సాక్షి, హైదరాబాద్: దేశంలో ముంబై తర్వాత అత్యంత ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివస్తుంటారు. హైదరాబాద్‌లో రేపు ఆదివారం మహా నిమజ్జనం జరగనుంది. జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయక విగ్రహాలు తరలి రానున్నాయి. శోభాయమానంగా జరిగే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
చదవండి: మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి
అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో తీవ్ర ఆంక్షలు విధించారు. అందులో భాగంగా మద్యం దుకాణాలు మూసి వేస్తున్నారు. ఆది, సోమవారం (19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు) మద్యం దుకాణాలు మూసి ఉంటాయని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న వైన్స్‌తో పాటు బార్లు, పబ్‌లు మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు.
చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు
All the #Toddy & #WineShops shall remain #closed from 0600 hrs on 19.09.2021 to 1800 hrs on 20.09.2021, in the jurisdiction of #RachakondaPoliceCommissionerate in view of #Ganeshimmersion to be held on 19.09.2021. pic.twitter.com/1bm4r78qGU
— Rachakonda Police (@RachakondaCop) September 18, 2021
Comments
Please login to add a commentAdd a comment