పాల్వాయి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Published Fri, Jun 9 2017 11:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితో పాటు మనాలి వెళ్లిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కాగా, పాల్వాయి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్‌లను ఆదేశించారు. మృతదేహం తరలింపుతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డిలను సీఎం కోరారు.
జానారెడ్డి సంతాపం
కాగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు..పాల్వాయి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Advertisement
Advertisement