హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మౌనం వహించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం హైదరాబాద్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మౌనం వహించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం హైదరాబాద్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రోహిత్ మృతిపై అందరూ స్పందిస్తున్నారు... కానీ చంద్రబాబు, కేసీఆర్ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న భయంతోనే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడటం లేదని కె.రామకృష్ణ విమర్శించారు.