k ramakrishna
-
పవన్ కి CPI రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్
-
రాష్ట్రంపై ఎన్నాళ్లీ వివక్ష?
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్ష పార్టీలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిపాయి. రాస్తారోకోలు, ప్రదర్శనలు, సభలు జరిపి కేంద్రం తీరుపై భగ్గుమన్నారు. విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్ని రకాలుగా తీరని ద్రోహం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, గత బడ్జెట్లో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ వంటి కీలక అంశాలను పూర్తిగా విస్మరించారన్నారు. పోలవరానికి నిధులు కేటాయించకుండా, కనీసం రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంపై ఎందుకింత కక్ష? ఎన్నాళ్లీ వివక్ష? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కలిసి రావాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర నిర్లక్ష్య, నిరంకుశ వైఖరిని ఎండగడుతూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని నేతలు ప్రకటించా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా వీధుల్లోకి రావాలని, అవసరమైతే బంద్ చేయాలని కోరారు. వామపక్షనేతలు వెంక య్య, శంకర్, విల్సన్, వనజ, జి.కోటేశ్వరరావు, బాబూరావు, కృష్ణ, కాశీనాథ్, అమరనాథ్, ఖాదర్ బాషా మాట్లాడారు. విశాఖపట్నంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిరసన తెలిపారు. శ్రీకాకుళం, విజయనగ రం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
దీక్షలు కాదు.. ఏపీ హామీలపై మోదీని ప్రశ్నించండి
ఒంగోలు: పార్లమెంట్ సాక్షిగా ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని ఎందుకు అడగట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని పంజాబ్‌లో ఫ్లైఓవర్‌పై నిలిపివేశారని.. ఏలూరులో సోము వీర్రాజు దీక్షకు దిగడం హాస్యాస్పదమన్నారు. 20 నిమిషాల పాటు మోదీ రోడ్డుపై ఆగితే ఇంత యాగీ చేస్తున్న బీజేపీ నాయకులు.. ప్రజా సమస్యలపై ఎందుకు వెంటనే స్పందించట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులపై కనీసం ఒక్క వినతిపత్రమైనా ప్రధానికి ఇచ్చారా అని నిలదీశారు. రాష్ట్రంలో పొత్తులపై తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని తెలిపారు. కాగా, ఉద్యోగులను పీఆర్సీ నిరుత్సాహపరిచిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 11న విజయవాడలో నిరుద్యోగులు, విద్యార్థులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు పీజే చంద్రశేఖర్, ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. -
న్యాయ రాజధానితోనే అభివృద్ధి
కర్నూలు (అర్బన్): న్యాయ రాజధానిని సాధించుకుంటేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రక త్యాగాలు చేస్తూ వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ఇకపై త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక మెగాసిరి ఫంక్షన్ హాల్లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘అధికార వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఏర్పాటు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగలడం దారుణమని, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తక్కువ ధరకు సేకరించిన భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అక్కడి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ముసుగులో చేపట్టిన పాదయాత్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, ఎన్నో త్యాగాలు చేసిన కర్నూలు వాసుల చిరకాల స్వప్నమైన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కలిసి రాని రాజకీయ నేతలంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం చూపిస్తాం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ..1953 నుంచి చారిత్రక త్యాగాలు చేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడి టీడీపీ నేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇక నుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఆ యాత్రలో రియల్ ఎస్టేట్వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. స్వార్థంతో పేద, మధ్య తరగతి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూములతో రూ.కోట్లు సంపాదించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ నిజమైన రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయ రాజధాని సాధనకు తొలి అడుగు కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇక పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 95 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవహిస్తున్నా తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటైతే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధన సమితి అధ్యక్షుడు బి.క్రిష్టఫర్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సీమ రైతులను ఆదుకోలేని టీడీపీ నేతలు అమరావతి రైతుల నకిలీ ఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. న్యాయ రాజధానికి సీపీఐ కట్టుబడి ఉంది సీపీఐ నేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టి బూటకమని, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులేనని అన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కర్నూలు నుంచి హైకోర్టు వరకు పాదయాత్రలు చేపడదామన్నారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులంతా వారం రోజులపాటు మాస్ క్యాజువల్ లీవ్ పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐ.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేసే ప్రక్రియలో ఎంతటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. సదస్సులో డిప్యూటీ మేయర్ రేణుక, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జాతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు వి.సిద్ధారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, కో–కన్వీనర్ ఆర్.చంద్రప్ప, సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, నాగలక్ష్మీదేవి, విశ్రాంత తహసీల్దార్ రోషన్ ఆలీ తదితరులు మాట్లాడారు. -
రూ.60 పెంచి.. రూ.5 తగ్గిస్తారా?
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, పన్నుల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరల వ్యత్యాసాన్ని రామకృష్ణ వివరించారు. రూ.60 పెంచి రూ.5 తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఈ నెల 14న తిరుపతి వస్తున్న హోం మంత్రి అమిత్ షాకు పెట్రోల్ ధరలపై నిరసన తెలుపుతామన్నారు. ఏపీలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పని తీరు సరిగా లేదని ఆరోపించారు. రష్యా విప్లవం విజయవంతమైన రోజును పురస్కరించుకుని లెనిన్ చిత్రపటానికి పార్టీ నాయకులు రామకృష్ణ, జల్లి విల్సన్, రావుల వెంకయ్య, వై.చెంచయ్య, నార్లవెంకటేశ్వరరావు పుష్పాంజలి ఘటించారు. -
రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు
నెల్లూరు (దర్గామిట్ట): రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. శనివారం ఉదయం నెల్లూరు సంతపేటలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, నైతికత లేకుండా బూతులు తిట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన కోరాలి అనే ఆలోచనలో ఉన్నారని.. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అనంతరం సీపీఐ నెల్లూరు జిల్లా సమితి సభ్యులు, శాఖ కార్యదర్శుల వర్క్‌షాపు జరిగింది. -
చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం
ఘంటసాల(అవనిగడ్డ)/సాక్షి, అమరావతి: చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం పెరిగిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఘంటసాల ఆదిశేషు సంతాపసభ కృష్ణా జిల్లా ఘంటసాల గోటకం కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఘంటసాల ఆదిశేషు నిబద్ధతను గౌరవిస్తూ ప్రత్యేక సంచికను విడుదల చేయడం గర్వకారణమని రామకృష్ణ తెలిపారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జెల్లి విల్సన్ మాట్లాడుతూ నిబద్ధత గల నేత ఆదిశేషు అన్నారు. వామపక్షాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది జీతాలనూ ప్రభుత్వమే చెల్లించాలి పంచాయతీ ఉద్యోగులకు మాదిరే మున్సిపల్, నగరపాలకసంస్థల సిబ్బంది వేతనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. -
'నీతో నీతులు చెప్పించుకొనే స్థితిలో బీజేపీ లేదు'
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణతో నీతులు చెప్పించుకొనే స్థితిలో బీజేపీ లేదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ రామకృష్ణ ఆయన పార్టీ వ్యవహారాలు ఆయన చూసుకుంటే మంచిది. చంద్రబాబు రాసిచ్చిన కాపీనే పేరు మార్చి సీపీఐ, కాంగ్రెస్ నేతలు చదువుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు చేయాలో బీజేపీకి తెలుసు. బీజేపీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాఖ ఇప్పటికే స్పందించింది. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎలాంటి రాజకీయాలు చేయాలో టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ మాకు చెప్పనక్కరలేదు' అంటూ సీపీఐ రామకృష్ణపై ధ్వజమెత్తారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) -
సీపీఐ కార్యదర్శి రామకృష్ణకు ఝలక్
కర్నూలు(సెంట్రల్): అమరావతి విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఏకపక్ష నిర్ణయాలపై ఆ పార్టీలో నిరసన స్వరాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుతో కలిసి బస్సు యాత్రలో పాల్గొనడంపై పార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర కార్యవర్గంలో చర్చించకుండా అమరావతి రాజధానిగా ఉండాలని ప్రకటించడాన్ని సీపీఐ సహ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ ఇప్పటికే తప్పుపట్టారు. ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన చంద్రబాబుతో రామకృష్ణ అంటకాగడంపై విమర్శలు చేశారు. సోమవారం పత్తికొండలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలోనూ రామకృష్ణ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి పార్టీ కట్టుబడాలని తీర్మానం చేశారు. అమరావతి రాజధానిగా ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఎవరిని అడిగి బాబు చుట్టూ తిరుగుతున్నారని పలువురు నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం. అన్ని జిల్లాల అభివృద్ధే పార్టీ విధానమని, దానికి కట్టుబడి ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. -
‘కేంద్రం మతాల మధ్య చిచ్చు పెడుతోంది’
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత విభజన ద్వారా ఓట్లు పొందేందుకు కేంద్రం ఆరాటపడుతోందని విమర్శించారు. గురువారం భారత కమ్యూనిస్టు నేత నీలం రాజశేఖర్ రెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమాల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లు ఆమోదంతో మైనార్టీలు అభద్రతా భావంలోకి వెళ్లిపోయారన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మతాల మధ్య కేంద్రం చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశం ఆర్థిక మాంద్యంతో అల్లాడుతుంటే పార్లమెంట్లో కనీస చర్చ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం విషయంలో బీజేపీ అనుకరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు నిరసనలు చేపడుతామని రామకృష్ణ స్పష్టం చేశారు. -
ఆ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం
సాక్షి, విశాఖపట్నం : కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం జరిగిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ది జరిగిన తర్వాత ఆంధ్రాబ్యాంక్ విలీనం చేయడం దారుణమన్నారు. మహారాష్ట్ర బ్యాంకులను ఎందుకు విలీనం చేయరని ప్రశ్నించారు. ఆంధ్రాబ్యాంకు విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 28న విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాగా, గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బ్యాంక్‌ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పది బ్యాంక్‌లు విలీనమై నాలుగు బ్యాంకులుగా అవతరించనున్నాయి. తొంభై ఆరేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనం కానుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్‌లు యధాతధంగా కొనసాగుతాయి. ఆంధ్రాబ్యాంక్ విలీనంపై అన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. -
రైలురోకో కేసులో కె.రామకృష్ణకు ఊరట
సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : రైలురోకో కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జరిమానా విధించి, కేసు కొట్టేశారు. ఈ మేరకు గుంతకల్లు రైల్వేకోర్టు స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ టి.వెంకటేశ్వర్లు సంచలన తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి 2008 జూలై 7న అనంతపురం రైల్వేస్టేషన్లో రైలురోకో చేశారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే యాక్టు ప్రకారం అప్పట్లోనే కేసు నమోదు చేశారు. రైలును అడ్డుకున్నందుకు 174/ఏ కింద, ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు 147 కింద కేసులు నమోదు చేశారు. బుధవారం కోర్టుకు హాజరైన సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణకు రైల్వే కోర్టు జడ్జి వెంకటేశ్వర్లు రూ.700 ఫైన్ విధించి కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారని న్యాయవాదులు చెన్నకేశవులు, యూనస్ తెలిపారు. -
బాబుకు అనుకూలమన్న భావనే మా కొంపముంచింది!
సాక్షి, అమరావతి: సీపీఐ, సీపీఎం, జనసేన, బీఎస్పీలు కలిసికట్టుగా పొత్తు పెట్టుకున్నా తాము సంఘటితం కాలేకపోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనికి తోడు టీడీపీ విధానాలను విమర్శించడంలో తాము వెనకబడడం వల్ల చంద్రబాబుకు తమ కూటమి అనుకూలమన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాము సాధించలేకపోయామని విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా గంపగుత్తగా వైఎస్సార్సీపీకి పడిందన్నారు. పార్టీ రాష్ట్ర నేతలు రావుల వెంకయ్య, హరినాథరెడ్డి, జల్లి విల్సన్‌తో కలిసి ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీడీపీని మట్టికరిపించడంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం సాధించారన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీపీఐ ఓటమికి దారితీసిన పరిస్థితులను సమీక్షించినట్టు తెలిపారు. పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత దేశంలో పరిస్థితి మారిపోయిందని, ఈ రెండు సంఘటనలను బీజేపీ బాగా ఉపయోగించుకోగలిగిందని, జాతీయవాదం పేరిట జనాన్ని తమ వైపు తిప్పుకోవడంలో మోదీ, అమిత్ షా విజయం సాధించారని చెప్పారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని తమ పార్టీ అభిప్రాయపడిందని, ఇందులో భాగంగా త్వరలో విజయవాడలో అన్ని కమ్యూనిస్టు పార్టీల నేతలతో సదస్సు నిర్వహించనున్నట్టు వివరించారు. కాగా, కాబోయే సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టు రామకృష్ణ తెలిపారు. సీపీఎం నేత మధుకు ఆహ్వానం వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును ఆహ్వానించారు. జగనే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలిపారు. -
వామపక్షాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి
సాక్షి, విజయవాడ : భారతదేశంలో వామ పక్షాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయని, ఎర్ర జెండా పార్టీల పునరేకీకరణ జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. పునరేకీకరణ కోసం జూన్ నెలలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీపీఐ పార్టీ తరపున అభినందనలు తెలియజేశారు. గడిచిన ఐదేళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. పుల్వామా ఘటనను సూడో నేషనలిజంగా చేశారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించే కార్యవర్గ సమావేశాలలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు, జనసేన, బీఎస్పీ నాలుగు పార్టీలు కలిసినా ఎన్నికల్లో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి లొంగిపోయిందని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్రంలో అధికారం చేపడతామని సవాలు చేసే ధైర్యం లేదన్నారు. -
‘చంద్రబాబు బరితెగించారు.. అందుకే ఇలా’
సాక్షి, విజయవాడ : ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదాన్ని ‘కంపెనీలకే భూమి’ అన్న చందంగా సీఎం చంద్రబాబు మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని బరితెగించి.. పారదర్శకత లేకుండా కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రముఖ రచయిత తెలకపల్లి రవి రచించిన ‘అమరావతి అడుగులెటు..?’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి పి. మధు, సీపీఎం వర్గసభ్యుడు వై. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఎంబీ భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..2013 భూసేకరణ చట్టం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేయడం ఇదే ప్రథమని అన్నారు. అమరావతిలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిందని దుయ్యబట్టారు. ఇష్టారీతిన కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడం అనేక వివాదాలకు కారణమవుతోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని.. అధికారంలోకి వస్తే తమకు కావాల్సిన వారికి భూములను కట్టబెట్టవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. అన్నీపరిశీలించిన తర్వాతే.. ప్రజలు ఆశించిన పాలనను చంద్రబాబు అందించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ప్రభుత్వ తీరుతో కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదని.. రైతుల నుంచి పూలింగ్ ద్వారా భూమిని తీసుకోవడం వివాదంగా మారిందని పేర్కొన్నారు. రైతుల భూమితో ప్రభుత్వం.. సింగపూర్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రైతు కూలీలు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావులు, రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ప్రపంచ బ్యాంకు నివేదికలను కూడా పరిశీలించి తెలకపల్లి రవి అమరావతి అడుగులెటు..? పుస్తకం రచించారని పేర్కొన్నారు. అమరావతి ప్రణాళిక, ప్రచారం, ప్రజాందోళన తదితర పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పుస్తకాన్ని వెలువరించారని తెలిపారు. -
రాజాలకు పెరుగుతున్న మద్దతు
సాక్షి, వెంకటగిరి: అధికార టీడీపీలో వివక్షకు గురై ధిక్కార స్వరం వినిపించిన రాజా కుటుంబీకులకు పట్టణంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదివారం స్థానిక రాజా ప్యాలెస్‌లో రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార యాచేంద్రను పట్టణంలోని పలువురు కలిసి సంఘీభావం తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ పటిష్టతకు కృషి చేసిన రాజా కుటుంబీకులను పార్టీ అధిష్టానంతోపాటు స్థానిక ఎమ్మెల్యే కె.రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయడంతో ఆ పార్టీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని, రాజకీయంగా రాజాలు తీసుకునే నిర్ణయానికి తాము మద్దతుగా ఉంటామని పలువురు సంఘీభావం తెలియజేశారు. -
చంద్రబాబుకు వామపక్షాల ఝలక్
సాక్షి, అమరావతి: రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని సీపీఎం, సీపీఐ నేతలు నిర్ణయించుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేసినప్పుడు తమ పార్టీల కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిందని గుర్తు చేశారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం ఆవేళ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా హోదాయే కావాలని పోరాటానికి దిగి ఉంటే అంతా మద్దతు పలికేవారమంటున్నాయి. ప్రధాని రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును తిట్టిపోతే రేపు బాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిపై దుమ్మెత్తిపోస్తారు... వీటితో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు కొందరు తమను ఆహ్వానించిన మాట నిజమేనని, తాము రాలేమని స్పష్టం చేసినట్టు తెలిపారు. -
మోసం చేయడానికే.. ‘అన్నదాత సుఖీభవ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం సీఎం చంద్రబాబు నాయుడు స్తోత్రంలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇది మధ్యంతర బడ్జెటో లేక పూర్తిస్థాయి బడ్జెటో టీడీపీ నాయకులకే అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ రాబోయే ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడారు. ఇది కేవలం ఎన్నికల బడ్జెటే అంటూ తేల్చిచెప్పారు. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప నిజంగా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గాలు లేవన్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, బాబు మాయ మాటలను నమ్మరని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయని చంద్రబాబు.. రైతులను మరోసారి మోసగించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు సరిగా లేవని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదించిన రైతు రుణమాపీలో ఇంకా రూ.8,200 కోట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నాటికి రైతుల అప్పులు రూ.1.37లక్షల కోట్లకు చేరాయని ఆయన అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఇళ్ల మంజూరు కేవలం రూ.4,099 కోట్ల రూపాయల కేటాయింపులతో ఎలా సాధ్యమని రామకృష్ణ ప్రశ్నించారు. -
చంద్రబాబూ.. ఇలాగేనా వ్యవహరించేది?
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల కనుసన్నల్లో కోడి పందాలు జరుపుతూ.. వేల కోట్లు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడి పందాలు, వేలకోట్ల బెట్టింగ్‌లు జరుగుతుంటే హోంమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలిగేలా టీడీపీ నేతల పాలన ఉందని విమర్శించారు. మాజీ సీఎం కూతురు, ప్రతిపక్ష నేత చెల్లెలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఆమె రాజకీయం చేస్తుందని చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి షర్మిల ఫిర్యాదు చేశారంటే ఆమె ఎంత బాధపడిఉంటుందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. షర్మిల వ్యవహారంలో ఇలానేనా వ్యవహరించేదని విమర్శించారు. -
సాయంత్రంలోపు ప్రభుత్వం స్పందించకపోతే..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. మాటలగారడీతో చంద్రబాబు నాలుగేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను అర్థరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. వాళ్లేమైనా టెర్రరిస్టులా.. ఆ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవరసరం ఏముందని ప్రశ్నించారు. కరెంట్ తీసేసి, దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడమేంటని నిలదీశారు. ఈ రోజు సాయంత్రంలోపు అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నా.. బకాయిలు ఎందుకు చెల్లించకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సమస్యను నాలుగేళ్లుగా ప్రభుత్వం నాన్చుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిచాలని.. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో అగ్రిగోల్డ్ భాదితులు తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు. -
జగన్‌ను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు?
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సీపీఐ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రతిపక్ష నేతపై ఇలాంటి దాడి జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. జగన్‌పై దాడి జరిగిన ఐదు గంటల తర్వాత ముఖ్యమంత్రి మంత్రి స్పందించటం సరికాదన్నారు. మీడియా సమావేశంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎంతో, ప్రతిపక్ష నేత కూడా అంతేనని చెప్పారు. సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం ఫోన్లో పరామర్శించే తీరిక చంద్రబాబుకు లేదా అని అడిగారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని వైఎస్సార్ సీపీ అంటోంది. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలి. వైఎస్ జగన్‌పై దాడి చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలి. వైఎస్ జగన్ హత్యాయత్నం వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాలి. సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ఎందుకు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నార’ని అన్నారు. -
‘నాలుగేళ్లలో 2.49 లక్షల కోట్ల రూపాయల అప్పు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లలో 2 లక్షల 49 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సెప్టెంబర్ 15న విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్ననూతన ప్రత్యామ్నాయ మహా గర్జన సభకు సంబంధించిన ప్రచార గీతమాలికను సోమవారం ఆయన అవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యవర్గసభ్యులు శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ మహా గర్జనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలపునిచ్చారు. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం అనేక సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, అక్కడి కరువు పరిస్థితులపై మంగళవారం వైఎస్సార్ జిల్లాలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడువి కేవలం ప్రచార ఆర్భాటలు మాత్రమేనని.. వాటి ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధానిని నిర్మించకుండా ముంబై వెళ్లి బాండ్లను విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాజధానిలో సెంట్ భూమి కొనుక్కొని, ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. మార్చురీలో పోస్టుమార్టంకు కూడా డబ్బులు వసూలు చేసేంతలా అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విలయం తాండవం చేస్తుంటే.. చంద్రబాబు డ్యాష్ బోర్డులో అది కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. అది జ్ఞాన భేరి ఎలా అవుతుంది.. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధర్మ పాలన చేస్తూ ధర్మ పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వేలాది ఎకరాల భూములు లాక్కొని ఒక్క పరిశ్రమైనా నిర్మించారా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసేది నిజమైన పోరాటం కాదని అన్నారు. ప్రశ్నించే హక్కు లేకుండా విద్యార్థులను అరెస్ట్ చేస్తే అది జ్ఞాన భేరి ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ముంబై వెళ్లి బాండ్ల లిస్టింగ్పైన చూపే శ్రద్ద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీద పెట్టాలని సూచించారు. -
మోదీ ఎడమచెయ్యి ఇస్తేనే.. ఎగిరి గంతులు!!
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన తుస్సుమన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మోదీ ఎడమ చెయ్యి ఇస్తేనే చంద్రబాబు ఎగిరి గంతులేశారని, అదే పొరపాటున కుడి చెయ్యి ఇస్తే ఆయన కింద నిల్చేవాడే కాదని ఎద్దేవా చేశారు. గుంటూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని,చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు మోసపూరిత మాటలు, మోసపూరిత పర్యటనలు మానుకోవాలని హితవు పలికారు. -
మహానాడులో భోజనాలు తప్ప ఇంకేమీ లేదు!
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న తహశీల్దార్ల కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నట్టు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. టీడీపీ మహానాడులో భోజనాలు బాగా జరిగాయి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనను ప్రధానమంత్రి అని పొగిడించుకున్నారని, అది పొగడ్తల మహానాడు అని విమర్శించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ డబ్బున్న వాళ్ళ కోసమే కానీ, పేదల కోసం కాదని, బాబు పాలనలో పేదల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. చంద్రబాబు 20 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్నారు కానీ ఎక్కడా ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. 13 జిల్లాల్లో ఒక్క ఎకర కూడా భూమి పంపిణీ సీఎం చంద్రబాబు చెయ్యలేదన్నారు. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి 18న నిరసన చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి రూపాయల భృతి నిరుద్యోగులకు ఏం సరిపోతుందని ఆయన అన్నారు. నెలకు రూ. 3600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి పాస్ అయినవారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో 10 లక్షల మంది వరకు అంటూ కటాఫ్ పెట్టడం సమంజసం కాదన్నారు. -
ప్రత్యేక హోదాకు ‘మా’ మద్దతు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదివరకే పలు కార్యక్రమాలు రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మద్దతు కోరింది. ఆదివారం మా అధ్యక్షుడు శివాజీ రాజా సహా కార్యవర్గాన్ని సీసీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నెలకొన్న పరిస్థితులను మా బృందానికి వివరించాం. ప్రత్యేక హోదా ఉద్యమానికి అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారని రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందని, మలిదశ ఉద్యమం ఉప్పెనలా ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది.