
'పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నవారిని తొలగించాలి'
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు.
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని తొలగించాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీకి చెందిన నేతలంతా కలసి కట్టుగా పోరాడతామని పాల్వాయి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అదికాక అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కారు ఎక్కేస్తున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పై కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పొన్నాలపై పలువురు సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.