దొంగలా దొరికావు బాబూ..
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరిక
గుడివాడ :
ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ‘నేను నిప్పుని అని చెప్పుకునే చంద్రబాబు కోర్టుమెట్లు ఎందుకు ఎక్కాడని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక శరత్ థియేటర్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసులు మాఫీ చేయించుకోవటంతో చంద్రబాబు ఎక్స్‌ఫర్టు అని చెప్పారు. వీలైతే వెన్నుపోటు పొడవటం, లేదంటే కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన సమర్ధులు లేరని అన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఆయన ఇంటికెళ్లి కేసులు పెట్టొద్దని కాళ్లు పట్టుకున్నాడని అన్నారు.
రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు పాల్గొన్నారు.