సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లు తనను బలిపశువు చేస్తున్నాయని కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు స్టీఫెన్‌సన్‌తో పాటు చాలా మందిని కొనుగోలు చేసి ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరికి టీడీపీ నాయకులు ఫోన్ చేశారన్న విషయాన్ని బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు.
తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులను ప్రలోభపెట్టి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ప్రమేయమున్న అందరిపై పూర్తి దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎవరెవరిని కోనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయాలను సైతం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఓటుకు కోట్లు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment