ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ మహానాడులో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ మహానాడులో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసేందుకు కేంద్రానికి డెడ్ లైన్ పెట్టాలని ఆయన సోమవారమిక్కడ సూచించారు.
ప్రత్యేక హోదాపై టీడీపీ ఏం చేయదలచుకుందో మహానాడు తీర్మానంలో స్పష్టం చేయాలని బొత్స అన్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ అన్నింటిలోనూ విఫలం అయిందని ఆయన విమర్శించారు. ప్రతి పనికి ఇంత రేటంటూ టీడీపీ దోపిడీకి తెగబడతోందని బొత్స మండిపడ్డారు.