Alla Rama Krishna Reddy
-
CBN: సుప్రీం కోర్టులో ఓటుకు నోటు పిటిషన్ల విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: ఓటుకు నోటు కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చాలంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ వేశారు. అలాగే.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్ వేశారు. జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ జరుపుతోంది. పిటిషన్ ఆర్కే తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు. అదే గైర్హాజరు అయితే రూ.2 కోట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు తరఫున రేవంత్ రెడ్డి బేరసారాలు జరిపారు. .. ఈ కేసులో ఏ వన్ రేవంత్ రెడ్డి, ఏ 2 ఉదయసింహ. స్టీఫెన్ సన్ ఇంటికి డబ్బుల తో రేవంత్ రెడ్డి వచ్చారు. "బ్రీఫ్డ్ మీ" కాల్ లో చంద్రబాబు అయిదు కోట్ల ఆశ చూపారు అని వాదించారు. ఈ పిటిషన్లపై చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. -
సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసుపై విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై, ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, ఈ పిటిషన్లపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇక, పిటిషన్‌పై విచారణ సందర్బంగా ఈ కేసు నిన్న రాత్రే లిస్ట్ అయినందున విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాద సిద్దార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో, కోర్టు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను వాయిదా వేసింది. ఇక, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు డబ్బులను ఎరగా చూపించారు. ఈ సందర్బంగా ‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’ అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. అయితే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. -
మంగళగిరిలో లోకేశ్ కు ఓటమి తప్పదు: ఆర్కే
-
మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపుకు నేను పనిచేస్తా: ఎమ్మెల్యే ఆర్కే
-
వైఎస్సార్సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారాయన. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్లో వ్యక్తిగత కారణాల పేరిట వైఎస్సార్సీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న ఆర్కే.. సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్సార్సీపీ అధిష్టానం నియమించింది. ఈ తరుణంలో.. నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే చర్చ జోరుగా నడుస్తోంది. -
ఆర్కే పూర్తి సంతృప్తితో ఉన్నారు: ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా అంశంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియాతో ఈ విషయమై మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌కు ఆర్కే అత్యంత సన్నిహితుడు. ఆయన జగన్ వెంటే నడుస్తారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా బాగా పని చేశారు. మంగళగిరిని బాగా అభివృద్ధి చేశారు. ఆయనకు అసంతృప్తి అనేది లేదు. రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఆర్కే ఉన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రీచ్ అవ్వలేకనే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అన్నీ ఆలోచించుకునే ఆయన రాజీనామా చేసి ఉంటారు’’ అని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే.. ‘‘మంగళగిరి సీటును బీసీ(పద్మశాలి)లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అయినప్పటికీ సీఎం జగన్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మంగళగిరిలో క్యాడర్‌ను ఆర్కే రూపొందించారు. మళ్లీ మంగళగిరిలో వైఎస్సార్సీపీనే గెలుస్తోంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేశా అనే సంతృప్తిలో ఆర్కే ఉన్నారు. రాజకీయ సమీకరణాల వల్లే ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదు’’ అని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. వ్యక్తిగత పనుల వల్లే ఆర్కే రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారాయన. -
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
సాక్షి, గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ‘‘స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను ఇచ్చా. నా రాజీనామాను ఆమోదించాలని కోరాను. వ్యక్తిగత కారణాలతోనే వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నా. 2014 నుంచి రెండుసార్లు మంగళగిరి నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నీతి నిజాయితీతో ధర్మంగా శాసనసభ్యుడిగా పనిచేశా’’ అని తెలిపారాయన. .. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ కోసం పనిచేశా. 2004లో కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి సీటు ఆశించాను. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేదు. 2009లో పెదకూరపాడు సీటును ఆశించాను. కానీ దక్కలేదు. రెండు సార్లు సీటు రాకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేశా’’ ఆయన గుర్తు చేసుకున్నారు. పర్సనల్‌గా మాట్లాడతా.. స్పీకర్ తమ్మినేని ఆర్కే రాజీనామా పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆర్కే రాజీనామా లేఖ అందిందని, అ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపారు. అలాగే ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సి ఉందని, ఆపై రాజీనామా లేఖ సరైన ఫార్మట్‌లో ఉందా? లేదా? అనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు. అలాగే.. అసంతృప్తితోనే ఆర్కే రాజీనామా చేశారన్న ప్రచారాన్ని స్పీకర్ తమ్మినేని ఖండించారు. అలా అసంతృప్తితో ఉంటే సీఎం జగన్‌తో సన్నిహితంగా ఎందుకు ఉంటారని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారాయన. -
‘మంగళగిరిలో లోకేష్ ఓటమి.. అందుకే పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోంది’
సాక్షి, అమరావతి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.. తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని సీఎం జగన్ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24 న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ న్యాయస్ధానాలను ఆశ్రయించింది.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి మాత్రం రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారన్నారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రాజధానిలో పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని భావిస్తున్నామన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే పేదల ఇళ్ల నిర్మాణాలని టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. చదవండి ‘ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్‌కే ప్రజలు మద్దతు’ -
పరామర్శ పేరిట రాజకీయం చేసేందుకు వచ్చారు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: పోలీసులపై టీడీపీ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తుమ్మపూడి ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి, చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే చెప్పామన్నారు. పరామర్శ పేరిట రాజకీయం చేసేందుకు లోకేష్ వచ్చారని ఎమ్మెల్యే విమర్శించారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నారని, పరామర్శకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజకీయాల కోసం పోలీసులపై రాళ్లు వేస్తారా అని మండిపడ్డారు. ఆస్పత్రి వద్ద లోకేష్ వచ్చే వరకు మృతదేహాన్ని ఉంచాలని అడ్డుకోవడం దారుణమన్నారు. చదవండి: టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీపై మంత్రి బొత్స క్లారిటీ తుమ్మపూడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు చేపట్టినప్పటికీ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. శవ రాజకీయాలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. వందలమందితో వచ్చి టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. చదవండి: తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు -
అక్షయపాత్ర వంటశాలను ప్రారంభించనున్న సీఎం జగన్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో తెనాలి రోడ్డులో అక్షయపాత్ర వంటశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు భోజనం అందిస్తున్న నేపథ్యంలో అధునాతమైన సాంకేతికతతో ఒకేసారి వేలాదిమందికి భోజనం వండేలా ఏర్పాటు చేసిన వంటగదుల భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, కొలనుకొండ వద్ద జాతీయరహదారి పక్కన ఇస్కాన్ నిర్మించనున్న ఆలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. -
నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే
-
రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం కు కృతజ్ఞతలు
-
ఒక్కసారిగా కూలిన ఆలయ ప్రహరీ గోడ
-
పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు
-
మీవాడు సీఎం కాకపోతే.. ఇంత ఫ్రస్ట్రేషనా!
సాక్షి, అమరావతి: ‘మీవాడు ముఖ్యమంత్రి కాకపోతే ఇంత ఫ్రస్ట్రేషనా.. అబద్ధాలు, అసత్యాలతో కూడిన వార్తలను ప్రతిరోజూ ఎల్లో మీడియాలో వండి వారుస్తూ ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లుతారా’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమవాడు సీఎం కాకపోతే వీరి ఫ్రస్ట్రేషన్ ఇంత పీక్‌లో ఉంటుందా అన్నట్టుగా సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రభుత్వంపైన, సీఎం జగన్‌పైన పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్న మంచి.. చంద్రబాబు పాలనలో జరిగిన చెడు ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లోనే రూ.1.40 లక్షల కోట్లను పేదవాడి బాగు కోసం ఖర్చు చేస్తే మీకెందుకు కడుపుమంట అని నిలదీశారు. పేదవాడు బాగుపడితే.. రైతు బాగుపడితే.. తద్వారా రాష్ట్రం బాగుపడితే.. చంద్రబాబు అండ్ కో కి నిద్రపట్టదా అని ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. పాఠశాలల దుస్థితికి చంద్రబాబు కారణం కాదా? ‘సీఎం ఇంటి పక్కనే ఇలా..’ అంటూ ఈనాడులో తాడేపల్లిలోని రెండు స్కూళ్ల ఫొటోలతో ఓ వార్త రాశారు. టీడీపీ హయాంలో బడుల్లో కనీసం బెంచీలు, కుర్చీలు, టేబుళ్లు, బ్లాక్ బోర్డులకు కూడా నోచుకోక ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అన్న దానికి ఆ వార్త అద్దం పడుతోంది. పదేళ్ల సైకిల్ కాంగ్రెస్ పాలనలో నాశనమైన ప్రభుత్వ బడులకు ఇది నిదర్శనం. మరోవైపు జగనన్న పాలనలో ఇలాంటి స్కూళ్లకు ఎలా మోక్షం కలుగుతోందో కూడా అందరికీ అర్థమవుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క సర్కారు బడినీ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సీఎం వైఎస్ జగన్ మారుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల ప్రభుత్వ బడులను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో దాదాపు రూ.3,700 కోట్లు ఖర్చు చేసి 15,715 పాఠశాలలను అభివృద్ధి చేశారు. రెండోదశ పనులకూ శ్రీకారం చుట్టారు. స్కూళ్ల అభివృద్ధికి ఏకంగా రూ.16 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. ఇది అభివృద్ధిలా కనిపించటం లేదా. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లి, ప్రతి బిడ్డలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. బహుశా తమ కార్పొరేట్ స్కూళ్ల బేరాల కోసమే ఈ పద్ధతిలో ఎల్లో మీడియా వార్తలు రాస్తుందా. విద్యార్థుల జీవితాలను మార్చేందుకు స్కూళ్లను అభివృద్ధి చేస్తుంటే.. వాస్తవాలు రాయాలని ఈనాడుకు ఎందుకు అనిపించలేదు. కనీసం సూచనలు, సలహాలు ఇస్తూ అన్నా రాశారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఊళ్లో.. నారావారిపల్లె పక్కనే చంద్రబాబు చదువుకున్న స్కూల్ శిథిలావస్థకు చేరితే దాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక తప్ప బాగు పడలేదు. ఇవి ఈనాడుకు, మిగతా ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించవు. అప్పులు పుట్టకూడదని పిటిషన్ వేయించింది వాళ్లు కాదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టకూడదని, స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు బ్యాంకుల నుంచి రుణాలు రాకూడదనే దురుద్దేశంతో నళినీ కుమార్ అనే ఈనాడు అడ్వకేట్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో పిటిషన్ వేయించింది రామోజీ, చంద్రబాబు కాదా. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ రూ.లక్షన్నర కోట్లు అప్పులు చేసి తన కాంట్రాక్టర్లకు, బినామీలకు దోచిపెట్టింది. సీఎం జగన్ రూ.1.40 లక్షల కోట్లను సంక్షేమ కార్యక్రమాల ద్వారా డీబీటీ విధానంలో ఒక్క పైసా అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి అందేవిధంగా చూస్తున్నారు. చేతనైతే వాస్తవాలు రాయండి, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇటీవల కాలంలో మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే మాటలను వక్రీకరించి మిమిక్రీ ఆర్టిస్టులతో రికార్డు చేసి.. వైఎస్సార్సీపీని, ప్రభుత్వాన్ని అభాసు పాల్జేయాలని కొందరు చూస్తున్నారు. మీ కుట్రల అంకంలో ఇదే చిట్ట చివరి మెట్టు. రాజకీయాల్లో ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మారండని హెచ్చరిస్తున్నాం. ఈనాడు రామోజీ పాడు బుద్ధి ‘రైతుల గుండెల్లో మీటర్ల మోత’ అంటూ మరో కథనాన్ని రాశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కరెంటు బకాయిలు కట్టలేదని రైతులపై నిర్దాక్షిణ్యంగా అక్రమ కేసులు పెట్టి, స్పెషల్ పోలీస్ స్టేషన్లు, స్పెషల్ కోర్టులు పెట్టి వేధించినప్పుడు ఒక్క వార్త అయినా రామోజీ రాశారా. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ పగటి పూటే 9 గంటలు ఇస్తుంటే గుండెల్లో మీటర్లు అని రాస్తారా. రాష్ట్రంలోని ప్రతి పొలంలోని ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్ వస్తోందా లేదా అన్నది తెలుసుకునేందుకు మీటర్లు పెడుతున్నాం. లో వోల్టేజీ, హై వోల్టేజీతో మోటార్లు కాలిపోకుండా ఉపయోగపడేందుకు ఫీడర్లు, లోడ్ సరి చూసుకునేందుకే వీటిని పెడుతున్నాం. వీటివల్ల రైతులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుంటే, రైతన్నల కోసం కనీవినీ ఎరగని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే మీకు ఎందుకు నచ్చటం లేదు. -
లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ఆర్కే
-
తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం: ఏఆర్కే
సాక్షి, గుంటూరు: బకింగ్ హామ్ కెనాల్ రోడ్‌ను రూ. 200 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మించబోయే రోడ్డుకు త్వరలో టెండర్లు ప్రారంభమవుతాయని చెప్పారు. దుగ్గిరాల మండలంలో 18 గ్రామాల్లో రూ.70 నుంచి రూ. 80 కోట్లతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. -
స్ట్రెయిట్ టాక్ విత్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి
-
నిజాలు తెలుసుకుని మాట్లాడాలి : ఆర్కే
-
పేదలు, దళితులను బెదిరించి భూసేకరణ
-
చంద్రబాబు రైతుల భూములు లాక్కున్నారు.. సాక్ష్యాలు ఇవిగో: ఎమ్మెల్యే ఆర్కే
-
నేడు కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
-
బాబు, లోకేశ్ విభేదాలు బట్టబయలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించడంతోనే తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు ప్రకటిస్తే.. లోకేశ్ ఇన్చార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఆయన ఆదేశాలతోనే పోటీ చేస్తున్నామని ప్రకటించారని విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన అఖండ విజయాన్ని చూసి దిమ్మదిరిగిన చంద్రబాబు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత ఘోర ఓటమి తప్పదని భయపడి ఎన్నికలను బహిష్కరించారన్నారు. అసలు ఆయనను ప్రజలు ఎన్నడో బహిష్కరించారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమితో పాటు, వయసురీత్యా చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఇకపై రాజకీయాలకు స్వస్తి పలికి, మనవడితో ఆడుకోవడం ఉత్తమమని హితవు పలికారు. దుగ్గిరాల పసుపు మార్కెట్లో వ్యాపారులంతా లోకేశ్ సామాజిక వర్గం వారు కావడంతో, వారి డబ్బులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్
సాక్షి, గుంటూరు: టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో దుగ్గిరాల 1,3 సెగ్మెంట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: ‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా’ కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
సిగ్గులేని రాతలు; నిజాల సమాధే ‘స్టింగా’?
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని ప్రాంతంలో దళితులకు చేసిన అన్యాయం వెలుగులోకి రాకుండా ఎల్లో మీడియా కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఆంధ్రజ్యోతి, ఈనాడు నిస్సిగ్గుగా వ్యవహ రించాయని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. అన్యాయం చేసిన వాళ్లను కాపాడటం స్టింగ్ ఆపరేషన్ ఎ లా అవుతుందని ప్రశ్నించారు. సీఐడీకి ఫిర్యాదు చేసిన రైతులను అదిరించి, బెదిరించి తమకు అనుకూలంగా చెప్పించుకున్నారని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. బెదిరించి జబ్బలు చరుచుకుంటున్నారు: ఆర్కే ల్యాండ్ పూలింగ్ పేరుతో తమను చంద్రబాబు మోసగించారని రైతులు నాకు చెప్పారు. దీన్ని సీఐడీ అధికారులూ రికార్డు చేశారు. ఇప్పుడు వాళ్లను బెదిరించి, అనుకూలంగా మాట్లాడించి స్టింగ్ ఆపరేషన్ అని జబ్బలు చరుచుకోవడం ఆ రెండు పత్రికలకే చెల్లింది. చంద్రబాబు మోసం చేశారని 2015 అక్టోబర్‌లో పలువురు దళిత రైతులు చెప్పినట్లు పత్రికల్లో వచ్చింది. 2016 ఫిబ్రవరి 19న సీపీఎం నేత బాబురావుతో కలసి దళితులకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో అప్పటి ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. మరికొంతమంది దళితులు కూడా అన్యాయంపై సీఐడీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడుకు దమ్ము ధైర్యం ఉంటే చట్టాలను అతిక్రమించి చంద్రబాబు దళితులను ఎలా మోసగించారో వెలుగులోకి తేవాలి. దళితులను తరిమేసే కుట్ర: నందిగం సురేష్ రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన మోసాలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి కనిపించకపోవడం దారుణం. అసైన్డ్ భూములకు ఏమీ ఇవ్వకుండా తీసుకుంటారని టీడీపీ నేతలు దళితులను భయపెట్టారు. వాళ్ల నుంచి భూములన్నీ చంద్రబాబు, ఆయన బినామీలు తీసుకున్నాక అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలు చెల్లుతాయ ని జీవో 41 ఇచ్చారు. అసైన్డ్ రైతులను ముష్టివారి కంటే హీనంగా చూశారు. రాజధాని శంకుస్థాపన సమయంలో దళితులను ఆ ప్రాంతానికి కూడా రానివ్వకుండా వేల మంది పోలీసులను అడ్డుపెట్టారు. చంద్రబాబు సామాజిక వర్గాన్ని మాత్రం సగర్వం గా సత్కరించి ఆహ్వానించారు. దళితులను నిజాలు చెప్పనివ్వకుండా బెదిరిస్తున్నారు. పచ్చ మీడియా సిగ్గూ శరం వదిలేసి అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. రాజధానిలో దళితులు, మైనార్టీలు, బీసీలు ఉండకూడదనేదే టీడీపీ దురాలోచన. -
'పక్కా ప్లాన్ ప్రకారమే భూముల్ని కొట్టేశారు'
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు అసైన్డ్ భూములను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చంద్రబాబు, ఆయన బినామీలు పేదల భూములను చౌకగా కొట్టేశారని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలను మార్చి తమ వారికి లబ్ధి చేకూర్చారన్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని కప్పి పుచ్చుకోవడానికి స్టింగ్ ఆపరేషన్ అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ దళిత సోదరుడైతే చంద్రబాబు మోసం చేశాడని నా దగ్గరకు వచ్చాడో...అతన్ని టీడీపీ మీడియా భయపెట్టి అనుకూలంగా చెప్పించుకుంది. దాన్నో స్టింగ్ ఆపరేషన్ అని చెప్పుకుంటున్నారు . మేమంతా అప్పట్లోనే దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాము. 1920లో బ్రిటిష్ ప్రభుత్వం వారికి డీకే పట్టాలు ఇచ్చారు. ఆ భూములను కూడా పక్కా ప్లాన్‌గా కొట్టేశారు. Pot, poa చట్టాలను అతిక్రమించి చంద్రబాబు ఏమి చేసాడో స్టింగ్ ఆపరేషన్‌లో తేల్చాల్సింది. ఇప్పుడు స్టే మీద ఉన్నాడు..మళ్లీ కేసు వచ్చేసరకి ఎదో చేయాలని ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. అసైన్డ్ భూములు అమ్మకూడదు...కొనకూడదు..మరి ఎలా కొట్టేశారు. మీరు నిజంగా ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని ఉంటే దళితులకు పెద్దపీట వేసి వారి భూములు వారికి ఉంచొచ్చు కదా. రాజధానిలో దళిత సోదరుడు ఉండకూడదని నీచంగా వ్యవహరించిన వ్యక్తులు చంద్రబాబు, నారాయణ బహిరంగ చర్చకు రండి. సైనికులకు ఇచ్చిన భూమి 10 ఎళ్ల తర్వాత సైనికుడి సొంతం అవుతుంది. దాన్ని కూడా చట్టాలని ఉల్లంఘించి మరీ కొట్టేశారు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 3 ఏళ్లలో సింగపూర్ తరహా అద్భుతమైన రాజధాని కడతాను అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. 'రాజధాని శంకుస్థాపనకు అగ్రవర్ణాలకు పట్టు వస్త్రాలు పెట్టి పిలిచారు. అదే దళిత ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పెరు కూడా శిలాపలకంపై లేదు. ఇప్పుడు కూడా దళితులను బెదిరిస్తూనే ఉన్నారు ఇవాళ రాజధాని రైతుల దుస్థితికి కారణం ఎవరు..? చంద్రబాబు కాదా..? మూడేళ్ళలో రాజధాని అని దండుకుని పక్కకెళ్లాడు.ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని తండ్రి కొడుకులు ఇటువైపు ముఖం చూపడం లేదు. అన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి...దమ్ముంటే చర్చకి రండి..లేదంటే కేసును ధైర్యంగా ఎదుర్కోవాలి' అని నందిగం సురేష్ డిమాండ్ చేశారు. చదవండి : బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్? -
టీడీపీ నేతలు అసైన్డ్ భూములను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారు
-
గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలు
-
తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నారిమన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ ఆర్కే తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు. టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాల తర్వాత చేపట్టనుంది. అయితే గతంలో ఆర్కే పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేయగా.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యేలు ఆర్కే, దాడిశెట్టి రాజాలకు పాజిటివ్
సాక్షి, తాడేపల్లిరూరల్/మంగళగిరి/తుని: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆర్కే తండ్రి దశరాథరామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్కే మంగళవారం కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. తనను ఈ మధ్య కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్కే బుధవారం ఒక ప్రకటనలో కోరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందటానికి తాను విశాఖపట్నానికి వెళ్లినట్లు రాజా చెప్పారు. చదవండి: 43 లక్షలు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు -
టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపు అక్రమం
సాక్షి, న్యూఢిల్లీ: గత ప్రభుత్వం గుంటూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం అక్రమంగా భూమి కేటాయించిందని, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన ఆ కేటాయింపులపై తగిన చర్యలు తీసుకోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ 22.06.2017 నాటి జీవో నంబరు 228ని సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది అల్లంకి రమేష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో పేర్కొన్న అంశాలు ►మంగళగిరి మండలం ఆత్మకూరులోని సర్వే నంబర్లు 392/1, 392/3, 392/4, 392/8, 392/10 పరిధిలో టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం గత ప్రభుత్వం 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన కేటాయించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతించింది. ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఇదివరకే సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్దేశించిన చట్ట సూత్రాలకు విరుద్ధం. ►నీటి వనరులను, వాటితో సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించారు. ►ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం–1994లోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ►భవన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినందున తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలి. ►చట్ట ప్రకారం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉందని హైకోర్టు చెప్పినప్పటికీ కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వలేదు. ►లీజు, నిర్మాణం నిషేధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించినా, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేయకుండా కేసును ముగించింది. -
రాజధానితో చంద్రబాబు వ్యాపారం
సాక్షి, అమరావతి: రైతు కూలీల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు.. కౌలు పరిహారాన్ని పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచినందుకు సీఎం వైఎస్ జగన్‌కు రాజధాని ప్రాంత రైతు కూలీలు, రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలసి బయటకు వచ్చిన అనంతరం రాజధాని రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు. అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపించారు. బాబు చేసిన అన్యాయాలపై సీఎం వద్ద రైతులు ఎకరువు పెట్టారని ఆర్కే తెలిపారు. కాగా, భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ వారం రోజుల్లో ప్రకటన ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రిజర్వ్ జోన్లను ఎత్తివేసేందుకు కూడా హామీ ఇచ్చారని.. రైతులు హాయిగా పంటలు పండించుకోవచ్చని.. రాజధాని ప్రాంతానికి ప్రభుత్వరంగ సంస్థలకు తీసుకొస్తామని కూడా సీఎం చెప్పారని ఆర్కే వివరించారు. మూడు నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తామని మాటిచ్చారని.. మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఆరు ఎత్తిపోతల పథకాలను, పైప్‌లైన్ పనులకూ నిధులు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు రూ.8 కోట్లు విడుదల చేసేందుకు సీఎం సంతకాలు చేశారన్నారు. రైతులు మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని అభివృద్ధే ముద్దు అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించామని చెప్పారు. అనేక పంటలు పండే భూముల్లో రాజధాని వద్దని చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదని చెప్పామన్నారు. -
రైతు వ్యవస్థ ఛిన్నాభిన్నం
సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణను మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో రైతు వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన చంద్రబాబు విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఆళ్ల మాట్లాడుతూ.. ‘అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి మొదట్లో సంతోషించినా ఆ తర్వాత అందులోని కుట్ర విషయం తెలిసి మోసపోయినట్టు గుర్తించాం. విభజన చట్టం ప్రకారం రాజధాని స్థలం ఎంపిక నుంచి నిర్మాణం వరకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని తెలిసినా తన స్వార్థం కోసం చంద్రబాబు హైదరాబాద్ నుంచి తరలివచ్చారు. ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ 13 జిల్లాలు పర్యటించి అభిప్రాయాలు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలంటే.. అది ప్రభుత్వ భూమి అయితేనే తమకు సమ్మతి అని అప్పట్లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అయితే ఆయన చెప్పిన విషయాన్ని వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియాతో అవాస్తవాలు చెప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భూముల్ని బలవంతంగా లాక్కున్నారు రాజధాని ముసుగులో చంద్రబాబు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రజలకు తెలిసిపోయింది. రాజధాని ప్రాంతంలో ప్రజలకు చంద్రబాబు కంటిమీద కునుకు లేకుండా చేశారు. కౌలురైతుల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు పంటలు పండుతాయి. ఈ భూముల్ని నాశనం చేయవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పట్టించుకోలేదు. రాజధాని అంటే అందరిది కావాలి.. కొందరిది కాకూడదు. చంద్రబాబు వల్ల ఈ ప్రాంతంలో రైతులు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ నష్టపోయారు. వారి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. చంద్రబాబు దళిత ద్రోహి. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని అన్నారు. 15 ఏళ్లకు కౌలు పెంచడం హర్షణీయం అందరి అనుమతితోనే పరిపాలన వికేంద్రీకరణకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆలోచనలో నేను కూడా పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నా. రాజధాని ప్రాంతంలో రైతులకు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కౌలు పెంచడం హర్షణీయం. అమరావతిని అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించి.. రైతులు సాగు చేసుకుంటామంటే వారి భూముల్ని వారికి తిరిగి ఇవ్వాలి. ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి. -
‘ఆ భూములు అనుకూలం కాదని ముందే చెప్పాం’
సాక్షి, తాడేపల్లి : అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు కోరుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా నడిపించమని, వెనుకబడిన ప్రాంతాలతో పాటు తమ ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు, కూలీలు కోరుతున్నారని తెలిపారు. తమ భూముల తీసుకొని చంద్రబాబు మోసం చేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు భూముల్ని టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి : రాజధాని ముసుగులో బాబు విషప్రచారం) ‘నిన్ను నమ్మి మోసపోయిన రైతులు జోలె పట్టుకొనేల చేశావు. బినామీ ఆస్తులు కాపాడు కోవడం కోసం జోలె పడుతున్నావు. హెరిటేజ్ కోసం చంద్రబాబు భార్య ప్లాటినం గాజులు చందాగా ఇచ్చారు. చంద్రబాబు పంటల్ని తగుల బెట్టించారు. బాబు, లోకేష్ జీతాలు జోలెల్లో ఎందుకు వేయలేదు. రాజధానికి అమరావతి భూముల అనుకూలం కాదని ముందే చెప్పాం. చంద్రబాబు పోలీసుల్ని బెదిరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. అప్పటి డీజీపీతో తప్పుడు ప్రకటన చేయించారు. (చదవండి : మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్) వనజాక్షిపై, ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి జరిగినప్పడు పోలీసు వ్యవస్థను అనుకూలంగా వాడుకున్నావు. డీజీపీ సవాంగ్‌ను ఉత్తరాది వాడు అంటున్నావు. మరి నువ్ పెట్టిన డీజేపీ ఏ ప్రాంతం వాడు. పోలీసులకు కులాలు మతాలు ప్రాంతాలు అంటగడుతున్నావు. సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉండగా శిబిరాలు, దీక్షలు ఎలా నిర్వహిస్తారు. రాజధానిలో శిబిరాలు, టెంట్లు ఎత్తివేయాలి. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, అసాంఘిక శక్తులు ఉన్నారు’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో వికేంద్రీకరణ భారీ ర్యాలీ
-
ఓటుకు కోట్లు కేసును శీఘ్రంగా విచారించాలి
ఇది వినాల్సిన కేసు (ఓటుకు కోట్లు). పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తాం.. – 2017 మార్చి 6న జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. కేసును 2019 ఫిబ్రవరిలో విచారిస్తామంటూ 2018 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు కేసు విచారణకు రాలేదని, శీఘ్రగతిన విచారించాలని అభ్యర్థించారు. ఆళ్ల తరపున న్యాయవాది అల్లంకి రమేష్ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏడాది క్రితం సుప్రీం ఉత్తర్వులు.. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్లో ప్రతివాదులైన నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి 2017 మార్చి 6న సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. తర్వాత ఈ పిటిషన్ విచారణకు రాలేదు. త్వరగా విచారించాలని కోరుతూ ఆళ్ల తొలిసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలు చేయగా 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డితో కూడిన ధర్మాసనం 2018 నవంబరు 2న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పిటిషన్ విచారణకు రాలేదు. 2017లో నోటీసులు జారీ చేసినా... ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ దర్యాప్తు సక్రమంగా లేదని, చంద్రబాబు పాత్రపై అధికారులు దర్యాప్తు చేయడం లేదని పేర్కొంటూ 2016 ఆగస్టు 8న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని అదే ఏడాది ఆగస్టు 29న ఏసీబీని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు 2016 సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించగా ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం 2017 మార్చి 6న ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఇది వినాల్సిన కేసని.. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తామని పేర్కొంటూ ఆ సమయంలో నోటీసులు జారీ చేసింది. విచారణకు రాని పిటిషన్ 2017 మార్చి 6న సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై తగినంత ఆసక్తి చూపడంలేదని, ప్రతివాదులు పలుకుబడి కలిగిన వారైనందున ఆలస్యమైతే సాక్షులను ప్రభావితం చేయవచ్చని పిటిషనర్ తొలిసారి శీఘ్ర విచారణ కోరిన సమయంలో నివేదించారు. వీటితోపాటు మరో కొన్ని అంశాలను జోడిస్తూ తాజాగా రెండోసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలుచేశారు. 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసినా ఇప్పటివరకు కేసు లిస్ట్ కాలేదని... పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదులు రిజిస్ట్రీలో విచారించినా ఫలితం లేదన్నారు. దీన్ని విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడానికి కారణాలు తెలియడం లేదని నివేదించారు. -
డీఆర్సీ సమావేశాలకు లోకేష్‌ను ఆహ్వానించం
సాక్షి, గుంటూరు : గుంటూరులో ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో శనివారం డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్,ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్సీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి జిల్లాలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు, డీఆర్సీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను పిలవకూడదని ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు లోకేష్‌ను బహిష్కరించాలని ఎమ్మెల్యే ఆర్కే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అంతకు ముందు జిల్లాలో చేపట్టాల్సిన వ్యవసాయం, సాగు, తాగు నీరుకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చించారు. -
ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులో చోరీ
సాక్షి, కృష్ణా: గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కార్యాలయం చోరీకి గురైంది. ఆయన కార్యాలయంలోని రూ.10 లక్షలు విలువ చేసే సొత్తును దోచుకున్నారు. అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఆ డబ్బును ఆఫీసులో ఉంచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమాతుడిగా గుర్తించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని నుంచి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే ఆర్కే వినూత్న ఆలోచన
సాక్షి, మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మంగళగిరి మిద్దె సెంటర్లో ఉచితంగా జ్యూట్ చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిని ప్లాస్టిక్ రహిత మంగళగిరిగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ సంచుల వాడకం మానేసి.. జ్యూట్ సంచులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అంతా కృషి చేయాలన్నారు. ఆదివారం నుంచి మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఒక జ్యూట్ చేతి సంచిని అందజేస్తామని ఆర్కే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కరకట్ట భవన యజమానులకు మరోసారి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం ఆ నిర్మాణాల యజమానులను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో లింగమనేని రమేశ్, ఇతర నిర్మాణాల యజమానులు, పలువురు అధికారులతో సహా 49 మంది ప్రతివాదులుగా ఉన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులు అందని వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
సీఎం జగన్‌కు ఆర్కే లేఖ
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇచ్చిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. రైతులకు ఇష్టం లేకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆనాడు టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందని లేఖలో పేర్కొన్నారు. భూసేకరణకు ఒప్పుకోని రైతులపై కేసులు పెట్టడమే కాకుండా.. వారి పంటలను తగుటబెట్టించారని ఆర్కే ఆరోపించారు. ఏడాదికి మూడు నుంచి ఐదు పంటలు పండే భూములను అన్యాయంగా తీసుకున్నారని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో రాజధాని సరైన నిర్ణయం కాదని శివరామకృష్ణ కమిషన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూసేకరణ చట్టం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూములను అమ్ముకోలేక, వారసత్వం ఇచ్చుకోలేక నష్టపోతున్నారని చెప్పారు. రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌ను ఈ చట్టాన్ని రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరినట్టు వెల్లడించారు. -
అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే
సాక్షి, అమరావతి: చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని అతిథి గృహం ముమ్మాటికీ అక్రమ నిర్మాణమేనని, చంద్రబాబు, లింగమనేని రమేశ్‌కు దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాల్ విసిరారు. అది అక్రమ కట్టడమని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు లింగమనేనిపై ఒత్తిడి తెచ్చి ఆయనతో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాయించారన్నారు. గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చినా స్పందించని లింగమనేని ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాశారని ప్రశ్నించారు. దేవినేని ఉమా 2014లో కృష్ణా నదిలో తిరిగి మరీ నదీ గర్భంలోని నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలని చెప్పలేదా? అని నిలదీశారు. తాడేపల్లి తహసీల్దార్ లింగమనేనికి నోటీసులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 271 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి–కృష్ణా నది అని అడంగల్‌లో ఉందని, అలాగే 271–1బి ప్రభుత్వ భూమి డొంక అని రికార్డుల్లో ఉందని వివరించారు. ఇలాంటి ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరానని లింగమనేని చెప్పడం ఏమిటన్నారు. ఇటీవల సీఆర్డీఏకి రాసిన లేఖలో తనవి 254, 250 సర్వే నెంబర్లు అని ఆయన పేర్కొన్నారని, వాస్తవానికి అవి లింగమనేనివి కానే కావన్నారు. ఆయన ఎక్కడా అనుమతులు తీసుకోలేదని.. తాను గ్రామ పంచాయతీ రికార్డులన్నింటినీ చూసి చెబుతున్నానని, పంచాయతీ అనుమతులుంటే తీసుకు రావాలని కోరారు. ఈతకొలను నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా ఇల్లే కట్టారన్నారు. ఉడా అనుమతి ప్రకారం పట్టా భూమిలో నిర్మాణం చేయాల్సి ఉండగా ఏకంగా ప్రభుత్వ భూమిలోనే కట్టేశారన్నారు. ఇంటి అద్దె కింద రూ.1.2 కోట్లు తీసుకున్నారు చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఇంటి అద్దె కింద శాసనసభ, శాసనమండలి నుంచి రూ.1.2 కోట్లు తీసుకున్నారని.. నిజంగా వారు ఇంటి అద్దె చెల్లించారా? చెల్లించి ఉంటే దాన్ని ఆదాయపు పన్ను చెల్లింపులో చూపించారా? అని ఎమ్మెల్యే ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ లింగమనేని తన అతిథి గృహాన్ని ఉచితంగా ఇచ్చి ఉంటే మరి వారు ఇంటి అద్దెను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. లింగమనేని ఎలాంటి ప్రతిఫలం లేకుండానే అతిథి గృహాన్ని చంద్రబాబుకు ఇచ్చారా? అని నిలదీశారు. రాజధాని ల్యాండ్‌పూలింగ్‌ను లింగమనేని భూముల వద్దకు వచ్చేటప్పటికే ఎందుకు ఆపేశారో చెప్పాలన్నారు. తానున్న అతిథి గృహం ప్రభుత్వ ఆస్తి అని గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారని.. ఇప్పుడు మాత్రం మాట మార్చి అద్దెకు ఉంటున్నానని చెబుతున్నారని మండిపడ్డారు. లింగమనేని కూడా ఆ అతిథిగృహం తనది కాదని.. ఎప్పుడో ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పారని, ఇప్పుడేమో తనదేనని ప్రభుత్వానికి లేఖ రాశారని ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా నిర్మించారని ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
మంగళగిరి, తాడేపల్లికి మహర్దశ
సాక్షి, తాడేపల్లి(గుంటూరు) : నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. తాడేపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్ఎన్ దినేష్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను వేర్వేరుగా చూడొద్దని రెండింటినీ కలిపి చుట్టుపక్కల గ్రామాలతో భవిష్యత్ తరాలకు మంచి సౌకర్యాలతో ఉండే విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి మహానగరంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇప్పటినుంచే అభివృద్ధి చేసే పనులు కొన్ని రెండింటికీ కలిపి నిర్వహిస్తే ప్రభుత్వానికి ఎంతో భారం తగ్గుతుందన్నారు. ముఖ్యంగా తాగునీరు రెండు మున్సిపాలిటీలకు అవసరమని దానికి సంబంధించి కృష్ణానదినుంచి రా వాటర్ తీసుకుని ఫిల్టర్ చేయించి గ్రావిటీ ద్వారా రెండు మున్సిపాలిటీలకు అందించడం, డంపింగ్ యార్డును ఒకేచోట ఏర్పాటుచేయడం లాంటి పనులను గుర్తించి ఉమ్మడిగా చేస్తే ప్రభుత్వానికి చాలా ఖర్చు తగ్గుతుంది. విజయవాడ తరువాత రైల్వేలైన్లు అభివృద్ధి చెందేది తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలోనేనని దానికి సంబంధించి కూడా రైల్వే వారితో చర్చించి ఎక్కడెక్కడ బ్రిడ్జిలు కావాలి, ఎంత ఖర్చుపెట్టాలి అనే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. బకింగ్‌హామ్ కెనాల్‌పై కొత్త బ్రిడ్జి నిర్మాణం, కొత్త రోడ్ల నిర్మాణం వాటి వలన కలిగే లాభనష్టాలు అన్నీ ముందుగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎవరి నివాసం తొలగించినా ముందస్తుగా వారికి నివాసాలు కేటాయించి మాత్రమే అభివృద్ధి పనులు చేసే విధంగా చూడాలని అధికారులను ఆయన కోరారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలో రెయిన్ ఫాల్స్‌తో నిండే చెరువులున్నాయని, వాటిని రెయిన్ఫాల్స్తో నింపి భూగర్భ జలా లను పెంచే విధంగా కృషి చేయాలని సూచిం చారు. కొండ ప్రాంతాల్లో అటవీ భూములను వినియోగించుకోకుండా ప్రత్యామ్నాయ స్థలాలను ఎన్నుకునేలా చూడాలన్నారు. వీలైనంత వరకు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలకు ఉమ్మడిగా ప్రణాళిక రూపొందిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. సమీక్ష సమావేశంలో తాడేపల్లి మున్సిపల్ కమీషనర్ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణకు అదేశం
-
‘సదావర్తి’లో అక్రమాలపై విజి‘లెన్స్’
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీ నేతలకు సదావర్తి సత్రం భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సత్రం పేరిట చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాలను అతి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడంతో భూముల అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. అప్పట్లో జరిగిన వేలం ప్రక్రియలో అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు విచారణకు ఆదేశిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ జీవో జారీ చేశారు. భూముల అమ్మకానికి అప్పట్లో ప్రభుత్వ పరంగా, దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను విజిలెన్స్ అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఐదేళ్లలో పవన్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు
-
చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే
సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను పరిశీలించారు. కృష్ణా నదీగర్భంలో అక్రమంగా నిర్మించిన నివాసాన్ని చూసి అక్కడి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని, ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబు అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ఇంట్లోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను ముందే హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి పరిస్థితి అర్థంకాలేదని ఆర్కే అన్నారు. ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాన్ని ఖాళీచేయక తప్పదని ఆయన హెచ్చరించారు. (చదవండి: ముంపు ముప్పులో చంద్రబాబు కరకట్ట నివాసం..!) పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. -
ఏ ఒక్కరు గృహప్రవేశానికి నోచుకోలేదు
-
అన్న క్యాంటీన్లపై ప్రచారం అవాస్తవం
-
టీడీపీ వాళ్లు ప్రచారానికి వాడుకున్నారు
-
సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం
సాక్షి, అమరావతి : సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో దేవదాయ శాఖ భూములపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి వెల్లంపల్లి సమాధానమిచ్చారు. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి అడ్వొకేట్ జనరల్‌తో సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదావర్తి భూముల్లో అక్రమాలకు సబంధించి పలు అంశాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ‘2018 ఆగస్టులో సదావర్తి భూములను అమ్మేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అప్పటి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో గత ప్రభుత్వం తమిళనాడులోని చిన్న పేపర్లో ప్రకటన ఇస్తే.. గుంటూరులోని చంద్రబాబు బినామీలు వెళ్లి ఆ వేలంలో పాల్గొన్నారు. వేలంలో ఎకరం భూమి ధరను రూ. 50 లక్షలు నిర్ణయిస్తే.. చంద్రబాబు బినామీలు రూ. 22లక్షలకే వేలం పాడారు. ఆ తర్వాత సదావర్తి భూముల వేలం అధికారి తమను బతిమిలాడితే.. మరో రూ. 5లక్షలు అధిక ధరకు పాడినట్టు మినిట్స్‌లో రాసుకున్నారు. దేవదాయ శాఖ అధికారి భ్రమరాంబ ఎకరం భూమి ధర రూ. 6 కోట్లు ఉంటుందని ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలిపారు. దీంతో సదావర్తి భూముల అక్రమాలపై న్యాయం కోసం నేను కోర్టును ఆశ్రయించాను. అయితే కోర్టుకెళ్లిన నాపై ఐటీ దాడులు చేయిస్తామంటూ అప్పటి మంత్రి నారా లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే సదావర్తి భూములపై విజిలెన్స్ దర్యాప్తు చేయించాల’ని ఆర్కే కోరారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సీనియర్ అధికారి ద్వారా దీనిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చెప్పుకొచ్చారు. అయితే దీనిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి తప్పుపట్టారు. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టైటిట్ డీడ్ లేని భూమిని రాష్ట్ర ప్రభుత్వం మరొకరికి అంటగట్టొచ్చా అని ప్రశ్నించారు. -
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళుర్పించిన ఎమ్మెల్యే ఆర్కే
-
టీడీపీ హయాంలో అక్రమంగా విల్లాలు కట్టారు
-
ఒక్కో విల్లాను 5 కోట్లకు అమ్ముకున్నారు
సాక్షి, విజయవాడ : కరకట్టలో తనకు ఇల్లు ఇచ్చినందుకే అక్రమాలకు పాల్పడిన లింగమనేని రమేష్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని 40 నుంచి 50 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో జరిగిన భూబాగోతాలపై దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... లింగమనేని 40 ఎకరాల్లో లే ఔట్లు వేసి..విలాసవంతమైన విల్లాలు కట్టారని ఆర్కే పేర్కొన్నారు. 2005-2006 నుంచి విల్లాలు నిర్మించి ఒక్కొక్క విల్లాను రూ. 5 కోట్లకు అమ్ముకుని, లే ఔట్ ఫీజులు చెల్లించలేదని ఆరోపించారు. ఆ కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతికి కట్టాల్సిన లే ఔట్ ఫీజు ఇప్పటిదాకా కట్టలేదన్నారు. ‘ గజం భూమి విలువ రూ. 4 వేలుగా రిజిస్ట్రేషన్ విలువ చూపించారు. వీటి ద్వారాసుమారుగా 50 నుండి 60 కోట్ల రూపాయలు ఎగవేశారు. వ్యవస్థను పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళ జేబులు నింపుకున్నారు. చట్టవ్యతిరేకమైన పద్ధతిలో వేరే వాళ్లకు మార్పిడి చేసుకున్నారు. రూ. 250 కోట్లరూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేని రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వస్తున్నారు’ అని ఆర్కే ఆరోపించారు. చదవండి : అక్రమాల గని.. ‘లింగమనేని’ ఇబ్బంది పడాల్సి వస్తుంది! ‘నిజానికి మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దు. విజయవాడ క్లబ్ కూడా అక్రమ కట్టడమే. అనుమతి లేని ఏ భవన యజమానులకైనా సీఆర్డీఏ నోటీసులు ఇస్తుందని అనుకుంటున్నాం. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది’ అని ఆర్కే పేర్కొన్నారు. సామాన్యులు అప్పులు తెచ్చుకుని ఇక్కడ ఇల్లు కడితే, తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలని సూచించారు. -
నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారు
-
లింగమనేని ఎక్కడున్నారు? : ఆర్కే
సాక్షి, అమరావతి : నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌కు నోటీసులు ఇస్తే లింగమనేని రమేశ్ ఎందుకు స్పందించటం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించాడు. లింగమనేని గెస్ట్ హౌస్‌కు నోటీసులు ఇస్తే.. పచ్చ మీడియా, టీడీపీ నేతలు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆర్కేను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులతో కలిసి ఆర్కే ఆ భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడంపై ఇచ్చిన నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి రోడ్డు పేరుతో అప్పటి ప్రభుత్వం రైతులను బెదిరించి భూములను తీసుకుందని విమర్శించారు. కేవలం 10 అడుగులు మాత్రమేనని చెప్పి ఒక్కొక్కరి నుంచి 20 సెంట్ల భూమిని కబ్జా చేశారని మండిపడ్డారు. భూమిని లాక్కోవడమే కాకుండా నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. భూమిని రైతులకు తిరిగి ఇస్తామని అన్నారు. -
నా ఇంటినీ కూల్చేస్తే?
సాక్షి, అమరావతి: కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టిన నేపథ్యంలో ఆ పక్కనే తాను నివాసం ఉంటున్న భవనాన్ని కూడా కూల్చేసే పరిస్థితి వస్తే ఏం చేయాలనే అంశంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం టీడీపీ నాయకులతో సమావేశమైన ఆయన ప్రజావేదిక కూల్చివేత, తదనంతర పరిణామాలపై చర్చించారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందని పలువురు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ భవనానికి సంబంధించిన అనుమతుల వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజావేదికను కూల్చినంత సులభంగా దీని వద్దకు రాలేదని కొందరు నేతలు పేర్కొన్నారు. కొందరు నేతలు మాత్రం అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేసేలా ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న ఇంటి విషయంలో విజ్ఞతతో వ్యవహరించాలని పలువురు మంత్రులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు సూచించడంపైనా చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై రాద్ధాంతం చేయకుండా గౌరవప్రదంగా వేరే ఇంటికి మారిపోతే బాగుంటుందని కొందరు నాయకులు అభిప్రాయపడగా అలా చేస్తే చంద్రబాబు తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లవుతుందని మరికొందరు అన్నట్లు తెలిసింది. చివరికి చంద్రబాబు ఇల్లు మారిపోతేనే మంచిదనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేశారు. ప్రజావేదికను ప్రభుత్వం కక్షపూరితంగానే కూల్చివేసిందని ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అయితే అదే సమయంలో దీనిపై ఎక్కువగా స్పందించరాదని, లేదంటే అక్రమ కట్టడాల కూల్చివేతను వ్యతిరేకించినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమవడం, పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని జరుగుతున్న ప్రచారంపైనా చంద్రబాబు చర్చించారు. -
‘చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే’
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూమిని లాక్కుని ప్రజావేదిక నిర్మించిందని, చంద్రబాబు అండతో కరకట్టపై అక్రమ కట్టడాలు చేపట్టారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చట్టానికి తూట్లు పొడిచారని విమర్శించారు. అక్రమ కట్టడాలతో నదీ గర్భం కలుషితమవుతోందని, కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలపై ముందునుంచి న్యాయపోరాటం చేస్తున్నామని, కరకట్టపై 60పైగా అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా అందాయన్నారు. కేసు కోర్టు ముందుకు రాకుండా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆరోపించారు. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేని, ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు ఖాళీ చేయడం మంచిదన్నారు. మిగిలిన వాళ్లు కూడా తమకు తాముగా ఖాళీ చేయాలని సూచించారు. ప్రజా ధనంతో హైదరాబాద్‌లోనూ ఇళ్లు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. (చదవండి: ప్రజావేదిక కూల్చివేత) -
పంచాయతీరాజ్,విద్యాశాఖాధికారులతో ఆర్కే సమీక్ష
-
రాజధాని అని అంతా అన్యాయం చేశారయ్యా..
పచ్చని పారాణి పూసుకుని కొత్త పెళ్లికూతురి వలే కళకళలాడే పంట భూములు .. బీడు వారి చిల్ల చెట్లు కప్పుకుని ఉంటే ఆ రైతుల గుండెలు చెరువయ్యాయి. మూడు పూటలా నాలుగు మెతుకులు పెట్టే భూములను బలవంతంగా లాక్కుంటే ఆ రైతుల జీవితాల్లో దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. తమ భూములు రాజధాని పేరుతో సాగించే దోపిడీకి ఇవ్వబోమని తెగేసి చెబుదామంటే అప్పటి టీడీపీ నేతల బెదిరింపులు గొంతు నొక్కేశాయి. ఇలా ఐదేళ్లపాటు కష్టాలను పంటి బిగువున దాచుకుని కాలం వెళ్లదీశారు రాజధాని రైతులు. బుధవారం రైతు సంక్షేమ ప్రభుత్వ వారథులుగా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తుళ్లూరు మండలం రాయపూడి వచ్చారు. రైతులను పలకరించగానే వారి గుండెల్లో పొంగిన వేదనలన్నీ కన్నీటి ప్రవాహమయ్యాయి. రాజధానిలో అంతా అన్యాయం చేశారయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా బెదిరించి భూములు లాక్కున్నారని వాపోయారు. విచారించి న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్యేలు భరోసా కల్పించారు. సాక్షి, అమరావతి : అమరావతి నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం చేసిన అవినీతిని త్వరలోనే బట్టబయలు చేస్తామని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో మల్లెల హరీంద్రనాథ్‌చౌదరి నివాసంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు, భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్న రైతులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. రాజధానికి భూములు ఇవ్వాలని బలవంతపెట్టారని, భూములు ఇవ్వకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొని స్వచ్ఛందంగా ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు అందకుండా చేశారని, విద్యుత్ సర్వీసులను తొలగించారని, సబ్సిడీలు రాకుండా అడ్డుకున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. భూములు తీసుకున్న తర్వాత ప్లాట్లు కేటాయించే సమయంలో టీడీపీ నాయకులు పాల్పడిన కుంభకోణాలను కూడా ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు. రాయపూడి గ్రామానికి చెందిన కస్తాలదిబ్బ, రూతమ్మ దిబ్బ, లంక భూములు సాగు చేసుకునే రైతులను దగా చేశారని వాపోయారు. విజయవాడకు చెందిన దళారితో కలసి స్థానిక సీఆర్డీఏ అధికారులు ఏవిధంగా తమ భూములు ఆక్రమించుకున్నారో వివరించారు. బలవంతంగా లాక్కునేందుకు యత్నం లింగాయపాలకెం, తాళ్లాయిపాలెం, వెంకటపాలెం లంక రైతులు మాట్లాడుతూ తమ భూములను గత ప్రభుత్వం అన్యాక్రాంతం చేయాలని యత్నించిందని, మా భూములను ప్రభుత్వ భూములుగా పరిగణించి బలవంతంగా లాక్కునేందుకు సీఆర్డీఏ అధికారులు తీవ్రంగా యత్నించారని తెలిపారు. తమవి జరీబు భూములైతే మెట్టగా పరిగణించి ప్యాకేజీ తగ్గించి ఇచ్చారని బోరుపాలెం, అబ్బరాజుపాలెం రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. అవినీతిని బయటపెడతాం అనంతరం ఎమ్మెల్యేలు ఆర్కే, శ్రీదేవి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతికి అడ్డూఅదుపులేదని పేర్కొన్నారు. వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందని విమర్శించారు. దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్, సీలింగ్, లంక భూములను కారుచౌకగా తీసుకునేందుకు ప్రయత్నించిందన్నారు. ప్యాకేజీ విషయంలో తీవ్ర వివక్ష చూపించిందని చెప్పారు. భూములు ఇవ్వని రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే సీబీఐ విచారణ రాజధానిలో భూకొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, టీడీపీ నాయకులు పాల్పడిన భూ కుంభకోణాలపై అవసరమైతే సీబీఐ విచారణ కోరతామని ఎమ్మెల్యేలు తెలిపారు. దళితులు ఆర్థికంగా బలోపేతమవడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. స్విస్ చాలెంజ్ పేరుతో రైతుల భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించారని, ఈ ఒప్పందాలను సమీక్షించి అవసరమైతే కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు తెలిపిన సమస్యలను సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపుతామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి సహజ వనరులను నాశనం చేస్తూ, కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేసి, నదీ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లుగా టీడీపీ నిరంకుశత్వంపై పోరాడాం. గత పాలకుల నిర్వాకంపై ఎన్జీటీలో కేసులు కూడా వేశాం. గ్రామాల్లో రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తే వాటిని అడ్డుకుని అక్రమంగా అరెస్టులు చేసి, కేసులు బనాయించారు. వాటిని కొట్టేసి, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. – అనుమోలు గాంధీ, లింగాయపాలె రాజధానికి భూములిస్తే రికార్డులు తారుమారు నాకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 84, 85లో ఉన్న 2 ఎకరాల 30 సెంట్ల భూమిని సీఆర్డీఏ ఇచ్చా. కౌలు చెల్లింపులో వ్యత్యాసం రావడంతో అధికారులను అడిగితే పూలింగ్‌లో నేను ఇచ్చింది ఎకరా 90 సెంట్లు మాత్రమేనన్నారు. దీనిపై నేను గట్టిగా నిలదీస్తే అసలు గుట్టు తెలిసింది. స్థానిక టీడీపీ నాయకులు నా భూమిలో 40 సెంట్లు వారి పేరుపై నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించుకుని పరిహారం కాజేశారు. – తరిగొప్పుల వసంతరావు, అనంతవరం గ్రామం, తుళ్లూరు -
అవసరమైతే సీబీఐ విచారణ: ఆర్కే
అమరావతి: రాజధాని అమరావతిలో గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వంలో రైతులు చిత్రహింసలకు గురయ్యారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని రైతుల సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అవసరమైతే సీబీఐ విచారణ కూడా కోరతామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్విస్ ఛాలెంజ్‌పై అవసరమైతే లండన్ కోర్టుకైనా వెళ్తామన్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల అవినీతి: ఉండవల్లి శ్రీదేవి గత ప్రభుత్వ హాయాంలో రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. చదరపు అడుగుకు రూ.2 వేలు కూడా ఖర్చు కాని తాత్కాలిక సచివాలయానికి రూ.10 వేలకు పైగా ఖర్చు పెట్టి వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. రాజధాని ఇక్కడ ఉండదని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబుకి రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడే ఇల్లు ఎందుకు కట్టుకోలేదని సూటిగా ప్రశ్నించారు. రాజధానిలో అందరికీ అండగా ఉంటామని ధీమా ఇచ్చారు. త్వరలోనే ఎమ్మెల్యే ఆర్కే, తాను కలిసి సీఆర్డీఏ కమిషనర్‌ను కలిసి రాజధానిలో పరిస్థితులు వివరిస్తామని చెప్పారు. -
రాజధాని భూములను ఎక్కడ తాకట్టు పెట్టారు?
సాక్షి, మంగళగిరి : రాజధాని పేరుతో ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసిన చంద్రబాబు వ్యవస్థలతో పాటు మీడియానూ మేనేజ్ చేసి నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. రాజధాని కోసం తీసుకున్న భూములను ఎక్కడ తాకట్టు పెట్టారో? ఎంత వడ్డీకి ఎన్ని కోట్లు తీసుకున్నారో అన్ని లెక్కలూ తేలాల్సి ఉందన్నారు. మంగళగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో తీసుకున్న భూములకు చట్టపరంగా ఇస్తామని చెప్పిన అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు రైతులతో పాటు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు, తీసుకున్న 33 వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణాలు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాల మీద ఇప్పటికే న్యాయ స్థానం 60 మంది నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసిందని, వారంతా న్యాయస్థానానికి సమాధానం చెప్పిన అనంతరం న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారం అక్రమకట్టడాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
‘నిద్రపోను.. నిద్రపోనివ్వను’
మంగళగిరి: గత ఐదేళ్లలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిథులకు ఏమాత్రం సహకరించలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తన విషయంలోనే అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. ఆదివారం మంగళగిరి మండల పరిషత్ సమావేశంలో ఆళ్లరామక్రిష్ణారెడ్డి అధికారులతో మాట్లాడారు. అధికారులపై ఒత్తిడి తెస్తే మానసికంగా ఇబ్బంది పడతారేమోనని అప్పట్లో వదిలేశానని చెప్పారు. భగవంతుడు, ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. మండల పరిషత్ సమావేశాలకు ఇకపై అన్నిశాఖల అధికారులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. అధికారులు తప్పుడు సమాచారం చెబితే నమ్మే అంత పిచ్చి వాడినైతే తాను కాదన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. గత ఐదేళ్లలో ప్రజా ధనాన్ని లూటీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ అధికారులు తమ ఉద్యోగాలకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రజాప్రతినిధులు పర్సంటేజీలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకోవద్దు.. ఒకవేళ ప్రజలు ఇచ్చినా దయచేసి తీసుకోవద్దని అధికారులకు సూచించారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. -
కృష్ణా నదిలో టీడీపీ నేత అక్రమ నిర్మాణం
-
‘అక్కడ 9700 ఓట్లు లెక్కించలేదు’
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదని ఆయన ట్వీటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్వో అక్రమానికి పాల్పడి టీడీపీ 4200 ఓట్లతో గెల్చినట్టు ప్రకటించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గుంటూరు లోక్‌సభ స్థానంలోని సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్న కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడంతో వాటిని లెక్కించని విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, ఉత్తర గుంటూరు, దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క దక్షిణ గుంటూరు మినహా అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ లోక్‌సభ స్థానంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కాకుండా టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ను విజయం వరించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుంటూరుతో పాటు శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారుల తీరుతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చిందని, ఈ రెండు స్థానాలపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. -
వైఎస్ జగన్ నాయకత్వన్ని ప్రజలు విశ్వసించారు : ఆర్కే
-
చరిత్ర సృష్టించిన ఆర్కే
సాక్షి, మంగళగిరి : నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌పై ఘన విజయం సాధించిన వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికలలో కేవలం 12 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే ఆర్కే 2019లో లోకేష్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. లోకేష్‌పై ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పిన ఆర్కేను నియోజకవర్గ ప్రజలు మరో సారి ఆదరించి విజయం అందించారు. గురువారం ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్‌కు బయలుదేరిన ఆర్కే తొలుత శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీలోని కౌంటింగ్ హాలుకు చేరుకుని కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్కేకు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోవడం విశేషం. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు మాత్రం ఆర్కే నీతి నిజాయతీతో ముఖ్యమంత్రి అవినీతిపై పోరాటం, రాజధాని రైతులకు అండగా నిలవడంతో మద్దతుగా నిలిచారు. రాజన్న క్యాంటీన్ పేరుతో రూ.4లకే పేదల ఆకలి తీర్చడంతో పాటు రాజన్న రైతుబజార్ పేరుతో రూ.10లకు ఏడురకాల కూరగాయలు అందజేయడం వంటివి ఆర్కే విజయానికి కారణమయ్యాయి. మంత్రి లోకేష్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోవడం, ఐదేళ్ల కాలంలో టీడీపీ నాయకులు చేసిన అవినీతి వారి ఓటమికి కారణమైందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నామినేషన్ రోజు నుంచే ప్రచారంలోనే లోకేష్‌పై ఆర్కే విజయం సాధించారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడం, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వై.ఎస్. షర్మిల బహిరంగ సభలు విజయవంతం చేయడంతోనే ఆర్కే విజయం ఖరారైంది. వై.ఎస్.జగన్ సైతం ఆర్కేను గెలిపిస్తే తన క్యాబినెట్లో మంత్రి అవుతారని చెప్పడం, ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేయడం వంటివాటితో ప్రజలు అండగా నిలిచి గెలిపించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) 5,769 ఓట్లతో విజయం సాధించారు. ఎమ్మెల్యే ఆర్కేకు 1,05,083 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్‌కు 99,314 ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 25,042 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1600పైగా పోల్‌కాగా, ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో 100 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. వీటిలో ఎమ్మెల్యే ఆర్కేకు 70 ఓట్లు మెజార్టీ లభించింది. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయడంలో పొరపాటుగా వ్యవహరించారా! లేక అధికారులే కావాలని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రిజక్ట్ చేశారనే విషయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 145వ బూత్ ఈవీఎం మొరా యించడంతో అధికారులు వీవీ ప్యాట్లను లెక్కపెడుతుండడంతో రాత్రి పదిన్నర గంటలకు సైతం అధికారులు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఓటమిని ముందే గ్రహించిన టీడీపీ అభ్యర్థి లోకేష్‌తో పాటు టీడీపీ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు మినహా మిగిలిన నాయకులు ఎవరు కౌంటింగ్ కేంద్రం వైపు రాలేదు. విజయంపై విశ్వాసంతో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే ఉదయం నుంచి కౌంటింగ్ హాలులోనే ఉండి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. -
లోకేశ్ పరాజయం : చంద్రబాబుకు షాక్
సాక్షి, అమరావతి : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం వెల్లడైంది. ఉదయం నుంచి అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన ఈ నియోజవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 5312 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రౌండు నుంచీ ఆర్కే తన ఆధిక్యతను కనబరిచారు. అయితే, ప్రతి రౌండులోనూ ప్రత్యర్థి లోకేశ్‌కు మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉండటంతో ఫలితంపై చివరి వరకు ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది రౌండు లెక్కింపు పూర్తయిన తర్వాత 5312 ఓట్ల ఆధిక్యతతో ఆర్కే జయకేతనం ఎగురవేశారు. లోకేశ్ ఓటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్‌లా తగిలింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన లోకేశ్‌ను ఎలాగైనా గెలిపించి సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పగించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని గందరగోళంలో పడిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ ను పోటీ చేయించాలని నిర్ణయించిన తర్వాత జనసేన అక్కడి నుంచి పోటీ చేయకుండా తప్పుకుంది. జనసేన పొత్తు పేరుతో ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. సామాజిక వర్గం, రాజధాని ప్రాంతం అంటూ అనేక కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే విజయం సులభమని భావించిన తర్వాతే లోకేశ్ ను అక్కడి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. లోకేశ్ కోసం అత్యంత శ్రేయోస్కరమైన నియోజకవర్గం ఏదవుతుందోనని అనేక విధాలుగా సర్వేలు చేయించిన తర్వాత భీమిలి, మంగళగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడం మంచిదని చంద్రబాబు నిర్ణయానికొచ్చారు. చివరగా మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్కే గట్టి పోటీనివ్వడంతో లోకేశ్ తన అధికార శక్తియుక్తులన్నీ ప్రయోగించారు. ఎన్నికల్లో పూర్తి సమయాన్ని వెచ్చించారు. ఆర్థిక అంగబలాన్నంతా ప్రయోగించారని వార్తలొచ్చాయి. తెలుగుదేశం పార్టీ బాధ్యతలను అప్పగించాలనుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిరోజూ నియోజకవర్గం నేతలతో సమాలోచనలు జరిపారు. ఇంత చేసినప్పటికీ చివరికి ఓటమి పాలవ్వడంతో చంద్రబాబుతో పాటు ఆయన సన్నిహితులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని పార్టీ వర్గాలు చెప్పాయి. నాయకత్వం వహించే విషయంలో మొదటి నుంచీ లోకేశ్ పై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమైనప్పటికీ చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో పార్టీ నాయకులెవరూ బహిరంగంగా మాట్లాడలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీ నేతలు ఒకరకమైన గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే, ప్రస్తుతం శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న లోకేశ్ ను ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా ఓటమికి నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకుంటారా? లేక కొనసాగుతారా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. -
మంగళగిగిలో లోకేశ్‌కు ఓటమి తప్పదు
-
గొడవలకు ఆస్కారం.. టీడీపీపై ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) శనివారం కలిశారు. మంగళగిరి కౌంటింగ్‌లో టీడీపీ గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్నే సీఎం చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నందువల్ల మంగళగిరిలో కౌంటింగ్ సిబ్బందిని కూడా భయపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీఎం తనయుడు నారా లోకేశే అభ్యర్థి కావడంతో వివాదాలను ప్రోత్సహించి ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉందని ఎన్నికల అధికారికి తెలిపారు. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలంటే పోలీస్ సిబ్బందిని మంగళగిరిలో అదనంగా నియమించాలని కోరారు. మంగళగిరి కౌంటింగ్‌పై అదనపు అభ్జర్వర్ని కూడా నియమించాలని విన్నవించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీపై ఎపీ ఈసీసి ఆర్కే ఫిర్యాదు -
టీడీపీపై ఎపీ ఈసీసి ఆర్కే ఫిర్యాదు
-
మాకు వ్యవస్థలపై నమ్మకం ఉంది: మోదుగుల
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వైఎస్సార్సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూములను పరిశీలించినట్లు తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని చెప్పారు. అభ్యర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారని వెల్లడించారు. తమకు భారతదేశంలోని వ్యవస్థలపైన నమ్మకముందని వ్యాక్యానించారు. బాబు ఘనుడు .. అందుకే పరిశీలించడానికి వచ్చాం: ఆళ్ల ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారని, తమకు భద్రతపై నమ్మకం ఉందని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఘనుడు అని ప్రజలు చెబుతున్నారు.. అందుకే ఒకసారి ఈవీఎంల భద్రతను పరిశీలించడానికి వచ్చామని పేర్కొన్నారు. -
సీఎం కొడుక్కి ఓ న్యాయం.. సామాన్యుడికో న్యాయమా?
తాడేపల్లిరూరల్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నారా లోకేశ్‌కు ఓ న్యాయం.. సామాన్యులకో న్యాయమా అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పోలీసులను ఉసిగొల్పి తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అక్రమ కేసులకు భయపడబోమని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పోలకంపాడు పాఠశాల వద్ద పోలింగ్ రోజు తమ పార్టీవారిని కొట్టి, వారిపై తప్పుడు కేసులు బనాయించి శనివారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలుసుకున్న ఆర్కే పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. లోకేశ్ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి క్రిస్టియన్‌పేటలో ఎన్నికలు జరుగుతున్న పాఠశాల వద్ద నుంచి 10 అడుగుల దూరంలో ధర్నా చేస్తే కేసు ఎందుకు పెట్టలేదు.. దాన్ని ప్రశ్నించినవారిపై ఎందుకు నమోదు చేశారు, ఎవరు ఫిర్యాదు ఇచ్చారు అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనికి పోలీసులు స్పందిస్తూ.. తమ దగ్గర వీడియోల ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, అక్కడ మీకు లోకేశ్ కనిపించలేదా? టీడీపీ కార్యకర్తలు కనిపించలేదా అని పోలీసులను ప్రశ్నించిన ఆర్కే పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. ఎన్నికల రోజు మంగళగిరి నార్త్ జోన్ డీఎస్పీ, ఇతర సిబ్బంది చేసిన హడావుడి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చేసిన లాఠీచార్జి లోకేశ్ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జరిగిన ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. లోకేశ్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశామని ఆర్కేకు పోలీసులు వివరణ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల హడావిడి.. అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ఆర్కే ధర్నా చేస్తుండగా, వైఎస్సార్సీపీ నేతలు తమను కొట్టేందుకు వేరే ప్రాంతాల నుంచి జనాల్ని తీసుకొచ్చారని, వారు తమ ఇళ్లను ధ్వంసం చేసి కొట్టారంటూ కొంతమంది మహిళలు హడావిడి సృష్టించారు. డీఎస్పీకి టీడీపీ జీతం ఇస్తుందా? మంగళగిరిలో లోకేశ్ పోటీలో ఉండటంతో స్థానిక డీఎస్పీ పసుపుజెండా కప్పుకుని, టీడీపీ జీతగాడిగా పనిచేస్తున్నారని ఆర్కే మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి డీఎస్పీ తన కిందిస్థాయి సిబ్బందిని బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. డీఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధమవుతామని ఆర్కే హెచ్చరించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. -
ఓటర్లతో కలిసి ధర్నాకు దిగిన ఆర్కే
-
ఆర్కేకు ఓటేస్తే.. మంత్రి అవుతాడు : వైఎస్ జగన్
సాక్షి, మంగళగిరి : ‘నా సోదరుడు.. లోకల్ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్లో మంత్రిగా ఉంటాడు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిని ప్రతి కుంభకోణం.. మోసం.. వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయన్నారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, ఆయన పార్టనర్.. ఎల్లో మీడియా చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి రాగానే చేనేత వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి (ఆర్కే)తో పాటు గుంటూరు లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. బాబు సుపుత్రుడిని ఓడించండి.. ‘చంద్రబాబు గత ఐదేళ్ల పాలన చూశారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి.. మీరందరూ మీ గుండెల మీద చేతులు వేసి ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ పక్కనే ఆర్కే(ఆళ్లరామకృష్ణారెడ్డి) నిల్చోని ఉన్నాడు. ఈ లోకల్ హీరో గురించి మీ అందరికి తెలుసు. తన పొలంలో తానే నాట్లు వేస్తాడు. తానే కాడిపట్టి దున్నుతాడు. ఆ గట్టు మీదనే భోజనం చేస్తాడు. తనతో పాటు పది మందికి రాజన్న క్యాంటీన్ ద్వారా భోజనం పెడ్తాడు. అందరికి అందుబాటు ధరల్లో కూరగాయాలు కూడా అమ్మిస్తాడు. రైతులకు కష్టం వస్తే రైతుల తరఫున కోర్టుకు కూడా వెళ్తాడు. తనను కొనేందుకు చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. తాను మాత్రం అమ్ముడుపోలేదు. నా సోదరుడు ఆర్కే గత 5 ఏళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఇక టీడీపీ నుంచి ఇక్కడ చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అభ్యర్థి ఇక్కడ ఐదేళ్లలో ఎన్నడూ కాలుకూడా పెట్టలేదు. టీడీపీ పాలనలో చుట్టు పక్కల రైతులకు రక్షణ కూడా లేదు. ఇష్టానుసారం భూములను ఆక్రమిస్తున్నారు. వాటిని అడ్డుకోవాలంటే కోర్టులదాకా వెళ్లే పరిస్థితి. బాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుంది. ఆయన సుపుత్రుడిని కూడా ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వాలని కోరుతున్నాను. అన్ని అక్రమాలు ఇక్కడే.. మంగళగిరిలోనే హాయ్‌ల్యాండ్, సింగపూర్ కుంభకోణం.. రిషితేశ్వరి మరణం, సదావర్తి భూముల కుంభకోణం. మూడు సెంటిమీటర్ల వర్షం పడితే లోపల 6 సెంటీమీటర్ల నీరు కనబడే టెంపరరీ సెక్రటిరియేట్, అసెంబ్లీ. అరటి తోటలను తగల బెట్టించింది. చంద్రబాబు అక్రమ నివాసం ఇక్కడే.. ఈ మంగళగిరిలోనే. ఇక్కడి నేతన్నలను వంచించింది. మేనిఫెస్టోలోచెప్పింది ఒక్కటి కూడా చేయనిది. స్వర్ణకారుల ఆత్మహత్యలు కూడా ఇక్కడే. రైతులను, కూలీలను మోసగించింది ఇక్కడే. దళితుల అసైన్డ్ భూములు లాక్కుంది ఇక్కడే. ల్యాండ్‌పూలింగ్ బాధితులకు ప్లాట్లు ఇవ్వలేదు కానీ.. ఆయన బీనామిలుకు ఇచ్చింది ఇక్కడే. కృష్ణానది పక్కనే ఉన్నా సాగు నీరు అందించలేని అధ్వాన్నమైన పరిస్థితి ఇక్కడే. కూతవేటులో సీఎం నివాసం.. పక్కనే ఇసుక దోపిడి. సీఎం ఆయన కొడుకు ఏనాడు మంగళగిరిలో తిరిగినది లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులనుకాపాడుతాడు.. మీ కుటుంబాలను కాపాడుతాడు.. నా క్యాబినెట్లోమంత్రిగా ఉంటాడు. పార్టనర్ ఎందుకు రాలేదు? ఇక చంద్రబాబు పార్టనర్ అయిన యాక్టర్ పోటీచేసే గాజువాక, భీమవరంలో బాబు ఆయన కొడుకు ప్రచారనికి వెళ్లరు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం.. ఆయన కొడుకు పోటీచేస్తున్న మంగళగిరిలో బాబు గారి పార్ట్నర్ ప్రచారానికి రారు. ఈ ఇద్దరికి ఒకే పార్టీలా ? లేక వేర్వేరు పార్టీలా? ఆలోచన చేయమని కోరుతున్నా. దుర్యోధనుడు ఏం చేసినా.. కౌరవసభలో కొందరికి గొప్పగా కనిపంచేదట.. అధికార మదంతో దుర్యోధనుడిని పొగిడినవారిని దుష్ట శక్తులంటాం. హిట్లర్ చేసిన దుర్మార్గులను కప్పిపెట్టి.. రెండో ప్రపంచ యుద్దంలో ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నాడని ఆ నాడు జర్మనిలో రేడియోలోతప్పుడు ప్రచారం చేసినవాడు.. హిట్లర్ మంత్రి గోబెల్స్. వీటిన్నిటిని వింటాఉంటే.. ఎవరైనా గుర్తుకు వస్తున్నారా? ఇదే మాదిరిగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 గుర్తుకు వస్తున్నాయా? ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబు నాయుడు ఓటమి కాయమని ప్రజలు నిర్ణయానికి వచ్చినా.. కూడా గోబెల్స్ తరహాలో చేస్తున్నా ప్రచారాన్ని చూడమని కోరుతున్నా.. 10 ఎల్లో మీడియా చానెళ్లు మైక్స్ పట్టుకోని ప్రచారం చేసినంతా మాత్రానా చంద్రబాబు చేసిన మోసాలు మంచివి అయిపోతాయా? దగా చేసంది ఎవరు? చదువుకున్న ప్రజలున్న ఈ అర్భన్ సిటీలో... వారందరిని కోరేది ఒక్కటే.. రుణమాఫి అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేసిందేవరు? నిరుద్యోగభృతి, ఉద్యోగం అంటూ నిరుద్యోగులను మోసం చేసింది ఎవరో ఆలోచన చేయమని కోరుతున్నా. మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? ప్రత్యేకహోదాను పట్టించుకోనిది ఎవరు? ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉన్నా కనీసం.. ఒక్క లేఖ రాయకుండా.. ఒక్కసారి కలవకుండా రాష్ట్రప్రయోజనాలు.. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఎవరు? సెప్టెంబర్ 16, 2016 అందరికీ గుర్తుంటుంది. హోదా వద్దు ప్యాకేజీ కావాలని ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేసింది ఎవరు? ప్యాకేజీ ఇస్తే చాలని కేంద్రానికి లేఖ రాసిందెవరు? ప్యాకేజీ ఇచ్చిన నాలుగు నెలలు తర్వాత.. బీజేపీ మన రాష్ట్రానికి చేసినంత ఎవరు చేయలేదని ప్రెస్‌మీట్ పెట్టి పొగిడింది ఎవరు? దుగ్గరాజు పట్నం ఓడరేవు వద్దని లేఖరాసింది ఎవరు? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టింది చంద్రబాబు?కాదా అని అడుగుతున్నా. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డానని ఇటీవల ప్రకటించింది చంద్రబాబు కాదా? సింగపూర్ కంపెనీలతో రహస్య ఒప్పందం పెట్టుకుని రాజధాని భూములను దారదత్తం చేసిందెవరు? ఆత్మగౌరవం అని మాట్లాడే పార్టనర్, ఎల్లో మీడియా.. ఈ మోసాలపై ఎందుకు మాట్లాడటం లేదని మీ అందరి తరపున ప్రశ్నిస్తున్నా? భూములు ఇవ్వలేదని పంటలు తగలబెట్టింది ఎవరు? రాజధాని ప్రకటనకు ముందు బినామీల చేత ఇక్కడ భూములు కొనగోలు చేయించింది ఎవరు? జగన్ ఇళ్లు ఎక్కడా? అని ఎవరిని అడిగినా.. తాడేపళ్లి అని చూపిస్తారు. అదే చంద్రబాబు ఇళ్లు ఎక్కడా? అని అడిగితే హైదారబాద్ జూబ్లిహిల్స్ చూపిస్తారు. ఈ ఐదేళ్లపాలనలో చంద్రబాబు మోసాలు చూశారు. అబద్దాలు చూశారు. ఈ మోసాలకు ఎన్నిక రోజు క్లైమాక్స్ వస్తుంది. ఇక్కడ ఓటుకు 10వేలు ఇస్తున్నారని నాకు తెలుస్తూ ఉంది. డబ్బులతో ప్రలోభాలకు గురిచేసినా.. మోసపోకండి. ప్రతి గ్రామానికి వెళ్లి.. ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పిండి. మేనిఫెస్టోను వివరించండి. అన్నను గెలిపిస్తే రాజన్నరాజ్యం వస్తుందని చెప్పండి’ అని వైఎస్ జగన్ కోరారు. -
మంగళగిరిలో కీలక పరిణామం
సాక్షి, అమరావతి: మంగళగిరిలో నారా లోకేశ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతు పెరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న పద్మశాలీలు ఆర్కేకు మద్దతు ప్రకటించారు. సోమవారం జరిగిన చేనేతల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ బుట్టా రేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి నేతన్నలు పూర్తి మద్దతు తెలిపారు. మంగళగిరిలో బీసీలను నమ్మించి టీడీపీ మోసం చేసిందని, తమకు జరిగిన అన్యాయాన్ని ఓటుతో ఎదుర్కొంటామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, చేనేత సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: లోకేశ్‌కు బుద్ధి చెబుతాం) -
‘నేను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా’
గుంటూరు: తాను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా కానీ తన మనవడు నారా లోకేష్‌కి మంగళగిరి పలకడం ఇప్పటికీ రావడం లేదని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరి మండలం యర్రబాలెంలో వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. మంగళగిరి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అంటే తనకు చాలా అభిమానమని తెలిపారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలన్నారు. స్వయంగా పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే, మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దింపేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచమైన రాజకీయాలు చేశాడని ఆరోపించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చంద్రబాబు రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు భూమి అమ్మేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన, పోరాడుతున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబుకి, జగన్‌కు చాలా తేడాలున్నాయన్నారు. జగన్ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టి నడుపుతుంటే.. చంద్రబాబు మాత్రం మామయ్యను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీని తన సొంత పార్టీ అని చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. జగన్‌పై అనేక కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడాడని, చివరికి జగన్‌పై హత్యాయత్నం కూడా చేయించిన నీచుడు చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు. బాబుకి మతిమరుపు రోగం చంద్రబాబు నాయుడికి మతిమరుపు వ్యాధి వచ్చిందని, అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడు, కాసేపు ప్రత్యేక హోదా అంటాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు. తన కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చు పెట్టి స్టాన్ఫోర్డ్ గ్యాడ్యుయేట్ యూనివర్సిటీ నుంచి దొంగ సర్టిఫికేట్ తెప్పించాడని ఆరోపించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి తన మనవడు నారా లోకేష్ అని, ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్‌ని నిలబెట్టాడని ఆరోపించారు. లోకేష్‌ని ఎక్కడ నిలబెట్టాలో అర్ధం కాక చివరికి సింహం లాంటి ఆర్కేకు ప్రత్యర్థిగా నిలబెట్టారని అన్నారు. ఆర్కేకి సింహంలా పోరాడడమే వచ్చు కానీ గుంటనక్కల్లా రాజకీయం చేయడం తెలియదన్నారు. మరో నంద్యాలలా చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడిలా నాలుగు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వైఎస్ జగన్‌కు తెలియదన్నారు. ప్రజల కోసం ఒంటరిగా పోరాడే వ్యక్తి జగన్ అని చెప్పారు. మంగళగిరి అన్ని నియోజకవర్గాల కంటే ప్రత్యేకమైనదన్నారు. మంగళగిరిలో ఆర్కే గెలిస్తే చరిత్ర సృష్టించినట్లేనని అభిప్రాయపడ్డారు. లోకేష్‌ని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని డబ్బును నీరులా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మరో నంద్యాల ఉప ఎన్నికలా చేయాలని చూస్తున్నారని అన్నారు. అడ్డగోలుగా కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని డబ్బును విపరీతంగా పంచుతున్నారని అన్నారు. మంగళగిరి ప్రజలు నీతి నిజాయతీ గల వ్యక్తులు అని, ఎవరికి ఓటువేయాలో వారికి తెలుసునన్నారు. సింగపూర్ పారిపావాల్సిందే ఆర్కే లాంటి వ్యక్తి అన్ని నియోజకవర్గాల్లో ఉంటే ప్రజల సమస్యలు తీరతాయని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని, అలాగే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే కాకుండా ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తండ్రీకొడుకులు(నారా చంద్రబాబు, నారా లోకేష్) ఇద్దరూ సింగపూర్ పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఆర్కే గెలిస్తే మంగళగిరి ప్రజలు గెలిచినట్టేనని అభిప్రాయపడ్డారు. -
మంగళగిరిలో వృద్ధురాలి ఆవేదన
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ నేతల మరో భూ దందా వెలుగుచూసింది. ఓ వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్‌బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దృష్టికి తీసుకవచ్చారు. తనకు జరిగిన అన్యాయం ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన వృద్ధురాలి భూమిని కబ్జా చేసిన టీడీపీ నేతలు.. ఆమెను బలవంతంగా గెంటివేశారు. తనకు జరిగిన అన్యాయంపై సదురు వృద్ధురాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని తెలిపారు. దీనిపై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయకుండా పనులు సాగిస్తున్నారని ఆరోపించారు. -
ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు
-
ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవం : మోహన్‌బాబు
సాక్షి, మంగళగిరి : వైస్రాయ్ హోటల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డితో కలిసి మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని ధ్వజమెత్తారు. ఇది అన్నయ్య టీడీపీ కాదు.. ‘ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్)ది కాదు.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వీడేవాడినే కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకుని వదిలేశారు. ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరు. ఆ సమయంలో అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మహోన్నత వ్యక్తి.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మహోన్నత వ్యక్తి. ఆయన మాట చెబితే అది వేదమే. ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. కొన్నివేల మంది ప్రజలకు ఇళ్లు కట్టించారు. కాంగ్రెస్ వంటి మహాసముద్రంలో ఓ మహానాయకుడిగా ఎదిగి.. పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకొని అద్భుత పథకాలు రూపొందించారు. ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివేలా చేశారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారు. తాను పార్టీకి బానిసను కాదని, ప్రజలకు బానిసని సోనియాను వ్యతిరేకించారు. ఆ తర్వాతే వైఎస్సార్ మరణం చెందారు. దాని వెనుక అనేక అనుమానులున్నాయి. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆయను ఆదరించి ముఖ్యమంత్రిని చేసుకుందా. మూడు పంటలు పండే చోట రాజధాని పేరుతో భూములు లాక్కున్నారు. తన బినామీలతో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ముందుగానే కొనుగోలు చేయించారు. రైతులను దారుణంగా మోసం చేశారు. అప్పులు పాలు చేశారు. చంద్రబాబుపై ఉన్న 11 కేసులు ప్రజలకు తెలియకుండా దాచారు. నీ దగ్గరున్న ఎంపీలు అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయారు. నీవెలా సత్య హరిశ్చంద్రుడివి అవుతావు చంద్రబాబు? వేల కోట్లు ఆస్తులు నీకెక్కడి నుంచి వచ్చాయి? బాబుకు ఓటేస్తే ఆయన అనుకూల మీడియా, భూకబ్జాదారులు బాగుపడుతారు. వాళ్లు మళ్లి ప్రజల రక్తం తాగుతారు. పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న డబ్బులు నీవా చంద్రబాబు? నాలుగేళ్లుగా పసుపు కుంకుమ గుర్తుకు రాలేదా? 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళగిరిలో మీ అందుబాటులో ఉండే రామకృష్ణారెడ్డిని, గుంటూరు ఎంపీగా మోదుగు వేణుగోపాల్‌రెడ్డిలను గెలిపించండి. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఏం లాభం లేదు.’ అని మోహన్‌బాబు ప్రజలను కోరారు. -
మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రచారం
-
మార్పు కావాలి...రావాలి!
సాక్షి, అమరావతి: మార్పు కావాలి. మార్పు తేవాలి. మార్పుతోనే ముందడుగేయాలి... ఇది జనాభిమతం. ఐదేళ్లుగా వెంటాడిన అనుభవాలు కళ్లముందు కదలాడుతుండగా.. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న భావావేశంలో ఎవరిని కదిపినా వినిపిస్తున్న భావోద్వేగమిది. ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా నాడిని పసిగట్టేందుకు రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ‘సాక్షి’ ‘రోడ్ షో’ చేపట్టింది. దారి పొడవునా సాగిన ఈ రాజకీయ చర్చలో రాష్ట్రంలో మార్పు చారిత్రక అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికార పార్టీ అక్రమాలపై ఉక్కుపాదం మోపి, ఐదేళ్లు న్యాయ పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ఓవైపు... ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ మరోవైపు ఇక్కడ బరిలో ఉన్నారు. స్థానిక అభ్యర్థులే కాదు... రాష్ట్రంలో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుందనే వాద ప్రతివాదాలూ స్థానికంగా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జనం మనసులో మాటేంటో నిర్మొహమాటంగా బయటపడుతోంది. నేతన్నను ఆదుకునేదెవరు? పాత మంగళగిరిలోని పద్మశాలి నగర్ సెంటర్లో ఓ సెలూన్ షాప్ దగ్గర జనం మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనే టిఫిన్ సెంటర్ నుంచి, అటుగా వెళ్తున్న మరికొందరితో అక్కడ క్షణాల్లో గుంపు పెరిగింది. ‘ఐదేళ్లవుతోంది. అప్పుల పాలయ్యామని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పలేదు. విన్నారా? కాలనీ సమస్యలు ఎన్ని చెప్పినా పట్టించుకున్నదెవరు? మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలి?’ నాగరాజు మాటల ఆవేశంతో తోకల బాలరాజు, కారంపూడి శ్రీనివాసరావు జోడీ కట్టారు. ‘ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ఇంకా నమ్మొద్దు పెద్దయ్యా. నేను ఎంటెక్ చదివాను. ఏదీ ఉద్యోగం...?’ జీరబోయిన స్వరంతో కారంపూడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. చేనేత సమస్యలు తీరుస్తానంటున్నాడు జగన్. ఉద్యోగాలిచ్చి తీరుతానంటున్నాడు. ఒక్క అవకాశం ఇద్దాం..’ అని తోకల బాలాజీ, దాసరి వినయ్‌తో పాటు పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. ఐటీ బాబొస్తే... అంతా పోతుందేమో! లక్ష్మీనర్సింహ స్వామి కాలనీలో అంతా పేదలే. ‘ఐదేళ్లు ఏం చేసిందయ్యా ఈ ప్రభుత్వం. చూడండి మా కాలనీ. ఏమాత్రమైనా బాగు చేశారా? పైగా అదిగో ఆ పక్క ఐటీ పార్క్ పెడతారట. ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన మా భూములూ లాక్కుంటారట. మేం కట్టుకున్న ఇళ్లూ కూల్చేస్తారట...’ రాజేశ్వరి, మంగతాయారు, సూర్యలక్ష్మి భయంతో అన్న మాటలివి. ఇక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడంటేనే తమకు భయమేస్తోందని వారు చెప్పారు. ‘వైసీపీ అభ్యర్థి ఆర్కేను గెలిపించుకున్నాం. ఎప్పుడైనా సమస్య చెప్పుకునే వీలుంది. లోకేష్ దగ్గరకు మేం వెళ్లగలమా?’ అని ప్రశ్నించాడు నీలి శ్రీకాంత్. ‘మేమీ కాలనీలో ఈ మాత్రం ఉన్నామంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. మళ్లీ అలాంటి మంచి రోజులు జగన్ వల్లే సాధ్యం’ అని పేరం నాగమణి చెప్పింది. పేదల ఆవాసాలున్న రత్నాల చెరువు, లక్ష్మీనర్సింహ కాలనీపై ప్రభుత్వం కన్ను పడిందట అని అక్కడి జనం నమ్ముతున్నారు. ఒక్క అవకాశమిద్దాం పెదవడ్లపూడి చౌరస్తాలో వృద్ధులు, యువకులు తాజా రాజకీయాలపై జోరుగా చర్చించుకోవడం కన్పించింది. రైతులే ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ అక్కడ చర్చను నిశితంగా పరిశీలిస్తే వాళ్లలో ఏదో తెలియని అసంతృప్తి. ‘పెద్ద దిక్కు అవుతాడని ఓట్లేశాం. ఏమైంది. ఏం పంటకు గిట్టుబాటు ధరొచ్చింది. మన పిల్లల్లో ఎవరికి ఉద్యోగాలొచ్చాయి. చంద్రబాబు అనుభవం ఏమైనట్టు?’ కోటా ప్రసాద్ నోటివెంట వచ్చిన మాటిది. ‘మార్పు తెస్తానంటున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’ అని పరిమినేని మహేష్ అన్నారు. రైతు కూలీ పిచ్చయ్య కూడా ‘ఈసారి మార్పు రావాల్సిందే’ అన్నాడు. ప్రజల గురించి పట్టించుకునే పార్టీ గెలవాలని వారు కోరుకుంటున్నారు. ఆ సత్తా జగన్‌కు ఉందనేది ప్రజాభిమతం అని వారు తెలిపారు. అందుబాటులోఉండాలి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ సమస్యయినా నేరుగా ఆయనకు చెప్పుకొనే పరిస్థితి ఉండాలి. మేం గెలిపించుకున్న నేత కోసం మేమే నిరీక్షించే దుస్థితిని కోరుకోవడం లేదు. –తోకల బాలాజీ, చిరు వ్యాపారి (మంగళగిరి) రాజన్న రాజ్యం వస్తుందనే ఆశ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎంతో అభిమానం. లక్ష్మీనర్సింహ కాలనీలో ఆయన హయాంలోనే పట్టాలొచ్చాయి. దీనికి కృతజ్ఞతగానే ఇక్కడ ప్రతిఒక్కరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పని చేశారు. దురదృష్టం కొద్దీ 2014లో జగన్‌ను గెలిపించుకోలేకపోయాం. ఈసారి మాత్రం జనానికి మంచి జరిగే ప్రభుత్వం వస్తుందని, రావాలని కోరుకుంటున్నాం. జనం కోరుకునే మార్పు సాధ్యమనే భావిస్తున్నాం. – పేరం నాగమణి, లక్ష్మీనర్సింహ కాలనీ ఉద్యోగం... ఉపాధి ఇచ్చే సర్కారు కావాలి ఎంటెక్ చదివా. కాళ్లరిగేలా తిరిగినా ఐదేళ్లుగా ఉద్యోగం రాలేదు. చూస్తుంటే ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మమ్మల్ని బతికిస్తున్నాయి. అధికారంలోకి వస్తుందని, మాలాంటి నిరుద్యోగులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఆ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. – దాసరి వినయ్, ఎంటెక్ విద్యార్థి -
అన్న వస్తున్నాడు...
సాక్షి, మంగళగిరి : అన్న వస్తున్నాడు! నవరత్నాలతో రాష్ట్ర గతిని మార్చనున్నాడు. పేదవాడి ఇంటికి సంక్షేమాన్ని చేర్చనున్నాడు. రాజన్న రాజ్యాన్ని నెలకొల్పి చదువుల విప్లవానికి నాంది పలకనున్నాడు. అవును ఇప్పుడు నియోజకవర్గంలో వినిపిస్తున్న మాటలు ఇవి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పట్టణంలోని అంజుమన్ షాదిఖానా పక్కన మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పార్టీ కార్యాలయం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా కార్యాలయానికి వచ్చిన యువకులు వాటిని చూసి తాము విషయాలను తెలుసుకోవడంతో పాటు పదిమందికీ వివరిస్తున్నారు. -
బడుగు బలహీనవర్గాల వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది
-
లోకేష్‌కు మంగళగిరి హద్దులు తెలుసా?
-
ఎన్నికలయ్యే వరకు డీజీపీని తొలగించండి
సాక్షి, అమరావతి: డీజీపీ ఆర్.పి.ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఆయన డీజీపీగా కొనసాగితే సామాన్యులు సజావుగా ఓటు హక్కును వినియోగించుకోలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలయ్యే వరకు ఠాకూర్‌ను డీజీపీ విధుల నుంచి తప్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో దివ్వేదిని కలిసి పలు ఆధారాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. హైదరాబాద్‌లో ఒక పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయన్ని డీజీపీగా సీఎం నియమించారని, ఈ పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే ఇది ఆ పార్టీ సానుభూతిపరులే ప్రచారం కోసం చేశారంటూ ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఒక పార్టీ కార్యకర్తలాగా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఠాకూర్ హయాంలో ఎన్నికలు ప్రజాస్వామికంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని, ఎన్నికలయ్యేంత వరకు ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్నారు. నిబంధనావళికి విరుద్ధంగా విధుల్లో ఖాకీలు..: కాగా, ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా విధుల్లో ఉన్న కొందరు పోలీసు అధికారులపై అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం ద్వివేదికి ఫిర్యాదు చేసింది. ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళి, ఏలూరు రూరల్ సీఐ వైవీ లచ్చునాయుడు, నందిగామ రూరల్ ఏఎస్ఐ నూతలపాటి నాగేశ్వరరావు, కోడూరు ఎస్ఐ ఎస్.ప్రియకుమార్, ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్స్ శివనాగరాజు, ఎస్ చిరంజీవిరావు, పి.హరిబాబులపై క్రిమినల్ స్వభావం, అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఇలా కేసుల్లో ఉన్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని నిబంధనలు స్పష్టం చేస్తుండటంతో వీరిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కోటంరాజు వెంకటేష్‌శర్మ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై ఈసీకి ఫిర్యాదు
-
డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి : ఎన్నికలు పూర్తయ్యే వరకు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదికి విఙ్ఞప్తి చేశారు. ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు. అనంతరం రామకృష్ణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ‘ ఠాకూర్ డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరు. ఆయనపై నేను వేసిన పిల్ పెండింగ్‌లో ఉండగానే సీఎం.. ఠాకూర్‌ను డీజీపీగా నియమించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి సమయంలోనూ సానుభూతి కోసం దాడి చేయించుకున్నారంటూ డీజీపీ చెప్పారు. ఈ విషయాన్ని కూడా ఈసీ ఫిర్యాదులో పేర్కొన్నా’ అని వ్యాఖ్యానించారు. ఏపీ డీజీపీ పార్కు ఆక్రమణ నిజమే! జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని డీజీపీ ఠాకూర్ ఆక్రమించుకుని ఇల్లు నిర్మించి... అఖిల భారత సర్వీస్ అధికారుల రూల్స్‌ను అతిక్రమించారని రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. కాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్‌నగర్‌లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీకి శాశ్వత సమాధి తప్పదు
ఆత్మకూరు (మంగళగిరి): ఇచ్చిన మాట మీద నిలబడినందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కుట్రలు పన్ని చంద్రబాబు, సోనియా గాంధీ జైలు పాలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది గుండెలు ఆగాయని, వారి కుటుంబాలను పరామర్శించి ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని వైఎస్ జగన్ పావురాలగుట్టలో మాట ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ తొమ్మిదేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, సోనియా గాంధీ కుట్రలో భాగంగానే తాము జగన్‌పై కేసులు వేశామని శంకర్రావు, ఎర్రన్నాయుడు చెప్పిన విషయం ప్రజలందరికీ తెలుసని ఆర్కే అన్నారు. అయినా కేసులను లెక్క చేయకుండా వైఎస్ జగన్ ప్రజలతో గడుపుతున్నారని కొనియాడారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేని చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబుకు, టీడీపీకి రానున్న ఎన్నికల్లో శ్వాశ్వత సమాధి తప్పదని హెచ్చరించారు. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎందాకైనా వెళ్లే వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నవ వసంతంలోకి అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో రెండు నెలల్లో అధికారంలోకి రావడం తధ్యమన్నారు. -
చంద్రబాబు అండతోనే డీజీపీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండదండలతోనే రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి, అక్రమాలకు వత్తాసు పలుకుతున్నందునే.. ప్రతిగా డీజీపీ అక్రమాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లల పార్కు ఆక్రమణపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ డీజీపీ ఠాకూర్ ఇంకా పదవిలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఓ రైతు తెలియక భవనం నిర్మిస్తే సీఆర్డీఏ అధికారులు ఆ నిర్మాణాన్ని తొలగించారని.. అయితే డీజీపీ ఠాకూర్ మాత్రం హైదరాబాద్‌లో పిల్లల పార్కును ఆక్రమించి మరీ భవనాన్ని నిర్మించారని తెలిపారు. సీఎం చంద్రబాబు కరకట్టలను ఆక్రమించి నిర్మించిన భవనంలో ఉండగా, తాను పిల్లల పార్కును ఆక్రమించడంలో తప్పేముందని డీజీపీ భావించినట్లున్నారని ఎద్దేవా చేశారు. రాష్టంలో ఎంతో మంది సమర్థులైన పోలీసు అధికారులు ఉండగా ఠాకూర్‌ను డీజీపీగా, ఏసీబీ డీజీగా జోడు పదవుల్లో కొనసాగించడం వెనుక మర్మమేమిటని చంద్రబాబును నిలదీశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై విచారణ కూడా మొదలుకాక ముందే అది సానుభూతి కోసమే చేశారంటూ డీజీపీ ఠాకూర్ ప్రకటించడం కేసు నుంచి సీఎం చంద్రబాబును కాపాడేందుకేనని స్పష్టం చేశారు డీజీపీ నిర్మించిన అక్రమ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి సేకరించారన్న వాస్తవాలను త్వరలో బయటపెడతానని ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు మంగళగిరి పోలీస్ స్టేషన్లో 2014 నుంచి 2019 వరకు పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను డీజీపీ ఠాకూర్ వేధిస్తూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. డీజీపీ ఠాకూర్ అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే ఆళ్ల ప్రకటించారు. డీజీపీ ఠాకూర్ అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రులకు ఫిర్యాదు చేస్తానని ఆయనకు శిక్షపడే వరకూ విశ్రమించబోనని తేల్చిచెప్పారు. తాజా రాజకీయ పరిణామాలపై విలేకరుల అడిగిన ప్రశ్నలపై ఎమ్మెల్యే ఆర్కే స్పందిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి తాను సహా పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉంటామన్నారు. -
డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలి?
-
డీజీపీయే కబ్జాలు చేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్ : చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకబ్జాలకు పాల్పడితే ఎలా?.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమంగా హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణరెడ్డి పార్టీ కేంద్రకార్యలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ డీజీపీ ఇంటి అక్రమనిర్మాణంపై హైకోర్టు తీర్పును వైఎస్సార్సీపీ స్వాగతిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు అండగా ఉన్నారని ఠాకుర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2010లో డీజీపీ ఠాకుర్ ప్లాన్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని, జీహెచ్ఎంసీ పర్మిషన్ రాకున్నా ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు. అక్రమ నిర్మాణ నిర్మించడమే కాకుండా పార్క్ స్థలాన్ని కూడా ఆక్రమించారన్నారు. భారీ ఇంటి నిర్మాణ చేపట్టిన డీజీపీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ నిర్మాణం విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులను డీజీపీ ఉల్లంఘించారన్నారు. డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. పసిపిల్లలు ఆడుకునే పార్క్‌ను కూడా అడ్డంగా కబ్జా చేస్తారా? అని నిలదీశారు. న్యాయాన్ని కాపాడుకునేందుకు మేం కోర్టుకు వెళ్లామని, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఓ డీజీపీగా ఠాకుర్ ఉందా లేదా? అని ప్రశ్నించారు. అవినీతి చేస్తూ చట్టాలను కాపాడతామని అబద్ధాలు చెబుతున్నారని, పోలీస్ బాస్ అయితే ఆక్రమణలు చెల్లుతాయా? అని మండిపడ్డారు. ఇక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్‌నగర్‌లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. -
ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు
-
ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయవల్సిందిగా ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు తొలగించుకున్నామని డీజీపీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇంటి నిర్మాణం కూడా అక్రమమే అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వివరణ కోరింది. దీంతో రెండు వారాల సమయం కావాలని డీజీపీ ఠాకూర్ తరపున న్యాయవాది కోరారు. అయితే సమయం ఇవ్వడం కుదరదన్న న్యాయస్థానం.. ఈ నెల 11వరకు ఇంటి అక్రమ నిర్మాణంపై కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. చదవండి : ఏపీ డీజీపీ పార్క్ భూమిని ఆక్రమించుకున్నారు -
అధికారులు స్పందించకపోవటం దురదృష్టకరం
-
చంద్రబాబు తప్పుదారి పట్టించారు: ఆర్కే
సాక్షి, హైదరాబాద్ : ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం చంద్రబాబు ఎగతాళి చేశారని, ఏపీ డీజీపీకి కనీస పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడి చేసి ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూశారన్నారు. సీఎం, డీజీపీ కలిసి కేసును నీరుకార్చే ప్రయత్నం చేశారని ఆర్కే తెలిపారు. 12.30 గంటలకు హత్యాయత్నం జరిగితే సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదన్నారు. డీజీపీ చేసిన తప్పులు ఎన్ఐఏ ముందు ఉంచుతామని ఆర్కే చెప్పారు. విచారణ చేయకముందే, కథను అల్లి డీజీపీ చెప్పడం వెనక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. హత్యాయత్నం వెనక ఉన్నవాళ్లను ఎన్ఐఏ ముందు నిలబెడతామని తెలిపారు. నిందితులకు శిక్షలు పడితీరుతాయని, ఎన్ఐఏ సుమోటోగా తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. -
కేసును నీరుకార్చే ప్రయత్నం చేశారు
-
‘చట్టం తెలియకపోతే డీజీపీ పోస్టుకి అనర్హులు’
విజయవాడ: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఏపీ డీజీపీ, అడ్వోకేట్ జనరల్ వ్యవహారించిన తీరును మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) తప్పుపట్టారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని, అడ్వేకోట్ జనరల్ వ్యాఖ్యల్ని కూడా హైకోర్టు తప్పుబట్టిందని వెల్లడించారు. మీరు(అడ్వోకేట్ జనరల్) ప్రభుత్వ నాయవాది కానీ చంద్రబాబుకు న్యాయవాది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేలా అడ్వోకేట్ జనరల్ మాట్లాడారని అన్నారు. మీకు ఇచ్చే జీతం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచేనని తెలుసుకోవాలని చెప్పారు. ఎన్ఐఏ యాక్ట్, సివిల్ ఏవియేషన్ స్పష్టంగా చెబుతున్నా డీజీపీ ఎందుకు ఫాలో కావడం లేదని సూటిగా అడిగారు. మీకు చట్టం తెలియకపోతే డీజీపీ పోస్టుకి అనర్హులు అని వ్యాఖ్యానించారు. హత్యాయత్నం తప్పుదారి పట్టించడమే మీ ఉద్దేశమా అని సూటిగా ప్రశ్నించారు. పోలీసు మాన్యువల్ స్పష్టంగా ఉంది.. డీజీపీకి తెలియదా అని అడిగారు. తాను డీజీపీపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుపై ఎలా స్పందించారని అన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే డీజీపీ వ్యవహరించారని ఆరోపించారు. కేసు ఎన్ఐఏ పరిధిలోకి వెళితే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టు కూడా ఈ విషయమై స్పష్టంగా వ్యాఖ్యానించిందని తెలిపారు. కేసు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్తే ప్రత్యేక కోర్టు విచారణ చేస్తుందని, అప్పుడు అన్ని విషయాలు బయటికి వస్తాయని వ్యాక్యానించారు. నిందితుడు శ్రీనివాసరావుని మట్టుబెట్టడానికి కూడా టీడీపీ నేతలు ప్రయత్నించే అవకాశముందన్నారు. చట్టాలను అతిక్రమించి కేసు రాష్ట్ర పరిధిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు..కానీ కచ్చితంగా ఎన్ఐఏ పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. ఈ కేసును సుమోటోగా కూడా కేంద్రం తీసుకుని దర్యాప్తు చేయవచ్చునని హైకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని వెల్లడించారు. -
‘ఎంపీటీసీ, సర్పంచ్ ఓట్లను కూడా గల్లంతు చేశారు’
సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లను టీడీపీ నేతలు గల్లంతు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ ఓట్లను కూడా గల్లంతు చేయడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆర్కే సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో ప్రభుత్వమే ఓట్ల గల్లంతు కార్యక్రమం చేపట్టిందని ఆర్కే ధ్వజమెత్తారు. -
అమరావతిలో అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని లంక, అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ పర్యటించింది. ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నేతలు కిలారి రోశయ్య, నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసైన్డ్ భూములున్న రైతుల సమస్యలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. లంక, అసైన్డ్ భూముల ప్యాకేజీ విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటూ కమిటీ సభ్యుల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.2500 కూడా సరిగా ఇవ్వడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని రైతులు, రైతు కూలీలు కమిటీ ఎదుట మొరపెట్టుకున్నారు. -
ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
ఓటుకు కోట్లు కేసు: ఫిబ్రవరి నుండి పూర్తిస్తాయి విచారణ
-
ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ వాదించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని సిద్దార్థ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ మదన్‌బీ లోకూర్.. ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం : ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్లు కేసులో సత్వర విచారణ కోసం తాను చేసిన విఙ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నాయని, విచారణను వాయిదా వేయాలన్న చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్దార్థ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చిందని తెలిపారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. -
ఎవరొచ్చినా జరుగుతుంటాయి
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉంటాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వీటిని ప్రోత్సహించబోమంటూ చెప్పేవన్నీ ఉత్త మాటలేనంది. రాజ్యాంగం అంటే గౌరవం లేని వారే అధిక సంఖ్యలో చట్టసభలకు వస్తున్నారని వ్యాఖ్యానించింది. వైఎస్సార్ సీపీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని వాదనల సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నివేదించారు. తెలంగాణలో కూడా ఇలాంటి అంశానికి సంబంధించి తమ ముందు దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు ఓ రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఫిరాయింపుదారులకు మరోసారి నోటీసులు... వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 18 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు హైకోర్టు గురువారం మరోసారి నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులకు కూడా హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు ఈ ఏడాది మార్చి 13న హైకోర్టు గతంలో నోటీసులిచ్చింది. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురిని ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. దీనికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో ఫిరాయింపుదారులైన బుడ్డా రాజశేఖరరెడ్డి, అత్తారు చాంద్‌బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కిడారి సరేశ్వరరావు, కలమట వెంకటరమణ, ఎం.మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, టి.జయరాములు, జ్యోతుల నెహ్రూ, పాశం సునీల్‌కుమార్, వి.సుబ్బారావు, ఎస్.వి.మోహన్‌రెడ్డి, పోతుల రామారావు, ఎం.అశోక్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, వి.రాజేశ్వరిలతో పాటు మంత్రులుగా కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ, రావు వెంకట సుజయకృష్ణ రంగారావులకు ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. -
నాపై కుట్ర పన్ని కక్ష సాధిస్తున్నారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలో సాగిస్తున్న విచ్చలవిడి అవినీతిని, ప్రజాధనం లూటీని అడ్డుకుంటున్నందుకే నాపై కుట్ర పన్ని కక్ష సాధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కె) ఆరోపించారు. చంద్రబాబు, తన పోలీసులు, ఏబీఎన్ రాధాకృష్ణతో సాగిస్తున్న దుష్ప్రచారానికి, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సాక్షిగా విచారణకు హాజరైన అనంతరం విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీబీ కేసులో ఆర్కె అంటూ టీడీపీ అనుకూల, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతుందని చెప్పారు. గతంలో తనను పిలిచినప్పుడు కంటికి ఆపరేషన్ చేయడంతో.. ఇప్పుడు హాజరయ్యానని తెలిపారు. విచారణలో దుర్గాప్రసాద్ నీకు తెలుసా? ఆయన వద్ద నుంచి భూములు కొన్నావా? అని మాత్రమే అడిగారని చెప్పారు. గుంటూరులో దుర్గాప్రసాద్ అనే స్నేహితుడు నుంచి తాను చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దుర్గాప్రసాద్‌పై ఏడాదిన్నర క్రితం దాడులు జరిగితే తనను ఇప్పుడు పిలవడం కక్ష సాధింపులో భాగం కాదా అని ప్రశ్నించారు. పోలీసులు ప్రకటించే అధికారికపత్రంలో ఎక్కడా తన ప్రస్తావన లేదని, ఏదో విధంగా ఇరికించాలనే కుట్రతో.. తనకు దుర్గాప్రసాద్ స్నేహితుడు కాబట్టి తాను గతంలో ఆస్తులు కొన్న సమాచారం తెలుసుకుని, చంద్రబాబు ప్రోద్భలంతో సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షిగా మాత్రమే పిలిచారన్నారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..: నా పేరుపై కొంటే నా భార్య పేరు మీద అని రాస్తున్నారని, సోషల్ మీడియా, ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్కె చెప్పారు. ఏబీఎన్ రాధాకృష్ణ తాను ప్రచారం చేసింది తప్పేనని ఒప్పుకుంటే చాలని హితవు పలికారు. ఒకవేళ వారు రాసింది నిజం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని..అందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. బాబు పాలనలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం: చంద్రబాబు గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను విచ్చలవిడిగా దోచుకుంటున్న విషయాన్ని తాను రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని ఆర్కె తెలిపారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి దర్యాప్తు ఆపించుకున్న నేపథ్యంలో తాను సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఐదుసార్లు లిస్ట్ అయి విచారణకు స్వీకరించారని తెలిపారు. ఆ రోజు నుంచి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని, న్యాయాన్ని కాపాడేందుకు నేను చేస్తున్న ప్రయత్నం వారికి నచ్చడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కటకటాల్లోకి పంపేవరకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది కేసుల మాఫీ కోసమేనని విమర్శించారు. సదావర్తి భూముల దోపిడీని అడ్డుకున్నా: అమరావతి దేవస్థానం కోసం వాసిరెడ్డి వంశస్థులు దానంగా ఇచ్చిన సదావర్తి భూములపై మంత్రి లోకేష్ కన్ను పడిందని ఆర్కె తెలిపారు. తన బినామీలతో కాజేయాలని చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వందల కోట్ల రూపాయలను కాపాడానని చెప్పారు. రాజధానిలో అన్యాయంగా రైతుల భూములను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటుంటే.. తాను అడ్డుపడ్డానని, పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయ్యాక చాలా ఆస్తులు అమ్ముకుని మంగళగిరిలో అద్దె ఇంట్లో ఉంటున్నాని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు, ఆయన కుమారుడి ఆస్తులపై విచారణకు సిద్ధమేనా అని ఆర్కె సవాల్ విసిరారు. పరువు నష్టం దావా వేసినందుకే: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు రాసి దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేసినందుకే తనపై రాధాకృష్ణ విషం కక్కుతున్నాడని ఆర్కె విమర్శించారు. దుర్గాప్రసాద్ ఆస్తులు తేలకముందే... పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై 2017 జనవరిలో అక్రమాస్తులు కలిగి ఉన్నాడని దాడులు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ చార్జిషీట్ వెయ్యలేదు. ఓవైపు దుర్గాప్రసాద్ ఆస్తుల వివరాలు తేలకముందే అతని వద్ద 2006లో ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే భూములు కొనుగోలు చేశారని, ఆయన్ను పిలిచి విచారించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాప్రసాద్ వద్ద 2006లోనే ఆర్కె భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2017లో దుర్గాప్రసాద్‌పై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో దాడులు చేసినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి భూములు అమ్మిన పత్రాలూ లభించలేదు. అయినా సరే ఓ దినపత్రికకు లీకులిచ్చి రామకృష్ణారెడ్డిని సీఆర్పీసీ 160 కింద పోలీసులు పిలిపించి విచారించడం దారుణమని పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓవైపు పోలీసు అధికారి ఆస్తులే నిరూపణ కాకపోతే, అధికారికంగా డబ్బు చెల్లించి భూమి కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎమ్మెల్యేను విచారణకు పిలిపించడం కేవలం కుట్రలో భాగమేనని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఆర్కే హాజరు గడువు పెంచిన ఏసీబీ
సాక్షి, విజయవాడ : మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికు ఓ కేసులో సాక్షిగా హాజరుకావాలని ఏసీబీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 22న ఆర్కే ఏసీబీ ఎదుట హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని పిటిషన్ ద్వారా ఏసీబీకి నివేదించామని ఆర్కే తరుఫు న్యాయవాదులు సుధాకర్ రెడ్డి, మన్మధ రావులు తెలిపారు. దీంతో 29వ తేదీన ఆర్కే హాజరుకావాలంటూ తిరిగి ఏసీబీ అధికారులు గడువు ఇచ్చారన్నారు. కానీ ఆరోగ్యం మెరుగుపడక పోవడం వల్ల ఈ రోజు కూడా హాజరుకాలేకపోతున్నట్లు న్యాయవాదుల ద్వారా ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చే నెల 5వ తేదీన హాజరు కావాలని వాయిదా వేశారు. -
ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తుకు వచ్చాడా?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు కొత్త పద్ధతిలో ప్రజలను దోచుకోవటం ప్రారంభించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. అందుకోసం అన్నా క్యాంటీన్లను తెరపైకి తెచ్చారని ఆయన మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి విధానాలను ఎండగట్టారు. ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? ‘2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చి 630 హామీల్లో అన్నా క్యాంటీన్ ఒకటి. నాలుగేళ్లుగా ఏ ఒక్క హామీ నెరవేర్చని బాబు.. ఇప్పుడు హడావుడిగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ పేరు వినబడకూడదనే ఇన్నాళ్లు ఆ అంశాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు ఎన్నికల వేళ అన్నా క్యాంటీన్ అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. కానీ, ప్రజలు మాత్రం వాటిని ‘అల్లుడి క్యాంటీన్లు’గానే భావిస్తున్నారు’ అని ఆర్కే ఎద్దేవా చేశారు. చంద్రబాబు,ఆయన తనయుడు లోకేశ్‌లు అన్నా క్యాంటీన్ల ద్వారా పెద్ద ఎత్తున్న దోపిడీకి తెరలేపారని ఆర్కే వివరించారు. ‘సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలను అన్న క్యాంటీన్లకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 163 క్యాంటీన్లకిగానూ రూ. 59 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. అంటే ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ. 36 లక్షలు అన్నమాట. ఆ లెక్కన్న నిర్మాణం కోసం చదరపు అడుగుకి రూ. ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు. చివరకు పేదవాడికి అన్నం పెట్టే విషయంలో కూడా అవినీతి చేయాలని చూస్తున్నారు అని చంద్రబాబుపై ఆర్కే మండిపడ్డారు. నారాయణ ఆ విషయాన్ని గ్రహించాలి... ‘ఈ అవినీతి ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ మీ అవినీతి ప్రభుత్వాన్ని అస్సలు వదిలి పెట్టదు. వైఎస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకొని పేదలకు ఎంతో కొంత మేలు చెయ్యండి. లేకుంటే ప్రజలు శాశ్వతంగా మర్చిపోతారు’ అని చంద్రబాబుకి ఆర్కే సూచించారు. ఇక నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో ఒక్క క్యాంటీన్ అయిన ప్రారంభిస్తారని చూశానన్న ఆయన.. గతేడాది తానే స్వయంగా రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు-లోకేష్ కలిసి అన్న క్యాంటీన్ల పేరుతో మంత్రి నారాయణని ఇరికించాలని చూస్తున్నారని.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని నారాయణకు ఆర్కే సూచించారు. చంద్రబాటు కుటుంబమే ఇంకా రాలేదు... చంద్రబాబు కుటుంబమే ఇంకా రాజధానికి రాలేదన్న విషయాన్ని ప్రస్తావించిన ఆర్కే.. రాజధానిలో బాబు ఇల్లు కట్టుకోలేదని తెలిపారు. ‘ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు రాజధానికి వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. దోపిడీని కేంద్రం ప్రశ్నించడానికి సిద్ధం అయిన తరుణంలో చంద్రబాబు ప్రజల రక్షణ కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నపుడు చంద్రబాబుకి గవర్నర్ వ్యవస్థ మంచిగా కనిపించిందని, చివరకు వైసీపీ ఎమ్మెల్యేలని మంత్రి చేసినప్పుడు కూడా ఆయనకు గవర్నర్ వ్యవస్థపై మంచిగానే కనిపించిందని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ను చేస్తానంటూ తెలంగాణలో ఒక దళితుణ్ణి చంద్రబాబు మోసం చేశారని ఆర్కే తెలిపారు. -
ఫిరాయింపుదారులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ టికెట్‌తో గెలుపొంది అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపుదారులపై తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత వారం దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు న్యాయ, శాసన వ్యవహారాలశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శిలకు కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అమ్ముడుపోయామని స్వయంగా చెబుతున్నారు... అధికార పార్టీ నేతలు తమకు డబ్బులు, పదవుల ఆశ చూపినట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొందరు బహిరంగంగానే చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధర్మాసనానికి నివేదించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ‘నిస్సంకోచంగా అడ్డుకట్టవేయాల్సిందే. అయితే మీ పార్టీ గతంలో ఎప్పుడూ ఫిరాయింపులకు పాల్పడలేదా?’ అని ప్రశ్నించింది. వైఎస్సార్ సీపీ 2014 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను గెలిచిందని, ఇప్పటి వరకు ఫిరాయింపులకు పాల్పడటంగానీ ప్రోత్సహించడం గానీ చేయలేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తమ పార్టీలోకి టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి వచ్చారని, ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేసిన తరువాతే పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. తమ పార్టీ విలువలు ఉన్న పార్టీ అని తెలిపారు. స్పీకర్ తన విధులను నిర్వర్తించకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్యని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఎప్పటికప్పుడు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నా ఇప్పటివరకూ స్పందించ లేదన్నారు. స్పీకర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు తప్పనిసరిగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని, అయితే సభాపతి వైపు నుంచి వాదనలు వినకుండా నేరుగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు ఇస్తామని, అందరి వాదనలు విన్నాక తగిన ఉత్తర్వులు ఇస్తామంది. పార్టీ ఫిరాయించిన ఎంపీల పేర్లను ఈ పిటిషన్ నుంచి తొలగించి అనుబంధ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించగా పిటిషనర్ తరపు న్యాయవాది అందుకు అంగీకరించారు. ‘గతంలో చంద్రబాబు తరఫున హాజరైనందున ఈ కేసును విచారించలేను’.. సీఎం చంద్రబాబే స్వయంగా వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ను ప్రలోభ పెట్టి టీడీపీలోకి ఫిరాయించేలా చేస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయనపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో వ్యాజ్యాన్ని కూడా మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. పశ్చిమ గోదావరి జిల్లా విద్యానగర్‌కు చెందిన వీర్ల సతీష్ కుమార్ దీన్ని దాఖలు చేయటం తెలిసిందే. అయితే ఈ వ్యాజ్యంలో చంద్రబాబు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉండటాన్ని గమనించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దీన్ని విచారించేందుకు నిరాకరించారు. గతంలో తాను చంద్రబాబు తరపున వాదనలు వినిపించానని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించడం నైతికంగా భావ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా చంద్రబాబు ప్రతివాదిగా ఉన్నారా? అని ఈ సందర్భంగా ఏసీజే ఆరా తీశారు. ఆ వ్యాజ్యంలో చంద్రబాబు ప్రతివాది కారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఒకవేళ కావాలంటే ఆ వ్యాజ్యాన్ని కూడా మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని ఏసీజే చెప్పారు. -
సర్వేలు బూటకం.. కమిటీలు ఓ నాటకం
మంగళగిరి టౌన్: అభిప్రాయ సేకరణకు వచ్చిన నిపుణుల కమిటీపై రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. మీ సర్వేలన్నీ బూటకమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో వేసిన నిఫుణుల కమిటీ.. తమకేమి ప్రయోజనం చేకూరుస్తుందని నిలదీశారు. తక్షణమే గ్రామం నుంచి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. దీంతో నిడమర్రు గ్రామంలో అభిప్రాయసేకరణకు వచ్చిన నిపుణుల కమిటీ వెనుతిరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నిడమర్రు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు నిఫుణుల కమిటీ గురువారం గ్రామానికి వచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా గ్రామంలోకి రావడంతో పాటు కమిటీ నివేదిక సమర్పించేందుకు సమయం పది రోజులే ఉందని తెలియడంతో రైతులు నిపుణుల కమిటీపై మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సర్వేలు చేయడమే కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగులతో నిపుణుల కమిటీని నియమించి రైతులకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. ఎక్స్పర్ట్ కమిటీ అర్థమేమిటో చెప్పాలని, అందులో ఎవరుంటారో వివరించాలని డిమాండ్ చేశారు. నిపుణులైన రైతులు లేకుండా కేవలం ఉద్యోగులతోనే కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. రైతుల ప్రశ్నలతో కమిటీ సభ్యులు మిన్నకుండిపోయారు. గతంలో గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఏ సర్వేనే ఒక తప్పుల తడకగా ఉందని, దాని ఆధారంగా అభిప్రాయాలు ఎలా సేకరిస్తారని రైతులు ప్రశ్నించడంతో.. కమిటీ సభ్యులు చివరకు అక్కడ్నుంచి వెనుతిరిగారు. వైఎస్సార్సీపీ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజధానిలో బూటకపు సర్వేలు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం.. వాటిని అమలుపర్చేందుకు నాటక కమిటీలను రంగంలోకి దించిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి కమిటీల వల్ల అన్నదాతలకు ఎలాంటి న్యాయం జరగదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే మళ్లీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. అలాగే నిఫుణుల కమిటీలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, నాన్ అఫీషియల్స్‌ను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులకే న్యాయం చేయలేదు.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకే ప్రభుత్వం ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడేమో మా భూములు కాజేసేందుకు తప్పుడు సర్వేలు, తప్పుడు రిపోర్టులు ఇస్తుండటం దారుణం. – వల్లభాపురపు శ్రీనివాసరావు, రైతు తీసుకున్న భూముల్లో ఏం వెలగబెట్టారు? రైతులను బెదిరించి తీసుకున్న భూముల్లో ఇప్పటివరకు ఏం వెలగబెట్టారు? జరీ భూముల్లో ఏం నిర్మిస్తారో ప్రభుత్వం ముందే చెప్పాలి. చట్టాలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. – ఎం.శివరామ్, రైతు -
చంద్రబాబు టార్గెట్ అదే..!
సాక్షి, విజయవాడ : పేదల భూములు కొట్టేసి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బెదిరించి 33 వేల ఎకరాల భూమిని లాక్కుని రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చాలా చోట్ల రికార్డులు తారుమారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘2017ను టీడీపీ భూకబ్జాల సంవత్సరం’గా అభివర్ణించారు. హుద్‌హుద్‌లో భూరికార్డులు హుష్‌కాకి.. : ‘‘రైతులు, కూలీలను ద్వేషించే చంద్రబాబు నాయుడు.. హుద్‌హుద్ తుఫాను తర్వాత రెవెన్యూ రికార్డులను మాయం చేసి, విశాఖ జిల్లాలో లక్షల ఎకరాలను కాజేశారు. ఆ కుంభకోణంపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని రైతులను బెదిరించి 33 వేల ఎకరాలను కాజేశారు. దాంతో లక్షల మంది రైతు కూలీలు, కౌలు రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కోర్టులు మొట్టికాయలు వేసినా టీడీపీ సర్కారు తీరు మారలేదు. గడిచిన మూడున్నరేళ్లలో వేలమంది రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయే తప్ప రాజధానిలో శాశ్వత నిర్మాణమంటూ ఒక్కటీ జరగలేదు. అసలు రాజధానిని కట్టాలన్న ఆలోచనే చంద్రబాబుకు లేదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభను నడిపడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించిన ఆర్కే.. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసేందుకు బాబు విఫలయత్నం చేశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రైతుల పొట్టకొట్టే విధానాలకు చంద్రబాబు స్వస్తిపలకాలని హితవుచెప్పారు. -
ఉండవల్లిలో అధికారుల అత్యుత్సాహం
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా ఉండవల్లిలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పీడబ్ల్యూడీ వర్క్ షాపు ఉన్న వద్ద ఇళ్లను ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధం అయ్యారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో తమకు ప్రత్యామ్నయం చూపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితుల ఆందోళనుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇళ్లను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం, రూ.5 లక్షల నగదు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయండి..
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ పిటిషన్ ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు బుధవారం పిటిషన్‌ను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ...‘ వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యే ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలి. చంద్రబాబు నాయుడు పోలవంరం నుంచి రాజధాని వరకూ అన్నింటా అవినీతి చేస్తూ దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. 23మందిపై అనర్హత పిటిషన్ ఇచ్చాం, స్పీకర్ చర్యలు తీసుకోవాలి. రాజ్యసభలో ఒక ఎంపీ వేరో పార్టీ ర్యాలీలో పాల్గొంటేనే చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ స్వయంగా చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదు. అసెంబ్లీ స్పీకర్ ధృతరాష్ట్రుడిలా పాలిస్తున్నారు. అన్ని పక్షాలను సమంతరంగా చూడాల్సిన స్పీకర్ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారు. తక్షణమే గిడ్డి ఈశ్వరితో సహా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
‘ఓటుకు కోట్లు’లో చంద్రబాబుకు పాత్ర
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నా తెలంగాణ ఏసీబీ అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమవడమే కాకుండా తదుపరి దర్యాప్తును ఆపేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు ఓ ప్రజాహిత వ్యాజ్యంలో నివేదించారు. కేసులో అత్యంత ప్రభావశీలురు నిందితులుగా ఉన్నందున దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రధాన పిటిషన్‌కు జత చేసి రెండూ కలిపి విచారిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యే ఆళ్ల తరఫున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, టి.విజయ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం దృష్టికి నివేదించారు. ఈ పిటిషన్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీ(ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి, బిషప్ హారీ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేంలను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి అప్పగించేలా ఆదేశించండి. ఓటుకు కోట్లు కేసును దర్యాప్తు చేయడంలో ఏసీబీ విఫలమైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న నిందితుడు ఒక ఎమ్మెల్యే. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి. వీరిద్దరూ ప్రభావశీలురు. తెలంగాణ ఏసీబీని ప్రభావితం చేయగలిగిన వారు. దర్యాప్తు తొలిరోజుల్లో ఈ కేసులో అనేక సాక్ష్యాలు దొరికినా ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తదుపరి చార్జ్‌షీట్‌లో చేర్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేసును దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు రాష్ట్రాల్లో పలుకుబడి కలిగిన ఈ నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది. మరోవైపు నిందితులు సాక్ష్యాధారాలను లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉంది..’అని పిటిషన్లో పేర్కొన్నారు. క్రిమినల్ అప్పీలుతో జత చేసిన ధర్మాసనం ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలు పిటిషన్‌ను లోతుగా విచారిస్తామని 06.03.2017న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజా రిట్ పిటిషన్‌ను ఈ క్రిమినల్ అప్పీలు పిటిషన్‌కు జత చేస్తూ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని పేర్కొంది. న్యాయానికి అండగా సుప్రీంకోర్టు: ఎమ్మెల్యే ఆర్కే సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు దర్యా ప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు న్యాయానికి, ధర్మానికి అండగా నిలిచిందని ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఆర్కే మీడియా తో మాట్లాడారు. ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏవిధంగా అడ్డంగా దొరికిపోయారో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్ లో మాట్లాడింది సీఎం చంద్రబాబే అని, ఆ ఫోన్‌ను లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ నుంచి వినియోగించారని లొకేషన్‌తో సహా ఏసీబీ అప్పట్లో నిర్ధా రించింది. ఈ విషయం ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిందని ఏసీబీ వెల్లడించింది. ఎవిడెన్స్ యాక్ట్–1872లోని సెక్షన్(10) ప్రకా రం కేసు విచారణకు ఈ సాక్ష్యాలు సరిపోతాయి. అయితే చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం ఈ కేసును ఏసీబీ నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే నిలువరించేందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పిల్ దాఖలు చేశాం. ఇక ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు’ అని ఆర్కే పేర్కొన్నారు. -
ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. విచారణ తేదీలను సుప్రీంకోర్టు త్వరలో ఖరారు చేయనుంది. కాగా ఇప్పటికే ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఓటుకు కోట్లు వ్యవహారం జరిగి రెండున్నర సంవత్సరాలు అయినా.. తదుపరి పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని, తెలంగాణ ఏసీబీ దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయడం లేదని మొదటి ఛార్జిషీట్‌కు రెండో చార్జిషీట్‌కు వ్యత్యాసం ఉందని ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానం తాజా ఆదేశాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారని, అయితే ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆడియో టేపుల్లో మాట్లాడింది చంద్రబాబేనని రుజువైందని, ఆయన పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సరిగా చేయడం లేదన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరగాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేసినట్లు చెప్పారు. -
‘సదావర్తి’పై సర్కారు తాజా పిటిషన్ తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి సత్రం భూముల వేలం పాటలో బిడ్డర్ చదలవాడ లక్ష్మణ్ చెల్లించిన డిపాజిట్‌ను తమ వద్దే ఉంచుకుంటామని, అందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సదావర్తి భూముల యాజమాన్య హక్కులు తమవేనంటూ తమిళనాడు ప్రభుత్వం గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు దీనిపై పూర్తి స్థాయిలో హైకోర్టు విచారణ జరపాలని చెబుతూ, భూముల వేలం ప్రక్రియలో పాల్గొన్న వారి డబ్బులు వెనక్కివ్వాలని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే యాజమాన్యం విషయం తేలే వరకు లక్ష్మణ్ డిపాజిట్‌ను తమ వద్ద ఉంచుకుంటామని ప్రభుత్వం తాజాగా పిటిషన్ వేసింది. మరోవైపు.. భూముల యాజమాన్య హక్కులు తేలేంత వరకు తన వేలం హక్కులను రద్దు చేయరాదని, విచారణలో భూములు ఏపీవని తేలితే తనకు కేటాయించాలని చదలవాడ లక్ష్మణ్ మరో పిటిషన్ వేశారు. వీరి వాదనలను తోసిపుచ్చుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లను తిరస్కరించింది. సత్రం భూములను కారు చౌకగా కట్టబెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడం వల్లే తిరిగి రెండవసారి వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. కేసు విచారణకు ఆళ్ల తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ హాజరయ్యారు. -
సదావర్తికి బాబు సొంత సొమ్ము కట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సదావర్తి భూముల వ్యవహరంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూములు ఎవరివో తేల్చాలంటూ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేయటంపై ఆర్కే హర్షం వ్యక్తం చేశారు. రెండు అంశాలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. కేవలం భూములను కాజేసేందుకు చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారని ఆర్కే చెప్పారు. చంద్రబాబు తన బినామీలతో సదావర్తి భూములను చేజిక్కించుకునేందుకు యత్నించాడని.. దమ్ముంటే సొంత డబ్బు కట్టాలని ఆర్కే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బాబు బినామీలు ఇప్పటికే కట్టిన డబ్బు వడ్డీ అడుగుతున్నారని.. ప్రజా ఆస్తిని చివరకు వడ్డీల రూపంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం వసూలు చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఒకవేళ కోర్టు ఆదేశాల ప్రకారం వడ్డీ కట్టాల్సి వస్తే దానిని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా చంద్రబాబు, లోకేశ్ ఆస్తుల నుంచి కట్టేలా చూడాలని కోర్టును కోరారు. 472 ఎకరాలను రాజా వాసిరెడ్డి పేద బ్రాహ్మణులకు ఇచ్చారని.. ఏపీ దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆర్కే అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చి దేవాదయ భూములు అమ్ముకూడదన్న జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆర్కే అభిప్రాయపడ్డారు. తమిళనాడు పిటిషన్ ఆధారంగానే సదావర్తి భూములు ఎవరివో తేల్చాలంటూ హైకోర్టుకు సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీచేసిన విషయం తెలిసిందే. -
ప్రజల ఆస్తులను కొట్టేస్తుంటే ఊరుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల ఆస్తులను కొట్టేయాలని ప్రయత్నిస్తే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని సీఎం చంద్రబాబును మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) హెచ్చరించారు. సదావర్తి భూముల వేలం కేసులో శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాలకు, వివిధ ట్రస్టులకు దాతలు ఇచ్చిన భూములను కొట్టేయాలని చూస్తే మాత్రం తాము అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. -
సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి: ఆర్కే
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పేద బ్రాహ్మణుల వేద విద్య కోసం సదావర్తి భూములను రాజా వాసిరెడ్డి వారసులు రాసిచ్చారన్నారు. అవి బ్రాహ్మణ భూములు అని, ప్రభుత్వ భూములు కాదని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు. పేద బ్రాహ్మణుల ఆస్తిని తక్కువ ధరకు చంద్రబాబు, లోకేశ్ దక్కించుకున్నారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించడంతో ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ అడ్డుకుంటుందని టీడీపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సదావర్తి భూములను కాపాడేందుకే తాము కోర్టును ఆశ్రయించామని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వేలం పాట నిర్వహించిందన్నారు. అయితే రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులురెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించని విషయం తెలిసిందే. అంతేకాకుండా కేసులు, పిటిషన్లు అంటూ వైఎస్ఆర్ సీపీ బెదిరిస్తోందంటూ శ్రీనివాసులురెడ్డితో ముఖ్యమంత్రి... పత్రికాముఖంగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వేలంపాటలో సదావర్తి భూములను దక్కించుకున్న ఆయనను తాము అభినందించి, స్వాగతించామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక వేలంపాటపై మంత్రి మాణిక్యాలరావు, దేవాదాయా శాఖ కమిషనర్ చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలన్నది చంద్రబాబు ప్లాన్ అని ఆర్కే ఆరోపించారు. సదావర్తి భూముల కేసు విచారణ వాయిదా సదావర్తి భూములపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ వేలంలో అత్యధిక ధరకు కోట్ చేసిన వ్యక్తి ముందుకు రావట్లేదని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ భూములపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చేనెల 3వ తేదీకి వాయిదా వేసింది -
హైకోర్టు దృష్టికి ‘సదావర్తి’ భూమి మాయం
రెండో సారి వేలంలో 4 ఎకరాలు మినహాయించారన్న ఎమ్మెల్యే ఆర్కే సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల అత్యంత విలువైన భూముల్లో 79 ఎకరాలకే వేలం నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ తీరును వైఎస్సార్సీపీ మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా 4 ఎకరాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో సర్కార్‌ను సంజాయిషీ కోరాలని ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు ను అభ్యర్థించారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాత తాము ఏపీ సర్కార్ వివరణ కోరుతామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ లోగా వేలం ప్రక్రియను కొనసాగనివ్వాలంది. -
రాజధానిలో రియల్ దందాపై సీబీఐతో విచారించాలి
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందంటూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో చేస్తున్నదంతా అవినీతేనం టూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాల యంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ తొలి నుంచి చెబుతోందని, చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాటల ద్వారా రుజువైంద న్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వారెవరూ గతంలో ఇలాంటి ఆరోపణలు ముఖ్యమంత్రులపై చేయలే దన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నపుడు పని చేసి న చిన్న ఉద్యోగి మొదలు ఉన్నతోద్యోగి వరకూ ఆయన నిర్ణయాలను ఎవరూ తప్పుబట్టలేద న్నారు. బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో న్యాయస్థానాలు నేరుగా స్పందించాయని అలాగే రాజధాని విషయంలో కూడా కోర్టులు సుమొటోగా కేసు స్వీకరించాలని కోరారు. తొమ్మిది నగరాల అడ్రస్ ఎక్కడ? రాజధానిలో నవ నగరాలు నిర్మిస్తానని చంద్రబాబు ప్రకటనలు చేశారని, ఇప్పటి వరకూ అవి ఎక్కడున్నాయో అడ్రస్ కూడా లేవన్నారు. స్విస్ ఛాలెంజ్ పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాజధానిని విక్రయిం చేలా వ్యవహరించారన్నారు. -
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల ఉపసంహరణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా 278మందిపై కేసులు ఉపసంహరిస్తూ చంద్రబాబు సర్కార్ 132 జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. కేసుల ఉపసంహరించినవారి జాబితాలో స్పీకర్, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, టీడీపీ నేతలు ఉన్నారు. కాగా చంద్రబాబు సర్కార్ దొడ్డి దారిన జీఓలు విడుదల చేసి టీడీపీ నేతలపై ఉన్న కేసులు రద్దు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఆయన న్యాయస్థానంలో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీఓలను కొట్టేయాలని ఆర్కే పిటీషన్లో కోరారు. -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు: ఆర్కే వాంగ్మూలం
హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రికపై పరువునష్టం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు మంగళవారం నమోదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాశారంటూ ఎమ్మెల్యే ఆర్కే... ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కోర్టు తదుపరి చర్యల్లో భాగంగా తొలుత ఎమ్మెల్యే ఆర్కే వాంగ్మూలాన్ని నమోదుకు ఆదేశించింది. దీంతో కోర్టు ఇవాళ ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. -
కోర్టు కట్టమన్న మొత్తం కట్టేశా: ఆర్కే
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సదావర్తి భూముల విషయంలో కోర్టుకు చెల్లించాల్సిన రూ. 27 కోట్ల 44 లక్షల 625 రూపాయలు మొత్తాన్ని చెల్లించానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన రూ. 10 కోట్లు కట్టేశానని, మిగిలిన మొత్తం రూ.17,44,12,625 శుక్రవారం ఏపీ దేవాదాయ కమిషనర్‌కి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. దీనిపై వచ్చే సోమవారం కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందని చెప్పారు. గతంలో సదావర్తి భూములకు సంబంధించి జరిగిన వేలంపాటలో అవకతవకలకు జరిగాయని ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గతంలో విక్రయించిన ధర కంటే మరో ఐదు కోట్లు అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆ భూమిని తనకే కేటాయించాలని ఆయన హైకోర్టును కోరగా అందుకు కోర్టు సమ్మతించింది. దానికి సంబంధించి చెల్లించాల్సిన మొత్తాన్ని (రూ. 27.44 కోట్లు) రెండు విడతలుగా చెల్లించాలని కోర్టు సూచించింది. గతంలోనే పది కోట్లు చెల్లించిన ఆర్కే శుక్రవారం మిగిలిన మొత్తాన్ని చెల్లించారు. -
ఆంధ్రజ్యోతిపై ఎమ్మెల్యే ఆర్కే పరువునష్టం దావా
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అసత్య కథనాలు రాశారంటూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఆగస్టు ఒకటో తేదీన ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లీకేజీ వెనుక పెద్ద ప్యాకేజీ ఉంది: ఆళ్ల
హైదరాబాద్ : ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం నిర్వాకాన్ని అందరూ చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కొద్దిపాటి వర్షానికే ఏపీ సచివాలయం ఛాంబర్లు వర్షపు నీటితో లీక్ అయిన వ్యవహారంతో ఆంధ్ర రాష్ట్ర పరువును దిగజార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సచివాలయంలో లీకేజీలు చాలా చిన్న విషయం అని, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మంత్రి నారాయణ అంటున్నారు. ఏపీ సచివాలయం ఛాంబర్ల లీకేజీ వెనక చాలా పెద్ద ప్యాకేజీ ఉంది. మీకు, ప్రభుత్వానికి, చంద్రబాబుకు వచ్చిన ప్యాకేజీ మాత్రం భారీ ఎత్తున ఉండి ఉంటుంది. లీకేజీ వెనుక అసలు విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. అందుకే చదరపు అడుగుకు పదివేల రూపాయిలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దీని వెనుక పెద్ద ఎత్తున ప్యాకేజీ కుదిరింది. గతంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ కూడా వర్షంనీరు చేరింది. దానిపై సీఐడీ ఎంక్వైరీ వేశారు. నెలరోజుల గడుస్తున్నా దానిపై కదలిక లేదు. ఇప్పుడు మంత్రుల ఛాంబర్లు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరోవైపు అధికారులు పని చేసుకోవాలి. దీంతో వాళ్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే తుపాను వస్తే పరిస్థితి ఏంటి?. హుద్‌హుద్ తుఫాను సమయంలో కేవలం విశాఖలో రెవెన్యూ శాఖలో రికార్డులు మాయం అయ్యాయి. ఇప్పుడు కూడా సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్లకు సంబంధించిన పైళ్లు మాయం అయ్యే అవకాశం ఉంది. దీనిపై సీఐడీ కాదు సీబీఐ విచారణ జరిపించాలి.’ అని ఆయన డిమాండ్ చేశారు. -
రూ.10 కోట్లు చెల్లించేశా
హైకోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే నివేదన సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు రూ.10 కోట్లను దేవాదాయశాఖ కమిషనర్ పేరు మీద చెల్లించినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం హైకోర్టుకు నివేదించారు. రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అందజేసిన ఈ నివేదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... మిగిలిన రూ.17.44 కోట్లను చెల్లించేందుకు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సమయంలో వేలంలో భూములు దక్కించుకున్న వారి తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ... పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తన బినామీల ద్వారా సమకూర్చుకున్న సొమ్మును కమిషనర్ పేరు మీద చెల్లించారని తెలిపారు. 83 ఎకరాల విలువ వెయ్యి కోట్ల వరకు ఉంటుందని పిటిషనర్ చెబుతున్నారని, కాబట్టి అతన్ని రూ.500 కోట్లయినా డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. -
సుప్రీం కోర్టులో అమరావతి భూసేకరణ కేసు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల గ్రామాల్లో భూ సేకరణపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే భూ సేకరణకు సంబంధించి.. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున అక్కడికే వెళ్లాలని సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత అవసరం అయితే మళ్లీ తమన ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. కాగా 2013 భూ సేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని, అలాగే మూడు పంటలు పండే భూములను నోటిఫై చేయకుండానే భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్లో అభ్యంతరం తెలిపారు. -
పెనుమాకలో రైతుల ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. మంగళవారం పెనుమాక రైతులతో సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. అధికారుల తీరుకు నిరసనగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కుర్చీలు విసిరేసి... అధికారులతో వాగ్వాదానికి దిగారు. పెనుమాక భూసేకరణ, రైతులు ఇచ్చిన అభ్యంతరాలపై అధికారులు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రైతుల అభ్యంతరాలను సీఆర్డీఏ అధికారులు నమోదు చేయలేదు. దీంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితోపాటు రైతులు అధికారుల తీరును తప్పుబట్టారు. అభ్యంతరాలు నమోదు చేయాలని పట్టుబట్టినప్పటికీ, అధికారులు మాత్రం ససేమిరా అనడంతో రైతులు ఆగ్రహించారు. టెంట్లు పడేసి.. కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశం కాస్తా ఉద్రిక్తంగా మారింది. -
రాజన్న క్యాంటీన్ ప్రారంభం
- నాలుగు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం - ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పేద ప్రజలకు కడుపునిండా రుచికరమైన భోజనం పెట్టాలనే సంకల్పంతో మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆదివారం ‘రాజన్న’ మొబైల్ క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేవలం నాలుగు రూపాయలకే పేదలకు భోజనాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. 2004లో మే 14వ తేదీన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాజన్న క్యాంటీన్ పేరుతో భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 365 రోజులూ ప్రతి పేదవాడికీ శ్రేష్టమైన భోజనం అందేలా తన సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వం కనుక క్యాంటీన్లు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో మసీదు సెంటర్ వద్ద ప్రతి పేదవాడికీ ఒక్క రూపాయికే నాలుగు ఇడ్లీలు ఇచ్చే పథకం ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంటీన్లు పరిశీలించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి కమిటీలను పంపించారని, ఇప్పటికి మూడేళ్లు గడిచినా పథకం రూపు దాల్చలేదన్నారు. -
రాజన్న క్యాంటీన్లో రూ.4కే భోజనం
- నేడు మంగళగిరిలో ప్రారంభం - పేదల కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్లో ఆదివారం నుంచి నాలుగు రూపాయలకే భోజనాన్ని అందించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. రాజన్న క్యాంటీన్ పేరుతో కేవలం నాలుగు రూపాయలకే అన్నం, కూర, పెరుగు, వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మిగిలిన మూడు రోజులు అరటి పండ్లు, వడియాలు, తాగునీటి ప్యాకెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజైన మే 14వ తేదీన రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గౌతమ బుద్ధారోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే ఆర్కే ఈ క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని వివరించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లో అందజేస్తున్న భోజనాన్ని పేదలు వినియోగించుకోవాలని కోరారు. నెలలో తొలి పదిరోజులు అంబేడ్కర్ విగ్రహం సెంటర్, మలి పది రోజులు పట్టణంలోని మిద్దె సెంటర్, మిగిలిన పది రోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో భోజనం అందజేయనున్నట్లు వివరించారు. -
రూ. 5 భోజనం ఎలాగుంది?
జీహెచ్ఎంసీ భోజన కౌంటర్లో తిన్న ఎమ్మెల్యే ఆర్కే హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న రూ. 5ల భోజన కేంద్రం (అన్నపూర్ణ) వద్దకు ఓ వ్యక్తి బైక్‌పై వచ్చారు. చేతిలో హెల్మెట్‌తో క్యూలో నిలబడి, టోకెన్ తీసుకొని, వారందించిన భోజనం చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). ఆయనను గుర్తుపట్టిన మీడియా ప్రతినిధులు మీరేంటి.. ఇలా? అని ఆరా తీయగా.. ఇలాంటి పథకాన్ని తన నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆర్కే తెలిపారు. అందుకే రూ. 5 భోజనం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇలా వచ్చానని బదులిచ్చారు. -
రూ. 5 భోజనం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణలో అమలులో ఉన్న రూ.5 భోజనాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయన బుధవారం నగరంలోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హరే కృష్ణ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న భోజన కేంద్రానికి వెళ్లారు. మండే ఎండలో క్యూ లైన్ల్ నిల్చుని భోజనం సదుపాయాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడే బోజనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ కార్యక్రమం బాగుందని, తన నియోజక వర్గం మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమం పెట్టి సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం క్షేత్ర స్థాయిలో రూ. 5 భోజన పథకాన్ని స్యయంగా పరిశీలిస్తున్నట్టు ఆర్కే తెలిపారు. -
కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం చేకూర్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన నేపథ్యంపై రామకృష్ణారెడ్డి వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో స్పందించారు. ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ చేయడమంటే సుప్రీంకోర్టును చంద్రబాబుకు చుక్కెదురైనట్లేనని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ సొత్తును దోచుకుంటూ అక్రమంగా సంపాదించిన లంచాల సొమ్ముతో అవసరం లేని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయారని చెప్పారు. "మనవాళ్లు దే బ్రీఫ్ డ్ మీ" అనే గొంతు ఆయనదే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని, అయినా అటు తెలంగాణ ఏసీబీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఇద్దరూ కూడా ఢిల్లీ పెద్దల కాళ్లు, గడ్డాలు పట్టుకుని తప్పించుకోజూశారని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం మీద హక్కులు ఉన్నా హైదరాబాద్‌ను వదులుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా ఆనకట్టలు కడుతున్నా నోరెత్తలేదని.. పార్లమెంట్ సాక్షిగా లభించిన హామీ, ఆంధ్రరాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉంది. గత మూడు సంవత్సరాలుగా దీనిపై మేం పోరాడుతున్నాం. దివంగత రాజశేఖర రెడ్డి స్పూర్తితో, పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అండదండలతో మా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ కేసులో తెలంగాణ మేజిస్ట్రేట్ కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. స్టీఫెన్ సన్ తో "మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ" మాట్లాడిన వాయిస్ ను టెస్ట్ చేయించి, మాట్లాడింది చంద్రబాబు నాయుడేనని రూజువుచేయించి కోర్టుకు సమర్పించడం జరిగిందని చెప్పారు. దానిపై చంద్రబాబుకు నోటీసులు జారీచేయడం శుభపరిణామమని చెప్పారు. -
ఓటుకు కోట్లు కేసు: తీర్పు వాయిదా
ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇప్పటికి పలు దఫాలుగా ఈ కేసులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే ఆర్కే తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మధ్యలో ఈ కేసులో చంద్రబాబు పాత్రపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తన వాదనలు వినిపించారు. మొత్తానికి ఈ కేసులో వాదనలు మంగళవారంతో ముగిసినట్లు హైకోర్టు ప్రకటించి, తీర్పును వాయిదా వేసింది. త్వరలోనే దీనిపై తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అసలు ఎమ్మెల్యే ఆర్కేకు ఈ కేసు దాఖలుచేసే అర్హత (లోకస్ స్టాండీ) లేదన్న అంశం మీదనే ప్రధానంగా చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బాధ్యత గల పౌరునిగా కేసు దాఖలు చేసినట్లు ఆర్కే తరఫు న్యాయవాది చెప్పారు. ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబు మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును విచారించాలని చెబుతుందా.. లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. -
దర్యాప్తు అకస్మాత్తుగా ఆగిపోయింది
- హైకోర్టుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది సుధాకర్‌రెడ్డి వెల్లడి - అందుకే ఓటుకు కోట్లు కేసులో ప్రత్యేక కోర్టును ఆశ్రరుుంచాం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో సక్రమంగా సాగుతూ వచ్చిన దర్యాప్తు అకస్మాత్తుగా ఆగిపోరుుందని, ఈ నేపథ్యంలోనే తాము ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. తమ ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు కేవలం దర్యాప్తునకు మాత్రమే ఆదేశించిందని, దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రరుుంచి స్టే పొందారని తెలిపారు. ఓటుకు కోట్లు కేసుతో తనకేమీ సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తి నివేదికను సమర్పించేంత వరకు ఆయన వేచి చూడాల్సిందన్నారు. ఆ దర్యాప్తులో చంద్రబాబు 24 క్యారెట్ల బంగారంలా బయటకు వచ్చే వారేమోనని, హైకోర్టును ఆశ్రరుుంచడం వల్ల ఆయన ఈ బంగారు అవకాశాన్ని కోల్పోయారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఓటుకు కోట్లు కేసులో ఫిర్యాదుదారు (ఆళ్ల రామకృష్ణారెడ్డి)ను థర్డ్ పార్టీ అని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత అతనికి లేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పదేపదే వాదిస్తున్నారని, వాస్తవానికి చంద్రబాబుకే ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదని ఆయన తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపివేస్తూ గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ మొదలుపెట్టారు. గతవారం చంద్ర బాబు తరఫున సిద్దార్థ్ లూత్రా వాదనలు ముగించడంతో సోమవారం సుధాకర్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు. బాబు స్వర నమూనాల జోలికెళ్లడం లేదు ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్లో 22 సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని, అరుుతే ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడం లేదని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మొదట్లో దర్యాప్తును వేగంగా ప్రారంభించిన ఏసీబీ అధికారులు తరువాత కీలక దర్యాప్తును పక్కన పెట్టేశారన్నారు. వారు చంద్రబాబు స్వర నమూనాల జోలికి వెళ్లలేదని నివేదించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారని, ఇది సరైన విధానం కాదన్నారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై భయాందోళనల ఆధారంగా చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారని చెప్పారు. ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో భయాందోళనల ఆధారంగా ఓ వ్యక్తి దాఖలు చేసే పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఈ కేసులో చంద్రబాబు నిందితుడు కాదని, అలాంటప్పుడు ఆయన హైకోర్టును ఆశ్రరుుంచడానికి వీల్లేదని సుధాకర్‌రెడ్డి అన్నారు. ఏసీబీ అధికారులు చంద్రబాబును నిందితునిగా చేర్చలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి స్పందిస్తూ... మీరు చంద్రబాబును నిందితునిగా మీ ఫిర్యాదులో పేర్కొన్నారు.. మరోవైపు నిందితుడు కాదని చెబుతున్నారు.. ఎందుకీ పరస్పర విరుద్ధమైన వాదనలు అని ప్రశ్నించారు. చంద్రబాబు నిందితుడు కాదని, కాబోయే నిందితుడని (ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్) సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్ అన్న ఉద్దేశంతోనే తాము ఫిర్యాదులో నిందితునిగా పేర్కొన్నామని, ఇది ప్రతీ పిటిషన్లోనూ జరిగే ప్రక్రియేనని వివరించారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ మంగళవారానికి వారుుదా పడింది. -
హోదా కోసమే మా నిరసన
- మేమెవరినీ అగౌరవ పర్చలేదు - మాకు దురుద్దేశం లేదు - రెండోరోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల వివరణ - సభా హక్కుల కమిటీ ముందు ఐదుగురి హాజరు - నేడు కూడా ఇద్దరు కమిటీ సభ్యుల డుమ్మా సాక్షి, హైదరాబాద్: ‘ప్రత్యేక హోదా అంశం తీవ్రతను చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే శాసనసభలో మేం నిరసన వ్యక్తం చేశాం... దీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు... ఎవరినీ అగౌరవపర్చలేదు... సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపి తానే కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనకు స్వాగతం పలికితే మాకు కడుపులో భగ్గుమనదా... అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రజల తరఫున హోదాపై చర్చకు పట్టు బట్టాం. మేం చేసిం దేమీ తప్పుగా భావించడం లేదు...హోదా సాధనకు ఎంత దూరమైనా పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రెండో రోజు ఏపీ శాసనసభా హక్కుల కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లో హోదా అంశంపై చర్చ జరగాలంటూ నిరసన తెలిపిన నేపథ్యంలో 12 మంది విపక్ష ఎమ్మెల్యేలకు హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలిరోజైన మంగళవారం ఆరుగురికి గాను నలుగురు ఎమ్మెల్యేలు , రెండో రోజైన బుధవారం మరో ఆరుగురికి గాను ఐదుగురు హాజరై తమ వాదనలు వినిపించారు. రెండో రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), కంబాల జోగులు (రాజాం), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), ముత్తిరేవుల సునీల్‌కుమార్ (పూతలపట్టు) విడివిడిగా కమిటీ ముందుకు వచ్చారు. అంతకుముందే వారు తమ వివరణలను తెలియజేస్తూ కమిటీకి లేఖలు అందజేశారు. విదేశీ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేకపోతున్నానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) లేఖ పంపారు. సభా హక్కుల కమిటీకి చైర్మన్ గొల్లపల్లి సూర్యారావుతో సహా ఐదుగురు సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, శ్రావణ్‌కుమార్, బి.సి.జనార్థన్‌రెడ్డి బుధవారం హాజరైనప్పటికీ మరో ఇద్దరు టీడీపీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, కురుగొండ్ల రామకృష్ణ గైర్హాజరయ్యారు. డిసెంబర్ 2న మళ్లీ కమిటీ సమావేశం కావాలని, ఇప్పుడు హాజరు కాని ఎమ్మెల్యేలు పిన్నెల్లి , కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆ రోజు పిలవాలని నిర్ణయించారు. బుధవారం కమిటీ ముందు ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇచ్చినపుడు చోటు చేసుకున్న అంశాల పూర్వాపరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇలా ఉంది. చంద్రబాబు మోసం వల్లే ఇదంతా: ఆళ్ల తొలుత సభ్యులొక్కొక్కరి చేత విడిగా కమిటీ ప్రమాణాలు చేయించింది. శాసనసభా వ్యవహారాల్లో తానెప్పుడూ సంయమనంతో వ్యవహరిస్తూ ఓపిగ్గానే ఉంటానని... ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలీయంగా ఉంటే వారి మనోభావాలను అసెంబ్లీలో కాక మరెక్కడ ప్రతిబింబింప జేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కమిటీ ముందు నివేదించారు. మీ నాయకుడు జగన్ మిమ్మల్ని ఇలా చేయమని ప్రేరేపించారా? ఆయనకు మైక్ ఇవ్వక పోతే ఇలా చేస్తారా? అని శ్రావణ్ ప్రశ్నించినపుడు... ‘ఒకళ్లు ప్రేరేపించడం ఏమిటి? హోదాపై మా వాణి వినిపించడానికి ఆరోజు అన్ని దార్లూ మూసేశారు. మేమేం చేయాలి?’ అని ఆళ్ల ప్రశ్నించారు. క్రాస్ ఎగ్జామినేషన్ వద్దు వారు ఇచ్చే వివరణ వినండి అని శ్రావణ్‌ను పెద్దిరెడ్డి వారించారు. కేంద్రానికి తెలియాలనే : సంజీవయ్య ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల మనోభావాలేమిటో, సమస్య తీవ్రత ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పడానికే అసెంబ్లీలో అలా చేయాల్సి వచ్చిందని కిలివేటి సంజీవయ్య చెప్పారు. వీడియో దృశ్యాల్లో తొలుత సంజీవయ్య ఎక్కడ ఉన్నదీ సభ్యులెవరూ గుర్తించలేదు. సంజీవయ్యే జోక్యం చేసుకుని తానెక్కడ ఉన్నదీ వారికి చూపారు. అలా ఎందుకు చేశారని గొల్లపల్లి ప్రశ్నించినపుడు... ‘పోడియంను ఎమ్మెల్యేలు చుట్టుముట్టడం కొత్తేమీ కాదని అందరికీ తెలుసు. బయట ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష బలీయంగా ఉన్నపుడు అసెంబ్లీలో చర్చకు తావివ్వకుంటే స్పీకర్‌ను ఒప్పించేందుకే అలా చేయాల్సి వచ్చింది. సభలో అలాంటి సంఘటనలు జరక్కూడదు. కానీ చర్చకు తావివ్వడం లేదన్న ఆవేశంలో అలా చేయక తప్పలేదు’ అని సంజీవయ్య వివరణ ఇచ్చారు. హోదా కోసమే: సునీల్‌కుమార్ తాము అసెంబ్లీలో నిరసన తెలపడం వెనుక ప్రత్యేక హోదా కావాలన్న బలీయమైన ఆకాంక్షే తప్ప ఇంకేమీ లేదని తమకు ఎలాంటి దురుద్దేశం లేదని సునీల్‌కుమార్ అన్నారు. మీరు గొడవ చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? అని గొల్లపల్లి ప్రశ్నించగా... ‘మౌనంగా ఉంటే తమ ప్రకటనతో సంతృప్తిగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. సమస్య తీవ్రత బయట ప్రజల్లో ఎంత ఉందో తెలియ జెప్పడానికే అలా చేయాల్సి వచ్చింది’ అని సునీల్ కుమార్ తెలిపారు. తప్పనిస్థితిలో...: ముత్యాలనాయుడు వాస్తవానికి అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితులు రాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తాము నిరసనకు దిగాల్సి వచ్చిందని బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వీడియో దృశ్యాలు చూపించినపుడు నాయుడు 8వ తేదీనాటి క్లిప్పింగ్‌లో ప్లకార్డు పట్టుకుని వెనుక నుంచుని ఉన్నారు. 9వతేదీన ఆయన దృశ్యాల్లో లేరు. 10వ తేదీన మాత్రం స్పీకర్ పోడియం దగ్గర నుంచుని ఉన్నట్లుగా తల మాత్రం కనిపించింది. వీటిపై వివరణ అడిగినపుడు సభలో ప్లకార్డు ప్రదర్శించడం తప్పని భావించడం లేదన్నారు. సభలో వాయిదా తీర్మానం ఇచ్చినా అనుమతించరు, చర్చకు అవకాశం కల్పించలేదు ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మా నిరసన ఎలా తెలియ జేయాలని కంబాల జోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నిరసన తెలిపామని చెప్పారు. -
ప్రాణత్యాగానికి సిద్ధం: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అవసరం అయితే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ఎదుట హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసమే అసెంబ్లీని స్తంభింపచేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదాపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరం అయితే వందసార్లు బల్లలు ఎక్కుతానని, వెయ్యిసార్లు మైకు లాగుతానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదని, ఎమ్మెల్యేలుగా ప్రజల ఆకాంక్షలనే తెలియచేశామన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును పట్టించుకోని ప్రభుత్వం తమ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదరిస్తోందని ముత్యాలనాయుడు, సునీళ్ కుమార్, సంజీవయ్య, జోగులు అన్నారు. మరోవైపు ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ మొత్తం 12మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, నిన్న, ఇవాళ విచారణకు హాజరు కాని మరో ముగ్గురిని డిసెంబర్ 2న విచారిస్తామన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోగా స్పీకర్‌కు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. -
ఎవరి పాత్ర ఏమిటో తేలుస్తాం
- ఓటుకు కోట్లు కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ - విచారణ 27కు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వస్తారని, అందువల్ల కేసు విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సుబ్బారావు కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ గత నెల 23న హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. చంద్రబాబు తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఈ కేసులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వస్తారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. తరువాత ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అందరూ ఇలా ఎవరికి నచ్చిన తేదీలు వారు అడిగితే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అయితే కేసును ఈ నెల 27కు వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు. మిగిలిన న్యాయవాదులు సైతం దీనికి అభ్యంతరం చెప్పకపోవడంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను 27కు వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులో కోర్టు గత నెల 2న ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. దర్యాప్తు కొనసాగుతోంది... ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఏసీబీ అదనపు ఎస్పీ ఎం.మల్లారెడ్డి హైకోర్టుకు నివేదించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ఈ నేరంలో ఎవరి పాత్ర ఏమిటో తేలుస్తామని ఆయన తన కౌంటర్లో పేర్కొన్నారు. ఏసీబీ ప్రాథమికంగా నలుగురిపై కేసు నమోదు చేసి ఆ మేర ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ కూడా దాఖలు చేసిందన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై దర్యాప్తు కొనసాగుతోందని, వెలుగుచూసే ఇతర వివరాలన్నింటినీ అనుబంధ చార్జిషీట్ల ద్వారా కోర్టు ముందుంచుతామని, ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టుకు తెలియచేశామని వివరించారు. నిందితుల్లో ఒకరైన మత్తయ్యపై హైకోర్టు కేసును కొట్టేసిందని, దీనిపై తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది అక్కడ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదును దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక కోర్టు ఏసీబీకి పంపిందని, అయితే వాస్తవానికి ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్ల నమోదు ఉండద ని అన్నారు. ఇదే విషయాన్ని తాము మెమో ద్వా రా ప్రత్యేకకోర్టుకు తెలిపామన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులో మళ్లీ ఫిర్యాదు దాఖలు చేసే అర్హత రామకృష్ణారెడ్డికి లేదని తెలిపారు. రామకృష్ణారెడ్డి సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద దర్యాప్తు కోరలేదని, సెక్షన్ 210 కింద కోరారని తెలిపారు. -
ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోగా హైకోర్టు ఏ నిర్ణయం వెలువరించని పక్షంలో పిటిషనర్ మరోసారి సుప్రీంకోర్టుకు రావచ్చని కూడా తెలిపింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఏసీబీ కోర్టు విచారణపై హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టేను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు. ఇది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారమని, కేసును జాప్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దశలో స్టే విధించడం సరికాదని ఆయన చెప్పారు. తాము సమర్పించిన ఆధారాలతో ఏసీబీ కోర్టు సంతృప్తి చెందడం వల్లే ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణకు ఆదేశించిందని, దానిపై స్టేను తొలగించేలా చూడాలని కోరారు. అయితే.. కేసు విచారణపై హైకోర్టు 8 వారాల పాటుస్టే ఇచ్చిన నేపథ్యంలో కేసులో జోక్యం చేసుకోలేమని.. అయితే నాలుగు వారాల్లోగా కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబుకు ఎదురుదెబ్బ సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులు ఏపీ సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ అని ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర రెడ్డి అన్నారు. స్టేలతో దర్యాప్తును ఆపాలని చంద్రబాబు చూశారని ఆయన అన్నారు. అయితే నాలుగు వారాల్లో ఓటుకు కోట్లు కేసును పరిష్కరించాలని సుప్రీం ఆదేశించిందని.. నాలుగు వారాలు దాటితే మళ్లీ తమ వద్దకు రావల్సిందిగా చెప్పిందని ఆయన తెలిపారు. -
కోట్లు ఖర్చు చేసి మురికి నీటిలో స్నానాలు: ఆర్కే
గుంటూరు : పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులను మురికి నీటిలో స్నానాలు చేయిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం సీతానగరంలోని పుష్కరఘాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా వచ్చిన కొద్దిమంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. లీడింగ్ చానల్ ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, భక్తులు స్నానాలు చేసే ఘాట్‌లో మురికి నీరు తోడిపోస్తున్నారని విమర్శించారు. నీటిని తోడేందుకు ఏర్పాటుచేసిన మోటార్లు పనిచేస్తున్నాయో లేదో కూడా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్నానం చేసిన అనంతరం శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయని పలువురు భక్తులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పుష్కరాల తొలి రోజే ఇలా ఉంటే, మిగిలిన 11 రోజుల్లో భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేసి ఘాట్లు నిర్మించినా.. నీళ్లు వదలడంలో అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. పుష్కరాల పేరుతో చేయించిన పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకా? లేక భక్తుల కోసం చేసినవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఆర్కే వెంట వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఈదురుమూడి డేవిడ్‌రాజు, పట్టణాధ్యక్షుడు వేణుగోపాలస్వామిరెడ్డి తదితరులున్నారు. -
వారి విద్యార్హతల వివరాలెందుకివ్వలేదు?
