
కేసీఆర్ కంటే ముందే మాట్లాడా: పాల్వాయి
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట్లాడటంలేదని అన్నారు.
కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి హామీ ఇవ్వనందునే విలీనంపై మౌనం వహించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాల్సిందేనని అన్నారు. కేసీఆర్ కంటే ముందే తాను పోలవరంపై మాట్లాడానని గుర్తు చేశారు. దిగ్విజయ్ సింగ్తో పాల్వాయి భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్తో కాంగ్రెస్ పొత్తు అంశం గురించి చర్చించారు.