దాడులపై న్యాయపోరాటం చేస్తాం..
దాచేపల్లి, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వ్యక్తులపై న్యాయపోరాటం చేస్తామని ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. నడికుడి గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన దాచేపల్లి ఎంపీపీ అభ్యర్థి మందపాటి రమేష్‌రెడ్డి,నాయకులు కొత్త వెంకటేశ్వరరెడ్డి, శ్రీపతి చార్లెస్‌లపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడిన విషయం విదితమే. గురువారం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలు నారాయణపురం పార్టీ కార్యాలయంలో ఎంపీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డిని, నడికుడిలో చాట్ల చార్లెస్‌ను పరామర్శించారు. టీడీపీ నాయకులు వరిగడ్డి వామికి నిప్పుపెట్టడంతో ఆర్థికంగా నష్టపోయిన వైఎస్సార్ సీపీ నడికుడి-1 ఎంపీటీసీ అభ్యర్థి వంకాయలపాటి లక్ష్మిని కూడా వారు పరామర్శించారు.
ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతోందని గ్ర హించిన టీడీపీ నాయకులు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన తమ పార్టీ నాయకులపై విక్షణరహితంగా దాడిచేసి గాయపర్చడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఓటమి భయంతోనే తమ పార్టీ నాయకులపై భౌతికదాడులకు పాల్పడ్డారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. వారి వెంట పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, సర్పంచ్‌లు బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, బాసిపోగు రాంబాబు, నాయకులు ఆకూరి శ్రీనివాసరెడ్డి, స్వర్ణ జానకీరామయ్య, కొమ్మారెడ్డి వెంకటరెడ్డి, మునగా పున్నారావు, పీవీ నరసింహారావు, షేక్ సుభాని తదితరులు ఉన్నారు.
ఓటమి భయంతోనే దాడులు..
గురజాల: ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులకు దిగుతున్నారని వైఎస్సార్ సీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మూలగొండ్ల ప్రకాశ్‌రెడ్డి, చార్లెస్‌లను గురువారం అయోధ్యరామిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్, గురజాల అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ హత్యా రాజకీయాలను తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎన్ని కుటిల యత్నాలు చేసినా విజయం తమదేనని తెలిపారు. వారి వెంట వైఎస్సార్ సీపీ మండల యూత్ కన్వీనర్ బొడ్డపాటి బాలిరెడ్డి, మాజీ ఎంపీపీ వీరంరెడ్డి అమరారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సోమా వెంకట్రావు, బీసీ విభాగం మండల కన్వీనర్ సంకుల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.