
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి కోరల్లో కూరుకుపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తూ హ్యాపీగా ఉంటున్నారని మండిపడ్డారు.
నయవంచన దీక్షలను ఆపి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చిత్తూరు డెయిరీని గాలికి వదిలేసిన చంద్రబాబు సొంత హెరిటేజ్ డెయిరీని అందలం ఎక్కించారని ఆరోపించారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment