మా అబ్బాయి వద్దన్నాడు: చంద్రబాబు | Son Lokesh advised not to take over as PM in 1990s: Chandrababu | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి వద్దన్నాడు: చంద్రబాబు

Published Sun, May 29 2016 12:33 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

మా అబ్బాయి వద్దన్నాడు: చంద్రబాబు - Sakshi

మా అబ్బాయి వద్దన్నాడు: చంద్రబాబు

తన కుమారుడు నారా లోకేశ్ సలహాతోనే ప్రధాని పదవిని వదులుకున్నానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

తిరుపతి: తన కుమారుడు నారా లోకేశ్ సలహాతోనే ప్రధాని పదవిని వదులుకున్నానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 1996లో జ్యోతిబసు, తాము భాగస్వాములుగా ఉన్న థర్డ్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టాలని సంకీర్ణ నాయకులు తనను కోరారని చంద్రబాబు చెప్పారు. 'అది తాత్కాలిక పదవి' అని తన కుమారుడి చెప్పడంతో పీఎం పోస్టు వదులుకున్నానని వెల్లడించారు.

టీడీపీ మహానాడు సందర్భంగా శనివారం రాత్రి జర్నలిస్టులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 'యునైటెట్ ఫ్రంట్ ఏర్పాటుకు మేమెంతో కృషి చేశాం. ప్రధాని పదవికి చేపట్టమని కూటమిలోని చాలా మంది నాయకులు నన్ను కోరారు. కానీ నేను ఒప్పుకోలేదు. జ్యోతిబసు, మరికొంత మంది మరోసారి అడిగారు. అప్పటికి లోకేశ్ తొమ్మిదో, పదో చదువుతున్నాడు. ప్రధాని పదవి చేపట్టవద్దని, అది తాత్కాలిక పదవి అని నాకు సలహాయిచ్చాడు. దాంతో నేను వెనక్కు తగ్గాన'ని చంద్రబాబు వెల్లడించారు.

మహానాడులో లోకేశ్ ను ప్రమోట్ చేసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు వ్యాఖ్యలు ఊతం ఇస్తున్నాయి. లోకేశ్ గురించి మహానాడులో చివరిరోజు ఏదైనా ప్రకటన చేయబోతున్నారా అని ప్రశ్నించగా.. ఆదివారం ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పను. కానీ పార్టీలో ప్రతిభను పోత్సాహిస్తాం' అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement