ వ్యాపారం చేస్తుందని తెలపడంతో గతేడాది అక్టోబర్‌లో అరుణ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్ ముందు ఉన్న కాఫీ షాపులో కిలేడీ లక్ష్మీని కలిసింది. లక్ష్మీ మరోమారు వీడియోలో కాయిన్ చూపించి దానిని తయారు చేయడానికి సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చువుతుందని తయారు చేసి దానిని అమ్మి కోటి రూపాయాల వరకు ఇస్తానని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన అరుణ నగదు రూపంలో రూ. 90 వేలు ఇవ్వగా పలు దఫాలుగా రూ. 6 లక్షలు చెల్లించింది. తనిఖీలో కాయిన్ చేసిన తర్వాత తాను ఉంటున్న హోటల్లో తనిఖీలు జరగడంతో దానిని అక్కడే పడేసి వెళ్లాలని బుకాయించింది. తనకు మరో రెండు లక్షల వరకు చెల్లిస్తే ఈ దఫా కాయి తప్పకుండా చేసి విక్రయించి నీ కష్టం అంతా తీర్చేస్తానని నమ్మించింది. దీంతో మరోసారి మోసపోయిన మరో రెండు లక్షల వరకు ఫొన్‌పే ద్వారా చెల్లించింది. చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీఎయిర్పోర్టులో హైడ్రామా... తాను పూర్తిగా మోసపోయినట్లు గుర్తించిన అరుణ ఎలాగైనా లక్ష్మీని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ఈ నెల 19 మరో వ్యక్తి డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రప్పించింది. ఆ రోజు మాట్లాడిన తర్వాత మరుసటిరోజు ఉదయం శనివారం కలుస్తానని చెప్పి నిందితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ నెల 20 ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన కిలేడీని పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు. చివరికి పోలీసుల సాయంతో పట్టుబడింది.. తాను డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పోలీసుల సమక్షంలోనే నమ్మించింది. ఆ తర్వాత తనతో పాటు కారు ఎక్కాలని చెప్పిన లేడీ చాకచక్యంగా అరుణతో పాటు ఆమెతోపాటు ఉన్న మరో మహిళను తోసేసి తనవెంట వచ్చిన వ్యక్తితో కారుతో వేగంగా ఎయిర్‌పోర్టు నుంచి ఉడాయించింది. దీంతో బాధిత మహిళ బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి పోలీసుల సూచనల మేరకు గురువారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలరాజు ముందు జరిగిన విషయాన్ని వెల్లడిండించడంతో పాటు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కిలేడీ ఫొటోలు, ఫోన్‌పే ద్వారా చెల్లింపు చేసిన వాటన్నింటిని, పలు దఫాలుగా జరిగిన సంభాషణల రికార్డింగులు సమర్పిచింది. బాధితురాలి నుంచి ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో -
రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని.. ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడకు రావాల్సిన ఉన్నా.. కశ్మీర్‌కు వెళ్లడంతో రాలేకపోయాయన్నారు.పాతతరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని.. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచానన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వాదన వినిపించేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నా పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నాను. ఎంతో మందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇండియాలో నూతన రాజకీయాలను నిర్మిద్దాం. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసాగిద్దాం. పాదయాత్రలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టాను. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారుల్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానని స్లోగన్ తీసుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ సమ్మిట్‌లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ అన్నారు. -
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండంతో సప్లయ్ తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ -
HYD: నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు అందజేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 213 మంది పాకిస్తానీలు నివాసం ఉంటున్నారు. వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు (LTV) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు నలుగురు వ్యక్తులు రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.కాగా, భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. -
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
హైదరాబాద్: ఇటీవల కుప్పలుతెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం అలాంటి పనిచేసే..ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవాలని గట్టి నిఘా పెట్టింది.చివరికి తన భర్త శివ, సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని, కుటుంబసభ్యుల సాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ, సుష్మలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాట్లు ఫిర్యాదు కూడా చేసింది. pic.twitter.com/95aRDE2twc— Telugu Scribe (@TeluguScribe) April 26, 2025 -
కాస్త పెరిగిన ఇంటి అద్దెలు..
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల విపణి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లయి తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది. -
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
సాక్షి,హైదరబాద్: కాశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ముష్కర మూకల ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై పోరు కొనసాగుతోంది. ఈ ఘాతుకాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాకిస్థానీల వీసాల రద్దు కూడా అందులో ఒకటి. దీంతో వివిధ రకాలైన వీసాలపై నగరంలో ఉన్న 208 మంది పాకిస్థానీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంలో తెరపైకి వచ్చే అంశమే హైదరాబాద్ డిటెన్షన్ సెంటర్లో బందీగా ఉన్న పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్. సిటీలో నమోదైన కేసుల విషయం తేలినా.. ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయాడు. ఢిల్లీ వాసిగా నమ్మించి.. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. 17 ఏళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్థానీ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. 2011లో ఇక్రమ్ సైతం నగరానికి వచ్చాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ ఆమెతో చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చి అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ.. అక్కడి నుంచి నగరానికి చేరుకున్నాడు. ఆ విషయం బయటపడక.. ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన అతగాడు ఆమెను వేధించడంతో మహిళా ఠాణాను ఆశ్రయించింది. దీంతో ఇక్రమ్‌పై వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఇక్రమ్‌ను విచారించి, నోటీసులు జారీ చేశారు. అప్పట్లో తన భర్త పాకిస్థాన్‌కు చెందినవాడని చెప్పకపోవడంతో విషయం బయటకు రాలేదు. పోలీసులు 2018 జూన్‌లో ఇక్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సరిహద్దుల నుంచి వెనక్కు.. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసు విచారణ, శిక్షా కాలం ముగియడంతో ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు బలవంతంగా తిప్పి పంపాలని (డిపోర్టేషన్) భావించారు. డిపోర్టేషన్‌కు సంబంధించిన పత్రాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు చెప్పిన పాకిస్థాన్ అధికారులు అతడి రాకను అడ్డుకున్నారు. కాగా.. తనపై నమోదైన కేసును భార్యతో రాజీ చేసుకున్న ఇక్రమ్‌ను దాదాపు రెండేళ్లుగా నగరంలోని సీసీఎస్ అదీనంలో ఉన్న డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు పంపడానికి అవసరమైన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా పహల్గాం ఉదంతంతో ఇతడి డిపోర్టేషన్ పక్రియపై సందేహాలు నెలకొన్నాయి. -
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
సాక్షి స్పెషల్ డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్ విడుదల చేశారు.మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు.. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు. 26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. బులెటిన్లోని ప్రధాన సూచనలు ఇవే..వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)
-
అపార్థం చేసుకోవద్దు.. రాజకీయాల్లోకి రండి
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలను యువత అపార్థం చేసుకోవద్దని, రాజకీయాలపై ఏవగింపు ధోరణితో కాకుండా సానుకూల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను వెతుక్కోవడం ద్వారా సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలని భారత్ సమ్మిట్–2025 పిలుపునిచ్చింది. అసమానత, వాతావరణ మార్పులు, వృద్ధిలో అస్థిరత అనే అంశాలపై దృష్టి సారించేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేసింది. ‘ఓటింగ్‌లో పాల్గొనడం, గళమెత్తడం, రాజకీయాల్లో చేరడం’ అనేవి నేటి యువతకు మార్గదర్శకాలుగా నిలవాలని కోరింది.యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు కృష్ణ అళవారు సంధానకర్తగా శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ‘యువత..రేపటి రాజకీయాలు’ అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ వంశీకృష్ణ, ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరిలతో పాటు పలు దేశాలకు చెందిన ఉదయ్‌భాను చిబ్, అరెనా విలియమ్స్, లినేశ్‌సెల్యు అందాన్, మెరీనా హే, జేమ్స్ స్టీవ్ సెరానో, జీసస్ తాపియాలు ప్యానలిస్టులుగా వ్యవహరించిన ఈ గోష్టి పలు కీలక అభిప్రాయాలకు వేదికయింది. వక్తలు వెలిబుచి్చన అభిప్రాయాలివే.. పరిస్థితులను యువత అధిగమించాలి ⇒ రాజకీయాలంటే అవినీతి అని యువత అనుకుంటోంది. ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసి విస్మరించే పారీ్టల వైఖరి వారికి వెగటు పుట్టిస్తోంది. అయితే ఈ కారణాలతో యువత రాజకీయాల నుంచి దూరం జరగకూడదు. వీటిని అధిగమించేలా యువత కంకణం కట్టుకోవాలి. ⇒ చదువుకునేటప్పుడే యువతకు రాజకీయాలు అలవడాలి. వారు వివిధ వృత్తుల్లోకి వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని కోరితే ప్రయోజనం ఉండదు. అందుకే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలి. ⇒ సోషల్ మీడియా యువతను బాగా ప్రభావితం చేస్తోంది. పలు సామాజిక మాధ్యమాల ద్వారా హింస, విద్వేషపూరిత ప్రసంగాలకు యువత ప్రభావితమవుతోంది. ఇది మంచిది కాదు. చెడును ప్రోత్సహించే ఎలాంటి సామాజిక మాధ్యమాలనైనా యువత అధిగమించగలగాలి. ⇒ వాతావరణ మార్పు అనే అంశాన్ని యువత సీరియస్‌గా తీసుకోవాలి. ఇందుకోసం చట్టాలు చేసే క్రమంలో యువత భాగస్వామ్యం కావాలి. యువత ముందున్న ప్రస్తుత రాజకీయ కర్తవ్యం వాతావరణ మార్పులపై పోరాటమే. ⇒ యువత ఎంత గట్టిగా అరిచిందన్నది ముఖ్యం కాదు. ఎంత నిఖార్సుగా పోరాడిందన్నదే ముఖ్యం. వారసత్వం ఇంకెన్నాళ్లు? చర్చాగోష్టిలో భాగంగా డొమినిక్ రిపబ్లిక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై ప్రశ్నించారు. తన కుటుంబం నుంచి ఒక ఎంపీనో, మంత్రినో ఉంటే ఆ కుటుంబ సభ్యులు మళ్లీ అవే పదవుల్లోకి వెళుతున్నారని, అలాంటప్పుడు సామాన్యులకు అవకాశాలెలా వస్తాయో ప్యానలిస్టులు చెప్పాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగానని చెప్పారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో పనిచేసి ఎంపీని అయ్యానని, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నానని, కష్టపడిన వారికి రాజకీయాల్లో అవకాశాలు వస్తాయనేందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. అయితే వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తున్న వారు కూడా ఉన్నారని, ఆ పరిస్థితిని కాదనలేమని పొన్నం అభిప్రాయపడ్డారు. మరో రెండు అంశాలపైనా చర్చ తొలిరోజు భారత్ సమ్మిట్‌లో భాగంగా మరో రెండు అంశాలపై కూడా చర్చాగోషు్టలు జరిగాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాటె మోడరేటర్‌గా జరిగిన ‘నిజం వర్సెస్ ఊహాజనితం: తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం’పై జరిగిన చర్చాగోష్టిలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగి్వజయ్‌సింగ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద శర్మ మోడరేటర్‌గా వ్యవహరించిన ‘బహుళపక్ష వాదం’ అనే అంశంపై చర్చాగోష్టిలోనూ పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ
హైదరాబాద్: పహెల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ హైదరాబాద్‌కు వచ్చిన పాక్ జాతీయుడు పోలీసులకు చిక్కాడు. మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి.. హైదరాబాద్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను కలిసేందుకు ఫయాజ్ భారత్ కు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు ఫయాజ్. అయితే ప్రస్తుతం పాకిస్తానీయులను వెనక్కి పంపించే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై ఓ కన్నేసి ఉంచాయి. ఈ క్రమంలోనే ఫయాజ్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ యువకుడ్ని మరింత లోతుగా విచారించనున్నారుపోలీసులు. అతను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్ జాతీయులు తమ దేశానికి వెళ్లిపోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ.. ముందుగా అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఇక వారు రాష్ట్రాల నుంచి ఖాళీ చేసి పాక్ కు వెళ్లిపోవాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో భార్యను కలవడానికి వచ్చి పోలీసులకు పాకిస్తాన్ జాతీయుడు చిక్కడం గమనార్హం. -
పహల్గాం ఉగ్రదాడి.. నెక్లెస్‌రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు.అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలి: సీఎం రేవంత్రెడ్డిఅందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడినవారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాక్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోదీ.. మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సాంకేతికంగా... ‘నిరభ్యంతరం’గా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అగ్నిమాపక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల నిర్మాణానికి ముందు జారీ చేసే తాత్కాలిక నిరభ్యంతర పత్రం (ప్రొవిజినల్ ఎన్ఓసీ) జారీ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ పర్యవేక్షణలో ఓ ప్రముఖ సంస్థ రూపొందిస్తున్న ఈ సాఫ్ట్వేర్ నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిర్ణీత రుసుం చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రొవిజినల్ ఎన్ఓసీ (provisional fire noc) పొందవచ్చని పేర్కొన్నారు. వీరికి ప్రొవిజినల్ ఎన్ఓసీ తప్పనిసరి రాష్ట్రంలో వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం నిర్మించే 15 మీటర్ల కంటే ఎత్తైన, నివాస గృహాలుగా నిర్మించే 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన భవనాలకు ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ తప్పనిసరి. వీటితో పాటు 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే పాఠశాలలు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, మతపరమైన, ప్రజావసరాలకు సంబంధించిన భవనాలకు కూడా ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకోవడం అనివార్యం. భవన నిర్మాణానికి ముందే దీన్ని పొందాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుంచి ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకుంటేనే ఇతర విభాగాలు తమ అనుమతుల్ని జారీ చేస్తాయి. ఈ ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసే ముందు ఆయా భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు అమలు చేయబోయే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఆ వివరాలన్నీ పొందుపరచాలి... భవన నిర్మాణం ప్రారంభానికి ముందే జారీ అయ్యే ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ కోసం దరఖాస్తుదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు ఆ ఫైల్‌ను, అందులోని ప్రతిపాదిత భద్రత ప్రమాణాలను పరిశీలిస్తారు. అవసరమైతే మార్పులు, చేర్పులు సూచించి, వాటిని జోడించిన తర్వాతే జారీ చేస్తారు. భవనం ఎత్తు, విస్తీర్ణం, ఎందుకు వినియోగిస్తారు? తదితర అంశాల ఆధారంగా భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఆ భవనానికి ఎన్ని ఫైర్ ఎగ్ట్వింగ్విషర్లు, స్ప్రింక్లర్లు ఎన్ని, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయాలు నిర్దేశించి ఉంటాయి. భవనం భద్రత ప్రమాణాల నమూనా, వాటికి తగ్గట్టు ఉంటేనే ప్రొవిజినల్ ఎన్ఓసీ జారీ అవుతుంది. వాటిని తనిఖీ చేసే అధికారి అవసరాలకు తగ్గట్టు ఉన్నాయా? లేదా? అనేది తేలుస్తారు.చదవండి: హైదరాబాద్‌లో హై అలర్ట్సాఫ్ట్వేర్తో ఆటోమేటిక్‌గా... తాజా సాఫ్ట్‌వేర్‌లో ఈ వివరాలన్నీ ముందే పొందుపరిచి ఉంటాయి. దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుడు భవనం వివరాలు పొందుపరచడంతోపాటు దాని భద్రతా ప్రమాణాల ప్లాన్‌ను ఆటో క్యాడ్ రూపంలో దాఖలు చేస్తాడు. దీన్ని ఆద్యంతం పరిశీలించే సాఫ్ట్వేర్ అవసరమైతే తగిన మార్పులు చేర్పుల్ని సూచిస్తుంది. ఈ మేరకు ప్లాన్‌ను మారుస్తూ మరో ఆటో క్యాడ్‌ను అప్లోడ్ చేస్తే ప్రొవిజినల్ ఎన్ఓసీ జారీ అవుతుంది. ‘కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తే మానవ వనరుల జోక్యం తగ్గుతుంది. తర్వాదా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రొవిజినల్ ఎన్ఓసీ దరఖాస్తును పరిశీలించి, మార్పులు, చేర్పుల సూచన వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పని విధానం పారదర్శకంగా మారి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు’ అని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
‘భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనది’’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ సమ్మిట్ చారిత్మాకమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ లో గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. హెచ్ఐసీసీ వేదికగా తొలిరోజు జరిగిన భారత్ సమ్మిట్ గురించి మల్లు భట్టి విక్రమార్క్ మీడియాతో మాట్లాడారు.‘గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్, శాంతి తదితర అంశాలపై సమ్మిట్ లో చర్చించారు. సామాజిక న్యాయం, అభివృద్ధిపై డెలిగేట్స్ తో చర్చించాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల విదేశీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ న్యాయ్ కార్యక్రమం పట్ల డెలిగేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడికి నిరసనలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటామని అన్నారు. కశ్మీర్ ఉగ్రవాద దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.నెక్లెస్ రోడ్డులో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. -
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.కాగా, భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. -
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
సాక్షి, హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో అఘోరీకి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. నా భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారంటూ అధికారులతో అఘోరీ వాగ్వాదానికి దిగారు. అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించగా.. అఘోరీ ప్రవర్తనపై జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.కాగా, చంచల్ గుడ జైలును నిన్న(గురువారం) సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్‌ను పరిశీలించారు. అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్‌లో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. కాగా.. మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది ఇవాళ అఘోరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.మహిళా సినీ నిర్మాత ఫిర్యాదుతో..పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈ ఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 308(5), 318(1), 351(3), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్ ఫస్ట్‌క్లాస్ జడ్జి ధీరజ్‌కుమార్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్‌లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
తెలంగాణలో తొలిసారిగా టెండన్ ఆగ్మెంటేషన్ షోల్డర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆపరేషన్
హైదరాబాద్: ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అపోలో వైద్యులు అరుదైన ఘనతను సాధింఆరు తెలంగాణలోనే తొలి అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డా. ప్రశాంత్ మేశ్రం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇటువంటి చికిత్స అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్ ద్వారా ఆ శస్త్ర చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల శక్తివంతమైన వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరు నెలలపాటు తీవ్రమైన నొప్పితోపాటు, చేతిలో బలహీనతతో బాధపడ్డాడు. మాసివ్, మరమ్మతులు చేయలేని రోటేటర్ కఫ్ టియర్తో పాటు ఆర్మ్ జాయింట్లో ప్రారంభ దశ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్‌లోని డా. మేశ్రంని సంప్రదించారు.ఈ మేరకు అతి సంక్లిష్టమైన ఈ ఆర్థోస్కోపిక్-అసిస్టెడ్ లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్సలో ఆకిలీస్ టెండన్ అల్లోగ్రాప్ట్ను నిష్ణాతంగా ఉపయోగించారు. బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్ మరమ్మతులతో కూడిన ఈ చికిత్స ద్వారా భుజం పనితీరు సామర్థ్యాన్ని పునరుద్ధరించి, తద్వారా ఆర్థరైటిస్‌ను నివారించే ప్రయత్నించి విజయవంతమైనారు. ఆపరేషన్ తర్వాత చేసిన షోల్డర్ జాయింట్లో మారిన హెడ్ పొజిషన్ తిరిగి సరి అయినట్టు వెల్లడైంది. అరుదైన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఒక కొత్త మైలురాయి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. -
క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చట్లు (ఫొటోలు)
-
నార్త్ టు సౌత్ నగరానికి క్యూ కడుతున్న నార్త్ ఫుడ్ బ్రాండ్స్
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార రుచులు ఆదరణ పొందటం విధితమే. ఈ మధ్య కాలంలో నగరం వేదికగా నార్త్ డిషెస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నగరంలో నార్త్ రెస్టారెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే నార్త్ ఇండియన్ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ నగరానికి విచ్చేసింది. ఢిల్లీ వేదికగా ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ దక్షిణాదిలో మొదటిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45లో ఆవిష్కరించడం ఇక్కడి ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అని ఫుడ్ బ్లాగర్స్ చెబుతున్నారు.స్మోక్ తందూరి కబాబ్‌లు మొదలు మటన్ షికంపురి కబాబ్, పత్తర్ కా గోష్ట్ వంటి వంటకాలు ఉత్తరాది లాజీజ్ అఫైర్ ప్రత్యేకత. వీటితో పాటు షాహి దమ్ కా ఆలూ, భట్టి కా పనీర్, షాదీ కా లాల్ చికెన్, దాల్ లాజీజ్, కేసర్ ఫిర్ని వంటి రుచులను నగరవాసులకు చేరువ చేయడానికి జూబ్లీహిల్స్‌లో లజీజ్ అఫేర్ను ప్రారంభించినట్లు ఇన్నాటో హాస్పిటాలిటీ డైరెక్టర్ యాష్ త్రివేది తెలిపారు. ప్రత్యేకించి నార్ట్ స్టైల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మరోసారి నగరవాసులకు రుచి చూపించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిసుగంధ ద్రవ్యాల సమ్మిళితంతో సాంస్కృతిక వంటకాలు, ఉత్తరాది పాకశాస్త్ర నైపుణ్యాలతో వడ్డించిన పసందైన రుచులు హైదరాబాదీల మనసు దోచేస్తాయన్నారు. అనాది ప్రపంచ స్థాయి వంటకాలకు నగరం వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు వినూత్న రుచులను ఆస్వాదించే లక్షణమే ఈ ఆహార వైవిధ్యానికి కారణం. ఈ ప్రయాణంలో లజీజ్ అఫేర్కు స్పందన వస్తుండటం తమ ప్రయత్నానికి భరోసా లభించిందని సహా డైరెక్టర్ కుష్ త్రివేది వివరించారు. -
Payal Rajput వజ్రాభరణాలంటే ఇష్టం..
గచ్చిబౌలి: వజ్రాభరణాలంటే చాలా ఇష్టమని నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) అన్నారు. కొండాపూర్‌లోని ప్రణవ్ వైష్ణాయ్ బిజినెస్ పార్క్‌లో టీబీజడ్–ది ఒరిజినల్ జ్యువెలర్ స్టోర్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో వివిధ రకాల డిజైన్ల భరణాలు ధరించి సందడి చేశారు. అనంతరం పాయల్ రాజ్‌పుత్ మాట్లడుతూ రూ.75 లక్షల విలువైన వజ్రాలు (Diamonds) పొదిగిన నక్లెస్‌తో పాటు మొత్తం కోటి రూపాయల విలువైన ఆభరణాలు ధరించానని చెప్పారు. ప్రతి ఆభరణం మన సంస్కృతిని తెలియజేసే విధంగా రూపొందించారన్నారు. టీబీజడ్ మూడో స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ రితీష్ గాడే మాట్లాడుతూ ప్రతి ఆభరణం మన వారసత్వానికి ప్రతీకలని, స్టోర్ బంగారంతో పాటు యాంటిక్, టెంపుల్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విస్తృతశ్రేణి మోడళ్లు, వినూత్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో సమకాలీన ఆభరణాల నుంచి సంప్రదాయ ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. టీబీజడ్ ఒరిజినల్ సర్టిఫైడ్, స్వచ్ఛతను సూచించే హాల్‌మార్క్‌ను కలిగి ఉందన్నారు. దేశంలో వివిధ నగరాల్లో 37 స్టోర్లు ఉన్నాయని తెలిపారు. చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి -
Hyderabad: నగరంలోని పాకిస్థానీలపై ఆరా
సాక్షి,హైదరబాద్: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం.. దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉన్న పాకిస్థానీలు నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగరంలోని స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) రిజస్టర్ చేసుకున్న పాకిస్థానీల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీయులు ఇక్కడ కచి్చతంగా రిజిస్టర్ చేయించుకోవాలి. వారి వీసా వివరాలతో పాటు ఎక్కడ ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? ఫోన్ నంబర్? చిరునామా? తదితరాలను అందించాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లూ శంషాబాద్‌లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మా త్రం ఎస్బీ అధీనంలోని పాక్, బంగ్లా బ్రాంచ్‌ల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కార్యాలయం పాతబస్తీలోని పురానీ హవేలీలో ఉంది. ఈ విభాగంలో రిజిస్టరై ఉన్న పాకిస్థానీల సంఖ్య 208గా ఉంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న పాకిస్థానీలతో పాటు వారి రక్త సంబం«దీకులకు ఈ వీసాలు జారీ చేస్తుంటారు. మరో 13 మంది షార్ట్‌టర్మ్ వీసా కలిగి ఉన్నారు. విజిట్, బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్‌టర్మ్ కిందికి వస్తా యి. మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు. 1992 నుంచి సార్క్ వీసాలు అమలవుతున్నాయి. సార్క్ సభ్యత్వ దేశాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు సహా 24 రకాల వారికి ప్రత్యేక మినహాయింపులతో కూడిన వీసాలు ఇస్తుంటారు. ప్రస్తుతం సిటీలో ఉన్న పాకిస్థానీల్లో సార్క్ వీసా కలిగిన వాళ్లు లేరు. నగరంలో రిజిస్టర్ అయిన ఈ 208 మంది వివరాలను ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ వదలాల్సిందిగా సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత వీరిలో ఎందరు ఎగ్జిట్ అయ్యారు అనేది ఇమ్మిగ్రేషన్ నుంచి తీసుకోనున్నారు. అప్పటి కీ ఎవరైనా మిగిలిన ఉన్నట్లు తేలితే వారిని పట్టుకుని బలవంతంగా తిప్పి పంపుతారని ఓ అధికారి తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
సూరీడు సుర్రు.. మీటర్ గిర్రు!
సాక్షి, హైదరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలకే సుర్రుమంటున్నాడు. ఎండలు మండిపోతుండటంతో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. కొద్ది రోజులుగా నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల డిమాండ్ (90.68 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా.. తాజాగా గురువారం 4,170 మెగావాట్లకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే మే ఒకటి నాటికి 4,500 మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చే అవకాశం లేకపోలేదని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఆన్‌లోనే ఏసీలు, కూలర్లు గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరవాసుల కొనుగోలు శక్తి పెరిగింది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలోనే కన్పించే ఏసీలు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి నివాసాల్లోనూ అనివార్యమయ్యాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం అనేక మంది ఏసీలు, కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తయారీ కంపెనీలతో పాటు వివిధ ప్రైవేటు బ్యాంకులు జీరో పర్సంటేజీ లోన్లు మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా ఉన్నవారే కాదు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఎల్రక్టానిక్ యంత్రాలు సాధారణమయ్యాయి. ఫలితంగా గత కొద్ది రోజుల నుంచి నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. -
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
హైదరాబాద్,సాక్షి: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది.కాశ్మీర్ ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరేలా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు ,ఎమ్మెల్యేలు , భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. -
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
ఆపన్న హస్తం ఆదుకుంది.. చదువు దారి చూపింది!
కన్నవారు కాదనుకున్నా.. అనాథలా మారినా.. కష్టాలు చుట్టుముట్టినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అక్షరమే ఆయుధంగా బతుకుపోరు సాగించింది.. అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసింది రవీనా చౌదరి. రెండేళ్ల పసిప్రాయంలో ఆమెను తల్లి వదిలేసి ఎటో వెళ్లిపోయింది. ఆలనా పాలనా చూడలేక తండ్రి మొహం చాటేశాడు. ఏ దారి లేని ఏడారి రాష్ట్రానికి చెందిన ఆ చిన్నారిని తీసుకొని నానమ్మ హైదరాబాద్ (Hyderabad) వచ్చింది. ఇక్కడే ఉంటున్న తన కూతురు వద్ద ఉంచి రాజస్థాన్ తిరిగి వెళ్లిపోయింది. రవీనాను మేనత్త చేరదీసి స్థానిక హెచ్ఎంటీ కాలనీలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో ఎల్కేజీలో చేర్పించింది. చదువుల్లో చురుగ్గా ఉండే రవీనా పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. చదువు ఇక చాలన్నారు..పదవ తరగతి పూర్తి కాగానే పైచదువులు చదివించలేనని, ఏదైనా పని చేయాలని రవీనాకు మేనత్త చెప్పింది. తండ్రి రాజస్థాన్ (Rajasthan) నుంచి వచ్చి తీసుకువెళ్లి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాడు. చదువుకుంటానంటే కొట్టి పెళ్లికి అంగీకరించాలని హింసించాడు. తండ్రి బారి నుంచి తప్పించుకొని రవీనా అతి కష్టం మీద తిరిగి నగరానికి వచ్చేసింది. అయితే ఆమెను మేనత్త చేరదీయలేదు. ఓనమాలు నేర్పిన పాఠశాల గడప తొక్కడంతో..రవీనా చౌదరి సెయింట్ ఆంథోని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుంది. ఆయన చలించి పాఠశాల పూర్వ విద్యార్థులు, తెలిసిన వారి సహకారంతో సమీపంలోని గరల్స్ హాస్టల్లో ఆమెను చేర్పించారు. నెలనెలా ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పుకోవాలని ఐదుగురు చిన్నారులను అప్పగించారు. దీంతో రవీనా చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ హబ్సిగూడలోని ఓ ప్రైవేటు ఇంటర్ కళాశాలలో చేరింది. ఆమె గాథ టీఎన్జీఓ (TNGO) వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి కోయడ దశరథరావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు.తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రవీనా 978/1000 మార్కులు సాధించి చదువుపట్ల తన ధృడత్వాన్ని చాటుకుంది. డిగ్రీ పూర్తి చేసి ఎప్పటికైనా సివిల్స్‌లో ర్యాంకు తెచ్చుకోవడమే తన లక్ష్యమని రవీనా చౌదరి ధీమాగా చెబుతోంది. అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రవేశం పొంది ఓ టోర్నమెంటులో మెడల్ కూడా సాధించడం గమనార్హం. రవీనా డిగ్రీ చదువుకు, ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్‌కు అండగా ఉంటామని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, దశరథరావు పేర్కొనడం వారి గొప్ప మనసుకు నిదర్శనం.చదవండి: ఈసారి కూడా అమ్మాయిలదే హవా -
ఆ దిశగానే భారత్ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే భారత్ సమ్మిట్ లో వంద దేశాలకు సంబంధించిన 450 ప్రతినిధులు పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు. భారతదేశం అలీనోద్యమం తీసుకొని ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని, ఆ దిశగానే సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.ఈరోజు(గురువారం) హెచ్ఐసీసీ నుంచి మాట్లాడిన భట్టి విక్రమార్క.. ‘ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఉదయం గం. 7.30ని.ల నుంచి గం.10.30 ని.ల వరకూ ఎన్ఆర్జీసీ పథకం ఫీల్డ్ విజిటింగ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరిస్తాం. 2:45 నుంచి 4 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కోసం ఏం చేస్తుందనేది వివరిస్తాం. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శాంతిని నింపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది.ఎల్లుండి(శనివారం) సాయంత్రం ఇందిర మహిళ శక్తి బజార్ శిల్పకళ వేదిక సందర్శిస్తాం. పెహల్గామ్ ఉగ్రదాడి దురదృష్టకర సంఘటన. ఈ ప్రాంతాన్ని రేపు రాహుల్ గాంధీ సందర్శిస్తారు. అనంతరం భారత్ సమ్మిట్ కి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. అహింస, సత్యాగ్రహ పద్ధతి ప్రపంచం పాటించాలని కోరుకుంటున్నాం. భారత్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణకి వస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వనరుల వివరిస్తాం. న్యాయం అన్ని వర్గాలకు దక్కాలనేది కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు. మా ప్రభుత్వం ద్వారా ప్రపంచానికి ఈ మూల సిద్ధాంతం తెలియజేస్తాం. ప్రగతిశీల భావజాలం ఉన్న, న్యాయ సిద్ధాంతం ఉన్న పార్టీలను ఈ సమ్మిట్ కి ఆహ్వానిస్తాం’ అని భట్టి పేర్కొన్నారు. భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాలపై పోలీసులు నజర్ పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని గతంలో టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.మరో వైపు, తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో టీటీడీ.. తిరుమలలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. -
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా చేసిన దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాసారు. పెహల్గాంలోని బైసరాన్‌కు విహార యాత్రలోభాగంగా , ప్రకృతి అందాలను వీక్షిస్తున్న తరుణంలో ఉగ్రమూకలు వారిపై దాడికి తెగబడ్డారు. దాంతో ఆ ఆనంద క్షణాలు కాస్తా విషాదంగా మారిపోయాయి. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుమారుడు ఉన్నారు.ఐబీ(ఇంటెలిజెన్సీ బ్యూరో) ఆఫీసర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజాన్.. ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు విడిచాడు. రంజాన్ మృతదేహం బుధవారం స్వస్థలానికి చేరుకున్న తరుణంలో ఆయన తండ్రి మంగ్లేస్ మిశ్రా కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూస్తూ కృంగిపోయారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ఆయన్ని పలకరించగా తాను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని, ఒంటరిగా ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.‘నన్ను ఒంటరిగా వదిలేయండి. నేనే మాట్లాడలేను. కశ్మీర్ కు నవ్వుతూ వెళ్లాడు నా కుమారుడు రంజన్. ప్రతీరోజూ మాకు కాల్ చేసి మా ఆరోగ్యం గురించి అడిగేవాడు.. జాగ్రత్తలు చెప్పేవాడు. తాను అసువులు బాసిన చివరి రోజు కూడా మాకు కాల్ చేశాడు. అంతకుముందే మా కాల్ చేసి మాట్లాడిన నా కుమారుడు ఇలా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటి వేదనతో చెప్పారు. -
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఇప్పటికీ ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందిన విషయం విధితమే.. ఈ గుర్తింపును ఇప్పటికీ కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, వజ్రాలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా నగరం నిలుస్తోంది. అంతేకాకుండా ఆభరణాల వ్యాపారానికి సురక్షితమైన ప్రాంతంగానూ నగరం సేవలందిస్తోంది. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో ఈ వ్యాపార కలాపాలు ఇక్కడ విస్తృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆభరణాల వినియోగంలో దేశం దాదాపు 29 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో దక్షిణాది, మరీ ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో నగరం వేదికగా ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’కు సిద్ధమవు తోంది. 3 రోజుల ఈవెంట్లో ట్రెండ్ సెట్టింగ్ డిజైన్లు, బ్రాండ్ లాంచ్‌లు, ఆభరణాల సమావేశాలు, ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక, పవర్ ఆఫ్ యంగ్, లెజెండ్స్ ఆఫ్ సౌత్, జ్యువెలరీ పర్చేజ్ మేనేజర్స్ కనెక్ట్, కాఫీ విత్ డాక్టర్ చేతన్, బిజినెస్ మ్యాచ్ మేకింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం దక్షిణాదిలోని హైదరాబాద్ సహా ముంబై, జైపూర్, కేరళ, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై వంటి నగరాలకు చెందిన ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్లు నగరానికి విచ్చేయనున్నాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. భారతదేశపు ప్రీమియర్ బీ2బీ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌గా ఇందులో 8 వేలకు పైగా వాణిజ్య సందర్శకులను ఆకర్షిస్తోందని, 220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం ఇస్తుందని అంచనా. ఈ వేదికగా తాజా ఆభరణాల ట్రెండ్స్, ప్రత్యేక బ్రాండ్ సేకరణలు, అత్యాధునిక డిజైన్లను ఆవిష్కరిస్తుంది. ఈ వేదికగా భారతదేశ వార్షిక ఆభరణాల అమ్మకాలలో 60 శాతం వరకు ప్రభావితం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ దేశంలోని ప్రీమియం ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా స్థిరపడింది. దక్షిణాదిలోని ఆవిష్కరణ, హస్తకళ, వారసత్వం, వ్యాపారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాం. బంగారం, వజ్రం, వెండి, ముత్యాలు, రత్నాల ఆభరణాలను, టెక్నాలజీ ప్రొవైడర్లు, విలువైన లోహ సరఫరాదారులు, ఆభరణాల యంత్రాల తయారీదారులు, భారత్‌తో పాటు విదేశాల నుంచి మౌంటింగ్ వ్యాపారులను ఏకం చేస్తున్నాం. – యోగేష్ ముద్రాస్, భారత ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్. వచ్చే నెలలో హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్, జెమ్ ఫెయిర్ -
World Mental Health Index : అట్టడుగున హైదరాబాద్, కారణాలివే!
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యువత మానసిక ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతర్జాతీయంగా సేపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ దీనిని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ( World Mental Health Index )అత్యల్పంగా ఉన్న భారతదేశపు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు అట్టడుగున స్థానం కల్పించింది. మెంటల్ హెల్త్ కోషియంట్(ఎంహెచ్క్యు) స్కేల్లో నగరం ప్రపంచ సగటు 63 కాగా మన నగరం 58.3 స్కోర్‌ను సాధించింది. ఢిల్లీ 54.4 స్కోర్‌తో మన తర్వాత స్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం కోసం సంస్థ 18 నుంచి 55 ఆ తర్వాత వయస్సు కలిగిన 75 వేల మంది వ్యక్తులను ఎంచుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఎంహెచ్క్యు స్కేల్ మానసిక ఆరోగ్యాన్ని ‘బాధలో ఉండటం’ నుంచి ‘అభివృద్ధి చెందడం’ వరకు విభజించింది. ‘ఎండ్యూరింగ్’ ‘మేనేజింగ్’ కేటగిరీల మధ్య హైదరాబాద్ సగటు పడిపోయింది. నగరంలో ‘32% మంది ‘బాధపడుతున్న’ లేదా ‘కష్టపడుతున్న’ కేటగిరీల్లోకి వచ్చారు. ఇది పేలవమైన భావోద్వేగ నియంత్రణ, బలహీనమైన సంబంధాలతో క్షీణించిన మానసిక పనితీరుగా గుర్తించడం జరిగింది’ అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ అంటున్నారు.యువతే ఎక్కువ.. మానసికంగా ప్రభావితమైన వారి సంఖ్య యువకులలో ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు అంతర్జాతీయ కొలమానాలతో సమానంగా 102.4 స్కోర్ సాధించగా, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత సగటున 27 పాయింట్లు పైబడి మాత్రమే సాధించి ‘ఎండ్యూరింగ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. సేపియన్ ల్యాబ్స్‌కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘దాదాపు సగం మంది యువకులు బాధను, మనసును బలహీనపరిచే భావాలను కలిగి ఉన్నారు’ అని చెప్పారు. యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలను సైతం నివేదిక కీలకంగా ప్రస్తావించింది.పంచుకునే మనసులు లేక.. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిస్థితికి ముఖ్యంగా సామాజిక బంధాల విచ్ఛిన్నం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. వ్యక్తివాద మనస్తత్వాలు పెరగడం వల్ల కుటుంబాలు సన్నిహిత స్నేహాలు వంటి సంప్రదాయ పద్ధతులు క్షీణించాయి. పిల్లలతో గడపడం అనే విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి వీటికి జత కలిసి ఒంటరితనం పెరుగుదలకు ఆజ్యం పోసింది అని నివేదిక తేల్చింది.ఊహ తెలిసేలోపే.. స్మార్ట్ ఫోన్ వినియోగం చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం అలవాటు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తోంది. తగిన వయసు లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల విషాదం, నిరాశా నిస్పృహలు, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణులు పెట్రేగేందుకు అవకాశం ఇచ్చి వాస్తవ దూరమైన ప్రపంచంలోకి నెడుతోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రాభంగానికి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్‌ను దగ్గర చేస్తుంది. పర్యావరణ ప్రభావం.. మానసిక సమస్యలకు పర్యావరణ మార్పులు కూడా దోహదం చేస్తున్నాయి. ఆహారం నీటిలో ఇప్పుడు సర్వ సాధారణంగా కనిపించే పురుగు మందులు, భారీ లోహాలు మైక్రోప్లాస్టిక్‌లు–మెదడు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు యుక్తవయస్సులో ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు ఇది దోహదం చేస్తోందని నివేదిక నిర్ధారించింది. రాంగ్ డైట్.. సైకలాజికల్ ఫైట్.. అతిగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్(యుపీఎఫ్) తీసుకునే వ్యక్తులు మానసిక క్షోభను కూడా ఎక్కువ అనుభవించే అవకాశం ఉంది. ‘యుపీఎఫ్ వినియోగం 15 సంవత్సరాలలో బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇది 30% వరకు మానసిక అనారోగ్యానికి కారణమవుతోందని మా డేటా సూచిస్తోంది.’ అని నివేదిక పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఫిట్నెస్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్: ఫిట్నెస్ సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించే గ్లోబల్ సంస్థ ఏబీసీ ఫిట్నెస్ హైదరాబాద్‌లో తమ ఇన్నోవేషన్ హబ్‌ను ఆవిష్కరించింది. ఫిట్నెస్ పరిశ్రమకు అవసరమైన టెక్నాలజీలను రూపొందించడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది.అంతర్జాతీయంగా ఎఫ్45 ఫ్రాంచైజీ, స్థానికంగా ది ఫిట్ స్ట్రీక్లాంటి ఇరవై పైగా కస్టమర్లకు కంపెనీ సర్వీసులు అందిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు సహా వచ్చే ఏడాది వ్యవధిలో 200 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సంస్థ సీఈవో బిల్ డేవిస్ వివరించారు. భారత్‌లో ఒసాము సుజుకీ ఎక్సలెన్స్ సెంటర్జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్ తమ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీ గౌరవార్థం భారత్‌లో ఆయన పేరిట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (ఓఎస్సీవోఈ) ఏర్పాటు చేయనుంది. దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీతో కలిసి గుజరాత్, హర్యానాలో ఓఎస్సీవోఈని నెలకొల్పనుంది. తయారీ రంగం అధిక వృద్ధి సాధనలోను, విడిభాగాల తయారీ సంస్థల ప్రమాణాలను మెరుగుపర్చడంలోను ప్రభుత్వ లక్ష్యాలకు తోడ్పడేదిగా ఇది ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. -
హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
-
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపీనాథ్ పై అక్రమ కేసు
-
SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)
-
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన లోగో మార్చుకుంది. జల వనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల్లో ఈ లోగోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టి అప్డేట్ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు.కాగా, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్‌లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్‌మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు. స్మితా సబర్వాల్.. అప్పుడు ఏం చేశినవ్? - గజ్జెల కాంతంకేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశినవ్అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ఇది కరెక్టు కాదని ఎందుకు ఖండించలేదు?IAS అధికారి స్మితా సబర్వాల్‌పై రెచ్చిపోయిన… pic.twitter.com/FrHZkWO2dA— Telugu Galaxy (@Telugu_Galaxy) April 23, 2025 -
గిన్నిస్ బుక్ రికార్డు: ఒకే కుటుంబంలో ముగ్గురికి అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: కేపీహెచ్ బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన ఇద్దరు చిన్నారులు లీషా ప్రజ్ఞ (8) అభిజ్ఞ ( 5) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రికార్డు నెలకొల్పడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత వ్రస్తాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని అభినందించారు. డిసెంబర్ 1, 2024న హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్‌స్ట్రాగాం వేదికగా వీడియోలు అప్లోడ్ చేశారు. లండన్‌లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలను ప్రకటించి డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. -
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్ పేరుతో కటింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.వకీల్ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్‌ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు. -
కలర్‌ఫుల్.. సిబ్లింగ్స్ వాక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్పల్లి అశోక వన్ మాల్ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్. అశోక డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ భాగస్వామి అయిన రిలయన్స్ ట్రెండ్స్.. ఫ్యాషన్ వాక్‌లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్ మై హోమ్, డెకథ్లాన్ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్ మాల్ సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్చార్మినార్: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్ వరకూ నెహ్రూ జూలజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్‌ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్‌కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్‌కూ ప్రతి రోజూ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన కిట్ అందిస్తారన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తో పాటు అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్ నెంబర్లో గానీ సంప్రదించాలన్నారు. -
నా దారి రహదారి : రివర్స్ వాకింగ్
ప్రతి రోజూ అందరూ వాకింగ్ చేస్తారు.. అతడు కూడా అందరిలానే వాకింగ్ చేస్తాడు.. అయితే అందరికన్నా భిన్నంగా వెనక్కి నడుస్తాడు.. అదే రివర్స్ వాకింగ్ అండి. అతడే కూకట్పల్లి, వివేకానందనగర్‌లో నివాస ముండే అన్య శ్రీధర్. నగరంలోని ఓ ఫార్మాకంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజూ 5 గంటలకే వాకింగ్ మొదలుపెడతాడు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అందరూ ముందుకు నడుస్తుంటారు.. ఆయన మాత్రం వెనుకవైపు నడుస్తూ.. వేగంగా పరుగెత్తటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పక్కనుంచి నడవడానికి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో శ్రీధర్ మాత్రం వెనుక వైపు పరుగెత్తటం విశేషం.ప్రతి రోజూ వివేకానందనగర్ కాలనీలోని వాకర్స్ రూట్లో యువకులతో సహా అందరూ ముందుకు నడుస్తుంటారు. అంతేకాకుండా వాకింగ్ చేసేవారు ఒకటిన్నర కిలోమీటర్లను సుమారు 15 నిమిషాలు నడుస్తుండగా.. శ్రీధర్ వెనుకవైపు 10 నిమిషాల్లోపు పరుగెత్తటం విశేషం. దాదాపు 17 నుంచి 20 నిమిషాల్లో రెండు రౌండ్లను రివర్స్‌లో పూర్తిచేస్తాడు. వ్యాయామం విషయంలో కూడా అందరూ నిలబడి కాళ్లను సైక్లింగ్లాగా వ్యాయామం చేసారు. తను మాత్రం తల కిందికి పెట్టి కాళ్ళను దాదాపు 5 నిమిషాల సేపు వాకింగ్ సైక్లింగ్ చేయటం విశేషం. అంతేకాకుండా తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి 3 నిమిషాల సేపు ఉంటారు. ఈ విధంగా శ్రీధర్ ఆరు పదుల వయసులో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా వ్యాయమం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ‘తాను గతంలో సాధారణ వాకింగ్‌తో పాటు వ్యాయామం చేసేవాడినని, తాను ఒక ఆర్టికల్ చదివి హృదయ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టే విధంగా ఈ వ్యాయామం పనిచేస్తుందని గ్రహించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఈ వ్యాయామంపై ప్రత్యేక దృష్టి సారించి వాకింగ్ చేయటం మొదలు పెట్టానని, దాదాపు మూడు సంవత్సరాలుగా రివర్స్ వాకింగ్ చేస్తూ.. తనలాంటి మరికొందరికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు ‘సాక్షి’తో తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని తాను పాటిస్తానని, తన వ్యాయామం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తనను మన్నించాలని కోరారు. -
భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్‌చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
TS Inter Result 2025: ఈసారి కూడా అమ్మాయిలదే హవా
సాక్షి, (హైదరాబాద్): ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ అమ్మాయిల హవానే కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి సత్తా చాటారు. కాగా.. రాష్ట్ర స్థాయిలోనే ఫస్టియర్‌లో మేడ్చల్– మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. సెకండియర్‌లోనూ ఈ రెండు జిల్లాలు మూడు, నాలుగో స్థానాలను కైవసం చేసుకున్నాయి. హైదరాబాద్ జిల్లా మరోసారి చతికిలపడి నిరాశే మిగిలి్చంది. మొత్తమ్మీద ఇంటరీ్మడియట్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు 73 శాతం ఉత్తీర్ణత లభించింది. గత ఏడాది కంటే 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఉత్తీర్ణత ఇలా.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్యా కోర్సులతో కలిపి 73.41 శాతం, ద్వితీయ సంవత్సరంలో 73.39 శాతం ఉత్తీర్ణత లభించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్‌లో 66.68 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.36, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 77.21 శాతం, ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా 77.91, రంగారెడ్డి 77.53, హైదరాబాద్ 67.74 శాతం ఉత్తీర్ణత సాధించాయి.మరోసారి.. సత్తా చాటి.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది సైతం బాలికల హవానే కొనసాగింది. ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో ఫలితాలు పరిశీలిస్తే.. మేడ్చల్– మల్కాజిగిరిలో బాలికలు 82.40 శాతం, బాలురు 73.54, రంగారెడ్డి జిల్లాలో 81.92 బాలికలు, 72.24 బాలురు, హైదరాబాద్ జిల్లాలో 74.65 బాలికలు, 60.47 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో.. మేడ్చల్‌లో 82.21 బాలికలు, 74.56 బాలురు, రంగారెడి జిల్లాలో 82 శాతం బాలికలు, 73.70 బాలురు, హైదరాబాద్ జిల్లాలో బాలికలు 74.81, బాలురు 59.50 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారు. -
HYD: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియ్ సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించనున్నారుఉదయం 10 గంటల వరకు 50 శాతం ఓట్లు నమోదు అవ్వగా, 45 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ AVN రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ కార్పొరేటర్లు ఓటు వేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. డ్యూటీలో 250 మంది పోలింగ్ సిబ్బంది.. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. పోటీలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు.మొత్తం ఓటర్లు 112. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరిలో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్‌కు 14. సరిపడ సంఖ్య బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది. -
విద్యుదాఘాత మరణాలపై నివేదిక ఇవ్వండి
సిటీ కోర్టులు: వరుసగా జరుగుతున్న విద్యుత్ షాక్ మరణాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ టీజీఎస్పీడీసీఎల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుపాశాలు’ కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యుత్‌శాఖ కారణంగా సంభవించిన మరణాలపై సమాగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను జూన్ 4లోపు సమర్పించాలని టీజీఎస్పీడీసీఎల్ను ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. శంషాబాద్ కొందుర్గు మండలాలలో ఇటీవల జరిగిన ఘటనలతో పాటు గత ఏడాది కాలంలో 69 మంది విద్యుదాఘాతానికి గురై మరణించడం ఆందోళన కలిగించిందని పేర్కొంది. దీనికి కారణం ప్రమాదకరమైన వైర్లు, ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని కమిషన్ పేర్కొంది. జూన్ 2025 మొదటి వారంలోగా ఈ మరణాలకు సంబంధించి వివరణాత్మక నివేదికలను సమర్పించాలని సీఎండీ టీజీఎస్పీడీసీఎల్ను, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది.గత ఏడాది విద్యుత్ షాక్‌తో వర్షాకాలంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మరణించిన బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందకపోవడం సంబంధిత అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం.... ప్రజలకు జీవించే హక్కుతో పాటు తమ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోందని కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు సంబంధింత మరణాల్లో ఎక్కువగా కారి్మకులు ఉండడం, వారి మృతదేహాలను సబ్స్టేషన్ల ముందు పెట్టి ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడమేంటని ప్రశ్నించింది. తదుపరి విచారణలోపు నివేదిక సమరి్పంచకపోతే నేరుగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని సంబంధిత అధికారులను హెచ్చరించింది. -
ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)
-
మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ అమరిక.. రోబోటిక్ శస్త్రచికిత్సతో అద్భుతం
హైదరాబాద్: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి వైద్యులు అసాధారణ శస్త్రచికిత్స చేసి, పశ్చిమబెంగాల్‌కు చెందిన వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. అతడి సొంత మూత్రపిండాన్నే శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడంతోపాటు... పూర్తిగా పాడైపోయిన మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ ఉపయోగించి అతడి కిడ్నీల పనితీరును సాధారణ స్థితికి తీసుకొచ్చారు.ఈ వృద్ధుడికి 2023లో వేరేచోట మూత్రపిండాల్లో రాళ్లు తీయడానికి మామూలు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో క్రియాటినైన్ ప్రమాదకరంగా పెరిగిపోయి, విపరీతమైన నొప్పి, తరచు జ్వరంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది.కిడ్నీలు రెండూ పాడైపోవడంతో తాత్కాలికంగా అతడికి ట్యూబులు (నెఫ్రోస్టమీలు) అమర్చి బయటి నుంచి మూత్రం పంపేవారు. పలు రాష్ట్రాలు తిరిగినా ఏ ఆస్పత్రీ చేర్చుకోకపోవడంతో చివరకు హైదరాబాద్ వచ్చారు. సమగ్ర పరీక్షలు చేసిన తర్వాత.. అతడి మూత్రనాళాలు చాలావరకు పూడుకుపోయినట్లు గుర్తించారు. ఇది చాలా అరుదు, సమస్యాత్మకం కూడా.కుడివైపు కిడ్నీ కోసం వైద్యులు ముందుగా అతడి సొంత అపెండిక్స్ తీసుకుని, పూడుకుపోయిన మూత్రనాళానికి బదులు దాన్ని అమర్చారు. అపెండిక్స్ కూడా మూత్రనాళం పరిమాణంలోనే ఉంటుంది. రోబోటిక్ శస్త్రచికిత్సతో దీన్ని మార్చారు. ఇది చాలా అరుదుగా చేసే చికిత్స. దీన్ని అపెండిక్స్ ఇంటర్పొజిషన్ అంటారు.“మూత్రనాళం బాగా పూడిపోఉయినప్పుడు దాన్ని బాగుచేయడానికి ఇది అత్యంత సృజనాత్మకమైన, మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి. సాధారణంగా ఇలా చేయరు. కానీ ఈ రోగి కేసులో ఇదే సరైన పరిష్కారం” అని ఏఐఎన్యూలోని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్,యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఈ చికిత్స అనంతరం అతడి కుడి కిడ్నీ బాగుపడింది. దాంతో బయట అమర్చిన ట్యూబులను తీసేశారు.సొంత కిడ్నీ మార్పిడి ఇలా.. రెండు నెలల తర్వాత అతడి ఎడమవైపు కిడ్నీ ఇంకా అలాగే ఉంది. అపెండిక్స్ కుడివైపే ఉంటుంది కాబట్టి రెండోవైపు పేగులను తీసి అమర్చవచ్చు. కానీ, అందులో ఈ వృద్ధుడికి సమస్యలు ఉండడంతో అత్యంత అరుదైన పరిష్కారాన్ని వైద్యులు ఎంచుకున్నారు. అదే.. సొంత కిడ్నీనే మార్చడం. ఈ సంక్లిష్టమైన చికిత్సలో.. రోగి ఎడమ కిడ్నీని రక్తనాళాలతో కలిపి తీశారు. తర్వాత దాన్ని కొంత కిందభాగంలో అమర్చారు. తద్వారా పాడైన మూత్రనాళాన్ని బైపాస్ చేసి, బాగున్న భాగంలోంచి మూత్రం వెళ్లేలా చేశారు.“సొంత కిడ్నీ మార్పిడి అనేది చాలా పెద్ద ఆస్పత్రుల్లోనే చేస్తారు. ఇది చిట్టచివరి పరిష్కారం. చాలా కచ్చితత్వంతో చేయాల్సిన శస్త్రచికిత్స. అతడి శరీరంలోనే అతడి కిడ్నీకి వేరే ఇల్లు ఇచ్చాం” అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ మద్దూరి తెలిపారు. ఇప్పుడా బెంగాలీ వృద్ధుడు పూర్తి సాధారణ స్థితికి చేరుకున్నారు. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, క్రియాటినైన్ స్థాయి సాధారణంగా ఉంది. నొప్పి, ఇతర సమస్యలూ తగ్గిపోయాయి.“ఈ కేసు వైద్యపరంగా ఓ సరికొత్త విజయం. రెండు కిడ్నీలను కాపాడేందుకు రెండు విభిన్న రకాల, అత్యాధునిక శస్త్రచికిత్సలు చేశాం. ఒకదాంట్లో అపెండిక్స్ను ఉపయోగించగా, మరోదాంట్లో సొంత కిడ్నీనే మార్చారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలా చేసినవాటిలో విజయవంతం అయినవే చాలా తక్కువ” అని ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో డాక్టర్ తైఫ్ బెండెగెరి కూడా పాల్గొన్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆసిత్ సాయపడ్డారు. -
‘భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుంది’
హైదరాబాద్: త్వరలో హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే భారత్ సమ్మిట్ 2025 అనేది చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ కు సంబంధించి ‘సాక్షి’తో మాట్లాడిన ఆయన.. ‘జాతీయ , అంతర్జాతీయ రాజకీయ, సామాజిక ,ఆర్దిక సమస్యల పై సమ్మిట్ లో చర్చ జరుగుతుంది. వందకు పైగా దేశాల నుంచి 400మందికి పైగా రాజకీయ, ఆర్థిక ,సామాజిక స్థితిగతుల లో నిష్టాతులైన వారు సమ్మిట్ కు హాజరవుతారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ లను ఆహ్వానించాం. రోహిత్ వేముల చట్టం తీసుకువస్తాం. ఈ చట్టం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఓత్తిడి పెరుగుతుంది. హైదరాబాద్ ఇమేజ్ పెరగనుంది. ఖర్గే, సోనియా, రాహుల్ ,ప్రియాంక గాంధీ లతో పాటు కార్పోరేట్ పెద్దలకు ఆహ్వానం. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సమ్మిట్ నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తాం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
శానిటరీ ప్యాడ్ల ఫ్యాక్టరీపై బీఐఎస్ దాడులు
హైదరాబాద్: ఐఎస్ఐ మార్కు లేని శానిటరీ ప్యాడ్లు సరఫరా చేస్తున్న ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం, కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జరిగిన సోదాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 30 వేల ప్యాడ్లు, 7వేలకు పైగా లేబుల్ కవర్లకు ఐఎస్ఐ మార్కు లేనట్లు గుర్తించిన అధికారులు వాటన్నింటినీ జప్తు చేశారు.మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఐఎస్ 5405:2019 ప్రమాణాలున్న శానిటరీ ప్యాడ్లను భారత ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ గెజిట్ ద్వారా బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. బీఐఎస్ ధ్రువీకరణ పొందకుండా అమ్మినా, తయారు చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించింది. అయితే, ఈ కేంద్రంలో ఎలాంటి ధ్రువీకరణ లేకుండా పెద్ద ఎత్తున శానిటరీ న్యాప్కిన్లు నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అందడంతో సోదాలు నిర్వహించినట్లు బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధిపతి, సంచాలకులు పీవీ శ్రీకాంత్ తెలిపారు. జాయింట్ డైరెక్టర్లు సవిత, రాకేశ్ తన్నీరు ఆధ్వర్యంలో బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా మొదటిసారి, ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా రెండోసారి, తదుపరి దీనికి పదిరెట్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం 679 ఉత్పత్తులను తప్పనిసరి చేస్తూ పలు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుదల చేసింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్క వినియోగదారుడూ అవగాహన కలిగి ఉండాలని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వస్తువుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించాలని, ఉల్లంఘనలను గుర్తిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. -
హైదరాబాద్‌లో దారుణం.. భార్య, అత్తపై అల్లుడు దాడి
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. క్యాబ్ డ్రైవర్ మహేష్.. శ్రీదేవి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో శ్రీదేవి తల్లి మంగ తన కూతురును చూసేందుకు ఇంటికి రాగా, అయితే మహేష్, శ్రీదేవిల మధ్య మరోసారి గొడవ జరిగింది. వారిని గొడవ పడొద్దని మంగ వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ తన భార్య శ్రీదేవి, అత్త మంగపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీదేవి స్వల్పంగా గాయపడగా.. ఆమె తల్లి మంగ తీవ్రంగా గాయపడింది. ఆమెను మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
ఫేస్‘బుక్కై’పోయాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సుదీర్ఘ కాలం తర్వాత మరో కస్టమ్స్ ఫ్రాడ్ కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నేరగాడు కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి రూ.1.55 లక్షలు కాజేశాడు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి దాదాపు రెండు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమెరికాలో ఉంటున్న సర్జన్ హెన్రీ రాబర్ట్ అంటూ ప్రొఫైల్ ఉండటంతో నగరవాసి యాక్సప్ట్ చేశాడు. ఆపై వాట్సాప్ కాల్స్ చేసిన రాబర్ట్ నగరవాసితో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడు. తాను త్వరలోనే భారత్‌కు వస్తున్నానని, హైదరాబాద్ వచ్చి కలుస్తానని చెప్పాడు. పూర్తిగా నమ్మించేందుకు డమ్మీ ఫ్లైట్ టిక్కెట్స్ ఫొటోలను పంపాడు. కొన్ని రోజులకు బాధితుడికి కాల్ చేసిన రాబర్ట్ తాను ముంబై విమానాశ్రయంలో దిగానని, తన వద్ద లెక్కలు చెప్పని 1.2 లక్షల డాలర్లు ఉన్నాయని నమ్మించాడు. దీంతో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారన్న రాబర్ట్ పన్ను చెల్లించకపోతే నగదుతో పాటు తన లగేజీ సైతం జప్తు చేస్తారని చెప్పాడు. ఆపై ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారిగా మాట్లాడిన మరో వ్యక్తి రాబర్ట్ రూ.1.55 లక్షలు పన్ను చెల్లించాలని చెప్పాడు. తాను బయటకు వచ్చాక ఆ మొత్తం ఇచ్చేస్తాంటూ రాబర్ట్ చెప్పంతో నమ్మిన నగర వాసి ఆ మొత్తం వాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో నిందితుడి అరెస్టు... నగరానికి చెందిన బాధితుడి (68) నుంచి ఏళ్ల బాధితుడి నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.52,29,500 కాజేసిన కేసులో ఓ నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌మీడియా ద్వారా బాధితుడికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు 5పైసా క్యాపిటల్ లిమిటెడ్, బార్క్లేస్, షాండా క్యాపిటల్ గ్రూప్ లిమిటెడ్‌ల్లో పెట్టుబడుల పేరు చెప్పారు. ఓ టెలిగ్రాం గ్రూపులో సభ్యుడిగా చేర్చి ప్రియా అగర్వాల్, గౌరవ్ ముంజాల్ పేర్లతో ఇరువురు సలహాలు సూచనలు ఇచ్చారు. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ నిండా ముంచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన ప్రతీఖ్ శుక్లాను అరెస్టు చేశారు. అతడిపై దేశ వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
కాచిగూడ(హైదరాబాద్): వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్రాజ్ (62), అతడి భార్య మీనా దుగ్గర్ (59) నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచి్చంది. దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్రాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్రాజ్ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డిఐ, ఎస్ఐ పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ టెలీ తాజాగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం యూఏఈకి చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ, ఎడ్జ్ గ్రూప్‌లో భాగమైన క్యారకల్‌తో జట్టు కట్టింది. రెండు సంస్థల మధ్య కుదిరిన లైసెన్సింగ్ ఒప్పందం కింద క్యారకల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదం కింద ఈ ప్లాంటులో సీఏఆర్ 816 క్లోజ్–క్వార్టర్స్ అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, సీఏఆర్ 817 అసాల్ట్ రైఫిల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తారు. వీటిని భారత సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లు, రాష్ట్రాల పోలీస్ ఫోర్స్‌లు, ఎస్పీజీ మొదలైన రక్షణ రంగ విభాగాలకు సరఫరా చేయడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. రక్షణ బలగాల పట్ల తమ నిబద్ధతకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్‌పై నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఐకామ్ ఎండీ సుమంత్ పాతూరు తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారానికి సంబంధించి సాంకేతిక బదిలీ ఒప్పందం కీలక మైలురాయిలాంటిదని క్యారకల్ సీఈవో హమద్ అల్అమెరి పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
జపాన్‌కు చెందిన డైఫుకు కో., లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Daifuku Intralogistics India) తెలంగాణలోని హైదరాబాద్‌లో అత్యాధునిక తయారీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇంట్రాలాజిస్టిక్స్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు రూ.227 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.ఈ-కామర్స్, రిటైల్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీ వంటి వివిధ రంగాలలో ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేలా హైదరాబాద్‌లోని ఈ ఇన్నోవేషన్ కేంద్రాన్ని కంపెనీ రూపొందించింది. అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీలు, డిజిటల్ టూల్స్, సస్టైనబుల్ పద్ధతులను ఈ కేంద్రం సమగ్రపరుస్తుంది. ఇది 2030 నాటికి భారతదేశ లాజిస్టిక్స్ అండ్ వేర్‌హౌసింగ్ మార్కెట్ 650 బిలియన్ డాలర్లను దాటే అంచనాకు అనుగుణంగా ఉంటుంది.ఈ గుర్తించదగిన పెట్టుబడి భారతదేశ "మేక్ ఇన్ ఇండియా" దృష్టిని బలోపేతం చేస్తుంది. భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తుంది. అలాగే భారత్‌ను అత్యాధునిక ఇంట్రాలాజిస్టిక్స్ సొల్యూషన్స్‌కు కేంద్రంగా నిలుపుతుంది. భారత్ తమకు అత్యంత వ్యూహాత్మక గ్లోబల్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తుందని డైఫుకు కో., లిమిటెడ్ సీఈవో హిరోషి గెషిరో విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కేంద్రం భారత్, జపాన్ మధ్య గల బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుందని డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ గరిమెళ్ల అన్నారు. డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా సీఈవో అసిమ్ బెహెరా మాట్లాడుతూ ఈ అసాధారణ ఇన్నోవేషన్ పెట్టుబడి భారతదేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన సొల్యూషన్స్‌ను అందించే తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ఈ కేంద్రం ద్వారా ఇంజినీరింగ్, ఆటోమేషన్, ప్రొడక్షన్ రంగాల్లో 100 మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. -
ఏపీ సిట్ అధికారుల అదుపులో రాజ్ కేసిరెడ్డి
హైదరాబాద్,సాక్షి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు దుబాయ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, విజయవాడకు తరలిస్తున్నారు. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి ఆడియో విడుదలమంగళవారం సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి ఓ ఆడియోని విడుదల చేశారు. అందులో ‘నేను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నాను. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు సిట్ ఆఫీసుకు వస్తానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చాను. నా ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉంది. కాబట్టి సిట్ విచారణకు హజరవుతున్నాను’ అని పేర్కొన్నారు.రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కేసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి. -
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలం.. రేవంత్ సర్కార్ సీరియస్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలంపై సీఎం రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. సెక్రటేరియట్ భద్రత ఏర్పాట్లు, సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాల నిఘాపై జీఏడీ ఆరాతీ తీసింది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఎంట్రీ ,ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎస్పీఎఫ్‌పై జీఏడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సెక్రటరియేట్ మొత్తం 246 సీసీ కెమెరాలు మరో 30 కెమెరాలు పెట్టే యోచనలో ఉన్నట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలతో పాటు కీలకమైన 6వ అంతస్తులో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ ప్రజలు ఎంట్రీ అయ్యే సౌత్ ఈస్ట్ గేటుతో పాటు ఇన్సైడ్ ఎంట్రీ వద్ద మరోసారి చెకింగ్ చేయనుంది.సెక్రటరియేట్లో రెండంచెల భద్రత వలయాన్ని ఎస్పీఎఫ్ మోహరించింది. -
అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్
హైదరాబాద్: గత పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. అదే తెలంగాణకు కేంద్రం చేసింది అనే దానిపై చర్చకు వస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అబిడ్స్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా కేటీఆర్? అని ఈటల ప్రశ్నించారు.‘కాంగ్రెస్ నైజం దేశ వ్యాప్తంగా బట్టబయలైంది. మరొకవైపు కార్పోరేట్లరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయొద్దని బీఆర్ఎస్ అప్రజాస్వామిక పిలుపునిచ్చింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి. కేంద్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి. మజ్లీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు.ముఖ్యమంత్రి గత విదేశీ పర్యటనలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ కనపడటలేవు. ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఉడిపోతున్నాయి. కేసీఆర్ హయంలోనే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యే వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు’ అని ఈటల విమర్శించారు.. -
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మందు బాబులకు అలర్ట్. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. -
Pet lovers ఆహారం పెట్టేముందు ఆలోచించండి?! ఈ చట్టం తెలుసా?
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.చట్టం ఏం చెబుతోంది.. మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు? సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్‌కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.వన్యప్రాణుల పట్ల జాగ్రత్త.. నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు. భద్రతకు భంగం కలగకుండా.. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు. -
Hyderabad: మధ్యాహ్నం ఎండలు.. సాయంత్రం ఈదురు గాలులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గత మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో పూర్తిగా చల్లబడుతోంది. ఇక వర్షం ప్రారంభమైతే అతలాకుతలం చేస్తోంది. భారీ ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చెట్లు విరిగిపడుతున్నాయి. వాహనాలు ధ్వంసమవుతున్నాయి. విద్యుత్ వైర్ల తెగిపడుతున్నాయి. రోజువారీగా సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 36 నుంచి 39 డిగ్రీల వరకు, కనిష్టంగా 26.5 నుంచి 20.8 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ మేర వీస్తున్నాయి. అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. నగరంలో ఉదయం 7 గంటల నుంచే ఎండ పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. మరో వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఆదివారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుండటంతో వరుసగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. కన్నతల్లే..
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. అనంతరం తల్లి కృష్ణ పావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రగతినగర్ ఆదిత్య గార్డెన్లో ఓ అపార్ట్మెంట్లో సాంబశివరావు, తన భార్య నంబూరి కృష్ణ పావని, కూతురు జశ్వికలతో కలిసి నివాసం ఉంటున్నారు 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ఇంట్లో భర్త లేని సమయంలో కృష్ణ పావని.. తమ కూతురు జశ్వికకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు తాగించి.. ఆ తర్వాత తాను తాగింది. 19వ తేదీ తెల్లవారుజామున విషం తాగినట్లు గుర్తించిన భర్త.. భార్య, కూతురిని ఆసుపత్రికి తరలించారు.ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణ పావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. -
‘ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది’
హైదరాబాద్: కంపెనీల సెక్రటరీలు దేశ కార్పోరేట్ రంగానికి రూపు రేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. నగరంలో ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీలో ఐసీఎస్ఐ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా)హైదరాబాద్ చాప్టర్ నూతన భవానికి భూమి పూజ చేసిన కిషన్‌రెడ్డి అనంతరం మాట్లాడారు.‘ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. కంపెనీ సెక్రటరీలు దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోంది.సత్యం వద(సత్యం పలుకు), ధర్మం చర(ధర్మం ఆచరించు) సూత్రం ఆధారంగా ICSI పనిచేస్తోంది.ప్రతి కంపెనీ సెక్రటరీ ప్రతిరోజు ఈ సూత్రాన్ని ఆధారంగా పని చేస్తే దేశ వ్యాపార రంగం నిజాయితీ పారదర్శకతతో ముందుకు సాగుతుంది.ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరో రెండేళ్లలోనే 5 బిలియన్ మార్క్ దాటనుంది. ఈ విజయం మీలాంటి ప్రొఫెషనల్స్ హార్డ్ వర్క్, అంకితభావం, విలువలతో కూడిన వ్యాపారం వల్లే సాధ్యమైంది. ఇప్పటికే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్ ని గుర్తించి, కంపెనీ సెక్రటరీలు, లాయర్లు, అకౌంటెంట్లను వారి దేశాల్లో పనిచేసేందుకు నియమించుకుంటున్నాయి. ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.ఇంటలెక్చువల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు. సమాజంతోపాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని విషయం గుర్తుంచుకోవాలి.భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా కంపెనీ ICSI లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
హైదరాబాద్ : గచ్చిబౌలిలో తారల సందడి (ఫొటోలు)
-
విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. -
యూత్లోనయా ట్రెండ్, F3 : ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్
జనరేషన్ మారింది.. యూత్ లైఫ్‌స్టైల్ మారింది.. ఆలోచనాతీరు మారింది.. ఆధునికత రూపంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొచ్చింది. ఇప్పుడు ఎఫ్ త్రీ కీలకంగా మారింది. ఒకప్పుడు ఖలీల్ వాలీ హవేలీలు, మొగలాయి వంటకాలు, చార్మినార్ బజార్లకు ప్రసిద్ధి అయిన నగరం ఇప్పుడు మోడరన్ కల్చర్‌కు కేంద్రంగా మారుతోంది. పార్టీ గేమ్స్ అనేవి మోడరన్ యూత్ ఫన్ థీమ్స్‌గా మారాయి. ముఖ్యంగా ‘స్నూకర్‘, ‘పూల్‘, ‘డార్ట్‘, ‘షాఫుల్ బోర్డు‘, ‘బోర్డ్ గేమ్స్‘ లాంటి గేమ్స్ పబ్స్, లాంజ్లలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ గేమ్స్ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, గచ్చిబౌలిప్రాంతాల్లో మొదలై జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హై ఎండ్ జోన్లను దాటింది. – సాక్షి, సిటీ బ్యూరోపార్టీ గేమ్స్ మానసిక విశ్రాంతి, స్నేహితులతో కాలక్షేపానికి మాత్రమే కాకుండా సోషల్ కనెక్టివిటీకి వేదికగా మారాయి. వాటితోపాటు వచ్చిన ఫుడ్, మ్యూజిక్, డ్రింక్ కల్చర్ యువతను మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఇది ఫుడ్ + ఫన్ + ఫ్రెండ్స్ = ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అనే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ గేమ్స్ ద్వారా యువత మానసికోల్లాసం పొందడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడం జరుగుతోంది. ఉద్యోగాల ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ‘నైట్ ఔట్‘ అంటే కేవలం ఫుడ్ కాకుండా, ఆటలతో కలిపిన ఎంటర్టైన్మెంట్ను సూచిస్తోంది. నగరంలో స్నూకర్, పూల్ లాంజ్‌లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హిమాయత్ నగర్లలో అందుబాటులో ఉండగా డార్ట్, షాఫుల్ బోర్డు గేమ్స్ గండిపేట్, ఫైనాన్షియల్ డిస్ర్టిస్క్ట్, కొండాపూర్‌లో బోర్డ్ గేమ్స్, సాఫ్ట్ గేమింగ్ లాంజ్‌లు మాదాపూర్, మణికొండ, బంజారాహిల్స్‌లో యువతను ఆకర్షిస్తున్నాయి. బ్రిటన్ టు భారత్... పార్టీ గేమ్స్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌లోకి వచ్చింది. ముఖ్యంగా యూరప్‌లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ పురుడు పోసుకుంది. అక్కడి పబ్ సంస్కృతిలో భాగంగా బిల్లియర్డ్స్, పూల్, డార్ట్ వంటి గేమ్స్ ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ఈ సంస్కృతి మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో ఇది వేగంగా వ్యాపించింది. ఉద్యోగులకు ఈ గేమ్స్ రిలాక్సేషన్‌తోపాటు టీమ్ బాండింగ్ సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఇదొక స్టేటస్ సింబల్... ఇప్పుడు పబ్‌కి వెళ్తే కేవలం మ్యూజిక్, డ్రింక్స్ కాదని, మినీ టోర్నమెంట్లు, ఫ్రెండ్స్ సర్కిల్ మధ్య స్నూకర్ మ్యాచ్‌లు సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ గేమ్స్‌ను కార్పొరేట్ పార్టీలలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. యువతలో ఇది ఒక స్టేటస్ సింబల్‌గా కూడా మారుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్పేస్‌లు గేమింగ్ కల్చర్‌తో ముడిపడి, సాంస్కృతిక మార్పునకు సూచికలుగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతితో సమన్వయం సాధిస్తూ, నగరం తనదైన శైలితో ముస్తాబవుతోంది.ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫ్రీ లేదా ప్లే అండ్ పే... నగరంలోని ఐక్యూ లాంజ్, స్ట్రైకర్ క్లబ్, ది హోపరీ, హార్ట్ కప్ కాఫీ, గేమర్స్ డెన్, సోబో కేఫ్ వంటి వాటిలో ఇలాంటి పార్టీ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరు నిర్వాహకులు ఈ గేమ్స్ తమ కస్టమర్లకు ఉచితంగా ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తే, మరికొందరు మాత్రం ప్లే అండ్ పే అంటూ చార్జ్ చేస్తున్నారు. మరికొందరైతే రీ చార్జ్ గేమింగ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు.చదవండి: అయ్యో ఎంత విషాదం కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
మిల్లెట్స్‌తో ఆరోగ్యం మెరుగు: అమల
లెట్ సీ కమ్యూనిటీ ప్రారంభం మాదాపూర్: అందరూ ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని సినీనటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని అన్నారు. మాదాపూర్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్లో శనివారం లెట్ సీ (లివింగ్ త్రూ కమ్యూనిటీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారం, ఆధ్యాతి్మకత, ఆరోగ్యం, ఉద్యమోన్యుఖత అనే నాలుగు అంశాలు మన జీవితంలో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిల్లెట్లను వాడుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా ఉండాలని కోరారు. లెట్సీ ద్వారా ఫిజికల్ మీటింగ్స్, ఆన్లైన్ సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యతరగతి యువతను మిల్లెట్ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ప్రశంసించారు. లెట్ సీ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ టిపిన్స్, భోజనాల పోడులు, నూడుల్స్, పాస్తా, స్నాక్స్, మిఠాయిలు తదితర ఉత్పత్తుల గురించి వివరించారు. 50 మంది డాక్టర్లతో ఏర్పాటు చేసిన హెచ్‌ఎన్‌ఏ కౌన్సిల్ తరపున డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ మండలాల వారీగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ గోషిక, సీఎ ప్రవీణ్‌కుమార్, మిల్లెట్ రైతులు, వినియోగదారులు, లెట్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెట్ ఫెస్ట్.. స్టైలిష్ డాగ్స్విభిన్న జాతులు.. వివిధ రకాల పెంపుడు కుక్కలు సందడి చేశాయి. చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం బీ2ఎం వెట్‌కేర్ ఆసుపత్రిలో రెయిన్బో విస్టాస్ పెట్ లవర్స్ అసోసియేషన్ సహకారంతో పెట్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ మెగా పెట్ ఫెస్ట్‌లో 40కిపైగా విభిన్నమైన జాతుల స్టైలిష్ డాగ్‌లు కనువిందు చేశాయి. పెంపుడు జంతువులను ఆకర్షించడం, వాటితో స్నేహం చేయడం, అనుభవాలను పంచుకోవడానికి పెద్ద సంఖ్యలో పెట్ లవర్స్ తరలి రావడంపై గర్వంగా ఉందని బీ2ఎం వెట్‌కేర్ వ్యవస్థాపకుడు సంతోష్‌నాయక్ అన్నారు. పెంపుడు జంతువుల సంరక్షణ చర్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి పెట్ ఒక ప్రత్యేకమైనదన్నారు. -
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్ఎస్టేట్ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.ఓ హత్యకేసులో ప్రశాంత్‌రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రాంగోపాల్‌పేట(హైదరాబాద్): వ్యభిచార ముఠా వ్యవహారాన్ని రాంగోపాల్‌పేట పోలీసులు రట్టు చేసి ఇద్దరు విటులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపి డబ్బులు సంపాధిస్తున్నట్లు గుర్తించారు. రాంగోపాల్‌పేట ఇన్స్పెక్టర్ నర్సింగరావు తెలిపిన వివరాల మేరకు.. రాంగోపాల్‌పేట పీజీరోడ్డు, బాపూబాగ్ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈనెల 18న పథకం ప్రకారం దాడి చేసి ఇద్దరు విటులతో పాటు ఇద్దరు యువతులను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వచ్చినట్లు సదరు యువతులు తెలిపారు. ఉదోగ్య ప్రయత్నంలో ఉండగా స్వప్న అనే యువతి పరిచయం అయిందని, చేతన్ అనే వ్యక్తితో కలిసి ఈ భవనంలో ఉంటున్నామని వివరించారు. పట్టుబడిన విటులు నగరానికి చెందిన మహ్మయద్ అవియాజ్ (32), ఫహాద్ హుస్సేన్ (25)పై కేసులు నమోదు చేశారు. యువతులను షెల్టర్హోంకు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు స్వప్న, చేతన్ కోసం గాలిస్తున్నామన్నారు. నిర్వాహకురాలు స్వప్న వాట్సాప్, ఫోన్ నంబర్ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచార గృహానికి రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
‘వక్ఫ్’పై దేశవ్యాప్త ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఓ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆ చట్టాన్ని మోదీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకొనేలా దేశవ్యాప్తంగా అన్నదాతలు పోరాడిన స్ఫూర్తితో నల్ల చట్టాన్ని ఉవసంహరించే వరకు దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహా్మనీ అధ్యక్షతన జరిగిన సభలో డీఎంకే ఎంపీ మహ్మద్ అబ్దుల్లా, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ హఫీజ్ ఖాన్, బీఆర్ఎస్ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు సయ్యద్ నిసార్ హుస్సేన్ హైదర్ ఆఘా, మౌలానా మతీనుద్దీన్ ఖాద్రీ, మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు. 11 ఏళ్లుగా ముస్లింలపై అణచివేత.. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రూపొందించే సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మతపరమైన విధానాలు, సంప్రదాయాలను స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే అంబేడ్కర్ కంటే తనను తాను గొప్పగా భావిస్తున్న ప్రధాని మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కానీ వాస్తవానికి అంబేడ్కర్ కాలి ధూళికి కూడా మోదీ సరిపోరని వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ 11 ఏళ్లుగా దేశాభివృద్ధిని మరిచి ముస్లింలను అణచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు.వక్ఫ్ సవరణ చట్టంతో మసీదులు, ఆస్తులను కాజేయడానికి ప్రయతిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 500కుపైగా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వపరం చేశారని మండిపడ్డారు. గతంలోనే బోహ్రా వర్గం వక్ఫ్ బిల్లు నుంచి మినహాయించాలని కోరిందని.. కానీ సవరణ చట్టంపై బోహ్రా వర్గం సంతృప్తిగా ఉన్నట్లు మోదీ ఫొటోలకు పోజులిస్తున్నారని ఆయన విమర్శించారు. ముస్లింలను విభజించడం ద్వారా బలహీనపరిచేందుకు మోదీ చేస్తున్న కుటిలయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే నల్ల చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించిన ఒవైసీ.. ఈ విషయంలో కోర్టులు తమకు న్యాయం చేస్తాయనే విశ్వాసం ఉందన్నారు. నిరసనల కోసం కార్యాచరణ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 30న రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 నిమిషాలు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపాలని కోరింది. అలాగే మే 18న రౌండ్ టేబుల్ సమావేశాలు, మే 22న హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లో మహిళల బహిరంగ సభ, మే 25న అన్ని జిల్లాల్లో మానవహారం, జూన్ 1న అన్ని జిల్లాల్లో ధర్నాలు, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. -
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి మాజీ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంజారాహిల్స్‌లోని నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి పైకి ఎక్కిన ఓ యువతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు యత్నించింది.యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను కిందకు దింపేదుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళను ఆసుపత్రి మాజీ ఉద్యోగి శివలీలగా గుర్తించారు. ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ శివలీల డిమాండ్ చేస్తోంది. -
Hyderabad: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఐదో అంతస్తులో మంటలు ఎగిసిడుతున్నాయి. నిమ్స్ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.👉ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. గ్రేటర్లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది. -
తగ్గినా.. పెరిగినా.. అనారోగ్యమే..
వస్తువుల్ని తూకమేసి అమ్మడం తెలిసిందే.. కానీ కొలత వేసి తినడం ఇప్పుడు సిటీజనులు అలవాటు చేసుకుంటున్నారు. సుషు్టగా తినడానికి బోలెడన్ని అవకాశాలున్నా వాటిని సరిగ్గా జీరి్ణంచుకునేందుకు తగిన శారీరక శ్రమ లేని నేపథ్యంలో నగరవాసుల ‘పొట్ట’తిప్పలు కొత్త దారి పట్టాయి. అవసరాన్ని మించిన ఆహారం ఆరోగ్యానికి చేటు అని గుర్తిస్తూ.. తింటున్న ఆహారాన్ని కొలిచే పనిలో పడ్డారు. వీరికి నగరంలో చెఫ్‌లు, న్యూట్రిషనిస్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన తరగతులు ఉపకరిస్తున్నాయి. ఎంత వరకూ యాప్్ట? పలు యాప్స్ సిటీజనుల ఆహారపు అలవాట్లను పర్యవేక్షిస్తున్నాయి. తింటున్న ఆహారం ద్వారా వారికి అందుతున్న కేలరీలను అవి ఖర్చవుతున్న తీరూ చెబుతున్నాయి. అయితే కొన్ని యాప్స్ అమెరికన్/విదేశాల ఫుడ్ వాల్యూస్‌తో తయారైనవి కాబట్టి మనకి అవి పూర్తిగా కరెక్టా కాదా? అనేది ఖచి్చతంగా చెప్పలేమని న్యూట్రిషనిస్ట్‌లు అంటున్నారు. మెనూలోనూ సమాచారం.. నగరంలోని పలు స్టార్ హోటల్స్, టాప్‌క్లాస్ రెస్టారెంట్లు తమ వంటకాల మెనూలోనే కేలరీల సమాచారాన్ని కూడా పొందుపరుస్తున్నాయి. రెస్టారెంట్స్‌లో తినడం అనే అలవాటు నగరాల్లో పెరిగిపోయిన నేపథ్యంలో 2022లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఎఐ) రెస్టారెంట్లు తమ మెనూలోని వంటకాలు అందించే కేలరీల గణనను తప్పనిసరిగా పేర్కొనాలని ఆదేశించింది. దాంతో పలు స్టార్ హోటల్స్ ఈ ఆదేశాలను పాటిస్తుండటం వల్ల నగరవాసులకు తాము తీసుకుంటున్న ఆహారం అందించే కేలరీలపై అవగాహన ఏర్పడుతోంది. కేలరీస్.. కేర్‌ఫుల్ ప్లీజ్.. అధిక కేలరీల వల్ల ఊబకాయం, డయాబెటిస్, కేన్సర్ తదితర వ్యాధులకు దారితీస్తుంది. తగినంత కేలరీలు పొందకపోవడం పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. అంటువ్యాధులు, ఆందోళన ఏకాగ్రత లోపం పెంచుతుంది. అధిక కేలరీల భారం లేకుండా కీలకమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు తృణధాన్యాలు వంటి పూర్తి, ప్రాసెస్ చేయని ఆహారాలను తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారాన్ని ప్రోత్సహించడానికి చిన్న ప్లేట్లు గిన్నెలను ఉపయోగించడం ద్వారా అతిగా తినడం తగ్గించాలి. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ సాధారణంగా పోషకాలు లేనివిగా, అధిక కేలరీలు కలిగి ఉంటాయి. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాలను ఎంచుకోవాలి. ప్రతి భోజనం నిదానంగా చేయాలి.. నెమ్మదిగా నమలాలి, ప్రతి బైట్‌ను ఆస్వాదించడానికి పరధ్యానాన్ని వదలాలి. రెగ్యులర్ శారీరక శ్రమ శక్తిని ఖర్చు చేయడం ద్వారా కేలరీలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన–తీవ్రతతో వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.రుచికన్నా మన శరీరానికి కలిగే లాభం మిన్న అనే ఆరోగ్య స్పృహ నగరవాసుల్లో బాగా పెరిగిందని నగరానికి చెందిన చెఫ్ కుమార్ అంటున్నారు. గతంలో అత్యంత రుచికరమైన వంటలు ఎలా చేయాలో అడిగిన మహిళలు ఇప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారం గురించి అడుగుతున్నారని చెప్పారు. తరచూ తాము నిర్వహిస్తున్న స్మార్ట్ స్నాకింగ్ సెషన్స్‌లో ఒక్కోసారి ఒక్కో దినుసుతో ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో నేర్పుతున్నామని, ఈ క్లాసెస్‌కి ఆదరణ బాగుందన్నారు. అవగాహన తరగతులూ షురూ.. ‘బాదం పప్పులు రోజువారీగా ఆహారంలో తీసుకోవడం మంచిది. కేవలం 4 పప్పులు తీసుకుంటే 29గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 322 మి.గ్రా కాల్షియం, 987 మి.గ్రా పొటాíÙయం, 322 మి.గ్రా కాల్షియం, 16.2 మి.గ్రా పీచు పదార్థాలు, 460 మి.గ్రా సోడియం.. వగైరాలు లభిస్తాయి’.. శ్రీనగర్‌కాలనీలో తన కుమార్తెకు వివరంగా చెబుతున్న మధ్యవయస్కురాలైన సుగుణ ఇటీవల తాజ్ డెక్కన్ హోటల్లో ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోరి్నయా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరవడం ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోగలిగారు. ఇదేవిధంగా నగరానికి చెందిన మరి కొందరు గృహిణులు సైతం పోషకాహారంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆచి తూచి.. ఆలోచించి..ఆహారం మీద సిటిజనుల్లో అవగాహన పెరగడం మంచి పరిణామమే. కానీ ఇంకా చాలా విషయాల్లో సరిపడా లేదనే చెప్పాలి. ఉదాహరణకు టీలు, కాఫీలు తాగితే ఏమీ కాదనుకుంటారు. కానీ టీ లేదా కాఫీ కూడా రోజుకి 2 కప్పులు మించకూడదు. దానిలో ఉండే పంచదార, పాలు కేలరీలను పెద్ద సంఖ్యలోనే జమ చేస్తాయి. అలాగే ఆల్కహాల్ తాగితే ద్రవమే కదా కేలరీలు రావనుకుంటారు. కానీ 1ఎం.ఎల్ఆల్కహాల్తో 7 కేలరీలు వస్తాయి. దానికి తోడు మంచింగ్ పేరుతో స్నాక్స్ అవీ జత చేస్తే మరింత హాని కలుగుతుంది. ఒకటే ఆహార పదార్థం ఇంట్లో వండిన దానికి బయట కొన్న దానికి కేలరీల్లో చాలా తేడా ఉంటుంది. బయట వండేవారు రుచి కోసం కలిపే నూనెలు, ఉప్పులు, దినుసుల వల్ల ఆ తేడా వస్తుంది. కూల్ డ్రింక్స్ కూడా అధికంగా కేలరీలను అందిస్తాయి. సగటున ఒక వ్యక్తి 1800 నుంచి 2200 వరకూ కేలరీలను తీసుకోవచ్చు. అయితే శారీరక శ్రమ, చేసే పని బట్టి ఇందులో కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. జాగ్రత్త పడినా బరువు పెరుగుతున్నామంటే మనం పాటిస్తున్న, అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లలో లోపం ఉన్నట్లే భావించి తగిన వైద్య సలహా తీసుకోవాలి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్ -
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంఎస్ఎన్ రియాల్టీ అద్భుతమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోపోలిస్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను ‘వన్’ను నిర్మించనుంది. 7.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,750 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది.40 లక్షల చ.అ.లలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో 5 టవర్లు, ఒక్కోటి 55 అంతస్తుల్లో ఉంటుంది. 5,250 చ.అ. నుంచి 7,460 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 655 యూనిట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నీ 4 బీహెచ్‌కే యూనిట్లే ఉండే ఈ ప్రాజెక్ట్‌లో చ.అ. ధర రూ.11 వేలుగా ఉంటుంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు రెండు బాల్కనీలు, లార్జ్ డెక్ ఉంటుంది. గండిపేట చెరువు వ్యూ ఉండే ఈ ప్రాజెక్ట్‌లో 1.8 లక్షల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఉంటుంది.ఇందులో 30కి పైగా ఆధునిక వసతులు ఉంటాయి. మూడు స్విమ్మింగ్ పూల్స్, యోగా డెక్, స్కై సినిమా, ఆక్వా జిమ్, వెల్నెస్, లైఫ్‌స్టైల్ జోన్లతో పాటు బ్యాడ్మింటన్, స్క్వాష్, పికిల్‌బాల్, ప్యాడిల్ బాల్ కోర్టులు, బౌలింగ్ అల్లే, క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ఫ్ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లు ఉంటాయని ఆయన వివరించారు. నగరంలో వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల చ.అ.లలో ప్రాజెక్ట్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. -
బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్‌లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్‌గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్‌కు కోల్‌కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది. -
కూతురే.. కుమారుడిగా..
హైదరాబాద్: దేశంలోనే ప్రసిద్ధి గాంచిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ డాక్టర్ వెంకట్ రామ్‌నర్సయ్య (82) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో కుమార్తె శాంతి తండ్రి చితికి నిప్పటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు తల్లి లక్ష్మితో పాటు శాంతి భర్త నవీన్ చక్రవర్తి ఆమోదం తెలపడంతో శుక్రవారం అంబర్‌పేట శ్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలు పూర్తి చేశారు. రామ్‌నర్సయ్య వృత్తి రీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి మాత్రం వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ. వైల్డ్‌లైప్ ఫొటో గ్రఫీలో అప్పటి కాంగ్రెస్ అగ్రనేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు ఆయన గురువు కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దిగి్వజయ్‌సింగ్, డాక్టర్ వెంకట్ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తీసిన పులుల ఫొటోలతో దేశంలోనే టాప్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచి్చపెట్టాయి. అంతేగాకుండా పులులపై ఆయన ఓ పుస్తకాన్ని కూడా రాశారు. -
దిల్‌రాజు బ్యానర్ 'ఆకాశం దాటి వస్తావా' సెట్స్‌లో ధనశ్రీ వర్మ (ఫోటోలు)
-
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్‌కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్‌కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్‌కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్‌లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి. -
ఒక్క వానకే కకావికలం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం పగలంతా మండిన ఎండలు.. సాయంత్రానికి ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈదురుగాలులకు తోడు భారీ వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం నగరంలోని కంచన్‌బాగ్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురాలో 7.9, చారి్మనార్‌లో 7.63 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలుచోట్ల వరద నీరు భారీగా చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసిన భారీ వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో ఏకధాటి వర్షానికి దుబ్బాకలో 10 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపుపంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు జనగామ జిల్లా ఆలింపూర్‌లో వాన పడుతుండటంతో తలదాచుకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన చలువ పందిరి కిందకు వెళ్లారు. వారికి సమీపంలోనే పిడుగు పడగా, ఆ ధాటికి వారంతా ఎగిరిపడ్డారు. 12 మందికి గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న కొందరికి వైద్యులు సీపీఆర్ చేశారు. కాగా, కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో పిడుగు పడి 40 గొర్రెలు మృతిచెందాయి. రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు బాధితుడు కడారి దేవయ్య తెలిపాడు. జనగామ జిల్లా చేర్యాలలో పిడుగుపాటుకు మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి.నేడు, రేపు అక్కడక్కడా వానలురాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం నిజామాబాద్‌లో 42.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, దుండిగల్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్ దిల్సుఖ్నగర్, రాజేంద్రనగర్, అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. లంగర్‌హౌస్‌లో విద్యుత్ తీగలపై భారీ వృక్షం పడింది. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ట్రాన్స్ఫార్మర్పై భారీ వృక్షం పడిపోయింది. కంచన్‌బాగ్ 8, బహదూర్‌పురాలో 7.8 సెం.మీ, యాకూత్పురాలో 7.6, బేగంబజార్‌లో 6.9 సెం.మీ, సంతోష్‌నగర్ 6.9, దబీర్పురాలో 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎండలు, సాయంత్రానికి వర్షాలు.. ఈదురుగాలులు, వడగడ్ల వానలతో జనం పరేషాన్ అవుతున్నారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీయ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీదగా ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీతో వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే మూడు, నాలుగు రోజులు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని పలు ఉత్తర, ఈశాన్య జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. -
తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. హైదరాబాద్‌లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్.. 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుంది. దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదం చేస్తుంది. ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్ గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందన్నారు.కాగా, టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్టీటీ డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో పేరొందిన కంపెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో 193,000 మంది ఉద్యోగులతో, ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒకటి. పబ్లిక్ సర్వీసెస్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. నెయిసా నెట్ వర్క్ ఏఐ-ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ, నిర్దిష్ట ఏఐ కంప్యూటర్ సొల్యూషన్స్ అందించటంపై ఈ కంపెనీ దృష్టి సారిస్తుంది. -
‘మీకు ఒక పార్టీ అండ కావాలి.. ఇప్పుడు ఎవరు ప్రేమ కావాలి?’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రతీసారి ముస్లింలు, మజ్లీస్ మాత్రమే అంటూ కాలయాపన చేయడమే తప్పా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చారా అని నిలదీశారు. కిషన్ రెడ్డి.. ఒక కిస్మత్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు మహేష్ కుమార్‌గౌడ్,హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బలం లేకపోయినా పోటీకి దిగడాన్ని తప్పుబట్టారు. బలం లేనప్పుడు పోటీకి దిగి మిగతా పార్టీలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ‘ప్రతీ ఎన్నికల్లో ఏదో ఓక పార్టీ అండతో గెలుస్తారు. కిషన్ రెడ్డి రాజకీయ జీవితంలో తెలంగాణ కు పైసా రూపాయి లాభం అయినా జరిగిందా?, ముస్లిం, మజ్లీస్ తప్ప కిషన్ రెడ్డి నుంచి మరో మాట రాదు. బలం లేకున్నా ఏ ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. ఎవరి ప్రేమ కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. మాకు బలం లేదు కాబట్టే పోటీ చేయలేదని మేము ప్రకటించాం. బీజేపీ, బిఆర్ఎస్ మధ్య ప్రేమ చిగురించింది’అంటూ ధ్వజమెత్తారు.ఏరోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసారా?, పూర్వ కాలంలో కిషన్ రెడ్డి, ఓవైసీ అన్నదమ్ములు అయ్యి ఉంటారు. రజాకార్ల అంటె కిషన్ రెడ్డికి ప్రేమ ఎందుకు?, ... పదే పదే రజాకార్ల ప్రస్తావన కిషన్ రెడ్డి ఎందుకు తెస్తున్నారు. రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంతో బండి సంజయ్ కి తెలుసా?, ఇతర రాష్ట్రాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సంజయ్ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్ -
ఆస్తిలో వాటా కోసం, చిన్నబావమరిదికి స్కెచ్.. కట్ చేస్తే!
ఘట్కేసర్: ఆస్తి పంపకాల్లో వాటా కోసం రెక్కీ ఏర్పాటు చేసిన ఘటన ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన బోనాల రాజశేఖర్, ఈశ్వర్ తమ సోదరి లావణ్యను కొండాపూర్ మసీదుబండకు చెందిన మేడ్చల్ శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ. 12 లక్షలు, ఎకరం భూమి కట్నంగా ఇచ్చారు. అయితే తర్వాత తండ్రి పెంటయ్య ఉద్యోగ విరమణతో వచ్చినడబ్బులోనూ తనకు వాటా కావాలని సోదరి లావణ్య సోదరులను డిమాండ్ చేసింది. దీంతో ఇచ్చిన ఎకరం భూమి విక్రయించిందని, తిరిగి డబ్బులు ఇచ్చేది లేదనడంతో గొడవ ప్రారంభమైంది. బావమరుదుల కదలికలపై రెక్కీ.. బావమరుదుల కదలికలు తెలుసుకునేందుకు శ్రీనివాస్ టోలీచౌక్‌కు చెందిన బాబు షేక్ సాహెల్ (20), ఎండీ ఇర్ఫాన్ (20), మహమ్మద్ అబ్బు, సల్మాన్(18)తో పాటు మరో మైనర్‌తో రూ.15 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. రూ. 1000 చొప్పున 3 సార్లు గూగుల్ పే ద్వారా డబ్బు పంపించి చిన్నబావమరిది ఈశ్వర్, ఇంటి, లొకేషన్ ఫొటోలు శ్రీనివాస్ ఇర్ఫాన్‌కు అందజేశాడు. బుధవారం ఉదయం వారు అంకుషాపూర్ గ్రామంలో బైక్ నంబర్ కనిపించకుండా జాగ్రత్త పడటం, ముఖాలకు మాస్క్‌లు ధరించి అనుమానాస్పదంగా రెక్కీ నిర్వహిస్తుండగా.. స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని పట్టుకుని ఫోన్ తనిఖీ చేయగా బావ శ్రీనివాస్ పంపిన ఫొటోలు, ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు గుర్తించడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 4 సెల్ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు బావ శ్రీనివాస్, సోదరి లావణ్య పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోనూ రెక్కీ నిర్వహించిన విషయమై ఇప్పటికే ఓ కేసు ఉంది. హత్యాయత్నం కోణం ఉందా..? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. -
“చరిత్రలోకి అడుగేసి మన నగర గత వైభవాన్ని గుర్తిద్దాం”
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న నిర్వహించే ప్రపంచ వారసత్వ దినోత్సవం (International Day for Monuments and Sites) సందర్భంగా, ఈరోజు ఉదయం 7:30 గంటలకు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పురావస్తు శాఖ (ASI) – హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC), JBRAC, ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, ఇతర పౌర సంఘాల భాగస్వామ్యంతో ఘనంగా హెరిటేజ్ వాక్ నిర్వహించబడింది.Er. వేదకుమార్ మనికొండ, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద ప్రారంభించి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ప్రొఫెసర్ Ar. జి.ఎస్.వి. సూర్యనారాయణ మూర్తి(South Zone Representative, ICOMOS, India), డా. జి. జయశ్రీ, ప్రాచీన భారత చరిత్ర మరియు పురావస్తు శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ, కోటయ్య వింజమూరి, డిప్యూటీ సూపరింటెండెంట్ కెమిస్ట్, ASI, డా. ఈ. సాయికృష్ణ, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ASI, శ్రీమతి జె. రాజేశ్వరి (Conservationist, ASI), సాయి రామ్, సుధాకర్, కార్యనిర్వాహకులు(తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్) , ఎస్. ప్రభాకర్(DTO, పర్యాటక శాఖ), డి. శ్రీనివాస్ (హెరిటేజ్ వాక్ ఇన్చార్జ్), డి. శ్యాం సుందర్ రావు, స్థపతి, డా. ద్యావనపల్లి సత్యనారాయణ(క్యురేటర్, తెలంగాణ గిరిజన మ్యూజియం), పి. వీరమల్లు, అధ్యక్షుడు, బౌద్ధ తత్వ ఫౌండేషన్ మరియు సిటీ కాలేజ్, JBRAC, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, SRDP, వాసవి స్కూల్, వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు, పౌర సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.Er.వేదకుమార్ మనికొండ గారు చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకు ఉన్న ముఖ్యమైన వారసత్వ కట్టడాల చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ, వారసత్వ సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజపు కలసికట్టు బాధ్యతగా భావించాలని సూచించారు. హైదరాబాద్ యొక్క చారిత్రక ఘనతను ప్రజలకు తెలియపరుస్తూ, వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు.ఇంకా, తెలంగాణ వారసత్వ శాఖ మరియు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సంయుక్తంగా ముదుమల్ మెగలిథిక్ మెన్హిర్స్ సైట్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాథమిక జాబితాలో చేర్చించడంలో చేసిన ప్రయత్నాలను వివరించారు. త్వరలో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూర్యనారాయణ మూర్తి గారు మాట్లాడుతూ, ఇటువంటి వాక్‌ల ప్రాముఖ్యతను వివరించారు. చార్మినార్ యొక్క చారిత్రక, శిల్పకళా విశేషాలను విద్యార్థులకు వివరించారు.చార్మినార్ మీదుగా లాడ్ బజార్, మోతిగల్లి,మెహబూబ్ చౌక్ (ముర్గీ చౌక్), ఇక్బాల్ ఉద్ దౌలా దేవ్డీ, మక్కా మసీదు ద్వితీయ ద్వారం, జిలుఖానా,ఖుర్షీద్ జా బహదూర్ ప్యాలెస్,ఇక్బాల్ ఉద్ దౌలా ప్యాలెస్, ఖిలావత్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద ఈ వాక్ ముగిసింది.ఈ వాక్ ద్వారా పాల్గొన్నవారికి హైదరాబాద్ నగరపు ప్రాచీన వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగారు. రాజప్రాసాదాలు, శతాబ్దాల నాటి మసీదులు, స్థానిక శిల్పకళ ఆధారిత నిర్మాణాలు వారి చూపుల ముందే ఆవిష్కృతమయ్యాయి. నగరపు బహుముఖ సంస్కృతి మరియు వారసత్వంపై గర్వభావం వారిలో మళ్ళీ వెల్లివిరిసింది. -
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
సనత్‌నగర్: నగరంలో రోజురోజుకు కాలుష్య ప్రమాణాలు పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండగా ఆ కాలనీవాసులు మాత్రం కాలుష్యానికి దూరంగా ఉండేలా ఏడు దశాబ్దాల క్రితమే పచ్చదనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 56 ఉద్యానవనాలు ఆ కాలనీ సొంతం. ఏ రోడ్డు కెళ్ళినా పార్కులు దర్శనమిస్తాయి. గజం జాగ కనిపిస్తే కాంక్రీట్‌మయంగా మార్చే ప్రస్తుత తరుణంలో 56 పార్కు స్థలాలను కేటాయించడం ఒక వంతైతే...వాటిని కబ్జా కాకుండా కాలనీవాసులంతా సమష్టిగా కాపాడుకోవడం మరో వంతు. కార్మికగడ్డగా పేరొందిన సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీకి వెళితే ఆయా పార్కుల అందాలను ఆస్వాదించవచ్చు. ఎస్ఆర్టీ కాలనీవాసులే కాకుండా పక్క కాలనీలైనా జెక్కాలనీ, రాజరాజేశ్వరీనగర్, తులసీనగర్, సౌభాగ్యనగర్, నాగరాజేశ్వరీనగర్, అల్లావుద్దీన్కోఠి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఆయా పార్కులకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఇక్కడి పార్కుల అభివృద్ధి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సగం వరకు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రాగా...మరికొన్ని క్రీడామైదానాలుగా వినియోగిస్తున్నారు. వాటికి నలువైపులా సైతం పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నారు. ఇంకొన్ని అభివద్ధి దశలో ఉన్నాయి. సనత్‌నగర్ పారిశ్రామికవాడ సాక్షిగా... స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి నిజామ్ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం సనత్‌నగర్ ప్రాంతంలో అల్లావుద్దీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 408 ఎకరాల భూమిని అప్పటి ప్రప్రథమ రాష్ట్రపతి ద్వారా తన పేరిట రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. తదనంతరం కేంద్ర కార్మిక సంస్థ ఇక్కడి దాదాపు 150 ఎకరాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిరి్మంచుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అల్లావుద్దీన్న్ నుంచి భూమిని సేకరించింది. అలా సేకరించినదే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా నామకరణం జరిగింది. ‘సనత్’ అంటే పరిశ్రమగా పేర్కొంటారు. అందుకే మొట్టమొదటి పారిశ్రామికవాడ కావడంతో సనత్‌నగర్‌గా ఈ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా సనత్‌నగర్ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. అదే పారిశ్రామికవాడ ఎదురుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆనాటి కార్మికుల ఆవాసం కోసం ఏర్పాటు చేసినదే నేటి సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీ. ఎస్ఆర్టీ (సింగిల్ రూమ్ టెనెంట్స్) పేరిట 1500 క్వార్టర్స్ ఇళ్ళ నిర్మాణం జరిపారు. ఆరు వేల జనాభా ఉన్న ఆ కాలనీలో పార్కుల కోసం 56 ఖాళీ ప్రదేశాలను విడిచిపెట్టారు. కాలక్రమంలో వాటిని కాపాడుకుంటూ అభివద్ధిపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పార్కు 1500 గజాల నుంచి మొదలుకొని ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి. చెట్లు,పూలమొక్కలతో ఆహ్లాదంగా... ఆయా పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో చెట్లు, పూలమొక్కలతో కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం పార్కు, మార్కెట్ ఉద్యానవనం, భగత్‌సింగ్ గ్రౌండ్, వినాయక గ్రౌండ్, బాస్కెట్‌బాల్ మైదానం, నవ వనాల పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, నెహ్రు పార్కు, ఎస్ఆర్టీ–80, ఎస్ఆర్టీ–87, ఎస్ఆర్టీ–495 తదితర పార్కులు ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. క్రీడా స్థలాలను మినహాయిస్తే సుమారు 30 వరకు ఉద్యానవనాలు చెట్లు, పూల మొఇక్కలు, పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యానవనంలో 300 పైచిలుకు వృక్షాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యానవన సంక్షేమ సంఘం, వినాయక సంక్షేమ సంఘం, భగత్‌సింగ్ ఉత్సవ కమిటీ, సనత్నగర్యువజన సంక్షేమ సంఘం వంటి వాటిని ఏర్పాటుచేసుకున్న కాలనీవాసులు ఈ ఉద్యానవనాలను ఆక్రమణదారుల పాలుకాకుండా కాపాడుకుంటున్నారు. -
‘బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకు సంబంధమేంటి?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అక్కసు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పదేళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మల్లు రవి స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసీఆర్ కుటుంబంగా మారింది. ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. బంగ్లాదేశ్ లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.పదేళ్లలో బిఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది. సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం. బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్. ధరణితో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది.16 లక్షలు మంది ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చింది. ప్రగతి భవన్ లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ హయంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు వీలు కల్పించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర లో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం’ అని మల్లు రవి పేర్కొన్నారు. -
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
హైదరాబాద్: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులుఅత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు. దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి. కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది. -
రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది..!
హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్ చెప్పకపోవడంగా సమాచారం. సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. -
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్లు చేస్తున్నారు.కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు. కానీ ఐఏఎస్ స్మిత సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు..
పరీక్షలు అయిపోయాయి.. వేసవి సెలవులు వచ్చాయి.. మరి సెలవులను వృథా చేసుకోకుండా విద్యార్థులు ఏం చేయాలి? వారికి నచ్చిన రంగాల్లో, ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇప్పిస్తే సరి.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత.. మాదాపూర్‌లోని శిల్పారామం ప్రతి ఏడాది సమ్మర్ ఆర్ట్ క్యాంప్ చేపడుతోంది. ఈ ఏడాది కూడా మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఆర్ట్ క్యాంపు నిర్వహిస్తోంది. దీనిలో మట్టికుండల తయారీ విధానం, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, మండల పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాల పఠనం, సంస్కృతంలో మాట్లాడటం వంటి అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు ఏఏ రంగాలపై ఆసక్తి ఉందో తెలుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు అధ్యాపకులు శిక్షణ ఇస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా గృహిణులు, ఉద్యోగినులు సైతం వివిధ రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన మహిళలు వివిధ రకాల బట్టలపై పెయింటింగ్‌లు వేసి ఆర్థికంగా సంపాదిస్తున్నారు. కొంత మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. 6 సంవత్సరాలకుపై బడినవారు ఎవరైనా సమ్మర్ ఆర్ట్ క్యాంపులో పాల్గనవచ్చు. చిన్నారులకు భగవద్గీత, సంస్కృత భాషలను నేర్పడం వల్ల వారు ప్రయోజకులు కావడంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రత్యేకతను తెలుసుకుంటారని అధ్యాపకులు తెలుపుతున్నారు. కేవలం సరదాగా నేర్చుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివిధ అంశాలలో శిక్షణ పొందేందుకు నామమాత్రపు రుసుముతో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడవచ్చు.. సంస్కృత భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి భాషను నేరి్పంచడం అరుదు. శిల్పారామం విద్యార్థులకు, ఆసక్తిగల వారికి సమ్మర్ క్యాంపు ద్వారా ఈ అవకాశాన్ని కలి్పస్తోంది. సులభ పద్ధతిలో సంస్కృత భాషను నేర్చుకోవచ్చు. సంస్కృత భాషను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం వల్ల అనేక గ్రంథాలను, పుస్తకాలను చదువుకొని అర్థం చేసుకోవచ్చు. – సంతోష్, అధ్యాపకుడు, సంస్కృత భాష మధుబని పెయింటింగ్‌లో శిక్షణ మధుబని పెయింటింగ్‌ను ఆసక్తితో నేర్చుకోవాలి. ప్రత్యేకత ఉన్న మధుబని పెయింట్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. గృహిణులు ఇంట్లో సరదాగా వేసి అమ్ముకోవచ్చు. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో నేర్చుకున్న వారు మరి కొంతమందికి శిక్షణ ఇవ్వవచ్చు. – రాజేశ్, మధుబని పెయింటింగ్ అధ్యాపకుడు ఆసక్తి గలవారు 8886652030,8886652004లలో సంప్రదించగలరు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే ఆరు నుంచి 60 సంవత్సరాల వారు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. మొత్తం 9 అంశాలలో శిక్షణ (చదవండి: హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!) -
తార్నాక జంక్షన్..రీ ఓపెన్!
సాక్షి, హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలంగా మూతపడిన తార్నాక జంక్షన్‌ను నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఎట్టకేలకు ప్రయోగాత్మకంగా తెరవనున్నారు. శుక్రవారం నుంచి మే 2 తేదీ వరకు ఈ చౌరస్తాను ఓపెన్ చేయనున్నారు. ఈ మధ్యకాలంలో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. ఆపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ– లాలాపేట వైపుల నుంచి రాకపోకలు సాగించడానికి గతంలో ఈ జంక్షన్‌ను వినియోగించే వాళ్లు. తార్నాక ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందు హబ్సిగూడ–మెట్టుగూడ వైపుల నుంచి రాకపోకలు సాగించడానికీ ఈ జంక్షన్ ఉపకరించింది. 1990 నుంచి తార్నాక ఫ్లైఓవర్ అందుబాటులోకి వచి్చంది. అయితే.. తార్నాక చౌరస్తాను మాత్రం 2015 జూలై వరకు తెరిచే ఉంచారు. ఆపై మూసివేయడంతో పాటు లాలాపేట నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్లే వాహనాలు హెచ్ఎండీఏ కార్యాలయం వరకు వెళ్లి యూ టర్న్ చేసుకుని వచ్చేలా.. అలాగే యూనివర్సిటీ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనాలు రైల్వే డిగ్రీ కళాశాల వద్ద యూ–టర్న్ తీసుకుని వచ్చేలా మార్పుచేర్పులు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు ఈ సిగ్నల్ వద్దే ఒకే పోలీసు అధికారి విధులు నిర్వర్తించేవారు. అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య ఎనిమిదికి పెంచాల్సి వచి్చంది. దీంతో పాటు ఇతర పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు 2015లో ఈ జంక్షన్‌ను మూసేశారు.అనేక విజ్ఞప్తుల నేపథ్యంలో నిర్ణయం... ఈ చౌరస్తాను మళ్లీ తెరవాలంటూ కొన్నేళ్లుగా అనేక మంది ట్రాఫిక్ విభాగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితులు లేవని, ట్రాఫిక్ జామ్స్ కావని చెబుతున్నారు. ఈ చౌరస్తా మూసేయడంతో ‘యూ–టర్న్’ కోసం దాదాపు కిలోమీటరు ముందుకు వెళ్లి, తిరిగి రావాల్సి వస్తోందని విజ్ఞప్తి చేస్తున్నారు. యూ టర్న్స్ కేంద్రంగా ట్రాఫిక్ జామ్స్ జరుగుతుండటాన్నీ ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో శుక్రవారం నుంచి ఈ జంక్షన్‌ను ప్రయోగాత్మకంగా రీ–ఓపెన్ చేయాలని నిర్ణయించారు. గతానికి భిన్నంగా రూట్ ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ కొన్ని కీలక సూచనలు చేశారు. ⇒ ఓయూ వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా లాలాపేట వైపు, కుడివైపు తిరిగి హబ్సిగూడ వైపు వెళ్లే అవకాశం ఉంది. ⇒ లాలాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఓయూ వైపు వెళ్లడానికి, కుడి వైపు తిరిగి మెట్టుగూడ వైపు రావడానికి అవకాశం ఉంది. ⇒ మెట్టుగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు మాత్రం ఈ చౌరస్తా వద్ద కుడివైపు తిరిగి ఓయూ వైపు వెళ్లే అవకాశం లేదు. నేరుగా హెచ్ఎండీఏ కార్యాలయం వరకు వెళ్లి, యూ టర్న్ తీసుకుని వచి్చ, చౌరస్తా వద్ద ఎడమ వైపు తిరిగి ఓయూ రూట్లోకి వెళ్లాలి. ⇒ హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా తార్నాక జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి లాలాపేట వైపు వెళ్లే అవకాశం లేదు. ఈ వాహనాలు ఎడమ వైపు తిరిగి, రైల్వే డిగ్రీ కాలేజీ వరకు వెళ్లి యూ టర్న్ తీసుకోవాలి. ఆపై చౌరస్తా వరకు వచ్చి ఎడమ వైపు తిరిగి లాలాపేట వైపు వెళ్లాలి. -
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
జీడిమెట్ల: కడుపున పుట్టిన ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపింది ఓ తల్లి. ఆపై తను కూడా అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్లో చోటు చేసుకుంది. బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేష్ హెయిట్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌నంబర్ 204లో ఉంటున్నారు.వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 1వ తరగతి, నర్సరీ చదువుతున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా, ఇంట్లో తేజస్విని, పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తేజస్విని అపార్ట్మెంట్ పైనుంచి దూకడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న అపార్ట్మెంట్ వారు వెళ్లి చూడగా, తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అపార్ట్మెంట్ వాసులు సెకండ్ ఫ్లోర్‌లోని తేజస్విని ఇంట్లోకి వెళ్లి చూడగా, కిచెన్‌లో ఆశిష్ రెడ్డి అప్పటికే మృతి చెంది రక్తపుమడుగులో పడి ఉండగా, హర్షిత్‌రెడ్డి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.వెంటనే అపార్ట్మెంట్ వారు హర్షిత్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలిస్తే...తేజస్విని తన ఇద్దరు కొడుకులను విచక్షణారహితంగా చంపినట్టు ఉందని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్‌లు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.8 పేజీల లేఖ స్వాధీనంతేజస్విని ఉంటున్న ఫ్లాట్‌లో పోలీసులకు 8 పేజీల ఓ లేఖ దొరికింది. అందులో తన ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉందని, రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారని...దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు అని రాసి ఉంది. తనను అందరూ పిచ్చిది అంటున్నారని, ఆ మాటలు భరించలేకపోతున్నానంటూ ఆ లేఖలో పేర్కొంది. కాగా తేజస్విని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అపార్ట్మెంట్లోనూ ఎవరితో మాట్లాడదని స్థానికులు అంటున్నారు. -
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
హైదరాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాఘవ.. తమ తాజా ప్రాజెక్ట్ 'సింక్ బై రాఘవ'ను ప్రకటించారు. ఈ ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్ కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 7.19 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాఘవ ‘సింక్’ ఐదు 61 అంతస్తుల టవర్లు కలిగి ఉంది.సింక్‌లోని ప్రతి రెసిడెన్షియల్ ఫ్లాట్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సౌకర్యాలను కలిగి ఉంటుంది. ‘ది ఒయాసిస్’ పార్టీ ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్, పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతి టవర్‌లో పికిల్‌బాల్ కోర్టులు, పార్టీ డెక్, యోగా డెక్‌తో కూడిన స్కై లాంజ్ కూడా ఉంది. అంతే కాకుండా వ్యాపార కేంద్రాలు, ప్రఖ్యాత విద్యా సంస్థలు, ఆసుపత్రులు కూడా దీనికి దగ్గరగా ఉన్నాయి.సింక్ బై రాఘవ కేవలం నివాస ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక హై-ఎండ్ ఆర్కిటెక్చరల్ అద్భుతం. చిన్న చిన్న అంశాల మీద కూడా ప్రత్యేక శ్రద్ద వహిస్తూ.. నాణ్యమైన మెటీరియల్స్ ఉపయోగించినట్లు.. రాఘవ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష రెడ్డి పొంగులేటి అన్నారు. డిజైన్, ఫినిష్ , ఫీచర్స్ అన్నీ కూడా ప్రస్తుత జీవన విధానాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. -
ఇద్దరు పిల్లలను నరికి చంపి.. తల్లి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కొడుకులను వేట కొడవలితో నరికి చంపిన తల్లి.. ఆ తర్వాత తాను భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గాజుల రామారంలో ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదంసికింద్రాబాద్ మచ్చ బొల్లారంలో ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుభకార్యాలకు సంబంధించిన అలంకరణ సామగ్రి ఉన్న గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దాదాపు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లో దారుణం.. గోడకేసి కొట్టి.. ఐదు కుక్క పిల్లలను కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఐదు కుక్క పిల్లలను గోడకేసి కొట్టి చంపేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సైకోగా మారిన ఆ వ్యక్తిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఫతేనగర్‌లో ఇండిస్ అపార్టుమెంట్ దగ్గర ఓ వీధి కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లో ఆ కుక్క పిల్లలు ఉంటున్నాయి. అదే అపార్ట్మెంట్లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్కపిల్లలు దగ్గరకు వచ్చేవి. దీంతో ఓ కుక్క పిల్లను గోడకేసి బలంగా కొట్టగా.. అది రక్తం కక్కుకుని కింద పడిపోయింది. బతికిందో లేదో తెలుసుకోవడానికి మరోసారి గట్టిగా కొట్టాడు.. ఇలా మొత్తం ఐదు కుక్క పిల్లలను దారుణంగా చంపేశాడు.కుక్క పిల్లలు చనిపోయి ఉండడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు.. ఈ క్రమంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, అదే అపార్ట్మెంట్లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంతువులపై ఇంత కిరాతకంగా వ్యహరించిన వ్యక్తిని జైలుకు పంపించాలని కోరాడు.ఆశిష్‌ను అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నించగా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగరంలో సైకోలు పెరిగిపోతున్నారని.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.*VB City Community – Urgent Alert!* The safety of our community, especially our children, is at serious risk.A disturbing incident has come to light—an individual was caught on video brutally attacking puppies just 5 to 6 days old. This act of cruelty is not only heartbreaking pic.twitter.com/hedp136Mrt— Khan (@khanbr1983) April 17, 2025 -
Easter 2025 పవిత్ర ఈస్టర్ సందర్భంగా ర్యాలీ
గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయడం, ఆయన పునరుత్థానం సందేశాన్ని గుర్తు చేసుకుంటూ రన్ ఫర్ జీసస్ నిర్వహిస్తున్నారు. ఈస్టర్ పర్వ దినాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చస్, అన్ని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న నగరంలో భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ర్యాలీ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. కాథలిక్, ప్రొటెస్టంట్ చర్చిలను ఏకంచేస్తూ అతిపెద్ద క్రైస్తవ ర్యాలీని ‘రన్ ఫర్ జీసస్’ నిర్వహిస్తున్నామన్నారు. అన్ని చర్చిల నుండి వేలాది మంది క్రైస్తవులు కాలికనడక, రన్నింగ్, మోటార్ సైకిళ్ళు/నాలుగు చక్రాల వాహనాలపై ఆనందంగా ఈ ర్యాలీని నిర్వహిస్తారని తెలిపారు.గ్రేటర్ హైదరాబాద్‌లో,శనివారం, ఏప్రిల్ 19,ఉదయం 6:00 గంటల నుండి హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో RUN FOR JESUS ర్యాలీ జరుగుతుంది. హైదరాబాద్ ఆర్చ్‌డయోసెస్ ఆర్చ్ బిషప్ హిజ్ ఎమినెన్స్ కార్డినల్ పాల్ ఆంథోనీ, మెదక్ డయోసెస్ ఇన్ఛార్జ్ బిషప్ రెవరెండ్ డాక్టర్ కె. రూబెన్ మార్క్, అరదాన టీవీ చైర్మన్ బ్రదర్ పాల్ దేవప్రియం పుల్లా ,చర్చి మరియు,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర ప్రముఖులు నగరంలోని వివిధ ప్రదేశాలలో జరిగే ఈ పరుగులో పాల్గొంటున్నారు .చర్చిలు. స్థానిక సువార్త గాయకులు నిర్వహించే ప్రశంస మరియు ఆరాధనతో ఈ పరుగు ఆయా ప్రదేశాలలో గొప్ప ఆనందంతో ముగుస్తుందనీ సీనియర్ పాస్టర్లు ఈస్టర్ సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. క్రైస్తవ సోదరులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ తీసుకురావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.ఒక ప్రత్యేకమైన సువార్తిక & క్రైస్తవ ర్యాలీ అయిన RUN FOR JESUS యొక్క ఆలోచన మరియు భావనను 2011 సంవత్సరంలో అరదాన టీవీ బృందం రూపొందించి ప్రవేశపెట్టింది. తొలుత ఇది 30కిపైగా ప్రదేశాల్లో ఈ ర్యాలీని చేపట్టారు. ప్రస్తుతం RUN FOR JESUS ఏపీ, తెలంగాణాతో పాటు, కర్ణాటక ,మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ,విదేశాలలో కొన్ని ప్రదేశాలలో ఒక ప్రధాన వార్షిక క్రైస్తవ ర్యాలీగా మారింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఢీలా పడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) మొత్తం 10,647 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 14,298 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లోనూ జనవరి–మార్చి కాలంలో ఇళ్ల అమ్మకాలు 19 శాతం తగ్గిపోయాయి. మొత్తం 98,095 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది.ఇళ్ల ధరలు పెరిగిపోవడం, వృద్ధి తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు వెల్లడించింది. అలాగే, ఎనిమిది ప్రముఖ నగరాల్లో మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా 10 శాతం తగ్గినట్టు తెలిపింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెవలపర్లు వ్యవహరించినట్టు పేర్కొంది. ‘‘ధరలు గణనీయంగా పెరగడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపించింది. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం కొత్త అనిశ్చితులను తీసుకొచ్చింది. ఇలాంటి తరుణంలో కొనుగోళ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం సాధారణంగా కనిపించేదే’’అని ప్రాప్ టైగర్, హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. నగరాల వారీ విక్రయాలు.. 👉 అహ్మదాబాద్‌లో 10,730 ఇళ్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 12,915 యూనిట్లతో పోల్చి చూస్తే 17 శాతం తగ్గాయి. 👉 ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 8,477 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 10,058 యూనిట్లతో పోల్చి చూస్తే 16 శాతం తగ్గాయి. 👉 ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అమ్మకాలు 26 శాతం క్షీణించి 30,705 యూనిట్ల ఇళ్లకు పరిమితయ్యాయి. 👉 పుణెలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25 శాతం తక్కువగా 17,228 యూనిట్లుగా ఉన్నాయి. 👉 కోల్‌కతాలో విక్రయాలు కేవలం ఒక శాతం తగ్గి 3,803 యూనిట్లుగా ఉన్నాయి. 👉 బెంగళూరులో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం పెరిగి 11,731 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలలో 10,381 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. 👉 చెన్నైలోనూ అమ్మకాలు 8 శాతం పెరిగి 4,774 యూనిట్లుగా ఉన్నాయి. 👉 జనవరి–మార్చి కాలంలో ప్రముఖ నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా 10 శాతం తగ్గి 93,144 యూనిట్లుగా ఉంది. ఈ డేటా కొత్త ఇళ్ల విక్రయాలకు సంబంధించినది. -
మన ప్రతిభ మెరుస్తుందా?
అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్‌కి మంచి మార్కెట్‌గా మార్చాయి! భారత్‌కు బ్రాండ్‌నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్టార్స్‌ని చేశాయి! ఆ అవకాశాలు ఇప్పుడు తెలంగాణ వెదుక్కుంటూ వచ్చాయి... మేలో జరగనున్న 73వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ను డెస్టినేషన్‌గా కోరుకుంటూ! ఆ స్టోరీ...భాష, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక వైవిధ్యంలో తెలంగాణ.. మన దేశానికి మినియేచర్‌గా ఉంటుంది. ఆ ప్రత్యేకతే తెలంగాణ రాష్ట్రాన్ని మిస్ వరల్డ్ పోటీలకు వేదికను చేసింది. ఇక్కడి కళలు, చేనేత, పర్యాటకప్రాభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. అందులో భాగంగానే ఈ పోటీలను తెలంగాణలోని పలుచోట్ల నిర్వహించనున్నారు. వీటిని కవర్ చేయడానికి అంతర్జాతీయంగా మూడువేల మీడియా సంస్థలు వస్తున్నాయి. అలా తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోచంపల్లి ఇక్కత్‌తో 120 దేశాల సుందరీమణులు మెరవబోతున్నారు. హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వానికి చిరునామా అయిన లాడ్‌బజార్‌లో హెరిటేజ్ వాక్ చేయబోతున్నారు. చౌమొహల్లా ప్యాలెస్‌లో చవులూరించే రుచులతో విందారగించనున్నారు. వీటన్నిటితోపాటు తెలంగాణ అభివృద్ధి, తమ అబ్జర్వేషన్స్నూ అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ఫీచర్స్గానో.. ఆఫ్ బీట్ స్టోరీస్గానో ఫోకస్ చేస్తాయి. అలా తెలంగాణ టాక్ ఆఫ్ ద వరల్డ్ అవుతుందని అందాల పోటీల నిర్వాహకుల అభి్రపాయం. తెలంగాణ కూడా ఇక్కడి పర్యాటకం మీద ప్రపంచదృష్టి పడేలా చేసి తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది. ఈ పోటీల్లో లోకల్ మేకప్ ఆర్టిస్ట్‌లు, హెయిర్ స్టయిలిస్ట్‌లు, టెక్స్టైల్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇతర కళాకారులకు అవకాశాలు లభించి, వారి ప్రతిభకు ప్రపంచ గుర్తింపు దొరకనుందా?హైదరాబాద్‌ను సౌత్ ఫ్యాషన్ హబ్‌లా మార్చనుందా? ఇక్కడా గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్ ఏర్పడనున్నాయా? ఆయా రంగాల్లోని నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!బాధ్యతనూ తీసుకోవాలినారాయణ పేట్ విమెన్ వీవర్స్ మీద నేనొక డాక్యుమెంటరీ చేశాను. లాక్డౌన్ టైమ్‌లో వాళ్లకో ఉపాధిలా ఉంటుందని తస్రిక వీవింగ్ టెక్నిక్‌తో అక్కడి స్త్రీలతో చీరలను నేయించాను. వాటికి నేను డిజిటల్ ప్రింట్స్‌ని యాడ్ చేసి ఆ చీరలతోనే వాళ్లకు మేకోవర్ చేసి నారాయణ పేట్ లోనే వీడియో షూట్, ఫొటో షూట్ చేశాను. ఆ డిజైన్స్‌ని హైదరాబాద్‌కి తీసుకొచ్చి పదిహేను రోజులు ఎగ్జిబిషన్‌లా పెట్టి.. ఆ సేల్స్‌ని పెంచాం. తర్వాత ఆ చీరలను హ్యాండ్లూమ్ డే రోజు వాళ్లకు గిఫ్ట్‌గా ఇచ్చాం. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి చేయూతా దొరక లేదు. అలాగే ఈ అందాల పోటీల వల్ల మన టెక్స్టైల్స్ గురించి ఒక వారం మాట్లాడుకుంటారేమో అంతే! అవకాశాలు రావాలి, పెరగాలంటే మాత్రం టెక్స్టైల్ మినిస్ట్రీ చొరవ తీసుకునిæతెలంగాణ ఫ్యాషన్ హబ్ లాంటిదొకటి ఏర్పాటు చేయాలి. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్మంచి అవకాశంనేనైతే దీన్ని పాజిటివ్‌గానే చూస్తాను. ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ తెలంగాణలో అందాల పోటీలకు ఓ స్పేస్ క్రియేట్ చేస్తుందనుకుంటున్నాను. ఫుట్‌వేర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, హెయిర్ స్టయిలిస్ట్స్, మేకప్ ఆర్టిస్ట్స్ లాంటివాళ్లెందరికో అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు ఈ పోటీల్లో వాడే ఫుట్‌వేర్, కాస్ట్యూమ్స్ తయారీకీ ఇది హబ్‌గా మారొచ్చు. గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్కీ స్కోప్ ఉంటుంది. గ్రూమింగ్ వల్ల తర్వాత అమ్మాయిలు ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఉపయోగపడతాయి. – కె. అభిమానిక యాదవ్, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..మేకప్ రంగంలో మంచి విమెన్ మేకప్ ఆర్టిస్ట్‌లు ఉన్నారు. కానీ వాళ్లకు అవకాశాల్లేవు. అలాంటి వాళ్లకు ఈ ఈవెంట్స్ ఉపయోగపడాలి. నేను వరుసగా నాలుగేళ్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌కి వర్క్ చేశాను. ఆ తర్వాత నుంచి మళ్లీ అబ్బాయిలనే తీసుకుంటున్నారు. అలా కాకుండా దీన్ని తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. అర్హతలు, ప్రమాణాలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మేకప్ ఆర్టిస్ట్‌ల నుంచి కొటేషన్స్‌ను ఆహ్వానించాలి– శోభాలత, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్భద్రత.. రక్షణ కల్పించి...ముందు మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించి.. ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు వేదికను ఇవ్వడం గురించి ఆలోచించాలి. వీటివల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరగడం మాట ఎలా ఉన్నా తెలంగాణ వనరులు విదేశీ పెట్టుబడి సంస్థలకు ధారదత్తం అవడం మాత్రం ఖాయం అని నాకనిపిస్తోంది.– భండారు విజయ, రచయిత, మహిళా హక్కుల కార్యకర్తబ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ఈ పోటీలు హైదరాబాద్ మొదలుకొని రామప్ప, పోచంపల్లి, చౌమొహల్లా ప్యాలెస్.. ఇలా పలుచోట్ల జరుగుతాయి. వీటివల్ల ప్రపంచం మన కళలు, సంస్కృతి, మన వారసత్వ సంపదను తెలుసుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇక్కడి వైద్య సౌకర్యాలను గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ వైవిధ్యాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పోటీలను బ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ అనుకోవచ్చు. – మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాష – సాంస్కృతిక శాఖ -
ఊరే ప్రేరణ
ఒక బొమ్మలో మాతృత్వం మరో బొమ్మలో పెళ్లి ఆనందం ఇంకో బొమ్మలో రైతు శ్రమ ఓ చిత్రంలో అందమైన బాల్యం మొత్తంగా ఈ గ్యాలరీ అంతా... అచ్చమైన పల్లెసీమకు చిత్రరూపం.తల్లి ఆవును ముద్దాడుతున్న లేగదూడ, పాలు తాగుతున్న లేగదూడ తోకను మురిపెంగా ముద్దాడుతున్న గోమాత, గిర్రున తిరుగుతున్న చక్రం మీదున్న మట్టికి పాత్ర రూపమిస్తున్న కుమ్మరి, పెళ్లి పందిట్లోకి అరటి గెలను భుజాన మోసుకొస్తున్న రైతు, రెండు జడలు వేసుకుని రిబ్బన్లను పువ్వుల్లా ముడి వేసుకున్న బాలికల ముఖాల్లో విరిసిన ఆనంద విరులు, తోటలో పూలబుట్ట మోస్తున్న శ్రామికురాలి ముఖంలో పరిమళిస్తున్న సంతోషాల తావి... ఇవన్నీ అంబిక ఆర్ట్ గ్యాలరీ కొలువుదీరిన అందమైన చిత్రాలు. ఇక... తలమీద నీరు తాగేసిన ఖాళీ కొబ్బరి బోండాలను తట్టలో నింపుకుని తలమీద మోస్తున్న మహిళ ముఖంలో మాతృత్వపు మధురిమకు మరేదీ సాటిరాదు. పై చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ఇదొక్కటే ఒక ఎత్తు. చంటి బిడ్డను చంకలో కట్టుకుని, పెద్ద బిడ్డను చేయి పట్టి నడిపించుకు వెళ్తున్న మహిళ ముఖంలో తల మీద మోస్తున్న బరువు కంటే కంటిపాపల్లాంటి ఇద్దరు బిడ్డల మాతృత్వపు సంతృప్తి నిండిన దరహాసం ప్రస్ఫుటమవుతోంది. ఇక రైతు కష్టాన్ని కళ్లకు కడుతూ వీక్షకుల మనసును ద్రవింపచేస్తున్న చిత్రం ఒకటుంది. ట్రాక్టర్ ట్రక్కులో ఎర్రగా నవనవలాడుతున్న మిరపకాయల మీద పడుకుని సేదదీరుతూ ఠీవిగా కాలు మీద కాలు వేసుకున్న రైతు చిత్రం అది. మిరపకాయల ఘాటును లెక్కచేయకుండా తాను పండించిన పంట మీద సాధికారత, ప్రేమ అంతకు మించిన ధీమా రైతు ముఖంలో వ్యక్తమవుతున్నాయి. అంబిక మనసులో అనంతంగా పరిభ్రమిస్తున్న ఆలోచనలకు ఆమె చేతిలో ఉన్న కుంచె ఇచ్చిన రూపాలివన్నీ. స్కూల్ రోజుల్లో భయభయంగా పెన్సిల్ పట్టుకున్న అంబిక ఇప్పుడు చిత్రకళా ప్రదర్శనల్లో తన మార్కు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో అంబిక తన చిత్రాలను ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. దార్శనికులు లేరు! అంబిక... ఏలూరులో పుట్టి పెరిగారు. స్కూల్లో బయాలజీ రికార్డు బొమ్మలు కజిన్స్‌ని బతిమాలి ఎప్పటికప్పుడు ఎలాగో గట్టెక్కుతూ వచ్చారు. ఒకసారి కజిన్స్ ఎవరికీ అంబికకు బొమ్మ వేసిచ్చేటంత ఖాళీ లేదు. ఇక తప్పదని ధైర్యం చేశారు. బొమ్మ బాగా వచ్చింది. తన మీద తనకు నమ్మకం కలిగిన క్షణాలవి. ఆ తర్వాత టెక్ట్స్ బుక్స్‌లో బొమ్మలను యథాతథంగా వేయడంతోపాటు గ్రీటింగ్ కార్డుల కోసం పువ్వులు, పక్షుల బొమ్మలు వేశారు. లెక్కకు మించిన బొమ్మలు వేశారు, కానీ చిత్రకారిణిగా ఎదగడానికి అవసరమైన శిక్షణ ఎక్కడ దొరుకుతుందో, ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియదు. బొమ్మలో భావం పలికిందిఎమ్మెస్సీ తర్వాత పెళ్లి, ముంబయికి వెళ్లడం, ఆ తర్వాత ఏడాదికే బెంగళూరుకు బదిలీ. బెంగళూరు ఆమె చేతిలో కలర్ పాలెట్ అనే చెప్పాలి. అక్కడి చిత్రకళా పరిషత్‌లో ఏడాది కోర్సు చేసి, ముఖ కవళికలు, ముఖంలో భావాలు పలికించడం నేర్చుకున్నారు. హ్యూమన్ అనాటమీ కొలతల వంటి మెళకువలు పట్టుపడ్డాయి. అప్పటి నుంచి ఆ కుంచెకు విరామం లేదు. బొమ్మను అలాగే రిప్లికా వేస్తున్న దశ నుంచి సొంత థీమ్‌తో బొమ్మలు వేయడం 2018లో మొదలు పెట్టారు. హైదరాబాద్, బెంగళూరుల్లో డజను ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అత్తగారి ఊరు గుళ్లపూడిలో సొంత ఆర్ట్ స్టూడియో, గ్యాలరీ ఏర్పాటు చేసుకున్నారు. ఆమె చిత్రాలకు విదేశీ చిత్రకారుల నుంచి ప్రశంసలు వచ్చాయి. సింగపూర్, దుబాయ్ ఆర్ట్ ఎగ్జిబిషన్లలో పాల్గొనడానికి ఆహా్వనాలు వస్తున్నాయి. పల్లెటూరి చిత్రాలు నా చిత్రాల్లో గ్రామీణ జీవనం కనిపించడానికి కారణం మా సొంతూరు రాజమండ్రి దగ్గర వానపల్లి. నేను పెరిగింది పట్టణంలోనే. ఇంటర్ సెలవుల్లో ఒకసారి నాన్నగారు నన్ను ఊరికి తీసుకెళ్లారు. రాజమండ్రి ప్రకృతి సౌందర్యం నా మనోఫలకం మీద ముద్రించుకు పోయింది. నా బొమ్మలు కోనసీమ జీవితాలను కళ్లకు కడుతుంటాయి. నన్ను ‘నారీ కళామహోత్సవ్ పురస్కారం’ పురస్కారానికి ఎంపిక చేసింది మా ఊరి ప్రకృతి, గ్రామాల్లోని శ్రమ జీవన సౌందర్యమే. ఇప్పుడు హైదరాబాద్‌లో 250 మంది చిత్రకారులు వేసిన మూడు వేల చిత్రాల ప్రదర్శనలో నా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు దక్కడానికి కారణమూ స్వచ్ఛత నిండిన అచ్చమైన జీవితాలకు చిత్రరూపమివ్వడమే. – అంబిక ఊరకరణం, చిత్రకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్
హైదరాబాద్,సాక్షి: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli land issue) అంశంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.మార్చి 31న 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక గిబ్లీ (Ghibli)చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఆ చిత్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hyderabad central university)లోని 'మష్రూమ్ రాక్' ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు గిబ్లీ శైలిలో నెమలి, జింక ఉన్నాయి. అయితే వైరల్ చిత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్‌కు బీఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై ఆమె ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.FREE SPEECH - TELANGANA MODEL! In probably a first, police booked a case against an IAS for a RETWEET! Smitha Sabharwal, IAS, principal secretary of Youth Advancement, Tourism & Culture is the latest to be served notices by the Telangana police. The Crime: She retweeted an… pic.twitter.com/5g5rTALYex— Revathi (@revathitweets) April 16, 2025 -
రెల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు సాధించడానికి కావాల్సిన శిక్షణను పరవస్తూ క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ గ్రీన్లాండ్స్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ (Free Coaching) అందించనున్నారు. రైల్వేలో ఉద్యోగం పొందడానికి 3 నుంచి 4 నెలలపాటు అన్ని విధాలా శిక్షణను నిరుద్యోగ యువతకు ఇవ్వనున్నట్లు సంస్థల ప్రతినిధులు గద్దె భాస్కర్, మువ్వ రాంరెడ్డి, ఫ్రొఫెసర్ లక్ష్మీకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతకు ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఉచిత భోజనం, వసతి, కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. శ్రీధర్ సీసీఈ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఉత్తమ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రల్లోని (Telugu States) వివిధ నగరాల్లో అర్హత రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత పరీక్షకు హాజరు కావాల్సిన వారు ముందుగా తమ పేర్లను ఈ నెల 17వ తేది లోపు నమోదు చేసుకోవాలని, ఆసక్తి గల వారు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ చానల్‌ను, ఫోన్: 9515658033లలో సంప్రదించవచ్చని సూచించారు.18న రైల్ మ్యూజియం ఉచిత సందర్శన హైదరాబాద్: వరల్డ్ హేరిటేజ్ డే (World Heritage Day) సందర్భంగా ఈ నెల 18వ తేదీన కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని రైల్ మ్యూజియంను ఉచితంగా సందర్శించవచ్చని స్టేషన్ డైరెక్టర్ కె.బాలాజీ తెలిపారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు, రైల్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మియాపూర్ రన్నర్స్ టీ షర్ట్ ఆవిష్కరణ కేపీహెచ్‌బీ కాలనీ: ఇగ్నైట్ విద్యాసంస్థల సైన్స్ ల్యాబ్ ప్రాంగణంలో మంగళవారం బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ చేతుల మీదుగా మియాపూర్ రన్నర్స్ (Miyapur Runners) టీ షర్ట్, మెడల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ శారీరక దారుఢ్యంతో కూడిన మానసిక వికాసం ఎంతో అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో ఇగ్నైట్, అవంతిక యాజమాన్యాలు ఈ నెల 20న చేపట్టనున్న మియాపూర్ రన్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కేపీహెచ్‌బీ (KPHB) ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఇగ్నైట్ చైర్మన్ రమేష్, అవంతిక కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రన్నర్స్ తరఫున జగన్మోహన్రెడ్డి, నరేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.చదవండి: జస్ట్ 9999 నెంబర్ కోసం ఏకంగా రూ. 12 లక్షలు పైనే..! -
హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఆ రాష్ట్ర మాజీ సీఎస్ కుమారుడు అరెస్ట్
హైదరబాద్,సాక్షి: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్ వద్ద పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మాదకద్రవ్యాలతో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతను ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకువచ్చాడు.ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న దానిపై అధికారుల ఆరా తీస్తున్నారు. -
Hyderabad Zoo సందర్శన టికెట్ రేట్లు పెరిగినా..తగ్గని ఆదరణ
చార్మినార్: పాతబస్తీలోని నెహ్రూ జులాజికల్ పార్కును సందర్శించడానికి చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఇష్టపడుతున్నారు. జూ సందర్శనకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ చాంతాడంత క్యూ లైన్లకు ఫుల్‌స్టాఫ్ పడింది. జూ సందర్శకులకు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే టికెట్ రేట్లు పెరిగినా.. ఆదరణ తగ్గలేదు. అంతేకాకుండా మనం ఎక్కడి నుంచైనా జా సందర్శన టికెట్లను ఆన్‌లైనా ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. జూ బుకింగ్ కౌంటర్ వద్ద ఉండే క్యూలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో..మనల్ని మనమే మరచిపోయి కాస్సేపు సరదాగా..ఉల్లాసంగా..ఉత్సాహాంగా గడపడానికి నెహ్రూ జూలాజికల్ పార్కు చక్కని వేదిక. అంతేకాకుండా మొబైల్ నావిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే జూ పార్కును చుట్టి రావచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని జూ సందర్శనకు వెళితే..జూ పార్కులోని అన్ని ఎన్‌క్లోజర్స్‌తో పాటు ఇతర సమాచారాన్ని మన కళ్ల ముందుంటుంది. గత నెల 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో పెద్దలకు వీక్ డేస్‌లలో రూ.70, చిన్నారులకు రూ.45 లుగాను..వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లో రూ.80, రూ.55 ఉండగా..ప్రస్తుతం రెండు కేటగిరీల వారీగా కాకుండా వారం రోజుల్లో పెద్దలకు రూ.100, చిన్నారుకు రూ.50గా నిర్దారించారు. వీటితో పాటు జూ సందర్శనలో వివిధ కేటగిరీలకు కూడా రేట్లు పెరిగాయి. ఆహ్లాదం, వినోదంతో పాటు విజ్ఞానం పంచుతున్న జూ.. నెహ్రూ జూలాజికల్ పార్కు ఓ ఎంటర్టైన్ మెంట్ పార్కుగా కాకుండా సందర్శకులకు ఆహ్లాదం, వినోదంతో పాటు జంతువు, పక్షులపై కొత్త విషయాలను నేర్చుకునే విద్యాలయంగా చెప్పవచ్చు. దీంతో జూ సందర్శకుల రద్దీ కూడా పెరిగింది. అప్పుడప్పుడు వచ్చే పాఠశాలలు, కళాశాలలకు సెలవులతో పాటు వీకెండ్ రోజులలో జూపార్కును సందర్శించే సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. వేలాది మంది సందర్శకులకు జంతువులు, పక్షులపై ప్రత్యేక అవగాహనను జూపార్కు అధికారులు కలి్పస్తూ జూలో అనేక కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం కలిగిస్తున్నారు. కేవలం కాలక్షేపం కోసమే కాకుండా జంతు ప్రపంచం గురించి తెలుసుకునే విజ్ఞాన యాత్రగా జూ పార్కు సందర్శన ఉంటుంది. జూ పార్కును సందర్శించడానికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. జూ సందర్శనకు పెరిగిన ఆసక్తి..జూలో లేని జంతువు, పక్షులను రప్పించేందుకు, జంతువు, పక్షుల సంతానోత్పత్తి చేపట్టడం ప్రారంభించాక జూ సందర్శన పట్ల సందర్శకుల్లో అమితమైన ఆసక్తి పెరిగింది. అత్యంత విషతుల్యమైన పాములు, విషం లేని పాములను స్నేక్ సెల్ బృందం ప్రదర్శిస్తూ వాటి వివరాలను సందర్శకులకు తెలియజేస్తూ పాములపై సందర్శకులకు ఉన్న అపోహాలను తొలగిస్తున్నారు. అంతేకాకుండా వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ వన్యప్రాణులను దత్తత తీసుకునే వెసలుబాటును కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లపై సందర్శకులను చైతన్యవంతులను చేస్తూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేస్తున్నారు. సందర్శకులు రోజంతా ఉపశమనం పొందడమే కాకుండా ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వన్యప్రాణులను తిలకించడమే కాకుండా అనేక విషయాలను తెలుసుకోవడం లాంటి అనుభూతులను జూను సందర్శిస్తే కాని తెలియదు. ఎప్పటికప్పడు కొత్తదనం.. జూపార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతరించిపోయే జంతువు, పక్షుల సంతానోత్పత్తిని చేపట్టేందుకు జూపార్కు కేంద్ర బిందువుగా ఉంది. చిన్నారులు ఆడుకునేందకు చిల్డ్రన్స్ పార్కు, సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, రచ్చబండలు, సహాపంక్తి భోజనాలు చేసేందుకు పచ్చని తోరణాలతో విచ్చుకున్న పచ్చదనం జూపార్కు అందచందాలను తిలకించేందుకు విజిటర్ వ్యాన్, లయన్ సఫారీ, చిట్టి రైలు అందుబాటులో ఉన్నాయి. -
ఫోన్ చేసుకుని ఇస్తామని మొబైల్‌తో జంప్..!
మొబైల్ ఇస్తారా ఒకసారి ఫోన్ చేసుకుంటామని కొందరు, మరికొందరు తమ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.. అర్జంటుగా బంధువులకు కాల్ చేసుకోవాలని చాలామంది మొబైల్ తీసుకుంటారు కదా. పాపం అని మనం కూడా చాలాసార్లు సాయం చేస్తుంటాం కూడా అయితే ఈ స్టోరీ చదివాక మరోసారి అలా ఇవ్వడానికి భయపడతారు. విషయం ఏమిటంటే..!దారిన వెళ్లే ఓ వ్యక్తిని ఆపి ఫోన్ చేసుకుని ఇస్తామని మొబైల్ తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన నరేష్ రసైలి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–9లోని నెట్వర్కింగ్ బిల్డింగ్‌లో గత నాలుగు సంవత్సరాలుగా వాచ్మెన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లాడు. తిరిగి మరుసటి రోజు 13వ తేదీన తెల్లవారుజామున 5.20 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటిబాట పట్టాడు. వెంకటగిరి నుంచి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై అతని వద్దకు వచ్చి తమ మొబైల్ ఫోన్ రీఛార్జ్ గడువు ముగిసిందని, ఒక్కసారి నీ ఫోన్ ఇస్తే చేసుకుని ఇస్తామని నమ్మబలికారు. దీంతో నరేష్ తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న ఆగంతకులు ఫోన్ చేసినట్లుగా నటించి బైక్‌పై ఉడాయించారు. ఈ సమయంలోనే బైక్‌పై వెనుక కూర్చొన్న ఆగంతకుడు నరేష్ జట్టు పట్టుకొని 5 మీటర్ల మేర లాక్కెళ్లాడు. ఈ ఘటనలో కిందపడిపోయిన నరేష్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నోట్ : నిజంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తప్పులేదు. కానీ అనామకులు, కేటుగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.! ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! వివాహిత అదృశ్యం వెంగళరావునగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... బీదర్‌కు చెందిన ప్రకాశ్, రేష్మ దంపతులు ఎస్పీఆర్హిల్స్లో ఉంటారు. రేష్మ దుర్గంచెరువు ప్రాంతంలో హౌస్‌కీపింగ్ పనులు చేస్తుంది. ఈ నెల 10న ప్రకాశ్ కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లగా భార్య విధులకు వెళ్లున్నట్టుగా చెప్పి బట్టలు సర్దుకుని వెళ్లింది. దాంతో ప్రకాశ్‌కు తన పెద్ద కుమార్తె ఫోన్ చేసి తన తల్లి దుస్తులు సర్దుకుని వెళ్లినట్టు తెలియజేసింది. అతను వచ్చి చూడగా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెదికినా ప్రయోజనం లేదు. ఇదిలా ఉండగా తన భార్య తరచూ భాస్కర్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రకాశ్ సోమవారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
నిజాం పాలనలో రజాకార్ల దాడుల గురించి ముందస్తుగా ప్రజలకు తెలియజేయడానికి గ్రామాల్లో అప్పట్లో బురుజులు నిర్మించారు. బురుజులపై ఎల్లప్పుడూ ఒకరిద్దరు కాపలా ఉండేవారు. గ్రామం పొలిమేర వరకూ కనిపించడానికి బురుజుల చుట్టూ కిటికీ లాంటి నిర్మాణాలుండేవి. అక్కడి నుంచి రజాకార్ల రాకను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేవారు. ఈ కట్టడాలు మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్నాయి. అవి నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ప్రభుత్వం చొరవచూపి వీటిని అభివృద్ధి చేస్తే భావితరాలకు చరిత్రను తెలిపే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేటలో, ఘట్కేసర్ మండలంలో కొండాపూర్, అంకుషాపూర్, మర్పల్లిగూడలో, మేడ్చల్ మండలంలోని డబిల్పూర్, బండమాదారంలో, మేడ్చల్ పట్టణంలో నిజాం రాజుల గుర్రాల కోసం నిర్మించిన గుర్రపుశాల నేటికీ తహసీల్దార్ కార్యాలయంగా వినియోగంలో ఉంది. వందల ఏళ్లు గడిచినా.. ఆ కట్టడాలు కట్టి వందల ఏళ్లు గడుస్తున్నా నేటికీ చెక్కు చెదరకుండా దృఢంగా ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 400 సంవత్సరాల క్రితం రాజులు పాలిస్తుండగా తరచూ చోరీలు జరిగేవి. దీంతో నాటి కాలంలో గ్రామాల నడిబొడ్డున పెద్ద రాతి కట్టడాలు (బురుజులు) నిర్మించారు. అనంతరం రజాకార్ల కాలంలో వారి ప్రవేశాన్ని గుర్తించేందుకు బురుజులను వినియోగించారు. నాటి సైనికుల విడిది కేంద్రం..నాడు మేడ్చల్ అటవీ ప్రాంతం కావడంతో రాజులు వేటకు వచ్చేవారు. మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయ భవనం సైనికుల విడిది కేంద్రంగా, చుట్టూ ఆవరణలో ఉన్న చిన్న చిన్న గదుల్లో గుర్రాలను కట్టించి ఉంచేవారు. తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న మేడ్చల్ పెద్ద మసీదును ప్రార్థనల కోసం నాడు నిర్మించినదే. కాలక్రమేణ నాటి గుర్రపు శాల నేడు మేడ్చల్ తహసీల్దార్ భవనంగా మారింది. (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!) -
హైదరాబాద్ లో ఈడీ సోదాలు
-
ఖరీదైన పండ్లకు కేరాఫ్‌గా భాగ్యనగరం..!
హైదరాబాద్ నగరానికి విదేశాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నాయి. న్యూజిలాండ్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, దక్షిణాఫ్రికా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, సౌదీ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫలాలు వస్తున్నాయి. ప్రధానంగా యాపిల్, కివీ, ప్లం, పియర్, డ్రాగన్, ఖర్జూర, చెర్రీ వంటి ఖరీదైన పండ్లు విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాయి. విదేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వెరైటీల పండ్లు సరఫరా అవుతున్నాయి. కొన్ని ప్రూట్స్ ఏడాది పొడవునా..మరికొన్ని సీజన్ వారీగా విపణిలో అందుబాటులో ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా అరటి, నారింజ, దానిమ్మ, నల్ల ద్రాక్ష, పైనాపిల్, జాక్ ఫ్రూట్ వంటివి దిగుమతి అవుతున్నాయి. మోసంబీ, సీతాఫలం, బొబ్బాయి, మామి డి, జామ, పుచ్చకాయ వంటి పండ్లు రంగారెడ్డి, వికారాబాద్‌లతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో సాగవుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రధానంగా బాటసింగారం, మోజంజాహీ, గుడిమల్కాపూర్, బోయిన్పల్లి పండ్ల మార్కెట్లు ముఖ్యమైనవి. పోషక అవసరాలను తీర్చడంలో ఉద్యానవన ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా తర్వాతి నుంచి ప్రజల ఆహార అలవాట్లలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఒత్తిడి, బిజీ పనుల కారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. దీంతో పండ్లు, కూరగాయల వినియోగం పెరిగింది. దీంతో రైతులు కూడా వైవిధ్యమైన తోటలను సాగు చేస్తున్నారు. మరోవైపు ఉద్యానవన సాగుతో కార్మిక శక్తికి ఉపాధి అవకాశాలను అందించినట్లవుతుంది. బాటసింగారం మార్కెట్లోకే 2023–24లో 4,65,633 టన్నుల పండ్లు దిగుమతి అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం తెలిపింది. రంగారెడ్డిలో 94 వేల ఎకరాల్లో సాగు.. గ్రేటర్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఉష్ణమండలం, సహజ వనరులు, అనువైన నేలలతో పాటు విస్తారమైన భూమి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 94,139 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. జిల్లాలోని మొత్తం పంట విస్తీర్ణంలో ఉద్యానాల సాగు విస్తీర్ణం వాటా 30–40 శాతం వరకు ఉంటుంది. ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి, జామ, తీపి నారింజ, దానిమ్మ, ఆమ్ల నిమ్మ, పుచ్చకాయ ప్రధానంగా సాగు అవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఉద్యానవన పంటలు లాభదాయకయమైన రాబడిని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాసెసింగ్ పరిశ్రమకు ముడి పదార్థాలను అందించడం, ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం వంటి కారణాలతో గణనీయమైన ప్రాముఖ్యతను పొందుతుంది.ఖరీదు ఎక్కువే.. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లు ఖరీదైనవే ఉంటున్నాయి. డ్రాగన్, కివీ, ఖర్జూర, చెర్రీ వంటి పండ్లు ఎక్కువ ధర పలుకుతుండగా.. సాగు, సీజన్‌ను బట్టి మామిడి, యాపిల్, దానిమ్మ ధరలు కూడా అధికంగానే పలుకుతున్నాయి. నగరంలో డ్రాగన్ ఫ్రూట్ ధర క్వింటాల్‌కు రూ.1,13,610లుగా ఉండగా.. పియర్ రూ.30 వేలు, కివీ రూ.18,471, చెర్రీ రూ.24,975, నల్ల ద్రాక్ష రూ.17,344, ఖర్జూర రూ.16,100, మామిడి రూ.13,338, యాపిల్ రూ.15,927, దానిమ్మ రూ.14,225లుగా ఉన్నాయి. ఇక సపోటా, మోసంబీ, బొప్పాయి, నారింజ, అరటి వంటి లోకల్ ఫలాలు ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉన్నాయి.(చదవండి: Japanese Tradition: ‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!) -
అపార్ట్మెంట్లో అక్కా చెల్లెళ్లు మృతి
హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్‌మెంట్‌లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన æవస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్‌లో 16 మంది ముంబై అమ్మాయిలు.!
హైదరాబాద్: వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ పబ్‌పై చైతన్యపురి పోలీసులు దాడి చేశారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కొత్తపేట కిలా మైసమ్మ దేవాలయ సమీపంలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లో యువతులతో అర్దనగ్న నృత్యాలు చేయిస్తుండటమేగాక, నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. 16 మంది యువతులను డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి యువకులే టార్గెట్.. పబ్‌కు వెళ్లాంటే కస్టమర్ల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. జంటలుగా వచ్చిన వారిని కాకుండా మద్యం సేవించేందుకు ఒంటరిగా వచి్చన యువకుల వద్దకు యువతులు వచ్చి వారికి కంపెనీ ఇస్తారు. అసభ్యంగా డాన్సులు చేస్తూ తాము సేవించే మద్యం, ఆహారం కూడా సదరు యువకుల బిల్‌లోనే వేస్తారు. వ్యాపారం పెంచుకునేందుకు మోసపూరితంగా పబ్ నిర్వాహకులే యువతులకు ఫ్రీ పాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. తద్వారా బిల్లు ఎక్కువ అయ్యేలా చేసి వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఇందుకు గాను ముంబై నుంచే కాక నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యవతులను పబ్ నిర్వాహకలు ఎంగేజ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. బ్యూటీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులను ఎంచుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పట్టుపడిన యువతులను వనస్థలిపురం, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. 16 మంది యువతులతో పాటు డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు. -
Hyderabad: ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
హైదరాబాద్: వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఇంజక్షన్ వికటింక్షో వ్యక్తి మృతి చెందిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్ రోడ్డు సమీపంలోని హై కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించిందని తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఐలయ్య మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడికి ఇచ్చింది ఇంజక్షన్లను పరిశీలించగా అవి మార్చి నెలలోనే ఎక్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిని ఇంజక్షన్ ఇచి్చనందునే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృత దేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వడగండ్ల వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో రెండు సంస్థలపై ఈడీ సోదాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీస్‌తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ.. అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలు, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. చెన్నై చెందిన ఈడీ బృందాలు సోదాల్లో పాల్గొంది. సూరానా గ్రూప్స్.. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిన నేపథ్యంలో ఇప్పటికే సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదైంది. ఇక, తాజాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఈడీ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈడీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
‘మాటలతో ఆటలాడవద్దు.. మీ గేమ్స్ చెల్లవు’
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేయబోతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటలతో ఆటగాడవద్దు. మీ గేమ్స్ చెల్లవు’ అంటూ అని తీవ్రంగా స్పందించారు. ఈ అంశంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వారే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తారని మండిపడ్డారు. (ఇదీ చదవండి: ‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’)ఇదిలా ఉంచితే,. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ నగరంలో నోవాటెల్ హెటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సంక్షేమం ఒక ఎత్తు అయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయారు మన ప్రభుత్వం అందరికీ చెప్పి చేసింది. ఈ రెండు అంశాలు చేయాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలవుతుంది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించాము. ఎస్సీ కుల వర్గీకరణ జరిగింది. దేశంలో కొద్దిమందికి ఇష్టం లేకపోయినా భూసంస్కరణలు వంటి గొప్ప నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టింది. అందుకే ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. బీసీ కుల గణన, sc వర్గీకరణ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బి ఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలను మూట కట్టి మూలన పడేసే విషయాలు.. ఇవి వారి అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి బీఆర్ఎస్, బిజెపి చేతులు కలిపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు బిజెపి, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయి. బీసీ కుల సర్వే మీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఏకంకండి, మాతో కలిసి రండి అని చెప్పి బహుజన వర్గాలను చైతన్యం చేయాలి. కులగణన ద్వారా పొందాల్సిన ఫలితాలను అందుకున్నాము. సంక్షేమ పథకాలు, బీసీ కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ నిశ్శబ్ద విప్లవాలు’ అంటూ ఆయన స్పష్టం చేశారు. -
హైదరాబాద్ కంపెనీతో చేతులు కలిపిన అమెరికన్ సంస్థ: వెయ్యికి పైగా జాబ్స్..
అమెరికాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం 'సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్', టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. ఇండియాలో తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దీనిద్వారా 1,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు.కాగ్నిజెంట్ కొత్త జీసీసీ సెంటర్.. ఎంటర్ప్రైజ్ టెక్ సామర్థ్యాలు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌లు, డేటా అనలైజ్, ఉత్పత్తి ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి ఇదొక ఇన్నోవేషన్ హబ్ మాదిరిగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.హైదరాబాద్‌లో దాదాపు 57,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న కాగ్నిజెంట్.. దాని AI-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లైన న్యూరో, ఫ్లోసోర్స్లను ఉపయోగించి సిటిజన్స్ జీసీసీకి అదనపు శక్తిని ఇవ్వనుంది. అంతే కాకుండా క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ,ఇంటెలిజెంట్ ఆటోమేషన్‌లో భవిష్యత్తు అవసరానికి కావలసిన పరిష్కారాలను అందిస్తుంది.అమెరికా కంపెనీ.. కాగ్నిజెంట్‌తో కలిసిన సందర్భంగా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సిటిజన్స్ బ్యాంక్, కాగ్నిజెంట్ చేతులు కలపడంతో, భారతదేశ జీడీపీకి 1 ట్రిలియన్ డాలర్లు అందించే మొదటి రాష్ట్రంగా అవతరించే లక్ష్యానికి తెలంగాణ దగ్గరగా ఉందని అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. -
మంచు లక్ష్మీ ఫ్యాషన్ షో.. వజ్రంలా మెరిసిపోయిన అనసూయ (ఫొటోలు)
-
మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ సీజన్ 2 వచ్చేస్తోంది!
హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా ఇటీవలే నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ ఈవెంట్ విజయవంతం కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ సీజన్ 2ను ప్రకటించారు. రెండో సీజన్ కు సంబంధించిన పోస్టర్ ను ఫౌండర్ కిరణ్మయి అలివేలు , సీజన్ 1 విజేతలతో కలిసి ఆవిష్కరించారు. ఔత్సాహిక యువతులకు ఇది మంచి వేదికని కిరణ్మయి చెప్పారు. నిత్య జీవితంలోని ఆలోచనలు, ఆశయాలకు పెళ్లి ముగింపు కాదనీ, మరో అద్భుత ఆరంభమన్నారు. మగువ సౌందర్యాన్ని మరింత గ్రాండ్ గా ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలు, బ్యూటీ కాంటెస్ట్స్ లో పాల్గొన్న అనుభవంతో, ఔత్సాహికులకు అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలను ఫ్యాషన్ వేదికపై ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ ఫౌండర్ కిరణ్మయి అలివేలు చెప్పారు.ఈ సందర్బంగా తమ విజయంలో భాగమైన కుటుంబాలు, స్పాన్సర్లు, పాల్గొనేవారు, నిర్వాహక బృందానికి, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ లక్ష్యంలో కలిసి నడిచినందుకు ధన్యవాదాలన్నారు. సీజన్ 2 ప్రకటన సందర్భంగా మొదటి సీజన్ లో విజేతలుగా నిలిచిన వారంతా ర్యాంప్ వ్యాక్ తో అలరించారు. -
హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. మరో మూడు రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని గంటల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, సోమాజిగూడ, ఎర్రమంజిల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.ఒక్కసారిగా వాతావరణం మారి.. వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాగం అప్రమత్తమైంది.తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య నుంచి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాల మీదుగా దక్షిణ గ్యాంజెటెక్ పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. -
నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడి కాస్త కిందకు కుంగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్ మొరాయించడమే కాకుండా ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంత లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. కాసేపు అంతా అయోమయానికి గురయ్యారు.ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం రేవంత్ ను పంపారు. ఈరోజు(మంగళవారం) నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో భాగంగా రేవంత్ అక్కడకు హాజరైన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీలోని నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్.. పార్టీలో నిరసన గళం వినిపిస్తున్న నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ పేర్లు ప్రస్తావించకుండా రేవంత్ ఆయా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.గతద్ది రోజులుగా పార్టీలో పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే వార్ నడుస్తోంది. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు పార్టీ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తమకు పదవులు రావేమోననే భయం కూడా వారిలో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అధిష్టానానిని తమదైన శైలిలో హెచ్చరికలు పంపుతున్నారు. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. మీ మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ తేల్చిచెప్పారు. ఇదీ చదవండి: అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ! -
ఎండలతో గాయ్ గాయ్.. నీళ్లల్లో హాయ్ హాయ్!
వేసవికాలం వచ్చిందంటే మండే ఎండలు భయపెడతాయి.మరి భయపెట్టే ఎండల నుంచి రక్షణపొందాలంటూ చల్ల చల్లని ప్రదేశాలు ఎక్కడున్నాయా అని వెదుక్కుంటూ ఉంటారు జనాలు. కూలెస్ట్ డెస్టినేషన్స్ వెదుక్కుంటూ ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే ఈ హడావిడి ఇంకా పెరుగుతుంది. ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సేద తీరేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. కొద్ది రోజులుగా నగరంలోని జల విహార్‌కు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో జల విహార్‌కు తాకిడి మరింత పెరిగింది. జలకాలాటలతో జరంత ఉపశమనం పొందారు.ఆద్యంతం.. ఉత్సాహభరితం.. వాక్ ఏ వే 2.0 కార్యక్రమం ఆదివారం ఆద్యంతం ఉత్సాహభరితంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 వేల మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆటిజంపై అవగాహన, అంగీకారం, సమగ్ర చేర్పునకు సంఘీభావంగా నిలిచారు. అందరినీ ఒక్కతాటిపై ఉంచి సమాజంలో లోతైన స్ఫూర్తిని నింపింది. మర్హం, రెసొనేటింగ్ రెసిలియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కుటుంబాలు, నిపుణులు, ఉపాధ్యాయులు, సోషల్ మీడియా స్టార్లు, సంస్కరణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీనటి పాయల్ రాధాకృష్ణ, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాణి, టీఎస్ఎంసీ అధ్యక్షురాలు డా.ప్రతిభ, డా.మిన్హాజ్, డా.లోకేశ్ ఆర్జే షదాబాద్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు విజయతుపురాణి ఆధ్వర్యంలో ఎనర్జీతో నిండిన డాన్స్హిట్ సెషన్, సుధారమణి కథ చెప్పడం, రోహిణి జయంతి చేసిన మనోహరమైన బొమ్మల షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగుల హరివిల్లులా కారి్నవాల్, ఆటలు, సృజన్మాతక స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మర్హం వ్యవస్థాపకుడు డాక్టర్ నవత్ లఖాని మాట్లాడుతూ.. ఎదుగుతున్న పిల్లలకు స్నేహితులు, కుటుంబం మద్దతు ఉంటుందనే భరోసాతో తల్లిదండ్రులు ఉంటారన్నారు. కానీ ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఆ భరోసా సులభంగా లభించదు. సమాజం ముందుకు రావాల్సిన సమయం ఇదేనన్నారు. -
గుంతలో పడిన బంతి తీస్తుండగా.. పైనుంచి లిఫ్టు పడి వ్యక్తి మృతి
సుభష్నగర్: గుంతలో పడిన బంతిని తీసే క్రమంలో పైనుంచి లిఫ్టు పడి ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందిన ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం డివిజన్ శ్రీకృష్ణనగర్లోని శ్రీ సాయి మణికంఠ రెసిడెన్సీ మొదటి అంతస్తులో నివసించే అక్బర్ పటేల్ (39) ఆర్ఎంపీ. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపార్ట్మెంట్ సెల్లార్లో పిల్లలు ఆడుతుండగా బంతి లిఫ్ట్ గుంతలో పడిపోయింది. బంతిని తీసేందుకు అక్బర్ పటేల్ లిఫ్ట్ గుంతలో తలపెట్టి తీస్తుండగా ఈ క్రమంలో ఒక్కసారిగా లిఫ్టు అతనిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్బర్ పటేల్ స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా. 15 ఏళ్లుగా స్థానికంగా ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. అక్బర్ పటేల్‌కు భార్య బిస్మిల్లా పటేల్, 7 ఏళ్ల లోపు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అక్బర్ మృతికి బిల్డర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సూరారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత రాత్రి 8.40 గంటలకు సూరారం చౌరస్తాలో గంట పాటు ధర్నాకు దిగగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. అటు గండిమైసమ్మ చౌరస్తా, ఇటు ఐడీపీఎల్ వరకు భారీ ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సదరు బిల్డర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబానికి కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మద్దతు పలికారు. -
ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆరు ప్లాట్ ఫామ్‌లను మూసివేయనున్నారు. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్లు మళ్లించనున్నారు. 100 రోజుల పాటు ఆరు ప్లాట్ ఫామ్‌లు మూసి వేయనునట్లు అధికారులు ప్రకటించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తుండటంతో 115 రోజుల పాటు సగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసి వేయనున్నారు. ఇవాళ నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా, కొన్ని నాంపల్లి, కొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్లో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి.వేచి ఉండే ప్రాంతంతో పాటు రిటైల్ ఔట్లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు లాంటివన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన పునాదులు, కాలమ్స్ పనులు మొదలుపెడుతున్నారు.ఇందుకోసం 2–3, 4–5 ప్లాట్స్ ఫామ్స్‌ను 50 రోజులు చొప్పున మొత్తం వంద రోజులపాటు మూసేస్తారు. వీటిల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేసే పనులు కూడా చేపడుతారు. ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రైల్వే ట్రాక్ మొత్తానికి పైకప్పు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన పనులను కూడా ఈ నాలుగు ప్లాట్‌ఫామ్స్‌తో ప్రారంభిస్తున్నారు. తర్వాత ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు పనులు చేపడుతారు.ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో ప్లాట్‌ఫామ్ వరకు భారీ ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్పామ్ 5–6 లో 500 టన్నుల సామర్థ్యంగల భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ట్రాక్‌లపై ఇసుక బస్తాలు నింపి, దాని మీద క్రేన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 15 రోజుల పాటు ఆ రెండు ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తున్నారు.నిత్యం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిల్లో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 100 రోజుల పాటు సింహభాగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తుండటంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌లో రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. ఆరు నెలల పాటు సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది. -
హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి.. శవంపై డ్యాన్స్
హైదరాబాద్: తన స్వీయ రక్షణ కోసం పెట్టుకున్న ఆయుధమే ఆమె పాలిట యమపాశమైంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఓ మైనర్ అతికిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా వృద్ధురాలి శవంపై నిలబడి డ్యాన్సులు చేసుకుంటూ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత తాను ఓ ఘనకార్యం చేశానంటూ మిత్రుడికి ఫోన్ చేసి హత్య చేసిన వీడియోను షేర్ చేశాడు. అలా వీడియో కాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 11న చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు..రాజస్తాన్‌కు చెందిన పుక్రాజ్ చౌదరి, కమలాదేవి (70) దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చి మీర్పేట్–హెచ్‌బీకాలనీ డివిజన్, కృష్ణానగర్ కాలనీ రోడ్డు నెంబరు–5లో ఉంటున్నారు. వారికి సంతానం లేదు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో కమలాదేవి ఒంటరిగానే ఉంటుంది. మొదటి అంతస్తులో ఆమె నివాసముంటూ గ్రౌండ్‌ఫ్లోర్‌లో షాపులను తన బంధువులకు అద్దెకిచ్చింది. అద్దె షాపుల్లో ప్రకాశ్ చౌదరి అనే వ్యక్తి హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తున్నాడు. 8 నెలల క్రితం రాజస్తాన్‌కు చెందిన ఓ బాలుడిని (17) షాపులో పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కమలాదేవికి బాలుడితో పరిచమైంది. కొన్ని విషయాల్లో కమలాదేవి ఆ బాలుడిని మందలించింది. దీన్ని మనసులో పెట్టుకున్న బాలుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయిచుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 10:15 గంటల సమయంలో కమలాదేవి ఇంట్లోకి వెళ్లి తనకు ఆకలిగా ఉందని చెప్పాడు. ఆమె రొట్టె చేసి ఇస్తానని చెప్పి పిండి సిద్ధం చేస్తుండగా..అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్‌ను తీసుకుని వెనుకనుంచి ఆమె తలపై బలంగా మోదాడు. కమలాదేవి రక్షణ కోసం పెట్టుకున్న రాడ్‌తోనే ఆమెపై దాడి చేశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో రాడ్‌తో బలంగా గొంతులో పొడిచి ఆమె చీర కొంగుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన వృద్ధురాలి గొంతు, చాతిపై నిలబడి డ్యాన్సులు చేస్తూ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. రాత్రి 12:30 గంటల సమయంలో ఇంట్లోంచి ఓ కవరుతో బయటకు వచ్చి తాను ఉంటున్న ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు, ఆ తర్వాతి రోజు కూడా ఏం తెలియనట్లు షాపునకు వచ్చాడు. హత్య చేసిన మరుసటి రోజు పైకి వెళ్లి విగతజీవిగా పడి ఉన్న కమలాదేవిని చూసి వచి్చన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతటితో ఆగకుండా ఈ నెల 14న బెంగుళూరులో ఉంటున్న మిత్రుడు సురేందర్‌కు ఫోన్ చేసి తాను ఓ ఘనకార్యం చేశానంటూ గొప్పగా చెప్పాడు. కమలాదేవిని హత్య చేసిన విషయాన్ని మిత్రుడికి చెప్పాడు. సరదాగా అంటున్నాడనుకొని మొదట నమ్మలేదు. దీంతో తన సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోను మిత్రుడికి షేర్ చేశాడు. కంగుతిన్న సురేందర్ వెంటనే కిషన్‌సింగ్ పనిచేస్తున్న షాపు యజమానికి విషయం తెలియపరిచాడు. స్థానిక పెద్దల సాయంతో విషయాన్ని పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడంతో పాటుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
స్నేహితుడుమోసం చేశాడని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమీర్‌పేట: స్నేహితుడు డబ్బులు తీసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్‌కు చెందిన శివాని, రుడాల్ప్ ఆంటోని (30) దంపతులు అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో నివాసముంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో భార్య కూడా ఉద్యోగం చేయాలని ఆంటోని భావించాడు. ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడు విశాల్ శివానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతడికి రూ.4.50 లక్షలు ఇచ్చాడు. అయితే అతను ఉద్యోగంఇప్పించకపోవడంతో ఆదివారం రాత్రి అల్వాల్‌లోని విశాల్ ఇంటికరి వెళ్లి గొడవ పడ్డాడు. రాత్రి ఇంటికి తిరిగి వచి్చన ఆంటోని కష్టపడి కూడబెట్టిన డబ్బు స్నేహితుడే కాజేశాడని భార్యకు చెప్పి బాధపడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శివాని స్నేహితుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆంటోనీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్ అంబులెన్స్‌లో గుండెపోటుతో వ్యాపారవేత్త మృతి
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ అంబులెన్స్‌లో వ్యాపారవేత్త మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కమల్ కుమార్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కమల్ కుమార్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ చేరుకోకముందే వ్యాపారవేత్త కమల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. -
'టీచ్ ఫర్ ఛేంజ్' సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మెరిసిన తారలు (ఫోటోలు)
-
HYD: అర్ధరాత్రి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో నగరంలో కొందరు పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని చైతన్యపురిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు పోలీసుల దృష్టికి సమాచారం అందడంతో సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయినట్టు పోలీసులు గుర్తించారు. పబ్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారు. ముంబై నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి.. కస్టమర్లకు ఎర వేస్తున్నారు పబ్ యాజమాన్యం. ఈ క్రమంలో సోదాల్లో భాగంగా 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు, కస్టమర్స్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
పోలింగ్‌కు బీఆర్ఎస్ హాజరయ్యేనా?
సాక్షి,హైదరాబాద్: త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం గెలిచేందుకు అవసరమైన ఓటర్ల సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ బరిలో దిగడమే. ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు హైదరాబాద్ ‘స్థానిక’ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. ఆ లెక్కన మొత్తం ఓటర్లలో అత్యధికంగా 49 ఓట్లు ఎంఐఎంకు ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధంతో ఆ పార్టీకి, దానికి మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్‌కు చెందిన 14 ఓట్లు ఎంఐఎంకు లభించే అవకాశాలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ, కమలం పార్టీ తమ అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో బీజేపీ ఏ ధీమాతో, ఏ నమ్మకంతో పోటీలో నిలిచిందనేది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న తలెత్తుతోంది.ఎవరికి ఎవరో.. మరో వైపు కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ ఈ మూడూ దేనికవిగా మిగతా రెండూ కలిసి పని చేస్తున్నాయని ఎంతో కాలంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. మిగతా రెండూ ఒకటేనని, తమ పార్టీ మాత్రమే వాటికి వ్యతిరేకంగా ప్రజల కోసం పని చేస్తోందని మూడు పారీ్టల నేతలూ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలో ఎవరికి ఎవరు మద్దతుగా నిలుస్తారో, ఎవరిని వ్యతిరేకిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అంత నమ్మకం లేనిదే బీజేపీ ఎందుకు పోటీలో ఉంటుందని, మిగతా పార్టీల నుంచి తగిన హామీ లభించి ఉండవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. ఈ ఎన్నికను సైతం ఆయా పార్టీలు, ప్రజలు పారీ్టలపరంగా చూస్తున్పటికీ, పోటీలో ఉన్న అభ్యర్థులను కానీ.. ఓటర్ల జాబితాలో కానీ వారి పేర్లు, చిరునామాలు తప్ప ఏ పారీ్టయో వెల్లడించరు. కనీసం ఏ డివిజన్ కార్పొరేటరో కూడా జాబితాలో ఉండదు. విప్ వంటివి వర్తించవు.ఆత్మ ప్రబోధానుసారంగా? ⇒ జీహెచ్ఎంసీ పాలకమండలిలో సైతం పార్టీ మారిన వారు ఒకే చోట కూర్చుంటారు తప్ప అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయరు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పారీ్టల వారీగా అభ్యర్థులను పేర్కొంటారు తప్ప.. తర్వాత పార్టీ మారినా అధికారికంగా దాన్ని ప్రకటించరు. పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యరి్థకి కానీ, తమ పార్టీ అధిష్ఠానం సూచించిన వారికి కానీ కచి్చతంగా ఓటేయాల్సిన పరిస్థితి ఓటర్లకు లేదు. అందువల్లే బీజేపీ ధీమాగా ఉందని చెబుతున్నారు. ⇒ అంతేకాదు.. ఇటీవల బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎంను ఓడించాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో అసలీ ఎన్నికలో ఏం జరగనుందో అంతుచిక్కడం లేదని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగినా గుర్తించలేరు. పారీ్టలు సైతం ఫలానా వారికే ఓటేయాలని ఇంతవరకు చెప్పలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వైఖరి ఏమిటో అంతుపట్టడం లేదు. ⇒ బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదేపదే అంటున్నారు. కాంగ్రెస్ మద్దతు ఎంఐఎంకు ఉంది. జీహెచ్ంఎసీ స్టాండింగ్కమిటీ ఎన్నికలోనూ అది వెల్లడైంది. కాబట్టి కాంగ్రెస్ మద్దతిచ్చే ఎంఐఎంకు బీఆర్ఎస్ సైతం మద్దతిస్తుందా, లేక పోలింగ్‌కు దూరంగా ఉంటుందా అన్నది తెలియడానికి ఇంకా సమయం పట్టనుంది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం కూడా ప్రారంభం కావచ్చని ఆశిస్తున్నవారూ ఉన్నారు. ప్రలోభాలను సైతం ఆత్మప్రబోధంగా చెబుతారని కార్పొరేటరొకరు వ్యాఖ్యానించారు. పారీ్టల పరంగా చూస్తే బీఆర్ఎస్కు 24 ఓట్లు, బీజేపీకి 25 ఓట్ల బలం ఉంది. -
కాకరేపుతున్న కామెంట్స్.. ఈటల వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుండగా, మరోవైపు కొందరు పదవులు దక్కిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అసంతృప్తి శ్రేణుల్లో నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో కొత్తగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షుల వ్యవహార శైలిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు పార్టీ పరంగా గ్రౌండ్ వర్క్ (Ground Work) చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. డివిజన్, జిల్లాలవారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలాబలాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపైనా చర్చిస్తున్నారు. ఇలాంటి సమంలో పార్టీ పదవుల్లో ఉన్నవారు సమావేశాలకు గైర్హాజర్ కావడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారే పార్టీ పదవుల్లో కొనసాగాలని, అలా కుదరదంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలనే వాదలు గట్టిగా వినిపిస్తున్నారు.ఇటీవల కాషాయ పార్టీ మీటింగ్‌లో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender ) సైతం ఇదే స్వరాన్ని వినిపించారు. మేడ్చల్ అర్బన్ జిల్లాలో బీజేపీ 25 డివిజన్లుగా విభజించింది. కొత్తగా డివిజన్ అధ్యక్షులను ఎంపిక చేసింది. అనంతరం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కొత్తగా ఏర్పాటైన వారిలో 9 మంది డివిజన్ అధ్యక్షులు హాజరు కాలేదు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన ఈటల రాజేందర్ 70 వేల మందికి ప్రాతినిథ్యం వహించే డివిజన్ అధ్యక్షుడు పార్టీ సమావేశాలకు హాజరు కాకుంటే ఎలా, అత్యవసర పరిస్థితుల్లో రాలేనివారిని మినహాయిస్తే, మిగతావారిని ఊపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.చదవండి: వారి మద్దతుతోనే ఈ నల్ల చట్టాన్ని తెచ్చారుదీంతో పార్టీలో ఆ 9 మంది డివిజన్ అధ్యక్షుల భవితవ్యం ఏంటనే చర్చ జరుగుతోంది. భాగ్యనగరంలోని మిగతా డివిజన్ల పరిస్థితిపైనా నిశితంగా పరిశీలించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారిని పక్కన పెట్టి పార్టీకి పనిచేసే వారికి పట్టం గట్టాలని పార్టీ అధిష్టానం (High Command) భావిస్తోందని నేతలు పేర్కొంటున్నారు. నేతలు సొంత పార్టీ వారే అయినా కొన్ని దఫాలు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందంటున్నారు. పదవి పొందేటప్పుడు ఉన్న ఆరాటం ఆ తర్వాత ఉండటం లేదని, పార్టీ కోసం 24 గంటలు పని చేయాల్సిందేనని పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తోంది. -
పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం.. సన్‌రైజర్స్ టీమ్‌కు తప్పిన ముప్పు
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుకుంది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే హోటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తోంది. ఈ ప్రమాద సమయంలో ఎస్ఆర్హెచ్ టీమ్ సభ్యులు హోటల్లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 17న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ టీమ్ సోమవారం సాయంత్రం ముంబైకి బయలు దేరాల్సి ఉంది. కానీ అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాస్త ముందుగానే ఎస్ఆర్హెచ్ టీమ్ చెక్ అవుట్ చేసింది.ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్ టీమ్ కాస్త తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై మాత్రం రికార్డు విజయాన్ని ఎస్ఆర్హెచ్ అందుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(141) భారీ సెంచరీతో చెలరేగాడు. -
ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డులు స్ఫూర్తిదాయకం
సాక్షి, సిటీ బ్యూరో : వ్యాపారం, సాంకేతికత, కళలు, సామాజిక సేవతో పాటు విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ (టీఓటీ) ఆధ్వర్యంలో ‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ –2025’ అవార్డులతో గౌరవించింది. హైటెక్ సిటీలోని అవసా హోటల్ వేదిక జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, వెల్నెస్ అంబాసిడర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు అవార్డులను అందించారు. ఈ వేదిక ద్వారా మహిళల ప్రయాణాన్ని స్ఫూర్తివంతమైన కథలుగా ప్రదర్శించామని ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఫయాజ్ తెలిపారు. అవార్డుల జ్యూరీలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఇండియా సీఈవో శిరీష వోరుగంటి, వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ భాగస్వామి అనురాధ ఏ, నోవార్టిస్ కంట్రీ హెడ్ దివ్య బాల్‌రాజ్, తెలంగాణ తొలి గిరిజన మహిళా వాణిజ్య పైలట్ కెప్టెన్ బాబీ ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, అబైరో క్యాపిటల్ సలహాదారు మహంకాళి శ్రీనివాసరావు, ఎడ్యు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిరోజ్ సైట్ పాల్గొన్నారు. నగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ ‘పత్ ఉత్సవాలకు’ వేదికైన ఖాజాగూడ పెద్ద చెరువు రాయదుర్గం : ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహా్వనితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రగ్బీ జాతీయ స్థాయి సభ్యత్వం ఇండియన్ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి తెలంగాణ అసోసియేషన్‌కు సభ్యత్వం అధికారికంగా ప్రకటించిన ఐఆర్ఎఫ్యుతెలంగాణలో బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ తరహాలో రగ్బీ క్రీడ కూడా అభివృద్ధి చెందనుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్ వెల్లడించింది. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి శాశ్వత సభ్యత్వం కోసం అధికారికంగా గుర్తింపు లభించిందని సంస్థ ప్రకటించింది. ఈ నూతన అనుబంధంతో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ కింద శాశ్వత సభ్యులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలనూ అందించనున్నట్లు నూతన అధ్యక్షులు, లైఫ్‌స్పాన్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. ఈ అధికారిక గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీని మెరుగుపరచడానికి, జాతీయ పాలక సంస్థతో సన్నిహితంగా సహకరించడానికి అసోసియేషన్ అనుమతిస్తుందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా 2028 వరకూ మూడేళ్ల పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన రగ్బీ సంఘాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఆకట్టుకున్న మార్షల్ ఆర్ట్స్ వైశాఖీ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం నగర కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహించారు. అమీర్‌పేట గురుద్వారా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రీన్‌ల్యాండ్స్, క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట మీదుగా గురుగ్రంథాన్ని, సిక్కు సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శనంగా ఊరేగింపు నిర్వహించారు. సిక్కు యువతీ, యువకులు చేసిన మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురుగోవింద్‌సింగ్ వంశపారంపర్యంగా వస్తున్న ఐదు అరుదైన గుర్రాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా గురుగ్రంథానికి పూజలు చేశారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.