Rajya Sabha MP
-
న్యాయ వ్యవస్థపై... నమ్మకం పోతోంది
న్యూఢిల్లీ: దేశ వ్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకం వంటి అంశాలు పద్ధతి ప్రకారం జరగడం లేదన్నారు. ఈ వాస్తవాన్ని న్యాయ వ్యవస్థతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినప్పుడే మెరుగైన ప్రత్యామ్నాయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సిబల్ శనివారం పీటీఐకి ఇచి్చన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరికిందన్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటప్పుడు వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం బాధ్యతాయుత పౌరుని లక్షణం కాదు’’ అన్నారు. సిబల్ ఇంకా ఏం చెప్పారంటే...ఈసీ ఓ విఫల వ్యవస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ విఫల వ్యవస్థ. రాజ్యాంగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని ఈసీపై ప్రజలకు విశ్వాసం లేదు. వారి నమ్మకాన్ని తిరిగి ఎంత త్వరగా పొందగలిగితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అంతే అవకాశముంటుంది. ఈవీఎంలతోపాటు ఎన్నికల ప్రక్రియ కలుషితమైందని ప్రతిపక్షాలకు చెప్పాలనుకుంటున్నా. ఈసీ వెలువరించే ఫలితాలు అనేక దశల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాక విడుదల చేసేవి అయి ఉండొచ్చు. ఇలాంటి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కూటమిగా ఒకే అజెండాతో సాగాలి. సైద్ధాంతిక ప్రాతిపదిక, విధానాలు రూపొందించుకోవాలి. కూటమి అభిప్రాయాల వ్యక్తీకరణకు సమర్థుడైన ప్రతినిధి ఉండాలి. అప్పుడే కూటమి ప్రభావం చూపే అవకాశముంటుంది. న్యాయవ్యవస్థలో అవినీతి మూడు రకాలు మన న్యాయవ్యవస్థ పనితీరుపై ఏళ్లుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఒకటి అవినీతి. ఈ అవినీతికి అనేక కోణాలున్నాయి. వీటిలో ఒకటి న్యాయమూర్తి ప్రతిఫలం ఆశించి తీర్పులివ్వడం. రెండోది భయం, స్వార్థం లేకుండా తీర్పులిస్తామన్న ప్రమాణానికి భిన్నంగా తీర్పులివ్వడం. దీనికో ఉదాహరణ చెబుతాను. ప్రస్తుతం జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టులు 95 శాతం కేసుల్లో బెయిల్‌ను తిరస్కరిస్తున్నాయి. ఇక్కడే తేడా జరుగుతోంది. బెయిలిస్తే అది వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారేమో! మూడో రకం అవినీతి న్యాయమూర్తులు మెజారిటీ సంస్కృతిని బాహాటంగా ఆమోదిస్తుండటం, రాజకీయపరమైన వైఖరిని వ్యక్తం చేస్తుండటం. పశ్చిమ బెంగాల్లో ఓ న్యాయమూర్తి ఒక రాజకీయ పార్టీకి అనుకూల వైఖరిని వ్యక్తపరిచారు. తర్వాత రాజీనామా చేసి అదే పార్టీలో చేరిపోయారు. మరో జడ్జి తాను ఆర్ఎస్ఎస్ మద్దతుదారునంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. భారత్‌లో మెజారిటీ సంస్కృతిదే పైచేయిగా ఉండాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ వీహెచ్‌పీకి సంబంధించిన కార్యక్రమంలోనే వ్యాఖ్య లు చేశారు. హిందువులు మాత్రమే ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చగలరనడమే గాక మైనారిటీ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారు. ఆయనపై జరిపిన రహస్య విచారణ ఫలితం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలాంటి వ్యవహారాలను సరైన గాడిలో పెట్టాలి. ఇలాంటి వివాదాంశాలపై సుప్రీంకోర్టు తక్షణం స్పందించి ఎందుకు పరిష్కరించలేకపోతోందో అర్థం కావడం లేదు!ప్రత్యామ్నాయమే లేదు! అవినీతికి పాల్పడిన న్యాయమూర్తులపై రాజ్యాంగంలోని 124వ అధికరణం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు 50 మందికి మించిన రాజ్యసభ సభ్యుల సంతకాలతో పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. ఇదంత త్వరగా తెమిలేది కాదు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. న్యాయమూర్తులపై రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లలేనప్పుడు ఇతర ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేనే లేవు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న న్యాయవ్యవస్థ తనకు తాను వేసుకోవాలి. ఇక్కడే న్యాయ వ్యవస్థపై నమ్మకం క్షీణిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై విమర్శలు పోవాలంటే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. కొలీజియం ఆశించినట్టుగా పనిచేయడం లేదని సుప్రీంకోర్టు గ్రహించాలి. కేవలం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)తో సమస్య పరిష్కారం కాదని కేంద్రం కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం. -
విజయసాయి రెడ్డి రాజీనామా
-
ఈవీఎంలపై సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: ఎంపీ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో తేడాలపై కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలను ఎన్నికల సంఘం (ఈసీ) నివృత్తి చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ గురు, శుక్రవారాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీకి ఆధారాలు అందజేస్తున్నామని, తమ సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సి ఉందని కపిల్ సిబల్ అన్నారు. ‘ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందనే భావిస్తున్నా. అయితే అది ఏమేరకు జరుగుతోందనేది నేను చెప్పలేను. ఈవీఎంల వాడకానికి నేను మొదటినుంచి వ్యతిరేకమే. పారదర్శకత లేనిదేనైనా ఆమోదయోగ్యం కాదు’ అని కాంగ్రెస్ మాజీ నాయకుడు సిబల్ అన్నారు. హరియాణాలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంల బ్యాటరీలు 80 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబర్చారని, 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయనేది కాంగ్రెస్ ఆరోపణ. -
మళ్లీ ‘రింగ్’లోకి దిగాలనుంది
ముంబై: బాక్సింగ్ క్రీడకు తాను ఇంకా రిటైర్మెంటే ప్రకటించలేదని... మళ్లీ ప్రొఫెషనల్ బాక్సింగ్ సర్క్యూట్‌లోకి దిగాలనే ఆలోచన ఉందని భారత మేటి బాక్సర్ మేరీకోమ్ తెలిపింది. ‘పోటీల్లో పాల్గొనాలనుకుంటున్నాను. పునరాగమనంపై నా అవకాశాల కోసం చూస్తున్నా. ఇంకో నాలుగేళ్లు ఆడే సత్తా నాలో వుంది. నా ప్రపంచం బాక్సింగే. అందుకే అందులో ఎంత ఆడినా, పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్లెన్ని గెలిచినా ఇంకా కెరీర్‌ను కొనసాగించాలనే ఆశతో ఉన్నాను’ అని మాజీ రాజ్యసభ ఎంపీ అయిన మేరీకోమ్ తెలిపింది. పారిస్‌లో భారత బాక్సర్ల వైఫల్యం... దరిమిలా తన అభిప్రాయాలను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్యతో వివరించాలనుకుంటున్నట్లు చెప్పింది. ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, రియో పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ పారిస్‌లో పతకాలు గెలుపొందలేకపోయారు. ఇక టోర్నీల సమయంలో బరువు నియంత్రణ, నిర్వహణ బాధ్యత పూర్తిగా క్రీడాకారులదేనని మేరీకోమ్ స్పష్టం చేసింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వంద గ్రాముల అధిక బరువుతో పసిడి వేటలో అనర్హతకు గురైంది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల మేరీ ఆమె పేరును ప్రస్తావించకుండా ‘బరువు’ బాధ్యత గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘ఈ విషయంలో నేనెంతగానో నిరాశకు గురయ్యాను. నేను కూడా ఇలాంటి సమస్యల్ని కొన్నేళ్ల పాటు ఎదుర్కొన్నాను. అతి బరువు నుంచి మనమే జాగ్రత్త వహించాలి. ఇది మన బాధ్యతే! ఇందులో నేను ఎవరినీ నిందించాలనుకోను. వినేశ్ కేసుపై నేను వ్యాఖ్యానించడం లేదు. నా కెరీర్లో ఎదురైన చేదు అనుభవాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. బరువును నియంత్రించుకోకపోతే బరిలోకి దిగడం కుదరదు. పతకం లక్ష్యమైనపుడు మన బాధ్యత మనకెపుడు గుర్తుండాలిగా’ అని వివరించింది. -
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. -
బీజేడీ ఎంపీ మొహంతా రాజీనామా
న్యూఢిల్లీ: బిజూ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మమతా మొహంతా బుధవారం ఎగువసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మమత స్వదస్తూరీతో రాజీనామా లేఖను రాసి, తనను కలిసి అందజేశారని, నిబంధనల ప్రకారమే ఉండటంతో ఆమె రాజీనామాను తాను ఆమోదించానని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. మమత బీజేపీలో చేరనున్నారని పారీ్టవర్గాలు వెల్లడించాయి. మమత రాజీనామాతో రాజ్యసభలో బీజేడీ బలం ఎనిమిదికి పడిపోయింది. ఒడిశాలో అధికారంలోకి వచి్చన బీజేపీ ఆ స్థానాన్ని దక్కించుకోనుంది. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌కు గురువారం అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కేశవరావు ఆ పార్టీ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.రాజీనామా సమర్పించిన అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారని.. బీఆర్ఎస్ సింబల్‌పై ఎన్నికైన నేపథ్యంలో రాజీనామా చేశానని తెలిపారు. నైతిక విలువలు పాటించి, చట్టానికి కట్టుబడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని.. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా సమర్పించానని కేశవరావు చెప్పారు. -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్‌హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్‌వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్‌మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు. ‘ఈ అంశం ధీరజ్ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు’’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం స్పష్టంచేశారు. విపక్షాలపై అమిత్ విమర్శలు ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ దర్యాప్తు సంస్థలను కేంద్రం దురి్వనియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది. విపక్షాలు తమ అవినీతి, అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి. తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి’’ అమిత్ వ్యాఖ్యానించారు. -
దాడుల్లో దొరికింది 290 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారు లు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా రూ. 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన రూ. 250 కోట్లను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబ డటం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి. మొరాయిస్తున్న కౌంటింగ్ మెషిన్లు ‘ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో, ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్నా పెద్దా కౌంటింగ్ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా రూ. 500 నోట్ల రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు రూ. 250 కోట్లను లెక్కించి బ్యాంకుల తరలించాం. శనివారం సాయంత్రానికి లెక్క పెట్టడం పూర్తవుతుంది. మొత్తం రూ. 290 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా, ఈ డబ్బును సంభాల్పూర్, బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించాం’ అని అధికారులు వివరించారు. స్పందించని కాంగ్రెస్ ఎంపీ ఇప్పటి వరకు సోదాలు జరిపిన ప్రాంతాల్లో జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందింది కూడా ఉందని ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టాం’అని ఐటీ వర్గాలు వివరించాయి. సోదాల్లో పాల్గొన్న 150 మంది అధికారులతోపాటు ఆయా ప్రాంతాల్లో లభ్యమైన డిజిటల్ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్ నుంచి మరో 20 మంది అధికారులు కూడా వచ్చారన్నారు. దాడులు జరిగిన కంపెనీల అధికారుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామన్నారు. ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు వెలుగులోకి రావడంపై ఎంపీ సాహు స్పందన కోసం తమ ప్రతినిధి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పీటీఐ తెలిపింది. 10 అల్మారాల నిండా డబ్బుల కట్టలు ‘బొలంగీర్ జిల్లాలోని ఓ కంపెనీ ఆవరణలోని సుమారు 10 అల్మారాల్లో రూ. 230 కోట్ల నగదు దొరికింది. మిగతాది తిత్లాగఢ్, సంబల్పూర్, రాంచీల్లో లభ్యమైంది. శనివారం బొలంగీర జిల్లా సుదపారకు చెందిన దేశవాళీ మద్యం తయారీదారుకు చెందిన ఇంట్లో మరో 20 బ్యాగుల నిండా ఉన్న డబ్బు లభ్యమైంది. ఇందులో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. దీన్ని లెక్కించాల్సి ఉంది. అదేవిధంగా, శుక్రవారం వెలుగు చూసిన 156 బ్యాగుల్లోని డబ్బును బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన బ్రాంచికి తరలించి, లెక్కిస్తున్నాం’అని వివరించారు. ఐటీ డీజీ సంజయ్ బహదూర్ మూడు రోజులుగా భువనేశ్వర్‌లో మకాం వేసి, పర్యవేక్షిస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది: బీజేపీ ఐటీ దాడుల్లో నమ్మశక్యం కాలేని రీతిలో నగదు బయటపడటంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని తరాలుగా ఎలా సజీవంగా ఉంచిందో దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. ‘కేవలం ఒక్క కాంగ్రెస్ నేత వద్ద రూ.300 కోట్ల నగదు దొరికింది. కాంగ్రెస్ నేతలందరి దగ్గరా కలిపితే ఎంత డబ్బు దొరుకుతుందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు’అని ఆమె అన్నారు. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని, ఎంతగా అవినీతికి పాల్పడొచ్చో కాంగ్రెస్ నేతలు నిరంతరం అన్వేషిస్తుంటారని పేర్కొన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీ అయిన సాహ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మద్యం వ్యాపారి ధీరజ్ సాహు ఏటీఎం ఎవరిదని ఆమె ప్రశ్నించారు. -
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గుర య్యారు. ఆయన సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాది త సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఆప్ మరో నేత సంజయ్ సింగ్ సస్పెన్షన్ పొడిగించే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే సంజయ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. -
‘ఇన్సాఫ్ కె సిపాహి’కి కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో జరిగే అన్యాయాలపై పోరాటానికి ఏర్పాటు చేసిన ‘ఇన్సాఫ్ కె సిపాహి’వేదికకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ‘సిబల్ ప్రకటించిన ఇన్సాఫ్ సిపాహి చాలా ముఖ్యమైంది. అన్యాయంపై కలిసికట్టుగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఇందులో చేరాలి’అని ఆదివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘ఇన్సాఫ్’కు శివసేన ఉద్ధవ్ వర్గం, ఆర్జేడీ చీఫ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మద్దతు దక్కింది. -
అన్యాయంపై పోరాటానికి ‘ఇన్సాఫ్’
న్యూఢిల్లీ: దేశంలో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు ‘ఇన్సాఫ్’అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ లాయర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించారు. తన ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, నేతలు సహా ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. దేశంలో పౌరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీని సంస్కరించడమే తప్ప, విమర్శించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం సమకూరాలని రాజ్యాంగం చెబుతున్నా, అన్ని చోట్లా అన్యాయమే జరుగుతోందన్నారు. -
మోదీపై తృణమూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మాజీ బ్యూరోక్రాట్ జవహార్ సిర్కార్ ఓ మీడియా ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి జై శంకర్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. పైగా జై శంకర్ తండ్రి కే సుమ్రమణ్యం ప్రధాని నరేంద్ర మోదీని అసుర అని సంబోధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు జవహార్ సిర్కార్ ట్విట్టర్ వేదికగా జైశంకర్ తండ్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. విమర్శలు గుప్పించారు. ఈ మేరకు జైశంకర్ తండ్రి సుబ్రమణ్యం గుజరాత్ 2002 అల్లర్లల విషయంలో ధర్మ హత్య జరిగిందన్నారు. అమాయకులను రక్షించడంలో మోదీ విఫలమై అధర్మానికి పాల్పడ్డారన్నారన్నారు. కానీ ఆయన కొడుకు ఒక అసురుడిని సేవిస్తున్నందుకు సిగ్గుపడకుండా సరైన నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరానని గర్వంగా చెబుతున్నాడంటూ జైశంకర్‌పై సిర్కార్ మండిపడ్డారు. అంతేగాదు నాడు జై శంకర్ తండ్రి రాముడు కచ్చితంగా గుజరాత్‌లోని అసుర పాలకులపై బాణాలను ఎక్కుపెట్టేవాడంటూ తిట్టిపోసిన వ్యాఖ్యలను చెప్పుకొచ్చారు సిర్కార్. ఇదిలా ఉండగా, జైశంకర్ విదేశాంగ కార్యదర్శి నుంచి రాజకీయ ప్రస్తానం వరకు సాగిన ప్రయాణం గురించి ఏఎన్ఐ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1980లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా ఉన్న తన తండ్రి కె సుబ్రమణ్యంను తొలగించారన్నారు. పైగా తన తండ్రి కంటే జూనియర్‌గా ఉన్న వ్యక్తిని ఆ పదవిలోకి భర్తీ చేశారని చెప్పారు. అలాగే తాను బీజేపీలోకి ఎందుకు చేరానో కూడా వివరించారు. దీంతో తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ జవహార్ విదేశాంగ మంత్రి మతిమరుపుతో బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నాడు తండ్రి చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి...గాంధీలపై ఉన్న అక్కసులను మరోసారి జైశంకర్ బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. ఆయన బీజేపీకి విధేయతగా పనిచేసి అత్యున్నత పదవులను పొందారు. విదేశాంగ మంత్రి పదవిని ఇచ్చినందుకు బీజేపీ తలెకెత్తించుకుంటూ పొగడ్తున్నాడా లేక పదవి మత్తులో మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నారా! అంటూ ట్విట్టర్లో జైశంకర్‌కి గట్టి చురలకలంటించారు. S Jaishankar’s father, K Subramanyam said “Dharma was killed in Gujarat (2002 Riots). Those who failed to protect innocent citizens are guilty of adharma. Rama…would have used his bow against the ‘Asura’ rulers of Gujarat.” Shame on son —serving Asura! https://t.co/rb5gkcerYs — Jawhar Sircar (@jawharsircar) February 21, 2023 (చదవండి: -
కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ కార్యకలాపాలను ఫోన్లో చిత్రిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రజనీ అశోక్‌రావ్ పాటిల్‌ను సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలయ్యే దాకా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీలపై ఆయన చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తుండగా విపక్ష సభ్యుల నిరసనను పాటిల్ వీడియో తీశారు. ఆమెను సస్పెండ్ చేయాలంటూ రాజ్యసభ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ధన్‌ఖడ్ అన్ని పార్టీల నేతల అభిప్రాయం కోరారు. ఆమెపై చర్య తీసుకునే ముందు విచారణ జరిపితే బాగుంటుందని వారన్నారు. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో శిబు సోరెన్
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ శిబు సోరెన్(79) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జరిపి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. 2005–10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. లోక్‌సభకు 8 పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించాడు?
-
రామోజీ నీకు ఇదే నా ఛాలెంజ్
-
రామోజీకి నైతిక విలువలు లేవు.. పుట్టుకే అనైతికం: విజయసాయిరెడ్డి
-
‘మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందాం’
సాక్షి, విశాఖపట్టణం: విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు. విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. టీడీపీ, ఎల్లోమీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కొన్ని పత్రికలు కులం అనే ఇంకుతో విషపు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్సీపీపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈనాడు దాని అనుబంధ కుల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. విషపు రాతలతో కొత్తదారులు అన్వేషిస్తున్నారు. ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం శోచనీయం. వికేంద్రీకరణపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దసపల్లా భూముల విషయంలో బిల్డర్లు, యజమానులు క్లారిటీ ఇచ్చారు. సుప్రీం తీర్పును అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ చర్యలతో 400 కుటుంబాలకు మేలు జరిగింది. 64 ప్లాట్ యజమానుల్లో 55 మంది చంద్రబాబు సామాజిక వర్గం వారే. ఉత్తరాంధ్రలో కాపులు, వెలమలు, యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారు. కానీ, భూములు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. కొన్ని పత్రికలు టీడీపీ కరపత్రం కంటే దిగజారిపోయాయి. కుల పత్రికలపై ఉమ్మి వేసే పరిస్థితి ఏర్పడింది. రామోజీకి నైతిక విలువలు లేవు.. పుట్టుకే అనైతికం.’అని తీవ్రంగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి. రామోజీ, చంద్రబాబుకు సవాల్.. ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు తాను సిద్ధమని.. రామోజీ, చంద్రబాబు సిద్ధమేనా అంటూ సవాల్ చేశారు విజయ సాయి రెడ్డి. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందన్నారు. ‘మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందాం. ఒక్క ఫిలింసిటీలోనే 2,500 ఎకరాలు ఆక్రమించుకున్నారు. పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? మార్గదర్శి డిపాజిటర్లను మోసం చేసిన వ్యక్తి రామోజీ.ఆస్తులపై విచారణకు చంద్రబాబు, రామోజీ సిద్ధమా?’ అంటూ సవాల్ చేశారు. ఇదీ చదవండి: అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ -
రియల్ హీరోగా మారిన హర్భజన్
గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించి, నిత్యం దూకుడుగా కనిపించే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రియల్ లైఫ్‌లోనూ అదే తరహాలో మోసగాళ్లకు చుక్కలు చూపించి, వారి చెరలో నుంచి ఓ అమాయక యువతికి విముక్తి కల్పించాడు. ప్రస్తుతం ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న భజ్జీ.. గల్ఫ్‌లో మోసగాళ్ల చెరలో చిక్కుకున్న ఓ యువతిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని భటిండా ప్రాంతానికి చెందిన కమల్జీత్ అనే 21 ఏళ్ల యువతి ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఓమన్కు వెళ్లాలనుకుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ ఏజెంట్‌ను కలిసి వీసా తదితర ఏర్పాట్లు చేయాలని కొరింది. కమల్జీత్ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఏజెంట్.. ఆమెకు మాయమాటలు చెప్పి గత నెలలో మస్కట్‌కు పంపించాడు. మస్కట్‌లో ఓ హిందూ కుటుంబానికి వంట చేసే పని ఉందని.. మంచి జీతం, వసతి ఉంటాయని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అయితే ఏజెంట్ చెప్పినవేవీ అక్కడ జరగకపోవడంతో కమల్జీత్ మోసపోయానని తెలుసుకుంది. కమల్జీత్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి పాస్ పోర్ట్, సిమ్ కార్డ్ లాక్కొని ఆమెను ఓ గదిలో బంధించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని బయట పడిన కమల్జీత్ తండ్రికి ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించింది. కమల్జీత్ తండ్రి విషయం తెలిసిన వెంటనే తెలిసిన వ్యక్తుల ద్వారా స్థానిక ఎంపీ హర్భజన్‌ను కలిశాడు. జరిగినదంతా భజ్జీకి వివరించాడు. ఇది విని చలించిపోయిన భజ్జీ వెంటనే మస్కట్‌లోని భారత ఎంబసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశాడు. దీంతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగి కమల్జీత్కు మోసగాళ్ల చెర నుంచి విముక్తి కల్పించి సురక్షితంగా భారత్‌కు పంపించారు. దీంతో కమల్జీత్, ఆమె కుటుంబసభ్యులు హర్భజన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీరు గ్రౌండ్లోనూ, రియల్ లైఫ్‌లోనూ హీరోలు అంటూ కొనియాడారు. చదవండి: పసికూనలు చెలరేగుతున్న వేళ, టీమిండియాకు ఎందుకీ దుస్థితి..? -
నా జీతం... రైతు బిడ్డల చదువు కోసం: హర్భజన్
భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు వచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు కోసం, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హర్భజన్ ‘ట్విటర్’ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ ఇటీవల పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. -
డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు
సాక్షి, చెన్నై: డీఎంకే ప్రచార కార్యదర్శి, ఎంపీ కె.ఎస్.ఇళంగోవన్, నళిని దంపతుల కుమార్తె ధరణి వివాహానికి హాజరైన ఆరోపణలపై అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్‌పై ఆ పార్టీ వేటు వేసింది. అన్నాఅరివాలయంలోని కలైంజర్ ఆడిటోరియంలో గురువారం పెళ్లి జరగ్గా ఎంపీ నవనీతకృష్ణన్ హాజరు కావడమేకాక, సీఎం స్టాలిన్‌ను కలిసి అభినందనలు తెలపడం వివాదాస్పదమైంది. దీంతో అన్నాడీఎంకే సమన్వయకమిటీ కన్వీనర్ ఓ.పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి, నవనీతకృష్ణన్ను కమశిక్షణ చర్యగా పార్టీ లీగల్‌సెల్ కార్యదర్శి పదవి నుంచి తప్పించినట్లు శుక్రవారం ప్రకటించారు. చదవండి: రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం கழக ஒருங்கிணைப்பாளர் திரு. ஓ. பன்னீர்செல்வம், கழக இணை ஒருங்கிணைப்பாளர் திரு. எடப்பாடி கே. பழனிசாமி ஆகியோரின் முக்கிய அறிவிப்பு. pic.twitter.com/GoaHfpRkPA — AIADMK (@AIADMKOfficial) January 28, 2022 -
రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. మహేంద్ర బిహార్ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు. (చదవండి: చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు) -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో గౌతమ్ గంభీర్..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. తెలంగాణ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా గంభీర్ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ.. గంభీర్‌కు వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని ఈ సందర్భంగా గంభీర్ కొనియాడారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. గంభీర్ మొక్కలు నాటిన వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఈ ఛాలెంజ్‌లో భాగమైనందుకు గంభీర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, టీ20 ప్రపంచకప్ మెంటర్‌గా ధోని ఎంపికపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
అమర్‌సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్‌సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. -
ఇది జీవితంలో మరిచిపోలేని రోజు
-
ఈ బలంతో మరింత పనిచేస్తాం: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తమపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన సీఎం వైఎస్ జగన్ ఆశయాన్ని నిలబెడతామని ఎంపీగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా పని చేస్తామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల ఎంపీగా ఎన్నికైన అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సేవా రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టామని తెలిపారు. కేంద్రం పాలసీలను రాష్ట్రానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. కేంద్రం పాలసీలతో రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పని చేస్తామని చెప్పారు. పథకాలను గడువు లోపల పూర్తి చేసుకోవడానికి కేంద్రంతో సమన్వయంతో రాష్ట్రం పనిచేస్తుందని అన్నారు. సంపద సృష్టి, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అనంతరం లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మాట్లాడారు. రాజ్యసభలో ఒక ఎంపీతో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఇప్పుడు ఆరుకు చేరిందని అన్నారు. ఈ బలంతో రాష్ట్రానికి మరింత ఉపయోగపడే విధంగా పని చేస్తామని చెప్పారు. -
ఇది జీవితంలో మరిచిపోలేని రోజు: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమ, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకు వెళ్తున్నారుని రాజ్యసభ ఎంపీ మోపిదేవీ వెంకటరమణ అన్నారు. ఏడాది కాలంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో సీఎం వైఎస్ జగన్ నాలుగో స్థానంలోకి వెళ్లడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే బలమైన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిందని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ.. ‘ఇది మా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఇద్దరు బీసీలకు రాజ్యసభ చోటు కల్పించడం అరుదైన విషయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టం మేరకు రైతులకు రెండున్నర రెట్లు ధర చెల్లిస్తున్నాం. సేకరించిన భూమిని ఇల్లు లేని పేదలకు ఇస్తున్నాం. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. ఇళ్ల స్థలాల పంపిణీపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో పస లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసి చూపిస్తారా?’అని ప్రశ్నించారు. ఇక వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. (కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం) -
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: పిల్లి సుభాష్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన మాకు రాజ్యసభలో చోటు కల్పించడం అరుదైన సన్నివేశం. కలలో కూడా ఊహించనిది జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. మా అందరిపైనా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విభజన చట్టం లో హామీలు ఇంకా పరిపూర్ణంగా అమలు కాలేదు .విభజన చట్టం అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆంధప్రదేశ్‌లో రూ.40 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం ఆల్‌టైమ్ రికార్డు. వ్యవసాయ రంగానికి రూ.19 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. విద్యా, వైద్య రంగాల మీద పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాల హృదయంతో ఏపీని ఆదుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా, వైఎస్సార్సీపీ రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. (మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ) -
కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్‌తో విషెస్
సాక్షి, హైదరాబాద్: నూతన వధూవరులను వీడియో కాలింగ్ ద్వారా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశీర్వదించారు. తన వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ శుక్రవారం ఉమారాణిని పెళ్లి చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఈ పెళ్లికి సంతోష్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన తన ప్రయాణాన్ని విరమించుకుని, తన అంగరక్షకుడికి ఫోన్ ద్వారా శుభాశీస్సులు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని, వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని అనుకున్నప్పటికీ కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు మనసులో బాధ ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలను పాటించినట్టు చెప్పారు. ప్రముఖులు, ప్రజలు అందరు కూడా జనసమూహానికి దూరంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సంతోష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. (ఎయిర్పోర్ట్ నుంచి అలా బయటకు వచ్చాం..) -
రాజ్యసభ సభ్యుడిగా గొగోయ్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యుల వ్యతిరేక నినాదాల నడుమ గురువారం రాజ్యసభలో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగానే విపక్షాలు సభనుంచి బయటకు వెళ్లిపోవటం గమనార్హం. విపక్షాల చర్యను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. రాజ్యసభ సభ్యుడిగా రంజన్ తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ( న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నీలినీడలు) సభనుంచి బయటకు వెళ్లిపోతున్న విపక్షాలు కాగా, 13 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా తన సేవలందించిన అనంతరం గతేడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ పొందారు. కొద్దిరోజుల క్రితం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే రంజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ విమర్శలపై రంజన్ స్పందిస్తూ.. ‘దేశ అభివృద్ధి కోసం శాసన, న్యాయ వ్యవస్థలు ఏదో ఒక సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరముందనే నమ్మకంతోనే నేను రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించాన’అని అన్నారు. ( నా ప్రమాణం తర్వాత మాట్లాడతా ) -
ఆంధ్రప్రదేశ్ మాల్యా... సుజనా!
సాక్షి, బిజినెస్ ప్రతినిధి : సుజనా చౌదరి అలియాస్ ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చాలా ఆలస్యంగా స్పందించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈయన కేబినెట్ మంత్రి అయినప్పుడే... కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని కేబినెట్‌కు పంపించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. ఇక మోదీ కేబినెట్లోకి ఇలాంటి వ్యక్తులు చేరడంపై ఆశ్చర్యమూ వ్యక్తమైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సుజనా మాత్రం చక్రం తిప్పారు. అప్పటికే భారీ నష్టాల్లో కూరుకుని, వ్యాపారం సైతం లేకుండా నెగటివ్ నెట్‌వర్త్‌లోకి వెళ్లిపోయిన తన కంపెనీలకు కొత్త రుణాలు ఇప్పించారు. ఆ రుణాలను అనుబంధ కంపెనీల ద్వారా సొంత అవసరాలకు, తన పార్టీ పెద్దల చేతుల్లోకి మళ్లించారు. ఫలితం... 2017 మార్చి 31 నాటికి తన మూడు లిస్టెడ్ కంపెనీల రుణాలు రూ. 7,503 కోట్లకు చేరిపోయాయి. ఇక సుజనా చౌదరి వెనక నుంచి నడిపిస్తున్న బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ రుణాలు రూ. 1,100 కోట్లు. వీటన్నింటిపై గడిచిన ఏడాదిన్నర కాలంగా పేరుకున్న వడ్డీని కూడా కలిపితే ఈ మొత్తం రూ. 9,500 కోట్ల పైనే.!! అంటే... దాదాపుగా కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎగ్టొట్టిన మొత్తంతో సమానం. ఇద్దరూ రాజ్య సభ సభ్యులే కనక సుజనాను ఆంధ్రప్రదేశ్ మాల్యాగా అభివర్ణించవచ్చేమో!! ఇదో చిన్న ఉదాహరణ చూద్దాం... సుజనా టవర్స్ అనేది సుజనా చౌదరి లిస్టెడ్ కంపెనీల్లో ఒకటి. ఇప్పుడు న్యుయన్ టవర్స్‌గా పేరు మార్చుకుంది. ఆర్‌ఓసీకి సమర్పించిన లెక్కల ప్రకారం 2017 మార్చి 31 నాటికి వివిధ కంపెనీల నుంచి దీనికి రావాల్సిన మొత్తం (ట్రేడ్ రిసీవబుల్స్) రూ. 1,290 కోట్లు. నిజానికి ఆ కంపెనీలు కూడా సుజనా చౌదరివే. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే... వ్యాపారపరంగా వస్తువులు విక్రయించినందుకు, సేవలందించినందుకు ఆయా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం. నిజానికి సుజనా కంపెనీల మధ్య జరిగేదంతా బోగస్ ట్రేడింగే. ఈ విషయాన్ని 2006లో ఏపీ సర్వీస్ ట్యాక్స్ అధికారుల విచారణలో సుజనా చౌదరే స్వయంగా అంగీకరించారు. భారీ టర్నోవర్ జరిగినందుకు సర్వీస్ ట్యాక్స్ కట్టాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో... అవన్నీ బోగస్ లావాదేవీలని, టర్నోవర్ కోసం తమ కంపెనీల మధ్యే ఆ లావాదేవీలు జరిగినట్లు చూపిస్తామని, అందుకని పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పారాయన. అది నిజమేనని తేలింది కూడా. ఎందుకంటే అప్పట్లో కొన్ని వాహనాల నంబర్లు ఇస్తూ... ఆ వాహనాల్లో వందలాది టన్నుల వస్తువుల్ని తరలించినట్లు పేర్కొన్నారు. తీరా చూస్తే అవి టూవీలర్ నంబర్లు. అదేంటని సుజనాను విచారిస్తే ఈ బోగస్ ట్రేడింగ్ వ్యవహారం బయటపడింది. మరి ఆ బోగస్ టర్నోవర్‌ను చూపించి దాని ఆధారంగా బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకున్న వ్యక్తి మోసగాడు కాదా? అప్పులు, అడ్వాన్స్‌ల రూపంలో మళ్లింపు... బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని అప్పులు, అడ్వాన్స్‌ల రూపంలో తన సొంత కంపెనీలకు మళ్లించారు సుజనా. ఉదాహరణకు సుజనా యూనివర్సల్ సంస్థ పీఏసీ వెంచర్స్‌కు రూ. 42.74 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అంటే అది సుజనా సొంత జేబులోకి వెళ్లిపోయిందన్న మాట. అలాగే సుజనా మెటల్స్‌కూ (ఇప్పుడు స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్‌గా మారింది) ట్రేడ్ రిసీవబుల్స్ భారీగానే ఉన్నాయి. తన కంపెనీల మధ్యే లావాదేవీల్ని చూపించడం కేవలం రుణాల్ని వ్యాపారానికి వాడకుండా మళ్లించడానికేనని ఎవరికైనా చెప్పకనే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే తన లిస్టెడ్ కంపెనీల పేరిట సుజనా చౌదరి రుణాలు తీసుకుని బ్యాంకులకు చెల్లించకుండా ఎగ్గొట్టిన మొత్తం ఇప్పటికి దాదాపు రూ. 8,400 కోట్లు. ఇందులో ఎంత మొత్తాన్ని తన డబ్బా కంపెనీల ద్వారా మళ్లించారో, ఎంత మొత్తం ఎవరెవరి జేబుల్లోకి వెళ్లిందో తేల్చాల్సింది మాత్రం దర్యాప్తు సంస్థలే. అందరూ పాత్రధారులే కేంద్ర కేబినెట్లోకి ప్రవేశించే నాటికే సుజనాకు బకాయిలు ఎగ్గొట్టిన చరిత్ర ఉంది. వందల కొద్దీ డబ్బా (షెల్) కంపెనీలు సృష్టించి వాటికి నిధులు మళ్లించడం, ఆదాయపు పన్ను (ఐటీ), సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఈపీఎఫ్ ఎగవేయటం వంటి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయినా చంద్రబాబు సిఫారసుతో కేంద్ర కేబినెట్లోకి వెళ్లగలిగారు. అప్పటి నుంచీ దర్యాప్తు సంస్థలేవీ ఆయన కేసులపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వడ్డీ కూడా చెల్లించకపోయినా... హామీగా ఆస్తులేవీ లేకున్నా... బ్యాంకులు కొత్త రుణాలిచ్చాయి. వాటిని చెల్లించడం మానేసినా మిన్నకున్నాయి. చిత్రమేంటంటే దివాలా చట్టం వచ్చాక కూడా ఈ కంపెనీలు తమ బకాయిలు ఎగ్గొట్టాయి కనక దివాలా తీసినట్లు ప్రకటించాలంటూ ఏ బ్యాంకూ ఎన్సీఎల్టీని ఆశ్రయించలేదు. బహుశా.. తాము గనక ఎన్సీఎల్టీని ఆశ్రయిస్తే వాటిని కొనేందుకు ఎవరూ ముందుకురారని ఆ బ్యాంకులకు తెలిసే ఉంటుంది. సుజనా కంపెనీల ఆస్తులు విక్రయిస్తే తమ బకాయిల్లో 3 నుంచి 5 శాతం కూడా వసూలు కావనే వాస్తవం కూడా వాటికి తెలియనిది కాదు. మనీల్యాండరింగ్... జరిగిందిలా!! నిజానికి సుజనా కంపెనీల్లో దశాబ్దం కిందటే మనీల్యాండరింగ్ మొదలైందని చెప్పొచ్చు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వ్యాపారంపై పెట్టకుండా, సొంత ఖాతాలకు మళ్లించడానికి ఆయనో తెలివైన పద్ధతి ఎన్నుకున్నారు. వందలకొద్దీ షెల్ కంపెనీలను సృష్టించడం... ఆ కంపెనీలకు–తన ప్రధాన కంపెనీకి మధ్య ట్రేడింగ్ జరిగినట్లు చూపించడం... ఆ ట్రేడింగ్ అనంతరం అనుబంధ కంపెనీ చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయి పెట్టేయడం!! Searches under PMLA were conducted in case of Sri Y.S.Chowdary,MP of Andra Pradesh to investigate #bankfraud of over ₹6000Crore by more than120 shell companies controlled by Sri Y.S.Chowdary. — ED (@dir_ed) November 24, 2018 -
సుజనాచౌదరి బ్యాంకుల లూటీ మొత్తం 6,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన బినామీగా భావించే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సాగించిన భారీ ఆర్థిక నేరాల ‘సృజన’బట్టబయలైంది. పుట్టగొడుగుల్లా 120 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి పేరిట ఏకంగా రూ. 6 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు పొంది ఎగ్గొట్టిన ఉదంతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల్లో వెలుగులోకి వచ్చింది. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులనే కంపెనీల డైరెక్టర్లుగా నియమించి బ్యాంకులను బురిడీ కొట్టించిన వైనం బయటపడింది. బ్యాంకులకు రూ. వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా గ్రూపులోని ఓ కంపెనీ లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘనలు జరిగాయన్న సీబీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ... శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో చేసిన సోదాల్లో సుజనా అక్రమాల పుట్ట బద్దలైంది. ఒకే చిరునామాపై షెల్ కంపెనీలు... హైదరాబాద్ పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం అడ్రస్‌తో ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్)లో ఈడీ సోదాలు ప్రారంభించింది. బీసీఈపీఎల్ మూడు బ్యాంకుల నుంచి రూ. 364 కోట్లు రుణాలుగా పొంది ఎగవేసింది. దీంతో రుణాలు జారీ చేసిన బ్యాంకులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఇందుకు సంబంధించి మూడు కేసులు నమోదు చేసింది. ఈ కంపెనీల్లో జరిగిన లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘన జరిగిందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ చెన్నై బృందం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించింది. బీసీఈపీఎల్ కంపెనీ చేసిన నేరంపై దర్యాప్తు చేస్తుండగా సుజనా చౌదరి సాగించిన భారీ ఆర్థిక నేరాల కుట్ర బయటపడింది. సుజనా చౌదరి చైర్మన్‌గా ఉన్న సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీల గొడుగు కింద ఏర్పాటు చేసిన 120 షెల్ òకంపెనీల జాబితా ఈడీ అధికారుల చేతికి చిక్కింది. ఈ కంపెనీలన్నీ పంజాగుట్టలోని ఒకే చిరునామాపై ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అంతే కాకుండా ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారికి ఈ కంపెనీలు సాగించిన లావాదేవీల విషయాలు ఏవీ తెలియకపోవడంతో ఈడీ మరింత లోతుగా సోదాలు చేపట్టింది. సుజనా చౌదరి ఇల్లు అన్నీ సుజనా చెప్పినట్లే... సుజనా చౌదరి 120 షెల్ కంపెనీల పేరుతో రూ. 6 వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ కంపెనీల్లో సాగించిన ఆర్థిక నేరాలకు, కుట్రకు దారి తీసిన అంశాలన్నీ ఆయా కంపెనీల ఈ–మెయిల్స్‌లో లభించాయి. డైరెక్టర్లకు, సుజనా చౌదరికి మధ్య జరిగిన కీలక వివరాలు ఈ–మెయిల్స్‌లో లభ్యమయ్యాయి. వాటికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారిని ఈడీ శనివారం విచారించగా సుజనా చౌదరి చెప్పినట్లే తాము వ్యవహరించామని, కంపెనీల్లో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదని, ఈ మొత్తం వ్యవహారం సుజనా కనుసన్నల్లోనే జరిగినట్లు వాంగ్మూలాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో సుజనా చౌదరే దగ్గరుండి వ్యవహారాలు చక్కబెట్టారని, ఆయన చెప్పిన చొట, చెప్పిన సమయంలో సంతకాలు మాత్రం డైరెక్టర్లు పెట్టినట్టు ఈడీ గుర్తించింది. బీసీఈపీఎల్ సంస్థకు వచ్చిన రుణాలు ఎక్కడి నుంచి ఎక్కడి పోతున్నాయో కూడా తమకు తెలియదని డైరెక్టర్లు వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం కుట్ర, ఆర్థిక నేరానికి కీలక నిందితుడిగా సుజనా చౌదరియేనని పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకున్నట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఫెమా చట్టాల ఉల్లంఘన... సుజనా చౌదరి సాగించిన ఈ నేరాలన్నీ ఫెమా చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని, ఇందులో ఈడీతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), సీబీఐ కూడా విచారణ సాగించేందుకు అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ఏడు చోట్ల, ఢిల్లీలో ఒక చోట ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 126 రబ్బర్ స్టాంపులు, షెల్ కంపెనీల పేర్ల మీద కొనుగోలు చేసిన ఆరు లగ్జరీ కార్ల (ఆడీ, ఫెరారీ, బెంజ్ రేంజ్ రోవర్ మొదలైనవి)ను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు స్పష్టంచేశారు. అదే విధంగా ఈ కంపెనీల ద్వారా ఫొరెక్స్ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. 27న విచారణకు రావాలంటూ సుజనాకు సమన్లు... పుట్టలకొద్దీ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి రూ. వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఉచ్చు మరింత బిగుసుకోనుందని స్పష్టమవుతోంది. ఇన్ని కంపెనీలు, రుణ ఎగవేతలు, ఫెమా చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డ ఆయన్ను లోతుగా విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 27న చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ పెద్దలను షాక్‌కు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో తమకు సంబంధించిన వివరాలేమైనా బయటకు వచ్చాయేమోనని వారు కంగారు పడ్డట్లు తెలిసింది. వ్యాపార నియమాలకు లోబడే..: సుజనా గ్రూప్ పదేళ్ల క్రితం నాటి కేసు విషయంలో ఈడీ అధికారులు సమాచారం కోరేందుకు తమ కార్యాలయానికి వచ్చారని, వారికి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చామని సుజనా గ్రూప్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. వ్యాపార నియమాలకు లోబడే తాము వ్యాపారం చేస్తున్నామని, కొంత మంది కావాలనే దురుద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తమ డైరెక్టర్లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సుజనా ఆఫీసు -
తెలుగు రాష్ట్రాల సీఎంలకు భయం పట్టుకుంది
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. వాళ్ల ఉనికి కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల సీఎంలు వారి స్థాయి మరిచి ప్రధానమంత్రి మోదీపై బురద జల్లుతున్నారని ఎంపీ మండిపడ్డారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ కుటుంబంలో బంగారం మాయం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అప్పుడు ఐదు రాష్ట్రాలు.. ఇప్పుడు 21 రాష్ట్రాలు ‘మొదట్లో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. ఏ ప్రభుత్వం చేయని పనులు మా ప్రభుత్వం చేసింది. బీజేపీ విస్తరణ కొనసాగుతూ వస్తుంద’ని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. కేవలం మోదీని తిట్టడానికే ఈ సభలు ‘కమ్యూనిస్టులు కేవలం నరేంద్ర మోదీని తిట్టడానికే జాతీయ మహాసభలు పెట్టుకున్నారు. మోదీ చేతిలో త్రిపురలో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తిట్టడం ద్వారానే వారు ఆనందం పొంతున్నార’ని ఆయన అన్నారు. ఉనికి కోసం ఆరోపణలు.. తన ఉనికి కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ మోదీపై ఆరోపణలు చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.3 లక్షల కోట్లు ఇచ్చారు.. కానీ మా ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అంతేకాక 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు కరెంట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం 50 శాతం నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. ఏదైనా ఒక విషయం మాట్లాడేప్పడు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. పేద వారికి సాయం చేసే పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమే అని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తాం.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో భూ స్థాపితం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఓడిపోతామనే భయంతో వారు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకే ఫ్రంట్లతో పేరుతో ఊదరా గొడుతున్నారు.. ఎటువంటి ఫ్రంట్ వచ్చిన మోదీకి ప్రతిఘటన ఇవ్వలేవని రాజ్యసభ ఎంపీ ధీమా వ్యక్తం చేశాడు. 2019 ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది. తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలను చేస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని రాజ్యసభ ఎంపీ జీఎల్‌వీ నర్సింహారావు స్పష్టం చేశారు. -
విమర్శలతో జీతమంతా ఇచ్చేసిన సచిన్
న్యూఢిల్లీ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా తాను అందుకున్న పూర్తి జీతాన్ని, అలవెన్స్‌లను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఇటీవలె సచిన్ రాజ్యసభ ఎంపీ పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా సచిన్ ఎంపీగా అలవెన్స్లతో కలిపి సుమారు రూ. 90 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని పీఎం రీలీఫ్ ఫండ్‌కు అందజేసినట్లు పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ హాజరు విషయంలో నటి రేఖతో పాటు సచిన్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచిన్ తన జీతాన్ని పీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. సచిన్ ఆఫీస్ పేర్కొన్న వివరాల ప్రకారం తన రూ.30 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ను దేశ వ్యాప్తంగా 185 ప్రాజెక్టులకు ఉపయోగించారు. సుమారు రూ.7.5 కోట్లు విద్యా సంబంధిత అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఇక సచిన్ ఆదర్శ్ గ్రామ యోజన కింద రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామం ఉండగా మరొకటి మహారాష్ట్రలో ఉంది. -
రాష్ట్రపతిని కలవనున్న విజయసాయి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతితో ఆయన భేటీ అవుతారని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ చైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు విజయసాయి రెడ్డి అంతకుముందు మీడియాతో చెప్పారు. రాజ్యసభలో తాను లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన చైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు గత మూడు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. న్యాయం చేయాలని గట్టిగా నినదిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. -
ఎంపీలుగా అమిత్‌షా, స్మృతి ప్రమాణం
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం పదిన్నర సమయంలో ఇరువురు ప్రమాణం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇరువురు బీజేపీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ సంస్కృతంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమిత్ షా... పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాగా అమిత్ షా, స్మృతి ఇరానీ ..రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
రాజ్యసభకు మళ్లీ పోటీ చేయను: ఏచూరి
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా మరోమారు ఎన్నిక కావాలని కోరుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. వరుసగా రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన పదవీకాలం వచ్చే ఆగస్టులో పూర్తికానుంది. ఒక వ్యక్తి రెండు కన్నా ఎక్కువ సార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యేందుకు పార్టీ నియమాలు అనుమతించవని, ‘ఇది మా పార్టీ నియమం. మూడోసారి నేను పోటీ చేయను’ అని తెలిపారు. ఏచూరి పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు లెఫ్ట్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
పదవీకాలంలో జీతమంతా విరాళంగా ఇచ్చారు
న్యూఢిల్లీ: హరియాణాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మీడియా టైకూన్ డాక్టర్ సుభాష్ చంద్ర.. ఎంపీగా తన పదవీకాలంలో తీసుకునే మొత్తం జీతాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. తాను నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని, మిగిలిన మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి అందజేస్తానని చెప్పారు. సుభాష్ చంద్ర.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చెక్ అందజేశారు. హరియాణాలోని హిసార్‌లో జన్మించిన సుభాష్ చంద్ర తన 20వ ఏట 17 రూపాయలతో ఢిల్లీకి వచ్చారు. మీడియా రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. భారత టెలివిజన్ రంగంలో తొలిసారిగా 1992లో ఉపగ్రహ టీవీ చానెల్ జీ టీవీని ప్రారంభించారు. ఆ తర్వాత తొలి ప్రైవేట్ న్యూస్ చానెల్ జీ న్యూస్‌ను స్థాపించారు. -
రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డి ప్రమాణం
న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాజసభ్య చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా సభ్యునిగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాజసభ్యకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వి విజయసాయిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఎన్నికైన విషయం విదితమే. -
'పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నవారిని తొలగించాలి'
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని తొలగించాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీకి చెందిన నేతలంతా కలసి కట్టుగా పోరాడతామని పాల్వాయి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అదికాక అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కారు ఎక్కేస్తున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పై కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పొన్నాలపై పలువురు సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
'వలసలకు పీసీసీ, సీఎల్పీ నేతలదే బాధ్యత'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్లడానికి పీసీసీ, సీఎల్పీ నేతలే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోని నేతల వలసలను పసిగట్టడంలో పార్టీ సమన్వయ కమిటీ విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవశ్యకతను వీహెచ్ ఈ సందర్భంగా విశదీకరించారు. బలోపేతం చేసే క్రమంలో తరచుగా సమావేశం కావాలని పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు వీహెచ్ సూచించారు.