
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న తహశీల్దార్ల కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నట్టు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. టీడీపీ మహానాడులో భోజనాలు బాగా జరిగాయి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనను ప్రధానమంత్రి అని పొగిడించుకున్నారని, అది పొగడ్తల మహానాడు అని విమర్శించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ డబ్బున్న వాళ్ళ కోసమే కానీ, పేదల కోసం కాదని, బాబు పాలనలో పేదల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.
చంద్రబాబు 20 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్నారు కానీ ఎక్కడా ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. 13 జిల్లాల్లో ఒక్క ఎకర కూడా భూమి పంపిణీ సీఎం చంద్రబాబు చెయ్యలేదన్నారు. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి 18న నిరసన చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి రూపాయల భృతి నిరుద్యోగులకు ఏం సరిపోతుందని ఆయన అన్నారు. నెలకు రూ. 3600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి పాస్ అయినవారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో 10 లక్షల మంది వరకు అంటూ కటాఫ్ పెట్టడం సమంజసం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment