
హైదరాబాద్,సాక్షి: హిమాయత్ నగర్‌లో దారుణం జరిగింది. దోమలగూడా పీఎస్ పరిధిలో హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.
గుర్తు తెలియని దుండగులు బాధితుణ్ని హత్య చేశారు. అనంతరం, బ్యాంకు లిఫ్ట్‌లో పడేసి వెళ్లారు. హత్యపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాల్ని సేకరిస్తున్నారు.