
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదివరకే పలు కార్యక్రమాలు రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మద్దతు కోరింది. ఆదివారం మా అధ్యక్షుడు శివాజీ రాజా సహా కార్యవర్గాన్ని సీసీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నెలకొన్న పరిస్థితులను మా బృందానికి వివరించాం. ప్రత్యేక హోదా ఉద్యమానికి అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారని రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందని, మలిదశ ఉద్యమం ఉప్పెనలా ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment