మహానాడు కాదు.. మాయనాడు.. | Kanna Calls TDPs Mahanadu As Mayanadu | Sakshi
Sakshi News home page

మహానాడు కాదు.. మాయనాడు..

Published Mon, May 28 2018 6:00 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

Kanna Calls TDPs Mahanadu As Mayanadu - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని వాడుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరం తీరాక టీడీపీ, బీజేపీని దోషిగా నిలబెడుతోందంటూ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు డబుల్‌ గేమ్‌ ఆడారని చెప్పారు. చంద్రబాబును పెద్ద మాయగాడు అని అభివర్ణించారు. నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) జయంతి సందర్భంగా చంద్రబాబు మహానాడు పేరుతో మాయనాడును నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఆత్మక్షోభకు గురి చేశారని చెప్పారు.

టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జతకడుతోందని అన్నారు. కర్ణాటకలో చంద్రబాబు వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement