50 గంటలు మద్యం బంద్.. | for 50 hours from saturday wine shops should be closed, hyderabad police orders | Sakshi
Sakshi News home page

50 గంటలు మద్యం బంద్..

Published Sat, Sep 26 2015 9:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

50 గంటలు మద్యం బంద్..

50 గంటలు మద్యం బంద్..

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలోని అన్ని మద్యం షాపులు మూసిఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి సోమవాంర మధ్యాహ్నం 12 గంటలవరకు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించినట్లు సైబరాబాద్ కమిషనర్ సి.వి. ఆనంద్ శుక్రవారం మీడియాకు తెలిపారు.

 

ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటు ఇతర జిల్లాల్లోనూ ఆయా ఎస్సీలు మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement