
సాక్షి, న్యూఢిల్లీ: తమపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన సీఎం వైఎస్ జగన్ ఆశయాన్ని నిలబెడతామని ఎంపీగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా పని చేస్తామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల ఎంపీగా ఎన్నికైన అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సేవా రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టామని తెలిపారు. కేంద్రం పాలసీలను రాష్ట్రానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు.
కేంద్రం పాలసీలతో రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పని చేస్తామని చెప్పారు. పథకాలను గడువు లోపల పూర్తి చేసుకోవడానికి కేంద్రంతో సమన్వయంతో రాష్ట్రం పనిచేస్తుందని అన్నారు. సంపద సృష్టి, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అనంతరం లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మాట్లాడారు. రాజ్యసభలో ఒక ఎంపీతో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఇప్పుడు ఆరుకు చేరిందని అన్నారు. ఈ బలంతో రాష్ట్రానికి మరింత ఉపయోగపడే విధంగా పని చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment