ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడానికి పార్టీలోని కొందరు స్వార్థ నేతలే కారణమని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.
పరాజయంపై సోనియాకు పాల్వాయి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడానికి పార్టీలోని కొందరు స్వార్థ నేతలే కారణమని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మంత్రుల్లో సొంత లాభాల కోసం ఫైళ్లపై సంతకాలు చేస్తూ కొందరు, కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సీఎం అయ్యే పనుల్లో మరికొందరు మునిగిపోయారే తప్ప... ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారన్నారు. ఏఐసీసీ నేతల నిర్లక్ష్య ధోరణి సైతం ఇందుకు తోడైందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కొప్పుల రాజు, కేంద్రమంత్రి జైరాంరమేశ్‌లపైనా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శుక్రవారం లేఖ రాశారు.