vote for note case
-
ఓటుకు నోటు కేసు... విచారణ వాయిదా ఈ సారి కోర్టుకు రేవంత్
-
రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు
-
ఓటుకు నోటు కేసు విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్
-
బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే. కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.. జూలై 24కు విచారణను వాయిదా వేసింది. విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా -
ఓటుకు నోటు కేసులో బాబుకు సుప్రీం షాక్
-
సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసుపై విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై, ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, ఈ పిటిషన్లపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇక, పిటిషన్‌పై విచారణ సందర్బంగా ఈ కేసు నిన్న రాత్రే లిస్ట్ అయినందున విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాద సిద్దార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో, కోర్టు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను వాయిదా వేసింది. ఇక, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు డబ్బులను ఎరగా చూపించారు. ఈ సందర్బంగా ‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’ అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. అయితే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. -
చంద్రబాబు ఓటుకు నోటు..దెబ్బ మీద దెబ్బ..
-
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ
-
మళ్లీ ‘ఓటుకు కోట్లు’ కేసు బయటకు తీస్తారేమో సార్!
మళ్లీ ‘ఓటుకు కోట్లు’ కేసు బయటకు తీస్తారేమో సార్! -
ఓటుకు కోట్లు కేసులో నిందితులకు ఈడీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఈడీ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నిందితులుగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయసింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోపాటు జెరూసలెం మత్తయ్య, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం క్రిష్ణకీర్తన్‌లనూ చేర్చింది. అక్టోబర్ 4న వారిని ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎంఎస్‌జే తుకారాంజీ సమన్లు జారీ చేశారు. ఈడీ అభియోగపత్రం ప్రకారం నిందితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనీలాండరింగ్‌కు సహకరించడం లేదా ఆ కుట్రలో భాగస్వామి కావడం తదితర అభియోగాలు ఉన్నాయి. వారిపై నేరం రుజువైతే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో కీలక సాక్షుల విచారణ పూర్తయ్యింది. అయితే ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదంటూ ఇటీవల ఎంపీ రేవంత్‌రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. ప్రత్యేక కోర్టు విచారణను నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్, సండ్రలకు సుప్రీంలో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన పేరు తొలగించడాన్ని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ సండ్ర వీరయ్య, ఏసీబీ కోర్టుకు ఈ కేసు విచారించే పరిధి లేదంటూ రేవంత్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రేవంత్ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సండ్ర తరఫున న్యాయవాది కె.గులాటిలు వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటువేయాలంటూ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డిసహా మరో ఇద్దరు లంచం ఇస్తూ దొరికారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశా రని గులాటి తెలిపారు. కేసుతో సండ్రకు సంబంధం లేదని వెల్ల డించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని సిద్దార్ధ లూత్రా తెలిపారు. అయితే, ఈ కేసులో స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి తదితరులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్ తెలిపారు. వాదన అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. మంగళవారంలోగా కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణ సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. -
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. కేసులో ఐ విట్నెస్లను వాగ్మూలం న్యాయస్థానం రికార్డు చేసింది. అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ వచ్చేనెల(సెప్టెంబర్) 6కు వాయిదా వేశారు. ఆరేళ్లుగా విచారణ 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. కాగా ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. -
ఏసీబీ కోర్టులో నేడు ఓటుకు కోట్లు కేసు విచారణ
-
ఏసీబీ స్పెషల్ కోర్టు లో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
ఓటుకు నోటు కేసు: జూలై 7న విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రానుంది. జూలై 7 నుంచి సాక్షుల విచారణ కొనసాగించాలని ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. జూలై 7 నుంచి 13 వరకు 18 మంది సాక్షుల విచారణకు ఏసీబీ కోర్టు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌కు చుక్కెదురు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్‌రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆరేళ్లుగా విచారణ 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. -
‘‘మహానాడు ఆత్మస్తుతి.. పరనిందలా సాగింది’’
తాడేపల్లి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు.. అందుకే మహానాడు ఆత్మస్తుతి.. పరనిందలా సాగింది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రెండేళ్లుగా చంద్రబాబు, ముఖ్యమంత్రిపై విమర్శలకే పరిమితం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో బాబు "బ్రీఫ్డ్ మీ" వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం చూసింది.. ఫోరెన్సిక్ ఈ వ్యాఖ్యలను నిజమని తేల్చిందన్నారు బొత్స. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. కానీ ప్రజలను మేనేజ్ చేయలేరు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు నైజం దోచుకోవడం.. దాచుకోవడమే. మహానాడు ద్వారా చంద్రబాబు ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు యత్నించారు’’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక కమిట్మెంట్తో, ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి క్షణం సీఎం జగన్ శ్రమిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 99 శాతం నేరవేర్చాం. సంక్షేమ పథకాల ద్వారా లక్షా 20 వేల కోట్లను నేరుగా ప్రజలకే అందించాం. ప్రతి అంశాన్నిr రాజకీయం చేయాలనే చంద్రబాబు యత్నం. ఆయన జూమ్ కార్యక్రమాలను చూస్తుంటే నవ్వొస్తుంది’’ అంటూ బొత్స ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్ట్‌ను కాంట్రాక్ట్‌లకు కట్టబెట్టి పూర్తిగా దోచుకున్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పూర్తి కాలేదు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ప్రజలు తిరస్కరించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే మేం చట్టాలు చేస్తున్నాం. ప్రతి చట్టంలోనూ సామాన్యుడికే మేలు జరిగేటట్లు చూశాం. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. రెండేళ్ల సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. మున్ముందు ఇంకా సంక్షేమ పాలన సాగుతుంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆధారాలు
-
ఓటుకు కోట్లు కేసు..ఈడీ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాంపల్లి ఈడీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ క్రిస్టియన్ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్, రేవంత్ అనుచరుడు రుద్రశివకుమార్ ఉదయసింహ, జెరుసలేం మత్తయ్యతోపాటు వేం కృష్ణకీర్తన్లను నిందితులుగా పేర్కొంది. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటేయాలని, రూ.5 కోట్లు ఇస్తామని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టి.. రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ రేవంత్, ఇతర నిందితులు ఏసీబీకి పట్టుబడ్డారని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ పాత్ర కూడా ఉన్నట్టు తేలడంతో ఆయన పేరునూ చార్జిషీటులో చేర్చినట్టు తెలిపింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఈ చార్జి షీటులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేరును కూడా పలుచోట్ల ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇంతకుముందే చార్జిషీట్లు దాఖలు చేసిన ఏసీబీ కూడా చంద్రబాబు పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోలు వెలుగులోకి రావడం, ఆ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా ధ్రువీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈడీ చార్జిషీటు దాఖలు చేయడం మరింత ఉత్కంఠగా మారింది. మహానాడు వేదికగా కుట్ర 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా కూడా.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ తరఫున వేం నరేందర్‌రెడ్డిని పోటీలో పెట్టారు. ఎలాగైనా గెలవాలని, పలువురు ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి ఓటు వేయించుకోవాలని కుట్రపన్నారు. అప్పట్లో టీడీపీ కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డికి కొనుగోళ్ల బాధ్యత అప్పగించారు. ఇందులోభాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు గాలం వేయాలని నిర్ణయించారు. టీడీపీ మైనార్టీ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్, తెలుగు యువత నేత జిమ్మిబాబుల సాయంతో జేరుసలేం మత్తయ్యను కలిసి విషయం చెప్పారు. తర్వాత హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో జరిగిన టీడీపీ మహానాడుకు మత్తయ్యను తీసుకెళ్లారు. అక్కడ వేదిక వెనకాల ఉన్న గదిలో.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలతో మత్తయ్య సమావేశమయ్యారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పిస్తే.. రూ.50లక్షలు ఇస్తామని మత్తయ్యను ప్రలోభపెట్టారు. స్టీఫెన్సన్ ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.3 కోట్లు, అనుకూలంగా ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని బేరం పెట్టారు. రూ.50 లక్షలు కమీషన్ వస్తుందని ఆశపడ్డ మత్తయ్య.. ఈ విషయాన్ని స్టీఫెన్సన్కు చెప్పారు. (మత్తయ్య ఈ మొత్తం వ్యవహారాన్ని వాంగ్మూలం రూపంలో ఇటీవల ఈడీకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు). ఇదంతా భారీ కుట్ర అని గుర్తించిన స్టీఫెన్సన్ వెంటనే ఏసీబీకి సమాచారం ఇచ్చారు. రేవంత్, ఆయన అనుచరులు 2015 మే 31న స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీనిపై తొలుత టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కానీ ఈ కుట్ర తాలూకు బాగోతం మొత్తం వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు మాట్లాడిన ఆడియోలు వెలుగు చూడటం దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. పెద్ద మొత్తంలో డబ్బుల ఒప్పందాలు, సొమ్ము చేతులు మారడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ప్రీవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేసింది. 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేవంత్‌రెడ్డి, ఉదయసింహా, వేం నరేందర్‌రెడ్డి, సెబాస్టియన్, స్టీఫెన్‌సన్‌ల వాంగ్మూలాలను నమోదు చేసింది. అడ్వాన్స్‌గా తెచి్చన రూ.50 లక్షలు ఎలా వచ్చాయి, మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ ఉంచారు, విదేశాల నుంచి డబ్బులు వచ్చాయా? అన్న అంశాలపై దర్యాప్తు చేసింది. ఏపీకి వెళ్లిపో.. ఏమీ కాదంటూ లోకేశ్ భరోసా! ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో పాత్రధారి అయిన జేరుసలేం మత్తయ్య.. ఈ కుట్రకు సంబంధించి ఇటీవలే ఈడీ అధికారులకు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. తనను ఎవరెవరు కలిశారు, ఎవరు డబ్బులు ఎర వేశారు, మొత్తం వ్యవహారం ఎలా జరిగిందన్నది వివరంగా వెల్లడించారు. మొత్తం కుట్రలో చంద్రబాబుదే మాస్టర్ మైండ్ అని.. అప్పట్లో తాను విజయవాడకు పారిపోవడానికి చంద్రబాబు కుమారుడు లోకేశ్ సూచనలే కారణమని బయటపెట్టారు. మత్తయ్య వాంగ్మూలంలో చెప్పిన ప్రకారం.. రేవంత్ అరెస్టు విషయం తెలియగానే జిమ్మిబాబు సాయంతో మత్తయ్య ఎన్టీఆర్ భవన్‌కి వెళ్లారు. అక్కడ చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను కలిశారు. నీకేమీ కాదని, వెంటనే విజయవాడ వెళ్లిపోవాలని మత్తయ్యకు లోకేశ్ అభయమిచ్చారు. అక్కడ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజయవాడలో భద్రంగా ఉండొచ్చని చెప్పారు. ఈ సూచనల మేరకే మత్తయ్య విజయవాడ వెళ్లారు. అదే మహానాడు సమయంలో.. 2015 మహానాడు వేదికగానే ‘ఓటుకు కోట్లు’ కుట్ర జరిగింది. దీనికి సూత్రధారి చంద్రబాబేనని బయటపడటం సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా టీడీపీ మహానాడు వేడుకలు (ఆన్లైన్)లో జరుగుతుండగా.. ఈ వ్యవహారంలో ఈడీ చార్జిషీటు నమోదవడం ఆసక్తిగా మారింది. -
ఓటుకు కోట్లు కేసులో నిందితులపై అభియోగాల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లపై ఏసీబీ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద నమోదు రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగం నమోదైంది. అయితే తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఈనెల 19న సాక్షుల విచారణ, షెడ్యూలును ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. చదవండి : (బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే) (ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌రెడ్డికి వార్నింగ్) -
ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌లు విడివిడిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఇదివరకు విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ వేశారు. ఇతరులకు మద్దతు ఇచ్చే దాని కన్నా తామే బరిలో ఉందామని, పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు న్నాయని ఆయా జిల్లాల మెజారిటీ నేతలు కమిటీకి సూచించినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన టీపీసీసీ ముఖ్యుల జూమ్ కాన్ఫరెన్స్‌లో కూడా అదే అభిప్రాయం వెల్లడైంది. కాగా, ఈ స్థానానికి మొత్తం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వం వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, మరో గిరిజన నేత బెల్లయ్యనాయక్‌ల పేర్లను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నారు. మానవతారాయ్, బెల్లయ్య నాయక్‌లు సోమవారం పార్టీ పెద్దలను కలసి టికెట్ విషయమై తమ వాదనలను వినిపించారు. అయితే, టీపీసీసీ ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేసిన తర్వాత ముగ్గురు నేతల పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. రంగారెడ్డి ఆశావహులతో చర్చలు కాగా, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు సమావేశమై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ స్థానానికి టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిలతో కూడా సంప్రదింపులు జరిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఉపాధ్యాయ నేత హర్షవర్ధన్‌రెడ్డిలతోసహా 24 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోంచి మూడు పేర్లను ప్రతిపాదించి మంగళవారం ఏఐసీసీకి పంపనున్నట్టు సమాచారం. పిటిషన్ పునర్విచారించాలని రేవంత్ అభ్యర్థన ఏసీబీ అభిప్రాయం కోరుతూ 18కి విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: తమపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమవుతుండగా, పిటిషన్‌ను తిరిగి విచారించాలంటూ రేవంత్ ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తన తరఫు న్యాయవాది వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని కీలక అంశాలపై వాదనలు వినిపించలేకపోయారని అందులో పేర్కొన్నారు. మరోసారి విచారణ జరిపితే తమ వాదనలు పూర్తిగా వినిపిస్తామని విన్నవించారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేసిన న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు... ఈ పిటిషన్‌పై అభ్యంతరం ఉంటే తెలియజేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. తమపై నమోదు చేసిన అభియోగాలను ఎలక్షన్ ట్రిబ్యునల్ మాత్రమే విచారించాలని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు విచారించే పరిధి లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా, చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 18న వెలువరించనుంది. -
బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పాత్ర మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఇటీవల ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం వ్యవహారా నికి మాస్టర్‌మైండ్ చంద్రబాబేనని కుండబద్దలుకొట్టాడు. ఈ కుట్ర ఎప్పుడు, ఎలా జరిగింది? తెలంగాణ ప్రభు త్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు మొదలు పెట్టిన ఎమ్మెల్యేల కొను గోలు విషయంలో ఎవరి పాత్ర ఏమిటన్నది పూసగుచ్చినట్లు వివరించాడు. కుట్రకు తెరతీసింది చంద్రబాబు అని, అమలు చేసింది రేవంత్‌రెడ్డి అని, ఇందుకోసం తనకు రూ.50 లక్షలు ఎరవేసి వాడుకున్నారని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మత్తయ్య ఏమి చెప్పాడంటే.. ‘టీడీపీ తెలుగు యువత నాయకుడు జిమ్మీబాబు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. 2015 మే నెలలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పాల్గొనే ఓ కార్యక్రమానికి జిమ్మీబాబును ఆహ్వానిద్దామని బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లా. అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంత నాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ నాకు చెప్పాడు. ఇదే విషయమై చంద్రబాబు, రేవంత్‌లతో చర్చించేందుకు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రావాలని సూచించాడు. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం) జిమ్మీ సూచన మేరకు మర్నాడు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లా. అక్కడ జిమ్మీబాబు మహానాడు వేదిక వెనుకాల ఉన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. తొలుత నేను భయపడ్డా. తప్పని వారించా. కానీ రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, పైగా వారు నాకు గుడ్‌విల్ కింద రూ. 50 లక్షలు లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ. 3 కోట్లు చెల్లిస్తామన్నారు. ముందుగా రూ. 50 లక్షలు అడ్వాన్సుగా మిగిలినది తరువాత అందజేస్తామన్నారు’ అని మత్తయ్య మత్తయ్య ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ గదిలోనే.. ‘‘అప్పుడు.. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంతనాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ చెప్పాడు. ఇదే విషయమై వారితో చర్చించేందుకు నన్ను మహానాడు వేదిక వెనుక ఉన్న గది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, నాకు గుడ్‌విల్ కింద డబ్బులిచ్చి లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా’’ తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు... ‘నేను మర్నాడు స్టీఫెన్స్న్ ఇంటికి వెళ్లి బోయిగూడలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించా. కార్యక్రమం అనంతరం డీల్ గురించి చెబితే తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు. రేవంత్‌రెడ్డితో మాట్లాడించాలన్నాడు. లాలాగూడకు చెందిన మాల్కం టేలర్, సీతాఫల్‌మండికి చెందిన ఆంథొనీ ద్వారా స్టీఫెన్సన్ను ఒప్పించే ప్రయత్నం చేశా. ఆయన ఒప్పుకోగానే ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి, జిమ్మీబాబులకు టీడీపీ క్రిస్టియన్ సెల్ ఇన్చార్జి హ్యారీ సెబాస్టియన్ ద్వారా తెలియజేశా. తరువాత మరోసారి అతనికి ఫోన్ చేసినప్పుడు రేవంత్, చంద్రబాబులకు సమాచారం ఇచ్చానని, వారు అదే పనిలో ఉన్నారన్నాడు. పని పూర్తికాగానే నీకివ్వాల్సింది ఇచ్చేస్తారని సెబాస్టియన్ సమాధానమిచ్చాడు. మర్నాడు సెబాస్టియన్‌కు మళ్లీ ఫోన్ చేయగా రేవంత్‌రెడ్డి రెండుసార్లు స్టీఫెన్‌సన్‌ని ఆయన నివాసంలో కలిసినట్లు చెప్పాడు. అంతేకాకుండా చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో కూడా మాట్లాడాడని చెప్పాడు. దీంతో వెంటనే నేను జిమ్మీబాబుకు కాల్ చేసి నా వాటా ఏమైంది? అని అడిగా. ప్రస్తుతం చంద్రబాబు వేం నరేందర్‌రెడ్డి ద్వారా స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు రూ. 50 లక్షలు సిద్ధం చేస్తున్నారని, అది అవగానే నాకు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మర్నాడు రేవంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిందన్న విషయం టీవీల ద్వారా తెలుసుకున్నా. నన్ను ఏ–4 నిందితుడిగా చూపడంతో రసహ్యంగా జిమ్మీబాబు సాయంతో వెంటనే టీడీపీ ఆఫీసులోకి వెళ్లా. అక్కడ నారా లోకేశ్‌ను కలిశా. నాతో మాట్లాడిన లోకేశ్.. ఏమీ భయపడొద్దన్నాడు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను మేనేజ్ చేస్తానని అభయమిచ్చాడు. వెంటనే విజయవాడ వెళ్లు, అక్కడ టీడీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చాడు’ అని వాంగ్మూలంలో జెరూసలేం మత్తయ్య పేర్కొన్నాడు. చంద్రబాబును కలిసిన మాట వాస్తవమే..! ఈ కేసుకు సంబంధించి జిమ్మీబాబు, మాల్కం టేలర్, ఆంథొనీ, సెబాస్టియన్లు తనకు పూర్వ మిత్రులని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పలు పనులపై కలిశానని మత్తయ్య చెప్పుకొచ్చాడు. అలాగే పలు అధికారిక కార్యక్రమాలతోపాటు ఓటుకు నోటు కుట్ర విషయంలోనూ 2015 మే నెలాఖరులో చంద్రబాబును తాను కలిసిన మాట నిజమేనని అంగీకరించాడు. ఈ కేసు విషయంలో మొదటి నుంచి చంద్రబాబుపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్‌రెడ్డి ఆయనకు రూ. 50 లక్షలిస్తూ మభ్యపెడుతుండగా ఆడియో వీడియోలతో సహా ఏసీబీ రికార్డు చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే రేవంత్, వేం నరేందర్‌రెడ్డి, జెరూసలేం మత్తయ్యను విచారించిన ఈడీ... చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారప్రీ కుట్రకు సూత్రధారి చంద్రబాబే అని మొదటి నుంచి వస్తున్న ఆరోపణలకు మత్తయ్య వాంగ్మూలంతో మరింత బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎలా ముందుకు వెళ్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్ కొట్టివేయటంతో అభియోగాలపై ట్రైల్స్ ప్రారంభించింది. సండ్రా వెంకటవీరయ్యపై విచారణ ప్రారంభమైంది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయసింహపై ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్ల కేసును విచారణ జరిగింది. మొదటిసారి నిందితులపై అభియోగాలపై విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై అభియోగాలపై చార్జస్ ప్రేమ్ చేసింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120బి, రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదు చేసింది. అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు కోర్టు చదివి వివరించింది. అభియోగాలను సండ్ర వెంకటవీరయ్య అంగీకరించలేదు. ఇదే క్రమంలో సండ్రా, ఉదయసింహల డిశ్చార్జ్ పిటీషన్స్ ను గతంలో ఏసీబీ కోర్టు, హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇతర నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు కోర్టుకు హజరుకాగా గైర్హాజరైన ఉదయ్ సింహాపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. గత విచారణ లోనే నిందితులు అందరూ ఎట్టి పరిస్థితి లో హాజరుకావాలి అని సీరియస్ గా ఆదేశించింది. అయినప్పటికీ ఉదయసంహ హాజరు కాపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఉదయసింహ, సెబాస్టియన్, సండ్రల డిశ్చార్జ్ పిటీషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో త్వరలోనే ఇతర నిందితుల అందరిపై సైతం నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభించనుంది ఏసీబీ కోర్టు. ఇక ఇదే కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. ఓటుకు కోట్ల కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. అభియోగాల నమోదుపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
చంద్రబాబు, రేవంత్ నుంచి ప్రాణహాని
సాక్షి, నాంపల్లి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లుకేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన కు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డిలేనని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: (అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు) -
ఓటుకు కోట్లు... ఆశ చూపింది సెబాస్టియనే..!
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇస్తామని ప్రలోభపెట్టింది ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న బిషప్ హ్యారీ సెబాస్టియన్ అని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ కుట్రలో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై గురువారం ఏసీబీ అదనపు ఎస్పీ రమణకుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయి. సెబాస్టియన్ ఫోన్లో కుట్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ఓటు కోసం ప్రలోభపెట్టడం అవినీతి నిరోధక చట్టం కింద నేరం. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారన్న సెబాస్టియన్ వాదనలో నిజం లేదు. స్టీఫెన్‌సన్‌తో ముందుగా ఫోన్లో మాట్లాడిందని సెబాస్టియన్. అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డితో కలసి సెబాస్టియన్ స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసిన తర్వాత సెబాస్టియన్ సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా అనేక ఆధారాలు లభించాయి’’ అని తెలిపారు. ( ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ) అంతేకాక ‘‘అభియోగాల నమోదుపై 2018 మార్చి 5 నుంచి దాదాపు రెండున్నర ఏళ్లుగా నిందితులు సమయం తీసుకుంటూనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 9న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అభియోగాలు నమోదు చేయాలని మరోసారి ప్రత్యేక కోర్టును కోరారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు గత అక్టోబరు 12న డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని లేదా నేరుగా వాదనలు వినిపించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే సెబాస్టియన్ తరఫు న్యాయవాది పలు వాయిదాలు తీసుకున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని కౌంటర్లో కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి.