పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కన్నుమూత | Palvai govardhan reddy passed away | Sakshi
Sakshi News home page

పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కన్నుమూత

Published Fri, Jun 9 2017 10:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కన్నుమూత - Sakshi

పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కన్నుమూత

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.  1936, నవంబర్‌ 20న జన్మించిన పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి స్వస్థలం మహబూబ్‌ నగర్‌ జిల్లా అచ్చంపేట మండలం నందంపల్లి.

1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా, 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీగా ఉన్నారు.  కాగా ఆయన భౌతికకాయాన్ని కులుమనాలి నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాల్వయి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ సంతాపం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement