
`అవినీతిపై ఉరితీయాల్సింది చంద్రబాబునే`
హైదరాబాద్: అవినీతి గురించి చంద్రబాబు అదేపనిగా మాట్లాడుతున్నారని, అవినీతిపై మొదటగా ఉరితీయాల్సింది చంద్రబాబునే అని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్లుగా పదవి లేకపోవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు మతిభ్రమించిందని పాల్వాయి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తలెత్తడానికి చంద్రబాబు అసమర్థపాలనే కారణమని ఆయన ఆరోపించారు. కంపెనీల పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వభూమిని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారని పాల్పాయి గోవార్థన్ రెడ్డి విమర్శించారు.