alla ayodhya rami reddy
-
రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజం : అయోధ్య రామిరెడ్డి
గుంటూరు, సాక్షి: అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్పీనే గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన మీడియాతో స్పందించారు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోయారో ఆయనే చెప్పాడు. ఆయన మంచి వ్యక్తి. విజయసాయి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన వ్యక్తిగతం.అలాగే ప్రతీ రాజకీయ పార్టీకి ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాగే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. ఓటమిలో కూడా తట్టుకొని నిలబడాలి. కష్టాలు వచ్చినప్పుడే పోరాటాలు చేయాలి.. నిలబడాలి. అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుంది’’ అని అయోధ్య రామిరెడ్డి అన్నారాయన. -
జగన్ వెంటే మేమంతా: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, గుంటూరు: మేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీలోనే ఉంటా: పిల్లి సుభాష్ చంద్రబోస్వైస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తో ఉన్నా.. నా వ్యక్తిత్వం ఏంటో అందరికి తెలుసు. నన్ను వైఎస్సార్ రాజకీయాల్లో ప్రోత్సహించారు. రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు కూడా రావాల్సి ఉంది. ఇతర కారణాల వలన రాలేకపోయారు. కానీ వారిద్దరు కూడా వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పమన్నారు. జగన్ నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. కానీ నా మీద కూడా ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. నాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కూడా జగన్ అన్నారు. అంతగా వైఎస్ జగన్ నన్ను గౌరవించారు....కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్ వెంటే ఉన్నాను. అప్పట్లో టికెట్ గురించి కూడా ఎవర్నీ అడిగేవాడిని కాదు. వైఎస్సారే నాకు అర్ధికంగా, రాజకీయంగా అండగా నిలిచారు. ఆ తర్వాత కూడా జగన్ అలాగే అండగా నిలిచారు. ఆర్థికంగా పేదవాడినే అయినా విధేయతలో సంపన్నుడునే. నాకు వ్యాపారల్లేవు, ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. నా మీద వార్తలు రాసేటపుడు ఒకసారి మాట్లాడితే సరిపోయేది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. ఇలా చేయటం రాజకీయ హననం చేసినట్లే. నైతికత ఉన్న నాయకుడిని నేను...మేము రాజీనామా చేస్తే మరొకరిని నియమించే అవకాశం లేదు. అలాంటప్పుడు మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టే. అలాంటి కృతజ్ఞ హీనులం మేము కాదు. పార్టీని హత్య చేసే పని నేను చేయను. పార్టీ నుండి వెళ్లేవారు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మంచిది. ఏ పార్టీ ఐనా ఓడుతుంది, గెలుస్తుంది. అధికారం శాశ్వతం కాదు, జయాపజయాలు సహజమే. వైఎస్సార్సీపీ ఇవాళ ఓడిపోయినంత మాత్రాన నేను పార్టీ వీడి వెళ్లను. నూటికి నూరుపాళ్లు వైఎస్ జగన్ నాయకత్వంలోనే పని చేస్తా. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్సార్సీపీలోనే ఉంటా’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.ఊహాజనిత కథనాలను ఖండిస్తున్నాం: ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిమాపై కొన్ని మీడియా సంస్థలు ఊహాజనిత కథనాలు రాస్తున్నాయి. పార్టీ వీడుతున్నట్టు వారు రాస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. మేము పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తాం. ఈ రోజు పార్టీలను నడపటం చాలా కష్టంతో కూడుకున్న పని. రాజకీయ పార్టీలు పటిష్టంగా ఉంటే గట్టి నాయకులు తయారవుతారు. మేము ఎంపీలుగా బాధ్యతతో పని చేస్తున్నాం. జగన్ సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తారు. అందుకే ఆయనతో కలిసి రాజకీయాల్లో నడుస్తున్నాను...పదేళ్ల క్రితమే నేను వ్యాపారాలు మానేశాను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన బాధ పడాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే నడుస్తాం. మోపిదేవి రమణ అంటే జగన్‌తో సహా మా అందరికీ ఇష్టం. ఆయన పొజిషన్ ని స్ట్రాంగ్ చేసే పనిలో జగన్ ఉన్నారు. కొందరు పర్సనల్ వ్యవహారాల వలన పార్టీ వీడుతున్నారు. నన్ను కూడా పార్టీలోకి రమ్మని కొందరు ఆహ్వానించారు. కానీ జగన్‌ని కాదని నేను ఎటూ వెళ్లను. రేటింగ్స్ కోసం మా గురించి ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేయొద్దని మనవి -
ఏపీలో టీడీపీ అరాచకాలు.. రాష్ట్రపతి, ప్రధానికి వివరిస్తాం
-
అర్జంటుగా దాడులు ఆపాలి.. లేదంటే? చంద్రబాబుకు వార్నింగ్
-
చంద్రబాబు... దాడుల్ని తక్షణం ఆపండి: అయోధ్య రామిరెడ్డి
గుంటూరు, సాక్షి: ఏపీలో అరాచక పరిస్థితులు దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెబుతున్నారు. శనివారం తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాడులు జరుగుతున్నాయి. టీడీపీ దాడులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించాం. టీడీపీ దాడులపై పార్లమెంట్లో లేవనెత్తాలని జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు పార్లమెంట్‌లోనూ మేం పోరాడతాం. రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిలను కలుస్తాం. ఇక్కడి పరిస్థితులు దేశమంతా తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఇలాంటి దాడులు సరికాదు.. పైగా ప్రజాస్వామ్యానికి ముప్పు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంది. చంద్రబాబు తక్షణం ఈ దాడులు ఆపాలి. ప్రజలకు మంచి చేసేలా పాలన కొనసాగాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన. -
ఆర్కే పూర్తి సంతృప్తితో ఉన్నారు: ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా అంశంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియాతో ఈ విషయమై మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌కు ఆర్కే అత్యంత సన్నిహితుడు. ఆయన జగన్ వెంటే నడుస్తారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా బాగా పని చేశారు. మంగళగిరిని బాగా అభివృద్ధి చేశారు. ఆయనకు అసంతృప్తి అనేది లేదు. రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఆర్కే ఉన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రీచ్ అవ్వలేకనే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అన్నీ ఆలోచించుకునే ఆయన రాజీనామా చేసి ఉంటారు’’ అని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే.. ‘‘మంగళగిరి సీటును బీసీ(పద్మశాలి)లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అయినప్పటికీ సీఎం జగన్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మంగళగిరిలో క్యాడర్‌ను ఆర్కే రూపొందించారు. మళ్లీ మంగళగిరిలో వైఎస్సార్సీపీనే గెలుస్తోంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేశా అనే సంతృప్తిలో ఆర్కే ఉన్నారు. రాజకీయ సమీకరణాల వల్లే ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదు’’ అని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. వ్యక్తిగత పనుల వల్లే ఆర్కే రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారాయన. -
అవనిగడ్డలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పర్యటన
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సోమవారం పర్యటించారు. సామాజిక సాధికార బస్ యాత్ర ఏర్పాట్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి పరిశీలించారు. అదే విధంగా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధమైన డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరిశీలించారు. కాగా నవంబర్ 2న అవనిగడ్డలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా ళ్ల అయ్యోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. నాలుగేళ్ళలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 85 శాతం మందికి వారి అవసరాలు తీర్చామని చెప్పారు. ఆయా వర్గాల జీవన విధానం మెరుగు పడిందన్నారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణులు, లబ్ధిదారులు వేడుకలా జరుపుకునే వాతావరణం ఏర్పడిందని తెలిపారు. బస్సు యాత్ర రూట్లో అన్ని వర్గాల వారిని కలుస్తామని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం ద్వారా కలిగిన లబ్ది ద్వారా కలిగిన సంతోషాన్ని పంచుకునే కార్యక్రమం సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్ధిక, సామాజిక సాధికారతకు సీఎం జగన్ పరిపాలన దోహదపడిందని తెలిపాఉ. -
ప్రధాని మోదీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. బీసీ జనగణన జరపాలని ప్రధానికి ఎంపీలు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంట్, శాసనసభ, న్యాయ వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
రాజ్యసభ: అమరావతి అక్రమాలపై విచారణ జరగాలి
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో కోరారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో మాట్లాడుతూ.. 'అమరావతిలో చంద్రబాబు నాయుడు ధనవంతులకే స్థలాలిచ్చారు. అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నించారు. అలాంటి ప్రయత్నాలను న్యాయస్థానాలు సైతం అడ్డుకోవడం సరికాదు. పేదవాళ్లు, పెద్దవాళ్ల పక్కన నివాసం ఉండడానికి అనర్హులా..?. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు ఇదేనా..?. అందుకే ఆ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. అంతర్వేదిలో దేవుడి రథం విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. (సీఎం జగన్‌పై వాసుపల్లి గణేశ్ ప్రశంసలు ) అంతర్వేది ఆలయం శిథిలావస్థలో ఉంటే దాన్ని మాజీ సీఎం వైఎస్సార్ అభివృద్ధి చేశారు. మా సీఎం దృష్టిలో అందరూ సమానమే. బడుగు వర్గాలకు చెందిన మేమిద్దరం ఇక్కడ ఎంపీలుగా నిలబడ్డమే అందుకు నిదర్శనం. కొందరు విబేధాలు రెచ్చగొట్టేందుకు ఎవరో కొందరు చేసిన పనిని సీఎంకు ఆపాదించడం దురదృష్టకరం. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరుతున్నాం. న్యాయమూర్తులపై నిందారోపణలున్నాయి. కాబట్టి కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది' అని పిల్లి సుభాస్ చంద్రబోస్ అన్నారు. (స్టేలతో బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు) సమగ్ర న్యాయ విచారణ జరగాలి- మోపిదేవి వెంకటరమణ అమరావతి అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా బడుగు బలహీనవర్గాల, పేదల భూములు సేకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ('మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం') నిష్పక్షపాత దర్యాప్తు ఉండాలి- అయోధ్య రామిరెడ్డి రాష్ట్రంలో అన్ని దర్యాప్తులకు మోకాలడ్డుతున్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సిట్, సబ్ కమిటీ ఏర్పాటైంది. అమరావతిలో అవకతవకలు జరిగాయని ఈ కమిటీ ద్వారా వెల్లడైంది. దీనిపైన న్యాయవిచారణ జరగాల్సిందే. నిష్పక్షపాత దర్యాప్తు తప్పనిసరిగా ఉండాలి. -
ఎమ్మెల్యే ఆర్కేకు పితృ వియోగం
సాక్షి, పెదకాకాని/పేరేచర్ల: రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి దశరథరామిరెడ్డి(86)కి కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, అభిమానులు శుక్రవారం కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. పెదకాకాని సర్పంచిగానే కాక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం పాలకవర్గం చైర్మన్‌గా పనిచేసిన దశరథరామిరెడ్డి గ్రామ, ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న దశరథ రామిరెడ్డి గుంటూరు సాయిభాస్కర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన సంగతి విదితమే. పెదకాకానిలోని ఆయన నివాసానికి గురువారం రాత్రి స్థానిక నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు చేరు కుని ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే, పారిశ్రామికవేత్త పేరిరెడ్డిని పరామర్శించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంబులెన్స్‌లో దశరథరామిరెడ్డి భౌతికకాయం ఆయన నివాసానికి చేరుకుంది. దశరధరామిరెడ్డి సతీమణి వీరరాఘవమ్మ పెద్ద కుమారుడు అయోధ్యరామిరెడ్డి చేయి పట్టుకోగా భర్త భౌతికకాయంచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ‘అయ్యా వెళ్లిపోతున్నావా’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పెదకాకానిలో ప్రజల సందర్శనానంతరం భౌతికకాయాన్ని ఫిరంగిపురం మండలం, వేమవరంలోని ఆళ్ల వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అయోధ్యరామిరెడ్డి శాస్త్రోక్తంగా పూజా క్రతువు నిర్వహించి తండ్రి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఎమ్మెల్యేలు కిలారి వెంకటరోశయ్య, మహమ్మద్ ముస్తాఫా, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్, లింగంశెట్టి ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్‌గాంధీ, కళ్లం హరనాథరెడ్డి, మేరుగ విజయలక్ష్మి, డైమండ్ బాబు తదితరులు దశరథరామిరెడ్డి పార్ది్థవదేహానికి నివాళులర్పించారు. -
ఈ బలంతో మరింత పనిచేస్తాం: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తమపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన సీఎం వైఎస్ జగన్ ఆశయాన్ని నిలబెడతామని ఎంపీగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా పని చేస్తామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల ఎంపీగా ఎన్నికైన అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సేవా రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టామని తెలిపారు. కేంద్రం పాలసీలను రాష్ట్రానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. కేంద్రం పాలసీలతో రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పని చేస్తామని చెప్పారు. పథకాలను గడువు లోపల పూర్తి చేసుకోవడానికి కేంద్రంతో సమన్వయంతో రాష్ట్రం పనిచేస్తుందని అన్నారు. సంపద సృష్టి, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అనంతరం లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మాట్లాడారు. రాజ్యసభలో ఒక ఎంపీతో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఇప్పుడు ఆరుకు చేరిందని అన్నారు. ఈ బలంతో రాష్ట్రానికి మరింత ఉపయోగపడే విధంగా పని చేస్తామని చెప్పారు. -
‘మంచి అవకాశం.. సీఎంకు కృతజ్ఞతలు’
సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యులుగా గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. రాంకీ అధినేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు అవకాశం కల్పించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఆ స్థానాన్ని శ్రీకృష్ణదేవరాయలుకు కేటాయించగా ఆయన జిల్లా పార్టీ అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ సముచిత స్థానం కల్పించేందుకు రాజ్యసభకు పంపిస్తోంది. రామిరెడ్డికి జిల్లాలో రాజకీయంగా విస్తృత సంబంధాలు ఉండటంతో పాటు, రాజకీయలపై మంచి పట్టుంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు గుంటూరు, కృష్ణా జిల్లాల పరిశీలకులుగా ఆయన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. మరోవైపు శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్సీ స్థానంలో ఉండి మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణారావుని కూడా రాజ్యసభకు పంపిస్తున్నారు. నిరంతరం పార్టీ వెన్నంటే ఉన్న బీసీ నేతకు పార్టీ రాజ్యసభ స్థానం ఇవ్వడంపై బీసీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం ఆలోచనలను బలోపేతం చేస్తా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరును, ఆయన ఆలోచనలను బలోపేతం చేయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నా. రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేందుకు సీఎం ప్రవేశపెడుతున్న నూతన పాలసీలకు కేంద్రం నుంచి సపోర్టు తీసుకురావడానికి ప్రత్యేకంగా నావంతు కృషి చేస్తా. నాకు రాజ్యసభ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. –ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, రాంకీ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బయోడేటా జన్మస్థలం: పెదకాకాని పుట్టిన తేదీ: 12–8–1964 తల్లిదండ్రులు: ఆళ్ల దశరథరామిరెడ్డి, వీర రాఘవమ్మ కుటుంబం: దాక్షాయణి (భార్య), శరణ్ (కుమారుడు), శ్రావ్య (కోడలు), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే–ఎమ్మెల్యే), పేరిరెడ్డి–వ్యాపారవేత్త, సోదరి మల్లీశ్వరి – ప్రాథమిక విద్య (1 నుంచి 5) పెదకాకాని గుంటూరు జిల్లా ఉన్నత పాఠశాల, (6 నుంచి 10) బాపూజీ హైస్కూల్–గుంటూరు, ఇంటర్మీడియెట్ రెడ్డికాలేజీ–నరసరావుపేట, బీఈ సివిల్ బెళగాం–కర్ణాటక, ఎంఈ సివిల్ ఉస్మానియా వర్సిటీ హైదరాబాద్, 1984 నుంచి 1988 వరకు సివిల్ ఇంజినీర్‌గా ఉద్యోగం. 1988లో రియల్ ఎస్టేట్ వ్యాపారం. 1994లో రాంకీ గ్రూప్స్ వ్యవస్థాపన. ఏడు కంపెనీలకు చైర్మన్‌గా విదేశాల్లో సైతం వ్యాపారాన్ని విస్తరించారు. వ్యర్థాల నిర్వహణలో ఆసియాఖండంలోనే ప్రధాన కంపెనీల్లో ఒకటిగా రాంకీ గుర్తింపు. రాంకీ ఫౌండేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా విద్య, మహిళ సాధికారత, సహజ వనరుల సంరక్షణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. మోపిదేవి వెంకటరమణారావు బయోడేటా స్వస్థలం: నిజాంపట్నం పుట్టిన తేదీ : 06–08–1964 తల్లిదండ్రులు: రాఘవయ్య, నాగులమ్మ విద్యార్హత : బీఏ కుటుంబం: అరుణభాస్కరి(భార్య), రాజీవ్(కుమారుడు), జస్మిత(కుమార్తె) రాజకీయ చరిత్ర : 1984లో ఎంపీపీ(కాంగ్రెస్), 1989, 1994లో రెండుసార్లు కూచినపూడి ఎమ్మెల్యేగా పోటీ(కాంగ్రెస్), 1999, 2004లో కూచినపూడి ఎమ్మెల్యేగా గెలుపు(కాంగ్రెస్), 2009లో రేపల్లె ఎమ్మెల్యేగా గెలుపు(కాంగ్రెస్), 2014, 2019లో రేపల్లె ఎమ్మెల్యేగా ఓటమి(వైఎస్సార్ సీపీ), 2004, 2009లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్లో కూడా పలు శాఖలు నిర్వహించారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లో మరోసారి మంత్రి అయ్యారు. -
ఏపీ ప్రజలకు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి
సాక్షి, గుంటూరు : తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకం ఉంచినందుకు ఆనందంగా ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర వాణి వినిపిస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారని అన్నారు. తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే వైఎస్ జగన్ కూడా నడుస్తున్నాని చెప్పారు. కాగా, రాజ్యసభ ఎన్నికలకు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ పరిమల్ నత్వాని పేర్లను ప్రకటించింది. చదవండి : వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరిద్దరినీ రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమల్‌ను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థులను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం వీరు మాట్లాడుతూ... ‘ఈనెల 6వ తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్థులను ఖరారు చేశాం. 50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలను రాజ్యసభకు నామినేట్ చేశాం. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశాం. ఇక నాలుగో సీటు పరిమల్ నత్వానికి ఇవ్వనున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి పరిమల్‌కు ఇవ్వడం జరిగింది. పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’ అని వెల్లడించారు. పరిమల్ నత్వానీ వైస్సార్ సీపీ అభ్యర్ధే... పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ అభ్యర్ధన మేరకే నత్వానీకి టిక్కెట్ కేటాయించామని, అయినా ఆయన్ని తమ పార్టీ అభ్యర్థిగానే భావిస్తుస్తాని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రాజ్యసభ టిక్కెట్లు దక్కించుకున్న ఇద్దరు మంత్రులు ఇప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారని ప్రకటించి.. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజీనామా చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు ఈనెల 7న ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. మార్చి 6 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
దాడులపై న్యాయపోరాటం చేస్తాం..
దాచేపల్లి, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వ్యక్తులపై న్యాయపోరాటం చేస్తామని ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. నడికుడి గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన దాచేపల్లి ఎంపీపీ అభ్యర్థి మందపాటి రమేష్‌రెడ్డి,నాయకులు కొత్త వెంకటేశ్వరరెడ్డి, శ్రీపతి చార్లెస్‌లపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడిన విషయం విదితమే. గురువారం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలు నారాయణపురం పార్టీ కార్యాలయంలో ఎంపీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డిని, నడికుడిలో చాట్ల చార్లెస్‌ను పరామర్శించారు. టీడీపీ నాయకులు వరిగడ్డి వామికి నిప్పుపెట్టడంతో ఆర్థికంగా నష్టపోయిన వైఎస్సార్ సీపీ నడికుడి-1 ఎంపీటీసీ అభ్యర్థి వంకాయలపాటి లక్ష్మిని కూడా వారు పరామర్శించారు. ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతోందని గ్ర హించిన టీడీపీ నాయకులు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన తమ పార్టీ నాయకులపై విక్షణరహితంగా దాడిచేసి గాయపర్చడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఓటమి భయంతోనే తమ పార్టీ నాయకులపై భౌతికదాడులకు పాల్పడ్డారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. వారి వెంట పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, సర్పంచ్‌లు బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, బాసిపోగు రాంబాబు, నాయకులు ఆకూరి శ్రీనివాసరెడ్డి, స్వర్ణ జానకీరామయ్య, కొమ్మారెడ్డి వెంకటరెడ్డి, మునగా పున్నారావు, పీవీ నరసింహారావు, షేక్ సుభాని తదితరులు ఉన్నారు. ఓటమి భయంతోనే దాడులు.. గురజాల: ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులకు దిగుతున్నారని వైఎస్సార్ సీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మూలగొండ్ల ప్రకాశ్‌రెడ్డి, చార్లెస్‌లను గురువారం అయోధ్యరామిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్, గురజాల అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ హత్యా రాజకీయాలను తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎన్ని కుటిల యత్నాలు చేసినా విజయం తమదేనని తెలిపారు. వారి వెంట వైఎస్సార్ సీపీ మండల యూత్ కన్వీనర్ బొడ్డపాటి బాలిరెడ్డి, మాజీ ఎంపీపీ వీరంరెడ్డి అమరారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సోమా వెంకట్రావు, బీసీ విభాగం మండల కన్వీనర్ సంకుల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ ఖాయం
నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి సత్తెనపల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సత్తెనపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ 175స్థానాల్లో 140 ఎమ్మెల్యే సీట్లతోపాటు, మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించబోతోందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని కుట్ర లు, కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోడి అనే పువ్వును తీసుకొచ్చి సీమాంధ్ర ప్రజల చెవుల్లో పువ్వు పెట్టాలని చూస్తున్నారని, అది కూడా ప్రజలు గమనించారన్నారు. వారి పప్పులు ఉడకపోవడంతో సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు, పవన్ అన్నదమ్ములిద్దరూ రూ.100 కోట్లకు పార్టీని అమ్మేసుకున్న ఘనులని విమర్శించారు. ప్రజారాజ్యం పేరుతో తమ సామాజికవర్గాన్ని వారు ముంచేశారన్నారు. వైఎస్సార్ సీపీ సీమాంధ్రలో కాపులకు 32 ఎమ్మెల్యే టికెట్లతో పాటు ఆరు ఎంపీ స్థానాలు కేటాయించి సముచిత స్థానం కల్పించిందని అంబటి పేర్కొన్నారు. -
పల్నాడును ప్రత్యేక జిల్లా చేస్తా..
పల్నాడు ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేసేందుకు కృషి చేస్తానని నరసరావుపేట పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి చెప్పారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీలు తీసుకొచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే.. - సాక్షి, గుంటూరు పొత్తులు చిత్తు చేస్తాం.. టీడీపీ ఒంటరిగా పోటీచేయలేక బీజేపీతో పొత్తుపెట్టుకుంది. ఆ రెండు పార్టీలే కాదు ఎంతమంది పొత్తుపెట్టుకున్నా.. మా కొచ్చిన భయమేమీ లేదు. ప్రజలకు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడిపై నమ్మకం, గౌరవంపై ఉన్నాయి. 2004లో మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి వచ్చినా వైఎస్సార్ ఒక్కరే ఒంటిచేత్తో పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఇప్పుడుకూడా సమర్ధుడైన జగన్ నాయకత్వంలో ముందుకుసాగుతున్నాం. ఎన్ని కూటములు వచ్చినా వైఎస్సార్సీపీని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు. మా పార్టీకి అధికారంలోకి రావాడం ఖాయం.. జగన్ సీఎం కావడం ఖాయం. నేను.. నాతోపాటు నా పార్లమెంటు పరిధిలోని ఏడుగురు శాసనసభ్యులు అత్యధిగ మెజార్టీతో గెలవబోతున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం.. ఎంపీగా గెలుపొందాక పార్టీ అందించే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయించి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తా. ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఏం చేయాలనేది ఆలోచించి అభివృద్ధి చేస్తా. వృత్తి నైపుణ్యం, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తా. అనవసర విమర్శలు మా నైజం కాదు.. రాజకీయ పార్టీల అభ్యర్థులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. మేము మాత్రం పార్టీపరంగా, వ్యక్తిగతంగా ప్రజలకు గట్టి భరోసా ఇస్తూ మేం ఏం చేస్తామనేది చెప్తూ ముందుకెళుతున్నాం. వైఎస్సార్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. దీంతో ప్రజలకు ఎవరు మంచి చేస్తారో అర్ధమవుతోంది. అవసరమైన చోట ప్రతిపక్షాల తప్పుడు విధానాలను ప్రజలకు తెలియపరుస్తూనే ఉన్నాం. అంతేకాని అనవసరంగా ఏది పడితే అది విమర్శించడం మా నైజం కాదు. ఫౌండేషన్ ద్వారానూ సేవ.. ప్రచారంలో ఎన్నో సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. గ్రామాల్లో జీవన ప్రమాణాలు మౌలిక వసతులు, ఆదాయ వనరులు బాగా తక్కువగా ఉన్నాయి. వీటన్నింటిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. నా పార్లమెంటు పరిధిలో 28 మండలాలు, 750 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక్కరిని జాతీయ స్థాయిలో ఉన్నతస్థానంలో కూర్చొబెట్టాలనేదే నా ఆలోచన. అతని ద్వారా ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ప్రతి గ్రామానికి ఓ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వపరంగా కుదరకపోతే మా ఫౌండేషన్ ద్వారా వాటిని పూర్తి చేసే ఏర్పాటు చేస్తా. టీడీపీని ప్రజలు విశ్వసించ రు.. టీడీపీ నేతలు నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు, వీటిని విశ్వసించరు. వైఎస్ చెప్పినవి, చెప్పనవి కూడా చాలా చేశారు. కనుక ఆయన అంటే ప్రజల్లో విశ్వాసం ఉంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో చెప్పిన ఏ ఒక్కటి చేయలేదు. కాబట్టే ఆయన ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. రాయపాటి చెప్పే మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. -
నాడు తిట్లు.. నేడు పొగడ్తలు
మాచర్లటౌన్, న్యూస్‌లైన్: నాడు కాంగ్రెస్ నాయకులను విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు వారినే తన పార్టీలో చేర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి సీమాంధ్ర రాజధానికి ప్యాకేజీ అడిగిన చంద్రబాబు నిత్యం కాంగ్రెస్ నాయకులను విమర్శించారన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులం దరిని చంద్రబాబు దుమ్మెత్తి పోశారని, నేడు వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ టీడీపీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతమవు తుందని చెప్పుకుంటున్నారన్నారు. బాబు రాజకీయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోరాటం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. అంతేకాక సీమాంధ్రను అభివృద్ధి చేయగలిగిన శక్తిమంత నేత జగన్ అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు జగన్ అన్నారు.అందుకే ఆయనపై విశ్వాసంతో అన్ని ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలువబోతున్నారన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. విలేకరుల సమా వేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మహానేత రుణం తీర్చుకుందాం
సాక్షి, గుంటూరు :వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పొందిన మనమంతా ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టి ఆ మహానేత రుణాన్ని తీర్చుకుందామని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు. నరసరావుపేటలో గురువారం రాత్రి జరిగిన వైఎస్సార్ జనభేరి కార్యక్రమంలో ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చే రారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువనేత జగన్‌కు అండగా ఉందామని, రాజన్న ఆశయాలు ఆలోచనలు ముందుకు తీసుకెళదామని చెప్పారు. రాజశేఖరరెడ్డి కంటే తెగువ, ధైర్యం, కష్టపడే తత్వం ఎక్కువగా ఉన్న నాయకుడు జగన్ అని, అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని పేర్కొన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తే దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. తిరస్కరించిన వారి కోసమే కిరణ్ పార్టీ.. వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఖాళీలు లేక, టీడీపీలో చేరలేక మిగిలిపోయిన వ్యక్తుల కోసమే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడుతున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు, సోనియాలు ఏకమైనా కిరణ్‌కుమారెడ్డి పార్టీ పెట్టినా జగన్ ను ఏమీ చేయలేరన్నారు. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబానికి తీరని అన్యాయం చేసిందన్నారు. బాబు వస్తే జాబు పోయే.. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్‌ను ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకోలేరన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ ఉ మ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో జాబు కావాలంటే బాబురావాలని టీడీపీ నినాదంగా తీసుకుందని, వాస్తవానికి జాబు పోవాలంటే చంద్రబాబు రావాలని ఎద్దేవాచేశారు. నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తల్లిలాగా తనను ఆదరించినందుకు జగన్‌కు రుణపడి ఉన్నానన్నారు. నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్నారని, వాస్తవానికి వారికి కూడు, గూడు, గుడ్డ అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులురావి వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు పాల్పడ్డాయని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనరు విజయచందర్ మాట్లాడుతూ, చంద్రబాబు, సోనియా, బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని వల్లకాడు చేశాయని విమర్శించారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయ కర్త కోన రఘుపతి మాట్లాడుతూ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్ అని అభివర్ణించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దాది వెంకట లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లేకుండా మూడున్నరేళ్లపాటు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ జగన్ వ్యాట్ ట్యాక్స్‌కు వ్యతిరేకంగా నరసరావుపేటలో ధర్నా చేసి వ్యాపారుల కష్టాలు తీర్చాడన్నారు. తాను తీసిన గోతిలోనే.. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ తాను తీసిన గోతిలో తానే పడిందన్నారు. గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ షౌకత్ మాట్లాడుతూ ఇటలీ సోనియా తెలుగు వారిని రెండు ముక్కలు చేసిందని విమర్శించారు. పెదకూరపాడు నియోజకవర్గం సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడి వద్ద పనిచేస్తున్నందుకు ప్రతి కార్యకర్త గర్వపడాలన్నారు. గుంటూరు నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోటీ అన్నారు. తెనాలి నియోజకవర్గం సమన్వయకర్త కిలారు రోశయ్య మాట్లాడుతూ చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకొని రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యాడన్నారు. సభలో పార్టీ నేతలు మేరిగ విజయలక్ష్మి, బండారు సాయిబాబా, నర్సిరెడ్డి, సయ్యద్‌మాబు, దేవళ్ల రేవతి, కావటి మనోహర్‌నాయుడు తదితరులు ప్రసంగించారు. -
'నరసరావుపేట దెబ్బ ఏంటో చూపిద్దాం'
-
'నరసరావుపేట దెబ్బ ఏంటో చూపిద్దాం'
నరసరావుపేట(గుంటూరు జిల్లా): వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్ బాటలో నడుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్నాడు పౌరుషం ఏంటో చూపిద్దామని పిలుపునిచ్చారు. నరసరావుపేట దెబ్బ ఎలావుంటుందో చూపించాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ మాత్రమే నెరవేర్చగలరని చెప్పారు. జగన్ నాయకత్వంలో నడిచి వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేయాలని అయోధ్యరామిరెడ్డి కోరారు. -
జనభేరికి సన్నద్ధం
‘చలో నరసరావుపేట’ నినాదంతో మార్చి ఆరో తేదీన నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో నిర్వహించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జనభేరి’ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రామిరెడ్డిపేటలోని తన కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారందరితో కలసి అయోధ్యరామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరిగే జనభేరి సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నారు. ఆ సభలో ఆయన సమక్షంలో తనతో పాటు అనేక మంది నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోత్నునట్టు చెప్పారు. ఈ సభకు హాజరయ్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనుద్దేశించి, పార్టీ విధివిధానాలపై జగన్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరిన తరువాత నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. రాష్ట్రానికి దిశ, దశా నిర్ధేశించగల నాయకుడు జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్,బీజేపీలు తీరని అన్యాయం చేశాయి : మర్రి రాజశేఖర్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడి ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు. భారతీయ జనతాపార్టీ కూడా సీమాంధ్రులను మురిపించి అన్యాయానికి పాల్పడిందన్నారు. రాష్ట్రంలో జగన్ ఒక్కరే మొదటి నుంచి సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ దేశంలోని జాతీయ నాయకులందరిని కలిసి రాష్ట్ర సమైక్యతకు కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరి వేదనలను పెడచెవిన పెట్టి విభజనకు పాల్పడిందన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారంలోకి రానున్నట్లు తెలియజేస్తున్నాయన్నారు. జగన్ సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని తమ ఇబ్బందులను తొలగించేది జగన్ ఒక్కరేనని భావిస్తున్నారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, సమన్యాయం అంటే ఏమిటో ఇప్పటికీ చంద్రబాబుకు తెలియదన్నారు. కాంగ్రెస్‌వారిని చేర్చుకొని చ ంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని, రాష్ట్ర విభజనకు అన్ని విధాల సహకరించిన రాష్ట్ర మంత్రులను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జనభేరి సభకు ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు స్వచ్ఛంధంగా తరలిరానున్నట్లు చెప్పారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో మాచర్లలో ఓదార్పు యాత్రను కూడా జగన్ నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, పెదకూరపాడు, వినుకొండ నియోజవకర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నన్నపనేని సుధ ఇంకా ఆళ్ల పేరిరెడ్డి పాల్గొన్నారు.