
సండ్రకు ముగిసిన వైద్య పరీక్షలు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆయనను మంగళవారం ఉదయం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే సండ్రను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏసీబీ అధికారులు సోమవారం కొన్ని గంటల పాటు విచారించగా నోరువిప్పని కారణంతో సాయంత్రం సండ్రను అరెస్టు చేసిన తెలిసిందే. ఏసీబీ ఈ కేసును త్వరగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.