
'పవన్ కల్యాణ్ మాతో కలిసి పోరాడాలి'
కాకినాడ: ఓటుకు కోట్లు కుంభకోణంపై ఆలస్యంగా స్పందించిన జనసేన నేత పవన్ కల్యాణ్ అన్ని విషయాలు మాట్లాడలేదని సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవమానానికి గురయ్యారనే విషయంపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతిపై పవన్ మాట్లాడారని గుర్తుచేశారు. అయితే ఆయన మద్దతిచ్చిన వాళ్లు ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయారని అన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదాపై పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి పోరాడాలని రామకృష్ణ సూచించారు.