palvai demise
-
పాల్వయి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి హఠాన్మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మరోవైపు పాల్వయి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితోపాటు కులుమనాలి వెళ్లిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్.... పాల్వాయి గోవర్దన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి ,సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం గల పాల్వాయి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేసారని అన్నారు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఎంతో చురుకుగా కార్యక్రమాలలో పాల్గొనేవారన్నారు. పాల్వాయి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ,వారి కుటుంబ సభ్యులకు స్వామిగౌడ్ సానుభూతి తెలిపారు. కాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పాల్వాయి గోవర్దన్ రెడ్డి పార్దీవ దేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించింది. అక్కడ పాల్వాయి అధికార నివాసంలో కొద్దిసేపు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అక్కడే ఏఐసీసీ నాయకులు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్కు తరలిస్తారు. -
పాల్వాయి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితో పాటు మనాలి వెళ్లిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, పాల్వాయి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్లను ఆదేశించారు. మృతదేహం తరలింపుతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీలు కేకే, జితేందర్రెడ్డిలను సీఎం కోరారు. జానారెడ్డి సంతాపం కాగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు..పాల్వాయి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. 1936, నవంబర్ 20న జన్మించిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నందంపల్లి. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా, 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీగా ఉన్నారు. కాగా ఆయన భౌతికకాయాన్ని కులుమనాలి నుంచి హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాల్వయి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.