Palvai Govardhan Reddy
-
Munugode Bypoll: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఆ ఇద్దరు..
సాక్షి, నల్గొండ: మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పని చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. తర్వాత ఆయన 2017 వరకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి తొలుత 2009లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి బూర నర్సయ్యగౌడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2016 నుంచి 2018 వరకు నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేశారు. ఎమ్మెల్సీ పదవీకాలం ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేసి గెలుపొందారు. చదవండి: రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం -
పోలవరం అక్రమాలపై విచారణ జరపాలి
మరణానికి ఒక రోజు ముందు సీవీసీకి పాల్వాయి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణ జరపాలన్నది ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చివరి కోరికగా మిగిలింది. పోలవరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వాటిపై సీవీసీ విచారణ జరిపి ప్రభుత్వ ధనాన్ని రాబట్టాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గత నెలలో సీవీసీకి పాల్వాయి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందిం చిన సీవీసీ.. ఫిర్యాదు తానే చేశానని ధ్రువీకరించా లని ఈ నెల 2న పాల్వాయికి లేఖ రాయగా.. తానే ఫిర్యాదు చేసినట్లు ధ్రువీకరిస్తూ మరణానికి ఒక రోజు ముందు సీవీసీకి మరో లేఖ రాశారు. కేంద్ర జల సంఘం, కేంద్ర పర్యావరణ శాఖల అనుమతి లేకుం డా పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథ కాలు అక్రమంగా చేపట్టారని పాల్వా యి ఆరోపించారు. పట్టిసీమ కాంట్రా క్టర్‌కు రూ.400 కోట్లు ఎక్కువగా చెల్లించారని, ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నా రు. పోలవరానికి సంబంధించి టెండర్ల కేటాయింపులో ప్రభుత్వ పద్ధతులు పాటించ లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి సరైన అనుమ తులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.10 వేల కోట్ల నుంచి రూ. 41 వేల కోట్లకు పెంచారన్నారు. పోలవరం కుడి కాలువ, పురుషోత్తపట్నం పథకాలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో వివక్షత ప్రదర్శించారన్నారు. ప్రాజెక్ట్ అక్రమాలు, అవినీతిపై పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, కాగ్ నివేదికను ఫిర్యాదుకు జతచేశారు. పోలవరం అవినీతిపై రిటైర్డ్ ఐఏఎస్ ఈఏ ఎస్ శర్మ ఇప్పటికే సీబీఐ, సీవీసీలకు ఫిర్యాదు చేశారని తెలిసిందని లేఖలో పాల్వాయి పేర్కొన్నారు. -
మరణానికి ముందు పాల్వాయి చివరి అభ్యర్థన
సాక్షి, న్యూడిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణానికి ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరారు? అనేక సందర్భాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై ప్రశ్నించిన పాల్వాయి.. తాను చనిపోవడానికి కొద్దిరోజుల ముందు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో భారీ ఎత్తున సాగుతున్న అవినీతి, అక్రమాలపై సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సీవీసీ) తో విచారణ జరిపించాలన్నది పాల్వాయి గోవర్ధన రెడ్డి చివరి కోరికగా మిగిలింది. జాతీయ ప్రాజెక్ట్‌గా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో విచ్చలవిడి అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, అందువల్ల సీవీసీ విచారణ జరిపి ప్రభుత్వ ధనాన్ని రాబట్టాలని, అవినీతికి బాద్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాల్వాయి గోవర్ధన రెడ్డి గత నెలలో సీవీసీకి ఫిర్యాదు రాశారు. ఆ ఫిర్యాదు పై స్పందించిన సీవీసీ, ఫిర్యాదు తానే చేశానని ధృవీకరించాలని పాల్వాయి కి ఈ నెల 2 వ తేదీన లేఖ రాసింది. ఆ ఫిర్యాదును తానే చేశానని ధృవీకరిస్తూ మరణించడానికి ఒక రోజు ముందు పాల్వాయి గోవర్ధనరెడ్డి సీవీసీ కి మరో లేఖ రాశారు. కేంద్ర జల సంఘం,కేంద్ర పర్యావరణ మంత్వ్రిత్వ శాఖల అనుమతులు లేకుండా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు అక్రమంగా చేపట్టారని పాల్వాయి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం కాంట్రాక్టర్ కు దాదాపుగా రూ. 400 కోట్లను అదనంగా చెల్లించారని, తద్వారా ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని పాల్వాయి సీవీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి టెండర్ల కేటాయింపులో ప్రభుత్వ పద్దతులను అనుసరించలేదని, కొన్ని పనులను నామినేషన్ పద్దతిలో కేటాయించారని పాల్వాయి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.10 వేల కోట్ల నుంచి రూ. 41 వేల కోట్ల కు పెంచారని ప్రస్తావించారు. పోలవరం కుడి కెనాల్, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాల అమలులో బాధితులైన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో వివక్షత ప్రదర్శించారని పాల్వాయి అరోపించారు. ప్రాజెక్ట్ పనుల కోసం వినియోగించాల్సిన సిమెంట్ ను కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని,కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రాజెక్ట్ పనులలో కొన్ని అంశాలను మార్చారని పాల్వాయి గోవర్ధన రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను, కాగ్ నివేదిక ను తమ ఫిర్యాదుకు జత చేశారు. పోలవరం అవినీతి, అక్రమాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇప్పటికే సీబీఐ,సీవీసీ లకు ఫిర్యాదు చేశారని తెలిసిందని పాల్వాయి ఆ లేఖ లో పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీ పర్యటనలో భాగంగా కులులో పర్యటిస్తున్న సందర్భంలో పాల్వాయి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మరణానికి ముందు చేసిన ఫిర్యాదుపై సీవీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. -
పాల్వాయికి అశ్రు నివాళి
- స్వగ్రామం ఇడికుడలో అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు - అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు..గాంధీభవన్‌లో నేతల నివాళి చండూరు: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమనాలిలో గుండె పోటుతో హఠాన్మరణం చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయ న స్వగ్రామం ఇడికుడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో జరిగాయి. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీభవన్ నుంచి బయలుదేరిన పాల్వాయి పార్థి వదేహం చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల మీదుగా ఇడికుడ గ్రామానికి చేరుకుంది. సంద ర్శకుల కోసం ఆయన ఇంటిముందు భౌతికకాయాన్ని ఉంచగా నియోజకవర్గ ప్రజలు, అభిమానులు నివాళులర్పించారు. 4.30 గంటలకు వేలాది మంది ప్రజల మధ్య మొదలైన అంతిమయాత్ర 6.30 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి చేరింది. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ సమక్షంలో పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత పెద్ద కుమారుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్వాయి చితికి నిప్పంటించారు. గాంధీభవన్‌లో అరగంటపాటు.. పాల్వాయి భౌతికకాయానికి గాంధీభవన్‌లో పలువురు నేతలు నివాళులర్పించారు. శనివారం ఉదయం పాల్వాయి నివాసం నుంచి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించారు. కార్య కర్తల సందర్శనార్థం అరగంటపాటు ఉంచారు. భౌతికకా యంపై పార్టీ జెండా, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు ఆర్.సి. కుంతియా, వి.హనుమంతరావు, మాజీ మంత్రులు డి.శ్రీధర్ బాబు, టి.జీవన్‌రెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్వాయి భౌతికకాయానికి నివాళులర్పించారు. పాల్వాయి తెలంగాణ కోసం కృషి చేశారు: సురవరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, ఎంపీగా ప్రజాసమస్యలపై పనిచేశారన్నారు. పాల్వాయి ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖుల సంతాపం.. పాల్వాయికి అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీలు కే.కేశవరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి నాగార్జున్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వాయిలార్ రవి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపా ల్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వేముల వీరే శం, గ్యాదరి కిశోర్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీను, తదితరులు ఘనంగా నివాళులర్పించారు. -
ఇంత నిర్లక్ష్యమా?
- చితికి నిప్పంటించకముందే వెళ్లిపోతారా? - మంత్రి, అధికారులపై వీహెచ్ మండిపాటు చండూరు/మునుగోడు: ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి అంత్యక్రియల్లో అధికార పార్టీ నాయకులు, అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నేత వి.హనుమంత్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇడికుడలో పాల్వాయి పార్థివదేహానికి చితి అంటిం చక ముందే అధికారులు అందరు వెనుదిరగడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చితిని అంటించేందుకు కేవలం ఒక లీటర్ కిరో సిన్ మాత్రమే తేవడం ఏమిటని, స్థానిక తహసీ ల్దార్, సీఐలు ఎక్కడా ఉన్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు మృతిచెందితే ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తారా అని అక్కడ ఉన్న నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారిని నిలదీశారు. అంత్యక్రియలకు హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చితికి నిప్పంటించకముందే ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. -
పాల్వాయి మృతిపై వెలువోలు బసవయ్య దిగ్భ్రాంతి
టొరంటో : రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఫెడరేషన్ ఆఫ్ ఇండో-కెనేడియన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెలువోలు బసవయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కులమత ప్రాంత భేదాలు లేకుండా పాల్వాయి వ్యవహరించేవాడని బసవయ్య తెలిపారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
స్వగ్రామానికి పాల్వాయి మృతదేహం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి మృతదేహాన్ని గాంధీభవన్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించారు. పాల్వాయి స్వగ్రామం అయిన నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటనలో భాగంగా కులుమనాలికి వెళ్లిన ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉదయం గాంధీభవన్‌లో పలువురు నేతలు పాల్వాయి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పాల్వాయి మృతి పార్టీకి తీరనిలోటు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. -
పాల్వాయి కన్నుమూత
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో గుండెపోటుతో తుదిశ్వాస పేరు : పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, పుట్టినతేదీ : 20 నవంబర్ 1936, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా నడింపల్లి, తల్లిదండ్రులు : పాల్వాయి రంగారెడ్డి–అనసూయమ్మ, భార్య : శ్రుజమణి, పిల్లలు : శ్రావణ్‌కుమార్‌రెడ్డి, స్రవంతి, శాంతన్కుమార్రెడ్డి, (శంతన్ అపోలో ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తున్నారు. శ్రావణ్ ఇడికుడ సర్పంచ్‌గా ఉన్నారు), స్వస్థలం : చండూరు మండలం ఇడికుడ గ్రామం, విద్యాభ్యాసం : మర్రిగూడ మండలం శివన్నగూడెం, దేవరకొండ మండలంలో 6వ తరగతి వరకు, ఆ తర్వాత 10 వరకు హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్‌లో.. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో పూర్తిచేశారు. సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్, చండూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. ముక్కుసూటి స్వభావమున్న నేతగా పేరుపొందిన పాల్వాయిది ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితం. నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. 1967లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీ గా, రాజసభ సభ్యుడిగా పనిచేశారు. తొలి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పోరాడి.. జైలుకు వెళ్లారు. పాల్వాయి మృతిపట్ల ప్రధాని మోదీ, సోనియా సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయాసంతో బాధపడుతూ.. శుక్రవారం హిమాచల్‌లోని కులూలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు సంబంధించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్వాయి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భార్య శ్రుజమణి, మనవరాలు, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితర ఎంపీలతో కలసి పాల్వాయి బయలుదేరారు. విమానం ఎక్కేముందు ఆయన తీవ్రంగా ఆయాసంతో బాధపడ్డారు. ఇలా ఆయాసం రావడం, మోకాలు నొప్పి కూడా ఉండడంతో పాల్వాయిని విమాన సిబ్బంది వీల్ చైర్ సహాయంతో విమానం ఎక్కించారు. గంటసేపు ప్రయాణం అనంతరం విమానం కులూకు చేరుకుంది. అక్కడ విమానం దిగగానే పాల్వాయి గుండెపోటుకు గురయ్యారు. ఛాతీలో బిగపట్టినట్టుగా ఉందని చెప్పడంతో ఆ బృందంలోనే ఉన్న ఒక వైద్యుడు పరీక్షించి.. ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వెంటనే విమానాశ్రయంలోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్ధారించారు. పాల్వాయిని అంబులెన్స్‌లోకి ఎక్కించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు.. వెనక మరో కారులో ఆస్పత్రికి బయలుదేరారు. కానీ వారు ఆస్పత్రికి చేరుకొనేలోగానే పాల్వాయి మరణ సమాచారం అందింది. అప్పటిదాకా తమ మధ్యే ఉండి, తమతో మాట్లాడిన పాల్వాయి అంతలోనే కన్నుమూశారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పాల్వాయితో పాటు విమానంలో కులూ కు ప్రయాణించిన ఆయన.. ఆ సంఘటనను బాధతో మీడియాతో పంచుకున్నారు. ఢిల్లీకి భౌతికకాయం కులూలో మృతిచెందిన పాల్వాయి భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం, హిమాచల్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. రాహుల్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ హిమాచల్ సీఎం వీరభద్రసింగ్తో మాట్లాడారు. అటు సీఎం కేసీఆర్ కూడా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేసి హిమాచల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఢిల్లీలోని జీఆర్జీ రోడ్డులో ఉన్న పాల్వాయి అధికారిక నివాసానికి భౌతికకాయాన్ని తరలించి ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పాల్వాయి స్వగృహానికి తరలించారు. నేడు ఇడికుడలో అంత్యక్రియలు పాల్వాయి భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శనివారం ఉదయం గాంధీభవన్‌లో ఉంచనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. అనంతరం పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడకు తరలించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు పాల్వాయి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రైతుల సంక్షేమం కోసం ఎనలేని కృషి ‘‘తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం పా ల్వాయి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన సేవలు మరువలేనివి. తనతో కలసి పనిచేసిన వారందరూ ఆయన్ను ప్రతిక్షణం గుర్తుంచుకుం టారు..’’ – ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇది బాధాకరం.. ‘‘పాల్వాయి హఠాన్మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా..’’ – ప్రధాని మోదీ ఆయన జీవితం ప్రజలకు అంకితం ‘‘గౌరవప్రదమైన నాయకుడిగా ఎదిగిన గోవర్ధన్‌రెడ్డి తన జీవితాన్ని ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి అంకితమిచ్చారు. శ్లాఘించదగిన వారసత్వాన్ని వదిలివెళ్లారు. ఆయన మరణం జాతికి, కాంగ్రెస్‌కు తీరని లోటు.. – సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తీరని లోటు.. ‘‘పాల్వాయి హఠాన్మరణం తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది’’ – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్వాయి సేవలు మరువలేనివి ‘‘పాల్వాయి ఆకస్మిక మృతి దిగ్భాంతి కలిగించింది. కాంగ్రెస్ సీనియర్ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన మరువలేని సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా..’’ – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో ప్రముఖుల నివాళి.. ఢిల్లీలో పాల్వాయి భౌతికకాయాన్ని ఉప రాష్ట్ర పతి హమీద్ అన్సారీ, మన్మోహన్, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి అహ్లూవాలి యా, ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, సురవరం సుధాకర్‌రెడ్డి, ఉత్తమ్, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
నాలుగు తరాల కెరటం
సాక్షి, నల్లగొండ: పాల్వాయి గోవర్దన్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఫక్తు కాంగ్రెస్ వాదిగా, గాంధీ కుటుం బానికి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన.. రాజకీయ ప్రస్థా నం ఐదున్నర దశాబ్దాల పాటు సాగింది. 1967లో మునుగోడు ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన ఆయన ఐదుసార్లు ఎమ్మె ల్యేగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రి గా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యు డిగా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్‌గా పలు హోదాల్లో పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో నాలుగు తరాల నాయకుడు. భారత తొలి ప్రధాని నెహ్రూ నాయకత్వంలో యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. తర్వాత ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ నాయకత్వంలోనూ రాజకీయాల్లో ఉన్నారు. ముక్కుసూటి మనిషిగా పేరుపొందారు. తెలంగాణ విషయంలోనూ, పార్టీలో అంతర్గత విషయాల్లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు విద్యార్థి దశ నుంచే.. పాల్వాయి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఉస్మాని యా వర్సిటీ ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగానూ పనిచేశారు. యూత్ కాంగ్రెస్‌కు 1961–63 మధ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1963–67 మధ్య రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కమ్యూనిస్టుల కంచుకోట మునుగోడులో ఆయన గెలుపు అప్పట్లో సంచలనం కలిగించింది. తర్వాత వరుసగా 1972, 1978, 1982లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి తదితర నేతలతో కలసి అరెస్టయ్యారు. నెలరోజులు జైలు జీవితం గడిపారు. 1978–80లో సీఎల్పీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1979–81 మధ్య రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. 1981లో భవనం వెంకట్రామిరెడ్డి కేబినెట్లో గ్రామీణ నీటి సరఫరా, యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు. 1981–82 మధ్య కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్లో చేనేత, జౌళి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో ఎన్నికల్లో ఆరోగ్య కారణాల రీత్యా పోటీ చేయలేదు. 1989లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 1994లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో రెబెల్‌గా పోటీచేసి.. ఓటమి పాలయ్యారు. రెండేళ్ల అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1999లో కాంగ్రెస్ తరఫున మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2007–09 మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. విలువల కోసం తపించిన వ్యక్తి.. పాల్వాయి ఆకస్మిక మృతి పట్ల మాజీ గవర్నర్ కె.రోశయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ విలువల కోసం తపించిన వ్యక్తి అని, ఆయన లేని లోటు తీరనిదని వ్యాఖ్యానించారు. -
పాల్వాయిది కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం: ఉత్తమ్
ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాల్వాయి మృతికి తన సంతాపాన్ని ప్రకటించారు. పాల్వాయి పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారన్నారు. కాంగ్రెస్ కోసం నెహ్రూ హయాం నుంచి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రతినిధిగా నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించారని, పాల్వాయి తమ మధ్య లేకపోవడాన్ని నమ్మలేక పోతున్నామన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు పాల్వాయి స్వగ్రామం చండూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం హైదరాబాదులోని నివాసంలో రెండు గంటలపాటు, తరువాత గాంధీ భవన్ లో కొద్దిసేపు పాల్వాయి పార్దివ దేహాన్ని ఉంచుతామన్నారు. -
రేపు పాల్వాయి అంత్యక్రియలు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలు రేపు (శనివారం) సాయంత్రం 5గంటలకి పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో జరుపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చురుకైన నాయకుడని, ఆయన పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలపై ఎంతో పోరాటం చేశారని, ఏఐసీసీ కార్యదర్శి ఎంపీ ఆర్సీ కుంతియా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాల్వాయి ఆకస్మిక మృతికి శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
పాల్వయి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి హఠాన్మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మరోవైపు పాల్వయి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితోపాటు కులుమనాలి వెళ్లిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్.... పాల్వాయి గోవర్దన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి ,సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం గల పాల్వాయి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేసారని అన్నారు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఎంతో చురుకుగా కార్యక్రమాలలో పాల్గొనేవారన్నారు. పాల్వాయి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ,వారి కుటుంబ సభ్యులకు స్వామిగౌడ్ సానుభూతి తెలిపారు. కాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పాల్వాయి గోవర్దన్ రెడ్డి పార్దీవ దేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించింది. అక్కడ పాల్వాయి అధికార నివాసంలో కొద్దిసేపు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అక్కడే ఏఐసీసీ నాయకులు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు తరలిస్తారు. -
పాల్వాయి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితో పాటు మనాలి వెళ్లిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, పాల్వాయి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్‌లను ఆదేశించారు. మృతదేహం తరలింపుతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డిలను సీఎం కోరారు. జానారెడ్డి సంతాపం కాగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు..పాల్వాయి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. 1936, నవంబర్ 20న జన్మించిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నందంపల్లి. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా, 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీగా ఉన్నారు. కాగా ఆయన భౌతికకాయాన్ని కులుమనాలి నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాల్వయి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. -
13 మంది సంతకాలు ఉపసంహరించుకున్నారు
- దీంతో జస్టిస్ నాగార్జున రెడ్డిపై ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించారు - రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అభిశంసన విషయంలో ఒక ఆంగ్ల దినపత్రికలో గురువారం ప్రచురితమైన వార్తా కథనం శుద్ధ అబ ద్ధమని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అభిశంసన నిమిత్తం 54 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసినప్పటికీ, జస్టిస్ నాగార్జునరెడ్డికి హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకున్న 13 మంది సభ్యులు తమ సంతకాలను ఉపసహరించుకున్నారని వివరించారు. దీంతో రాజ్యసభ చైర్మన్ సంబంధిత ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించారని తెలిపారు. ఈ వాస్తవాల గురించి ప్రస్తావించకుండా కేవ లం నాణేనికి ఒకవైపు ప్రచురించిన సదరు ఆంగ్ల పత్రిక... నీతి, నిజాయితీలకు మారుపేరైన జస్టిస్ నాగా ర్జునరెడ్డి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిందని విమర్శిం చారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆ పత్రిక ఈ విధం గా అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం సరికా దన్నారు. ఇదే విషయాన్ని తాను ఆ పత్రిక యాజమాన్యం దృష్టికి రాతపూర్వకంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. జస్టిస్ నాగార్జునరెడ్డిపై సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ చేసిన అరోపణలన్నింటినీ కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత వాస్తవాలను తెలుసుకుని పలువురు సభ్యులు తమ సంతకాలను ఉపసంహరించుకుంటున్నట్లు రాజ్యసభ చైర్మన్‌కు తెలిపారని, అయితే ఈ పత్రిక ఈ విషయాన్ని ఎక్కడా కూడా తన కథనంలో పేర్కొనలేదని తెలిపారు. ఇది 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పత్రిక వ్యవహరించాల్సిన తీరు ఎంత మాత్రం కాదని విమర్శించారు. నిరాధారంగా, పక్షపాతంతో, ఓ నిర్దిష్ట ఎజెండాతో ఈ కథనం ప్రచురించారన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్‌ను సంప్రదించి ఉంటే వాస్తవాలు తెలిసి ఉండేవని ఆయన తెలిపారు. -
బాధితులకు పరిహారం చెల్లించాలి
మర్రిగూడ(మునుగోడు): ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాకే చెర్లగూడెం రిజర్వాయర్ పనులు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. బాధితులను పట్టించుకోకుండా పోలీస్ పహారాలో రిజ ర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టడం దారుణమని అన్నారు. మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో మంగళవారం ఎంపీ చెర్లగూడెం ముంపు బాధితులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. బాధిత రైతులు అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని ఎంపీ భరోసా కల్పించారు. అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంట్లో లెవనెత్తి బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని హామీ ఇచ్చారు. దేశంలో నిర్మంచబోయే ప్రతి ప్రాజెక్టు కింద ముంపునకు గురై భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కి 123 జీఓ తీసుకొచ్చిందని ఆరోపించారు. ఆ జీఓను హైకోర్టు కొట్టివేసిన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యేను చూడలేదు.. ‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎమ్మెల్యేను ఎప్పుడూ చూడలేదు’ అని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉద్దేశించి అన్నారు. న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యేనే కాంట్రాక్టర్ వద్ద డబ్బులకు ఆశపడి పోలీసులతో రైతులను బెదిరించడం దారుణమన్నారు.కొంత మంది బ్రోకర్లను పెట్టుకుని ఎమ్మెల్యేనే దందాలకు తెగబడుతున్నాడని ఎంపీ ఆరోపించారు. కూసుకుంట్లకు సీఎం కేసీ ఆర్ వద్ద కూడా మంచి పేరు లేదని అన్నారు. ఇప్పటికైనా తీ రు మార్చుకోవాలని లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో ఎంపీ ఫోన్లో మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఇన్చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి, ఎంపీపీ అనంత రాజుగౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మేతరి యాదయ్య, మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ పాల్వాయి అనిల్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పొనుగోటి విజయరామారావు, మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మద్ది విఠల్‌రెడ్డి, సర్పంచ్‌లు పాముల యాదయ్య, కంచకంట్ల వసంతలక్ష్మీ, నాయకులు చిట్యాల రంగారెడ్డి, సిరపగ్రఢ అనందరావు, మల్గిరెడ్గి గోవర్ధన్‌రెడ్డి, రైతులు నేర్లకంటి రామలింగం, ఐతగోని వెంకటయ్య, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాల్వాయి సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: గాంధీ భవన్‌లోని టీపీసీసీ కార్యాలయంలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్వాయి మాట్లాడారు. పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణ పాటించడం లేదని, హద్దులు దాటుతున్నారని పాల్వాయి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ నేత ఏకే ఆంటోనికి కూడా చెప్పానన్నారు. ఒక్క నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలే ఇలా గీత దాటి వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరిని పార్టీకి చెందిన వారే ఎవరో కొందరు ప్రోత్సహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ గీత దాటుతున్న నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత దిగ్విజయ్సింగ్దే నని పేర్కొన్నారు. కాగా, ఈ భేటీకి ఏడుగురు సభ్యులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎంఏ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య సమన్వయ కమిటీ భేటీకి గైర్హాజరయ్యారు. -
కోమటిరెడ్డివి పగటి కలలు: పాల్వాయి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి అవుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘కోమటిరెడ్డికి పిచ్చిలేచి ఉండాలి, లేదా సీఎం అవుతానని పగటికలలైనా వచ్చి ఉండాలి. డబ్బులు పెట్టి పదవులను కొనుక్కోవాలని చూస్తున్నాడు. డబ్బులకు హైకమాండ్ అమ్ముడుపోదు. 2019 ఎన్నికల్లోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమారే ఉంటారు’ అని అన్నారు. ‘పాదయాత్ర చేయడానికి కోమటిరెడ్డి ఏమైనా వైఎస్ రాజశేఖరరెడ్డినా? పాదయాత్ర చేసినంత మాత్రాన వైఎస్ స్థాయి నాయకుడు కోమటిరెడ్డి కాలేడు. పాదయాత్ర చేస్తానని అనుకుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంటది’ అనిఎద్దేవా చేశారు. మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని రాజగోపాల్‌రెడ్డి ఆలోచిస్తే మంచిదికాదని, అది ఆయన తాత జాగీరు కాదన్నారు. -
అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు..
కేసీఆర్‌పై ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంక్షేమాన్ని విస్మరిస్తున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేవలం హంగు, ఆర్భాటాలతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఇక్కడి ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, పింఛన్ల పెంపు హామీలను ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. -
మిషన్ భగీరధ అవినీతి మయం: పాల్వాయి
ఇంటింటికీ రక్షిత జలాలను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అవినీతిమయంగా మారిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని రాజీవ్‌స్మారక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పనుల్లో 50శాతం అవినీతి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే నీటి వసతులు లేని ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమివ్వకుండా, వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో కేటాయించి, టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం అనుచర వర్గానికి కాంట్రాక్టులను కట్టబెడుతోందన్నారు. రెండేళ్లలో అవినీతి పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయన్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని కావడం లేదన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. డబల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభమే కాలేదన్నారు. రుణమాఫీ ఊసే లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ, హైదరాబాద్‌లోని భూములను కొన్ని సంస్థలకు అప్పగించి రూ.కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, కొండ యాదగిరి, నయీంషరీఫ్, బోయ రామచంద్రం, తిరుపతి రవీందర్, చింతల వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పల్సం సత్యం, చింతపల్లి వెంకట్‌రెడ్డి, జేకే.దశరథ, రాజయ్య, రఘుపతి, జానిబాబు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను వీడిన వారికి నో ఎంట్రీ
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయిన వారికి పార్టీలోకి తిరిగి ప్రవేశం ఉండదని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఏఐసీసీ విరాళాల కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం కొద్దిసేపు ఆగారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ... రాహుల్‌గాంధీ ఫార్ములా ప్రకారం పార్టీలో రెండేళ్లు విధిగా పనిచేయాల్సి ఉంటుందని, పార్టీని వీడిపోయిన వారు తిరిగి వస్తే టికెట్లు వచ్చే అవకాశమే లేదన్నారు. పీసీసీ నాయకత్వ మార్పు ఉండకపోవచ్చని, పార్టీలో సమన్వయంతో పని జరుగుతున్నదన్నారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్, తన మార్పు అంశం అధిష్టానం పరిధిలోనిదన్నారు. ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజు నోటీసులు ఇచ్చిన సంగతి తనకు తెలియదని.. వారికి నోటీసులు ఎందుకు ఇచ్చారో, దాని పరిణామాలేమిటో తెలుసుకుంటానని చెప్పారు. -
బూడిద తెలంగాణగా మారుస్తున్నారు
సీఎం కేసీఆర్‌పై ఎంపీ పాల్వాయి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ అడ్డగోలు విధానాలతో బూడిద తెలంగాణగా మారుస్తున్నారని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కోదండరాంను ఒంటరివాడిని చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించకపోవడం వల్ల యూజీసీ నిధులు రావడం లేదని, దీంతో వర్సిటీలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు రీడిజైన్ల పేరుతో పెంచిన నిధులలో సీఎం కేసీఆర్‌కు ఎన్ని ముడుపులు ముడుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. -
'బంగారు కాదు...బూడిద తెలంగాణగా మారుతుంది'
హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ కాదు..బూడిద తెలంగాణగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు పనులిచ్చి రూ.కోట్లలో కమీషన్లు దండుకుంటున్నారని పాల్వాయి విమర్శించారు. -
జానా కంటే డీకే మేలు
- సీఎల్పీ నేతగా సమర్థంగా పని చేయడం లేదు: పాల్వాయి వ్యాఖ్యలు - తప్పుకుంటానన్న జానారెడ్డి... వారించిన నేతలు - మండలి నేతకు ఎన్నిక వద్దా?: సర్వే సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేతగా జానారెడ్డి సమర్థంగా పనిచేయడం లేదని, ఆయన స్థానంలో ఎమ్మెల్యే డి.కె.అరుణను నియమించడం మేలని టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. ‘‘మహిళ అయినా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే డి.కె.అరుణ ఒక్కరే గట్టిగా మాట్లాడుతున్నారు. జిల్లాలో కూడా ఏదో కార్యక్రమంతో ప్రజల్లోకి పోతున్నారు. అసెంబ్లీలోనూ ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించినవాళ్లు కూడా జేబులో నుంచి రూపాయి తీయడం లేదు. జానా స్థానంలో డి.కె.అరుణను పెడితే మంచిది’ అని పాల్వాయి వాదించారు. దాంతో, పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని జానా బదులిచ్చారు. ‘‘సోనియాగాంధీకి చెప్పి పదవిని వదులుకుంటా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో ఎవరినైనా పెట్టుకొమ్మని అధినేత్రికి చెబుతా. సామాన్య కార్యకర్తగా ఉంటూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా’’ అని బదులిచ్చారు. భేటీలో పాల్గొన్న ఇతర నేతలు జానా నిర్ణయాన్ని వారించారు. శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత ఎన్నిక విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రస్తావించారు. షబ్బీర్ అలీని తాత్కాలిక ప్రాతిపదికనే నియమించామని గుర్తుచేశారు. ‘మండలి, శాసనసభాపక్షాలకు ఇప్పటిదాకా ఎన్నికలు నిర్వహించలేదు. వాటిని వెంటనే నిర్వహించాలి’ అని సర్వే కోరగా దిగ్విజయ్ అంగీకరించారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలపై శాస్త్రీయ అధ్యయనానికి పార్టీ తరపున రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. రెండేళ్ల టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలు, దేశానికి కాంగ్రెస్ చేసిన సేవ, పార్టీ సిద్ధాంతాలు తదితరాలుసిలబస్గా ఉంటాయి. సోషల్ మీడియాను వినియోగించుకోవాలని కూడా భేటీ నిర్ణయించింది. దీనిపై 2 రోజుల్లో సమావేశమై నిర్దిష్ట బాధ్యతలను విభజించుకోవాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ను చీల్చే యత్నాలను అడ్డుకున్నా: జానా టీఆర్ఎస్ను చీల్చడానికి గతంలో జరిగిన ప్రయత్నాలను తాను వారించానని సీఎల్పీ నాయకుడు జానారెడ్డి చెప్పారు. అసెంబ్లీలోనూ ఇదే విషయం చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడేమో తెలంగాణ రాష్ట్రం అనైతిక రాజకీయ ప్రలోభాలకు అడ్రస్‌గా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. అప్రజాస్వామిక, అనైతిక ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. ఏ పదవీ ఆశించకుండా, ఉన్న పదవిని త్యాగం చేసైనా కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని ప్రకటించారు. -
జానారెడ్డి కోవర్టు అని డైరెక్ట్‌గా అనలేదు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని విబేధాలు మరోసారి బయటపడ్డాయి. షబ్బీర్ అలీ, మల్లు రవిపై క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పాల్వాయి ఆదివారం లేఖ రాశారు. సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్టు అని తాను నేరుగా అనలేదని పాల్వాయి లేఖలో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ, మల్లు రవి తనను విమర్శించడం ద్వారా గీత దాటారని ఆరోపించారు. వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలపై హైకమాండ్‌కు వివరణ ఇస్తానని పాల్వాయి తెలిపారు. -
ఆ ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె. మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లకు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం సమావేశం అయింది. ఈ నేపథ్యంలో మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్ పరస్పర ఆరోపణలపై షోకాజ్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు పాల్వాయి గోవర్థన్ రెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లు చేసిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 17న వివరణ ఇవ్వాల్సిందిగా ముగ్గురు నేతలను టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదేశించింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ మాజీ ఛైర్మన్ శ్యాంసుందర్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు తెలిసింది. జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వేటు వేశారు. శ్వాంసుందర్ను కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ నోటీసులు ఇచ్చినస్టు సమాచారం. -
షోకాజ్ నోటీసులు అందలేదు: పాల్వాయి
హైదరాబాద్ : తనకెవరూ షోకాజ్ నోటీసులు పంపించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ...తాను ముక్కుసూటిగా వ్యవహరిస్తానని అన్నారు. జానారెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దిగ్విజయ్ సింగ్ తనను వివరణ అడిగినట్లు పాల్వాయి తెలిపారు. కాంగ్రెస్ లో ఉన్న కోవర్ట్లులు పార్టీని విడిచి పోవాలని, వారివల్లే కాంగ్రెస్ బలహీనపడుతోందన్నారు. తానే పెద్ద ప్రతిపక్ష నాయకుడినని, కాంగ్రెస్‌తో తనకంటే పెద్ద అపోజిషన్ లీడర్ లేరని పాల్వాయి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కరువును ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆయనవి అన్ని హిట్లర్ విధానాలు అని, నియంత పాలనలో ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కాగా అధికార టీఆర్ఎస్కు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. -
నాలుక కోస్తా అన్న కేసీఆర్.. మరి ఇప్పుడు..
కాంగ్రెస్ ఓటమికి పాల్వాయి వంటి నేతలే కారణం మండలి ప్రతిపక్ష నేత షబ్బిర్ అలీ హైదరాబాద్ : కాంగ్రెస్ ఓటమికి ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతలే కారణమని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... సీఎల్పీ నేత జానారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలను షబ్బీర్ అలీ ఖండించారు. జానారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన పాల్వాయికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన కోరారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, కూలీల వలసలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్‌ను సైతం కేసీఆర్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తాము రెండేళ్లుగా చెబుతున్న అంశాలే జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ లేవనెత్తారని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో కోదండరాంను విమర్శించినందుకు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నాలుక కోస్తా అన్న కెసీఆర్.. ఇప్పుడు తెలంగాణ మంత్రులు కోదండరాం పై చేసిన దాడిని ఏ విధంగా స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులకు ఏ శిక్షలు విధిస్తారని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. ఈ అంశంపై కేసీఆర్ స్పందించకపోతే ఆయన ఆదేశాలతోనే మంత్రులు కోదండరామ్‌ను టార్గెట్ చేశారని భావించాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. -
‘టీఆర్ఎస్ కు జానారెడ్డి కోవర్టు’
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్కు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. జానారెడ్డి వంటి కోవర్టులు పార్టీలో చాలామంది ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాల్వాయి బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలోని కోవర్టుల గురించి సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి లేఖ రాసినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రక్షాళనకు సమయం వచ్చిందని, ఆయారాం గయారాంలను తప్పించడం ఖాయమని పేర్కొన్నారు. నల్లగొండలో పార్టీ మూడు గ్రూపులుగా ఉందని, దుర్మార్గులు పార్టీని వీడితేనే లాభమని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి సోదరులు పార్టీ అండతో కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రి హరీష్‌రావుతో మాట్లాడుతూ పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు. తప్పుగా మాట్లాడినందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజు నోటీసు ఇచ్చారని, అధిష్టానం అనుమతితోనే షోకాజు ఇచ్చినట్టు తెలిపారు. దిగ్విజయ్‌ను తిట్టినా, జానారెడ్డి గురించి మాట్లాడినా పార్టీ బాగుకోసమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ కేడర్‌ను కాపాడుకోవడానికే తన కుమార్తె స్రవంతి గత ఎన్నికల్లో రెబెల్‌గా పోటీచేశారని చెప్పారు. సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావు పార్టీని వీడితే కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని పాల్వాయి స్పష్టంచేశారు. -
'జానారెడ్డివి కోవర్టు రాజకీయాలు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే పార్టీకి నష్టమని అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరులు టీఆర్ఎస్లోకి వెళ్లడానికి ఐదు సార్లు ముహుర్తాలు పెట్టుకున్నారని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి కాంట్రాక్టులను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు అండంతో సంపాదించారని ఆరోపించారు. వీరంతా ఎంత తొందరగా కాంగ్రెస్ పార్టీని వీడితే అంత మంచిదని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు కూడా టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నాని ఎంపీ పాల్వాయి తెలిపారు. -
అప్పులు, అబద్ధాలు తప్ప చేసిందేమీ లేదు
కేసీఆర్‌పై పాల్వాయి విమర్శలు సాక్షి, హైదరాబాద్: అవి నీతి, అప్పులతో రాష్ట్రాన్ని ఊబిలోకి దించిన సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలతో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అబద్ధాలు, అట్టహాసపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు, ఈ రెండేళ్ల పాలనలో టీఆర్ఎస్ అమలు చేసిన కార్యక్రమాలపై వివరించాలన్నారు. ఈ రెండేళ్లలో లక్షకోట్లు అప్పుచేయడం, అబద్ధాలు చెప్పడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. పార్టీ నుంచి ఎవరు పోయినా కార్యకర్తలు అధైర్య పడక్కర్లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారినా వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారకపోవచ్చన్నారు. -
'ఆ రెండు చోట్ల కూడా టీఆర్ఎస్సే గెలవవచ్చు'
హైదరాబాద్: ప్రాణహిత- చేవెళ్ల రీ డిజైన్ పేరుతో.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చి వేల కోట్లు పెంచడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విలేరులతో మాట్లాడారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులోని 28 ప్యాకేజీలకు కొత్త టెండర్లు పిలవకుండా పాతవాటి అంచానాలకే 50 నుంచి 80 శాతం పెంచడంలో అవినీతి ఉందని పాల్వాయి విమర్శించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలను జీహెచ్ఎంసీతో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అవకతవకలతో ఖమ్మం, వరంగ్ల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలవవచ్చునని చెప్పారు. అయినంతమాత్రాన టీఆర్ఎస్కు ప్రజాదరణ ఉన్నట్లు కాదని ఎంపీ పాల్వాయి తెలిపారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలోకి టీఆర్ఎస్
-
'జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలోకి టీఆర్ఎస్'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిలో టీఆర్ఎస్ పార్టీ చేరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎంపీ, కూతురు కవిత మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం పాల్వాయి విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరుపుతున్నదని, ఈ విచారణ నుంచి బయటపడేందుకు ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని పాల్వాయి విమర్శించారు. -
'ఆ నలుగురి' వద్దే అధికారం
హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దుష్టపాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని అధికారమంతా కేసీఆర్ కుటుంబంలోని నలుగురు ప్రజాప్రతినిధులదే అని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో దిగ్విజయ్‌సింగ్‌తో పాల్వాయి భేటీ అయ్యారు. అనంతరం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ దీటుగా ఎదుర్కోలేక పోతుందన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డిలో పోరాడే తత్వం లేదని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ఆర్ పోరాట తత్వంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తీరు మార్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హితవు పలికారు. లేదంటే ప్రభుత్వం విఫలం కాక తప్పదన్నారు. ప్రభుత్వ పాలన ఇలానే సాగితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిని ప్రజలు రాళ్లతో కొడతారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. తీరు మార్చుకోవాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హితవు పలికారు. లేదంటే ప్రభుత్వం విఫలం కాక తప్పదన్నారు. ప్రభుత్వ పాలన ఇలానే సాగితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిని ప్రజలు రాళ్లతో కొడతారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. -
'ఆ ఎంపీ ఎవరిని తిడతాడో ఆయనకే తెలియదు'
హైదరాబాద్ : ‘కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎప్పుడు ఎవరిని తిడతాడో ఆయనకు సోయి లేకుండా పోయింది. ఆయనకు రోజు రోజుకూ పిచ్చి ముదురుతోంది. సొంత పార్టీ, బయటి పార్టీ అన్న తేడా ఏమీ లేకుండా ఎవరు గుర్తొస్తే వారిని నోటికి వచ్చినట్లు తిట్టడం అలవాటుగా మారింది..’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఢిల్లీలో పాల్వాయి నోటికొచ్చినట్లు విమర్శలు చేశారని, ఆయన చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న పాల్వాయి చేసిన అభివృద్ధి ఏమిటని నిలదీశారు. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టయినా ఎందుకు తీసుకు రాలేక పోయారు? ఆయనకు ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. 46వేల చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, పల్లెపల్లెకు తాగునీరు అందించేందుకు మొదలు పెట్టిన వాటర్ గ్రిడ్ పథకాలకు ప్రశంసలు దక్కుతుంటే ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం ఆ పథకాలపై విషం కక్కుతున్నాయని, ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నాయని విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ వైఖరు మార్చుకోవాలని బోడకుంటి హితవు పలికారు. -
తెలంగాణ పోరాట యోధుడు-పల్వెల
‘....గంజ్‌లో పలానాయన ఉన్నాడు. మీరక్కడ ఉంటారా?’ అని అడిగాడు జైలరు. సంతోషంగా, ఆయన పక్కనైతే గంజ్‌లో ఏమొచ్చె, నరకంలోనైనా ఉంటాననుకున్నాను మనసులో’ (సహచరులు- మనుషులు-1989 జూలై పే.77) ఆయనే పల్వెల రామిరెడ్డి. ఈ (2, అక్టోబర్) ఉదయమే ఆయన కొడుకు ఫోన్ చేసి ‘బాపు చనిపోయాడు. నేను కూడా దుబాయ్ నుంచి వార్త తెలిసే వచ్చాను. ఫలానారోజు సంస్మరణ. రండి’ అని చెప్పాడు. 92 ఏళ్ల యువకుడు రామిరెడ్డి. ఆయన గురించి ‘సహచరులు’లో ఇట్లా రాసుకున్నాను. ‘తెలంగాణ రైతాంగ పోరాటకాలం నుంచి, అంటే 1946 నుంచి 86 దాకా నలభై ఏళ్లుగా జైలుకు వస్తూపోతూ ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మిత్రుడు అందులో ఒక సెల్లో ఉన్నాడు. కార్మిక రంగంలో పనిచేస్తూ, నక్సలైట్ ముద్రతోనే అరెస్ట యిన మరొక యువకుడున్నాడు. ఆయనతో నాకు ఈ జైల్లోనే పరిచయం. ఆ నల్లగొండ మిత్రునితో మాత్రం ఎమర్జెన్సీలో వరంగల్ జైల్లో పరిచయ మైంది. ఈ ఇద్దరితో మొదటి రెండు నెలలు ఒకటి కాలప్రవాహం వలె, రెండవది యవ్వన ప్రవాహం వలె గడిచిపోయాయి. ఆ నల్లగొండ మిత్రుడు విస్తృతంగా దేశం తిరిగాడు. విస్తృతంగా చదివాడు. ఆచరణ నుంచి జ్ఞానం వస్తుందనడానికి ఆయన సజీవ సాక్ష్యం. ఎన్ని అనుభవాలు చెప్పేవాడో. లాకప్ అయ్యేదాకా ఆ అవరణలో ముగ్గురమూ కలసి అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆయన మాటలు వింటుండేవాళ్లం. తిరుగుతూనే పుస్తకాలు చదవడం ఆయనకలవాటు...’ వాళ్లిద్దరూ టాడా కింద అరెస్టయి వచ్చారు. రామిరెడ్డిగారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. నక్సల్బరీ, శ్రీకాకు ళం రైతాంగ పోరాట విస్ఫోటనతో తెలంగాణలో తిరిగి ప్రారంభ మైన విప్లవోద్యమంలో ఆయన మొదట దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశాడు. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే బండ్రు నరసింహులు (ఆలేరు)గారిని అరెస్టు చేసి నేనున్న గదిలోనే పెట్టారు. అప్పుడు రామిరెడ్డిగారితో గాఢా నుబంధం ఏర్పడలేదు. ఎన్‌కె వంటి విప్లవ కవి, చెరుకూరి రాజకుమార్ వంటి రాడికల్ విద్యార్థి నా గదిలోనే ఉండడంవల్ల మా లోకం మాదిగా ఉండేది. రామిరెడ్డిగారు మిగిలినవారి వలె ఏ ప్రజాసం ఘంలోనూ పనిచేసినట్లు లేరు. ఇంగ్లిష్, ఉర్దూ భాష లలో ప్రావీణ్యం వల్ల సీపీ నాయకత్వంలోని పార్టీ ఆయనను బయటి రాష్ట్రాలలో టెక్నికల్ సహాయా లకు వినియోగించుకున్నట్లుంది. ఇంగ్లిష్ నవలలు గురించి, ముఖ్యంగా చార్లెస్ డికెన్స్ ‘రెండు మహా నగరాలు’, నెపోలియన్ జీవితచరిత్రల గురించి మాట్లాడేటప్పుడు యుద్ధనీతి, ఆయుధాల గురించి చెప్పే విషయాలు అందులో ఆయనకు లోతైన జ్ఞానం ఉన్నదని అనిపించేది. బక్క పలచటి మనిషి. ఆరడుగుల పొడవు, ధోతీ, తెల్లటి అంగీ. ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు. సంభాషణాప్రియుడు. మా ఇద్దరి అభిరుచి సాహిత్యం, విప్లవ రాజకీయాలు. మా స్నేహం నేను నల్లగొండ చౌరస్తాలో 2014 జూలై దాకా ఉన్నంతవరకు కొనసాగింది. ఆయన దిల్సు ఖ్నగర్లో ఉండేవారు. చివరిరోజుల్లో చేతికి కర్ర, చెవుడు వచ్చినట్టున్నాయి. కానీ అదే ఉత్సాహం. జర్నలిస్టుగా ఉన్న ఆయన మేనల్లుడు అనుకుం టాను, ఆయన జీవితచరిత్ర, మిత్రుల జ్ఞాపకాలు రాయించే ప్రయత్నం రెండేళ్ల క్రితం చేసినట్టున్నాడు. నా దగ్గరకి కూడా వచ్చారు. చెప్తానన్నాను. కానీ జీవన వ్యాపకాలలో పడిపోయాం. అంతేనా- ముగి సిపోని, కొనసాగుతున్న తెలంగాణ పోరాట చరిత్ర కనుక, ఇంకా నిర్మాణంలోనే ఉన్న అసంపూర్ణ ప్రజా స్వామ్య పోరాట చరిత్ర కనుక అప్పుడు చరిత్ర రచ నకు సమయం చిక్కడం లేదా? లేదా ఇంకా ఎందరో పోరాటయోధులు రక్తంతో చరిత్ర రచన కొనసాగు తున్నదా? బండ్రు నర్సింహులు నూరేళ్ల పండుగ నూటొక్క పాటల సంబురంలో పి.చంద్ రాసిన ‘సాయుధ పోరాటయోధుని కథ’ ఆవిష్కరించుకు న్నాం. రామిరెడ్డిగారంటే, బండ్రు నర్సింహులు వలెనే ఇంచుమించు నూరేళ్ల తెలంగాణ చరిత్ర. ఏడు దశాబ్దాలకు పైగా పోరాట చరిత్ర. జీవితమంతా ప్రజా పోరాటాలతో పరుచుకున్న చరిత్ర. - వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యులు మొబైల్: 96765 41715 -
'ఇద్దరు సీఎంలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలనతో తెలుగు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో పాల్వాయి మాట్లాడుతూ... ఈ రెండు రాష్ట్రాలలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా... ఇద్దరు సీఎంలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పుష్కరాలను ప్రచార ఆర్భాటం కోసమే ఇద్దరు సీఎంలు పని చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగంగాకాదని ఇరిగేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని పాల్వాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. అలాగే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదనీయంకాదని కూడా కమిటీ చెప్పిందన్నారు. అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరడం ప్రజలను మభ్యపెట్టడమే అని కేసీఆర్‌పై పాల్వాయి మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న మేరకే ప్రాణహిత - చేవెళ్ల కట్టాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. సీడబ్ల్యూసీ ఒప్పుకున్నా ఇచ్చంపల్లి పాజెక్టును ఎందుకు చేపట్టడంలేదన్న కేంద్రం ప్రశ్నకు కేసీఆర్ సర్కార్ స్పందించడం లేదన్నారు. -
'దోబూచులాడుతున్న చంద్రబాబు, కేసీఆర్'
నల్లగొండ: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు బలిపశువు చేశారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు, కేసీఆర్ దోబూచులాతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కరీంనగర్ లో 252 ఫ్లోరైడ్ ప్రాంతాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లాలో 252 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఐఎంఐఎస్(ఇంటిగ్రేటెడ్ మ్యానేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం)ద్వారా 2012-13లో సేకరించిన సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాలో 252 ప్రాంతాల్లోని తాగునీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. అయితే తాగునీటి సరఫరా అనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని తెలిపారు. -
'ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు'
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సరిగా పనిచేయడం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నాడు పి. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది ఎమ్మెల్యేలున్నా చంద్రబాబు ప్రభుత్వంపై సమర్థవంతంగా పోరాడామని గుర్తు చేశారు. నేడు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నా సీఎల్పీ పట్టించుకోవడం లేదని పాల్వాయి వాపోయారు. -
అత్యంత మూర్ఖుడు కోమటిరెడ్డి: పాల్వాయి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఎంపిక విషయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఈ భూమి మీద ఉన్న అత్యంత మూర్ఖుడని పాల్వాయి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ నియామకం భేష్ అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని అభిప్రాయపడ్డారు. రాహుల్ మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని గతంలో కొందరు మధ్యవర్తులు పక్కదోవ పట్టించి నష్టం చేశారన్నారు. ఇపుడు కూడా కొందరు ఇదే తరహాలో రాహుల్‌కు మధ్యవర్తులుగా ఉండి ఆయన్ను పక్కదోవ పట్టిస్తూ, పార్టీకి నష్టం చేస్తున్నారని పాల్వాయి వివరించారు. -
'పట్టిసీమతో తెలంగాణకూ ఇబ్బందే'
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్ట్‌తో తెలంగాణకు కూడా ఇబ్బందేనని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాస్తవాన్ని పసిగట్టి పట్టిసీమ నిర్మాణానికి అభ్యంతరం చెప్పాలని సీఎం కేసీఆర్‌కు పాల్వాయి సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లో పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ... పట్టిసీమతో పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గోదావరి జలాలు వినియోగించుకోవడంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా రాదని సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ తేల్చిందన్న విషయాన్ని ఈ సందర్బంగా పాల్వాయి గుర్తు చేశారు. ఇచ్చంపల్లిని కలుపుకుని 7 బ్యారేజీలతో ప్రాణహిత - చేవెళ్ల చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేలకుండా ప్రాజెక్ట్‌లను రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రమే నష్టపోతుందని పాల్వాయి అన్నారు. -
'అర్హతలన్నీ ఉంటేనే ప్రాణహితకు జాతీయ హోదా'
న్యూఢిల్లీ: సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణసాధ్యంగా ఉండటంతోపాటు జాతీయ ప్రాజెక్టుకు ఉండాల్సిన అర్హతలను సంతృప్తిపరిస్తేనే ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు కూడా రావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్ లాల్ జాట్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. -
జన ఔషధి స్టోర్లు ఏర్పాటు చేయాలి: పాల్వాయి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పేదలందరికీ తక్కువ ధరకు మందులు అందుబాటులో ఉండేలా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఔషధి స్టోర్లు ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఇందుకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించారు. మంగళవారం స్పెషల్ మెన్షన్ కింద రాజ్యసభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. -
'పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నవారిని తొలగించాలి'
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని తొలగించాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీకి చెందిన నేతలంతా కలసి కట్టుగా పోరాడతామని పాల్వాయి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అదికాక అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కారు ఎక్కేస్తున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పై కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పొన్నాలపై పలువురు సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
కేబీఆర్ పార్క్‌కు నిజాం పేరా?
* పునః పరిశీలించాలంటూ కేసీఆర్‌కు పాల్వాయి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరును పెడుతున్నట్టు వార్తలు వచ్చాయని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడం కోసం చాలామంది చనిపోయారని గుర్తుచేశారు. నిజాం బలగాలు, రజాకర్ల దాష్టీకానికి చాలా కుటుంబాలు బలయ్యాయని, తమ కుటుంబంపై కూడా దాడి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ముస్లింల మెప్పు పొందాలన్న కాంక్షతో నిజాం పేరు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. చాలామంది ముస్లింలు కూడా హైదరాబాద్ స్టేట్‌కు స్వాతంత్య్రం కోసం పోరాడిన సంగతిని మరువరాదన్నారు. రావి నారాయణ రెడ్డి పేరు గానీ, రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి పేరు గానీ, సాలార్జంగ్ బహదూర్ పేరు గానీ పెట్టాలని పాల్వాయి సూచించారు. -
ఎంపీ, మాజీ ఎంపీల మధ్య మాటల యుద్ధం
సికింద్రాబాద్: నాయకులు మధ్య పోరుకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ పార్టీలోని ఎంపీ, మాజీ ఎంపీల మధ్య ఆదివారం తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అందుకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా కార్యక్రమం వేదిక అయింది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 10 జిల్లాల నుంచి పార్టీ నాయకులు హాజరయ్యారు. కాగా కార్యక్రమంలో నాయకులకు సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేస్తున్నారు. ఆ క్రమంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డికి పుస్తకాలు అందజేస్తుండగా... కె.రాజగోపాల్ జోక్యం చేసుకుని... రెబల్‌గా తన కుమార్తెను పోటీ చేయించిన పాల్వాయికి ఆ పుస్తకాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దాంతో పాల్వాయి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విషయం నీకు ఎందుకు అంటూ పాల్వాయి... రాజగోపాల్‌రెడ్డిపై ఫైరయ్యారు. దీంతో ఇద్దరు మధ్య చాలా సేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. పలువురు నాయకులు జోక్యం చేసుకుని సర్థి చెప్పినా వారు వినలేదు. సమావేశం అనంతరం కూడా ఇదే అంశంపై వారిరువురు తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఇటీవల తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి నల్గొండ జిల్లా మునుగొడు అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. అయితే ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని వామపక్ష పార్టీకి కేటాయించారు. దీంతో స్రవంతి ఆ స్థానం నుంచి రెబల్‌గా బరిలోకి దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కె.రాజగోపాల్ భువనగిరి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి... ఓటమి పాలైయ్యారు. ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి మునుగొడు అసెంబ్లీ స్థానం వస్తుంది. తన ఓటమికి గల కారణాల్లో పాల్వాయి కుమార్తె కూడా ఓ కారణమని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. -
'అసమ్మతితో కేసీఆర్ సర్కారు పడిపోవచ్చు'
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. కమర్షియల్ లీడర్షిప్ కాదు ఎఫెక్టివ్ లీడర్షిప్ కావాలన్నారు. సీఎల్పీ నేతగా జానారెడ్డి విఫలమయ్యారని అన్నారు. సీఎల్పీ బాధ్యతలు జీవన్‌రెడ్డికి అప్పగించాలన్నారు. కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని జోస్యం చెప్పారు. కేసీఆర్ తన మంత్రులెవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ మొత్తం అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి వల్ల కేసీఆర్ సర్కారు పడిపోవచ్చని చెప్పారు. సర్కారు పడిపోతే కాంగ్రెస్ దీటుగా ఎదిగేలా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పాల్వాయి సూచించారు. -
పొన్నాల, జానాలది అసమర్థ నాయకత్వం
కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలపై ప్రభుత్వా న్ని నిలదీయడంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి విఫలవుయ్యూరని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పంటరుణాల వూఫీ, కరెంటు కోతలు, ఉద్యోగాల భర్తీ తదితర సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో రాష్ట్ర కాం గ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానించారు. శనివా రం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ జరి గాక రాష్ట్ర నాయకత్వాలను మార్చేస్తారన్నారు. పుష్కరాలకు ఇంజనీర్లతో కమిటీ సాక్షి, హైదరాబాద్: 2015లో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు వచ్చే ప్రతిపాదనలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందు కు ఆరుగురు ఇంజనీర్లతో కమిటీని ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్, ఎస్ఆర్ఎస్పీ, జీఎల్ఐఎస్ చీఫ్ ఇంజనీర్లు, గోదావరి బేసిన్ కమిషనర్, ఖమ్మం, కరీంనగర్ల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. -
పొన్నాలను అధిష్ఠానమే తప్పిస్తుంది: పాల్వాయి
పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికీ పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తనదేనని చెప్పిన పొన్నాల.. ఇంకా ఎందుకు ఆ పదవిలో ఉన్నారని ఆయన అడిగారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పొన్నాలను అధిష్ఠానమే ఆ పదవి నుంచి తప్పిస్తుందని చెప్పారు. వాస్తవానికి దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదని పాల్వాయి విమర్శించారు. అధిష్ఠానానికి తెలియకుండానే జిల్లా నాయకులను పొన్నాల సస్పెండ్ చేస్తుంటే దిగ్విజయ్ స్పందించట్లేదని మండిపడ్డారు. పీసీసీ బాధ్యతలను అధిష్ఠానం యువతరానికి అప్పగించాలని, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. -
''పీసీసీ పదవిలో పొన్నాల కొనసాగడం సరికాదు''
-
'క్షమాపణలు చెప్పి సీఎం పదవి నుంచి తప్పుకో'
హైదరాబాద్: ఎన్నికల సందర్బంగా రుణమాఫీపై రైతులకు ఆశలు కల్పించిన చంద్రబాబు... ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక అదే రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం దక్కించుకున్న తర్వాత చంద్రబాబు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై పాల్వాయి ఆదివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రుణమాఫీపై హామీలిచ్చినప్పుడు తెలియదా ? అవి ఆచరణ సాధ్యం కానివని చంద్రబాబును ప్రశ్నించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు వెంటనే చంద్రబాబు మాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేయాలేక పోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని చంద్రబాబుకు పాల్వాయి హితవు పలికారు. సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, తన ఛాంబర్ హంగులకు చంద్రబాబు రూ. వందలాది కోట్లు దుబారా చేస్తున్నారని పాల్వాయి విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందుంచాలని పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబుకు సూచించారు. -
'కాంగ్రెస్ ఓడిందంటే తెలంగాణ నేతలదే తప్పు'
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నాయకత్వ లోపమే కారణమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఎన్నికల్లో ఓడిందంటే అందుకు ఆప్రాంత కాంగ్రెస్ నేతలదే తప్పు అని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని నేతలందరూ వ్యవహరించిన వైఖరి వల్లే కాంగ్రెస్ ఓటమి చెందిందని సర్వే సత్యనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని బలోపేతం చేయాలని సోనియాగాంధీని కోరినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా కృషి చేస్తామని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మంగళవారం ఉదయం సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్థన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలు వివరించినట్లు పాల్వాయి తెలిపారు. తెలంగాణా ఇచ్చినా ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయామని సోనియాకు చెప్పామన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామన్నారు. -
ఆ నాయుడు.. ఈ నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారు
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి విమర్శించారు. పోలవరం అంశం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశానని, ప్రాజెక్టుకు అంశాలన్నింటినీ ప్రధానికి వివరించానని ఆయన చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరగనీయమని ప్రధాని హామీ ఇచ్చారని పాల్వాయి అన్నారు. పోలవరం డిజైన్ మార్చితేనే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, పర్యావరణ, గిరిజనశాఖ అనుమతులు లభిస్తాయని ఆయన చెప్పారు. -
లాటరీ పద్ధతి అశాస్త్రీయం: పాల్వాయి
రాజ్యసభ సభ్యులను లాటరీ పద్ధతిలో రెండు రాష్ట్రాలకు కేటాయించడం అశాస్త్రీయమని సీనియర్ ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి రాజ్యసభకు ఎంపికైన వారిని ఆంధ్రా, తెలంగాణ వారీగా ఉంచాలని, తాము ఇప్పటికే తమ సొంత జిల్లాలకు నిధులు కేటాయిస్తున్నామని పాల్వాయి చెప్పారు. తమ వాదనను ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుందని, బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత ఆర్డినెన్స్ చేస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. కాగా, రాజ్యసభ సభ్యులను లాటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయించడంపై పలువురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో డ్రా వాయిదా పడింది. శుక్రవారం సాయంత్రం 4 దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. -
ఏఐసీసీ నేతలూ కారణమే: పాల్వాయి
పరాజయంపై సోనియాకు పాల్వాయి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడానికి పార్టీలోని కొందరు స్వార్థ నేతలే కారణమని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మంత్రుల్లో సొంత లాభాల కోసం ఫైళ్లపై సంతకాలు చేస్తూ కొందరు, కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సీఎం అయ్యే పనుల్లో మరికొందరు మునిగిపోయారే తప్ప... ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారన్నారు. ఏఐసీసీ నేతల నిర్లక్ష్య ధోరణి సైతం ఇందుకు తోడైందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కొప్పుల రాజు, కేంద్రమంత్రి జైరాంరమేశ్లపైనా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శుక్రవారం లేఖ రాశారు. -
పాల్వాయిని బహిష్కరించండి
హైకమాండ్‌కు టీపీసీసీ సిఫారసు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించారని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ టీ పీసీసీ క్రమశిక్షణా సంఘం.. కాంగ్రెస్ అధిష్టానానికి సిఫారసు చేసింది. సోమవారం గాంధీభవన్‌లో క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన సభ్యులు పాల్వాయి వ్యవహారంపై చర్చించారు. షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ ఇంతవరకుపాల్వాయి వివరణ ఇవ్వలేదని, ఆయనను కాంగ్రెస్ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించి, ఏఐసీసీకి ఫిర్యాదు చేసింది. -
పాల్వాయిపై వేటుకు సిఫారసు
హైదరాబాద్: సొంత పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఏఐసీసీకి సిఫార్సు చేసింది. గాంధీభవన్‌లో నేడు జరిగిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాల్వాయికి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన తన కూతురు స్రవంతి తరపున పాల్వాయి ప్రచారం చేయడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలే ప్రధాన కారణమని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లులో ఆయనను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కేసీఆర్ వస్తే వాళ్లకు సీఎం పదవి దక్కదనే దురాశతో వ్యతిరేకించారని ఆరోపణలు చేశారు. -
పొన్నాల టికెట్లు అమ్ముకున్నారు.. తప్పించండి
కాంగ్రెస్ పార్టీ నేతల లోపం వల్లే తెలంగాణ ప్రాంతంలో పార్టీ ఓటమి చవిచూసిందని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టికెట్లు అమ్ముకున్నారని, ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. కేవలం తమ నేతల వైఫల్యం వల్లే టీడీపీకి తెలంగాణలో ఓట్లు పడ్డాయన్నారు. పార్టీ ఓటమికి అసలైన కారణం దిగ్విజయ్ సింగ్, పొన్నాల లక్ష్మయ్యలేనని, వాళ్లిద్దరినీ తక్షణం పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవిభజన తర్వాత టీపీసీసీని ఏర్పాటు చేయడంలో దిగ్విజయ్ ఆలస్యం చేశారని, ఆయన పూర్తిగా కేవీపీ డైరెక్షన్లో నడిచారని ఆరోపించారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో కేసీఆర్ పాత్ర ఉండాలన్న తన సలహాను దిగ్విజయ్ పట్టించుకోలేదని చెప్పారు. ఇక తెలంగాణ ప్రాంతంలో టిక్కెట్ల కేటాయింపు, పార్టీ నేతలను కలుపుకోవడంలో పొన్నాల ఘోరంగా విఫలమయ్యారని, ఆయన టిక్కెట్లు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఓటమికి కారణమైన పొన్నాల తక్షణమే పార్టీకి క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. దిగ్విజయ్, జైరాం రమేష్ లాంటి కొందరు పెద్దలు సోనియగా గాంధీ చుట్టూ చేరి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి తనకు కావాలంటే తనకు కావాలంటూ బయల్దేరిన జానారెడ్డి లాంటి ఆశావహులు కూడా ఈ ఓటమికి కారణమేనని పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. -
పాల్వాయి, రాజేశ్వర్లకు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్లకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించకుండా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నోటీసులు ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. తక్షణమే వివరణ ఇవ్వడంతోపాటు అభ్యర్థులకు సహకరించాలని ఆదేశించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం సభ్యులు శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమై వారికి నోటీసులు జారీ చేశారు. సాధారణంగా ఏ నాయకుడికైనా షోకాజు నోటీసు జారీ చేస్తే రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటారు. అయితే ఎన్నికల సమయంలో ఆ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదు. షోకాజ్ నోటీసులతో సంబంధం లేకుండా పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించే అధికారం టీపీసీసీకి ఉంది. అయితే, పాల్వాయి సీనియర్ నేత, ఎంపీ కూడా. రాజేశ్వర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచన మేరకు ఇరువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మాత్రమే టీపీసీసీ క్రమశిక్షణా సంఘం పరిమిత మైంది. ‘మా నోటీసులకు వెంటనే వివరణ ఇస్తూ.. పార్టీ అభ్యర్థులకు సహకరిస్తే ఎలాంటి చర్యా ఉండదు. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే మాత్రం సస్పెండ్ చేసేందుకూ వెనుకాడం’ అని క్రమశిక్షణా సంఘం సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. -
పాల్వాయికి 'డాటర్ స్ట్రోక్'
ఎండాకాలంపైగా ఎన్నికల సమయం... ప్రచారం కోసం తిరిగే సన్ స్ట్రోక్ తగలాలి. కాని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డికి మాత్రం 'డాటర్ స్ట్రోక్' తగిలింది. ఇదేమిటీ అని అనుకుంటున్నారా? నిజమండీ. సదరు ఎంపీగారి కుమార్తె పాల్వాయి స్రవంతి దెబ్బకు ఆమె తండ్రి గోవర్థన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ శుక్రవారం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఉండి ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాంటూ పాల్వాయిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి ఓ నివేదిక తయారు చేసి అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌కు నివేదిక అందజేశారు. ఆ అంశంపై శుక్రవారం గాంధీ భవన్లో చర్చించి పాల్వాయికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అసలు జరిగిందేంటి : పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి 2009లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. అందుకో లేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనో కానీ ఆమె తండ్రి పాల్వాయి గోవర్థన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలిచి మరీ రాజ్యసభ సీటు అప్పగించింది. దాంతో ఆయన మహా ఖుషీ అయ్యారు. అయితే తన తండ్రికేనా తనకు ఎమ్మెల్యే సీటైనా లేకపోతే ఏట్లా అనుకుందో ఏమో కానీ స్రవంతి రానున్న ఎన్నికల బరిలో నిలబడాలని గట్టిగా నిర్ణయించుకుంది. 2014లో ఎన్నికలు రానే వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశ పెట్టుకుంది. కానీ తెలంగాణలో పొత్తులో భాగంగా సీపీఐ నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మిత్రపక్షాల అభ్యర్థిగా మునుగోడు నుంచి రంగంలోకి దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహించిన స్రవంతి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వినిపించుకోలేదు. దీంతో ఓట్లు చీలే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ రంగంలో దింపింది. ఆ క్రమంలో కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ సైతం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. కుమార్తె స్రవంతికి నచ్చ చెప్పుకోవాలని పాల్వాయికి హితవు పలికారు. తన కుమార్తె తన మాట వినడం లేదు మహాప్రభో అంటూ గోవర్థన్ రెడ్డి... జైరాం రమేష్ ఎదుట వాపోయారు. ఇంకే చేస్తాం కనీసం కుమార్తెకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని గోవర్థన్ రెడ్డికి జైరాం రమేశ్ హితవు పలికారు. విడవమంటే పాము కోపం పట్టమంటే కప్పకు కోపం అన్నట్లు తయారైంది గోవర్థన్ రెడ్డి పరిస్థితి. కుమార్తె స్రవంతి తరపున ప్రచారం చేయాలని కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి రోజురోజూకు అధికమైంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మాట వినక తప్పదని నిర్ణయానికి వచ్చిన పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె తరపున ప్రచారం చేస్తున్నారు. పిలిచి రాజ్యసభ సీటు ఎక్కిస్తే కూతురు కూతురంటూ ఆమె తరఫున ప్రచారం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతావా అంటూ అధిష్టానం పాల్వాయిపై ధ్వజమెత్తింది. -
'నా కూతురు నా మాట వినడం లేదు మహాప్రభో'
కరవ మంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోవాలని పాల్వాయి ... తన కుమార్తె స్రవంతికి సూచించారు. అందుకు ఆమె ససేమిరా అంది. ఇంకే చేస్తాంమంటూ పాపం పాల్వాయి దగ్గరుండి తన కుమార్తె చేత శనివారం నామినేషన్ దాఖలు చేయించారు. ఆ విషయం కాస్తా కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌కు తెలిసింది. అంతే పాల్వాయి గోవర్థన్పై జైరాం రమేష్ నిప్పులు తొక్కారు. నామినేషన్ ఉపసహంరింప చేయాలంటూ ఇంటికెళ్లి మరీ ఆదేశించారు. తన కుమార్తె తన మాట వినడం లేదు మహాప్రభో అంటూ పాల్వాయి గోవర్ధన్ కన్నీటీ పర్యంతమైయ్యారు. దాంతో జైరాం తిక్క రేగింది. కాంగ్రెస్ పార్టీ నిన్ను రాజ్యసభకు పంపిస్తే ఇంత పని చేస్తావా అంటూ పాల్వాయికి జైరాం తలంటాడు. అంతేకాకుండా కన్న కూతురుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పాల్వాయిని జైరాం రమేష్ ఆదేశించారు. మునగొడు ఎమ్మెల్యే టికెట్ పాల్వాయి గోవర్థన్ రెడ్డి ... తన కుమార్తె స్రవంతికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయిస్తుందని ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి ఆశలుపై నీళ్లు చల్లింది. ఇంకేముంది స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని స్రవంతి తన తండ్రికి బల్లగుద్ది చెప్పింది. దాంతో పాల్వాయి తన కుమార్తె నామినేషన్ దగ్గరుండి మరీ వేయించారు. -
రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి కుమార్తె
నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. సీపీఐతో పొత్తుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించటం లేదు. దాంతో మునుగోడులో రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ....కుటుంబానికి ఒకే సీటు అనే వాదన తెరపైకి రావడంతో ఆశావాహులకు నిరాశే ఎదురైంది. గతంలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పలుమార్లు మునుగోడు టిక్కెట్ స్రవంతిదేనని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మునుగోడును అంటుపెట్టుకోని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీని ముందుకు నడిపించారు. మరోవైపు దేవరకొండలో రెబల్ బరిలో ఎమ్మెల్యే బాలూ నాయక్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఖరారైన గుడిపాటి నర్సయ్యను మార్చి ఆయన స్థానంలో అద్దంకి దయాకర్‌కు టికెట్ ఖరారు చేయటంతో పార్టీ నేతలు అలకబూనారు. -
కాంగ్రెస్ ని వీడేది లేదు : కోమటిరెడ్డి
-
కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు దక్కవు: కోమటిరెడ్డి
నల్లగొండ: తమకు టిక్కెట్ రాకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా దక్కవని సాక్షి టెలివిజన్ తో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తన సోదరునికి సిట్టింగ్ సీటు కోరడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై విషప్రచారం చేస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పాల్వాయి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారని సాక్షితో కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమకు టిక్కెట్లు ఇస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్లోకి వెళతానని కొంత మంది తమపై విషప్రచారం చేస్తున్నారని, అయితే తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
కేసీఆర్ కంటే ముందే మాట్లాడా: పాల్వాయి
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట్లాడటంలేదని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి హామీ ఇవ్వనందునే విలీనంపై మౌనం వహించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాల్సిందేనని అన్నారు. కేసీఆర్ కంటే ముందే తాను పోలవరంపై మాట్లాడానని గుర్తు చేశారు. దిగ్విజయ్ సింగ్‌తో పాల్వాయి భేటీ అయ్యారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అంశం గురించి చర్చించారు. -
సోనియాకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటాం: పాల్వాయి
-
'టి. బిల్లు 18న లోక్‌సభలో, 19న రాజ్యసభలో ఆమోదం'
తెలంగాణ బిల్లు ఈ నెల 18న లోక్‌సభ, 19న రాజ్యసభలో ఆమోదం పొందుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో జోస్యం చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముడుపుల కోసం ఫైళ్లపై సంతాకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన సంతకాలు చేసిన ఫైళ్లు చెలవన్నారు. సీఎం మాటలు విని తప్పులు చేసే అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో పెడితే తన పదవికి రాజీనామా చేస్తానని గతం సీఎం కిరణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపో ఏల్లుండో పార్లమెంట్లో బిల్లు చర్చకు రానుంది. దాంతో కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఊహగానాలు ఊపందుకున్నాయి. అందుకోసం సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సీఎం గత నాలుగైదు రోజులుగా సచివాలయంలో వందల సంఖ్యలో పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. దాంతో అటు విపక్షాలు, ఇటు స్వపక్షం చెందిన నాయకులు సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. -
సీఎంను పదవి నుంచి దించి, తన్ని పంపాలి
మర్రిగూడ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దించి తన్ని పంపించాలని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జలాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని 9నెలల క్రితమే తాను సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈనెల 12న తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంపై బీజేపీ రంగు కూడా బయటపడుతుందన్నారు. బీజేపీ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయినా, దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం కూడా కేంద్రం చేస్తుందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. -
'ప్రపంచంలో పెద్ద మూర్ఖుడు కిరణే.. ఛీ కొడుతున్నారు'
హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద మూర్ఖుడు కిరణేనని విమర్శించారు. సీఎం తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్ర విభజన ఆగదని, ఆయన్ను అందరూ ఛీ కొడుతున్నారంటూ పాల్వాయి రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 15 కల్లా నోటిఫికేషన్ రాబోతోందని పాల్వాయి చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నెల 30 కల్లా తెలంగాణ బిల్లు కేంద్రానికి చేరుతుందని పాల్వాయి గోవర్ధన రెడ్డి వ్యాఖ్యానించారు. -
సీఎం పార్టీ పెట్టినా భూస్థాపితమే: పాల్వాయి
హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీపెట్టినా, పెట్టకున్నా ఒక్కటేనని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడతారో... ఆతరువాత రాజకీయంగా భూస్థాపితమే అవుతారో కానీ వాటితో తమకు సంబంధం లేదని తెలంగాణకు అడ్డుపడే ప్రయత్నాలేవీ ఫలించవని అన్నారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌కు పిచ్చిపట్టి తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరుడు వివాదాస్పద భూములను సెటిల్మెంట్లు చేస్తూ కోట్లాది రూపాయలుదండుకుంటున్నారని ఆరోపించారు. సీఎంను క్షణాల్లో తప్పించే అవకాశమున్నా సోనియా గాంధీ ఓపిక పడుతున్నారని, పగసాధిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుందని వెనుకడుగు వేస్తున్నారే తప్ప వేటు వేయలేక కాదని స్పష్టంచేశారు. అక్రమాలకు పాల్పడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లకతప్పదన్నారు. ఏఐసీసీ సమావేశంలో సమైక్యం పేరుతో గొడవ చేస్తే అక్కడి కార్యకర్తలు వారిని మెడపట్టి గెంటేస్తారని హెచ్చరించారు. అవినీతి అక్రమార్కులను పార్టీలో చేర్చుకోవద్దని ఏఐసీసీ సమావేశంలో తాను తీర్మానం ప్రవేశపెడతానని తెలిపారు. యువనేత రాహుల్‌గాంధీ పార్టీ ప్రభుత్వ పదవులు స్వీకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నార. రాహుల్‌కు రాక్షస జాతికి చెందిన మోడీకి మధ్య యుద్ధం జరుగుతోందని అంతిమంగా రాహుల్ విజయం ఖాయమన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం మోసాలతోనే గడిచిందని, ఆయనంత అబద్ధాల పుట్ట ఎవరూ లేరన్నారు. సోనియాకు ధన్యవాద తీర్మానం: పొంగులేటి తెలంగాణ ఇచ్చినందున పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఏఐసీసీ సవూవేశంలో ప్రత్యేక ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈమేరకు ఏఐసీసీలో చర్చించాలని ఎంపీ లగడపాటి రాజగోపాల్ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని స్పష్టంచేశారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని రెండుచోట్లా భూస్థాపితం కావడం ఖాయమన్నారు. -
'నరేంద్ర మోడీ రాముడై వస్తున్నాడు'
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రావణ జాతికి చెందిన కాంగ్రెస్ ను ఓడించడానికి మోడీ రాముడై వస్తున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి ఎస్.కుమార్ తెలిపారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎదుర్కొవడానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ ను ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు. పాల్వాయి సహా ఇతర కాంగ్రెస్ నేతలు తమ చరిత్రను గుర్తించుకుంటే మంచిదన్నారు. నరేంద్ర మోడీని రాక్షస జాతికి చెందిన వ్యక్తిగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాక్షస జాతి మోడీతో కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ యుద్ధం చేస్తారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
'రాక్షస జాతి మోడీతో రాహుల్ యుద్ధం చేస్తారు'
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రాక్షస జాతికి చెందిన వ్యక్తిగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాక్షస జాతి మోడీతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యుద్ధం చేస్తారని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను పవిత్రుడులా మాట్లాడుతున్నారని పాల్వాయి ఎద్దేవా చేశారు.ఈ విధంగా బాబు మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. నరరూప రాక్షసుడైన ఆయన పాలనలో ప్రజలు నరకాన్ని చూశారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి వెన్నపోటుపొడిచిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు భూదందాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేసే కాంట్రాక్టల నుంచి కిరణ్ లంచాలు తీసుకుంటున్నారన్నారని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిపై సమీక్షలు నిర్వహిస్తామని పాల్వాయి తెలిపారు. కళంకిత నేతలను, మంత్రులను కాంగ్రెస్ నుంచి పంపాలని ఏఐసీసీలో తాను తీర్మానం ప్రవేశపెడతానన్నారు. -
`అవినీతిపై ఉరితీయాల్సింది చంద్రబాబునే`
హైదరాబాద్: అవినీతి గురించి చంద్రబాబు అదేపనిగా మాట్లాడుతున్నారని, అవినీతిపై మొదటగా ఉరితీయాల్సింది చంద్రబాబునే అని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్లుగా పదవి లేకపోవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు మతిభ్రమించిందని పాల్వాయి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తలెత్తడానికి చంద్రబాబు అసమర్థపాలనే కారణమని ఆయన ఆరోపించారు. కంపెనీల పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వభూమిని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారని పాల్పాయి గోవార్థన్ రెడ్డి విమర్శించారు. -
'విలీనంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు'
-
'విలీనంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు'
హైదరాబాద్ : విలీనం విషయంలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కేసీఆర్‌తో ఎలాంటి ఒప్పందం జరగలేదని... అయితే భవిష్యత్‌లో ఒప్పందం జరగవచ్చని అన్నారు. చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు కోసం ఆపార్టీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని పాల్వయి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీకి పుట్టగతులు ఉండవంటూ విరుచుకుపడ్డారు. పనిలో పనిగా పాల్వాయి ముఖ్యమంత్రిపై కూడా ధ్వజమెత్తారు. సీఎంకు మతిభ్రమించిందని మండిపడ్డారు. సీమాంధ్రలో ప్రజాప్రతినిధుల్ని రెచ్చగొట్టి పార్టీని బలహీనపరుస్తున్నారని అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును తెలంగాణ ప్రాంతం ఆమోదించదని పాల్వాయి తెలిపారు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
'టిఆర్ఎస్ను కెసిఆర్ కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు'
-
కెసిఆర్ మాట నిలబెట్టుకోవాలి: పాల్వాయి
హైదరాబాద్: తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్ధన రెడ్డి అన్నారు. విలీనంకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీఆర్‌కు తగిన గౌరవం ఇస్తోందన్నారు. ఎన్నికల్లో టిక్కెట్ దక్కదనే కొందరు విలీనం వద్దంటూ కేసీఆర్‌కు సలహా ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలని పాల్వాయి కోరారు. -
'రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పు'
కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఏమీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ట్రిబ్యునల్ ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జనవరిలో ఏర్పడుతుందని పాల్వాయి గోవర్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తుందని తెలిపారు. మూడు రోజులపాటు టి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని వెల్లడించారు.