హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సీపీఐ బస్సు యాత్ర నిర్వహిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే 11వ తేదీన బంద్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం హైదరాబాద్లో రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల ప్యాకేజీ అన్న బీజేపీ... ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రి పదవులకోసమే చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పోరాటాన్ని ఆహ్వానిస్తున్నామని రామకృష్ణ తెలిపారు.