TDP Mahanadu
-
టీడీపీపై బొత్స సెటైర్లు
-
చంద్రబాబు భయాన్నే ఈనాడు హైలైట్ చేసింది
టీడీపీ మహానాడుకు సంబంధించి మీడియాలో.. ప్రత్యేకించి ఈనాడులో వచ్చిన వార్తలను చదివితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.ఈనాడు పత్రిక తన శక్తి వంచన లేకుండా తెలుగుదేశంను జాకీలు వేసి లేపే ప్రయత్నం యధాప్రకారం చేసింది. పదిహేనువేల మంది ఈ మహానాడులో పాల్గొంటారనుకుంటే.. అనేక రెట్లు కార్యకర్తలు వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయని రాశారు.సభ మొదలైనప్పటి నుంచి చివరవరకు జనం కదలలేదని ఈనాడు రాసింది. తీరా చూస్తే చంద్రబాబు మాట్లాడుతున్న తరుణంలోనే వందల కుర్చీలు ఖాళీగా కనబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సందర్భంలో చంద్రబాబు అంటున్న ఒక మాట మాత్రం వాస్తవం అనిపిస్తుంది.‘‘ఈసారి ఎన్నికలలో అవకాశం వదలుకుంటే అన్నిదారులు మూసుకుపోతాయ’’ని ఆయన పార్టీ కార్యకర్తలతో అంటున్నట్లు ఆ వీడియోలో ఉంది.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా కార్యకర్తలు పనిచేయాలని చంద్రబాబు వ్యాఖ్యలు పత్రికలో కూడా వచ్చాయి. ఆయన భయం ఏ స్థాయిలో ఉందో ఈ మాటలు తెలియచెబుతాయి. 👉 జగన్ పై చంద్రబాబు అండ్ కో ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. ఆయన స్కీముల ప్రభావానికి.. తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటో తెలియక చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నది మాత్రం అక్షర సత్యం. ఆ మాట ప్రతిసారి చెప్పలేరు కనుక రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించుకోవాలని పైకి అంటుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలను కౌరవసేన అని,దానిని ఓడించి సభలోకి గౌరవంగా వెళతామని చంద్రబాబు చెప్పారు. విశేషం ఏమిటంటే 2014 ఎన్నికలలో టీడీపీకి 102 సీట్లు వచ్చాయి. అంటే కౌరవుల సంఖ్య వందకు దాదాపు దగ్గరగా ఉందన్నమాట. ఆ తర్వాత ఆ సంఖ్యకు తోడుగా మరో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అయినా చంద్రబాబు భాషలో మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలందరిని.. జనం కౌరవులుగా పరిగణించి ఓడించారన్నమాట.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 👉 వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి,వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ మిగిలిన మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి అసెంబ్లీని బహిష్కరించారు. ఆ తర్వాత 2019 లో తెలుగుదేశం కౌరవులు వంద మందిని ఓడించి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని అనుకోవాలి. వైఎస్సార్సీపీ పక్షాన 151 మంది గెలిచారు. వీరిని కౌరవులుగా పోల్చడం వల్ల టీడీపీకి ఏమి ప్రయోజనం వస్తుందో తెలియదు. ఎవరో తెలివితక్కువగా ఇచ్చిన సలహాను చంద్రబాబు వాడుకున్నట్లు అనిపిస్తుంది. 👉 చంద్రబాబు తన భార్యను అవమానించారంటూ అసెంబ్లీని ఆయన ఒక్కరే బహిష్కరించారు. మరి మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు ఎందుకు వస్తున్నారో వారికి కూడా తెలియదు. సభ జరిగే రోజుల్లో వారు లోపలికి వచ్చి కౌరవుల మాదిరి ఏదో ఒక గొడవ చేసి బయటకు వెళుతున్నారు. కొత్తగా ఏదో ఫోర్ పి అంటూ పేదలందరిని ధనికులను చేసేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అదెలాగో ఆయన చెప్పలేరు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని మరో మాట అన్నారు. మంచిదే. మరి పద్నాలుగేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కదా? అయినా పేదరికం ఎందుకు పోలేదు?. అందరిని ధనికులుగా ఎందుకు మార్చలేకపోయారు? అంటే దాని అర్ధం ఆయన ఏదో పడికట్టు పదాలతో నినాదం ఇచ్చి జనాల్ని మాయ చేసే ఆలోచనే కదా!. ఇప్పుడు చంద్రబాబు అందరినీ ధనికులను చేసేస్తానంటే ప్రజలు నమ్ముతారా?. 👉 మరింత సంక్షేమం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఒక పక్క సంక్షేమ స్కీములతో రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేస్తారు. ఇంకో వైపు తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చంద్రబాబు అంటారు. ఆయన్ని ఎలా నమ్మలి?. ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దం చెప్పారు. ఒకవేళ అది నిజమైతే, ఆ పది లక్షలలో చంద్రబాబు టైమ్ లో చేసిన మూడు లక్షల కోట్లో, నాలుగు లక్షల కోట్లు కూడా ఉండి ఉండాలి కదా! దాని గురించి జనానికి తెలియదని ఆయన భావన అన్నమాట. 👉 ఇక రాజకీయ తీర్మానంలో ఒక విశేషం కనిపించింది. రాష్ట్ర ,జాతీయ రాజకీయాలలో ఏమి జరుగుతోందో తెలుగుదేశం గమనిస్తోందని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తీర్మానం ప్రవేశపెట్టిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.అంటే మళ్లీ అవకాశవాదంతో టీడీపీ వ్యవహరిస్తోందన్నమాట. జనసేనతో పొత్తు కోసం నానా తంటాలు పడుతున్న విషయాన్ని కాని, ప్రధాని మోదీని మళ్లీ కాకా పడుతున్న సంగతిని కాని యనమల ఎందుకు వివరించలేదో తెలియదు. రెండు,మూడు పడవలపై కాళ్లు పెట్టి ఎటు వీలైతే అటు దూకుతారని అనుకోవచ్చన్నమాట. 👉 వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పలు తీర్మానాలు ఆమోదించిన మహానాడులో.. అమరావతి గురించి ప్రత్యేక తీర్మానం ఎందుకు పెట్టలేదో తెలియదు. అమరావతిలో యాభై వేలకు పైగా పట్టాలు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఎందుకు తీర్మానం చేయలేదో ఊహించుకోవచ్చు. పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డు పడుతోందని, చంద్రబాబు వాటిని సమాధులతో పోల్చుతున్నారని ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. డ్యామేజీ అయిందన్న భయంతో మహానాడు మొదటిరోజు వాటి జోలికి వెళ్లలేదనుకోవాలి. ఏది ఏమైనా మహానాడులో ఏమి చెప్పాలనుకున్నారో ఎవరికి తెలియకపోయినా, కదం తొక్కిన పసుపుదళం అంటూ ఈనాడు పత్రిక పెద్ద హెడింగ్ లు పెట్టి మురిసిపోతే తెలుగుదేశం గెలిచిపోతుందా! వారి భ్రమ కాకపోతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
మహానాడులో తమ్ముళ్ల బాహాబాహీ
-
‘టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత కనుమరుగే’
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ మరణానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం రాత్రి ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. చంద్రబాబు పదవీ దాహం వల్ల ఎన్టీఆర్ మరణించారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని అంబటి ప్రశ్నించారు. ‘‘టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగే. టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. తుక్కు తుక్కయిన సైకిల్‌ను బాబు తొక్కలేరు. ఇచ్చిన వాగ్ధానాలు చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా?. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు. ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశారా?. వాగ్ధానాలను నట్టేట ముంచిన చంద్రబాబును ఎవరు నమ్ముతారు?. బాబు జీవితమంతా ప్రజలను మోసం చేయడమే’’ అని మంత్రి అంబటి మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు, లోకేష్‌కు కొడాలి నాని సవాల్ ‘‘వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందా?. దోచుకు తినడమే చంద్రబాబు తెలుసు. ఎన్టీఆర్ బతికుంటే బాబు బతుకు బజారుపాలయ్యేది. మహానాడులో చంద్రబాబు అభూతకల్పనలు చెప్పారు. మేం చెప్పింది చేసి చూపించాం. టీడీపీ చెప్పింది ఏదీ చేయలేదు. చంద్రబాబును ప్రజలు ఎన్నటికీ నమ్మరు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
టీడీపీ మహానాడు ప్రాంగణంలో ‘గాలి దుమారం’
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద గాలి దుమారంతో టెంట్లు కూలిపోవడంతో పాటు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. నేతలు మాట్లాడుతుండగానే వర్షం కురుస్తుండటంతో ప్రాంగణం నుంచి కార్యకర్తలు వెళ్లిపోతున్నారు. కాగా, నిన్న(శనివారం) మహానాడు ప్రాంగణంలో ఆ పార్టీకి చెందిన నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక హోటల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణలో ‘పార్టీ లేదు.. బొక్కా లేద’ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. అదే వెంకటేశ్వరరావు.. మహానాడుకు హాజరై కార్యకర్తల మధ్య నుంచి లోకేశ్‌ను పిలిచి తిట్టడం చర్చనీయాంశమైంది. కొందరు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నా జీవితం నాశనమైంది. మీవి కూడా అలా కాకుండా చూసుకోండి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని, న్యాయం చేయమని అడిగితే లోకేశ్ పట్టించుకోలేదన్నాడు. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని -
టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి టీడీపీ మహానాడులో నారా లోకేష్‌కు కార్యకర్త షాకిచ్చాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని లోకేష్‌ను నిలదీశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ లోకేష్‌ను కార్యకర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నాడు. కార్యకర్తను పట్టించుకోకుండా లోకేష్ వెళ్లిపోయారు. దీంతో మహానాడు ప్రాంగణంలోనే వెంకటేశ్వరరావు నిరసనకు దిగాడు. చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ -
సాక్షి కార్టూన్ 30-05-2022
సర్వేలు, కొలమానాలొద్దు సార్! మహానాడులో ఎక్కువ బూతులు మాట్లాడినోళ్లకే టికెట్స్ ఇస్తే సరి! -
మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు : నారా లోకేష్
‘టీడీపీలో దీర్ఘకాలిక పదవుల విధానం రద్దు. వరుసగా మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు. ఇది నా నుంచే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం.’ – మీడియా ప్రతినిధులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: లోకేష్ ఝలక్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఆ జాబితాలో ముందు వరుసలో జిల్లాకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిలవనున్నట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయితే సోమిరెడ్డి పరిస్థితి ఏమిటీ? రాబోయే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ దక్కే అవకాశం లేదా? అని జిల్లా ప్రజానీకంతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుందీ సోమిరెడ్డి పరిస్థితి. ‘మహానాడు’ ఆయన రాజకీయ జీవితానికి సమాధి కానున్న పరిస్థితి ఏర్పడింది. జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు సోమిరెడ్డి. వరుస ఓటముల పాలైనా సోమిరెడ్డికి టీడీపీ అగ్రనేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఆయనకు స్థానం కల్పించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని కూడా చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికగా నారా లోకేష్ ప్రకటన జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో వరుస ఓటముల చరిత్రలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. టీడీపీ సీనియర్ నేతగా జిల్లా నేతలకు పెద్ద దిక్కుగా, పొరుగు జిల్లాల ఇన్చార్జి బాధ్యులుగా ఉన్న ఆయన 1994, 99 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు. 2004, 2009, 2012 (కోవూరు ఉప ఎన్నిక), 2014, 2019ల్లో వరుసగా టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన చరిత్ర జిల్లాలో సోమిరెడ్డిదే. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, 2012 కోవూరు ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. వరుసగా అత్యధిక సార్లు ఓడిపోయిన నేతల జాబితాలో సోమిరెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నారు. నారా లోకేష్ నిర్ణయానికి ఆ పార్టీ కట్టుబడితే సోమిరెడ్డికి పార్టీ టికెట్ దక్కడం దుర్లభమే. రాష్ట్ర స్థాయి నేతగా చెప్పుకునే సోమిరెడ్డికి నారా లోకేష్ ఝలక్ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. యూటర్న్లు తీసుకోవడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటు, అదే వారసత్వం నారా లోకేష్‌కు కూడా వస్తే తప్పా, సోమిరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం లేదు. లోకేష్ ప్రకటన తర్వాత నెటిజన్లు, తెలుగుతమ్ముళ్లు అయ్యో.. సోమిరెడ్డా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంతగా దిగజారాలా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. కావలి ప్రతిభాభారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరంలో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. ప్రతిభాభారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్చల్ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో అసభ్య పదజాలంతో ప్రసంగించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రసంగంతో పాటు ఆమె వైఖరి కూడా సర్వత్రా విమర్శల పాలవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను సమర్థించలేకపోతున్నారు. ఉన్నత పద వులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. హుందాగా వ్యవహరించాల్సిన మహిళ ఇలా నిండు సభలో నోటి కి అదుపు లేకుండా మాట్లాడడాన్ని అంతా ఖండిస్తున్నారు. టిక్కెట్ కోసమేనా ఇదంతా..? గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యా రు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాల తో పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చే యాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు వి జయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పో టీగా కోండ్రు మురళీమోహన్ ఉండటం, ఆయనకు టిక్కె ట్ వస్తుందేమోనన్న అభద్రతాభావంతో ఇలా అధినేత దృష్టిలో పడడానికి పాట్లు పడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
ఒంగోలులో వెలవెల బోయిన తెలుగుదేశం మహానాడు
-
అచ్చెన్నాయుడి పదవికి ఎసరు!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి పదవికి పార్టీ అధినేత చంద్రబాబు ఎసరు పెట్టారు. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆయన్ని తప్పించి మరో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చాప కింద నీరులా చాలాకాలం నుంచి వ్యాపంపజేశారు. తాజాగా క్యాడర్ నుంచి ఇదే అభిప్రాయం వస్తున్నట్లు చూపించి మహానాడులో అచ్చెన్నకు చెక్ పెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఒంగోలులో శుక్రవారం రాత్రి జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అధ్యక్ష పదవిని మరొకరికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రతిపాదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని, ఎక్కువ పదవులు ఇస్తోందని ఆయన చెప్పినట్లు తెలిసింది. జగన్ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజల్లోనూ చర్చ జరుగుతున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో బీసీకి ఇవ్వాలని వెంకట్రావు చెప్పినట్లు తెలిసింది. వ్యూహాత్మకంగానే.. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ, తెలంగాణకు అధ్యక్షులను ఎన్నుకుంటారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం లాంఛనమైన ప్రక్రియే. మిగిలిన పదవులను ఎవరికివ్వాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఇలాగే అచ్చెన్నాయుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్న పార్టీ పరిస్థితి, లోకేశ్ నాయకత్వం పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి నుంచి ఆయన్ని లోకేష్ టార్గెట్ చేశారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ అచ్చెన్నాయుడిని లోకేష్ ఎక్కడికీ వెళ్లనివ్వలేదు. మీడియా సమావేశాల పైనా ఆంక్షలు విధించారు. దీంతో అచ్చెన్నాయుడు అప్పుడప్పుడు ప్రకటనలు మాత్రం విడుదల చేసేవారు. జిల్లాల పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకుని లోకేశే వెళ్లేవారు. అన్ని రకాలుగా అచ్చెన్నాయుడిని పక్కన పెట్టేశారు. అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాలని చూశారు. ఇలా చేస్తే బీసీల్లో ఇంకా బలహీనమవుతామని చంద్రబాబు ఆపుతూ వచ్చారు. ఇప్పుడు మహానాడు సందర్భంగా వ్యూహం ప్రకారం కళా వెంకట్రావు ద్వారా అచ్చెన్నకు చెక్ పెడుతున్నారు. లోకేశ్ కూడా పార్టీ నేతలు ఎక్కువ కాలం పదవుల్లో ఉండకూడదని మహానాడు ప్రాంగణంలోనే తేల్చి చెప్పారు. ఎక్కువ కాలం పదవులు పట్టుకుని వేళ్లాడితే కొత్త వాళ్లు ఎలా వస్తారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని ఉద్దేశించే లోకేశ్ మాట్లాడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహానాడు తర్వాత కొత్త వారికి అవకాశం పేరుతో అచ్చెన్నను పదవి నుంచి తప్పించి మరో డమ్మీ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. (క్లిక్: వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు) -
వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయలు. చంద్రబాబు ఓ విష సర్పం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే తప్ప మహానాడులో చేసిందేమీ లేదు. బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. అది మహానాడు కాదు.. మోసపునాడు. వంద మహానాడులు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేడు. వచ్చే ఐదేళ్లు కూడా చంద్రబాబుకు నిద్రపట్టదు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. కాఫర్ డ్యామ్ పూర్తికాకముందే డయా ఫ్రమ్ వాల్ నిర్మించారు. చంద్రబాబు చారిత్రాత్మక తప్పు చేయడం వల్లే ఇలా జరిగింది. మంత్రి ఇళ్లు దగ్ధమైతే మహానాడులో ఖండించారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతోంది’’ అని ఆరోపించారు. -
మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి: మంత్రి రోజా
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని అని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్నాడు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆమె. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు. ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె... అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు -
‘టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు’
సాక్షి, విశాఖపట్నం: మహానాడులో చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విమర్శించేందుకు ఏమీ లేక చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ’టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడిని మించిన దొంగలెవరున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నాడు’’ అని మంత్రి సురేష్ ఎద్దేవా చేశారు. చదవండి: ‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’ -
మేకవన్నె పులి బాబూ!
దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు... గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజాన్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయ మేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరా టంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. బాబు ఒక చిన్న మిడత 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడు పుఠాణీ ఆరంభించారు. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చు పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగు దేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్నమిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చా త్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించీ, చేరదీస్తున్న గ్రూపుల గురించీ పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందనీ, అతడి వల్ల ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందనీ, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందనీ, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్ను పోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేక పోయాను. నామీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధా భక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్ద మనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది! పేరు చెప్పేందుకూ అనర్హుడే ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తన కంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండే వాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరే వారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెçప్పడం కూడా నాకిష్టంలేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అంద రికీ 5లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్ని కల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్డ్ ట్రెచెరీ! తెలుగు జాతి దురదృష్టం చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లు న్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దుర దృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభ వించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజా స్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లిన ప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగు జాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగు దేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయ కుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? ఆదర్శాలకు వెన్నుపోటు ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్ లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమ స్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడు అనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడి చారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం? బాబును చరిత్ర క్షమించదు అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడి గట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు. మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవా ల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మ హక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికి తనంతో దాన్ని మరోరకంగా ఉపయోగించకండి... ఇది ‘అన్న’ మాట. -
నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి!
చంద్రబాబు పాలన అంటే ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచన గుర్తుకు వస్తాయి. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో దుర్భిక్షం రాజ్యమేలింది. పాడికి పేరొందిన ప్రకాశం జిల్లాలో రైతులకు అండగా ఉన్న ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. రైతులను నట్టేట ముంచేసి.. వేలాది మంది కార్మికులను రోడ్డు పాల్జేశారు. రుణమాఫీ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది కర్షకులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో విడుదలైన అరకొర నిధులు బాబు బినామీలు కాజేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఐదేళ్లు కాలక్షేపం చేసిన ఎన్నికల వేళ హడావిడిగా శిలా ఫలకం వేసి వంచన చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను నట్టేట ముంచేసిన చంద్రబాబు.. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఈ గడ్డపై మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు హయాం 2014 నుంచి 2019 వరకు ప్రకాశం జిల్లాలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఐదేళ్లూ అన్ని మండలాల్లో కరువు తాండవించింది. సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. పశ్చిమాన పలు గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనలతో హడావుడి చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఐదేళ్ల బాబు నయవంచన పాలనను.. మూడేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని జనం పోల్చుకుంటున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. జిల్లాలో నాడు–నేడు ఒక్కసారి పరిశీలిద్దాం.. పాలేరూ అంతే.. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో ముందుకు సాగనేలేదు. అప్పటి, నేటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి (టీడీపీ) కాంట్రాక్టర్లను మార్చటమే పనిగా పెట్టుకున్నారు. మూడుసార్లు కాంట్రాక్టర్లను మార్చి నిర్లక్ష్యం చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను గాలికొదిలేశారు. కరువు జిల్లాగా మార్చేశారు. రుణమాఫీ పేరిట దగా 2014 ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. కమిటీల పేరుతో ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. పాత ప్రకాశం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు కలిపి సుమారు రూ.11 వేల కోట్లకు పైగా రుణాలు ఉండేవి. కేవలం రూ.3 వేల కోట్లలోపు మాత్రమే రుణాలు మాఫీ చేసి అటు రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. హెరిటేజ్ కోసం ఒంగోలు డెయిరీ మూత... పాడి రైతులకు ఆదాయ వనరుగా ఉన్న ఒంగోలు డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ కోసం నిలువునా ముంచేశారు. తన పార్టీకి చెందిన డెయిరీ పాలక మండలి చేత సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్పించి దగా చేశారు. డెయిరీ సొమ్ముంతా దోచుకునేటట్లు చేసి చివరకు రూ.100 కోట్ల వరకు అప్పులు చేయించి మరీ డెయిరీని మూతవేయించారు. పాడి రైతులను నట్టేట ముంచారు. వేలాది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. వెలిగొండ పనులు నత్త నడక.... ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా నిర్మింపతలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఐదేళ్లూ నత్తను తలపించాయి. తన సొంత బినామీ అయిన సీఎం రమేష్‌కు వెలిగొండ పనులను అడ్డగోలుగా నామినేషన్‌పై ఇచ్చి రూ.వందల కోట్లు కాజేశారు. పనుల్లో మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకటో టన్నెల్ పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. ఆర్అండ్ఆర్ పనులు అసలు చేపట్టనే లేదు. నాడు గాలికొదిలేసిన టీడీపీ నేతలు ఇదే ప్రాజెక్టుపై లేఖల డ్రామాలు మొదలుపెట్టి అసత్య ప్రచారానికి పూనుకున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపన జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం పోర్టు. టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారు. చివరకు ఎన్నికలకు ముందు డ్రామాకు తెరతీశారు. మేజరు పోర్టును మినీపోర్టుగా మార్చేశారు. హడావుడిగా శిలాఫలకం వేశారు. నన్ను తిరిగి గెలిపిస్తే రామాయపట్నం పోర్టు, పేపర్ మిల్లు ఏర్పాటు చేస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చి వెళ్లారు. మారిన గతి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. వెలిగొండకు భారీగా నిధులు కేటాయించింది. పనుల్లో వేగం పెంచింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నాలుగైదు రకాల ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది దాదాపు రూ.19,600 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు చేరాయి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ.. దోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం 50 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.475 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల దశ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జీజీహెచ్ అభివృద్ధికి రూ.170 కోట్లు జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు మంజూరు చేయించారు. జీజీహెచ్ వెనుక 7 ఎకరాలను అదనంగా కేటాయించారు. బెడ్లు పెంచటంతో పాటు అదనపు సౌకర్యాలు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి సీటీఎంఆర్తో పాటు జీజీహెచ్‌లో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. థర్డ్ వేవ్ కోవిడ్‌ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ వేలాది ప్రాణాలను కాపాడింది. జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ.. టీడీపీ హయాంలో ఒక్క విద్యా సంస్థ కూడా జిల్లాకు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీని మంజూరు చేసింది. పేర్నమిట్టలో 109 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను డీపీఆర్ కోసం రూ.50 లక్షలు రిలీజ్ చేసింది. మొత్తం యూనివర్శిటీ బడ్జెట్ కింద రూ.340 కోట్లు కేటాయించింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ► నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించటానికి (స్కిల్ డెవలప్మెంట్) ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో 5 ఎకరాలు కేటాయించింది. ► దోర్నాలలో రూ.3 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► గిద్దలూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల గ్యాప్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లతో పనులు చేస్తున్నారు. ► ఒంగోలు నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు నగరానికి వచ్చినప్పుడు రూ.400 కోట్లు కేటాయించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. దీంతో ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నట్లు బహిరంగ సభలోనే ప్రకటించారు. ► రూ.54 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► చీరాల మండలంలోని వాడరేవు, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో రెండు ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి స్థల సేకరణ పూర్తయింది. త్వరలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేసింది. రెండో టన్నెల్ 18.679 కిలో మీటర్లకుగాను ఇక కేవలం 4.920 కిలో మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతం చేసింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ఇప్పటికే 31,066 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. భూ సేకరణ కోసం రూ.418 కోట్లు వెచ్చించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం 11 గ్రామాల తరలింపునకు రూ.116 కోట్లు కేటాయించింది. పేద విద్యార్థుల కల సాకారమే ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీని జిల్లాకు తీసుకొచ్చి పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏటా 4 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చేరుతుంటారు. ఐదేళ్లపాటు అంటే 20 వేల మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం ఇడుపులపాయతో పాటు పేర్నమిట్ట అవతల ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనిర్మాణం కోసం కనిగిరి ప్రాంతంలో స్థల పరిశీలన జరుగుతోంది. -
కేంద్రానికి మద్దతు: టీడీపీ తీర్మానం
సాక్షి, అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాలవారీ మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూమ్ కాన్ఫరెన్స్‌లో గురువారం రెండో రోజు జరిగిన మహానాడులో ఈ మేరకు రాజకీయ తీర్మానం చేసింది. అలాగే రాష్ట్రంలో కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోవాలని తీర్మానించింది. జగన్ పాలనను ప్రశ్నించాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. చంద్రబాబు మరో యూటర్న్ మాట మీద నిలబడకుండా.. సమయానుకూలంగా మాటమారుస్తూ.. యూటర్న్లు తీసుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన చంద్రబాబు తాజాగా మరో యూటర్న్ తీసుకున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వాన్ని తిట్టి కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన ఇప్పుడు అవసరాల కోసం బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు సందర్భం కాకపోయినా, అవసరం లేకపోయినా బీజేపీకి మద్దతు ప్రకటించారు. తన అవినీతిపై విచారణ భయం పట్టుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పనిచేయాలని, ఇందుకోసం బీజేపీ, వామపక్ష పార్టీలను సైతం వాడుకోవాలని మహానాడులో నర్మగర్భంగా చెప్పడం గమనార్హం. మొక్కుబడి తీర్మానాలు: రెండు రోజులపాటు ఆన్లైన్లో టీడీపీ నిర్వహించిన మహానాడు మొక్కుబడిగా ముగిసింది. చంద్రబాబు రోజూ నిర్వహించే టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌ల మాదిరిగానే ఇది కూడా ముగిసినట్లు పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొక్కుబడి తీర్మానాలు, సుదీర్ఘ ఉపన్యాసాలతో శుక్రవారంతో ఈ తంతు ముగిసినట్లు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే మొక్కుబడి తంతును ఈసారి కూడా చంద్రబాబు రక్తి కట్టించారు. అదే కోవలో మిగిలినవి.. ఈసారి మొత్తం 15 తీర్మానాలు చేశారు. 8 ఏపీకి సంబంధించినవి కాగా తన గొప్పలు, ప్రభుత్వంపై బురద చల్లడం, అభూత కల్పనలకే చంద్రబాబు పరిమితమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
'టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ'
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మహానాడు ఒక పెద్ద మాయ అని, పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ధోరణిపై, మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మళ్ల విజయప్రసాద్‌తో కలిసి ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేకిగా ఉండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని తెలిపారు.(రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్) మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. ' 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పనైనా చెప్పుకోగలరా ? సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చెప్పట్టిన రోజు రాష్ట్రం ఊబిలో కూరుకుపోయి ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి కష్టాల్లో ఉన్న సమయంలోనూ ప్రజలను ఆదుకుంటున్నారు . వైఎస్ జగన్ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయం' అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అందిస్తున్ననవరత్నాలు టిడిపి కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా చేరాయి. అభివృద్ధి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ప్రతీది రాజకీయం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు టిడిపి ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్టపరిహారం అడిగితే సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీది శవరాజకీయం' అంటూ మండిపడ్డారు. (సెప్టెంబర్ వరకు జీ7 సమ్మిట్ వాయిదా) మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ గుర్తించారని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో జీవో 97 రద్దు ద్వారా సీఎం గిరిజనుల పక్షపాతిగా నిలిచారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారన్నారు.మహానాడు తీర్మానాలు చూస్తుంటే టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో చేయలేదు. ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినట్టు చెప్పే చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్లో టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జెసి దివాకర్‌కు చెందిన బస్సు ప్రమాదం లో 30 మంది చనిపోయినా... జుట్టు పట్టుకొని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినా న్యాయస్థానాలకు గుర్తుకు రాలేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. -
జూమ్ కాన్ఫరెన్స్‌తో మహానాడట!
సాక్షి, అమరావతి : టీడీపీ మహానాడుపై, చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. ‘జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట! రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా?’అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ఇక కరోనా లాక్డౌన్ సమయంలోనూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసిస్తూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘ఏడాది కాలంలో లాక్ డౌన్ వల్ల మూడు నెలలు రాబడి లేకపోయినా 90 శాతం హామీలు నెరవేర్చారు జగన్ గారు. వివిధ కార్యక్రమాల కింద 3.60 కోట్ల మందికి 40 వేల కోట్ల సాయం అందింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులన్నీ కొనసాగుతున్నాయి. పోలవరం వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి పూర్తవుతుంది’అంటూ ట్విటర్లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట! రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా? — Vijayasai Reddy V (@VSReddy_MP) May 28, 2020 చదవండి: 'ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు' ‘అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా’ -
ఆ హక్కు చంద్రబాబుకు లేదు: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలైందని గుర్తు చేశారు. చంద్రబాబు తనయుడే ఘోరంగా పరాజయం పాలయ్యారని, కేవలం 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే టీడీపీ గెల్చుకుందని తెలిపారు. ఓటమిపై మహానాడులో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని అంబటి సూచించారు. చంద్రబాబుకు అధికార కాంక్ష తప్ప రాష్ట్రంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రతిపక్ష హోదాను కూడా చంద్రబాబు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించి లబ్ధిపొందాలన్నదే చంద్రబాబు తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి బుధవారం మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వ సహాయక చర్యలపై.. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని అంబటి గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో టీడీపీ శ్రేణులకే సంక్షేమ పథకాలు అందాయని, ఆయన ధోరణి నచ్చకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా.. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంబటి వెల్లడించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని తెలిపారు. మే 30న రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు. వలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని అంబటి పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ నిత్యం సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. -
ఎన్నికల ఫలితాల షాక్ టీడీపీ మహానాడు రద్దు
-
‘మహానాడు’ రద్దు!
సాక్షి, అమరావతి: ఈనెల 27వతేదీ నుంచి నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేయాలని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం ఉండ వల్లిలోని తన నివాసంలో మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో ఆయన మహానాడు నిర్వహణపై మంతనాలు జరిపారు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న దృష్ట్యా మహానాడు నిర్వహించడం కష్టమని పలువు రు మంత్రులు పేర్కొనగా చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. మహానాడు బదులుగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫలితాలపై భయంతోనే? ఏటా మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మహానాడు నిర్వహించారు. ఈసారి ఫలితాల సాకుతో దీన్ని రద్దు చేసుకోవడానికి కారణం గెలుపుపై భరోసా లేకపోవడమేనని చెబుతున్నారు. సర్వేలు, అంచనాలన్నింటిలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని ప్రస్ఫుటమవుతుండడంతో టీడీపీ అధినేత సహా ముఖ్య నేతల్లో కలవరం నెలకొంది. అధికారం కోల్పోతున్నామనే ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోసేందుకు 120 సీట్లు వస్తాయంటూ గంభీరంగా చెబుతున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు వారిని కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును సైతం రద్దు చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపుపై ధీమా ఉంటే మహానాడు నిర్వహించడానికి ఇబ్బంది ఉండేది కాదని కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు. దీన్ని బయటకు చెప్పుకోలేక ఫలితాల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పాల్సి ఉంది కాబట్టి మహానాడులో పాల్గొనలేరని, అందుకే రద్దు చేసినట్లు పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం. -
మహానాడులో భోజనాలు తప్ప ఇంకేమీ లేదు!
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న తహశీల్దార్ల కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నట్టు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. టీడీపీ మహానాడులో భోజనాలు బాగా జరిగాయి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనను ప్రధానమంత్రి అని పొగిడించుకున్నారని, అది పొగడ్తల మహానాడు అని విమర్శించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ డబ్బున్న వాళ్ళ కోసమే కానీ, పేదల కోసం కాదని, బాబు పాలనలో పేదల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. చంద్రబాబు 20 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్నారు కానీ ఎక్కడా ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. 13 జిల్లాల్లో ఒక్క ఎకర కూడా భూమి పంపిణీ సీఎం చంద్రబాబు చెయ్యలేదన్నారు. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి 18న నిరసన చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి రూపాయల భృతి నిరుద్యోగులకు ఏం సరిపోతుందని ఆయన అన్నారు. నెలకు రూ. 3600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి పాస్ అయినవారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో 10 లక్షల మంది వరకు అంటూ కటాఫ్ పెట్టడం సమంజసం కాదన్నారు.