సాక్షి, విజయవాడ: ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా అంశంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియాతో ఈ విషయమై మాట్లాడారు.
‘‘సీఎం జగన్‌కు ఆర్కే అత్యంత సన్నిహితుడు. ఆయన జగన్ వెంటే నడుస్తారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా బాగా పని చేశారు. మంగళగిరిని బాగా అభివృద్ధి చేశారు. ఆయనకు అసంతృప్తి అనేది లేదు. రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఆర్కే ఉన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రీచ్ అవ్వలేకనే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అన్నీ ఆలోచించుకునే ఆయన రాజీనామా చేసి ఉంటారు’’ అని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే..
‘‘మంగళగిరి సీటును బీసీ(పద్మశాలి)లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అయినప్పటికీ సీఎం జగన్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మంగళగిరిలో క్యాడర్‌ను ఆర్కే రూపొందించారు. మళ్లీ మంగళగిరిలో వైఎస్సార్‌సీపీనే గెలుస్తోంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేశా అనే సంతృప్తిలో ఆర్కే ఉన్నారు. రాజకీయ సమీకరణాల వల్లే ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదు’’ అని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. వ్యక్తిగత పనుల వల్లే ఆర్కే రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment