wine shops closed
-
ఈ సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాపులు బంద్
హైదరాబాద్: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నారు..ఎందుకంటే..రేపు సోమవారం 2024, మార్చి25న హోలీ సందర్భంగా నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 26 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. -
మందుబాబులకు షాక్.. ఐదు రోజులు వైన్స్ బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మందుబాబులకు అలర్ట్. ఢిల్లీలో వరుసగా ఐదు రోజుల పాటు వైన్స్ షాప్‌లు మూడపడనున్నాయి. కాగా, ఢిల్లీలో జీ20 సమావేశాలు, పండుగల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వివరాల ప్రకారం.. ఢిల్లీలో వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, జీ20 సమావేశాల సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వైన్ షాపులను క్లోజ్ చేయనున్నారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఆ మూడు రోజులు మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులతోపాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. మరోవైపు.. శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నెల 6, 7 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించింది. దీంతో వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వరుస సెలవుల కారణంగా మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. గత వారం రోజులుగా రాజధానిలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడం విశేషం. ఇది కూడా చదవండి: 'పాక్‌కు వెళ్లండి..' విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు -
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ముంబై తర్వాత అత్యంత ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివస్తుంటారు. హైదరాబాద్‌లో రేపు ఆదివారం మహా నిమజ్జనం జరగనుంది. జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయక విగ్రహాలు తరలి రానున్నాయి. శోభాయమానంగా జరిగే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చదవండి: మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో తీవ్ర ఆంక్షలు విధించారు. అందులో భాగంగా మద్యం దుకాణాలు మూసి వేస్తున్నారు. ఆది, సోమవారం (19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు) మద్యం దుకాణాలు మూసి ఉంటాయని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న వైన్స్‌తో పాటు బార్లు, పబ్‌లు మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు All the #Toddy & #WineShops shall remain #closed from 0600 hrs on 19.09.2021 to 1800 hrs on 20.09.2021, in the jurisdiction of #RachakondaPoliceCommissionerate in view of #Ganeshimmersion to be held on 19.09.2021. pic.twitter.com/1bm4r78qGU — Rachakonda Police (@RachakondaCop) September 18, 2021 -
ప్రైవేటు కిక్.. నేటితో చెక్
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మద్యం షాపుల గడువు సోమవారంతో ముగియనుంది. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం షాపుల తొలగింపు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేటితో ప్రైవేట్ మద్యం షాపుల గడువు రాష్ట్ర వ్యాప్తంగా ముగియనుంది. మంగళవారం నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో 355 ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉన్నాయి. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏటా 20 శాతం మద్యం షాపులు తొలగిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని నెలల్లోనే ఆయన నిలబెట్టుకున్నారు. జిల్లాలో 282 దుకాణాలు మూత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 38 ప్రభుత్వం మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ జిల్లాలో ప్రారంభించి విక్రయాలు కొనసాగిస్తోంది. మంగళవారం నుంచి 282 ప్రభుత్వ మద్యం దుకాణాలు జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. బెల్టు షాపుల నిర్మూలన, మద్యం అమ్మకాలకు చెక్‌పెట్టడం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఈ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా భవనాల గుర్తింపు, ఆయా భవనాల్లో ఫర్నిచర్ ఏర్పాటు దాదాపు పూర్తయింది. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉండే మద్యం షాపుల్లో ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్మెన్లు, మిగిలిన ప్రాంతాల్లో ఒక సూపర్వైజర్, ఇద్దరు సేల్స్మెన్లు చొప్పున జిల్లా వ్యాప్తంగా 282 మంది సూపర్వైజర్లు, 731 మంది సేల్స్మెన్లను ఎక్సైజ్ అధికారులు నియమించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం దుకాణాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ విక్రయాలు నిర్వహిస్తారు. మద్యం కొనుగోళ్లపై సైతం ఆంక్షలు విధించారు. ఒక వ్యక్తికి ఏ సైజులో అయినా సరే.. మూడు బాటిళ్ల వరకూ కొనుగోలుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. విదేశీ మద్యం కూడా మూడు బాటిళ్లకు మించి కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధించారు. స్పిరిట్ మూడు బల్క్ లీటర్లు, కల్లు 2 బల్క్ లీటర్లు, బీరు 650 మిల్లీలీటర్ల బాటిళ్లు ఆరు వరకూ కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చారు. -
50 గంటలు మద్యం బంద్..
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలోని అన్ని మద్యం షాపులు మూసిఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి సోమవాంర మధ్యాహ్నం 12 గంటలవరకు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించినట్లు సైబరాబాద్ కమిషనర్ సి.వి. ఆనంద్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటు ఇతర జిల్లాల్లోనూ ఆయా ఎస్సీలు మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీచేశారు.