cash for vote
-
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
కోల్‌కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్‌లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్‌ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
8 నుంచి ‘ఓటుకు కోట్లు’ తుది విచారణ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు తుది విచారణ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ 2015లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఆధారాలను ఏసీబీ సోమవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఇందులో రికార్డయిన వీడియోతోపాటు నిందితులకు సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్ తో కూడిన 1 టీబీ హార్డ్‌డిస్క్‌లు రెండు, ఒక డీవీడీఆర్ ఉన్నాయి. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్ను ఈనెల 8న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని -
ఓటుకు కోట్లు కేసులో నిందితులపై అభియోగాల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లపై ఏసీబీ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద నమోదు రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగం నమోదైంది. అయితే తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఈనెల 19న సాక్షుల విచారణ, షెడ్యూలును ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. చదవండి : (బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే) (ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌రెడ్డికి వార్నింగ్) -
బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పాత్ర మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఇటీవల ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం వ్యవహారా నికి మాస్టర్‌మైండ్ చంద్రబాబేనని కుండబద్దలుకొట్టాడు. ఈ కుట్ర ఎప్పుడు, ఎలా జరిగింది? తెలంగాణ ప్రభు త్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు మొదలు పెట్టిన ఎమ్మెల్యేల కొను గోలు విషయంలో ఎవరి పాత్ర ఏమిటన్నది పూసగుచ్చినట్లు వివరించాడు. కుట్రకు తెరతీసింది చంద్రబాబు అని, అమలు చేసింది రేవంత్‌రెడ్డి అని, ఇందుకోసం తనకు రూ.50 లక్షలు ఎరవేసి వాడుకున్నారని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మత్తయ్య ఏమి చెప్పాడంటే.. ‘టీడీపీ తెలుగు యువత నాయకుడు జిమ్మీబాబు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. 2015 మే నెలలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పాల్గొనే ఓ కార్యక్రమానికి జిమ్మీబాబును ఆహ్వానిద్దామని బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లా. అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంత నాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ నాకు చెప్పాడు. ఇదే విషయమై చంద్రబాబు, రేవంత్‌లతో చర్చించేందుకు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రావాలని సూచించాడు. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం) జిమ్మీ సూచన మేరకు మర్నాడు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లా. అక్కడ జిమ్మీబాబు మహానాడు వేదిక వెనుకాల ఉన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. తొలుత నేను భయపడ్డా. తప్పని వారించా. కానీ రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, పైగా వారు నాకు గుడ్‌విల్ కింద రూ. 50 లక్షలు లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ. 3 కోట్లు చెల్లిస్తామన్నారు. ముందుగా రూ. 50 లక్షలు అడ్వాన్సుగా మిగిలినది తరువాత అందజేస్తామన్నారు’ అని మత్తయ్య మత్తయ్య ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ గదిలోనే.. ‘‘అప్పుడు.. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంతనాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ చెప్పాడు. ఇదే విషయమై వారితో చర్చించేందుకు నన్ను మహానాడు వేదిక వెనుక ఉన్న గది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, నాకు గుడ్‌విల్ కింద డబ్బులిచ్చి లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా’’ తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు... ‘నేను మర్నాడు స్టీఫెన్స్న్ ఇంటికి వెళ్లి బోయిగూడలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించా. కార్యక్రమం అనంతరం డీల్ గురించి చెబితే తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు. రేవంత్‌రెడ్డితో మాట్లాడించాలన్నాడు. లాలాగూడకు చెందిన మాల్కం టేలర్, సీతాఫల్‌మండికి చెందిన ఆంథొనీ ద్వారా స్టీఫెన్సన్ను ఒప్పించే ప్రయత్నం చేశా. ఆయన ఒప్పుకోగానే ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి, జిమ్మీబాబులకు టీడీపీ క్రిస్టియన్ సెల్ ఇన్చార్జి హ్యారీ సెబాస్టియన్ ద్వారా తెలియజేశా. తరువాత మరోసారి అతనికి ఫోన్ చేసినప్పుడు రేవంత్, చంద్రబాబులకు సమాచారం ఇచ్చానని, వారు అదే పనిలో ఉన్నారన్నాడు. పని పూర్తికాగానే నీకివ్వాల్సింది ఇచ్చేస్తారని సెబాస్టియన్ సమాధానమిచ్చాడు. మర్నాడు సెబాస్టియన్‌కు మళ్లీ ఫోన్ చేయగా రేవంత్‌రెడ్డి రెండుసార్లు స్టీఫెన్‌సన్‌ని ఆయన నివాసంలో కలిసినట్లు చెప్పాడు. అంతేకాకుండా చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో కూడా మాట్లాడాడని చెప్పాడు. దీంతో వెంటనే నేను జిమ్మీబాబుకు కాల్ చేసి నా వాటా ఏమైంది? అని అడిగా. ప్రస్తుతం చంద్రబాబు వేం నరేందర్‌రెడ్డి ద్వారా స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు రూ. 50 లక్షలు సిద్ధం చేస్తున్నారని, అది అవగానే నాకు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మర్నాడు రేవంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిందన్న విషయం టీవీల ద్వారా తెలుసుకున్నా. నన్ను ఏ–4 నిందితుడిగా చూపడంతో రసహ్యంగా జిమ్మీబాబు సాయంతో వెంటనే టీడీపీ ఆఫీసులోకి వెళ్లా. అక్కడ నారా లోకేశ్‌ను కలిశా. నాతో మాట్లాడిన లోకేశ్.. ఏమీ భయపడొద్దన్నాడు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను మేనేజ్ చేస్తానని అభయమిచ్చాడు. వెంటనే విజయవాడ వెళ్లు, అక్కడ టీడీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చాడు’ అని వాంగ్మూలంలో జెరూసలేం మత్తయ్య పేర్కొన్నాడు. చంద్రబాబును కలిసిన మాట వాస్తవమే..! ఈ కేసుకు సంబంధించి జిమ్మీబాబు, మాల్కం టేలర్, ఆంథొనీ, సెబాస్టియన్లు తనకు పూర్వ మిత్రులని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పలు పనులపై కలిశానని మత్తయ్య చెప్పుకొచ్చాడు. అలాగే పలు అధికారిక కార్యక్రమాలతోపాటు ఓటుకు నోటు కుట్ర విషయంలోనూ 2015 మే నెలాఖరులో చంద్రబాబును తాను కలిసిన మాట నిజమేనని అంగీకరించాడు. ఈ కేసు విషయంలో మొదటి నుంచి చంద్రబాబుపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్‌రెడ్డి ఆయనకు రూ. 50 లక్షలిస్తూ మభ్యపెడుతుండగా ఆడియో వీడియోలతో సహా ఏసీబీ రికార్డు చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే రేవంత్, వేం నరేందర్‌రెడ్డి, జెరూసలేం మత్తయ్యను విచారించిన ఈడీ... చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారప్రీ కుట్రకు సూత్రధారి చంద్రబాబే అని మొదటి నుంచి వస్తున్న ఆరోపణలకు మత్తయ్య వాంగ్మూలంతో మరింత బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎలా ముందుకు వెళ్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఓటుకు నోట్లు ; ఇదేమి ఆదర్శంరా నాయనా..!
-
ఓటుకు నోట్లు ; ఇదేం ఆదర్శంరా బాబూ..!
సాక్షి, మంచిర్యాల : స్థానిక సంస్థల సంరంభం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని టీఆర్ఎస్ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కో ఆప్షన్ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది. ఇక మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం లింగయ్య పల్లెలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ తరపున ఎంపీటీసీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మాదాడి హన్మంతరావు అనే వ్యక్తి ఓటమిపాలయ్యారు. దీంతో ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలామంది తాము తీసుకున్న డబ్బుల్ని తిరిగిచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓటుకు నోట్లు పంచిన ఓ వ్యక్తి తిరిగి చెల్లించమనడం.. ఇదే మా ఆదర్శం అంటూ ప్రజలు స్పందించడం భలే యావ్వారం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
ఓటర్లకు 15 కోట్లు.. ‘కొండ’ బండారం బట్టబయలు!
సాక్షి, గచ్చిబౌలి : ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతున్న ఓ కీలకమైన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అనుకూలంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న సందీప్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్‌లో తాజాగా సోదాలు నిర్వహించిన పోలీసులు.. సందీప్ రెడ్డి దగ్గర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొండాకు అనుకూలంగా చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 కోట్ల రూపాయల నగదును ఓట్ల కోసం పంపిణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చిందీ.. కోడ్ రూపంలో సందీప్ రెడ్డి రాసిపెట్టుకున్నారు. ఈ కోడ్ భాషలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కోడ్‌లో ఉన్న వివరాలను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. సందీప్ వ్యవహారంపై ఇప్పటికే ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రూ. 15 కోట్ల పైచిలుకు నగదును కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కలిసి పంచినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు.. మంగళవారం సాయంత్రం కొన్ని గంటలపాటు సందీప్ రెడ్డిని ప్రశ్నించారు. మరోసారి తమ ముందు హాజరు కావాలని అతన్ని ఐటీ అధికారులు ఆదేశించారు. 2008 నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వద్ద సందీప్ రెడ్డి పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఆయనకు సమీప బంధువు కూడా. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆర్థిక వ్యవహారాలను కూడా సందీప్ రెడ్డి చూస్తాడని తెలుస్తోంది. -
ఇక లాభం లేదు.. పోలీసులనే దించుదాం..!
సాక్షి, శ్రీకాకుళం : ఎన్ని అక్రమాలు, అరాచకాలు చేసైనా, చివరికి ప్రజలు ఛీకొట్టినా సరే అధికారం మాత్రం దక్కాలనే తీరుగా టీడీపీ వ్యవహరిస్తోంది. కరెన్సీ కట్టలతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం నిఘా నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పోలీసులనే రంగంలోకి దించారు పచ్చ నేతలు. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తరపున పోలీసులు డబ్బులు పంచుతున్న వ్యవహారం బయటపడింది. వజ్రపుకొత్తూరుకు చెందిన పోలీసులు టీడీపీ నేతలతో కలిసి ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియా కంటబడ్డారు. జిల్లా పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను హెడ్ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చింది. అయినా పరిస్థితుల్లో ఏ మార్పు కానరావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అడుగడుగునా నిబంధనలకు పాతరేస్తున్న టీడీపీ ప్రభుత్వం.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను కూడా తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ హైకోర్టులో సవాల్ చేసింది. (చదవండి : ఎన్నికల ప్రచారంలో..‘గౌతు’కు షాక్...!) -
రూ.5 కోట్లకు చంద్రబాబు ఓకే
సాక్షి, హైదరాబాద్: ‘మనవాళ్లు.. బ్రీఫ్డ్ మీ, అయామ్ విత్ యూ బ్రదర్, ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ, వాట్ ఆల్ దె కమిటెడ్.. వి విల్ ఆనర్, ఫ్రీలీ యుకెన్ డిసైడ్.. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్’ఈ నాలుగు డైలాగులు తెలుగు ప్రజలకు చాలా బాగా పరిచయం. 2015 జూన్‌లో నమోదైన ‘ఓటుకు కోట్లు’కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టారంటూ అప్పట్లో విడుదలైన వీడియోల సారాంశమిది. చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగేళ్ల క్రితం నాటి ఈ ‘ఓటుకు కోట్లు’కుంభకోణంలో.. తాజాగా మరో అత్యంత కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు వెలుగుచూడని తాజా వీడియోతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 11 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలున్నాయి. డీల్‌లో భాగంగా ‘బాబు’మొదట రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సెబాస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు చెప్పారు. అయితే తాను గట్టిగా పట్టుబట్టడం వల్లే ‘బాబు’చివరకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. ఇందులో భాగంగా రూ.50 లక్షలు పంపించారనేది వెల్లడైంది. సెబాస్టియన్ చేసిన వ్యాఖ్య ఈ వీడియోలో రికార్డయింది. రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్ టేబుల్ మీద పెట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఆగిపోయిన సెబాస్టియన్ మాత్రం తనకు రావాల్సిన కమిషన్ గురించి స్టీఫెన్‌సన్‌తో మంతనాలు జరిపారు. ‘బాబు’తో మధ్యవర్తిత్వం వహించినందుకు తనకు పర్సంటేజీ ఇవ్వాలని స్టీఫెన్సన్ను కోరాడు. ఈ వీడియో నాలుగో నిముషంలో ‘నోటుకు కోట్లు’సూత్రధారి ఎవరో సెబాస్టియన్ వెల్లడించారు. వీడియోలో ఏముంది? ‘ఈ డీల్‌లో మధ్యవర్తులు కూడా ఉన్నారు. నిజానికి ‘బాబు’మొదట్లో రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు మాత్రమే ఇస్తానన్నారు. అయితే నేను పట్టుబట్టడంతో పాటు, డబ్బులు పెంచే విషయంలో బాధ్యతను తీసుకున్నా. ‘బాబు’నన్ను నమ్ముతున్నారు. నువ్వు మాత్రం రేవంత్‌రెడ్డిని విశ్వసిస్తున్నావు. అందుకే అతడిని రంగంలోకి దించాల్సి వచ్చింది’అని డీల్‌లో తన పాత్రను సెబాస్టియన్ వివరించారు. ఈ క్లిప్‌లో సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ‘బాబు’, ‘బాస్’గురించి పదే పదే ప్రస్తావించగా.. స్టీఫెన్సన్, సెబాస్టియన్లకు ‘బాబు’ఎవరో తెలుసనే విషయం స్పష్టమవుతోంది. 11 నిముషాల నిడివి ఉన్న వీడియో క్లిప్ ప్రకారం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేస్తే.. మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు ఇవ్వాల్సిన డబ్బును ‘బాబు’సమకూర్చారు. వీడియో క్లిప్‌తో గుట్టు రట్టు? 2015 జూన్‌లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటా ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బులు ఇచ్చే క్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ప్రలోభాలకు సంబంధించిన తతంగాన్ని ఏసీబీ రహస్య కెమెరాలతో చిత్రీకరించింది. అయితే ఓటుకు కోట్లు కేసు నమోదై నాలుగే«ళ్లవుతున్నా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై చిక్కుముడి వీడటం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ), ఇన్‌కంట్యాక్స్ (ఐటీ) విభాగాలు, ఏసీబీ ఇదే కోణంలో నాలుగేళ్లుగా విచారణ జరుపుతున్నాయి. ‘ఓటుకు కోట్లు’కేసులో అత్యంత కీలకమైన ఈ వీడియో క్లిప్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ విచారణ ఏజెన్సీకి చిక్కలేదు. 2015లోనే ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో పాటు, ఓ ఫోన్ ద్వారా ఈ వీడియోను చిత్రీకరించారు. నోటుకు ఓటు కేసు విచారణ తాజాగా మరోమారు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఈ వీడియో క్లిప్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, అతని అనుచరుడు ఉదయ సింహ.. స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బు తమది కాదని ఇన్నాళ్లూ విచారణ ఏజెన్సీలకు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన ఈ క్లిప్ ‘నోటుకు కోట్లు’కేసు విచారణలో కీలకంగా మారడంతో పాటు, ఈ కేసు కుట్రదారుల గుట్టు బయట పెడుతుందని భావిస్తున్నారు. కాగా స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఈ వీడియోలో సంభాషణలు సాగాయి. ఏసీబీ కెమెరాలతో పాటు మరో ఫోన్లో! ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న తార్నాకకు చెందిన మాల్కమ్ టేలర్ నివాసంలో ఈ వీడియోను చిత్రీకరించారు. డీల్ సందర్భంగా ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో పాటు, మరో ఫోన్లో ఈ తతంగం రికార్డయింది. ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి, మధ్యవర్తి సెబాస్టియన్ నడుమ జరిగిన సంప్రదింపులు, సంభాషణ ఈ వీడియోలో ఉన్నాయి. తార్నాకలోని మాల్కమ్ టేలర్ నివాసంలో ఎల్విస్ స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యింది మొదలుకుని డీల్ కుదరడం, నగదు ఇవ్వడం తదితర ఘట్టాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘తెలంగాణలో నీకేమైనా జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తాం. మిగతా అన్ని విషయాల్లోనూ నీ వెంట ఉంటా. మా ‘బాస్’ఇది నాకు వ్యక్తిగతంగా అప్పగించిన బాధ్యత. ఈ డీల్ కోసం నా తలను పణంగా పెడుతున్నా’అని స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ‘నా మొత్తం జీవితాన్నే పణంగా పెడుతున్నా’అని స్టీఫెన్సన్ సమాధానం ఇవ్వగా, మా ‘బాస్’చెప్పిన పని చేస్తున్నా అని రేవంత్ సమాధానం ఇచ్చారు. ‘సెబాస్టియన్ ద్వారా ఈ రోజు రాత్రికల్లా మొత్తం డబ్బు పంపిస్తా’అని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా.. వెనుక ఓ నల్ల బ్యాగుతో నిల్చున్న వ్యక్తి అందులో నుంచి నగదు నుంచి మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టినట్లు క్లిప్ వెల్లడిస్తోంది. కాగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేసే సందర్భంలో ఏసీబీ అధికారులతో రేవంత్ వాగ్వాదానికి దిగినట్లుగా క్లిప్‌లో రికార్డయింది. ‘ఓటుకు నోటు’క్రమమిదీ! ►2015 జూన్ మొదటి వారంలో తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటాకు ఎన్నికలు జరిగాయి. ►ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది. ►పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేలా టీడీపీ డబ్బులు ఎరగా వేసింది. ►అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన ‘బాస్’అప్పగించిన బాధ్యత మేరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50లక్షలు ఇస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ►వీడియో కెమెరాలతో ప్రలోభాల పర్వాన్ని చిత్రీకరించిన ఏసీబీ రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లారు. ►ఈ కేసు విచారణను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు. నాటినుంచీ కేసు అనేక మలుపులూ తిరుగుతోంది. ►ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సెబాస్టియన్ అమీర్‌పేట నివాసంపై 2018 సెప్టెంబర్‌లో ఐటీ విభాగం దాడులు చేసింది. ►2018 అక్టోబర్‌లో (రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు) రేవంత్‌రెడ్డి సన్నిహితుడు ఉదయసింహ, సోదరుడు కొండల్‌రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ►2019 ఫిబ్రవరిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌తోపాటు, ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి, అతని కుమారుడిని ఈడీ విచారించింది. ►తాజాగా మార్చి 5, 2019న స్టీఫెన్‌సన్‌తో పాటు, కీలక సాక్షి మాల్కం టేలర్, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. -
‘చంద్రబాబును చూసి సిగ్గుతో చచ్చిపోతున్నాం’
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు తమ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడంతో ఆయన స్పందించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... తప్పు ఒప్పుకుని తెలుగుజాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసుపై త్వరితగతిన నిష్పక్షపాత విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మనీ, మీడియా, మానిపులేషన్‌లతో చంద్రబాబు మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలంటే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. భారత దేశ చరిత్రలో ఇంత నిసిగ్గుగా డబ్బులతో ఎదుటివారిని కొనేసి రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. నిజంగా చంద్రబాబుకు సిగ్గుండాలా. నాలుగేళ్ల క్రితం ఓటు కోట్లు కేసులో టీడీపీ నాయకులు ఆడియో, వీడియో టేపుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనాన్ని దేశం యావత్తు చూసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రలోభాలకు దిగడంతో ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకున్నారు. (సార్ ఎవరు?) ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఫలానా నాయకుడు మా ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకునేట్టు ఉండాలి. మీ సీఎం ఎవరని అడిగితే చంద్రబాబు అని చెప్పటానికి సిగ్గుపడే పరిస్థితులు ఇవాళ కన్పిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాయి. తప్పు ఒప్పుకుని తెలుగు జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. కోర్టులను అడ్డం పెట్టుకుని స్టేలు తెచ్చుకుని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును విచారణను వేగవంతం చేయాలి. చంద్రబాబు పట్ల కేసీఆర్ ఉదారంగా వ్యహరించడం సరికాదు. చట్టబద్ధంగా నిష్పక్షపాత దర్యాప్తు జరిపాల’ని అప్పిరెడ్డి అన్నారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) -
చంద్రబాబు వేధింపులను ఆధారాలతో నిరూపిస్తా
-
చంద్రబాబు అవినీతిపై పోరాడుతున్నందుకే కేసులు
-
అంతా అయోమయం
సాక్షి, హైదరాబాద్: అధినేతకు పట్టింపు లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న కొద్దిపాటి కేడర్‌ను కూడా నడిపించేందుకు నాయకుడు లేడు. వెరసి తెలంగాణలో అగమ్యగోచరంగా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ మహానాడుకు సన్నద్ధమవుతోంది. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఓటుకు కోట్లు తర్వాత తెలంగాణ ఆవిర్భావ సమయంలోనే టీడీపీకి ఎడాపెడా దెబ్బలు తగిలాయి. కేడర్‌తో పాటు నేతలు కూడా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో చేరిపోయారు. అలా సగానికి పైగా పార్టీ ఖాళీ అయిపోయింది. 2014లో 15 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్‌సభ స్థానంలో గెలిచినా ఓటుకు కోట్లు ఉదంతం టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు దిగడం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు పెద్ద మొత్తంలో డబ్బులిస్తూ అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్హాండెడ్గా ఏసీబీకి పట్టుబడటం, ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ. మరేం పర్లేదు, నేనున్నానం’టూ స్టీఫెన్సన్ను చంద్రబాబే నేరుగా ఫోన్లో ప్రలోభపెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓటుకు కోట్లు దెబ్బతో రాష్ట్రంలో టీడీపీ కేడర్ కూడా తాము టీడీపీ అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణలో తాము టీడీపీ అని చెప్పుకునే నేతలు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న మహానాడులో ఏం తీర్మానాలు చేస్తారు, ఎలాంటి పంథా ఎంచుకుంటారు, బాబు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
చంద్రబాబే ఏ-1
-
ఏపీలోనూ ‘ఓటుకు కోట్లు’!
సాక్షి, అమరావతి: ఈనెల 23 న జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు రాష్ట్రంలో వేడి రగిలించాయి. బలం లేకపోయినా స్వతంత్ర అభ్యర్థి పేరుతో మూడో అభ్యర్థిని బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ముఖ్యనేత’ ఆదేశాల మేరకు అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగి విపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేస్తున్నారని తెలుస్తోంది. డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎరవేస్తూ.. నీతిబాహ్యమైన రీతిలో ఎమ్మెల్యే ఓట్లను కొనుగోలు చేసేందుకు దిగజారారని సమాచారం. మరోవైపు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నాయకులు ఇపుడు కూడా అదే తరహాలో సాక్ష్యాలతో సహా దొరికిపోయారని వార్తలు వినిపిస్తుండడం సంచలనంగా మారింది. రేవంత్ తరహాలో ఏపీలో దొరికిన టీడీపీ పెద్దలు ఎవరు?.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో వారు ఏం మాట్లాడారు? ముఖ్యనేత పేరు కూడా ప్రస్తావించారా..? ‘ముఖ్యనేత’ చెబితేనే మీతో ఈ మాట మాట్లాడుతున్నామంటూ బేరమాడారా..? త్వరలోనే ఆ ఆడియో వీడియో టేపులు బయటకు రానున్నాయా... అన్నవి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ముఖ్యనేత తెర వెనుక వ్యవహారం! రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడో సీటు కోసం ‘ముఖ్యనేత’ తెరవెనుక నడుపుతున్న వ్యవహారం ఇప్పడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలను ఎంతకైనా కొనుగోలు చేయాలని ‘ముఖ్యనేత’ సంప్రదింపులు జరిపించారని వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన రాయ‘బేరాల’ సాక్ష్యాలు ప్రతిపక్షపార్టీకి చెందిన సీనియర్ నాయకులకు చేరాయన్న విషయం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇలా ప్రలోభాలకు దిగిన నాయకులు మాట్లాడిన మాటలను ఆడియో వీడియో టేపులలో ఎమ్మెల్యేలు రికార్డు చేసినట్లు సమాచారం. ఈ సాక్ష్యాలను సరైన సమయంలో బయట పెడతామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ప్రకటించడం తెలుగుదేశం వర్గాల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దోషిగా నిండా మునిగిపోయారని, తత్ఫలితంగా అక్కడ పార్టీనే బలిపెట్టాల్సి వచ్చిందని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. బలాబలాలను బట్టి టీడీపీకి 2, వైఎస్సార్సీపీకి 1 ప్రస్తుతం శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు మిత్రపక్షమైన బీజేపీ సభ్యులతో కలిపి తెలుగుదేశానికి కేవలం రెండు సీట్లకు సరిపడా బలం మాత్రమే ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి ఉన్న 44 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అనుసరించి ఒకస్థానం వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారిలో నలుగురిని తన కేబినెట్లోనూ చోటు కల్పించడం తెలిసిందే. సోమవారంతో నామినేషన్లకు తుది గడువు కాగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున వేమిరెడ్డిప్రభాకర్రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెండింటికే నామినేషన్లు వేస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే కనుక ఎన్నిక అనివార్యమవుతుంది. అప్పుడు అసెంబ్లీలోని సభ్యుల మొత్తం సంఖ్యను అనుసరించి మొదటి ప్రాధాన్యత ఓటు కింద 44 మంది ఓట్లు దక్కించుకున్న వారు విజయం సాధించినట్లే. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో అంతర్మథనం.. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఆయనతో పాటు మంత్రులు చేసిన అనేక అవినీతి వ్యవహారాలు, తమ సొంతమనుషులకోసం చేసిన అక్రమాలతో పాటు ప్రజావ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి టీడీపీలో చేర్చుకున్న అనేకమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. ప్రలోభాల వల్ల టీడీపీలోకి వెళ్లిన తమను ఆ సమయంలో వాడుకొని తరువాత నుంచి కరివేపాకుల్లా పక్కన పెట్టారని అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ప్రలోభాల వల విపక్ష ఎమ్మెల్యేలపై ప్రయోగించిన ప్రలోభాలు రకరకాలుగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేని కలుసుకున్న నాయకుడు ఏకంగా మంత్రి పదవి ఆఫర్ చేయగా.. మరో ఎమ్మెల్యే వద్దకు తెల్లవారుఝామున ఎవరి కంటా పడకుండా వచ్చి రకరకాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారట. మనం ఇద్దరిదీ ఒకటే కులం.. నువ్వు అధికారపార్టీకి మద్దతిస్తే మనకు చాలా మేలు జరుగుతుంది అని మరో ఎమ్మెల్యేని ఒప్పించే ప్రయత్నం చేశారు.. మన ఇద్దరిదీ బాల్య స్నేహం.. నీకు రూ.30 కోట్ల వరకు ఇప్పిస్తాను అని మరో నాయకుడు ఒక ఎమ్మెల్యేకు ఆఫర్ చేశారని తెలిసింది. -
పదవులపై పచ్చాశ
-
నేరమే... అధికారమైతే?
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఓటుకు వెలకట్టి కొనుగోలు చేయడం భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. ఒక పార్టీతరపున ఎన్నికైన వ్యక్తిని ప్రలోభాల ఎరతో మరో పార్టీలోకి తీసుకోవడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం నేరం. రెండు సందర్భాల్లో రెండు రాష్ట్రాల్లో... ఈ రెండు నేరాలకు పాల్పడుతూ ఆడియో వీడియోల సాక్షిగా దొరికిపోయిన దోషి చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ డబ్బు సంచులతో అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సెల్‌ఫోన్ సంభాషణలు బట్టబయలయ్యాయి. ఏపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పదవులతో ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయించేలా చేశారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా కార్యకర్తలకు చెబుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. దొంగతనాలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్ గా దొరికిన దొంగలకు శిక్షలు పడే పరిస్థితి లేకుంటే దేశంలో శాంతి–భద్రతలు మృగ్యమై అరాచకం తాండవిస్తుంది. అలాగే చంద్రబాబు నేరాలకు సాక్ష్యాలున్నా శిక్ష పడకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే, ఇక డబ్బులు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేసిన వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇలా దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో ఎన్నికైన ప్రభుత్వాల పాలన ‘ధనస్వామ్యం’ అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాజాలదు. ఈ ధనస్వామ్యపాలనకు ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై దృష్టి కన్నా ధనార్జన పైనే సహజంగా దృష్టి ఉంటుంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్యం బదులు.. ధనం చేత , ధనం కొరకు, ధనమే ఎన్నుకునే ధనస్వామ్య ప్రమాదాన్ని ప్రతిఘటించడం. ప్రజాస్వామ్య ప్రేమికుల కర్తవ్యం. ఓటుకు కోట్లు నుంచి గిడ్డి వరకూ ఎన్నో సాక్ష్యాలు... తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవడం కోసం తెలుగుదేశం అధినేత రంగంలోకి దిగారు. రేవంత్‌రెడ్డిని పురమాయించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టేం దుకు ప్రయత్నించారు. మా బాస్‌తో మాట్లాడి నిర్ధారించుకోండి అని రేవంత్‌రెడ్డి చెప్పగా స్వయంగా స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణలు జరిపారు. స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ రేవంత్‌రెడ్డి దొరికిపోయారు. రేవంత్ వీడియో, చంద్రబాబు ఆడియో టేపులు బయటప డ్డాయి. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఏపీలో అన్ని రంగాలనూ అవినీతి మయం చేసిన బాబు ఆ అవినీతి డబ్బుతో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరతీశారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు, మంత్రి పదవులు, కాంట్రాక్టులు, కమీషన్లు ఎరచూపి ఇప్పటివరకు 23 మంది ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పారు. అభివృద్ధి చూసి పార్టీ మారుతున్నారని చంద్రబాబు చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లేనని పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి నపుడే స్పష్టమయ్యింది. ఎమ్మెల్యేల ఫిరాయిం పుల వెనక మాస్టర్‌మైండ్ చంద్రబాబేనని, ఫిరాయింపులకు కారణం పదవులు, డబ్బు, కాంట్రాక్టులు, కమీషన్ల వంటి ప్రలోభాలేనని తాజాగా గిడ్డి ఈశ్వరి ఉదంతం రుజువు చేసిం ది. పార్టీ ఫిరాయించడానికి ముందు కార్యక ర్తలతో మాట్లాడుతూ గిడ్డి ఈశ్వరి ఈ ప్రలో భాల పర్వాన్ని స్పష్టంగా బయటపెట్టారు. మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రాబోతోందని, మంత్రికి ఉండే అధికా రాలన్నీ ఉంటాయని, ఏడాది పదవిలో ఉంటాం కనుక అనేక పనులు చేసుకునే అవ కాశం కల్పిస్తారని గిడ్డి ఈశ్వరి చెబుతున్న వీడి యో ఫుటేజ్ బయటపడింది. ఇవన్నీ బాబు దోషి అని రుజువు చేస్తున్న సాక్ష్యాలే. ఇవిగో మరికొన్ని సాక్ష్యాలు.. ‘పార్టీ ఫిరాయిస్తే నాకు రూ.20 కోట్లు ఇస్తామన్నారు.’అని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆ మధ్య విలేకరుల సమా వేశం పెట్టిమరీ వివరించారు. ఆ తర్వాత ఆమె టీడీపీలోకి ఫిరాయించారు. ‘నాకు డబ్బు ఇవ్వలేదు కానీ మంత్రి పదవి ఇస్తామన్నా రు.’అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలుగుదేశంలోకి ఫిరాయించిన తర్వాత బయ టపెట్టారు. తాజాగా తెలుగుదేశం మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో ఓ పెద్ద తలకాయ కోసం ‘అన్ని రకాలు’గా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అదే జరిగితే ఇక వైఎస్సార్సీపీ ఖాళీయేనని ఆయన సెలవిచ్చారు. ఇవన్నీ సాక్ష్యాలు కావా? చంద్రబాబు దోషి అని రుజువు చేయడం లేదా? చట్టాలకు తూట్లు పొడుస్తూ.. భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఓటుకు వెలకట్టి కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అలాంటిది ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా బేరమాడి మరీ కొనుగోలు చేయడం ఎంత నేరం? ప్రజాస్వామ్యమంటే గౌరవమున్న వారు చేసే పనేనా ఇది. ఈ చట్టంలో ప్రజా ప్రతినిధులకు ఉండాల్సిన అర్హతలేమిటో చాలా స్పష్టంగా వివరించింది. అలానే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేసే లక్షణాలేమిటో కూడా అంతే స్పష్టంగా వివరించింది. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ అనర్హత వేటుకు అర్హులు అని స్పష్టంగా వివరించింది. డబ్బులు, పదవులు, కాంట్రాక్టులు తీసుకుని పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినట్లు కాదా.. ఎమ్మెల్యేల సంగతలా ఉంటే.. వారికి అవన్నీ ఎరవేసి ప్రలోభ పెట్టి పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలకు ఏ పేరు పెట్టాలి? గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ఇలాంటి నీతిబాహ్యమైన, చట్టవిరు ద్ధమైన పనులకు పురికొల్పడం, స్వయంగా పాల్గొనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సాక్ష్యాలతో సహా దొరికిపోతూ ఇంకా పదవి లోనే కొనసాగడాన్ని ఏ పేరుతో పిలవాలి? ప్రజాస్వామ్య మనుగడకు విఘాతం.... సీఎం స్థాయి వ్యక్తి చట్టాలకు తూట్లు పొడుస్తూ, ఆడియో – వీడియో టేపులతో సహా దొరికినా పదవిలోనే కొనసాగ డం, ఏ శిక్షా పడకపోవడం ప్రజాస్వామ్య మనుగడకు విఘాతంగా పరిణమిస్తుందని విశ్లేషకు లంటున్నారు. ఇలాంటి నేరాలు చేసినా శిక్ష పడక పోతే ఇక సొమ్ములున్నవారంతా ఓట్లను కొని ఎమ్మెల్యేలు అవుతారు. ఆపై వారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తారు. ఇలా ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవారు ఆ తర్వాత ప్రజా సంక్షేమానికి గానీ, రాష్ట్రాభివృద్ధికి గానీ, దేశాభివృద్ధికి గానీ పనిచేయాలనుకుంటారా? సొమ్ములు సంపాదించుకోవడం అన్న ఏకైక లక్ష్యంతోనే పనిచేయాలనుకుంటారు. ఈ పరిస్థితులకు దారితీసే ప్రమాద కర పోకడలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ గొంతు విప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. ఫిరాయింపులు, కొను గోళ్లు, బేరసారాలతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయమిది. ఈ నేరగాళ్లకు శిక్షలు పడకపోతే.. మన రాష్ట్రంలో ఇక ప్రజా స్వామ్య మనుగడకు ఇది పూర్తిస్థాయి ప్రమా దంగా పరిణమించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వెనక పదవులు, డబ్బు వంటి ప్రలోభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి సాక్ష్యాలతో బయటపడుతున్న ఈ ఉదంతాలపై తగిన చర్యలు తీసుకోకుంటే ఇవి రానురాను ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదంగా పరిణమిస్తాయి. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకపోయినా అధికారంలో ఉన్నవారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయాలనుకోవడం అనైతికం. –పి. మధు, రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం అనైతికం.. రాజ్యాంగ విరుద్ధం.. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులు మంత్రి పదవులివ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయడమో, వారంతట వారు రాజీనామా చేయడమో జరగాలి కానీ అవేవీ జరక్క పోగా పదవులలో ప్రతిష్టించడం సరికాదు.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక ప్రలోభాలకు సంబంధించి బయటపడుతున్న సాక్ష్యాలపై తగిన దర్యాప్తు జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలి. – కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఎలా..? ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే విరుద్ధం. అధికారం ఉంది కదా అని ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడం, రాజీనా మా చేయించకుండా కొనసాగించడం అనైతికం. రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సిన వారే వాటిని అతిక్రమిస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి? రాజ్యాంగ వ్యవస్థలను నడపాల్సిన స్పీకర్, గవర్నర్ వంటి వ్యక్తులే ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధమేముంది? దీనికి అంతమెక్కడ? –డాక్టర్ డి. నర్సింహారెడ్డి, రాజకీయ విశ్లేషకుడు -
బాబును వెంటనే అరెస్టుచేసి, జైలుకు పంపాలి!
హైదరాబాద్: తాను తలుచుకుంటే ఓటుకు రూ. ఐదువేలు ఇవ్వగలనన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీఎం చంద్రబాబు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు రూ. ఐదువేలు ఇవ్వగలనన్న చంద్రబాబును.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అరెస్టు చేసి, జైలుకు పంపాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గతంలో రూ. ఐదు కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ కొనుగోలు చేయాలని చూసిన చంద్రబాబు.. ఇప్పుడు ఓటర్లను కూడా రూ. 5వేల చొప్పున కొనుగోలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల అంటే చంద్రబాబు ఓటర్లుగానే కనిపిస్తున్నారని, ఓటు ఉన్నవాడే మనిషి అన్న ఆలోచనతో ఆయన బతుకుతున్నారని భూమన ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. -
మళ్లీ తెరపైకి పన్నీర్ సెల్వం
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (అమ్మ వర్గం) నేత ఓ. పన్నీర్ సెల్వం మరోసారి తెర ముందుకు వచ్చారు. ఢిల్లీ వేదికగా శశికళ వర్గంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ఎడపాడి పళనిస్వామి పాలన చెల్లదని స్పష్టం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా శశికళ నియమించినందున ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. పార్టీ బాధ్యతలను తాను మాత్రమే నిర్వహించగలనని చెప్పారు. పార్టీ చిహ్నం రెండాకుల కోసం ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న నోటుకు ఓటు అంశాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళతామన్నారు. ఉప ఎన్నికల్లో రూ. 89 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు వెల్లడించాక ఎవరికీ మద్దతు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తామంతా చర్చించుకుని నిర్ణయానికి వస్తామని పన్నీర్ సెల్వం తెలిపారు. తన చీలిక వర్గాన్ని శశికళ వర్గంలో కలిపేందుకు పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన ఢిల్లీ బాట పట్టినట్టుగా కనిపిస్తోంది. -
ఓటుకు నోటు తీసుకున్న ఓటర్లపైనా చర్యలు!
- ఇచ్చిన, తీసుకున్నవారిపై చర్యలకు వినతి -ఆర్కేనగర్ ఉపఎన్నికలపై మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం -వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉపఎన్నికలకుగాను ఓటర్లకు నోట్లు పంచినవారే కాదు తీసుకున్న వారిని సైతం నేరస్తులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. ఆర్కేనగర్ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారని ప్రాథమికంగా రుజువుకావడంతో ఈనెల 12వ తేదీన జరగాల్సిన ఎన్నికల పోలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ 9వ తేదీన ప్రకటించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నళినీ చిదంబరం కోర్టుకు చెప్పారు. అయితే నోట్లు పంచిన అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, నగదు పంపిణీకి నాయకత్వం వహించిన ఐదుగురు మంత్రులు ఇతర అనుచరులపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఆర్కేనగర్ పరిధిలోని పోలీసులను ప్రధాన ఎన్నికల కమిషన్ అదేశించలేదని తప్పుపట్టారు. నగదు పంపిణీకి బాధ్యులను, పుచ్చుకున్న ఓటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరాడు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది నిరంజన్ తనవాదనను వినిపిస్తూ, ఓటర్లకు నగదు పంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ తరఫున చెన్నై పోలీస్ కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపి ఆ పత్రాలను అందజేశారు. ఆర్కేనగర్ పరిధిలోని రెండు లక్షల ఓటర్లను తనిఖీ చేయడం ఆచరణలో సాధ్యం కాదని, అలా చేస్తే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు ఎలా వస్తారని నిరంజన్ వాదించారు. ఈ పిల్‌పై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, చెన్నై పోలీస్ కమిషనర్ సవివరమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందర్ ఆదేశించారు. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. -
అసెంబ్లీని కుదిపేసిన ‘ఓటుకు కోట్లు’
⇒ ఆ వీడియోలను సభలో ప్రదర్శించాలి ⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై చర్చించాలి ⇒ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం అసెంబ్లీని మరోసారి కుదిపేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తోసిపుచ్చడంతో మొదలైన వివాదం సభ వాయిదాకు దారితీసింది. ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చిన వీడియోలను సభలో ప్రదర్శించాలని వైఎస్సార్సీపీ సభ్యులు సభ ప్రారంభమైన ఉదయం 9 గంటల నుంచి 42 నిమిషాల పాటు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై సభలో చర్చించాలని ప్రతిపక్ష సభ్యుడు జి.శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ దీన్ని తోసిపుచ్చుతూ ప్రశ్నోత్తరాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. తొలి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందిగా ఆర్థిక మంత్రి యనమలను ఆదేశించారు. యనమల లేచి సమాధానం చెబుతుండగా విపక్ష సభ్యులు సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. ‘ఓటుకు కోట్లు వీడియోను ప్లే చేయాలి, మీకు నైతిక విలువలుంటే తక్షణమే రాజీనామా చేయాలి, రాష్ట్ర పరువు తీసిన ముఖ్యమంత్రి డౌన్‌డౌన్’ వంటి నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ గొడవ మధ్యలోనే యనమల తన తొలిప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ దశలో మైకు అందుకున్న టీడీపీ సభ్యుడు కూన రవికుమార్, బొండా ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, యరపతినేని శ్రీనివాసరావు, గొల్లపల్లి సూర్యారావు, ధూళిపాళ్ల నరేంద్ర మొదలు బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు వరకు విపక్షంపై ఆరోపణలు చేశారు. కొందరైతే రాయడానికి వీల్లేని పదాలను సైతం ఉపయోగించారు. -
ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్ ఇస్తారా?:వైఎస్ జగన్
అమరావతి: ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ....సభలో ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్ ఇస్తారా, తమ ఛాలెంజ్‌లపై రూలింగ్ ఇవ్వరా అని ప్రశ్నించారు. దేనికైనా ధర్మం, న్యాయం ఉండాలని పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరామని, కానీ స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని అనర్హత వేటు పడకుండా చూస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. అనర్హత వేటు వేస్తే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామన్న సవాల్‌కు స్పందించలేదని, ఓటుకు కోట్లు కేసులో మనవాళ్లు బ్రీఫ్డ్ మి అనే వాయిస్ చంద్రబాబుదో, కాదో చెప్పాలని సవాల్ విసిరామని, దానిపై ఇప్పటివరకూ స్పందనలేదన్నారు. ప్రతిపక్షం సవాళ్లపై స్పందించరని, అదే అధికారపక్షం సవాల్‌పై మాత్రం స్పందించాలని ఎదురు దాడి చేయడం సరికాదని వైఎస్ జగన్ అన్నారు. స్పీకర్ కూడా అధికారపక్షం వైపే ఉన్నారన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలిసి తనపై తప్పుడు కేసులు వేయించారని, అందుకే అవిశ్వాసం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్‌ను చంద్రబాబు కాపాడారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తన ఆస్తి లక్ష కోట్లు అని ఒకసారి, రూ.43వేల కోట్లని మరోసారి చెబుతున్నారని, అందులో 10శాతం ఇవ్వాలని తాను సవాల్ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తన సవాళ్లపై స్పందించేందుకు ఇంతవరకూ ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. మళ్లీ అవే ఆరోపణలు తనపై చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పుడైనా వన్‌సైడ్ ఛాలెంజ్ ఉండదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారంలో తాను చేసిన సవాల్‌కు సర్కార్ నుంచి స్పందనే లేదన్నారు. అధికార పార్టీ నేతలకు సంబంధించి అగ్రిగోల్డ్ బాధితులు తనకు చాలా సమాచారం ఇచ్చిరని వైఎస్ జగన్ తెలిపారు. సభలో వాటిని తాను బయటపెడతాననే భయంతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారన్నారు. వాస్తవాలు చెబుతుంటే మైక్ కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. సభలో తనను అడ్డుకున్నా టీడీపీ నేతలు, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సాయంత్రం మీడియా ఎదుట మొత్తం ఆధారాలతో సహా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. హాయ్‌లాండ్ ఆస్తులు ఎందుకు వేలానికి రాలేదని, యారాడ ప్రాపర్టీస్, షాపింగ్ మాల్స్‌ను ఎందుకు వేలంలో చేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం మోసం చేస్తోందని, బాధితుల వద్దకు తాను వెళ్లి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మృతులకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తామనగానే కాస్త చలనం వచ్చిందన్నారు. మొదట రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించి ...ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచిందని వైఎస్ జగన్ అన్నారు. సభలో తాను మాట్లాడిన ప్రతిసారి మైక్ కట్ చేస్తున్నారని, అధికారపక్ష సభ్యులు లేచి సభను దారి మళ్లిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వాన్ని నిలదీయగానే నలభై రోజుల కిందట వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ప్రజల గొంతు తాము వినిపిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటోందని, సభలో తమపై ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్ల ట్రాప్‌లో పడకుండా సంయమనం పాటిస్తే మళ్లీ తప్పుబడుతున్నారన్నారు. తమ సవాళ్లను చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని ఆయన అన్నారు. -
అందుకే మా గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్
అమరావతి: అగ్రిగోల్డ్ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రాకుండా సభలో తమ గొంతు నొక్కుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సభముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుంటే... తన ప్రయత్నాన్ని అధికారపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సభలో పుల్లారావు భూముల కొనుగోలుపై తాను ఆధారాలు ప్రవేశపెట్టాక, తర్వాత వాళ్ల దగ్గర గొప్ప ఆధారాలుంటే సభలో ఇవ్వొచ్చన్నారు. ఇద్దరి వాదనలు విన్నాక తప్పెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే ఆ అవకాశాన్ని స్పీకర్ తమకు ఇవ్వడం లేదన్నారు. నీటి కుళాయిల దగ్గర సవాళ్ల మాదిరిగా విసురుతున్న సవాళ్లకు అర్థం లేదన్నారు. ఇదే సభలో గతంలో తాను విసిరిన సవాల్‌కు ప్రభుత్వం పారిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. తనపై కేసులకు సంబంధించి విసిరిన సవాల్‌కు ప్రభుత్వం నోరు విప్పలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాలు బయటకు వస్తే మంత్రి పుల్లారావు సహా అధికార పార్టీ నేతల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే తాను మాట్లాడటానికి ప్రయత్నిస్తే మైక్ కట్ చేస్తున్నారన్నారు. సభను ముందుకు తీసుకెళ్లాల్సిన స్పీకర్ ఆ పని చేయడం లేదని, సభ విలువలను, గౌరవాన్ని దిగజార్చుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. -
'చంద్రబాబూ ఆ ఒక్కమాట చెప్పు'
-
'చంద్రబాబూ ఆ ఒక్కమాట చెప్పు'
అమరావతి: 'మనవాళ్లు బ్రీఫ్డ్ మీ' అని ఆడియో టేపుల్లో వినిపించిన మాట 'నాది కాదు' అని అసెంబ్లీలో ఒక్కమాట చెప్పండి అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అసెంబ్లీలో పట్టుబట్టింది. అయితే సభలో అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. అధికారపక్షం మాత్రం సభను తప్పుదోవపట్టించేలా వ్యక్తిగత దూషణలకు దిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఓటుకు నోట్లు కేసులో ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును తాము ముఖ్యమంత్రిగానే చూస్తున్నామని అన్నారు. ఆడియో టేపుల్లోని వాయిస్ నాది కాదు అని చెబితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం కాపాడటానికి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవారిపై పోరాటం చేస్తామని అన్నారు. ఆడియో టేపులోని వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్లే చేయాలని శ్రీధర్‌రెడ్డి అన్నారు. -
తమ బాగోతం బయటపడుతుందనే భయం: రోజా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అధికారపక్ష సభ్యులు వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా, కరువు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల సహా ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. చర్చ జరిగితే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందన్నారు. అందుకే ప్రతిసారి అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ తాము వాయిదా తీర్మానం ఇస్తే...దానిపై చర్చించకుండా... అదో పనికిమాలిన కేసు అని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకరు, పక్క రాష్ట్రంలో జరిగినదాన్ని తీసుకు వచ్చిన ఏపీ అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు అని మరొకరు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. స్పీకర్ తమకు తండ్రిలాంటివారని, ఆయనపై తమకు గౌరవం ఉందన్నారు. ఇక ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కయ్యారని, ఆడియో, వీడియో టేపుల్లో ఆయన దొరికిపోయారన్నారు. బ్రీఫ్డ్ మి అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని, చంద్రబాబు డబ్బులిచ్చారని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని రోజా పేర్కొన్నారు. -
బాగోతం బయటపడుతుందనే భయం
-
మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే బోండా ఉమా
అమరావతి: ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరోసారి నోరు జారారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్చను పక్కదారి పట్టించేందుకు అధికార పక్ష నేతలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూ తమ నోటికి పని చెబుతున్నారు. శుక్రవారం కూడా అసెంబ్లీలో అదే జరిగింది. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చి, దానిపై చర్చకు పట్టుబట్టింది. దీంతో అధికార సభ్యులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రతిపక్షానికి సభలో కూర్చొనే అర్హత లేదంటూ అసలు విషయాన్ని పక్కనపెట్టి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణల పర్వం కొనసాగించారు. ఆయన బాటలోనే కూన రవికుమార్, యరపతినేని శ్రీనివాసరావు ...ప్రతిపక్షంపై ఎదురు దాడి చేశారు. అగ్రిగోల్డ్ అంశంపై ప్రభుత్వం విచారణకు సిద్ధంగా ఉంటే ...ప్రతిపక్షం సభనుంచి ఉడాయించిందంటూ వ్యాఖ్యానించారు. -
వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు
-
వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు
అమరావతి: విపక్ష సభ్యుల నిరసనలతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలని వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి ఆందోళనకు దిగారు. అయితే ప్రశ్నోత్తరాల తర్వాతే ఏ అంశంపైన అయినా చర్చిద్దామని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు ఇవాళ కూడా అధికారపక్ష సభ్యులు...ఎదురు దాడికి దిగారు. వ్యక్తిగత దూషణలకు దిగి, నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ సభ్యుల నిరసన, నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. -
వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
అమరావతి: ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులు జారీపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. నియామవళి 63 కింద వైఎస్ఆర్ సీపీ ఈ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. మరోవైపు అగ్రిగోల్డ్, సాక్షి మీడియా వ్యవహారాలపై అధికార పక్షం మళ్లీ చర్చను లేవనెత్తే అవకాశం ఉంది. ఇక ఆర్అండ్బి, రవాణా, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యుత్, అటవీశాపద్దులపై సభలో చర్చించే అవకాశం ఉంది. -
ఎవరినైనా కొంటాం టాం..టాం..!
-
ఓటుకు కోట్లు.
-
చంద్రబాబు చాలా బాగా కష్టపడ్డారు
-
చంద్రబాబు చాలా బాగా కష్టపడ్డారు: వైఎస్ జగన్
విజయవాడ: ఓ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సాయంత్రమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం పదవిలో ఉన్న వ్యక్తులు ఆడియో, వీడియోలతో సహా దేశంలో ఎక్కడా దొరకలేదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అడ్డంగా దొరికిపోయినా పదవిలో కొనసాగుతున్నారన్నారు. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఇప్పటికీ చెప్పలేదన్న విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నానాతంటాలు పడ్డారని ఆయన అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే అరగంటలోనే మళ్లీ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి గవర్నర్ చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మీడియాలో ఎక్కడ ఓటుకు కోట్లు విషయం వస్తుందేమో అన్న భయంతో చంద్రబాబు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చాలా బాగా కష్టపడ్డారన్నారు. సరిగ్గా 11.06 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైతే 11.10 నిమిషాలకు చంద్రబాబు కేసును సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిందన్నారు. కేసును అడ్మిట్ చేసుకుని నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అవన్నీ మామూలే అంటున్నారని, పైపెచ్చు తనపై 26 కేసులు పెట్టారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. -
ఏపీ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర తాజా పరిణామాలపై పలువురితో చర్చించారు. ఓటుకు కోట్లు కేసులో సండ్ర వీరయ్య అయిదో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. -
సుప్రీంలో రేపు ఓటుకు కోట్లు కేసు విచారణ
-
‘ఓటుకు నోటు కేసులో బాబుకు జైలు తప్పదు’
సోమందేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ.ఐదు కోట్లు ఎరచూపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా దొరికిపోయాడని, భవిష్యత్తులో జైలుకెళ్లడం ఖాయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పేర్కొన్నారు. సోమందేపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డిపై బురద జల్లేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబు విమర్శించడం తగదన్నారు. ఓటుకునోటు కేసులో బయట పడటానికి ప్రధాని నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు కాళ్లు పట్టుకుని ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారన్నారు. అలాగే కేసీఆర్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని రాజధానిపేరుతో విజయవాడ, అమరావతికు పారిపోయి వచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న ఆయన జగన్మోహన్రెడ్డి జైలుకు వెళతారని తన మంత్రులు ఎమ్మెల్యేలతో ఉదరగొట్టడం గురువిందసామెతను గుర్తుకు తెస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం, తుంగోడు సర్పంచ్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో అప్రూవర్ గా మారుతానంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడును టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ ప్రచారం చేయడంలో రేవంత్ దిట్ట అని, అలాంటి వ్యూహాలతోనే ఎదుగుతానని భ్రమిస్తున్నాడని ఎర్రబెల్లి మండిపడ్డారు. తను మళ్లీ టీడీపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. నిరాధారమైన వార్తను సృష్టించి రాజకీయంగా బద్నాం చేయటం సాధ్యం కాదని ఎర్రబెల్లి శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి మాట్లాడిన విషయం నిజమేనని అంగీకరించారు. తమ స్నేహం రాజకీయాలకు అతీతమైందన్నారు. తమ భేటీకి రాజకీయాలు ఆపాదించడం అర్థరహితమని చెప్పారు. రేవంత్ రెడ్డిది మొదట్నుంచీ సంకుచిత మనస్తత్వం అన్నారు. రాత్రిపూట ఎవరు ఎవరిళ్లకు వెళతారో, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరు చేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ బీజేపీ మొదలుకుని ఎన్ని పార్టీలు మారారో ఆందరికీ తెలుసిందేనని ఎర్రబెల్లి తెలిపారు. -
‘నేను దేన్నయినా మేనేజ్ చేయగలను’
-
‘నేను దేన్నయినా మేనేజ్ చేయగలను’
న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానం గురించి తనకు పెద్దగా తెలియకపోయినప్పటికీ తాను దేన్నయినా మేనేజ్ చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన ప్రభుత్వమంతా తన కంప్యూటర్లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేయాలని తానే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మరోసారి చెప్పారు. నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు జఠిలం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు అంశంపై చెప్పడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలు కూడా తమ మైండ్ సెట్‌ను మార్చుకోవాలంటూ సూచించారు. -
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనుమతి
-
ఓటుకు కోట్లు: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనుమతి
ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అనుమతించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. చంద్రబాబుపై విచారణ జరపాలన్న ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ఏసీబీ అధికారులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదుచేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి గత నెలలో విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే అది అవినీతి కిందకు రాదని వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి గత నెల 22న తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పులో.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. -
‘ఓటుకు కోట్లు’ కేసులో నేడు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించనుంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై ఏసీబీ అధికారులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్‌చౌదరి గత నెలలో విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే అది అవినీతి కిందకు రాదని వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి గత నెల 22న తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసులో తీర్పు వాయిదా
-
ఓటుకు కోట్లు కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో హైకోర్టు మంగళవారం తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై తెలంగాణ ఏసీబీ సరిగా దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపి ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు బాబు వ్యాజ్యంపై ఇటీవల విచారణ ప్రారంభించింది. గతవారం అందరి న్యాయవాదుల వాదనలు పూర్తయినప్పటికీ, ఆయా న్యాయవాదులు తమ తమ వాదనల సందర్భంగా ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీర్పుల కాపీలను అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించా రు. ఇందుకు గాను కేసు విచారణను మంగళవారానికి వాయిదావేశారు. మంగళవారం కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయవాదులు తీర్పు కాపీలను కోర్టు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
అద్భుత రాజధాని ఆర్డరేస్తే రాదు..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ రాజధాని విషయంలో అద్భుతాలు చేస్తామనడం దూరదృష్టి లోపమంటున్నారు లోక్‌సత్తా సంస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంస్కృతి ఇవన్నీ ఒకదానికి ఒకటి సమకూరితేనే ఆధునిక రాజధాని వస్తుంది తప్ప. ఆర్డర్ వేస్తేనో, భూమి రేట్లు 5 కోట్లకు వెళ్లిపోతేనో అకస్మాత్తుగా రాజధాని ఏర్పడదన్నారు. పుష్కరాలు, ఉత్సవాలు వంటి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోనే పాలకులు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని పాలకులే కులాల కంపుతో మురికి చేయడం అభివృద్ధికి, ఆధునిక సంస్కృతికి చిహ్నం కాదన్నారు. వాగ్దానాలు, మాటల గారడీలు మాని అధికార వికేంద్రీకరణ, సమర్థ పాలన, ప్రజలకు సేవలందించటం, విద్యా ఆరోగ్యం ప్రతి బిడ్డకూ ఆందే ఏర్పాటు చేయ డమే తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మార్గం అంటున్న జేపీ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... చంద్రబాబు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు మీరెలా ఫీలయ్యారు? ఒక నాయకుడికి, మిత్రపక్షాలకు 225 సీట్లను కట్టబెడుతూ జనం తీర్పునిచ్చిన ప్పుడు అర్ధరాత్రిపూట ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని దింపేస్తే అది ఏ రకమైన ప్రజా స్వామ్యం అవుతుంది? ఎలా రాజ్యాంగ బద్దమౌతుంది? సాంకేతికంగా అది చట్టబద్ధం కావచ్చు. కానీ అలాంటి పనిని ఏ పార్టీ చేసినా నైతికంగా తప్పే. తెలంగాణ విషయంలో మీరు సరైన వైఖరి తీసుకున్నారా తీసుకోలేదా? అప్పటికీ ఇప్పటికీ ఒకటే చెబుతున్నాను. ఆనాడు నేను చెప్పింది వాస్తవం అని రుజువవుతోంది. రాజ్యవ్యవస్థ మారకుండా రాజధాని మారితే ప్రయోజనం లేదు. రాష్ట్రం పేరు మారితే పెద్దగా ఏమీ ఒరగదు. తెలంగాణ కావాలంటే తెచ్చుకుందాం కానీ అదొక్కటే సరిపోదు అని ఆనాడే చెప్పాను. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం కరెక్టని తేలిందా లేదా? పార్టీ కోణం నుంచి అయితే రెండు చోట్లా చతికిలపడిపోయారు కదా. ఏపీలో ఒక తరం వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవచ్చు. తెలంగాణలోనూ ఆ పార్టీనుంచి చాలామంది జారుకుంటున్నారు. రాజ కీయంగా అద్భుతాలు సాధిస్తామనుకుని, ఓడిపోయారు. అయితే తెలం గాణ ప్రజలు దేశాన్ని కాపాడారు. తెలంగాణ సాధించిన కీర్తిని ప్రజలకు కాకుండా సోనియాకు కట్టబెట్టినట్లయితే బేజీపీ లేదా కాంగ్రెస్.. రాష్ట్ర శాసనసభతో, ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ దేశంలో అన్ని చోట్లా ఇదే ప్రయోగానికి ఒడిగట్టేవాళ్లు. ఇప్పుడిక ఈ సాహసాన్ని ఎవరూ చేయరు. ప్రజలు తమకు తాముగా కోరుకుని వారి మధ్య సంఘీభావంతో ఒక ఒప్పందానికి వస్తే తప్ప ఢిల్లీలో బలవంతంగా విభజన చేస్తామనే ప్రయత్నం ఇక ఎవరూ చేయరు. కేసీఆర్, చంద్రబాబు పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలనలో రెండు మూడు అంశాలు నాకు నచ్చాయి. సింగపూర్ నుంచి, బ్రిటన్ దాకా గృహ నిర్మాణం ఆధునిక ప్రపంచంలో చాలా కీలకమైనది. అలాగే ఇరి గేషన్, నీటి సంరక్షణ వగైరా. అధికార వికేంద్రీకరణ చేస్తామన్నారు. పంచాయితీలకు ఏడాదికి 5వేల కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నప్పుడు నా గుండె ఉప్పొంగింది. తొలి నుంచీ మేం పోరాడుతున్నది దానిమీదే కదా. కాని ఆయన ఇప్పుడు అలా చేయడం లేదు. ఏపీ విషయంలో బాబుకు గతంలో ఉన్న విస్తృతస్థాయి దృక్పథం కనుమరు గైంది. పెట్టుబడులకోసం ప్రయత్నిస్తు న్నాడు. కానీ అధికార వికేంద్రీకరణపై దిశా నిర్దేశం లేకుండా కులాల జంజాటంతోటే కాలం గడిపేస్తున్నాడు. తాత్కాలికమైన కానుకలు, పుష్కరాలు, అమరావతికి శంకు స్థాపనలు.. ఇలా ఈవెంట్ మేనేజ్మెంట్ హడావుడి తప్ప మరేమీ జరగటం లేదు. అమరావతి ప్రపంచంలోనే నంబర్ వన్ రాజధాని అంటున్నారు. నిజమేనా? ప్రజల హృదయాలు కాస్త గాయపడ్డాయి కాబట్టి, హైదరాబాద్‌కు దీటుగా ఏర్పాటు చేసుకుంటామనటంలో తప్పులేదు. కానీ రాజధాని సహజంగా నిర్మాణం కావాలి. దీన్నే ఆర్గానిక్ గ్రోత్ అంటాం. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంస్కృతి ఇవన్నీ ఒకదానికి ఒకటి సమకూరాలి. దాంతోనే ఆధునిక రాజధాని వస్తుంది తప్ప.. మీరు ఆర్డర్ వేస్తేనో, భూమి రేట్లు 5కోట్లకు వెళ్లిపోతే అకస్మాత్తుగా జరగదు. ఒక యాభై ఏళ్లు, వందేళ్లు పడుతుందని భావించి దానికనుగుణంగా పునాదులు వేస్తే మీరనుకున్నది జరుగుతుంది కాని పాలకుడు ఆదేశిస్తే జరిగేది కాదు. అమరావతిలో రాజధాని విష యంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కావటం లేదు. అద్భుతాలు చేస్తాం అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇచ్చినవారు సంతోషంగా ఇచ్చారు. భూమి ఇస్తే పెరిగే విలు వలో రైతుకు వాటా ఉంటుందంటే సంతోషమే కదా. రేపు పొద్దున భూమి రేటు పెరిగితే నాకు కూడా వాటా ఉంటుందనే భావన కలగాలి కానీ నేను తీసేసుకున్నాను. మీ చావు మీరు చావండి, నేను అమ్మేసుకున్నాను అంటే పద్ధతి కాదు. ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? కౌన్సిల్‌కు ఉన్న ఒకే ఒక అధికారం ఏమంటే అసెంబ్లీ చేసిన నిర్ణ యాలను 90 రోజుల పాటు ఆపగలగడమే. ఇది తప్పితే దానికి ఏ అధికారమూ లేదు. దాంట్లో ఒక కౌన్సిల్ సభ్యుడి విషయంలో మీకు అధికారమే లేని రాష్ట్రంలో ఇంత రాద్దాంతం ఏమిటి? ఓటుకు డబ్బులిస్తే, పార్టీ ఫిరాయింపులు చేస్తే తప్పకుండా రాజ్యాంగ విరుద్ధమే. ఆ టేపులో గొంతు మీదా కాదా అని బాబును నేను ఎన్నడో ప్రశ్నించాను. కానీ ఇలాంటి వ్యవహారాల్లో పవిత్రులెవరు? అపవిత్రులెవరు? ఎన్నికలలో పోటీ చేసిన ప్పుడు బీజేపీ ఇతర పార్టీలు ఎంపీ సీటుకు 20, 30 కోట్లు ఖర్చు పెట్టలేదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మీ సందేశం? రెండున్నరేళ్ల క్రితం మనందరి మనసుల్లో కాస్త భయం ఉండింది. రెండు రాష్ట్రాలు వచ్చేశాయి. ఈ ఆంధ్ర, తెలంగాణ భావం జనం మనస్సుల్లో ఉండి కలుషిత వాతావ రణం సృష్టిస్తే గందరగోళం నెలకొంటుందని అనుకున్నాం. అలా జరగనందుకు ప్రధా నంగా కేసీఆర్‌ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి. రాజకీయం కోసం గతంలో ఏం జరిగినప్పటికీ ఒక సామరస్య వాతావరణం మాత్రం తీసుకొచ్చారు. దానికి మనం సంతోషపడాలి. రెండోది. ఆంధ్ర ప్రజలేమో మాకు అన్యాయం జరిగిపోయిందని అను కున్నారు. కాని మన సమస్యలకు ఇంకొకళ్లు కారణం కాదు అని గ్రహించాలి. తెలంగాణ ప్రజలు గతంలో ఆ వాదన చేసారు. ఆ వాదన తప్పని అప్పుడూ చెప్పాను. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఆ వాదన చేస్తున్నారు. అది తప్పని ఇప్పుడు చెబుతున్నాను. మన సమస్యలకు పరిష్కారాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన పరిపాలనలో, మన రాజ కీయంలో మన సమాజం నడిచే తీరులో, మనందరి ఆలోచనలలో ఉన్నాయి తప్పితే ఇంకెక్కడినుంచో సమస్యలు రావు. పై నుంచి ఏమిచ్చినా పుచ్చుకుందాం. అది మన హక్కు. వాళ్లేం దానంగా ఇవ్వటం లేదు. ప్రత్యేక రాష్టం వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, పదో తరగది చదివితే చాలు ప్రతి ఇంటికీ ఉద్యోగం వచ్చేస్తుంది. అందరికీ మూడు ఎకరాలు వచ్చేస్తాయి అంటూ తెలం గాణ ప్రజలు రకరకాల కలలు కన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అధికార వికేంద్రీకరణ, సమర్థ పాలన, ప్రజలకు సేవలందటం, మంచి ప్రమాణాలతో విద్యా ఆరోగ్యం ప్రతి బిడ్డకూ ఆందే ఏర్పాటు చేయడం దానిమీద దృష్టి పెట్టండి. (జయప్రకాశ్ నారాయణ్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) -
‘రోజుకు రూ.10లక్షలు ఎలా చెల్లిస్తున్నారు’
-
‘రోజుకు రూ.10లక్షలు ఎలా చెల్లిస్తున్నారు’
హైదరాబాద్: ఓట్లకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది కొత్త భాష్యం చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే అది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఎమ్మెల్యేలను కొనడం తప్పుకాదన్నట్లు సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించటం వింతగా ఉందన్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని బొత్స సూటిగా ప్రశ్నించారు. ‘రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బు నాది కాదు... ఆ వాయిస్ నాది కాదు అని’ చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదన్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు చెప్పేది ఇదేనా, ఎమ్మెల్యేల కొనుగోలును ఆయన ప్రోత్సాహిస్తారా అంటూ బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ఆస్తి రూ.50 లక్షలని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, మరి లాయర్ లూథ్రాకు రోజుకు రూ.10 లక్షలు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. రూ.500, 1000 నోట్లను రద్దు చేయాలని నేనే చెప్పానంటున్న చంద్రబాబు అవే పెద్దనోట్లను తన అనుచరులకు ఇచ్చి లంచంగా పంపిస్తారని ధ్వజమెత్తారు. -
శాస్త్రీయంగా దర్యాప్తు సాగుతోంది
► ‘ఓటుకు కోట్లు’ కేసులో హైకోర్టుకు ఏసీబీ న్యాయవాది నివేదన ► ఇది హైప్రొఫైల్ కేసు.. ఎలాపడితే అలా చేయలేం ► ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నాం ► కనీస సమాచారం తెలుసుకోకుండానే ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య ► విచారణను నేటికి వాయిదా వేసిన న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ దర్యాప్తు ఓ పద్ధతి ప్రకారం, శాస్త్రీయంగా సాగుతోందని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తరఫు న్యాయవాది వి.రవికిరణ్‌రావు హైకోర్టుకు నివేదించారు. ఇది హైప్రొఫైల్ కేసు అని, కాబట్టి శాస్త్రీయ ఆధారాలతో పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏసీబీపై ఉందని చెప్పారు. యాంత్రికంగా చేయడానికి ఇది ఆషామాషీ కేసు కాదని.. ‘ఓటుకు కోట్లు’ కేసు దర్యాప్తును నిలిపేశామన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వాదనల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో తమను అడిగితే చెప్పే వారమని.. కనీస సమాచారం కూడా తెలుసుకోకుండానే ఆయన ఏసీబీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారని వివరించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు నివేదించారు. క్రిమినల్ కేసుల్లో ఆ కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీల (ఇతరుల) జోక్యం తగదని పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో.. ‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేయగా.. వేగంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఏసీబీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రరుుంచారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఏసీబీ కోర్టు ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా ఏసీబీ తరఫున రవికిరణ్‌రావు సోమవారం తన వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనాల కోసమే పిటిషన్ దాఖలు చేశామని రామకృష్ణారెడ్డి చెబుతున్నారని.. కానీ ఇందులో ప్రజా ప్రయోజనాలకన్నా ఇతర కారణాలే ఎక్కువగా ఉన్నాయని హైకోర్టుకు వివరించారు. రాజకీయ కారణాలతోనే ఫిర్యాదు దాఖలు చేసినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కేసుతో సంబంధం లేని వాళ్లను, ప్రజా ప్రయోజనాలతో దాఖలు చేశామని చెబుతున్న వాళ్లను ప్రోత్సహిస్తూ పోతే కోర్టు ప్రక్రియ దుర్వినియోగం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి వాళ్లను చూసి రేపు వంద మంది వచ్చే అవకాశముందని.. తాము ఏం చేశామో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రహస్యంగా ఉండాల్సిన 164 స్టేట్మెంట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలా అందాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి వారి ఫిర్యాదులను విచారించేటపుడు అసలు ఏ ఉద్దేశంతో ఫిర్యాదు దాఖలు చేశారో కోర్టులు క్షుణ్నంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అరుుతే అప్పటికే కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ మంగళవారానికి వారుుదా పడింది. -
ఓటుకు లంచమిస్తే చట్టం వర్తించదు
-
ఓటుకు లంచమిస్తే చట్టం వర్తించదు
చంద్రబాబు తరఫు న్యాయవాది వాదన ► ‘ఓటుకు కోట్లు’లో బాబు పిటిషన్‌పై వాదనలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ‘ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) ఎలా వర్తిస్తుంది’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రశ్నించారు. ఆయన ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం వాదనలు ప్రారంభమయ్యాయి. పీసీ చట్టం వర్తించదు.. లూథ్రా తన వాదనలు కొనసాగిస్తూ.. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజావిధుల్లో భాగం కాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలోనే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు లంచం ఇవ్వచూపారన్నది ప్రధాన ఆరోపణని తెలిపారు. ఇందుకు సంబంధించి నిందితులపై ఏసీబీ అధికారులు పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారన్నారు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి పీసీ యాక్ట్ ఎలా వర్తిస్తుందో అర్థం కాకుండా ఉందన్నారు. ఇందుకు లూథ్రా ఓ ఉదాహరణనిచ్చారు.‘మునిసిపాలిటీలో ఓ ఇంజనీర్‌ను తీసుకుందాం. తాను చేయాల్సిన పనికి సంబంధించి లంచం తీసుకుంటే అది నేరం అవుతుంది. దానికి అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చు. అదే ఇంజనీర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే దానికి అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుంది? పబ్లిక్ సర్వెంట్ హోదాలో అతను ఓటు వేయలేదు. పెపైచ్చు ఓటు హక్కు ప్రజా విధుల్లో భాగం కానే కాదు.’ అని లూథ్రా వివరించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఏసీబీ సంబంధిత కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసింది’’ అని ఆయన తెలిపారు. ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని సంబంధిత కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన కేసులో మళ్లీ దర్యాప్తు జరపాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ ఆదేశాల వల్ల ఏసీబీ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని, ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని ఆయన కోర్టుకు నివేదించారు. సాక్షుల వాంగ్మూలాలు ఎలా వచ్చాయి? ఏసీబీ చార్జిషీట్లో ఉన్న సాక్షుల వాం గ్మూలాలు కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలా వచ్చాయని లూథ్రా ప్రశ్నించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలాలను థర్డ్ పార్టీకి ఇవ్వడం సాధ్యం కాదని, ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు వ్యాజ్యం నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ హైకోర్టు గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ గత నెల 23న హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం వాదనలు మొదలయ్యాయి. -
బాబు జైలుకెళ్లడం ఖాయమని చెప్పిన కేసీఆర్!
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఇద్దరు సీఎంలు కేసీఆర్, చంద్రబాబునాయుడు ఒక అవగాహనకు వచ్చారనడానికి అనేక తార్కాణాలు ఉన్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డా. మల్లు రవి అన్నారు. ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టారన్నారు. వీరిద్దరూ కూడా పరస్పరం ఒకరి సలహాలు, సూచనలపై మరొకరు పనిచేస్తున్నారన్నారు. ఒకరికి ఇబ్బంది వచ్చినపుడు మరొకరు ఆదుకుంటున్నారని ఆరోపించారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక భూమికను పోషించిన సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డిని అవమానించేలా మాట్లాటడం సరికాదన్నారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ అధికారప్రతినిధి ఇందిరా శోభన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు డెరైక్షన్‌లో కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమైనవన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేసిన సందర్భాలు ఎప్పుడూ లేవని మల్లు రవి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లి చంద్రబాబును పొగడడం, పట్టీసీమ ప్రాజెక్టును మెచ్చుకోవడం, కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి చంద్రబాబు రావడం వంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన వ్యాఖ్యల ద్వారా హరీష్‌రావు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
'నారాయణ సంస్థలపై గవర్నర్ దృష్టి పెట్టాలి'
విశాఖపట్నం : ఓటుకు కోట్లు కేసు రాజీ కోసం డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఓట్లు కోట్లు కేసు కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. శనివారం విశాఖపట్నంలో కొయ్య ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా, విభజన హామీకు బ్రేక్ పడినట్లే అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ విద్యాసంస్థలపై దృష్టి పెట్టాలని గవర్నర్‌కు కొయ్య ప్రసాద్‌రెడ్డి సూచించారు. -
'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఆయన కలిశారు. అగ్రిగోల్డ్ విచారణ ఆలస్యంగా జరుగుతుందని అన్నారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేశారన్న విషయం అందరికీ తెలుసునని తెలిపారు. 'బ్రీఫ్డ్ మీ' అన్న గొంతు చంద్రబాబుదేనని రాష్ట్రంలో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు ప్రధాననిందితుడు రేవంత్‌రెడ్డిని తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్‌ని చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. -
‘చంద్రబాబు స్టే తెచ్చుకోవడం సరికాదు’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు సిద్ధపడాలని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ 17సార్లు స్టే ఎందుకు తెచ్చుకున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. నిప్పునని చెప్పుకునే బాబు స్టే కోసం ఎందుకు హైకోర్టును ఆశ్రయించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోందని, డీపీఆర్ లేకుండానే టెండర్లు పిలుస్తున్నారని ఆయన విమర్శించారు. -
'ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ'
విజయవాడ: తనమీద ఆరోపణలు వచ్చిన ప్రతీసారీ ‘ స్టే’లు తెచ్చుకోవడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...గతంలో అనేక కేసుల్లో స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఆయన స్టే తెచ్చుకుంటున్నారంటే సగం తప్పు అంగీకరించినట్లే అని అన్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో మరోసారి మోసం చేసే యత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే కేసు ఉపసంహరించుకుని విచారణకు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు. తనకు ఏమీ కాదని చెప్పిన సీఎం ఎందుకు స్టేకు వెళ్లారని రఘువీరా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కేసును నీరుగారుస్తున్నాయని తప్పుపట్టారు. కాగా తనపై ఏసీబీ విచారణ నిలిపివేయాలంటూ చంద్రబాబు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసుపై స్పందించిన హరిబాబు
చిత్తూరు : ఓటుకు కోట్లు కేసుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొనేవారు ఏం చేయాలో వారు అదే చేస్తున్నారని, చట్టం ఏం చేయాలో అదే చేస్తుందని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఈ రోజు వరకు బీజేపీ, టీడీపీలు కలిసే పనిచేస్తున్నాయని, హోదా ఇవ్వకుంటే టీడీపీ విడిపోతుందనే విషయం గురించి తనకు తెలియదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తుందని హరిబాబు అన్నారు. రాష్ట్రానికి హోదా బిల్లును ప్రవేశపెట్టడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఇప్పుడు ఏపీకి హోదా ఇస్తే బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తుందన్నారు. ఏపీకి హోదాకు మించిన ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం సిద్దంగా ఉందన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో రాజధాని నిర్మాణానికి రూ.2150 కోట్లు, క్రిష్ణా గోదావరి బేసిన్లో పెట్రోలియం నిల్వలు వెలికి తీయడానికి రూ.650 కోట్లు, రక్షణ రంగం, మౌలిక వసతులు, పోలవరం ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు విడుదల చేసిందన్నారు. ఇక పట్టణాల్లోని పేదలకు కేంద్రం నుంచి 1.19 లక్షల ఇళ్లు, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్దికి రూ.700 కోట్లు కేటాయించిందన్నారు. దీంతో పాటు ఎన్ఐటి కళాశాలల్లో 540 సీట్లు, ఎనిమిది కేంద్ర విద్యా సంస్థలు రాష్ట్రంలో స్థాపించిందన్నారు. రాజధాని నిర్మాణానికి నీతి ఆయోగ్య్ ఇచ్చే నివేదిక ఆధారంగా మరిన్ని నిధులు సైతం విడుదల చేస్తుందన్నారు. 2014-15 సంవత్సరంలో పది నెలలకు రూ.3,997 కోట్ల రెవెన్యూలోటుకు ఉందని, దీన్ని కూడా త్వరలోనే కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. కాగా ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. -
’కోట్లు’ కుట్ర....
-
’కోట్లు’ కుట్ర తేలుస్తాం
-
చంద్రబాబును అరెస్టు చేయాలి
గుంతకల్లు టౌన్ : ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన సీఎం చంద్రబాబునాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు భయంతో ముఖ్యమంత్రి అటు కేంద్రం, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో లాలూచీపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆయన ఆరోపించారు. తాను జైలుకు పోకతప్పదని భావించిన బాబు తన తనయుడు లోకేష్‌ను మంత్రివర్గంలో తీసుకునే ఆలోచనలో ఉన్నారన్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని స్వయానా దేశ అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు వేసినా బాబు మాత్రం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యత సింగపూర్ కంపెనీలకు అప్పగించి రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ జాయింట్ వెంచర్ వ్యాపారానికి తెరలేపారన్నారు. ఈ అంతర్జాతీయ కుంభకోణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. వేరుశనగ పంటలన్నీ 60 శాతం దెబ్బతిన్నాక రెయిన్గన్లు ఇస్తే ఏం ప్రయోజనమని ఆయన నిలదీశారు. వేరుశనగ పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు రూ.25 వేల పంటనష్ట పరిహారాన్ని చెల్లించాలని వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గోపి, అహ్మద్ , మాజీ కౌన్సిలర్ సుంకప్ప, భాస్కర్ పాల్గొన్నారు. -
బాబును ఎవరూ కాపాడలేరు
డీ.హీరేహాళ్ : ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో నిండా మునిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎవ్వరూ కాపాడలేరని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హిర్దెహాళ్ వద్ద ఆయన వ్యవసాయ క్షేత్రంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన వ్యవహారమంతా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగిందని ఏసీబీ చార్జ్‌షీట్‌లో పేర్కొందన్నారు. ఈ కేసు భయంతోనే ఆయన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని, జీవనదులైన కష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కడుతున్నా మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో కడుతున్నది సింగపూర్ కాదని.. దొంగపూర్ అంటూ అభివర్ణించారు. సింగపూర్ కంపెనీ కోసం రాజధాని కడుతున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదన్నారు. స్విస్ చాలెంజ్ విధానం దుర్మార్గమైనదని అన్నారు. రైతులకు న్యాయం చేసే విధానం కావాలి తప్ప సింగపూర్‌కు దోచిపెట్టే ప్రభుత్వం అక్కరలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ బోయ మల్లికార్జున, ఎస్సీ సెల్ కార్యదర్శి బీటీపీ గోవిందు, మండల కన్వీనర్ వన్నూరుస్వామి, సీనియర్ నాయకులు జగదీష్, రహమతుల్లా, ఎన్.టి.సిద్దప్ప, బేలోడు రామాంజినేయులు, సోమలాపురం సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మురళిమోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ రవీంద్రనాథ్‌రెడ్డి, హనుమంతు, రాజు, కరిడిమల్లి, కాదలూరు హనుమంతరెడ్డి, సింగాడి మంజు, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగతంగా హాజరు కండి... స్టీఫెన్ సన్ కు కోర్టు ఆదేశం
హైదరాబాద్ : కోర్టు ధిక్కార అభియోగానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ 30 న వ్యక్తిగతంగా హాజరుకావాలని తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను హైకోర్టు ఆదేశించింది. ఓటుకు నోట్ల కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వేసిన పిటిషన్ ను విచారిస్తున్న న్యాయమూర్తి దానినుంచి తప్పుకోవాలని కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని స్టీఫెన్ సన్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయమూర్తి దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ స్టీఫెన్ సన్ పై కోర్టు ధిక్కార అభియోగంగా పరిగణిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. స్టీఫెన్ సన్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ మత్తయ్య క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అప్పట్లో స్టీఫెన్ సన్ పై నమోదు చేసిన కేసు బుధవారం విచారణకు రాగా స్టీఫెన్ సన్ కోర్టుకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే సెప్టెంబర్ 30 న వ్యక్తిగత హాజరు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఆయనకు బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. -
గవర్నర్‌తో కేసీఆర్, ఏసీబీ డీజీ భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, తెలంగాణ అడ్వకేజ్ జనరల్ రామకృష్ణారెడ్డి మంగళవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఓటుకు కోట్లు కేసు పునర్విచారణ సందర్భంగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గవర్నర్‌ను కలిశారు. వారిద్దరి మధ్య సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసు గురించి చర్చించినట్లు సమాచారం. కాగా సీఎం అక్కడ ఉన్న సమయంలోనే ఏసీబీ డీజీతో పాటు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ...గవర్నర్‌ను కలిశారు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు తీరుతెన్నులను ఏకే ఖాన్ ...గవర్నర్‌కు వివరించారు. గతంలో మత్తయ్యపై కేసును హైకోర్టు కొట్టివేయగా, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశాలను వివరించారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసు విచారణకు రానుందని ఏకేఖాన్ తెలిపారు. కాగా ఓటుకు కోట్లు కేసు విషయంలో సీఎం కేసీఆర్ రాజకీయంగా తనకు చెడ్డపేరు రాకూడదన్న భావనతో ఉన్నట్లు సమాచారం. కాగా ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఏవిధంగా ముందు కెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసుపై స్పందించిన చంద్రబాబు
-
బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే...
తిరుపతి : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావీస్తోందని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరన్న కేసీఆర్... 14 నెలలు అయినా ఆ కేసులో అనుబంధ ఛార్జిషీట్ వేయకపోవడం దేనికి నిదర్శనమన్నారు. ఉన్నపళంగా విజయవాడకు చంద్రబాబు నాయుడు పారిపోవడం వెనుక పెద్ద కథే నడిచిందని భూమన అన్నారు. కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కు రూ.500 కోట్లు చెల్లించడమే కాకుండా, ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని భూమన విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే లంచాలు ఇస్తూ దొరికిపోతే కేసును ఇంతగా నీరుగార్చుతారా అని ఆయన అన్నారు. చంద్రబాబు కంటే పనికిమాలిన ముఖ్యమంత్రి దేశంలో లేరని భూమన వ్యాఖ్యానించారు. బాబులాంటి అవినీతిపరుడు ముఖ్యమంత్రిగా ఉండటం తెలుగుజాతికి అవమానమన్నారు. కపటం, మోసం తప్ప ఎలాంటి నైతికత లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజంగా నిప్పు అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడాలని డిమాండ్ చేశారు. -
బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే...
-
మత్తయ్యకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యను నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన మత్తయ్య క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
హైకోర్టులో మత్తయ్యకు ఊరట
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. మత్తయ్యపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా కేసు విచారణ నుంచి తనను తప్పించాలని ఆయన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
పోరు కత్తులా... పూల గుత్తులా...
-
పోరు కత్తులా... పూల గుత్తులా...
ఎన్నికల బరిలోకి నేటి నుంచి ఇద్దరు సీఎంలు వేడెక్కనున్న గ్రేటర్ ఎన్నికల పోరు ‘మీట్ ది ప్రెస్’ ద్వారా ప్రజల్లోకి సీఎం కేసీఆర్ నేడు, రేపు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ‘ఓటుకు కోట్లు’లో నాటి విమర్శలకు కట్టుబడతారా? రాజకీయ అవసరాల కోసం రాజీపడ్డారన్న జనం అభిప్రాయానికి బలం చేకూరుస్తారా? ఆసక్తి రేపుతున్న ముఖ్యమంత్రుల ప్రచారం 30న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: బల్దియా బరి వేడెక్కబోతోంది.. ఇద్దరు చంద్రులు రంగంలోకి దిగనున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ‘గ్రేటర్’ ఫైట్‌కు కదలనున్నారు. ఒక నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇద్దరు సీఎంలు ప్రచారానికి తరలిరానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ‘ఓటుకు కోట్లు’ కేసు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఇద్దరు సీఎంలు ఇప్పుడేం మాట్లాడతారు? ఇద్దరి మధ్య మళ్లీ మాటల తూటాలు పేలుతాయా? ఒకరిపై ఒకరు కాలు దువ్వుతారా? లేక పైపై విమర్శలతో సరిపెడతారా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే!! నాడు కత్తులు.. మరి నేడు? గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ టీడీపీ అడ్డంగా దొరికింది. స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ చంద్రబాబు స్వయంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటపడడంతో వివాదం తారస్థాయికి చేరింది. ‘నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.. నగ్నంగా పట్టపగలే దొరికిన దొంగవు నువ్వు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది..’ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. అటు ఏపీలో కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది.‘ఖబడ్దార్.. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం మీకెవరిచ్చారు.. నాకూ ఏసీబీ ఉంది.. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉన్నారు’ అంటూ బాబు మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో ఇక చంద్రబాబు రాజీనామా చేయకతప్పదేమోనని అంతా భావించారు. అటు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూడా ఇరుక్కున్నారని అనుకున్నారు. ఇంతలో వారిమధ్య ‘స్నేహం’ చిగురించింది. అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఇరువురు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. బాబు ఆహ్వానం మేరకు కేసీఆర్ అమరావతి వెళ్లొచ్చారు. అనంతరం అయుత చండీమహాయాగానికి రావాల్సిందిగా కేసీఆర్ కూడా బాబు నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడంతో కేసుల కథ కంచి చేరింది. ఇద్దరు నేతలు రాజీ పడ్డారని, అందుకే ఓటుకు కోట్లు కేసు, ట్యాపింగ్ కేసు అటకెక్కాయన్న అభిప్రాయం కూడా జనంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ మళ్లీ పాత కేసులను ప్రస్తావిస్తూ పరస్పర విమర్శలకు దిగుతారా లేదా అభివృద్ధి నినాదానికే పరిమితమై లాలూచీ కుస్తీకి దిగుతారా? అన్న ఆసక్తి నెలకొంది. పైపై విమర్శలకే పరిమితమైతే తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఇరువురు నేతలు పక్కా ఆధారాలు లభించిన ఇంతటి కీలకమైన కేసులను పక్కనపెట్టారన్న అభిప్రాయానికి మరింత బలం చేకూరినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. లాలూచీ పడడం వల్లే ఏపీ సచివాలయం, అధికార యంత్రాంగాన్ని హుటాహుటిన అమరావతికి తరలించేందుకు బాబు యత్నిస్తున్నారని, అలాగే తెలంగాణలో కేవలం టీడీపీ కేడర్‌ను సంతృప్తి పరిచేందుకే గ్రేటర్లో పోటీకి దిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందని వారు చెబుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఏమంటారు? హైదరాబాద్ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, హైటెక్ సిటీ నిర్మాణం తన గొప్పేనని ఇప్పటికే పలుమార్లు ఏపీ సీఎం చెప్పుకోవడాన్ని కేసీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన హామీగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్.. ఏపీ సీఎంకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. అటు టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో న లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకుంటూ నగరంలో పార్టీ ఉనికే లేకుండా ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్పై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న అంశం కూడా ఆసక్తిగా మారింది. మొత్తంగా ఇప్పుడు గ్రేటర్ ప్రచారంలో ‘ఇద్దరు చంద్రులు’ ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తారన్న దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇదీ నేతల ప్రచార షెడ్యూల్.. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ప్రచార షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ గురువారం ‘మీట్ ది ప్రెస్ ’ ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. 30వ తేదీ (శనివారం)న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చంద్రబాబు గురుువారం మధ్యాహ్నం 2.30కు మెదక్ జిల్లా పటాన్చెరు బస్టాండ్‌లో బహిరంగ సభ ద్వారా ప్రచారం మొదలుపెట్టనున్నారు. అక్కడ్నుంచి రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ సర్కిల్, చందానగర్, కూకట్పల్లి, బాలానగర్ క్రాస్‌రోడ్స్, ఎర్రగడ్డ ఫ్లైఓవర్, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్, హైటెక్‌సిటీ, శిల్పారామం వరకు రోడ్‌షో సాగనుంది. రాత్రి 9 గంటల వరకు సాగే ఈ ప్రచారం పూర్తిగా శివార్లు, సీమాంధ్ర ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలకే పరిమితం కావడం గమనార్హం. 2014 ఏప్రిల్ సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లకే పరిమితం కాగా.. వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు విడతల వారీగా టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. -
రాజ్యాంగ విధులకు ‘పాతర’
రెండోమాట పాలకులు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతోనో, వ్యక్తిగత ప్రాబల్యపు తీట తీర్చుకోవడానికో కాకుండా, పేదసాదల అవసరాలు తీర్చే వస్తూత్పత్తి ప్రయోజనాలకు ప్రజాధనాన్ని వెచ్చించాలి. సొంత హౌస్‌లనూ, ఫామ్ హౌస్‌లనూ తీర్చిదిద్దుకోవడానికి ప్రజాధనం వెచ్చిస్తే ఎవరూ హర్షించరు. అయినా, ఒక సందేహం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఇంతకూ ఓటుకు నోటు కేసు పర్యవసానం ఏమిటి? రాజ్యాంగ విధులను పాతర వేసినట్టు, ఈ పాలకుల మధ్య పరస్పరారోపణలతో కూడిన ఈ కేసు ఏ కంచికి చేరింది? ఇది శేషప్రశ్న. ‘ప్రవక్తలు వేరు; మతాచార్యులు/పురోహిత వర్గం లేదా మత ప్రచారకులు వేరు. మూఢ విశ్వాసాలను వ్యతిరేకించడం ప్రవక్తల పని కాగా, మూఢ నమ్మకాలను పెంచేందుకు నడుం కట్టినది పురోహితవర్గం. ఈ ప్రత్యేక వర్గానికి ప్రపంచంలో మరేదీ పట్టదు. నిజానికి ఈ ప్రపంచం ప్రకృతి ప్రసాదం. దార్శనికులైన ప్రవక్తలు మూఢ విశ్వాసాలను సవాలు చేసినవాళ్లు. కాగా, మతాచార్యులు లేదా పురోహిత వర్గమే 2000 రకాల ఆచారాలనూ, కర్మకాండలనూ సృష్టించారు.’ -స్వామి వివేకానంద ప్రజాబాహుళ్యంలో శాస్త్రీయమైన ఆలోచనాశక్తినీ, మానవతావాదాన్నీ, కార్యకారణ సంబంధాన్నీ తెలుసుకోగలిగిన జిజ్ఞాసనూ సంస్కరణాభిలాషనూ పెంచి పోషించాలి.’ - భారత రాజ్యాంగం (ప్రాథమిక బాధ్యతలు-అధ్యాయం: జీఠి అ లో 51వ అధికరణ ‘ఎ’ (హెచ్) ఆదేశం) ప్రజలను విడదీసే మతాలన్నీ అంతిమంగా రద్దయి, మానవత్వం చిరంజీవిగా వెలుగొందుతుందని షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామీ వివేకానందుడు ప్రవచించారు. భారతీయులు గర్వించదగిన ఆ దేశభక్తుడు, మహా తాత్వికుడు 130 ఏళ్ల కిందటే ఆ విధంగా ఎలా చాటగలిగాడని ఇటీవల ఒక మిత్రుడు ప్రశ్నవేశాడు. అయితే, వివేకానందుడి భావాలకు విరుద్ధంగా, ‘భారత ప్రజలమైన మేము...’ అంటూ తమకు తాముగా ఇక్కడి ప్రజాబాహుళ్యం ఆమోదించిన రాజ్యాంగం నిర్దేశించిన పౌర బాధ్యతల నుంచి, విధుల నుంచి తప్పుకుని పాలకులు ఎందుకు పక్కదారులు పడుతున్నారు? అన్నది కూడా ఆ మిత్రుడి సందేహమే. ఈ కుహనా సంస్కృతి ఇంకానా? రాచరికాలలో తమ మనుగడ కోసం రాజులు అమాయక ప్రజలను విద్యావికాసాలకు దూరంగా ఉంచి, యాజ్ఞయాగాదుల పేరిట కర్మకాండల ముసుగులో తమ ఆధిపత్యాన్ని సాగించుకున్నారు. ప్రజలకు దూరం చేసిన విద్య ఆసరాగానే ప్రభువర్గాలకు సన్నిహితమైన మరొక వర్గంలోని స్వార్ధపరులు వేదాల పేరిట, సంహితల ముసుగులో యజ్ఞయాగాదులకూ, నానారకాల కర్మకాండలకూ ప్రాణం పోసి పబ్బం గడుపుకున్నారు. సమాజంలో అవిద్యను పెంచి పోషించారు. ఇప్పటికీ అదేపనిలో ఉన్నారు. పాత యుగాల నాటి ఈ కుహనా సంస్కృతి ఇప్పటికీ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కొందరు పాలకులను పట్టి పీడిస్తున్నది. పాలకులూ, ప్రభుత్వాలే యజ్ఞయాగాదులకూ, కర్మకాండల తంతుకూ విస్తృత స్థాయిలో శ్రీకారం చుడుతున్నారు. తమపై జరిగే దోపిడీ, పీడనలు ఏమిటో గుర్తించకుండా ప్రజలను మద్యానికి మించిన మత్తులోకి నెడుతున్నారు. నిజానికి కొందరు స్వార్ధపరులు పూర్వ వైదికంలో లేని తంతును అనంతర వైదికం పేరుతో ఇలాంటివి చొప్పించారని కొందరు పరిశోధకుల భావన. దీని ఫలితంగానే ‘ఉదర నిమిత్తం బహుకృత వేషం’ వంటి వ్యక్తీకరణలు జనజీవనంలో స్థిరపడినాయి. యజ్ఞం అన్న సంస్కృత పదం ఆదిలో పూజించడానికీ, ప్రార్థించడానికీ పరిమితం కాగా, వైదికానంతర సాహిత్యంలో ఏరకమైన కర్మకాండలకైనా, పండుగలూ పబ్బాలకైనా వర్తింపచేయడం వల్లనే అలాంటి వ్యక్తీకరణ వచ్చిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, సమష్టి శ్రమ స్థానాన్నీ, కష్టించే తత్వాన్నీ గౌరవించకుండా చేసేందుకు ‘యజ్ఞ’మన్న పదాన్ని వాడుకలోకి తెచ్చారు. కొన్నాళ్లు అసలు యజ్ఞవాటికలతో సంబంధం లేకుండా కర్మకాండలనూ, యాగాలనూ నిర్వహించారు. ఎటు తిరిగీ ఉపనిషత్తులూ, బ్రాహ్మణాలు క్రీస్తుపూర్వం 500 సంవత్సరం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాతనే కర్మకాండలకు ఊతం లభించిందని పండితులు గుర్తించారు. ఆ తరువాతే యజ్ఞవాటికలు వచ్చాయి. చివరికి యోగాన్ని కూడా ఆరోగ్యసూత్రంగా కాకుండా యజ్ఞచట్రంలోకి తెచ్చి, బ్రహ్మ పదార్థంగా చిత్రించారు. బ్రాహ్మణ్యం తప్ప ఇతరులు వీటిని నిర్వర్తించరాదన్న శాసనం అప్పటి నుంచే. కాబట్టే, జీవితాన్ని ఎవరికి వారు ఒక ఉపాధ్యాయునిగా, బోధకునిగా భావించాలనీ, మూఢ విశ్వాసాలు మన అభివృద్ధికి ఆటంకమనీ వివేకానందుడు బోధించవలసి వచ్చింది. అంతేకాదు. హేతువాదాన్ని విశ్వసించి, దాని మీద ఆధారపడిన వృత్తి సమాజాన్ని నిర్మించి; కులమతాలకు, వర్గాలకు అతీతంగా ఉండే సమాజావిష్కరణకు పునాదులు వేసిన గౌతమ బుద్ధుడిని భారతదేశానికి ఏకైక ప్రతినిధిగా భావించినవాడు వివేకానందుడే. వినలేదా ‘వివేక’ వాణి? ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాల నేతలూ గాడి తప్పారు. ఆది బౌద్ధమూ, బుద్ధుడూ ఏ యజ్ఞయాగాదులను, విగ్రహారాధనను ప్రగతి నిరోధకమని చెప్పారో, సరిగ్గా ఆ బోధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పాలనా విధులకు వ్యతిరేకంగా మన పాలకులు వ్యవహరిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే, ‘ఇది సొంత వ్యవహారమ’ని చెబుతున్నారు. తెరచాటున ప్రజోపయోగ, సంక్షేమ పథకాలకు, వయోజన విద్యావ్యాప్తికి వెచ్చించాల్సిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నల్లధనాన్నీ, దొంగడబ్బు చలామణీని నిరోధించాలని ఒకవైపున గావుకేకలు పెడుతూనే యాగాల మాటున చీకటి పనులు చేస్తున్నారు. బహుశా ఇందుకే వివేకానందుడు అన్నాడేమో: ‘ప్రపంచంలో మతధర్మాల పేరుతో వ్యవహరించే వారిలో చాలామంది వాస్తవ జీవితంలో రాజకీయులే. వాస్తవ జీవితంలో రాజీ పడకుండా జీవించడంలో వీరంతా విఫలమైనవారే. వీరంతా మూఢ విశ్వాసాలనే అంటకాగుతుంటారు’ (నిజానికి ఇలాంటి ప్రవచనాలు వివేకానందుల రచనలలో, ముఖ్యంగా ఎనిమిదో సంపుటంలో ఎన్నో!). ఇంకా వివేకానందుడు, దేశం బాగుపడాలంటే తప్పుడు ధర్మాలను, దారి తప్పిన తాత్విక ధోరణులను; వాటిని ప్రచారం చేసే మతాచార్యులనీ, పురోహితులనీ ‘దేశ సరిహద్దులు దాటించవలసిన అవసరం ఉంది’ అని ప్రస్తావించేవరకూ వెళ్లాడు. తన భవిష్యత్తును తాను దిద్దుకునే నిర్ణేత మానవుడేనని కూడా ఆయన అన్నారు. జబ్బు చేస్తే వెళ్లవలసింది వైద్యుడి దగ్గరకే తప్ప, జ్యోతిష్కుడి వద్దకు కాదని చెప్పాడాయన. ఇలాంటి భావాలతోనే ‘నేను బుద్ధుడిని ఆవాహనం చేసి మరోసారి దేశంలో అడుగుపెట్టమని ఆహ్వానిస్తున్నాను’ అని కూడా వివేకానందుడు వెల్లడించాడు. ఖగోళశాస్త్రాన్ని పక్కనపెట్టి జ్యోతిష్యాన్ని అంటకాగినందుకు నిరసనగా, ‘జ్యోతిష్యం, అలాంటి మార్మిక పద్ధతులు, వాటి ప్రచారం బలహీన మనసులకు ప్రతిబింబాలు’ అని అన్నాడు. క్రీస్తుశకం 4,5 శతాబ్దాల నాటికే ఖగోళ, గణితశాస్త్రాలకు పెద్ద పీట వేసిన ఆర్యభట్టు, భాస్కర, వరాహమిహిర వంటి వారి కృషి ఫలితంగా ఆవిర్భవించిన జ్ఞానాన్ని మనం గ్రీకులకు అప్పగించి, వారి నుంచి జ్యోతిష్యాన్ని తెచ్చి, ప్రజలలో శాశ్వత గందరగోళానికి దోహదం చేశామని వందేళ్లనాడే విశ్లేషించారాయన. బౌద్ధాన్ని విస్మరించారు చారిత్రకంగాను, తాత్వికంగాను ప్రపంచం మున్నెన్నడూ ఎరుగనంతటి మహత్తర ధార్మికశక్తిగా బౌద్ధం దూసుకుపోయి, మానవ సమాజాన్ని ప్రభావితం చేసిందని వివేకానందుడు విశ్వసించాడు. అయితే ఆయన వ్యాఖ్య వజ్రయాన శాఖ ప్రవేశంతో చెడిన అనంతర కాల బౌద్ధానికి వర్తించదని గుర్తించాలి. హరప్పా, మొహెంజొదారో నాగరికతకు (సింధు నాగరికతకు) సమాంతరంగానే బౌద్ధం విస్తరిల్లిందనీ, అది క్రీస్తుపూర్వం 2500 ఏళ్ల నాటిదనీ ఆ తవ్వకాలను చూసిన తరువాత మార్షల్ ప్రకటించాడు. ‘ఎవరైనా సరే, మొదటిసారిగా ఈ ప్రాచీన నాగరికతకు చెందిన తవ్వకాల మధ్య నడిచి వెళుతుంటే అభివృద్ధి చెందిన నేటి ఆధునిక లాంక్షైరీ పట్టణ శిథిలాల మధ్య నుంచి ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. ... ఆ హరప్పా తవ్వకాలలో ఆ శిథిల నగర నిర్మాణ ంలో వేల ఏళ్ల క్రితం వాడిని ఎర్ర ఇటుకలు, ఈనాటి ఆధునిక ఇంగ్లిష్ ఇటుకల పరిమాణంలో ఉండడం ఆశ్చర్యకరం. హరప్పా, మొహెంజొదారో ప్రాచీన నగర నిర్మాణాలు వేదాలు అవతరించక ముందే కనీసం వెయ్యేళ్ల నాటివి, వైదిక యుగానికి చెందిన యజ్ఞవేదికల కంటే ముందుటివి’ అని మార్షల్ రాశాడు. పట్టణ-నగర నిర్మాణ పథకాల విశిష్ట సంస్కృతి వేదాలకు ముందే సింధు నాగరికతగా పరిఢవిల్లింది. ఈ సంస్కృతి మొహెంజొదారోతో పాటు కలిబాంగన్, లోథాల్ తదితర ప్రాంతాలలో కూడా శతాబ్దాల తరబడి కొనసాగిందని ఎన్‌పి గుప్తా, శశి ఆస్తానా వంటి పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నమోదు చేసిన సంగతిని విస్మరించరాదు. ఇంతటి వైభవోపేత భారతీయ సంస్కృతికి మూఢ విశ్వాసాలకు తోడు, విదేశీ వ్యామోహం కూడా పట్టుకుంది. మానసిక బానిసత్వానికి అర్రులు చాచవలసి వస్తోంది. శేషప్రశ్న పాలకులు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతోనో, వ్యక్తిగత ప్రాబల్యపు తీట తీర్చుకోవడానికో కాకుండా, పేదసాదల అవసరాలు తీర్చే వస్తూత్పత్తి ప్రయోజనాలకు ప్రజాధనాన్ని వెచ్చించాలి. సొంత హౌస్‌లనూ, ఫామ్ హౌస్‌లనూ తీర్చిదిద్దుకోవడానికి ప్రజాధనం వెచ్చిస్తే ఎవరూ హర్షించరు. అయినా, ఒక సందేహం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఇంతకూ ఓటుకు నోటు కేసు పర్యవసానం ఏమిటి? రాజ్యాంగ విధులను పాతర వేసినట్టు, ఈ పాలకుల మధ్య పరస్పరారోపణలతో కూడిన ఈ కేసు ఏ కంచికి చేరింది? ఉభయులూ ఏ మార్గాలలో ఇళ్లకు చేరారు. ఇది శేషప్రశ్న. యజ్ఞయాగాదులు అధికారాన్ని నిలబెట్టలేవు. ప్రభుత్వాలను నిలబెట్టినా, పడగొట్టినా ఆ శక్తి ప్రజాశక్తికే ఉంది. ఇంతకూ పాలకుల చేతిలో ప్రజలే పిచ్చివాళ్లవుతున్నారు. ధనస్వామ్య వ్యవస్థలో మరొకలా జరగదు మరి! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.com.in -
‘ఓటుకు కోట్లు’పై పిల్ కొట్టివేత
న్యాయవాది పీవీ కృష్ణయ్య తీరుపై హైకోర్టు మండిపాటు కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు దర్యాప్తును ఏసీబీ నుంచి సీబీఐకి బదలాయించాలం టూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. పార్టీ ఇన్ పర్సన్‌గా (పిటిషనర్ కమ్ న్యాయవాది) ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది పి.వి.కృష్ణయ్య తీరుపై మండిపడింది. కృష్ణయ్య తన చర్యల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొదటి నుంచి కృష్ణయ్య వ్యవహరించిన తీరును తమ ఉత్తర్వుల్లో ప్రస్తావిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే తాను రూ.లక్ష డిపాజిట్ చేయాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ కృష్ణయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడి న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని, అందువల్ల కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కృష్ణయ్య పిల్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిల్ దాఖలు వెనుక సదుద్దేశాలు ఉన్నాయని నిరూపించుకోవాలని, ఇందు కు గాను రూ. లక్షను కోర్టులో డిపాజిట్ చేయాలని, ఆ తర్వాతే కేసు తదుపరి విచారణను చేపడతామంటూ విచారణను వాయిదా వేసింది. కేసు తదుపరి విచారణ సమయంలో లక్ష రూపాయల డిపాజిట్ ఉత్తర్వులపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నానని కృష్ణయ్య తెలిపారు. దీంతో ధర్మాసనం కేసును వాయిదా వేసింది. అయితే కృష్ణయ్య సుప్రీంకోర్టులో కేసు వేశానని ఒకసారి, కేసు వేయలేదని మరోసారి చెప్పి వాయిదాలు కోరారు. ఈ నేపథ్యంలో తన కేసును న్యాయవాది రాజుకు అప్పగించారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని తెలుసుకున్న ధర్మాసనం.. కృష్ణయ్య వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. తాజాగా వ్యాజ్యం విచారణకు రాగా.. వ్యక్తిగత సమస్యల వల్ల కృష్ణయ్య కోర్టు ముందు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది రాజు కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్నుంచీ ఈ కేసులో కృష్ణయ్య ఇలాగే వ్యవహరిస్తున్నారని, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడింది. ఆయన తీరును ఉత్తర్వుల్లో పొందుపరిచింది. పిల్‌ను, దానితోపాటు అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. -
రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి
న్యాయస్థానం నుంచి ఫోరెన్సిక్ రిపోర్టు కోరిన ఏసీబీ కోర్టులో మెమో దాఖలు నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ‘ఓటుకు కోట్లు’కేసులో మళ్లీ కదలిక చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచన సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో కదలిక కనిపిస్తోంది. కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య స్వరనమూనాలకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అందజేసిన నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ఏసీబీ త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారనుంది. ఈ మెమోపై కోర్టు శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతోపాటు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి, ఇతరులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వారి అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు నిందితుల ఫోన్లు, ఆడియో, వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు. స్వర నమూనాల పరిశీలన కోసం వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపారు. అలాగే వారి ఒరిజినల్ వాయిస్ కోసం అసెంబ్లీ రికార్డులతో పాటు మీడియాతో సంభాషించిన టేపులను కూడా ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం పంపించారు. వాయిస్ స్పెట్రోగ్రాఫ్ వేవ్స్ ఆధారంగా సంభాషణలను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్... ఆడియో, వీడియో టేపులు నిజమైనవేనని, అందులో కత్తిరింతలు, అతికింపులు ఏమీ లేవని నిర్ధారించింది. చంద్రబాబు వాయిసే కీలకం! ‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీట్ వేయాలంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర నిగ్గు తేలాల్సి ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి పదేపదే తమ ‘బాస్’ చంద్రబాబు అదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడిన టేపు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో, ఆడియో టేపులు నిజమైనవే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ విషయాలను కోర్టులో దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో ఏసీబీ స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తామని అప్పట్లో పేర్కొంది. అయితే సప్లిమెంటరీ చార్జిషీట్ లేదా తుది చార్జిషీట్ వేయాలంటే రేవంత్ మాదిరిగా చంద్రబాబు స్వర నమూనాలను నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇందుకు రికార్డులు, ఒరిజినల్ వాయిస్‌లను కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఏసీబీ నిర్ణయించింది. దాని ఆధారంగా చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. కానీ తాజా పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పాత్రను తేల్చడం తమకు కత్తిమీద సాము లాంటిదేనని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఓటుకు కోట్లు కేసులో కీలక నివేదిక
-
సికింద్రాబాద్‌లో ముత్తయ్య ప్రత్యక్షం
మారేడుపల్లి: ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తిగా మారిన జెరూసలేం ముత్తయ్య సికింద్రాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. సమాజ్‌వాది పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌గా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు నాగలక్ష్మి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లలో సమాజ్‌వాది పార్టీ పోటీకి సిద్ధమని ముత్తయ్య తెలిపారు. వంద సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు జ్యోతి కాలనీలో తెలంగాణ సమాజ్‌వాది పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పార్టీకి సంబంధించిన వివిధ పదవుల్లో నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఏఎస్ శ్రీనివాస్, మీడియా కో-ఆర్డినేటర్‌గా జెరూసలేం ముత్తయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ సీ ప్రాన్సిస్, సెక్రటరీ జనరల్ సుజాన్, ఆర్గనైజర్ చంద్రశే ఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మత్తయ్య క్వాష్ పిటిషన్ విచారణ 16కు వాయిదా
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో తన పేరును తొలగించాల్సిందిగా మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. మత్తయ్య వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని కోర్టుకు తెలియజేశారు. కౌంటర్ దాఖలలకు మత్తయ్య తరపు న్యాయవాది గడువు కోరారు. హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య ఎ-4 నిందితుడిగా ఉన్నాడు. -
'ఓటుకు కోట్లు కేసులో నన్ను కావాలనే ఇరికించారు'
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : ఓటుకు కోట్లు కేసులో తనను కావాలనే ఇరికించారని ఆ కేసులో నిందితుడు, ఆలిండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయూసిస్ అండ్ యూనియన్ చైర్మన్ డాక్టర్ హ్యారీ సెబాస్టియన్ ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సెన్ డబ్బులకు కక్కుర్తిపడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం జరిగిన అభిషేక మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో తామంతా నిర్దోషులమని, ఈ విషయం త్వరలోనే తేలుతుందన్నారు. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ విమానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నెలలో గుంటూరులో క్రైస్తవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మైనార్టీ వర్గంలో ఉన్న క్రైస్తవులకు కో ఆప్షన్ పదవులు ఇవ్వకుండా, ముస్లింలకే ఇస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవులను మైనార్టీ వర్గాలుగా గుర్తించకుండా కేవలం దళితులుగానే చూస్తున్నారన్నారు. క్రైస్తవ మత సంస్థలు మతమార్పిడి చేస్తున్నారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. -
సెల్ పోయింది.. ఓటుకు కోట్లు కేసులో నోటీసు
హైదరాబాద్: రెండేళ్ల క్రితం సెల్‌ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తికి ఏసీబీ నోటీసు వచ్చింది. ఈ నోటీస్ చూసి అతనితో పాటు కుటుంబ సభ్యులు షాకయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి రాములు అనే వ్యక్తికి ఏసీబీ నోటీసు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రాములు పేరుతో ఉన్న సిమ్‌ను వాడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. అయితే ఓటుకు కోట్లు కేసులో తనకెటువంటి సంబంధాలు లేవని రాములు చెబుతున్నాడు. హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితం సెల్ పోగొట్టుకున్నానని చెప్పాడు. ఆ ఫోన్ ఎవరికి దొరికొందో.. ఆ నెంబర్‌తో ఎవరు ఫోన్ చేశారో తనకు తెలియదని అన్నాడు. వాస్తవమేంటన్నది ఏసీబీ విచారణలో తేలాల్సివుంది. -
బాగా ‘ప్యాక్ ’చేయండి
ఏపీ బంద్‌కు ముందురోజే ప్రకటన వచ్చేలా సన్నాహాలు కేంద్రంతో ఢిల్లీలో మంతనాలు ప్రారంభించిన రాష్ట్ర ఉన్నతాధికారి ‘ఓటుకు కోట్లు’తో ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాడలేక ‘భారీ’ ప్యాకేజీ పేరుతో జనాన్ని మభ్యపెట్టి బయట పడాలనే కుతంత్రం ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారుతున్న పరిస్థితులు ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా, 29న బంద్ పిలుపుతో వేడెక్కిన వాతావరణం ప్యాకేజీ కనికట్టుతో ప్రత్యేక హోదా తాకట్టు తంత్రం విభజన చట్టంలోని హామీలన్నింటినీ గుదిగుచ్చి లెక్కించి భారీ సైజులో చూపే ప్రయత్నాలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ప్రత్యేక హోదాను పక్కనబెట్టి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విభజనతో నష్టపోతున్న ఏపీకి ఊతమిచ్చేందుకు కేంద్రప్రభుత్వం విభజన చట్టంలో అనేక ప్రాజెక్టులు పొందుపరచడంతోపాటు ప్రత్యేకహోదా కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విభజన జరిగి 15 నెలలు కావొస్తున్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి పోరాటం చేయకపోగా కేంద్రం ముందు సాగిలపడ్డారంటూ చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం చుట్టుకున్న తర్వాత హోదా విషయాన్ని కేంద్రం ముందు ప్రస్తావించడానికి కూడా చంద్రబాబు ధైర్యం చేయడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఢిల్లీలో నిరసన దీక్ష చేయడం, ఈ నెల 29 న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ బంద్‌కు అన్ని సంఘాలు, వర్గాలు, రాజకీయ పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో పడింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటికీ వేర్వేరుగా కేటాయింపులు జరగకుండా... అవి పూర్తయ్యేవరకూ పెట్టాల్సిన ఖర్చంతటినీ.. ఒకేసారి ప్రత్యేక ప్యాకేజీలో భారీగా చూపించి... ప్రజలను మభ్యపెట్టేందుకు ప్లాన్ వేశారు. అందులో భాగంగా బంద్‌కు ముందురోజే కేంద్రంతో ప్యాకేజీ ప్రకటింపజేసి తామేదో సాధించేశామన్న భ్రమ కల్పించాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు ప్రకటించే ప్యాకేజీ భారీగా కనిపించడానికి వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేషన్‌ను ప్రభుత్వం ఢిల్లీ పంపింది. ఆయన శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రెవెన్యూ, వ్యయ విభాగం ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కలిపి సమగ్రంగా ప్రభుత్వం రూపొందించిన ఒక నివేదికను ఈ సందర్భంగా కేంద్రానికి అందజేశారు. శాఖల వారీగా రాష్ట్ర ఆర్థిక అవసరాలు, రాజధాని నిర్మాణం, వాస్తవిక రెవెన్యూలోటు భర్తీకి వనరులు, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల్లో ఇంకా అమలు కాని హామీలు, వాటికి రానున్న ఐదేళ్లలో వెచ్చించాల్సిన వ్యయం తదితర అంశాలపై చర్చించారు. విభజన చట్టంలో ఇచ్చిన అనేక హామీలను ఒకే చోట చేర్చి బీహార్ తరహాలో భారీ ప్యాకేజీని ఒకేసారి ప్రకటించాలని కోరుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నివేదికను అందజేసినట్టు తెలిసింది. అన్నింటికీ గంప గుత్త? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో స్వయంగా ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్‌లోనే హామీ ఇవ్వగా ఏడాదిన్నర గడుస్తున్నా ఆ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే పార్లమెంట్లో ఇచ్చిన హామీని నిలుపుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చెబుతూ కాలయాపన చేస్తుండగా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున, అలాగే కొన్ని జాతీయస్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్రం అరకొర కేటాయింపులు జరిపినా నోరుమెదపలేదు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి చేయలేని పరిస్థితుల్లో ప్రజల నుంచి వస్తున్న విమర్శల నుంచి బయటపడటానికి వీలుగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిపైనా ఒకేసారి భారీ ప్యాకేజీగా ప్రకటించాలంటూ చంద్రబాబు రాజీ ధోరణి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు అయ్యే వ్యయాన్ని ‘స్పెషల్ ప్యాకేజీ’లో చూపించి ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యారు. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభింవృద్ధి చేయడం వంటి అంశాలను పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచారు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజీలో చూపించడం ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున ప్రయోజనం కలగబోతున్నట్టు ప్రజల్లో భావన కల్పించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా కనబడుతోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతోపాటు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడుతామని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిధులతోపాటు ఇతర ప్రాజెక్టులకయ్యే మొత్తం నిధులను కూడా కలిపి ఒకేసారి ప్రకటించడంవల్ల భారీ ప్యాకేజీ సాధించామని చెప్పుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఐఐటీ, ఐఐఎం వంటి జాతీయ విద్యా సంస్థలకయ్యే వ్యయాన్ని కూడా ఇదే ప్యాకేజీలో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ విభజన చట్టంలో ఉన్నవే అయినప్పటికీ అన్నిటినీ కలిపి భారీగా చూపి మసిపూసి మారేడుకాయ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ బీహార్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో... తాము కూడా రాష్ట్రానికి అలాంటి భారీ ప్యాకేజీ సాధించామని మభ్యపెట్టాలన్న దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు అధికార వర్గాలు చెప్పాయి. అయితే బీహార్‌కు ప్రకటించిన భారీ ప్యాకేజీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు మిగిలిన అన్ని పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీహార్ ప్రగతికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాయి. అంటే ప్యాకేజీకన్నా ప్రత్యేక హోదా ఇవ్వడంవల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలెన్ని ఉంటాయో వారి డిమాండ్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తాను కేసులనుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ వల్ల టీడీపీకి లబ్ధి తెనాలిలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు మారీసుపేట (తెనాలి): కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ముందు లాభపడేది టీడీపీయేనని, ఆ తర్వాత ఆంధ్రులని రాష్ట్ర అటవీ, పర్యావరణం శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఇవ్వటానికి అంగీకరించినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఇంకా ఎక్కువ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు యాచించటానికైనా, దోచిపెట్టడానికి కూడ వెనుకాడబోమన్నారు. అటవీ సంపదను రక్షించేందుకు, భూ ఆక్రమణలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.