పాల్వాయి సంచలన వ్యాఖ్యలు!
పాల్వాయి సంచలన వ్యాఖ్యలు!
Published Fri, Mar 3 2017 3:58 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
హైదరాబాద్: గాంధీ భవన్‌లోని టీపీసీసీ కార్యాలయంలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్వాయి మాట్లాడారు. పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణ పాటించడం లేదని, హద్దులు దాటుతున్నారని పాల్వాయి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ నేత ఏకే ఆంటోనికి కూడా చెప్పానన్నారు.
ఒక్క నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలే ఇలా గీత దాటి వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరిని పార్టీకి చెందిన వారే ఎవరో కొందరు ప్రోత్సహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ గీత దాటుతున్న నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత దిగ్విజయ్‌సింగ్‌దే నని పేర్కొన్నారు. కాగా, ఈ భేటీకి ఏడుగురు సభ్యులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎంఏ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య సమన్వయ కమిటీ భేటీకి గైర్హాజరయ్యారు.
Advertisement