- రాష్ట్ర శాసనసభ పీఐఓకు సమాచార హక్కు కమిషనర్ నోటీసు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి తదితరుల విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తూ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ అసెంబ్లీ పీఐఓ(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)కు నోటీసులు జారీచేశారు. జూలై 13న తన ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు తెలిపారు. సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం తాను.. అసెంబ్లీలోని ఈ ఉన్నతాధికారులు టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వివరాలతోపాటు న్యాయశాస్త్ర పట్టాను వీరు ఎప్పుడు, ఎక్కడినుంచి పొందారనే సమాచారాన్ని ఇవ్వాలని 2015 నవంబర్ 10న సంబంధిత అధికారులను కోరానని తెలిపారు. మళ్లీ 2016 ఫిబ్రవరిలోనూ ఇదే సమాచారం కావాలని కోరానన్నారు. తాను అడిగినవి రహస్య పత్రాలేమీ కావని, అన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లేన న్నారు. చట్టప్రకారం నెలరోజుల్లో ఇవ్వాల్సిన ఈ సమాచారాన్ని ఏడెనిమిది నెలలైనా ఇవ్వకపోయేటప్పటికి సమాచార హక్కుకమిషనర్‌ను ఆశ్రయించడంతో ఈ విషయమై ఏపీ శాసనసభ పీఐఓకు నోటీసులు జారీ చేశారని ఆర్కే తెలిపారు. -
ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహించాలి: ఆర్కే
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... రాజధానిలో మొన్న ఇళ్ళు కుంగాయి. నేడు తాత్కాలిక సచివాలయం ప్లోరింగ్ కుంగింది. నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఈ భూమి రాజధానికి పనికిరాదు అని చెప్పినా స్వార్ధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి మాటలను పెడ చెవిన పెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం బాబు చదివి ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పంతాలకు పోకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలి.' అని డిమాండ్ చేశారు. కాగా సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో గురువారంనాడు మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. -
మంత్రి గారి వియ్యంకుడు.. నదిలో పాగా!
► అనుమతులు లేకుండానే నదిలో తిప్పేందుకు లాంచీ సిద్ధం ? ► బ్యారేజీ గేట్లకు పొంచివున్న ముప్పు అయినా ధనార్జనే లక్ష్యంగా ఏర్పాట్లు ► అన్నీ తెలిసినా నోరుమెదపని అధికారులు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకుల తీరు లక్షలాది మంది సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న బ్యారేజీ గేట్లకు ముప్పు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే కృష్ణానదిలో ఎటువంటి అనుమతులూ లేకుండా తిప్పుతున్న బోట్లకు తోడు మరో భారీ లాంచీని కూడా సిద్ధం చేశారు. దీనికి అనధికారికంగా ప్రారంభోత్సవం కూడా చేసేశారు. ఎలాంటి అనుమతులూ లేకపోయినా నదిలో తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీ గేట్లకు ముప్పు పొంచి ఉంది. 70 టన్నుల పైనే బరువు గల భారీ లాంచీని నిబంధనలకు విరుద్ధంగా నదిలో తిప్పేందుకు రంగం సిద్ధం చేయటమే దీనికి కారణం. దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులూ లేవు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర మంత్రి వియ్యంకుడిది కావడంతో దీనిపై అధికారులు కూడా నోరుమెదపడం లేదు. లాంచి, బోట్లను కృష్ణానదిలో తిప్పేందుకు వినియోగిస్తే బ్యారేజీ గేట్లకు ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకెళితే... 1884లో బ్రిటీష్ హయాంలో ప్రారంభించిన కృష్ణా బ్యారేజీ 1957 నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ఈ బ్యారేజీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటికి వరప్రదాయినిగా మారింది. సుమారు 14 లక్షల ఎకరాలకు సాగు నీరందించటంతో పాటు వందలాది గ్రామాలు, నగరాలు, పట్టణాలకు తాగునీరు అందిస్తోంది. గతంలో బ్యారేజ్ గేట్లు మూడడుగులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 12 అడుగుల గేట్లు 70 ఉన్నాయి. ఒక్కో గేటు సుమారు 50 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ, గేట్ల రక్షణను దృష్టిలో ఉంచుకుని నదిలో ఎటువంటి లాంచీలు, బోట్లు తిప్పకూడదని నిబంధనలు ఉన్నాయి. బ్రిటీష్ వారి హయాంలో నిర్మించిన కట్ట, మూడడుగుల గేట్లను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో చట్టం చేసినట్లు సమాచారం. అనుమతులు లేకుండా బోట్లు, లాంచీలను నదిలో తిప్పితే అప్పట్లో 50 పైసలు అపరాధ రుసుం విధించేవారని తెలుస్తోంది. ప్రస్తుతం అటువంటి నిబంధనలేవీ అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం కృష్ణానదిలో అనధికారికంగా 150 బోట్లు తిప్పుతున్నట్లు సమాచారం. వీటికితోడు తాజాగా రాష్ట్ర మంత్రి బంధువు లాంచీని నదిలో తిప్పేందుకు సిద్ధం చేశారు. ఇటీవలే అనధికారికంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ లాంచీ బరువు 70 టన్నులపైనే ఉంటుందని, ఐరన్ వరకే 60 టన్నులని సమాచారం. లాంచీ ఎత్తు 22 అడుగులు, పొడవు 40 అడుగులు ఉంది. పొంచివున్న ముప్పు... ప్రస్తుతం నదిలో నడుపుతున్న బోట్లకు తోడు లాంచీని కూడా తిప్పితే బ్యారేజీ గేట్లకు ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. వరదలు వచ్చి, పెద్ద గాలులు వీస్తే నీటితో పాటు లాంచీ బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకునే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. భారీ లాంచీ కావడంతో దాని బరువు, నీటి అలలు, గాలి ఉధృతికి గేట్లను ఢీకొంటే అవి దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. ఈ నెల ఆరున కురిసిన భారీ వర్షానికి నదిలో ‘0’ పాయింట్ వద్ద తాడుతో కట్టి ఉంచిన లాంచీ గాలికి తిరగబడింది. దీంతో విజయవాడ మారుతీనగర్‌కు చెందిన తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ (48) లాంచీ కిందపడి మరణించాడు. సుమారు 70 టన్నులకు పైగా ఉన్న లాంచీని ప్రస్తుతం చిన్న చిన్న తాడులతో బండకు కట్టి ఉంచటం గమనార్హం. పెద్ద గాలి వీస్తే తాడు తెగి లాంచీ కొట్టుకుని వెళ్లి బ్యారేజీ గేట్లను గుద్దుకునే అవకాశముంది. 70 టన్నుల లాంచీ గుద్దితే గేటు 50 టన్నుల సామర్థ్యం ఉన్న గేటు ఎటువంటి పరిస్థితుల్లో నిలిచే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణానదిలో లాంచీని ఉంచితే ప్రమాదం ఉందని అధికారులకు తెలిసినా నోరెత్తటానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం లాంచీని కృష్ణాలో అద్దెకు నడిపేందుకు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. లాంచీలో వినోదాలు, విహారం, ఫంక్షన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు లాంచి అద్దె రూ.3 లక్షలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బ్యారేజీని తాకితే ఇబ్బందే కృష్ణానదిలో ఏర్పాటుచేసిన లాంచీ ప్రమాదవశాత్తూ బ్యారేజీని తాకితే ఇబ్బందులు ఎదురవుతాయి. మత్స్యకారు ల వలలకూ ఇబ్బందే. ఇవన్నీ ఆలోచించకుండా అధికారులు లాంచీని నదిలోకి ఎలా దిగనిచ్చారో మరి. - ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే -
‘రియల్’ వ్యాపారానికే బాబు ప్రాధాన్యం
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాజధాని పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. గతంలో కేవలం 5 గ్రామాలకు సంబంధించి 8 చ.కి.మీ. పరిధిలోనే సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ప్రకటించి.. ఇప్పుడు ఆ పరిధిని 20 చ.కి.మీ పెంచి 20 గ్రామాల ప్రజలను బలి చేయబోతున్నారని దుయ్యబట్టారు. సీడ్ క్యాపిటల్‌లో ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఉండదని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా రాశారని.. అంటే ఆ పరిధిలో ఉండే 20 గ్రామాల్లో రైతులకు ఏ కేటాయింపులు ఉండవని తేలిపోతోందన్నారు. 20 చ.కి.మీ పరిధి బయట కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో రైతులకు భూములు దక్కినా ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలంటే కనీసం 10 మీటర్లు ఎత్తు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తిరుమల కొండలన్నింటినీ తవ్వినా అక్కడి భూముల ఎత్తు పెంచుకోవడానికి మట్టి సరిపోదన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి అమలుచేయడం లేదని విమర్శించారు. ‘ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి హామీలను పక్కన పెట్టేశారు. రాజధాని ప్రాంత వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న సామాజిక పింఛన్లను 5-6 నెలల నుంచి చెల్లించడం లేదు. భూములిచ్చిన రైతులకు ఈ ఏడాది కౌలు చెక్కులు ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు. -
ఇది పన్నుల రాజధాని!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రజారాజధానిలా కాకుండా.. పన్నుల రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ రోజున ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ప్రభుత్వం అవాస్తవాలను చెబుతోందని మండిపడ్డారు. రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను 99 ఏళ్లు లీజుకిచ్చి తమ బినామీలకు మేలు చేసేలా ప్రభుత్వ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు. చివరకు రాజధాని డిజైన్లను కూడా ప్రైవేటు వ్యక్తులే ఇచ్చారని, ప్రతిదాన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. -
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు!
తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వాగ్దానం చేయలేదని అసెంబ్లీ సాక్షిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తాము నైపుణ్యాభివృద్ధి చేస్తామన్నామే తప్ప.. ఎక్కడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తారు. సీఆర్డీఏ చట్టంలో ఏవేం వాగ్దానాలు చేశారో చూడాలని, వాటిలో ఏ ఒక్కటీ ఈరోజు వరకు నెరవేర్చలేదని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముందు చెప్పి, ఇప్పుడు ఆ వాగ్దానం ఇవ్వలేదని చెప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి 30 వేల ఎకరాల భూములిచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సోమవారం కూడా సభలో చెప్పారని, కానీ.. రైతులు పొలాలు పోయి, వ్యవసాయం గానీ ఉపాధి గానీ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా అర్హులైన యువతీ యువకులు ఉంటే వాళ్లలోంచి తొలి దశ కింద 113 మందిని మాత్రమే ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారని.. కానీ రూపాయి కూడా స్టైపండ్ ఇవ్వలేదు, కనీసం బస్సు చార్జీలు కూడా ఇవ్వలేదని అన్నారు. వాళ్లు సీఆర్డీఏ ఆఫీసుకు వచ్చి, తాము బయట ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చామని, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని అడిగితే పోలీసులతో బలవంతంగా కొట్టించి పంపారని తెలిపారు. చివరకు ప్రభుత్వం తాను చెప్పిన పనులు చేయడం లేదన్న ఆవేదనతో అక్కడ ఓ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాజీనామా కూడా చేశారన్నారు. ఇప్పుడు అసలు వాగ్దానమే చేయలేదనడం అన్యాయమని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో యువతీ యువకులకు కనీసం సిమెంటు బొచ్చెలు మోసే పనికూడా ఇవ్వకపోవడం దారుణమని, కనీసం పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో వాళ్లకు 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. -
రోడ్ల పేరుతో ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదు
రాజధాని ప్రాంతంలో రైతులు, పేదలు నిద్రలేకుండా గడుపుతున్నారు కోర్టులు మాత్రమే న్యాయం చేయగలవు చివరి వరకు అండగా ఉండి ఇళ్లు, భూములు కాపాడతా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళగిరి రాజధాని కోసం ఎక్స్‌ప్రెస్ హైవేలు, రోడ్ల నిర్మాణం పేరుతో వేలాది నివాసాలు, భూములను ప్రభుత్వం ఎప్పుడు లాక్కుంటుందోనని పేదలు, రైతులు నిద్రలేకుండా గడుపుతున్నారని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆవేదన వ్యక్తంచేశారు. తాడేపల్లి కనకదుర్గ వారధి నుంచి ఎన్టీఆర్ కాలనీ అమరావతి కరకట్ట మీదుగా నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంతో ఇళ్లు, భూములు కోల్పోనున్న రైతులు, పేదలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ ఆవేదనను ఎమ్మెల్యే ఆర్కే ముందు వెలిబుచ్చారు. రైతులు పలువురు తమకున్న అరెకర, ఎకరా భూముల్లో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నామని, రోడ్డు నిర్మాణం కోసం భూములు లాక్కుంటే తమ కుటుంబాలు వీథినపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు మహిళలు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, ఇప్పుడు రాజధాని రోడ్ల పేరుతో తమ నివాసాలు ఖాళీ చేయమంటే ఎక్కడకెళ్లి బతకాలని వాపోయారు. స్పందించిన ఆర్కే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో రైతులు, పేదలను కబళించి వారి రక్తాన్ని పీల్చుకుంటున్నారని దుయ్యబట్టారు. అమరావతి కరకట్టపై ముఖ్యమంత్రి ఉంటున్న అక్రమ అతిథి గృహంతోపాటు బడాబాబులు తమ అనుచరుల అక్రమ నివాసాలను సక్రమ నివాసాలుగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారని, అలాగే సీఎం తన నివాసానికి వెళ్లేందుకుగాను ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం పేదలు, రైతుల నివాసాలు, భూములను లాక్కుంటారా అని ప్రశ్నించారు. రాజధానికి తాము కాని, తమ పార్టీ కాని వ్యతిరేకం కాదని.. ఆ పేరుతో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఆర్కే పునరుద్ఘాటించారు. రైతులు, పేదల కడపులు కొట్టి రోడ్ల నిర్మాణం చేపట్టే బదులు ఇప్పటికే వెంకటపాలెం వద్ద నిర్మాణానికి అనుమతులు పొందిన వంతెనతోపాటు భూములు సేకరించివున్న ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసుకుంటే రాజధాని అమరావతికి ఇంకా సలువుగా ప్రయాణించవచ్చన్నారు. భూములు, ఇళ్లు కోల్పోనున్నవారు ప్రభుత్వానికి ఎంత మొక్కుకున్నా ఉపయోగం లేదని.. న్యాయస్థానాలను ఆశ్రయించి తమ నివాసాలు, భూములు కాపాడుకోవడమొక్కటే మార్గమని ఆర్కే పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేవారు ఇవ్వవచ్చని అందుకు అడ్డు చెప్పబోమని, ఇవ్వనివారు తమతో కలిసి నడిస్తే చివరివరకు పోరాడి వారి భూములు, నివాసాలను కాపాడతామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఉంటున్న అక్రమ అతిథి గృహాన్ని తొలగించే వరకు ఒక్క నివాసం జోలికి వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఆర్కేతోపాటు పార్టీ తాడేపల్లి పట్టణ కన్యీనర్ బుర్రముక్క వేణుగోపాలరెడ్డి, కౌన్సిలర్లు కేలి వెంకటేశ్వరావు, ఓలేటి రృము, రైతులు గాంధి, మేకా వెంకట్రామిరెడ్డి, బండి రామిరెడ్డి, చీడిపూడి లక్షిరెడ్డి, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, బండి వెంకటరెడ్డి, బుర్రముక్క ఆషా, ఉయ్యూరు లక్ష్మీరాజ్యం తదిత రులు ఉన్నారు. -
భూ బాగోతంపై విచారణ జరిపించండి
విజిలెన్స్ కమిషనర్‌కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ఎవరివో తెలియని భూముల(అన్ నోన్)ను అధికార పార్టీ నేతలు, సీఆర్డీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కలసి పంచుకున్నారని, ఈ భూ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విజిలెన్స్ కమిషనర్ ఎస్వీ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఎస్వీ ప్రసాద్‌కు ఆర్కే ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలో కుంటలు, శ్మశానాలు, హక్కుదారులు ఎవరో తెలియని భూములు మొత్తం 500 ఎకరాల వరకు ఉన్నాయని ఆర్కే తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఫిర్యాదు కాపీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డీజీకి కూడా ఆర్కే పంపించారు. కాగా, సమస్యల నుంచి అవకాశాలు వెతుక్కుంటానని చెప్పే చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడంలో అవకాశాలు వెదుకుతున్నారని ఆర్కే విమర్శించారు. సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాటాడారు. రాజధాని వ్యవహారాలపై శ్వేతపత్రాలు విడుదల చేసే దమ్ముందా? అని సూటిగా ప్రశ్నించారు. -
‘రాజధాని’కి ఇసుక ఎక్కడ నుంచి తెస్తారు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి రూరల్: రాజధాని చుట్టుపక్కల ఉన్న ఇసుక మొత్తాన్ని రెండేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు దోచేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి ఇసుక ఎక్కడి నుంచి తెస్తారని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రాజధానిలో ఉన్న ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించి పడవల ద్వారా ఉన్న ఇసుకను అంతా తోడేశారు. ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తీస్తుంటే మట్టిముద్దలు, సిల్టు తప్ప ఇసుక రావడం లేదు. ప్రభుత్వం తన అనుయాయులను సంపన్నులను చేసేందుకు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. చిర్రావూరు ఇసుక రీచ్‌పై వైఎస్సార్సీపీ పార్టీ పోరాటాలు నిర్వహించడంతో దానిని పక్కన పెట్టి, కొత్తగా గుండిమెడ క్వారీలో ఇసుకను దోచుకునేందుకు అతి తక్కువ ధరకు ప్రభుత్వం తమ్ముళ్లకు అప్పగించింది. తమ పార్టీ నాయకులకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఈ పాటలు నిర్వహించింది’ అని ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడం వెనక ఉద్దేశం ఏంటని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. రైతుల తరఫున పోరాటం చేయడానికి వెళ్లారా.. లేదా చంద్రబాబుతో రాజీ పడేందుకు వెళ్లారో పవనే స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన విషయం పవన్ కల్యాణ్‌కు గుర్తుందా లేదా అని కూడా ఆర్కే సూటిగా ప్రశ్నించారు.