సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై, ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, ఈ పిటిషన్లపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
ఇక, పిటిషన్‌పై విచారణ సందర్బంగా ఈ కేసు నిన్న రాత్రే లిస్ట్ అయినందున విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాద సిద్దార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో, కోర్టు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను వాయిదా వేసింది.
ఇక, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు డబ్బులను ఎరగా చూపించారు. ఈ సందర్బంగా ‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’ అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. అయితే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment