
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మందు బాబులకు అలర్ట్. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.
ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.